అటవీ నిర్మూలన

From tewiki
Jump to navigation Jump to search
దక్షిణ మెక్సికోలో వ్యవసాయం కోసం బూడిద చేసిన అడవి.
అరణ్య ప్రాంతాల్లో మానవ సంచారం, వనరుల సేకరణ పెరగడం వలన జీవవైవిద్యానికి మరిన్ని ముప్పులు ఏర్పడతాయి, అందువలన అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో రోడ్ల నిర్మాణం పెరగడం మరియు అటవీ నిర్మూలన ఆందోళన కలిగిస్తోంది.

సహజసిద్ధంగా ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం మరియు/లేదా కాల్చివేయడాన్ని అటవీ నిర్మూలన అంటారు.

అటవీ నిర్మూలన జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి: చెట్లు లేదా వాటి నుంచి తీసే బొగ్గును మానవులు ఉపయోగించే ఒక సరుకుగా విక్రయించవచ్చు, చెట్లను నరికిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని పచ్చిక బయలు, పంట భూములు, మానవ నివాసాలకు ఉపయోగించుకోవచ్చు. తగిన మోతాదులో మళ్లీ చెట్ల పెంపకం లేకుండా అడవులను నిర్మూలించడంతో సహజావరణం దెబ్బతినడంతోపాటు, జీవవైవిద్యానికి నష్టం జరుగుతుంది మరియు శుష్కత (నిర్జల ప్రదేశం, ఎడారి) ఏర్పడుతుంది. ఇది వాతావరణ బొగ్గుపులుసు వాయువు యొక్క బయోసీక్వెస్ట్రేషన్‌పై ప్రతికూల ప్రభావాలు ఏర్పరుస్తుంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవడంతోపాటు, తరచుగా ఇటువంటి ప్రదేశాలు బంజరుభూమిగా రూపాంతరం చెందుతాయి.

అడవుల అంతర్గత విలువను పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం, అటవీ నిర్వహణపై జాగ్రత్తలేకపోవడం మరియు సమర్థవంతంగాలేని పర్యావరణ చట్టాలు, తదితరాలు భారీస్థాయిలో అటవీ నిర్మూలన జరగడానికి కొన్ని కారకాలుగా ఉన్నాయి. అనేక దేశాల్లో, అటవీ నిర్మూలన ప్రస్తుతం తీవ్ర సమస్యగా మారింది, పరాసత్వం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఎడారీకరణ మరియు స్వదేశీ పౌరుల వలసలకు ఇది కారణమవుతుంది.

ఇదిలా ఉంటే, కనీసం US$4,600 తలసరి GDP కలిగివున్న దేశాల్లో, సగటు అటవీ నిర్మూలన రేటు పెరగడం ఆగిపోయింది.[1][2]

అటవీ నిర్మూలన

సహజసిద్ధముగా ఉన్న అడవులను తొలగించి ఆ ప్రాంతమును ఇతర ప్రయోజనాలకు వాడటాన్ని “ అటవీ నిర్మూలన ” అంటారు . అడవులను వ్యవసాయభూములుగా, పచ్చిక మైదానములుగా, పట్టణ ప్రాంతములుగా మార్చుట వంటివి అటవీ నిర్మూలనకు కొన్ని ఉదాహరణలు . 2011 సంవత్సరము నాటికి ప్రపంచములోని సగానికి పైగా అటవీ ప్రాంతము తొలగించబడినది . వాటిలో ఎక్కువ శాతం గత 50 సంవత్సరములలో తొలగించబడినవే ఉన్నాయి . ప్రపంచములోని సగానికి పైగా వృక్షములు మరియూ జంతువులు అడవులనే తమ జీవనాధారముగా కలిగి ఉంటాయి . ఈ విధంగా అడవులను నిర్మూలిస్తుంటే వాటి పైన ఆధారపడిన జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది .

చెట్లును నరికివేసి వాటి నుంచి వచ్చే కలపను ఇంధనముగా వాడటం, అడవులను నిర్మూలించి వాటిని పశువుల యొక్క పచ్చిక బయళ్ళుగా వాడటము మరియూ పెరుగుతున్న ప్రపంచ జనాభా యొక్క అవసరాలను తీర్చటానికి మరియూ జన నివాసములుగా వాడటము అటవీ నిర్మూలనకు పలు కారణములు . ఇటువంటి కార్యముల వలన జీవుల యొక్క మనుగడకు, జీవ వైవిధ్యమునకు మరియూ శుష్కత వంటి వాటికి తీవ్ర నష్టము వాటిల్లుతుంది . యుద్ధ సమయములలో కూడా తమ యొక్క శత్రువులు పొంచి ఉండుటకు వీలుగా ఉన్న అడవులను తొలగిస్తారు . వియట్నం యుద్ధములో అమెరికా దళాలు ఉపయోగించిన " ఏజెంట్ ఆరెంజ్ " విధానము ఈ పధ్ధతికి ఉదాహరణ . అటవీ నిర్మూలన వలన జీవులు అంతరించి పోవుట, వాతావరణ పరిస్థితులలో మార్పులు రావటం, భూమి యొక్క సారత్వము లోపించుట వంటి అవంచాకరమైన ప్రమాదములను ఎదుర్కోవలసి వస్తుంది . గణాంకముల ఆధారముగా, సగటు స్థూల దేశీయ ఉత్పత్తి 4600 డాలర్ల కన్నా ఎక్కువ వున్న దేశములలో అటవీ నిర్మూలన పెరిగినట్టుగా చూపించుచున్నాయి.

కారణములు :

UNFCCC ( యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్త్లెమేట్ చేంజ్ ) ప్రకారo అటవీ నిర్మూలకు గల ప్రధాన కారణము వ్యవసాయము . అటవీ నిర్మూలనకు గల కారణములలో జీవనాధారము కొరకు చేయు వ్యవసాయము కోసం జరుగుతున్నా నిర్మూలన యొక్క భాగము 48 శాతము మరియూ వ్యాపార నిమ్మితము చేయు వ్యవసాయము 32 శాతము ఆక్రమించినవి . కలప కోసం జరిగే నిర్మూలన 14 శాతము వరకు ఉంటుందని నిర్ధారించబడినది, మరియూ నిత్య జీవనములో ఉపయోగించే చెక్క కొరకు 5 శాతము అటవీ నిర్మూలన జరుగుతుందని అంచనా . పేద ప్రజలు తమ జీవనోపాధి కొరకు అడవులను నిర్మూలించి వాటి నుంచి వచ్చే ఉత్పత్తు పై ఆధారపడతారు . 2000 సంవత్సరములో అమెరికాకు చెందిన “ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్” ( ఎఫ్ . ఏ . ఓ ) అను సంస్థ, అడవులను నరికి వేయట వలన జనాభా పెరుగుదల భారం మరియూ ఆర్థిక, సమాజిక, సాంకేతిక, విజ్ఞాన రంగాలలో అవాంఛిత మార్పులు చోటు చేసుకుంటాయని ప్రకటించినది .

అడవులను సంరక్షించుట కన్నా వాటిని నిర్మూలించి, వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల పై ఆధారపడటం లాభాదాయకముగా ఉండటము కూడా అటవీ బద్రతకు ముప్పుగా తయారైంది . అమెరికా వంటి అగ్రదేశములు, తమ దేశములో ఉన్న అడవులను తొలగించుట వలనే అభివృద్ధిని సాధించాయన్న అపోహ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంది . పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయ అవసరాలు మరియూ పాడి పశువుల ఆహార అవసరములు, 1990 లలో ఎక్కువ శాతం అడవులు తొలగించబడటానికి కారణములు .

