"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అజ్ఞాత (సమూహం)

From tewiki
Jump to navigation Jump to search

అజ్ఞాత సమూహం అనేది ఒకరకమైన గుర్తు. ఇంటర్నెట్‌ వాడుక పదం. ఇంటర్నెట్‌ సంస్కృతిలో పేరు తెలియకుండా పని చేసే పలువురు ఆన్‌లైన్‌ కమ్యూనిటీ వాడుకరుల చర్యలను సూచించేందుకు ఉపయోపడే పదం. ఈ వాడుకరులంతా సాధారణంగా సంయుక్త లక్ష్యం కోసం కలిసి పనిచేస్తుంటారు. కొన్ని ఇంటర్నెట్ ఉప సంస్కృతుల సభ్యులకు అజ్ఞాత గ్రూపు అనే పదాన్ని ఓ ముసుగుగా వాడుతుంటారు.[1]

అజ్ఞాత గ్రూపుకు ఆపాదించే పనులన్నింటినీ తమకు తాము అజ్ఞాతలుగా ముద్ర వేసుకునే గుర్తు తెలియని వ్యక్తులు చేపడుతుంటారు.[2] పలు వివాదాస్పద, బహూళ ప్రచారం పొందిన నిరసనలు, సంఘటనలు, 2008లో జరిగిన పలు DDoS‌ దాడుల తర్వాత ఇలాంటి అజ్ఞాత గ్రూపుల సభ్యులవిగా చెప్పే ఇలాంటి సంఘటనలు ఇటీవల పరిపాటిగా మారాయి.[3]

పలు వెబ్‌సైట్లు అజ్ఞాత గ్రూపు పేరు కింద గట్టిగా పెనవేసుకుని పోయి ఉంటాయి. ఇందుకోసం అవన్నీ ఒకే ఆన్‌లైన్‌ విభాగంగా ముడిపడి ఉండాల్సిన అవసరమేమీ లేదు. 4 చాన్‌, ఫుటబా, వాటికి సంబంధించిన వికీలు, ఎన్‌సైక్లోపీడియా డ్రమాటికా, పలు ఇతర ఫోరాల వంటి ప్రముఖ ఇమేజ్ బోర్డులను ఇందుకు ప్రముఖ ఉదాహరణలుగా చెప్పవచ్చు.

వాడుకకు సంబంధించిన మూలాలు

అజ్ఞాత అనే పదమే గోప్యత నుంచి స్ఫూర్తి పొందింది. ఒకరకంగా దాని నుంచే పుట్టిందని చెప్వచ్చు. ఈ గ్రూపు కింద వాడకందార్లు ఫొటోలను, వ్యాఖ్యలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. పంచుకునే అస్తిత్వం అనే అర్థంలో అజ్ఞాత అనే పదం వాడకం ఇమేజీ బోర్డులతో మొదలైంది. పోస్ట్‌ చేసిన విషయానికి మూలమేమిటో చెప్పని అతిథులకు అజ్ఞాత అనే తోకను సాధారణంగా తగిలిస్తుంటారు. కొన్నిసార్లు ఇమేజ్‌బోర్డు నిజమైన వాడకందారులే ఇలా అజ్ఞాత అనే ముసుగులో చలామణీ అయిన సందర్భాలున్నాయి. అజ్ఞాత అనే పదం గుర్తు తెలియని వాడకందారుల సామూహిక పదంగా ఇంటర్నెట్‌ వాడుకలో స్థిరపడిపోయింది.[4]

స్థూలంగా చెప్పాలంటే వ్యక్తి గానీ, ప్రజలందరి సమూహాన్ని గానీ పేరు లేని సమూహంగా చెప్పేందుకు అజ్ఞాత అనే పదాన్ని వాడుతుంటారు. నిజానికి ఈ పదానికి ఇదీ అని ఒకే నిర్వచనం ఇవ్వలేమని ప్రతి నిర్వచనం చివరా విధిగా చెబుతుంటారు. అది నిజం కూడా. అందుకే దానికి బదులుగా తరచూ సంబంధిత సమూహం అఫోరిజంలను సూచించే సూక్తుల ఆధారంగా వారిని పరోక్షంగా నిర్వచిస్తుంటారు.

కూర్పు

అజ్ఞాత గ్రూపు సాధారణంగా విభిన్న ఇమేజీబోర్డులు, ఇంటర్నెట్‌ ఫోరంల వాడకందారుల కలయికగా ఉంటుంది. సంప్రదాయిక ఇమేజీబోర్డుల పరిమితుల్ని అధిగమించేందుకు పలు వీకీలు, ఇంటర్నెట్‌ రిలే చాట్‌ నెట్‌వర్కులను నిర్వహిస్తుంటారు. ప్రాజెక్టు కానాలజీలపై పని చేసే అజ్ఞాత నిరసనకారులు ఇలాంటి సమాచార సాధనాల ద్వారానే సంభాషించుకుంటుంటారు. తమ భావి నిరసనలకు కూడా పథక రచన చేస్తుంటారు.[5][6]

దీన్ని ఇంటర్నెట్‌ డెనిజన్ల[7] మధ్య ఉండే పై పై సంబంధంగా చెప్పుకోవచ్చు. ఈ సమూహాన్ని సాధారణంగా ఇంటర్నెట్‌, 4చాన్‌[6][7], 11చాన్‌,[6] ఎన్‌సైక్లోపీడియా డ్రమాటికా, IRC చానెల్స్,[6] యూట్యూబ్‌ వంటి సైట్లు ఒకటిగా పట్టి ఉంచుతాయి.[1]

ఫేస్‌బుక్‌, వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సేవలను ఇలాంటి సమూహాల ఏర్పాటుకు ఉపయోగించుకుంటారు. తద్వారా ప్రజలకు చేరువై బయటి ప్రపంచంలో నిరసనలను ఏర్పాటు చేస్తారు.[8]

అజ్ఞాత సమూహాలకు సారథి గానీ, నియంత్రణ వ్యవస్థ గానీ ఉండవు. అందులోని వ్యక్తులందరి సామూహిక శక్తిపైనే ఆధారపడి పనిచేస్తుంటాయి. తద్వారా వచ్చే నికర ఫలితం సమూహం మొత్తానికీ లబ్ధి చేకూరుస్తుంది.[7]

దాడుల వంటివి జరిగినప్పుడు ఈ అజ్ఞాత లంతా దాదాపుగా ఒకే వాదన విన్పిస్తుంటారు. ఆయా పనులన్నీ ఇతర సైట్ల నుంచి సమాచారాన్ని దొంగిలిస్తుందంటూ అజ్ఞాత లంతా విపరీతంగా అసహ్యించుకునే ఈబేమ్స్‌ వరల్డ్‌ అనే సైట్‌ చేసినవేనని చెబుతుంటారు.

