అగ్నికులక్షత్రియులు

From tewiki
Jump to navigation Jump to search

అగ్నికులక్షత్రియులు అనునది ఒకానొకప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలియున్న గొప్ప పాలకవంశము. ఇది ఏవో కొన్నిరాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులము కాదు. అగ్నికులక్షత్రియులు ప్రధానంగా వ్యవసాయము, నౌకానిర్మాణము, శిల్పకళ, దేవాలయ అర్చకత్వములను వృత్తులుగా కలిగియుండేవారు. పల్లవులు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసిన నౌకానిర్మాణము, నౌకాయానము, నౌకావ్యాపారము 50సం||ల క్రిందటివరకు అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడిచింది. పల్లవులు అభివృద్ధి పరచిన దేవాలయవ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అగ్ని పదమునకు సంస్కృత పదము 'వహ్ని'. 'వహ్ని'కి వికృతి 'వన్ని'.

పుట్టుపూర్వోత్తరాలు

ఉత్తర భారతదేశంలో మౌర్య, శుంగ వంశములు అంతరించుట వల్ల, అప్పటికే కావేరి, గంగా నదుల మధ్య, తూర్పు పశ్చిమ సముద్రముల మధ్య విస్తరించియున్న ఆంధ్రమహాసామ్రాజ్యాన్ని శాతవాహన వంశజులైన రాజపుత్రులు అల్పరాజ్యములను స్థాపించుట వలన సరైన నాయకత్వము లేకపోవుట వల్ల, పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వం కొరకు అప్పటి పీఠాధిపతులు బ్రాహ్మణరాజవంశములనుండి వీరులగు నలుగురును ఏరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వారిచేత హోమాదులను చేయించి, దేశమును నాలుగు భాగములుగాచేసి ఆ నలుగురిని అధినాయకులుగా చేశారు. ఆ నలుగురు తమ నాయకత్వమును అంగీకరించిన సామంతరాజులతో కలిసి విదేశీయుల దాడులనుండి దేశమును కాపాడారు. ఈ నాలుగువంశముల వారు అగ్నికులక్షత్రియులు అని పిలువబడ్డారు. అగ్ని దేవతలలో బ్రాహ్మణుడు. బ్రాహ్మణవర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు "అగ్నికులక్షత్రియుడు”. వీరి నాయకత్వమును అంగీకరించిన వారిలో శాతవాహనుల సామంతులైన పల్లవులుఉన్నారు.

అపోహ

భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అ.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం.... చేపలుపట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియులు (పల్లవులు) నిషాదులని చరిత్రలో ఎక్కడా లేదు. సముద్రంలో చేపలుపట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని, అగ్నికులక్షత్రియులు అన్నా పల్లీలు, జాలరి, బెస్త, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, పల్లికాపు, పల్లెరెడ్డి, నెయ్యల, పట్టపు అన్నా ఒకటేనని చెప్పటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కనీసము పై కులాలు అగ్నికులక్షత్రియ కులానికి ఉపకులాలు కూడా కావు.
అగ్నికులక్షత్రియ (పల్లవ) కులాన్ని సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసిఉంది.అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం, రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ జాలరులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది .సాక్షాత్తు శ్రీరామచంద్రుని గోత్రమున్న ఏకైక క్షత్రియుడు అగ్నికులక్షత్రియుడు మాత్రమే ...కాలానుగుణంగా మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కులాల వారు ఉపయోగించుకొవటం శోచనీయం

గోత్రాలు, గృహనామాలు

అగ్నికులక్షత్రియులకు గోత్రాలు బహుళములై యున్నవి-రఘుకుల గోత్రం, జంబు మహర్షి గోత్రం, అగ్ని గోత్రం, విష్ణు గోత్రం(కర్ణాటకలో), షోడంగి గోత్రం ... ... లున్నవి.