మానవజన్య అటవీ నిర్మూలనకు కారణాలు

అటవీ నిర్మూలనకు అనేక మూల కారణాలు ఉన్నాయి, అవి ప్రభుత్వ సంస్థల అవినీతి,[3][4] అధికారం మరియు సంపద యొక్క అసమాన పంపిణీ,[5] జనాభా పెరుగుదల[6] అధిక జనాభా,[7][8] మరియు పట్టణీకరణ ఇందులో ముఖ్యమైనవి.[9] ప్రపంచీకరణను కూడా తరచుగా అటవీ నిర్మూలనకు మరో మూల కారణంగా పరిగణిస్తున్నారు,[10][11] అయితే ప్రపంచీకరణ ప్రభావాలు (కార్మికులు, మూలధనం, సరుకులు మరియు భావాలకు సంబంధించిన కొత్త విధానాలు) స్థానిక అటవీ పెంపకాన్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.[12]

"ఒక స్థానిక వ్యవస్థలో జనాభా చలనాల పాత్ర నిర్ణయాత్మకం నుంచి స్వల్పస్థాయి వరకు ఉంటుందని" మరియు "అటవీ నిర్మూలన జనాభా ఒత్తిడి, నిశ్చేష్టమైన ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక పరిస్థితుల వంటి వివిధ అంశాల కలయిక ద్వారా జరుగుతుందని" 2000లో ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) గుర్తించింది.[6]

బ్రిటీష్ పర్యావరణ శాస్త్రవేత్త నార్మన్ మేయర్స్ ప్రకారం, 5% అటవీ నిర్మూలన పశువుల మేతకు ఉద్దేశించిన పంటల పెంపకం ద్వారా, 19% భారీస్థాయిలో కలప కోసం చెట్లను నరకడం ద్వారా, 22% పామ్ ఆయిల్ చెట్లు పెంపకం కోసం, 54% అటవీ నిర్మూలన బొగ్గు తయారీకి ఉద్దేశించిన ప్రక్రియల ద్వారా జరుగుతుంది.[13]

అటవీ పర్యావరణ వ్యవస్థలు క్షీణించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా కారణమవుతున్నాయని గుర్తించబడింది, ఇవి అటవీ పరిరక్షణ కంటే చెట్లు నరికిన ప్రదేశాల్లో అడవులను పెంచడం లాబాధాయకంగా కనిపించేటట్లు చేశాయి.[14] అనేక ముఖ్యమైన అటవీ వ్యవస్థలకు ఎటువంటి విఫణులు లేవు, అందువలన అడవుల యజమానులకు లేదా స్వప్రయోజనం కోసం అడవులపై ఆధారపడే మానవ వర్గాలకు అప్పటికప్పుడు కనిపించే ఆర్థిక విలువ కూడా ఏమీ ఉండదు.[14] అభివృద్ధి చెందుతున్న దేశాల కోణం నుంచి చూస్తే, బొగ్గుపులుసు వాయువు గ్రాహకాలుగా లేదా జీవవైవిద్య వనరులుగా అడవులు అందించే ప్రయోజనాలు మొదట ధనిక అభివృద్ధి చెందిన దేశాలకు వెళతాయి, ఈ సేవలకు పరిహారం తగినస్థాయిలో లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి కొన్ని అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు శతాబ్దాల క్రితమే వాటి యొక్క అడవులను నరికివేశాయి, ఈ అటవీ నిర్మూలన ద్వారా అవి బాగా లబ్ధి పొందాయని, అంతేకాకుండా ఈ ప్రయోజనాలను పొందకుండా తమను అడ్డుకోవడం సముచితం కాదని అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్నాయి: ధనిక దేశాలు సృష్టించిన ఈ సమస్యకు, పరిరక్షణ భారాన్ని పేద దేశాలు భరించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.[15]

పారిశ్రామిక అవసరాల కోసం చెట్లు నిర్మూలించబడటం ప్రపంచ అటవీ నిర్మూలనకు ప్రధాన కారణమనే వాదనతో నిపుణులు విభేదిస్తున్నారు.[16][17] అదేవిధంగా, అటవీ నిర్మూలనలో పేదరికం కీలకమనే దానిపై కూడా ఏకాభిప్రాయం లేదు. ప్రత్యామ్నాయాలు ఏమీ లేని కారణంగా పేద ప్రజలు సాధారణంగా అడవులను నరికివేస్తుంటారని కొందరు వాదిస్తున్నారు, చెట్లను నిర్మూలించేందుకు అవసరమైన వస్తువులు లేదా కార్మికులను సమకూర్చే శక్తి పేదలకు ఉండదని ఇతరుల వాదనలు ఉన్నాయి.[16] జనాభా పెరుగుదల కూడా అటవీ నిర్మూలనకు కారణమైందనే అభిప్రాయాలు కూడా వివాదాస్పదమయ్యాయి;[16] అధిక సంతాన రేట్ల కారణంగా జనాభా పెరుగుదల 8% సందర్భాల్లో మాత్రమే ఉష్టమండల ప్రాంతాల్లో అటవీ నిర్మూలనకు ప్రధాన కారణంగా ఉందని ఒక అధ్యయనం గుర్తించింది.[18]

పర్యావరణ సమస్యలు

వాతావరణం

అటవీ నిర్మూలన వలన వాతావరణములో మరియూ భౌగోళిక పరిస్థితులలో తీవ్ర మార్పులు సంభవించుచున్నయి . “ గ్లోబల్ వార్మింగ్ ” మరియూ “ గ్రీన్ హౌస్ “ ప్రభావములకు ముఖ్య కారణముగా పరిగణించవచ్చు . “ గ్రీన్ హౌస్ “ వాయువుల ఉత్పత్తిలో 20 శాతము వరకు ఉష్ణ మండలలో కల అడవులను నిర్మూలించటం వలన జరుగుతుంది . “ ఇంటర్ – గవర్ణమెంటల్ పేనెల్ ఒన్ క్లైమేటిక్ చేంజ్ “ అను సంస్థ ప్రకారం, ఉష్ణమండల ప్రాంతములలో ఉన్న అడవులను తొలగించటము వలన వాతావరణములో ఉన్న బొగ్గుపులుసు వాయువు యొక్క శాతము మూడవ వంతు పెరిగినట్టు .

అడవులు “కిరణజన్య సంయోగక్రియ “ అను విధానము ద్వారా వాతావరణములో ఉన్న బొగ్గుపులుసు వాయువును గ్రహించి తిరిగి ప్రాణవాయువును విడిచెదవు . అడవులను నరికి వేయుట వలన వాతావరణములో బొగ్గుపులుసు వాయువు తొలగించబడదు . ఇలా ఉన్న ఆ వాయువు భూమి చుట్టూ ఒక పొరను ఏర్పరిచి, సూర్యుని నుంచి వచ్చే రేడియోధార్మికతను బయటకి పోనీయకుండా, వాతావరణము లోనే పట్టివేసి ఉంచుతుంది . ఈ రేడియోధార్మికత ఉష్ణముగా మారి భూమియందలి ఉష్ణోగ్రతను పెంచుతుంది . ఈ విధానమును “ గ్రీన్ హౌస్ “ ప్రభావము అంటారు . శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఉష్ణమండల అడవులను తొలగించటము వలన ఏటా 1500 కోట్ల టన్నుల కార్బన్ విడుదల అవుతుంది . చెట్లు గాలిలో ఉన్న విష వాయువులను మరియూ బొగ్గుపులుసు వాయువును గ్రహించి, భౌగోళిక పరిస్థితులలో సమతుల్యతను కాపాడటములో విశేష పాత్ర పోషించుచున్నవి . అటవీ నిర్మూలన కొనసాగుతుండటం వలన వాతావరణం మరియు భూగోళం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.[19][20][21][22]

ప్రపంచ పర్యావరణ మార్పుకు అటవీ నిర్మూలన కూడా ప్రధాన కారణం,[23][24] అంతేకాకుండా హరితగృహ ప్రభావం విస్తరించబడటానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. 20% ప్రపంచ హరితగృహ వాయు ఉద్గారాలకు ఉష్ణమండల ప్రాంతాల్లో అటవీ నిర్మూలన కారణమవుతున్నట్లు గుర్తించబడింది.[25] వాతావరణ మార్పులపై అంతర్‌ప్రభుత్వ కమిటీ ప్రకారం అటవీ నిర్మూలన, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, మొత్తం మానవజన్య బొగ్గుపులుసు వాయువు ఉద్గారాల్లో 1/3 వంతు పరిమాణానికి బాధ్యత వహిస్తుంది.[26] చెట్లు మరియు ఇతర మొక్కలు వాటి సాధారణ శ్వాసప్రక్రియలో భాగంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్‌ను (బొగ్గుపులుసు వాయువు లేదా కార్పన్‌ డైఆక్సైడ్ రూపంలో) తొలగించి ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చెట్టు లేదా అడవి క్రియాశీలకంగా పెరుగుతున్నప్పుడే వార్షిక లేదా దీర్ఘకాల ప్రాతిపదికన అవి కార్బన్‌ను తొలగించగలవు. చెట్ల క్షయం జరగడం లేదా వాటిని కాల్చడం వలన అది నిల్వచేసుకున్న కార్బన్‌లో ఎక్కువ భాగం తిరిగి వాతావరణంలో కలుస్తుంది. అడవులు కార్బన్‌ను గ్రహించేలా చేయడానికి, కలపను పెంచడం మరియు వాటిని దీర్ఘకాల-మన్నిక గల ఉత్పత్తులుగా తయారు చేయడం మరియు చెట్లను తిరిగి నాటడం చేయాలి.[27] భూమిలో నిక్షిప్తమైన కార్బన్ వాతావరణంలోకి విడుదల కావడానికి కూడా అటవీ నిర్మూలన కారణమవుతుంది. అడవులు అనేవి కార్బన్ నిల్వలుగా ఉంటాయి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా అవి కార్బన్ నిల్వలుగా లేదా వనరులుగా మారతాయి. ప్రౌఢ అడవులు బొగ్గుపులుసు వాయువు యొక్క నికర నిల్వలు మరియు నికర వనరులు మధ్య ప్రత్యామ్నాయ పాత్ర పోషించగలవు (కార్బన్ డైయాక్సైడ్ సింక్ మరియు కార్బన్ సైకిల్‌ను చూడండి).

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉష్ణమండల అటవీ నిర్మూలన మరియు అటవీ క్షయం (REDD) నుంచి ఉద్గారాలను తగ్గించడం ప్రస్తుత వాతావరణ విధానాల్లో సంపూర్ణాంశంగా మారింది. అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణత నుంచి హరితగృహ వాయువు (GHG) ఉద్గారాలను తగ్గించినందుకు ఆర్థిక పరిహారాలు అందజేయడం ఈ ఆలోచనలో భాగంగా ఉంది".[28]

భారీ వర్షపాతం నమోదయ్యే అటవీ ప్రాంతాలు ప్రపంచ ఆక్సిజన్ పరిమాణంలో ఎక్కువ భాగాన్ని సృష్టిస్తున్నాయని లేమాన్ పేర్కొన్నాడు,[29] అయితే సంవత్సరంలో ఎక్కువ భాగం వర్షాలు కురిసే అటవీ ప్రాంతాలు వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణాన్ని తక్కువ స్థాయిలోనే పెంచుతున్నాయని మరియు అటవీ నిర్మూలన వాతావరణ ఆక్సిజన్ (ప్రాణవాయువు) స్థాయిలపై ఎటువంటి ప్రభావం చూపించదని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.[30][31] ఇదిలా ఉంటే, భూమి కోసం అడవుల్లోని చెట్లను భస్మీకరణం చేయడం మరియు కాల్చివేయడం ద్వారా టన్నులకొద్ది CO2 వాతావరణంలోకి విడుదలవుతుంది, ఇది భూతాపానికి కారణమవుతుంది.[24]

అడవులు గాలిలోని బొగ్గుపులుసు వాయువు మరియు ఇతర కాలుష్య కారకాలను గ్రహించగలవు, దీని ద్వారా అవి భూఆవరణ స్థిరత్వాన్ని కాపాడుతున్నాయి.[citation needed]

జలావరణం

ఉష్ణమండలములో ఉన్న వర్షారణ్యాల వలన ప్రపంచములోని 30 శాతము మంచినీరు లభిస్తుంది . అడవులను నిర్మూలించటము వలన జలావరణమునకు కూడా నష్టం వాటిల్లుతుంది . చెట్లు తమ వేర్ల ద్వారా భూమిలోపల ఉండు నీటిని గ్రహించి దానిని తిరిగి వాతావరణము లోనికి ప్రవేశింపచేస్తుంది . అడవులను నిర్మూలించటము వలన భూగర్భ జలాలు ఇంకిపోవటమే కాక వాతావరణములో ఉన్న తేమ శాతము తగ్గిపోతుంది . భూగర్భజలాలు ఇంకిపోవటము వలన భూమి తన నీటిని గ్రహించే శక్తిని కోల్పోతుంది . అంతేకాక నేల వికోషీకరణం, భూమి సంయోగము వంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది . ఉత్తర, వాయువ్య చైనాలో తొలగించబడిన అడవుల కారణము గా, 1950 – 1980 లలో సగటు వార్షిక అవపాతము మూడవ వంతు పడిపోయిందని గణాంకములు తెలుపుచున్నవి .

నేల :

సహజ సిద్ధముగా ఉన్న అడవులలో కల చెట్లు వరదల సమయములలో నేల పై భాగములో ఉండు మట్టి కొట్టుకుపోకుండా పట్టి వేసివుంచును . ఇలా చేయటము వలన నేల వికోషీకరణమునకు గురికాకుండా చెట్లు కాపాడతాయి . అటవీ నిర్మూలన వలన భూమి తీవ్ర వికోషీకరణమునకు గురియై తన యొక్క సారగుణమును కోల్పోతుంది . పైగా మట్టిలో నివసించే ప్రాణులు తుడిచిపెట్టుకు పోవటానికి కారణముగా కూడా చూడవచ్చును . అటవీ నిర్మూలన వలన జల చక్రం కూడా ప్రభావితమవుతుంది. చెట్లు వాటి యొక్క వేర్ల ద్వారా భూగర్భజలాలను గ్రహించి, వాతావరణంలోకి విడిచిపెడతాయి. అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం మరియు భూగర్భజలాల పరిమాణం కూడా తగ్గిపోతుంది.[32] అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన క్రమక్షయం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.[33][34] కొన్ని ప్రదేశాల్లో అడవులు జలాశయాలకు తిరిగి నీరు చేరే అవకాశాలను విస్తరిస్తాయి, అయితే అనేక ప్రదేశాల్లో జలాశయాల క్షీణతకు అడవులు ప్రధాన కారణమవుతున్నాయి.[35]

అడవులు కుచించుకుపోవడం వలన సంభవించే అవక్షేపణాన్ని నిరోధించే నేల యొక్క సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అవక్షేపణం కోరల్లో చిక్కుకున్న ప్రాంతంలో భూగర్భ జల వ్యవస్థలు నాశనమవుతాయి, అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతంలో క్రమంగా ఉపరితల జలాలు పూర్తిగా ఖాళీ అవుతాయి, ఉపఉపరితల ప్రవాహాల కంటే ఇవి బాగా వేగంగా క్షీణిస్తాయి. ఉపరితలంపై నీరు వేగంగా రవాణా అయ్యేందుకు అవకాశం ఏర్పడటం వలన అకస్మాత్తుగా వరదలు ముంచెత్తుతాయి, అడవులు ఉన్నప్పటి కంటే లేనప్పుడు వరదలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అటవీ నిర్మూలన వలన శ్వేదన ప్రక్రియ (చెట్ల ద్వారా, భూమి నుంచి నీరు ఆవిరి రూపంలో గాలిలో కలిసే ప్రక్రియ) కూడా క్షీణిస్తుంది, దీని వలన వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం తగ్గిపోతుంది, ఇది కొన్ని సందర్భాల్లో అవపాతన స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఒక ప్రాథమిక అధ్యయనం ప్రకారం, ఉత్తర, వాయువ్య చైనాలో అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతంలో 1950వ దశకం మరియు 1980వ దశకం మధ్యకాలంలో సగటు వార్షిక అవపాతనం మూడింట ఒక వంతు మేర క్షీణించింది.[citation needed]

సాధారణంగా చెట్లు మరియు మొక్కలు జల చక్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి:

దీని ఫలితంగా, చెట్లు ఉండటం లేదా లేకపోవడం ద్వారా భూఉపరితలంపై, మట్టి లేదా భూగర్భం లేదా వాతావరణంలో నీటి పరిమాణం ప్రభావితమవుతుంది. మరో విధంగా క్రమక్షయం రేట్లను మారుస్తుంది మరియు వాతావరణవ్యవస్థ పక్రియలు లేదా మానవ సేవలకు నీటి లభ్యతను కూడా చెట్లు ప్రభావితం చేస్తాయి.

భారీ వర్షం కురిసిన సందర్భంలో వరదలపై అడవులు అతికొద్ది ప్రభావం చూపుతాయి, భూములు సంతృప్తీకరణ స్థాయిలో లేదా దానికి దగ్గరగా ఉంటే అటవీ భూభాగం యొక్క నిల్వ సామర్థ్యం భారీ వర్షపాతాన్ని నిలువరించలేదు.

భూమిపై 30 శాతం స్వచ్ఛమైన నీటిని ఉష్ణమండలాల్లోని సతత హరితారణ్యాలు సృష్టిస్తున్నాయి.[29]

మట్టి

రియో డి జనైరో నగరంలో మట్టి కోసం అటవీ నిర్మూలన - బ్రెజిల్.మొర్రో డా కోవాంకా యొక్క చిత్రం - జాకేర్‌పాగువా.

దట్టమైన అటవీ ప్రాంతంలో మట్టి నష్టం రేట్లు చాలా తక్కువగా ఉంటాయి, ఇటువంటి ప్రదేశంలో ఒక చదరపు కిలోమీటరుకు సుమారు 2 మెట్రిక్ టన్నుల నష్టం మాత్రమే జరుగుతుంది (ఒక చదరపు మైలుకు 6 టన్నులు).[citation needed] సాధారణంగా అటవీ నిర్మూలన క్రమక్రమంగా మట్టి కోత పరిమాణాన్ని పెంచుతుంది, క్షయం పెరిగేకొద్ది, చెట్ల వ్యర్థాలు మట్టికి కల్పిస్తున్న రక్షణ తగ్గుతుంది. ఎక్కువగా స్రవించే ఉష్టమండల సతత హరితారణ్యాల భూముల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. రోడ్ల నిర్మాణం మరియు యంత్ర పరికరాలు ఉపయోగించడం వంటి అటవీ కార్యకలాపాలు కూడా కోతను పెంచుతాయి.

చైనా యొక్క లోయెస్ పీఠభూమిపై అటవీ ప్రాంతం వెయ్యేళ్ల క్రితమే నిర్మూలించబడింది. దీని తరువాత నుంచి ఈ ప్రాంతంలో భూమి కోతకు గురై నాటకీయంగా లోతైన లోయలు ఏర్పడ్డాయి, యెల్లో నదిలో పెద్దఎత్తున అవక్షేపం (మడ్డి) వచ్చి చేరేందుకు ఇది కారణవుతుంది, ఈ మడ్డి కారణంగానే నదిలోని నీరు పసుపు పచ్చని రంగులో కనిపిస్తుంది, అంతేకాకుండా మడ్డి కారణంగా నది దిగువ ప్రాంతాల్లో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి (అందువలనే ఈ నదికి 'చైనా దుఃఖదాయిని' అనే పేరు వచ్చింది).

చెట్లను తొలగించడం ఎల్లప్పుడూ భూమి కోత పరిమాణాన్ని పెంచదు. US నైరుతీ భాగంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో, పొదలు మరియు మొక్కలు గడ్డి భూములను ఆక్రమిస్తున్నాయి. చెట్ల ప్రస్తారాల మధ్య గడ్డి నాశనమయ్యేందుకు చెట్లు కారణమవుతున్నాయి. దీని వలన దట్టమైన అంతరప్రస్తార ప్రాంతాలు బాగా కోతకు గురవుతున్నాయి. US అటవీ శాఖ, ఉదాహరణకు బాండెలియర్ నేషనల్ మాన్యుమెంట్, చెట్లను నిర్మూలించడం ద్వారా పాత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, చెట్లను కోతను తగ్గించడం ఎలా అనే దానిపై అధ్యయనం చేస్తుంది.

చెట్ల వేర్లు మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయి, అయితే మట్టి బాగా లోతుగాలేని సందర్భంలో, అవి కిందనున్న రాతిపొరను పట్టుకొని మధ్యలో మట్టిని నిలిపేందుకు ప్రయత్నిస్తాయి. వాలుగా ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మట్టి పొర పరిమాణం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం బాగా పెరుగుతుంది, దీని ద్వారా ఇటువంటి ప్రదేశాల్లో ఉంటున్న ప్రజలకు ఏ క్షణంలోనైనా ప్రాణహాని జరగవచ్చు. అయితే ఎక్కువ అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో మోడులు మాత్రమే నరికివేస్తారు, చెట్ల వేర్లు తొలగించరు, అందువలన కొండచరియలు విరిగిపడేందుకు అటవీ నిర్మూలన కారణమనే వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

జీవవైవిధ్యము :

అడవులు జంతువులకు సహజ నివాసములుగా వున్నాయి .మనిషి తన అవసరములకు అడవులను ఇష్టం వచ్చినట్టు తొలగించటం వలన గడిచిన రెండు దశాబ్దములలో అనేక జీవులు అంతరించిపోయాయి . చెట్లు నరకటo వలన జీవ వైవిధ్యమునకు తీవ్ర నష్టము వాటిల్లుతుంది . దీని వలన పలు విధముల జీవజాతులు అంతరించిపోయాయి .వర్షారణ్యాల నిర్మూలన వలన రోజుకు 137 రకముల జంతు, వృక్ష మరియు కీటక జాతులను అంతరించిపోతున్నాయని అంచనా . అనగా ఏడాదికి 50000 జాతులు అంతరించిపోతున్నాయి . ఈ విధముగా కొనసాగితే 21 వ శతాబ్ధాము కల్ల 40 శాతము జంతు మరియు వృక్ష జాతులు అంతరించిపోవునని అంచనా .

