"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంజన

From tewiki
Jump to navigation Jump to search

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించెను.

సంబంధిత పురాణ కథలు

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.

మూలాలు