దాడులు, ఆక్రమణలు

ఈ విభాగంలోని పనులను వాటిని వ్యాప్తి చేసేవారు గానీ, మీడియా గానీ అజ్ఞాత సమూహాలకు ఆపాదించడం పరిపాటి. అజ్ఞాతలు చేసే పనులకు సంయుక్త అజెండా వంటిది కూడా ఏదీ ఉన్నట్టు కన్పించదు. ఈ పేరును ఆపాదించుకునేవారు చాలా సందర్భాల్లో కేవలం వినోదం కోసమే ఆ పనిచేస్తుంటారు. అజ్ఞాత లను కేవలం వినోదం కోసమే చేసేవారుగా చెప్పే (లజ్)సైట్లలో ఇది మరీ ప్రచారంలో ఉంది.

హబ్బో దాడులు

అజ్ఞాత సమూహాలు చేసే వ్యవస్థీకృత దాడులకు బాగా ప్రాచుర్యం పొందినది హబ్బో. ఇది వర్చువల్ హోటల్ గా డిజైన్ చేసిన సోషల్ నెట్ వర్క్. ఇందులో మొదటి అతిపెద్ద దాడిని "గ్రేట్ హబ్బో రైడ్ ఆఫ్'06" అనీ ఆ తర్వాత సంవత్సరం జరిగిన దాడిని "గ్రేట్ హబ్బో రైడ్ ఆఫ్ 07" అంటారు.[9] ఆ దాడిలో (ఇలా జరిగే అనేక ఇతర దాడుల్లో) హబ్బోలో ఎకౌంటు ఉన్న వాడకందారులు ఆఫ్రో తలకట్టు, గ్రీ సూటుతో అవతార్ ను తలపించే నల్లటి వ్యక్తిలా కనిపిస్తూ సైట్లోకి ప్రవేశాన్ని నిరోధించారు. 'ఎయిడ్స్[9][10] కారణంగా సైట్ ను మూసేశారు" అని ప్రకటించారు, సైట్ ను ఇంటర్నెట్ వ్యాఖ్యలతో[10] నింపేశారు మరియు స్వస్తిక వంటి గుర్తులను రూపొందించారు.[10] దాడులు జరిపే వారిని నిషేధించడంతో వారు జాతి వివక్ష అంటూ ఫిర్యాదు చేసారు.[10] ఇలాంటి వాటికి స్పందనగా హబ్బో నిర్వాహకులు తరచూ దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత కూడా దుండగుల ప్రోఫైల్స్ తో కలిసే అవతార్ వాడకందారులను కూడా నిషేధించడం పరిపాటి.[citation needed]

హాల్ టర్నర్ దాడి

2006 డిసెంబర్, 2007 జనవరి జనవరిలో తమను తాము అజ్ఞాత లుగా చెప్పుకున్న కొందరు తన వెబ్ సైట్ను ఆఫ్ లైన్ గా వాడుకున్నారని శ్వేత ఆభిజాత్యం బాగా ఉండే రేడియో వ్యాఖ్యాత హాల్ టర్నర్ ఆరోపించారు. దాంతో తనకు బ్యాండ్ విడ్త్ బిల్లుల రూపంలో వేలాది డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. ఆ తర్వాత 4 చాన్, ఈ బామ్స్ వరల్డ్, 7 చాన్, ఇతర వెబ్ సైట్లపై టర్నర్ కాపీ రైట్ అతిక్రమణ దావా వేశారు. అయితే ఇంజంక్షన్ విజ్ఞప్తిని నేగ్గించుకోలేకపోయారు. కోర్టు నుండి ఉత్తరాలు అందుకోలేకపోవడంతో టర్నర్ కేసు ఓడిపోయారు.[11]

ప్రాజెక్ట్ కానాలజే

హెచ్‌టీఎంఎల్‌ ఆట్రిబ్యూట్స్‌ చర్చ్‌ ఆఫ్‌ సైంటాలజీ పద్ధతులు, పన్ను హెAదా తదితరాలపై అజ్ఞాత సమూహం దాడి.

ఈ గ్రూప్ ప్రాజెక్ట్ చానాలజీ కి ప్రపంచ ప్రచార మాధ్యమాల దృష్టిని ఆకర్షించడంతోపాటు, చర్చి ఆఫ్ సైంటాలజీకి వ్యతిరేకంగా ఉద్యమించింది.[12]

జనవరి 15వ తేదీ 2008వ సంవత్సరం చర్చఆఫ్ సైంటాలజీ టాం క్రూజ్‌తో చేసిన ఒక ఇంటర్వ్యూ వీడియో ఇంటర్‌నెట్‌కు బహిర్గతమై యూట్యూబ్‌లో పొందుపరచబడింది. [13][14][15] యూట్యూబ్ పై కాపీ రైట్ ఉల్లంఘన కేసు పెట్టిన చర్చే ఆఫ్ సైంటాలజీ సదరు వీడియోను తొలగించాలంటూ అభ్యర్ధించింది.[16] ఇందుకు స్పందించిన అజ్ఞాత సమూహం ప్రాజెక్ట్ క్యానలోజిని ఏర్పాటు చేసింది.[6][17][18][19] చర్చ ఆఫ్ సైంటాలజీ చర్యను ఒకరకమైన ఇంటర్నెట్ సెన్సార్షిప్ గా అభివర్ణించిన ప్రాజెక్ట్ క్యానలోజి సభ్యులు సైంటాలజీ వెబ్ సైట్లపై సేవల నిరాకరణ, ప్రాంక్ కాల్స్ వంటి వరుస దాడులకు పాల్పడ్డారు. సైంటాలజీ కేంద్రాలకు బ్లాంక్ ఫ్యాక్సులు కుడా పంపారు.[20]

దస్త్రం:Message to Scientology.ogv అజ్ఞాత సమూహాల తరఫున మాట్లాడేవారిగా చెప్పుకున్న వ్యక్తులు కొందరు 2008 జనవరి 21న యూట్యూబ్‌లో మెసేజ్‌ టు సైంటాలజీ పేరుతో పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా తమ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రకటించారు. ఆ తర్వాత ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. చర్చ్‌ ఆఫ్‌ సైంటాలజీతో పాటు రిలీజియస్‌ టెక్నాలజీ కేంద్రంపై కూడా సంయుక్తంగా సైంటాలజీపై యుద్ధం ప్రకటించారు.[19][21][22] వాక్‌ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు, చర్చి సభ్యుల ఆర్థిక దోపిడీ (వారి దృష్టిలో)ని అరికట్టేందుకు చర్చ్‌ ఆఫ్‌ సైంటాలజీ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఆ సమూహం పత్రికా ప్రకటనలో పేర్కొంది.[23] కాల్‌ టు యాక్షన్‌ పేరుతో 2008 జనవరి 28న యూట్యూబ్‌లో దర్శనమిచ్చిన ఓ తాజా వీడియోలో చర్చ్‌ ఆఫ& సైంటాలజీ కేంద్రాల బయట 2008 ఫిబ్రవరి 10న నిరసన ప్రదర్శనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.[24][25] ఇక 2008 ఫిబ్రవరి 2 న ఫ్లోరిడాలోని ఆర్లాండో వద్ద చర్చ్‌ ఆఫ్‌ సైంటాలజీ కేంద్రం బయట దాదాపు 150 మంది గుమిగూడి దాని కార్యకలాపాల పట్ల నిరసన తెలిపారు.[26][27][28][29] వీటితో పాటు కాలిఫోర్నియాలోని శాంతాబార్బరా, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ వంటి పలు చోట్ల కూడా చిన్న తరహా నిరసన ప్రదర్శనలు జరిగాయి.[27][30][31] 2008 ఫిబ్రవరి 10న దాదాపు 7 వేల మంది ప్రపంచవ్యాప్తంగా నిరసనలను 93కు పైగా నగరాల్లో దీనిపై నిర్వహించారు.[32][33] వీరిలో చాలామంది నిరసనకారులు అచ్చం 'వీ ఫర్‌ వెండెట్టా ' కార్యక్రమం (గై ఫాక్స్‌ కార్యక్రమం దీనికి స్ఫూర్తి)లో వీ పాత్రధారి ధరించే మాదిరిగా ముసుగులు ధరించారు. మిగతా వారు కూడా ఏదోలా తమ అస్తిత్వాలు బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇదంతా చర్చి పీడన పట్ల నిరసన వ్యక్తం చేసే ఉద్దేశంతో జరిపినదేనని వారంతా నినదించారు.[34]

