"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్ | |
---|---|
దస్త్రం:Ampasayya naveen sahitya academy award.jpg 2005 ఫిబ్రవరి 16న సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఆచార్య గోపీచంద్ నారంగ్ చేతులమీదుగా కొత్తఢిల్లీలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంటున్న అంపశయ్య నవీన్ | |
జననం | దొంగరి మల్లయ్య డిసెంబరు 24, 1941 వావిలాల గ్రామం, పాలకుర్తి మండలం, వరంగల్ జిల్లా |
విద్య | ఎం. ఎ ఆర్థిక శాస్త్రం |
పూర్వ విద్యార్థులు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | రచయిత, ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు |
తల్లిదండ్రులు |
|
అంపశయ్య నవీన్ గా పేరొందిన దొంగరి మల్లయ్య నేటి ప్రముఖ తెలుగు రచయితల్లో ఒకరు.[1] 2004 లో ఈయన రాసిన కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారు.[2]
Contents
జననం - ఉద్యోగం
ఆర్థిక శాస్త్ర ఆచార్యుడైన నవీన్, 1941లో వరంగల్ జిల్లా, పాలకుర్తి మండలం, వావిలాల గ్రామంలో దొంగరి నారాయణ, పిచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎం. ఎ చేశాడు. కరీంనగర్, వరంగల్లులో లెక్చరర్ గా పనిచేశారు.
రచనా ప్రస్థానం
చైతన్య స్రవంతి శిల్పంతో ప్రభావితమయ్యారు. అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్స్రవంతి నవలల్ని రచించారు. ఈ మూడు నవలల్లో కథానాయకుని పేరు రవి కావడంతో, మూడింటిని కలిపి రవిత్రయ నవలలు అని వ్యవహరిస్తారు. ఈయన 1965- 1968 సంవత్సరాల మధ్య రాసి 1969లో ప్రచురించిన అంపశయ్య నవల ఎంతగా విజయవంతమైందంటే, ఈయన అప్పటి నుండి అంపశయ్య నవీన్ గా పేరొందాడు. ఈయన కథలు అనేకం హిందీ, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మరాఠీలలోకి అనువదించబడ్డాయి.[3]
అంపశయ్య నవీన్ 1941 డిసెంబరు 24వ సంవత్సరంలో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల అనే గ్రామంలో జన్మించారు.[4] బాల్యంలో పిల్లవాడిగా నవీన్ వరంగల్‌లో జరిగిన 11వ ఆంధ్రమహాసభను చూశాడు. ఆ సభ ప్రారంభోత్సవంలో వేడుకగా అలంకరించిన బండిని 11 జతల ఎద్దులతో నడిపిస్తూ వీధుల వెంట ఉత్సవంగా ఊరేగించి అందులో సభాప్రముఖులను ప్రాంగణానికి చేరవేసిన సన్నివేశం నవీన్ పై చెరగని ముద్రవేసింది. యువకునిగా సాహిత్వంతో పరిచయమేర్పడినప్పుడు, ఈ ఊరేగింపు సన్నివేశం ప్రారంభ సన్నివేశంగా ఒక్క పెద్ద నవలను వ్రాయలని అనుకున్నాడు. అదే కాలరేఖలు నవలకు బీజం వేసింది [5] 1996 లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీవిరమణ చేశాక నవీన్ ఈ నవలను రాయడం మొదలు పెట్టాడు. కాలరేఖలు 1944 నుండి 1995 వరకు తెలంగాణా ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దంపడుతుంది. 1600 కు పైగా పేజీలున్న ఈ గ్రంథాన్ని పాఠకుల సౌలభ్యం కోసం “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు”, “బాంధవ్యాలు” అనే నవలాత్రయంగా విడుదల చేశారు.[6] 2004లో కాలరేఖలు రచనకు, అంపశయ్య నవీన్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు.