పర్యావరణం

అటవీ నిర్మూలన జీవవైవిద్యం క్షీణించేందుకు కారణమవుతుంది.[37] అటవీ ప్రాంతాలను నిర్మూలించడం లేదా నాశనం చేయడం ద్వారా జీవవైవిద్యం తగ్గిపోవడంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది.[38] అడవులు జీవవైవిద్యానికి అండగా ఉంటాయి, వన్యప్రాణులకు నివాసాన్ని అందజేస్తున్నాయి;[39] అంతేకాకుండా అడవులు ఔషధ మొక్కల పరిరక్షణను ప్రోత్సహిస్తాయి.[40] కొత్త ఔషధాలకు (ఉదాహరణకు టాక్సోల్) తిరుగులేని వనరుగా ఉంటూ అడవులు వాటికి ఉనికిపట్టుగా ఉంటున్నాయి, అడవుల నిర్మూలన ఎప్పటికీ తిరిగి సంపాదించలేని జన్యుసంబంధమైన వైవిద్యాలను నాశనం చేస్తుంది (ఉదాహరణకు పంట నిరోధక శక్తి).[41]

భూమిపై ఉష్ణమండల సతత హరితారణ్యాలు బాగా వైవిద్యభరిత పర్యావరణ వ్యవస్థలుగా గుర్తింపు పొందాయి,[42][43] ప్రపంచానికి తెలిసిన 80% జీవవైవిద్యం ఉష్ణమండల సతత హరితారణ్యాల్లోనే గుర్తించబడింది,[44][45] గణనీయమైన అటవీ ప్రాంతాలను నిర్మూలించడం లేదా నాశనం చేయడం ద్వారా జీవవైవిద్యం క్షీణించి[46] పర్యావరణ అసమతౌల్యం ఏర్పడుతుంది.[47]

జీవవైవిద్యంపై అటవీ నిర్మూలన యొక్క కచ్చితమైన ప్రభావాన్ని అంచనా వేయడం నిర్మూలన ప్రక్రియ యొక్క శాస్త్రీయ అవగాహన ద్వారా సాధ్యపడటం లేదు.[48] జీవివైవిద్యం నష్టానికి సంబంధించిన అనేక అటవీ అంచనాలు ఎక్కువగా జాతుల-ప్రధాన నమూనాలపై ఆధారపడి ఉన్నాయి, అడవులు నిర్మూలించబడుతుంటే, అదే విధంగా జీవ జాతుల వైవిద్యం కూడా క్షీణిస్తుందని అంచనాలు పేర్కొంటున్నాయి.[49] అయితే, ఇటువంటి అనేక నమూనాలు అవాస్తవాలుగా నిరూపించబడ్డాయి, సహజావరణం కోల్పోవడం పెద్దఎత్తున జీవ జాతుల నష్టానికి కారణం కాకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి.[49] జాతుల-ప్రధాన నమూనాల్లో వాస్తవ అటవీ నిర్మూలన జరుగుతున్న ప్రదేశాల్లో ముప్పు ఎదుర్కొంటున్న జీవజాతులు పరిమాణం ఎక్కువగా చూపించబడినట్లు తేలింది, విస్తృతంగా వ్యాపించివున్న ముప్పు ఎదుర్కొంటున్న జాతుల సంఖ్య కూడా ఎక్కువగా చూపించినట్లు తెలుస్తోంది.[50]

సతత హరితారణ్యాల్లో చెట్లను నరకడం వలన ప్రతి రోజూ మనం 137 వృక్ష, జంతు మరియు క్రిమి జాతులను కోల్పోతున్నట్లు అంచనా వేయబడింది, అంటే ఏడాదికి భూమిపై 50,000 జీవజాతులు అంతరించిపోతాయని అంచనా వేశారు.[51] సతత హరితారణ్యాలు నిర్మూలించబడటం వలన ప్రస్తుతం కొనసాగుతున్న అర్వాచీన జీవజాతుల విలుప్తతకు ఆజ్యం పోస్తుందని ఇతరులు వాదిస్తున్నారు.[52][53] అటవీ నిర్మూలన కారణంగా తెలిసిన విలుప్తత పరిమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి, క్షీరదాలు మరియు పక్షి జాతుల్లో సుమారు ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే అంతరించిపోతుంది, అయితే అన్ని జాతులను పరిగణలోకి తీసుకుంటే ఏడాదికి 23,000 జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. 21వ శతాబ్దంలో ఆగ్నేయాసియాలోని 40% జంతు మరియు వృక్ష జాతులు అంతరించిపోతాయని అంచనాలు వెలువడ్డాయి.[54] ఆగ్నేయాసియాలోని ప్రాంతాల్లో ఎక్కువ భాగం అటవీ ప్రాంతాలు ఏకరీతి చెట్ల పెంపకానికి ఉద్దేశించిన (పంట) భూములుగా మార్చబడ్డాయి, దీని వలన అతికొద్ది జాతులు మాత్రమే ప్రమాదంలో పడ్డాయి, ఇక్కడ వృక్ష జాతులు ఇప్పటికీ విస్తృతంగా మరియు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించిన 1995నాటి సమాచారం పైవాదనలతో విభేదించింది.[50]

ఆర్థిక ప్రభావం

అడవులు మరియు ఇతర సహజసిద్ధమైన వనరులకు నష్టం కలిగించడం ప్రపంచంలోని పేదల యొక్క జీవన ప్రమాణాలను సగానికి తగ్గిస్తుంది, అంతేకాకుండా 2050నాటికి అంతర్జాతీయ GDPని ఇటువంటి నష్టాలు 7% మేర తగ్గిస్తాయి, బోన్‌లో జరిగిన కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్శిటీ (CBD) సమావేశంలో ఒక ప్రధాన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.[55] చారిత్రాత్మకంగా నీరు మరియు పంట భూముల కంటే కలప మరియు వంటచెరకు వంటి అటవీ ఉత్పత్తులను ఉపయోగించుకోవడం మానవ సమాజాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ రోజు కూడా, అభివృద్ధి చెందిన దేశాలు గృహాల నిర్మాణానికి కలపను ఉపయోగించడం మరియు కాగితం తయారీకి కలప గుజ్జు ఉపయోగించడం కొనసాగిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా 3 బిలియన్ల మంది పౌరులు వేడి కోసం మరియు వంటకు కలపపై ఆధారపడుతున్నారు.[56]

అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలో అటవీ ఉత్పత్తుల పరిశ్రమ పెద్ద భాగంగా ఉంది. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం లేదా కలప ఉత్పత్తుల తయారీని పెంచడం ద్వారా స్వల్ప-కాలిక ఆదాయార్జనలు సాధించవచ్చు, అయితే ఈ పరిస్థితి దీర్ఘ-కాలిక ఆదాయం మరియు దీర్ఘకాలిక జీవసంబంధ ఉత్పాదన నష్టాలకు దారితీస్తుంది (ప్రకృతిసిద్ధమైన సేవలు క్షీణిస్తాయి). పశ్చిమ ఆఫ్రికా, మడగాస్కర్, ఆగ్నేయాసియా మరియు అనేక ఇతర ప్రాంతాలు కలప సాగు క్షీణించడం వలన ఆదాయం అడుగంటిన పరిస్థితిని చవిచూశాయి. ప్రతి ఏటా అక్రమ అటవీ నిర్మూలన వలన జాతీయ ఆర్థిక వ్యవస్థలకు బిలియన్లకొద్ది డాలర్ల నష్టం వాటిల్లుతుంది.[57]

కలపను కావాల్సిన పరిమాణంలో పొందేందుకు ఉద్దేశించిన కొత్త పద్ధతులు ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం కలిగిస్తున్నాయి మరియు కలప కోసం చెట్లను నరికివేస్తున్న వ్యక్తులకు దీని ద్వారా వస్తున్న డబ్బు వ్యామోహం సృష్టిస్తుంది.[58] ఒక అధ్యయనం ప్రకారం, "అధ్యయనం జరిపిన అనేక ప్రాంతాల్లో, అటవీ నిర్మూలనను ప్రోత్సహించిన వివిధ కార్యక్రమాలు అవి విడుదల చేసిన ప్రతి టన్ను కార్బన్‌కు US$5 కంటే ఎక్కువ ఆదాయాన్ని చాలా అరుదుగా సృష్టించాయి మరియు తరుచుగా US$1 కంటే చాలా తక్కువ ఆదాయాన్ని తిరిగి ఇచ్చాయి". యూరోపియన్ విఫణిలో ఒక టన్ను కార్బన్‌ను తగ్గించేందుకు ఉద్దేశించిన ఒక మొక్క ధర 23 యూరోలు (సుమారు US$35) ఉంది.[59]