మళ్లీ 2008 మార్చి 15న ఈ అజ్ఞాత సమూహాలు బోస్టన్‌, డల్లాస్‌, షికాగో, లాస్‌ ఏంజెలెస్‌, లండన్‌, పారిస్‌, వాంకోవర్‌, టరంటో, బెర్లిన్‌, డబ్లిన్‌. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రెండో దశ నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టారు. వీటిలో దాదాపు 7 వేల నుంచి 8 వేల మంది పాల్గన్నట్టు అంచనా.[35] అనంతరం ఇదే దారిలో చాలా తరహాల 2008 ఏప్రిల్‌ 12న నిరసన ప్రదర్శనలు జరిగాయి.[36][37] ఇక మూడో దశ నిరసనలు ఆపరేషన్‌ రీకనెక్ట్‌ పేరుతో మొదలయ్యాయి. చర్చ్‌ ఆఫ్‌ సైంకాలజీ డిస్‌ కనెక్షన్‌ విధానాల పట్ల అందరికీ అవగాహన కల్పించడమే దీని ముఖ్యోద్దేశమని అజ్ఞాత సమూహాలు ప్రకటించాయి.[13]

మళ్లీ 2008 అక్టోబరు 17న న్యూజెర్సీకి చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు తనను తాను అజ్ఞాత నిగా చెబుతూ తెరపైకి వచ్చాడు. 2008 జనవరిలో చర్చ్‌ ఆఫ్‌ సైంకాలజీ సైట్లపై జరిగిన డీడీఓఎస్‌ దాడుల్లో తన ప్రమేయం పట్ల విచారం వ్యక్తం చేశాడు.[38][39]

2009 డిసెంబరు 2న అజ్ఞాత సమూహాలు 'సైంకాలజీ సక్స్‌: ఏ కాంటెస్ట్‌ పేరుతో ఒక పోటీని నిర్వహించాయి. చర్చ్‌ ఆఫ్‌ సైంకాలజీపై ప్రాంక్‌ దాడులను కొనసాగించాల్సిందిగా పోటీదారులను కోరాయి. ఇందుకు వారికి గాను టాప్‌ 3 ఎంట్రీలకు విరాళపు మొత్తం కింద వరుసగా 1,000 డాలర్లు, 300 డాలర్లు, 75 డాలర్లు (మొదట్లో ఈ మొత్తం 400 డాలర్లు, 100 డాలర్లు, 50 డాలర్లు) ప్రకటించాయి.[40] ఈ పోటీలో మాల్కంటెంట్‌ నాజీగా తనను తాను చెప్పుకునే ఓ పోటీదారుడు గెలుపొందాడు. ఆ చిత్రంలో అతను నాజీ మాదిరి వస్త్రధారణతో సైంకాలజీ చర్చ్‌ ముందు నుంచుని కన్పించాడు. ఆ తర్వాత అతనే స్వయంగా చర్చ్‌కి ఫోన్‌ చేసి, నాజీ మాదిరిగా దుస్తులు వేసుకుని చర్చిని వీధుల్లో అల్లరిపాలు చేస్తున్న యువకునిపై ఎందుకు ఏ చర్యలూ తీసుకోవడం లేదని ప్రశ్నించాడు![41]

ఇలా నిరసనలు కొనసాగాయి. టామ్‌క్రూయిజ్‌ సినిమా వాల్కైర్‌ ప్రీమియర్‌ షో వంటి మీడియా ఈవెంట్లను ఇందుకు వాడుకున్నారు. తమ నిరసనలకు మరీ ఎక్కువ ప్రచారం రాకుండా చూసుకునేందుకు వాటిని వాడుకున్నారు.[42]

ఎపిలెప్సీ ఫౌండేషన్ ఫోరంపై దాడి

‌ఎపిలెప్సీ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఎపిలెప్సీ సపోర్ట్‌ ఫోరంపై ఇంటర్నెట్‌ గ్రీఫర్స్‌ (ఇతరులను వేధించడమే[43] పనిగా పెట్టుకునే వారికి పెట్టిన తాత్కాలిక పదమిది)గా చెప్పుకునే కొందరు దాడికి దిగినట్టు వైర్డ్‌ న్యూస్‌ 2008 మార్చి 28న పేర్కొంది.[44] ఫొటో సెన్సిటివ్‌, పాటెన్‌ సెన్సిటివ్‌ ఎపిలెప్టిక్స్‌ సమస్యలు, మైగ్రేన్‌ తలనొప్పుల వంటివాటిని వ్యాప్తి చేసే (సీజర్)ఉద్దేశంతో జావాస్క్రిప్ట్‌, ఫ్లాషింగ్‌ కంప్యూటర్‌ యానిమేషన్లను కూడా పోస్ట్‌ చేశారు.[44] ఈ దాడులకు కూడా అజ్ఞాత వాడకందారులే కారణమని ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా వైర్డ్‌ న్యూస్‌ పేర్కొంది. ఎపిలెప్సీ ఫోరంపై తొలుత జరిగిన దాడులకు ఈ బేయమ్స్‌ వరల్డ్‌ను దోషిగా పేర్కొన్నారు. అజ్ఞాత లకు బలమైన స్థావరంగా చెప్పే 7 చాన్‌ అనే ఇమేజ్‌బోర్డులో తమ పై దాడులకు పథక రచన చేస్తున్న ఒక తీగను కనిపెట్టినట్టు ఎపిలెప్సీ ఫోరం సభ్యులు ప్రకటించారు. ఇలాంటి ఇమేజీ బోర్డులపై గతంలో తెరపైకి వచ్చిన ఇతర ప్రమాదాల మాదిరిగానే ఈ తాజా ప్రమాదం కూడా కన్పించకుండా అదృశ్యమైపోయింది.[44]

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి నడిచే నేషనల్‌ సొసైటీ ఫర్‌ ఎపిలెప్సీ అనే ఫోరం కూడా ఇలాంటి దాడులకే గురైందని రియల్‌టెక్‌ న్యూస్‌ పేర్కొంది.[unreliable source?] కొందరు అజ్ఞాత సమూహపు సభ్యులు ఈ రెండు రకాల దాడులకూ బాధ్యత తమది కాదని పేర్కొన్నారని చెప్పింది. ఈ దాడులకు పాల్పడింది చర్చ్‌ ఆఫ్‌ సైంకాలజీయేనని కూడా వారు అన్నట్టు వివరించింది.[45] అజ్ఞాత సమూహాల పై జనాభిప్రాయాన్ని ప్రతికూలంగా మార్చేందుకు చర్చ్‌ ఆఫ్‌ ఆంకాలజీయే ఈ దాడులకు పాల్పడిందని పేర్కొంటూ 7 చాన్‌ డాట్‌ ఓఆర్‌జీ ఒక బహిరంగ లేఖను పోస్ట్‌ చేసింది. న్యూస్ డాట్ కాం డాట్ ఎయూ ఈ మేరకు చెప్పింది. అజ్ఞాత సమూహాల చట్టబద్ధమైన నిరసనల ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించే ఉద్దేశంతోనే చర్చి తన సూత్రబద్ధ క్రీడల విధానంలో భాగంగా ఈ ఎత్తుగడకు దిగిందని వాదించింది.[43] ఈ దాడి మొదలైనప్పుడు అజ్ఞాత సమూహాలతో పాటు పలు ఇతర గ్రూపులను కూడా ఉల్లంఘించినట్టుగా ద టెక్‌ హెరాల్డ్‌ వివరించింది.[unreliable source?] ద ఇంటర్నెట్‌ హేట్‌ మెషీన్‌ (కేటీటీవీ ఫాక్స్‌ 11 వార్తా కథనం ప్రకారం) ఈ దాడులకు కారణమని కూడా తేల్చింది. ఇది కూడా అజ్ఞాత సమూహంలో తానూ ఒక భాగమేనని చెప్పుకుంటుందని పేర్కొంది. కాకపోతే సైంకాలజీ పై దుష్ప్రచారానికి దిగిన సమూహం మాత్రం ఇది కాదని అభిప్రాయపడింది.[46]

ఈ దాడుకు దిగింది కేవలం వాచ్యార్థంలో మాత్రమే అజ్ఞాత లుగా ఉన్న కొందరు ఇంటర్నెట్‌ వాడకందారులని ప్రాజెక్ట్‌ చాంకాలజీలో పాల్గన్న కొందరు అజ్ఞాత లు సూచించారు. అజ్ఞాత లకు తరచూ ఆపాదించే సైంకాలజీ వ్యతిరేక ప్రయత్నాలతో వారికి ఏ సంబంధమూ లేదని అభిప్రాయపడ్డారు.[46] అజ్ఞాత సమూహాలు ఎపిలెప్సీ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లోకి చొరబడ్డాయని సైంకాలజిస్టు టామీ డేవిస్‌ సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ఆరోపించారు కూడా. ఎపిలెప్టిక్‌ జీర్లకు దారి తీసేలా చిత్రాలను ప్రదర్శించేట్టు సైట్‌ను తప్పుదోవ పట్టించారని చెప్పుకొచ్చారు. కానీ, ఈ చర్యలతో అజ్ఞాత సమూహాలకు ఏ సంబంధమూ లేదని, ఆ దిశగా ఎలాంటి సాక్ష్యమూ దొరకలేదని ఎఫ్‌బీఐ చేసిన ప్రకటనను ఇంటర్వ్యూ చేసిన జాన్‌ రాబర్ట్స్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు అజ్ఞాత సమూహంపై ఇలాంటి ఆరోపణలు ఆపాదించేందుకు ఎలాంటి కారణమూ కన్పించడం లేదని ఆ సంస్థ పేర్కొనడాన్ని కూడా టామీతో ఆయన అన్నారు.[47] ఈ విషయం స్థానిక పోలీసుల చేతిలో ఉందని, దీని పై మరింత లోతుగా విచారణ జరుగుతోందని చెప్పి టామీ సరిపెట్టారు.[47]

ఎస్‌ఓహెచ్‌హెచ్‌, లననహిప్‌టాప్‌ వెబ్‌సైట్లపై దుష్ప్రచారం

2008 జూన్‌ చివర్లో తమను తాము అజ్ఞాత లుగా చెప్పుకున్న కొందరు SOHH‌ (సపోర్ట్‌ ఆన్‌లైన్‌ హిప్‌హాప్‌) వెబ్‌సైట్‌పై దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్నారు.[48] 4 చాన్‌ వాడకందారులను ఎస్‌ఓహెచ్‌హెచ్‌ తాలూకు జస్ట్‌ బగ్గింగ్‌ ఔట్‌ ఫోరం సభ్యులు అవమానించడానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్టు సమాచారం. వెబ్‌సైట్‌పై దాడి దశలవారీగా జరిగింది. SOHH‌ ఫోరాలన్నింటి పైనా అజ్ఞాత సమూహాల వాడకందారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాంతో అవన్నీ విధి లేక మూతబడ్డాయి. 2008 జూన్‌ 23న తమను తాము అజ్ఞాత లుగా చెప్పుకున్న ఒక సమూం ఈ వెబ్‌సైట్‌ప విజయవంతంగా DDOS‌ దాడులకు దిగింది. వెబ్‌సైట్‌ సర్వీస్‌ సామర్థ్యంలో 60 శాతాన్ని విజయవంతంగా తొలగించింది. వెబ్‌సైట్‌ ప్రధాన పేజీని మార్చేందుకు క్రాస్‌ సైట్‌ స్క్రిప్టింగ్ ను 2008 జూన్ 27న హ్యాకర్లు తెలివిగా వాడుకున్నారు. అంతే కాకుండా వ్యంగ్య బమ్మలు, శీర్షికలు, పలు జాతి వివక్షపూరితమైన నినాదాలు తదితరాలను పేజీలో ఉంచారు. దాంతోపాటు SOHH ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని విజయవంతంగా దొంగిలించారు.[49]

నో కసింగ్‌ క్లబ్‌

2009 జనవరిలో అజ్ఞాత సమూహపు సభ్యులు కాలిఫోర్నియాకు చెందిన మెక్‌కే హాచ్‌ అనే ఒక టీనేజీ యువకున్ని లక్ష్యంగా చేసుకున్నారు. అతను అశ్లీలతపై పోరాడే ప్రోఫిన్టీ నో కసింగ్‌ క్లబ్‌ను నడుపుతున్నాడు.[50][51] హాచ్‌ ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఇతర వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్లో లీకైంది. దాంతో ఆయన కుటుంబీకులకు కూడా బెదిరింపు, అసహ్యకర మెయిళ్లు వచ్చాయి. ఫోన్లలో కూడా అసభ్యకర సంభాషణలు పెరిగిపోయాయి. బోగస్‌ పిజ్జాలతో పాటు అశ్లీల దృశ్యాలు కూడా ఇంటికి డెలివరీ అయ్యాయి.

యూ ట్యూబ్‌ పోర్న్‌ డే

2009 మే 20న అజ్ఞాత సమూహపు సభ్యులు అసంక్యాకమైన అశ్లీల వీడియోలను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేశారు.[52] వీటిలో చాలా వీడియోలు పిల్లల వీడియోలు, కుటుంబ, స్నేహపూర్వక వీడియోల ముసుగులో వచ్చి పడ్డాయి. జోనాస్‌ బ్రదర్స్‌ వంటి పేర్లుండటంతో ఎవరికీ అనుమానం కూడా రాలేదు.[52] ఆ తర్వాత వీటన్నింటినీ యూట్యూబ్‌ తొలగించింది. యూట్యూబ్‌ నుంచి మ్యూజిక్‌ వీడియోలను తొలగించడం వల్లే అలా దాడులు చేయాల్సి వచ్చిందని తమను సంప్రదించిన BBCతో అప్‌లోడర్లు చెప్పుకొచ్చారు.[53] ఆ వీడియోల బాధితుల్లో ఒకరు 'నేను 12 ఏళ్ల పిల్లాన్ని. ఏమిటీ వీడియోలు? ' అంటూ వాపోయినట్టు BBC న్యూస్‌ పేర్కొంది.[53] ఆ తర్వాత ఈ ప్రశ్నే ఇంటర్నెట్‌ వాడుక మాటగా కూడా మారింది.

ఆపరేషన్‌ టిట్‌స్టార్మ్‌


ఇది 2010 ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటలకు సంభవించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఇంటర్నెట్‌ ఫిల్టరింగ్‌ చట్టాన్ని నిరసిస్తూ ఈ ప్రహసనం మొదలైంది. చిన్న వక్షోజాలున్న మహిళల (వీరిలో ఎదుగుదల వయసు కంటే తక్కువని భావిస్తారు) అశ్లీల దృశ్యాలు, మహిళల్లో భావప్రాప్తి వంటి వాటిని నిషేధించడం ఈ చట్టం ఉద్దేశం. నిరసనల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లపై సేవల నిరాకరణ (DDoS‌) దాడులకు దిగారు. కానీ ఇలాంటి దాడులతో దెబ్బ తినేది తమ ప్రయోజనాలేనని ఆస్ట్రేలియాకు చెందిన యాంటీ సెన్సార్‌షిప్‌ సమూహాలు పిర్యాదు చేశాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ పెద్దలు ఈ దాడులను తేలిగ్గా కొట్టిపారేశారు. దాడులు పూర్తవగానే సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.[54][55] దాడుల గరిష్ఠ బ్యాండ్‌విడ్త్‌ 17 ఎంబిట్‌ లోపేనని విశ్లేషణలో తేలింది. DDoS తాలూకు ఇతర దాడులతో పోలిస్తే ఇవి చాలా పిల్లరకపు దాడులేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.[56]

కేటీటీవీ ఫాక్స్‌ 11 వార్తా కథనం

అజ్ఞాత సమూహాలను 'స్టెరాయిడ్లు తీసుకున్న హ్యాకర్లుగా, అంతర్గత ఉగ్రవాదులుగా, ఉమ్మడిగా ఇంటర్నెట్‌ హేట్‌ మెషీన్‌గా పేర్కొంటూ అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌, కాలిఫోర్నియాలకు చెందిన KTTV ఫాక్స్‌ 11 2007 జూలై 26న వార్తా కథనం ప్రసారం చేసింది. ఒక మైస్పేస్‌ వాడకందారుపై జరిగిన దాడిని ఈ కథనం ఉటంకించింది. అజ్ఞాత ల చేతిలో తన మైస్పేస్‌ అకౌంట్‌ కనీసం ఏడుసార్లు హ్యాకింగ్‌కు గురైందని అతను చెప్పుకొచ్చాడు. అంతేగాక స్వలింగ సంపర్కుల అశ్లీల దృశ్యాలుతో తన అకౌంట్‌ను నింపేసిందని వాపోయాడు. ఇంతటితో ఊరుకోకుండా ఓ వైరస్‌ను తన అకౌంట్‌కు, అందులోని తన మిత్రులకు చెందిన 90 దాకా అకౌంట్లకు అజ్ఞాత సమూహాలు పంపాయని అతను చెప్పాడు. అజ్ఞాత సమూహాల నుంచి విడిపోయిన ఒక మాజీ హ్యాకర్‌ కూడా ఈ వార్తా కథనంలో దర్శనమిచ్చాడు. అజ్ఞాత సంస్కృతి గురించి అతను చాలా విషయాలు వివరించాడు. అంతేగాక హ్యారీపోటర్‌ సిరీస్‌లో కొత్త పుస్తకంలో ముగింపును పాడు చేసేందుకు హబ్బోపై దాడి ద్వారా జాతీయ స్థాయి ప్రచారం మొదలు పెట్టి, క్రీడా స్టేడియంలపై బాంబులు వేస్తామని బెదిరించిన వైనాన్ని కూడా ఈ కథనం ప్రస్తావించింది.[3][57]

కేటీ టీవీ కథనం వచ్చిన మర్నాడే వైర్డ్ న్యూస్‌ బ్లాగర్‌, జర్నలిస్టు రేయాన్‌ సింగల్‌ దాన్ని తప్పుబట్టారు. నిజానికి ఆ హ్యకర్ల సమూహం బాగా బోరు కొట్టిన 15 ఏళ్ల కుఆళ్ల పనని వారన్నారు. ఆ కథనాన్ని ఇప్పటిదాకా వచ్చి వాటిలోకెల్లా అత్యంత హాస్యాస్పదమైనదిగా అభివర్ణించారు.[58] 2008 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాకు చెందిన టుడే టునైట్‌ ప్రసార సంస్థ కేటీ టీవీ కథనంలో ఒక భాగాన్ని ప్రసారం చేసింది. ద చర్చ్‌ ఆఫ్‌ సైంటాలజీ అనే ప్రకటనను దానికి ముందు జత చేసింది. అజ్ఞాత సమూహపు సభ్యులపై తీవ్రస్థాయిలో దాడికి దిగింది. వారంతా రోగగ్రస్తులని, మతిభ్రమించిన ఆత్మలని, మతోన్మాదులని దుమ్మెత్తి పోసింది.[59]

ఇంటర్నెట్‌ నిఘా నివేదికలు

క్రిస్‌ ఫోర్కాండ్‌ అరెస్టు

క్రిస్‌ ఫోర్కాండ్‌ అనే అనుమానిత ఇంటర్నెట్‌ ఆక్రమణదారును అరెస్టు చేశారంటూ కెనడాకు చెందిన టొరంటో సన్‌ పత్రిక 2007 డిసెంబరు 7న ఒక కథనం ప్రచురించింది.[60] 53 ఏళ్ల ఫోర్కాండ్‌పై 14 ఏళ్ల లోపు బాలున్ని లైంగిక చర్యలకు ఆహ్వానం, ఎక్స్‌పోజర్‌, ప్రమాదకర ఆయుధాన్ని కలిగి ఉండటం, ఆయుధాన్ని రహస్యంగా అట్టిపెట్టుకోవడం వంటి అభియోగాలు మోపారు.[61] ఇలా పిల్లల విషయంలో లైంగికాసక్తి ప్రదర్శించే వారిని కనిపెట్టేందుకు పని చేసే సైబర్‌ విజిలాంట్స్‌ పోలీసుల విచారణ కంటే ముందే ఫోర్కాండ్‌ను పట్టుకునే ప్రయత్నాలు చేసిందని కథనం వివరించింది.[60]

తాము అజ్ఞాత లమని చెప్పుకున్న స్వయం ప్రకటిత ఇంటర్నెట్‌ విజిలాంట్‌ గ్రూపు ఫోర్కాండ్‌ అరెస్టుకు కారణమని ఒక గ్లోబల్‌ టీవీ నెట్‌వర్క్‌ నివేదిక చెప్పింది. తమ సభ్యులు కొందరికి ఫోర్కాండ్‌ తన అశ్లీల ఫొటోలను పంపడంతో వారు అతని పని పట్టారని, పోలీసులను ఆశ్రయించి ఫోర్కాండ్‌ ఆట కట్టించారని వివరించింది. ఇంటర్నెట్‌ జాగరూకత కారణంగా అనుమానిత ఇంటర్నెట్‌ ఆక్రమణదారు అరెస్టవడం ఇదే తొలిసారని ఆ కథనం పేర్కొంది.[62]

హ్యాక్టివిజం

2009 ఇరాన్‌ ఎన్నికల నిరసనలు

2009 జూన్‌ 20న ద పైరేట్‌ బే తొలి పేజీద పైరేట్‌ బేతో కలిసి ఇరాన్‌ గ్రీన్‌ పార్టీకి మద్దతుగా అనానిమస్‌.ఇరాన్‌ సైట్‌ను అజ్ఞాత సమూహం మొదలు పెట్టింది.

2009 జూన్‌లో ఇరాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్‌ అహ్మదీ నెజాద్‌ తిరిగి ఎన్నికైన అధ్యక్ష ఎన్నికల్లో విచ్చలవిడిగా ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఇరాన్‌ పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాంతో ది పైరేట్‌ బేతో కలిసి అజ్ఞాత సమూహాలు ఇరాన్‌ గ్రీన్‌ పార్టీకి మద్దతిచ్చే Anonymous.Iran‌ సైట్‌ను ఏర్పాటు చేశారు. ఇరాన్‌, మిగతా ప్రపంచం మధ్య సమాచార ప్రసారానికి వీలు కల్పించే ఈ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 వేల మంది మద్దతుదారులున్నారు. తమ దేశంలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన వార్తలు ఇంటర్నెట్‌కు ఎక్కకుండా నిరోధించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. నిరసనలు తెలుపుతున్న ఇరాన్‌ వాసులకు మద్దతుగా ఈ సైట్‌ వార్తా వనరులను అందజేస్తూ వస్తోంది.[63][64]

ఆపరేషన్‌ డిడ్‌జెర్డీ

అజ్ఞాత సమూహం ఇమేజీ బోర్డులను పలు ప్రభుత్వాలు నిషేధించినా పౌర హక్కులను కాపాడే నిమిత్తం 2009 సెప్టెంబరులో అది మరోసారి మేల్కంది. జర్మనీలో Krautchan.netను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం చాలామందికి ఆగ్రహం కలిగించింది. కానీ ఇంటర్నెట్‌ పై ISP స్థాయి సెన్సార్‌షిప్‌ విధించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం ఇక్కడ ముఖ్యమైన అంశం.[65] స్టీఫెన్‌ కోన్రీ హయాంలో మొదలైన ఈ విధానాన్ని 2007 ఎన్నికల తర్వాత నుంచీ కెవిన్‌ రుడ్‌ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.[66]

సెప్టెంబరు 9న ఉదయాన్నే అజ్ఞాత సమూహం ఏకంగా ప్రధాని అధికారిక వెబ్‌సైట్‌పై అంచలవారీగా సేవల నిరాకరణ దాడికి దిగింది! దాదాపు గంట పాటు సైట్‌ను స్తంభింపజేసింది.[67] ఇక 2010 ఫిబ్రవరి 10 ఉదయాన ఆపరేషన్‌ టిట్‌స్టార్మ్‌ పేరుతో మరింత సన్నద్ధతతో కూడిన దాడికి దిగింది. ప్రధాని వెబ్‌సైట్‌ ముఖచిత్రాన్ని వీలైనంతగా నాశనం చేసేసింది. ఆస్ట్రేలియా పార్లమెంటు వెబ్‌సైట్‌ను కూడా మూడు గంటల పాటు స్తంభింపజేసింది. అంతేగాక సమాచార ప్రసార శాఖ వెబ్‌సైట్‌ను కూడా దాదాపుగా స్తంభింపజేసినంత పనిచేసింది.[68] ఈ దాడిని ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కన్సల్టెట్లు అంత సీరియస్‌గా తీసుకోలేదని ద ఆస్ట్రేలియన్‌ వార్తా పత్రిక తర్వాత వెల్లడించింది. ఇలాంటి దాడులు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసని వారు పేర్కొన్నట్టు చెప్పింది. కానీ వాటిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమవడం గమనార్హం.[69] ఇలాంటి దాడులను సైబర్‌ ఉగ్రవాదంగా పరిగణించరాదని, లేదంటే ఆ పదం మరీ పలుచబడిపోతుందని సెక్యూరిటీ సొల్యూషన్స్‌ మేగజైన్‌ తన కవర్‌ స్టోరీలోపేర్కొంది.[70]

వీటిని కూడా చూడండి

Page మాడ్యూల్:Portal/styles.css has no content. వెడల్పు = 250 పాయింట్లు వాలిన్‌ టాప్‌. (బెక్‌ వర్సెస్‌ ఎలాండ్‌ హాల్‌) (ఎలక్ట్రానిక్‌ పౌర సమాయ నిరాకరణ) (మూక మనస్తత్వం) (జాన్‌ డో) (లిబెర్టైన్‌) (బహూళ వాడకపు పేర్లు) (ఆన్‌లైన్‌ డిస్‌ ఇన్హిబిషన్‌ ప్రభావం) వెడల్పు = 250 పాయింట్లు, టాప్ కంపోజిషణ్

