"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అంగులూరి అంజనీదేవి
అంగులూరి అంజనీదేవి | |
---|---|
దస్త్రం:Anguluri anjani devi.jpg అంగులూరి అంజనీదేవి | |
జననం | మామిడేల అంజనీదేవి |
నివాస ప్రాంతం | హన్మకొండ |
ప్రసిద్ధి | నవలా రచయిత్రి, కథా రచయిత్రి, కవయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | అంగులూరి ఆంజనేయులు |
తండ్రి | మామిడేల రాఘవయ్య |
తల్లి | మామిడేల వెంకట సుబ్బమ్మ |
అంగులూరి అంజనీదేవి వరంగల్లు జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె నవల, కథ, కవిత్వ ప్రక్రియలలో రచనలు చేశారు. మామిడేల రాఘవయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. అంగులూరి ఆంజనేయులును వివాహం చేసుకున్నారు. పదవ తరగతి చదివే సమయం నుండే కథలు వ్రాయడం మొదలు పెట్టారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తొలి నవల మధురిమ ప్రగతి వారపత్రిక నుండి ధారావాహికగా వెలువడింది. కథలు, కవిత్వం ఆకాశవాణి కడప, వరంగల్లు కేంద్రాలలో ప్రసారమయ్యాయి. తెలుగు సాహిత్యంలో బి.ఎ. చదివారు.
Contents
రచనలు
ఈమె వెలువరించిన పుస్తకాలలో కొన్ని:
- మధురిమ (నవల)
- నీకు నేనున్నా (నవల)
- మౌన రాగం (నవల)
- ఈ దారి మనసైనది (నవల)
- రెండో జీవితం (నవల)
- ఎనిమిదో అడుగు (నవల)
- ఆమె అతడిని మార్చుకుంది (నవల) [1]
- జీవితం ఇలా కూడా ఉంటుందా? (నవల)
- ఆరాధ్య (నవల)
- ఇలా ఎందరున్నారు? (నవల) [2]
- జ్ఞాపకం (నవల)
- ఒక చిన్న అబద్ధం (నవల)
- ఉద్వేగ (నవల) [1]
- నీ జీవితాన్ని నువ్వే మార్చుకో (నవల)
- అందమైన మనసు (నవల)
- ఈ రోజుల్లో ఒక అమ్మాయి (నవల)
- జీవితం అంటే కథ కాదు (కథా సంపుటి)
- సైలెంట్ మెలోడి (ఆంగ్ల నవల)
- గుండెలోంచి అరుణోదయం (కవితా సంపుటి)
పురస్కారాలు
- 1986లో ఉమ్మెత్తల సాహితీ అవార్డు.
- 2010లో లేఖిని సంస్థ నుండి మాతృమూర్తి నవలకు యద్దనపూడి సులోచనారాణి అవార్డు.
- 2012లో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారి జాతీయ అవార్డు.
- 2012లో సెలెబ్రిటీ న్యూస్ మేకర్ అవార్డు.
- 2014లో భారత మహిళా శిరోమణి అవార్డు.
మూలాలు
బయటిలింకులు
- అంగులూరి అంజనీదేవి అధికారిక జాలస్థలి
- యూట్యూబులో అంజనీదేవి ఇంటర్వ్యూ
- https://telugu.pratilipi.com/user/wwgolt58om
Interview with Myindmedia Radiohttps://www.youtube.com/watch?v=pNuOvk-5YKc&list=PLwvKbhzkvIJ1G2qz3qyqJYuNcotCT44C9[2][3]Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).