ఈయన 1962లో బి.ఏ.పూర్తి చేశాక,పెళ్ళి చేసుకున్నారు.[7]
నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య. తొలి రోజుల్లో ఆ పేరుతోనే అనేక రచనలు చేశారు. అయితే వాటిల్లో చాలావరకు అచ్చుకాలేదు. తన ప్రియమిత్రుడు వరవరరావు సలహామేరకు తన పేరును నవీన్‌గా మార్చుకొన్నారు.[8]
పురస్కారాలు
- కాళోజీ పురస్కారం (తెలంగాణ సాహిత్యంలో విశేష కృషికి) - 2018
- కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు, నుంచి 2004లో 16వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, 2002 లో ఉత్తమ కథల, నవలా విభాగంలో ప్రతిభా పురస్కారం
- హైదరాబాదులో రావి శాస్త్రి పురస్కారం, 2000 సంవత్సరంలో
- జ్యేష్ట సాహిత్య పురస్కారం, 1999లో, విశాఖపట్నం, స్వీయ రచన బలి ని ఆంగ్లంలోకి అనువదించినందుకు
- ఉత్తమ కథ: చెర - ఆంధ్రజ్యోతి వార పత్రిక, 1973
- ఉత్తమ కథ: బలి - స్వాతి వార పత్రిక, 1984
- ఉత్తమ కథ: దాడి - పల్లకి వార పత్రిక, 1985
- ఉత్తమ కథ: చెర - ఆంధ్రప్రభ వార పత్రిక, 1986
- ఉత్తమ కథ: తెర - ఆంధ్రజ్యోతి వార పత్రిక, 1987
- ఉత్తమ నవల దాగుడు మూతలు - స్వాతి వార పత్రిక, 1978
- ఉత్తమ నవల అంత:స్రవంతి - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 1994
రచనలు
నవలలు:
- అంపశయ్య
- కాలరేఖలు
- చెదిరిన స్వప్నాలు
- బాంధవ్యాలు
- రక్తకాసారం
- చీకటిరోజులు
- చీకటి మూసిన ఏకాంతంలో
- ముళ్ళపొదలు
- అంతస్స్రవంతి
- మనోరణ్యం
- విచలిత
- సంకెళ్ళు
- దాగుడు మూతలు
- ప్రత్యూష
- చెమ్మగిల్లని కన్నులు
- తీరనిదాహం
- సౌజన్య
- మౌనరాగాలు
- తారు-మారు
- దృక్కోణాలు
కథా సంకలనాలు:
- ఫ్రం అనురాధ విత్ లవ్
- ఎనిమిదో అడుగు
- లైఫ్ ఇన్ ఎ కాలేజి
- నిష్కృతి
- బంధితులు
- అస్మదీయులు - తస్మదీయులు
వ్యాస సంకలనాలు:
- నవీన్ సాహిత్య వ్యాసాలు
- సాహిత్య కబుర్లు
- జీవనశైలి (ప్రజాశక్తి కాలమ్)
- సినిమా వీక్షణం
- మనోవైజ్ఞానికి నవలల విశ్లేషణ
- సప్తవర్ణాల హరివిల్లు (సాహిత్య వ్యాసాలు)
పదవులు - గుర్తింపులు
- కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు[2]
మూలాలు
- ↑ "తెలుగు వెలుగు: ఆ మార్గాన్నే అనుసరించా". ramojifoundation.org. ఈనాడు. October 2018. Archived from the original on 2018-11-10. Retrieved 2018-11-15.
- ↑ 2.0 2.1 ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (24 March 2018). "ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం". Retrieved 24 March 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-14. Retrieved 2010-06-06.
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. అంపశయ్య నవీన్ (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 49.
- ↑ "No life without literature, says `Ampasayya' Naveen". The Hindu. 2006.
- ↑ నేనూ నా రచనలు - అంపశయ్య నవీన్ Archived 2010-11-02 at the Wayback Machine. ఈమాట జనవరి 2007 సంచిక
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. అంపశయ్య నవీన్ (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 52.
|access-date=
requires|url=
(help) - ↑ "ఈనాడులో నవీన్ ఫై చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2010-08-11. Retrieved 2010-06-06.
ఇతర లింకులు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
- CS1 errors: access-date without URL
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- 1941 జననాలు
- తెలుగు రచయితలు
- తెలుగు నవలా రచయితలు
- జీవిస్తున్న ప్రజలు
- జనగామ జిల్లా రచయితలు
- జనగామ జిల్లా ఉపాధ్యాయులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు
- లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతలు