"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంబాపురం (విజయవాడ గ్రామీణ)

From tewiki
Jump to navigation Jump to search
అంబాపురం (విజయవాడ గ్రామీణ మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ తోడేటి విజయకుమార్
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 1,123
 - స్త్రీల సంఖ్య 1,124
 - గృహాల సంఖ్య 606
పిన్ కోడ్ 520012
ఎస్.టి.డి కోడ్ 0866

"అంబాపురం" కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 520 012., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ ఊరి పేరు అంబ + పురం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అంబ అనగా స్త్రీదేవత అయిన పార్వతి. నిఘంటువు ప్రకారం దీనికి అమ్మ అనే అర్ధం వచ్చేటట్లు పేర్కొన్నారు. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం A city, or town. పట్టణం. A house, ఇల్లు. A storey, మేడ అని అర్ధాలున్నాయి.[1]

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 21 మీ,ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో పి.ఎన్.టి కాలని, రామక్రిష్ణాపురం, అయోధ్యనగర,ఫ్రైజర్ పేట గ్రామాలు ఊన్నాయి.

సమీప మండలాలు

విజయవాడ, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

చిట్టీనగర్, ఎపిఎస్ ఆర్టీసి బస్ స్టేషన్ విజయవాడ. రైల్వేస్టేషన్: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

 1. ఎ.ఎస్ఎం..జూనియర్ కాలేజి, నున్న.
 2. నారాయణ జూనియర్ కాలేజి, గొల్లపూడి.
 3. ఎన్.ఆర్.ఐ. ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోతవరప్పాడు.
 4. హార్వెస్ట్ ఇండియా పబ్లిక్ స్కూల్, అంబాపురం.

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం

ఈ గ్రామంలో ఒక నీటిశుద్ధి పథకం రూపుదిద్దుకున్నది. సురక్షిత త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్.టి.ఆర్. సుజలధార నీటి శుద్ధి పథకంలోభాగంగా మంజూరయిన ఆర్.ఓ.ప్లాంటు నిర్మాణం పూర్తి అయినది. నాలుగు లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన ఈ పథకం ద్వారా 20 లీటర్ల ఫ్లూరైడ్ రహిత శుద్ధినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. ఈ పథకాన్ని, 2014, అక్టోబరు-2న గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. [5]

అంగనవాడీ కేంద్రం

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొడాలి దయాకర్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచ్ గా శ్రీమతి బాడిశ నాగేంద్రమ్మ ఎన్నికైనారు. [3]&[4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

శ్రీ రామాలయం

ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

జైన గుహాలయం

అంబాపురం కొండల ప్రక్కన జైన గుహాలయం ఉంది. క్రీ.శ.7, 8 శతాబ్దాల నడుమ వేంగీ చాళుక్యుల గులాలయ వాస్తు దీనిలో కనబడటం విశేషం. [6]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయంలో, మూడురోజులపాటు అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు, 2017,మార్చి-17వతేదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ గ్రామములోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ ఉత్సవలు నిర్వహించుచున్నారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1689.[3] ఇందులో పురుషుల సంఖ్య 862, స్త్రీల సంఖ్య 827, గ్రామంలో నివాసగృహాలు 428 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 356 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,247 - పురుషుల సంఖ్య 1,123 - స్త్రీల సంఖ్య 1,124 - గృహాల సంఖ్య 606

మూలాలు

 1. http://dsalsrv02.uchicago.edu/cgi-bin/romadict.pl?page=769&table=brown&display=utf8[permanent dead link]
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/Ambapuram". Retrieved 17 June 2016. External link in |title= (help)
 3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.

వెలుపలి లింకులు

 • [3] ఈనాడు విజయవాడ; 2013,ఆగస్టు-7; 5వపేజీ.
 • [4] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు=2; 5వపేజీ.
 • [5] ఈనాడు విజయవాడ/మైలవరం; 2014,అక్టోబరు-3; 2వపేజీ.
 • [6] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-16 19వపేజీ.
 • [7] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,మార్చి-18; 2వపేజీ.