 • ఆవిర్భావం
 • స్వీయ సన్నద్ధత
 • సమయానుకూల ఆర్డర్‌
 • స్టాండ్‌ అలోన్‌ కాంప్లెక్స్‌

వెడల్పు = 250 పాయింట్లు వాలిన్‌ టాప్‌

ప్రాజెక్టు చరిత్ర క్రమం
 • ఫ్లాష్‌ మాబ్‌
 • హాక్టివిజం
 • స్ట్రెయిశాండ్‌ ఎఫెక్ట్‌

|}

సూచనలు

 1. 1.0 1.1 Jessica Parral, James Clark (February 2, 2008). "Internet Group Takes Action Against Scientology". City on a Hill Press (student newspaper). University of California, Santa Cruz. Retrieved 2008-02-21.
 2. Davies, Shaun (May 8, 2008). "The internet pranksters who started a war". ninemsn. Archived from the original on 2012-07-12. Retrieved 2008-10-29.
 3. 3.0 3.1 Tsotsis, Alexia (2009-02-04). "My Date with Anonymous: A Rare Interview with the Elusive Internet Troublemakers". LA Weekly. Retrieved 2009-02-07.
 4. Whipple, Tom (June 20, 2008). "Scientology: the Anonymous protestors". The Times. London.
 5. Ryan Singel (2008-01-23). "War Breaks Out Between Hackers and Scientology -- There Can Be Only One". Wired News. CondéNet, Inc. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 6. 6.0 6.1 6.2 6.3 6.4 George-Cosh, David (2008-01-25). "Online group declares war on Scientology". National Post. Canwest Publishing Inc. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help) Cite error: Invalid <ref> tag; name "George-Cosh" defined multiple times with different content
 7. 7.0 7.1 7.2 James Harrison (2008-02-12). "Scientology protestors take action around world". The State News (student newspaper). Michigan State University. Retrieved 2008-02-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 8. Dahdah, Howard (February 8, 2008). "'Anonymous' group declares online war on Scientology". Computerworld: The Voice of IT Management. IDG Communications. Retrieved 2008-02-08. Cite has empty unknown parameter: |coauthors= (help)
 9. 9.0 9.1 "Net users insist 'racist' sign is joke". KENS-TV.
 10. 10.0 10.1 10.2 10.3 Ryan Singel (2008-09-19). "Palin Hacker Group's All-Time Greatest Hits". Retrieved 2009-09-21.
 11. "Harold C. "Hal" Turner v. 4chan.org". Justia. Retrieved 2007-07-27.
 12. Richards, Johnathan (The Times) (January 25, 2008). "Hackers Declare War on Scientology: A shadowy Internet group has succeeded in taking down a Scientology Web site after effectively declaring war on the church and calling for it to be destroyed". Fox News. Fox News Network, LLC. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 13. 13.0 13.1 John Cook (March 17, 2008). "Scientology - Cult Friction". Radar Online. Radar Magazine. Retrieved 2008-03-18. External link in |work= (help)
 14. Warne, Dan (January 24, 2008). "Anonymous threatens to "dismantle" Church of Scientology via internet". APC Magazine. National Nine News. Retrieved 2008-01-25.
 15. KNBC Staff (January 24, 2008). "Hacker Group Declares War On Scientology: Group Upset Over Church's Handling Of Tom Cruise Video". KNBC. Retrieved 2008-01-25.
 16. Vamosi, Robert (January 24, 2008). "Anonymous hackers take on the Church of Scientology". CNET News. CNET Networks, Inc. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 17. Singel, Ryan (January 23, 2008). "War Breaks Out Between Hackers and Scientology -- There Can Be Only One". Wired. CondéNet, Inc. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 18. Feran, Tom (January 24, 2008). "Where to find the Tom Cruise Scientology videos online, if they're still posted". The Plain Dealer. Newhouse Newspapers. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 19. 19.0 19.1 Chan Enterprises (January 21, 2008). "Internet Group Declares "War on Scientology": Anonymous are fighting the Church of Scientology and the Religious Technology Center" (PDF). Press Release. PRLog.Org. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 20. Matthew A. Schroettnig, Stefanie Herrington, Lauren E. Trent (2008-02-06). "Anonymous Versus Scientology: Cyber Criminals or Vigilante Justice?". The Legality. Retrieved 2008-01-25.CS1 maint: multiple names: authors list (link)
 21. Thomas, Nicki (January 25, 2008). "Scientology and the internet: Internet hackers attack the church". Edmonton Sun. Sun Media. Retrieved 2008-01-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
 22. Dodd, Gareth (Editor) (January 25, 2008). "Anonymous hackers vow to "dismantle" Scientology". Xinhua News Agency. Retrieved 2008-01-25. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra text: authors list (link)
 23. Brandon, Mikhail (January 28, 2008). "Scientology in the Crosshairs". The Emory Wheel. Emory University. Retrieved 2008-01-31. Cite has empty unknown parameter: |coauthors= (help)
 24. Feran, Tom (January 31, 2008). "The group Anonymous calls for protests outside Scientology centers - New on the Net". The Plain Dealer. Newhouse Newspapers. Retrieved 2008-02-04. Cite has empty unknown parameter: |coauthors= (help)
 25. Vamosi, Robert (January 28, 2008). "Anonymous names February 10 as its day of action against Scientology". CNET News. CNET Networks, Inc. Retrieved 2008-01-28. Cite has empty unknown parameter: |coauthors= (help)
 26. Braiker, Brian (February 8, 2008). "The Passion of 'Anonymous': A shadowy, loose-knit consortium of activists and hackers called 'Anonymous' is just the latest thorn in Scientology's side". Newsweek. Newsweek, Inc. pp. Technology: Newsweek Web Exclusive. Retrieved 2008-02-09. Cite has empty unknown parameter: |coauthors= (help)
 27. 27.0 27.1 Barkham, Patrick (February 4, 2008). "Hackers declare war on Scientologists amid claims of heavy-handed Cruise control". The Guardian. London: Guardian News and Media Limited. Retrieved 2008-02-03. Cite has empty unknown parameter: |coauthors= (help)
 28. Staff (February 3, 2008). "Group Lines Road To Protest Church Of Scientology". WKMG-TV. Internet Broadcasting Systems and Local6.com. Retrieved 2008-02-03. Cite has empty unknown parameter: |coauthors= (help)
 29. Eckinger, Helen (February 3, 2008). "Anti-Scientology group has protest rally". Orlando Sentinel. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); |access-date= requires |url= (help)