ఆర్ధిక రంగము పై ప్రభావము :

పర్యావరణానికి జరుగుతున్న నష్టము ఇదే విధముగా కొనసాగితే 2050 సంవత్సరాని కల్లా పేద ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి సగానికి పడిపోతుందని మరియూ అంతర్జాతీయ జి.డి.పి 7 శాతము తగ్గుతుందని సి.బి.డి ( కన్వెంషన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ) అను సంస్థ అంచనా వేసెను . అడవులనుంచి వచ్చే ఉత్పత్తులపై ఆధారపడుట పూర్వ కాలం నుంచి వస్తున్న అలవాటు .చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితులకు అడవులు చాలా ముఖ్యమైన ఆధారము . స్వల్ప కాల లాభాల కోసం వాటిని నాశనం చేయటం వలన వాటివల్ల రావాల్సిన దీర్ఘకాలిక లాభాలు కోల్పోయి ఆర్థిక పరిస్థితి తీవ్రముగా దెబ్బతింటుంది . వేగముగా అభివృద్ధి చెందుతున్న దేశాల వలన కూడా పర్యావరణముపై ప్రభావము వుంటుంది . పెరుగుతున్న జనాభాతో పాటు వారి అవసరములను తీర్చుటకు కావల్సిన వనరులను సమకూర్చుటకు అడవులపైనే ఆధారపడవలసి వస్తుంది . అవే కాక ప్రజలకు నివాసముల కోసం మరియూ రహదారుల వంటి వాటికి కూడా చెట్లను నిర్మూలించాల్సి వస్తుంది . అమేజాన్ అడవులలో జరిగిన నిర్మూలనలలో 90 శాతము వరకు రహదారులకు 100 కిలోమీటర్ ల పరిధిలో జరిగినది . ప్రపంచవ్యాప్తముగా అడవుల నిర్మూలన 1852వ సంవత్సరము నుంచి వేగమైనది .

చారిత్రక కారణాలు

చరిత్రకు ముందు

నాగరికత ప్రారంభమవడానికి ముందు కొన్ని వేల సంవత్సరాలపాటు మానవ సమాజాలు అతికొద్ది స్థాయిలో అటవీ నిర్మూలనకు కారణమయ్యాయి.[60] అటవీ నిర్మూలనకు సంబంధించిన తొలి సాక్ష్యం మధ్య రాతియుగ కాలంలో కనిపిస్తుంది.[61] బహుశా దట్టమైన అటవీ ప్రాంతాలను లేడి, దుప్పి, అడవి పంది వంటి వేట జంతువులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థలను తయారు చేసేందుకు ఇది జరిగివుండవచ్చని భావిస్తున్నారు.[60] వ్యవసాయం కనిపెట్టడంతో, ఎక్కువ ప్రాంతాల్లో అటవీ నిర్మూలన జరిగింది, పంటల కోసం భూమిని సేకరించేందుకు నిప్పు ప్రధాన సాధనమైంది. దీనిని సమర్థించేందుకు యూరప్‌లో 7000 BC ముందు కాలానికి చెందిన ఒక బలమైన ఆధారం లభించింది. మధ్యరాతి యుగానికి చెందిన ఆదిమ మానవులు (ఆహారం కోసం వేటపై ఆధారపడేవారు) ఎర్ర జింక మరియు అడవి పందులను వేటాడేందుకు వాటికి మైదానాలు సృష్టించేందుకు నిప్పును ఉపయోగించారు. గ్రేట్ బ్రిటన్‌లో బాగా నీడనిచ్చే ఓక్ మరియు యాష్ వంటి చెట్ల స్థానంలో హాజెల్ అనే అడవి చెట్లు, కోరింద కంప, గడ్డిజాతులు మరియు దురదగొండి వంటి పుప్పొడి జాతులు ఏర్పడ్డాయి. అడవులు తొలగించడం వలన పత్రశ్వేదనం తగ్గిపోయింది, దీని ద్వారా ఎత్తైన కుళ్లిన బురదనేలలు ఏర్పడ్డాయి. 8400-8300 BC మరియు 7200-7000 BC మధ్యకాలంలో ఐరోపావ్యాప్తంగా రంపపు ఆకుల చెట్టు పుప్పొడి విస్తృత స్థాయిలో క్షీణించింది, దక్షిణ ఐరోపాలో ప్రారంభమైన ఈ క్షీణత క్రమంగా ఉత్తర ప్రాంతంవైపు, అక్కడి నుంచి గ్రేట్ బ్రిటన్‌కు వ్యాపించింది, కొత్త రాతియుగంలో వ్యవసాయం ప్రారంభమైన కాలంలో అడవులను మంటలతో బూడిద చేయడం కూడా ఈ కాలంలోనే జరిగినట్లు తెలుస్తోంది.

కొత్త రాతియుగానికి చెందిన కళాకృతుల అమరిక, కంకణాలు, గొడ్డలి తలభాగాలు, చీరణాలు (ఉలులు) మరియు సానపెట్టే సాధనాలను ఇందులో చూడవచ్చు.

కొత్త రాతియుగ కాలంలో వ్యవసాయ భూమి కోసం పెద్దఎత్తున అటవీ నిర్మూలన జరిగింది.[62][63] బ్రిటన్ మరియు ఉత్తర అమెరికా దేశాల్లో 3000 BC ప్రాంతంలో చెకుముకిరాయి నుంచి మాత్రమే కాకుండా, వివిధ రకాల కఠిన శిలల నుంచి కూడా రాతి గొడ్డళ్లు తయారు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లేక్ డిస్ట్రిక్ట్‌లో గుర్తించబడిన లాంగ్‌డేల్ యాక్స్ ఇండస్ట్రీ కూడా ఈ పరిధిలోకి వస్తుంది, గొడ్డళ్ల తయారీ కోసం ఉత్తర వేల్స్‌లోని పెన్మెన్మార్ మరియు అనేక ఇతర ప్రాంతాల్లో రాతి గనులు త్రవ్వబడ్డాయి. రాతి గనులకు సమీపంలోనే గొడ్డళ్లకు ప్రాథమిక నమూనాను చెక్కేవారు, కొన్నింటికి మెరుగైన రూపు ఇచ్చేందుకు స్థానికంగానే సానబట్టేవారు. ఈ చర్య గొడ్డలి యొక్క యాంత్రిక బలాన్ని పెంచడంతోపాటు, కలపలోకి సులభంగా ప్రవేశించడానికి ఉపయోగపడింది. గ్రిమ్స్ గ్రేవ్స్ వంటి వనరుల నుంచి మరియు ఐరోపావ్యాప్తంగా అనేక ఇతర గనుల నుంచి సేకరించిన చెకుముకి రాయిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

మినోవన్ క్రిటీలో అటవీ నిర్మూలనకు సంబంధించిన ఆధారం గుర్తించబడింది; కాంస్య యుగంలో నోసోస్ రాజమందిరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవులను తీవ్రస్థాయిలో నాశనం చేయబడ్డాయనేందుకు ఇది ఉదాహరణగా నిలిచింది.[64]

పారిశ్రామిక చరిత్రకు ముందు

చరిత్రలో ఎక్కువ భాగం, మానవులు ఆహారం కోసం వేటపై ఆధారపడే వారు, వీరి ఆహార వేట అడవుల్లోనే సాగేది. అమెజాన్, ఉష్ణమండలాలు, మధ్య అమెరికా, కరేబియన్ దీవులు వంటి అనేక ప్రాంతాల్లో,[65] కలప మరియు ఇతర అటవీ ఉత్పత్తుల కొరత ఏర్పడిన తరువాత అటవీ వనరుల పరిరక్షణకు వాటిని మోతాదుకు మించకుండా ఉపయోగించాలనే విధానాలు అమలు చేయబడ్డాయి.

పురాతన గ్రీసులో, జీరెడ్ వాన్ ఆండెల్ మరియు సహ-రచయితలు[66] చారిత్రక క్షయం మరియు అవక్షేపాన్ని మూడు ప్రాంతీయ అధ్యయనాల్లో సంగ్రహించారు, దొరికిన ఆధారం ప్రకారం, కొత్త రాతియుగం చివరి భాగం నుంచి ప్రారంభ కాంస్య యుగం మధ్యలో గ్రీసులోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రవేశపెట్టబడిన తరువాత 500-1,000 సంవత్సరాలకు ప్రధాన భూక్షయ దశ ప్రారంభమైందని ఈ అధ్యయనాల్లో వారు గుర్తించారు. తొలి సహస్రాబ్ది BCE మధ్యకాలం తరువాత వేలాది సంవత్సరాలపాటు అనేక ప్రాంతాల్లో తీవ్రంగా, అడపాదడపా భూమి కోతకు గురవడం చోటుచేసుకుంది. చరిత్రలో క్రీస్తుపూర్వ కాలానికి చెందిన చివరి శతాబ్దాల్లో ఆసియా మినార్ (ఉదాహరణకు క్లారస్ మరియు ఎఫెసస్, ప్రియన్ మరియు మిలెటస్, ఈ నౌకాశ్రయాలు నదుల ఒండుమట్టి పేరుకుపోవడం వలన వదిలివేయబడ్డాయి) దక్షిణ తీరం మరియు సిరియా తీరంలోని రేవుపట్టణాలు ఒండుమట్టితో పూడిపోయాయి.

ఈస్టర్ ఐల్యాండ్ ఇటీవలి శతాబ్దాల్లో భారీస్థాయిలో భూమి కోతను ఎదుర్కొంటుంది, దీనికి వ్యవసాయం మరియు అటవీ నిర్మూలన ప్రధాన కారణమైంది.[67] పురాతన ఈస్టర్ ఐల్యాండ్ వాసులు పతనం అవడం గురించి జారేద్ డైమండ్ తన యొక్క కొలాప్స్ పుస్తకంలో విస్తృతంగా ప్రస్తావించాడు. ఐల్యాండ్ చెట్లు కనిపించకుండా పోవడం 17వ మరియు 18వ శతాబ్దంలో దాని యొక్క నాగరికత పతనం రెండూ ఏకకాలంలో జరిగినట్లు కనిపిస్తుంది.[68][69]

యాంట్‌వెర్ప్‌ మరియు బ్రూగ్స్ రేవుపట్టణానికి మధ్య నౌకా వాణిజ్యం నిలిచిపోవడానికి కూడా పూడిక ప్రధాన కారణమవడం ప్రాధాన్యత సంతరించుకుంది, ఎగువ నది పరివాహ ప్రాంతాల్లో స్థిరనివాసాలు పెరిగిపోవడం (అటవీ నిర్మూలన ద్వారా) ఇందుకు కారణంగా తెలుస్తుంది. ప్రారంభ మధ్యయుగ కాలంలో ఎగువ ప్రావీన్స్‌లోని రియెజ్‌లో రెండు చిన్న నదుల్లో ఒండుమట్టి పూడిక చేరడంతో నదుల్లో మేట పెరిగిపోయి, వరదప్రదేశాలు వ్యాపించాయి, ఇది క్రమంగా రోమన్ స్థిరనివాసాలను ఒండుమట్టితో పూడ్చివేసింది మరియు తరువాతి కాలంలో వారు మేటవేసిన ప్రాంతాలపై కొత్త నిర్మాణాలు ప్రారంభించారు; అదే సమయంలో రియెజ్ ఎగువన నది జన్మస్థానాలుగా ఉన్న లోయలు పశువులు మేపుకునే ప్రదేశాలుగా రూపాంతరం చెందాయి.[citation needed]

వివిధ పరిశ్రమలకు కలపను అందించే (ఉదాహరణకు, నిర్మాణ రంగం, నౌకానిర్మాణం, కుమ్మరి పని) అటవీ ప్రాంతంలో తరచుగా నగరాలు నిర్మించబడటాన్ని ప్రగతి వల అని పిలుస్తారు. తిరిగి మొక్కలు నాటకుండా అటవీ నిర్మూలన జరిగినప్పుడు, స్థానిక కలప సరఫరాలు కొంతకాలానికి మందగిస్తాయి, అవసరాలకు కలప సేకరణ పూర్తిగా కష్టమైనప్పుడు నగరాలు మూతబడ్డాయి, పురాతన ఆసియా మినార్‌లో పదేపదే ఇటువంటి సంఘటనలు జరిగాయి. గనుల త్రవ్వకం మరియు లోహ సంగ్రహణం రెండు పరిశ్రమలు తరచుగా స్వీయ-నాశన మార్గంలోనే వెళ్లాయి.[citation needed]

ఇదిలా ఉంటే ఎక్కువ సంఖ్యలో జనాభా వ్యవసాయ రంగంపై నేరుగా ఆధారపడి (లేదా పరోక్షంగా ఆధారపడి) నివసిస్తున్నారు, అందువలన అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కోసం, పశువుల మేత కోసం అటవీ నిర్మూలన జరిగింది; వ్యవసాయం ద్వారా అదృష్టవశాత్తూ ఎక్కువ భాగం అడవులు (మరియు పాక్షికంగా ఉపయోగించుకోబడ్డాయి ఉదాహరణకు వంటచెరుకు సేకరణకు, కలప మరియు పళ్లు, లేదా పందుల పెంపకానికి) సంరక్షించబడ్డాయి మరియు సంఘ పెద్దలు (ఉన్నత వర్గాల పెద్దలు మరియు భూస్వాములు) వేటకు ప్రత్యేకార్హతలు కలిగివుండటం వలన కూడా గణనీయమైన అటవీ ప్రాంతం రక్షించబడింది.[citation needed]

మత నిష్టాపరులు ఆధీనంలో (ముఖ్యంగా బెనడిక్టైన్ మరియు వాణిజ్య ఆదేశాలు) జనాభా విస్తరించిన ప్రధాన ప్రాంతాలు (మరియు ఈ విధంగా మరింత స్థిరమైన వృద్ధి) పాలించబడేవి మరియు కొంత మంది భూస్వాములు (జమీందారులు) మెరుగైన న్యాయ మరియు ఆర్థిక నిబంధనలు అందజేయడం ద్వారా రైతులను ఆకర్షించి (మరియు వారిని పన్నుచెల్లింపుదారులుగా మార్చారు) స్థిరనివాసాలు ఏర్పరుచుకునే విధంగా ప్రోత్సహించారు - నగరాలు ఆవిష్కరణ లేదా వాటిని ప్రోత్సహించే సమయంలో ఎల్లప్పుడూ రైతు వర్గాన్ని కూడా పరిగణలోకి తీసుకునేవారు. బ్లాక్ డెత్ (మహమ్మారి వ్యాధులు సోకి మరణించడం) లేదా యుద్ధాల్లో మృతి చెందడం (ఉదాహరణకు తూర్పు మరియు మధ్య ఐరోపాలోని జెంగీస్ ఖాన్ యొక్క మంగోల్ తండాలు, జర్మనీలో ముప్పై ఏళ్ల యుద్ధంలో పాల్గొన్నాయి) వంటి కారణాలతో ఒక ప్రదేశ జనాభాకు తీవ్ర నష్టం జరిగినప్పుడు సంబంధిత ప్రాంతాల్లో స్థిరనివాసాలు విసర్జించబడ్డాయి, ఇటువంటి పరిస్థితుల్లో భూమి తిరిగి ప్రకృతి ఆధీనంలోకి వెళ్లిపోతుంది, అయితే ఇక్కడ పెరిగే ద్వితీయశ్రేణి అడవులు ముందున్న జీవవైవిద్యాన్ని కలిగివుండవు.