వీరి గృహనామములు : 1అద్దంకి, 2అంకాని, 3అంకాడి,4 అంగ, 5అవనిగడ్డ,6 అండ్రాజు, 7ఆకుల, 8బర్రి,9 బొడ్డు, 10బొమ్మిడి, 11చెన్ను,12 చింతా, 13చిప్పల,14చెక్క 15నాగాడి, 16గుల్లల,17 జల్లా, 18కర్రి, 19కన్నా,20 కొక్కిలిగడ్డ, 21కోల,22కొల్లాటి,23 కొల్లు, 24కొపనాతి,25 కొప్పాడ, 26లంకాడ, 27లంకె,28 మధురాంతకం, 29మల్లాడి, 30మర్ల, 31మచ్చా, 32మాతా, 33మైలా, 34మోకా,35 మోపిదేవి, 36నడకుదిటి,37 నాయుడు, 38నాగిడి, 39ఒడుగు, 40ఓలేటి,41 పినపోతు, 42పెదసింగు,43 పీత, 44పెమ్మాడి, 45పొన్నమండ, 46పోతాబత్తుల, 47రామాడ,48 రామాని, 49రేవు, 50రేకాడి, 51సమ్మిడి,52 సింగోతు, 53సునపుడి, 54సైకం, 55సంగాని, 56శీరం,57 తమ్ము, 58తమాడ, 59తాడి, 60తిరుమలశెట్టి,61 తిరుమాని,62తిరుమల, 63 వనమాడ,64 వాడ్రేవు,65 వల్లభనేని, 66వాతాడి,67 విశ్వనాథపల్లి, 68 యరబాల, 69 బస్వాని,70.యిల్లింగి,71 తదితరాలు,72 కూనే,

1.నెల్లూరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో, ... ... (ఇక్కడ 'జంబుమహర్షి' గోత్రం గల వారు ఎక్కువ ) ... ... కాళహస్తీ , కంచి , ఆరణి , చెంగల్పట్టు , మల్లెంబాకం, కనగలూరు , పూజారి, తిరువొత్తూరు , వేలూరు, కామాటి, నెల్లూరు, చిత్త్తాతూరు, ... ... ... ...

2.ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో (పల్లెపాలెం (గ్రా), కొత్తపట్నం(మం)), ... ... పిన్ని , చాపల, సైకం, చమ్ము(తమ్ము), వనమల, నాయుడు, సంకె, కోలా, ... ... ... ... ...


3.శ్రీకాకుళం జిల్లా, గజపతినగరం పరిసర ప్రాంతాల్లో & ఒరిస్సా రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, గజపతి, బరంపురం ప్రాంతాలలో (ఇక్కడ ఎక్కువ మందికి 'షోడంగి గోత్రం' ఉంటుంది, ) ... ... రఘుకుల గోత్రం కూడా వాడుకలో ఉంటుంది . రాంబుడ్డి , దున్న, గుడ్ల , జుత్తు , సీగు, తామాడ, రంగాల, దుమ్ము, మర్ల, వనిమిన, బత్తిన, సంగాని, యజ్జల, ఉప్పరపల్లి, పెద్దింటి, తెప్పల, రొయ్యి, గేదెల, బొడ్డు, తాళ్ల, ... ... ... ... ...


4.చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, పరిసర ప్రాంతాల్లో (i)(ఇక్కడ 'అగ్నిగోత్రం' గల వారు కొందరి ఇంటిపేర్లు) ... ... తాళిక్కాల్, కోనేరుగారి, జ్ఞానాంభావారి, కోనేరుగారి, మప్పేటి , అర్కాడు, సున్నపు, తలప, వెంగలత్తూరు, కైలాసం, ... ... ... ... (ii)ఇక్కడ 'జంబుమహర్షి' గోత్రం గల వారు ఎక్కువ: బండి,

5. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ఉత్తరాంధ్ర, కృష్ణా:రఘుకుల గోత్రం

మూలాలు