 30. Standifer, Tom (February 4, 2008). "Masked Demonstrators Protest Against Church of Scientology". Daily Nexus. University of California, Santa Barbara. pp. Issue 69, Volume 88. Retrieved 2008-02-04.
 31. Eber, Hailey (February 4, 2008). "Anti-Scientologists Warm Up for February 10". Radar Online. Radar Magazine. Retrieved 2008-02-04.
 32. Carlos Moncada (2008-02-12). "Organizers Tout Scientology Protest, Plan Another". TBO.com. Retrieved 2008-02-13.
 33. Andrew Ramadge (2008-02-14). "Scientology protest surge crashes websites". News.com.au. News Limited. Archived from the original on 2008-02-15. Retrieved 2008-02-14.
 34. Harrison, James (The State News) (February 12, 2008). "Scientology protestors take action around world". Retrieved 2008-02-14. Cite has empty unknown parameter: |coauthors= (help)
 35. Andrew Ramadge (2008-03-17). "Second round of Anonymous v Scientology". News.com.au. News Limited. Archived from the original on 2008-03-19. Retrieved 2008-03-17.
 36. Davies, Shaun (March 20, 2008). "Scientology strikes back in information war". National Nine News. ninemsn. Archived from the original on 2012-07-13. Retrieved 2008-03-20.
 37. Andrew Ramadge (2008-03-20). "Scientology site gets a facelift after protests". News.com.au. News Limited. Archived from the original on 2008-03-20. Retrieved 2008-03-20.
 38. Staff (October 17, 2008). "Teenage hacker admits Scientology cyber-attack". Agence France-Presse. Archived from the original on 2008-10-21. Retrieved 2008-10-18.
 39. Thomas P. O'Brien, US attorney, Central District California. "New Jersey Man Admits Scientology Web Hack". US Department of Justice.CS1 maint: multiple names: authors list (link)
 40. http://www.youtube.com/watch?v=ggamDYxtGYI
 41. http://www.anoncontest.org/
 42. Courtney Hazlett (2008-12-15). "Group bungles protest at 'Valkyrie' premiere". msnbc.com. Retrieved 2008-12-16.
 43. 43.0 43.1 Andrew Ramadge (2008-04-01). "Anonymous attack targets epilepsy sufferers". News.com.au. News Corporation. Archived from the original on 2008-04-02. Retrieved 2008-04-01.
 44. 44.0 44.1 44.2 Kevin Poulsen (2008-03-28). "Hackers Assault Epilepsy Patients via Computer". Wired News. Condé Nast Publications. Retrieved 2008-04-01.
 45. Eric Montana (2012-01-11). "Hackers Attack Epilepsy Forum; Cause Headaches, Seizures". Gaming Planet. Gaming Planet. Retrieved 2017-01-12. External link in |work= (help)
 46. 46.0 46.1 Steve Ragan (2008-03-31). "Targeted physical attack takes aim at Epilepsy". The Tech Herald. Retrieved 2008-04-02.
 47. 47.0 47.1 Scientology vs Anonymous, Critics take it to the web. CNN. Event occurs at 0:50-1:38. Retrieved 2008-06-27.
 48. Reid, Shaheem (2008-06-30). "Hip-Hop Sites Hacked By Apparent Hate Group; SOHH, AllHipHop Temporarily Suspend Access". MTV.com. MTV Networks. Retrieved 2008-07-18.
 49. Chideya, Farai (2008-06-30). "Hip Hop Sites Attacked by Hate Groups". News & Notes. NPR. Retrieved 2008-07-19.రేడియో ప్రసారం
 50. Rogers, John (2009-01-15). "Teenage founder of No Cussing Club under siege". Ventura County Star, The Associated Press. Retrieved 2009-01-21. (...) a group calling itself Anonymous launched a viral No Cussing Sucks campaign across the Web.
 51. Potter, Ned (2009-01-16). "'No-Cussing' Club Attracts Followers -- and Thousands of Hate Messages". ABC News. Retrieved 2009-01-21.
 52. 52.0 52.1 Cheng, Jacqui (2009-05-20). "4chan, eBaum's World carpet bombing YouTube with porn videos" (in English). Ars Technica. Retrieved 2009-06-02. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 53. 53.0 53.1 యూట్యూబ్‌ను ముంచెత్తిన అశ్లీల వీడియోలు. సియోభాన్‌ కోర్ట్‌నీ. 2009 మే 21 నాటి బీబీసీ న్యూస్‌. 14 మే 2007లో తిరిగి పొందబడింది
 54. Asher Moses (February 10, 2010). "Operation Titstorm: hackers bring down government websites". The Age.
 55. "Media Release – Attacks on government websites must be condemned". Stop Internet Censorship group. February 10, 2010. Cite journal requires |journal= (help)
 56. John Leyden (February 11, 2010). "Aussie anti-censor attacks strafe gov websites: Operation Titstorm DDoS more of a bee sting". The Register.
 57. Phil Shuman (investigative reporter) (2007-07-26). "FOX 11 Investigates: 'Anonymous'". MyFOX Los Angeles. KTTV (Fox). Retrieved 2007-08-11. External link in |work= (help)
 58. Ryan Singel (2007-07-27). "Investigative Report Reveals Hackers Terrorize the Internet for LULZ". Wired News. CondéNet, Inc. Retrieved 2008-02-23. Cite has empty unknown parameter: |coauthors= (help)
 59. Bryan Seymour (reporter) (2008-02-11). "Anonymous takes Scientology war to streets" (newscast). Today Tonight. Seven Network. Retrieved 2008-02-20.
 60. 60.0 60.1 Jonathan Jenkins (2007-12-07). "Man trolled the web for girls: cops". CANOE. Toronto Sun. Retrieved 2008-02-19.
 61. Constable George Schuurman, Public Information, for Detective Constable Janelle Blackadar, Sex Crimes Unit (2007-12-06). "Man facing six charges in Child Exploitation investigation, Photograph released, Chris Forcand, 53". News Release. Toronto Police Service. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link)
 62. Gus Kim (reporter) (2007-12-08). "Internet Justice?". Global News. CanWest Global Communications. |access-date= requires |url= (help)
 63. ఇరాన్‌పై ఇంటర్నెట్‌ అండర్‌గ్రౌండ్‌ దాడి
 64. Iranian Support Site http://iran.whyweprotest.net
 65. http://www.youtube.com/watch?v=CEe7qhlFNs4
 66. Turner, Adam (2009-07-13). "Conroy named Internet Villain of the Year". The Sydney Morning Herald.
 67. "Rudd website attacked in filter protest". ABC News. 2009-09-10. Retrieved 2009-09-10.
 68. See:
 69. Neighbour, Sally (2010-03-17). "Terror moves into the digital age". The Australian. p. A Plus section, p. 13. Retrieved 2010-05-08.
 70. Gifford, Nick; Raghu, Arun (May/June 2010). "Cyberterrorism: Are we there yet?". Security Solutions (65). pp. 64–66, 68, 70, 72, 74. Check date values in: |date= (help)

బాహ్య లింకులు

న్యాయ శాఖ. అజ్ఞాత సమూహం సభ్యుని అరెస్టు. పత్రికా ప్రకటన

Central District of California. line feed character in |publisher= at position 32 (help)

మీడియా షిఫ్ట్‌ ఐడియా ల్యాబ్‌ (పీబీఎస్)
ఆడియో/వీడియో మీడియా

మూస:Anonymous and the Internet మూస:Scientology versus the Internet