"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అక్కపల్లె

From tewiki
Jump to navigation Jump to search

"అక్కపల్లె" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నూతన జీవధ్వజ ప్రతిష్ఠ సందర్భంగా, 2014,జూన్-5, గురువారం నాడు, విశేషపూజలు నిర్వహించారు. విష్వక్సేన, పంచగవ్యాదిపూజలు, ధ్వజస్థంభానికి మంగళహారతి, విశేషపూజలు నిర్వహించారు. శుక్రవారం నాడు విశేషపూజలు నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, కలశస్థాపన, మూర్తిహోమాలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు, హోమం నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం చేసారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. శనివారం నాడు స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. యంత్రస్థాపన, ధ్వజప్రతిష్ఠ చేసారు. స్వామివారికి విశేషపూజలు చేసారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. [1]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-6, 7 & 8.