1100 నుంచి 1500 AD వరకు పశ్చిమ యూరప్ ప్రాంతంలో గణనీయమైన స్థాయిలో అటవీ నిర్మూలన జరిగింది, మానవ జనాభా విస్తరించడం దీనికి ప్రధాన కారణం. 15వ శతాబ్దం నుంచి కొంత భాగాల అన్వేషణ, కాలనీల ఏర్పాటు, బానిస వాణిజ్యం కోసం ఐరోపా (తీరప్రాంత) నౌకల యజమానులు పెద్దఎత్తున కలపతో నౌకలు తయారు చేయడం ప్రారంభించారు - సముద్రమార్గం గుండా ఇతర వ్యాపారాలకు మరియు (తరచుగా) నావికా దళ యుద్ధానికి (స్పానిష్ ఆర్మెడా 1559లో ఇంగ్లండ్‌ను ఆక్రమించేందుకు చేసిన విఫలయత్నం మరియు 1571లో లెపాంటో యుద్ధం సందర్భంగా పెద్దఎత్తున కలప వృధా చేయబడింది) మరియు స్పెయిన్‌లో మాదిరిగా విస్తారమైన కలప ప్రాంతాలు పంట భూములుగా మార్చివేయబడటంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి, కొలంబస్ అమెరికాను కనుగొనడంతో కాలనీల కార్యకలాపాలు (కొల్లగొట్టడం, గనుల త్రవ్వకం, పశు పెంపకం, మొక్కల పెంపకం, వాణిజ్యం, తదితరాలు) ప్రాచుర్యం పొందాయి, దీనిని ఆ సమయంలో సముద్ర చౌర్యంగా పరిగణించేవారు.

అటవీ ప్రాంతం మొదట నిర్మూలించబడిన సమయం నుంచి వరదల ఉధృతి పెరిగిందని సూచించే 17వ శతాబ్దానికి చెందిన న్యూ ఇంగ్లండ్ ఇంగ్లీష్‌మెన్స్ రిపోర్ట్‌లను సేకరించి విలియం క్రోనాన్ చేంజెస్ ఇన్ ది ల్యాండ్ (1983)ను రూపొందించాడు, మరియు వరదలు పెరిగిపోవడం విస్తృత స్థాయిలో అడవులు నిర్మూలించబడటం వలనే జరిగిందనే భావనలు వ్యాప్తి చెందాయి.

ప్రారంభ ఆధునిక ఐరోపా ఖండంలో పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గును భారీగా ఉపయోగించడం వలన పశ్చిమ ప్రాంత అడవుల్లో చెట్లు నరకడం ఊపందుకుంది; స్టువర్ట్ ఇంగ్లండ్‌లో కూడా ప్రాచీనమైన బొగ్గు ఉత్పత్తి పతాకస్థాయికి చేరుకుంది. నౌకా నిర్మాణానికి అవసరమైన కలప దుంగల కోసం, స్టువర్ట్ ఇంగ్లండ్ ప్రాంతంలో పెద్దఎత్తున అటవీ ప్రాంతం నిర్మూలించబడింది, ఈ ప్రాంతం బాల్టిక్ సముద్రంపై జరిగే వాణిజ్యంపై ఆధారపడివుంది, అవసరాలు తీరేందుకు న్యూ ఇంగ్లండ్‌లో అప్పటివరకు ఉపయోగించబడని అడవులపై దృష్టి పడింది; ట్రాఫాల్గార్‌లోని నెల్సన్ యొక్క రాయల్ నేవీ యుద్ధనౌకల్లో (1805) ఒక్కోదాని నిర్మాణానికి సుమారు 6000 పెద్ద ఓక్ చెట్లు అవసరమయ్యేవి. భవిష్యత్‌లో ఫ్రెంచ్ నేవీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్రాన్స్‌లో కోల్బెర్ట్ ఓక్ చెట్లను నాటించాడు; పందొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో ఈ ఓక్ చెట్లు బాగా పెద్దవయ్యే సమయానికి, నౌక స్తంభాల అవసరం లేకుండా పోయింది.

మధ్యయుగ కాలంలో జరిగిన అటవీ నిర్మూలన ప్రభావం ప్రారంభ ఆధునిక ఐరోపాకు సమానంగా వర్తిస్తాయని నార్మన్ F. కాంటర్ యొక్క సంగ్రహంలో పేర్కొనబడింది:[70]

Europeans had lived in the midst of vast forests throughout the earlier medieval centuries. After 1250 they became so skilled at deforestation that by 1500 they were running short of wood for heating and cooking. They were faced with a nutritional decline because of the elimination of the generous supply of wild game that had inhabited the now-disappearing forests, which throughout medieval times had provided the staple of their carnivorous high-protein diet. By 1500 Europe was on the edge of a fuel and nutritional disaster [from] which it was saved in the sixteenth century only by the burning of soft coal and the cultivation of potatoes and maize.

20వ శతాబ్దంలో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోటాపోటీగా అటవీ నిర్మూలన కనిపించింది.

అటవీ నిర్మూలన రేట్లు

తీర్పు బొలీవియా ప్రాంతంలో చేపట్టిన టీరాస్ బజాస్ ప్రాజెక్టులో మానవ అటవీ నిర్మూలన పురోగతి యొక్క కక్ష్యా చిత్రం

సుమారుగా 1852 ప్రాంతంలో అంతర్జాతీయ అటవీ నిర్మూలన బాగా పెరిగింది.[71][72] భూమిపై ఉన్న ప్రౌఢ ఉష్ణమండల అరణ్యాల్లో సుమారు సగ భాగం- భూమిపై 1947 వరకు ఉన్న 15 మిలియన్ల నుంచి 16 మిలియన్ల km2 (5.8 మిలియన్ల నుంచి 6.2 మిలియన్ల చదరపు మీటర్ల వరకు) మొత్తం అటవీ ప్రాంతంలో[73] 7.5 మిలియన్లు మరియు 8 మిలియన్ km2 మధ్య (2.9 మిలియన్ల నుంచి 3 మిలియన్ చదరపు మీటర్లు) అటవీ భాగం- నిర్మూలించబడింది.[74][75] ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన చర్యలు తీసుకోకుంటే (పురాతన అరణ్య ప్రాంతాలకు ఎటువంటి నష్టం జరగకుండా, వాటిని పరిరక్షించే చర్యలు చేపట్టడం)[73] 2030నాటికి పది శాతం క్షీణ దశకు చేరుకున్న అడవులతో[71][74] మరో పది శాతం మాత్రమే అరణ్య భాగం మిగిలివుంటుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.[71] 80% అటవీ భాగం నష్టపోవడంతోపాటు, తిరిగి పొందలేని వేలాది జీవజాతులను కూడా కోల్పోవడం జరుగుతుందని వాదించారు.[71]

సతత హరితారణ్యాల నిర్మూలన రేట్లలో విస్తృత వైవిద్యభరిత అంచనాలు కనిపించాయి, మిగిలిన చోట్ల అటవీ నిర్మూలన రేట్లు అంచనా వేయడంలో పెద్దగా క్లిష్టతలు ఎదురుకాలేదు. 1960 మరియు 1990 మధ్యకాలంలో ప్రపంచంలోని మొత్తం ఉష్ణమండల సతత హరితారణ్యాల్లో ఐదింట ఒక వంతు భాగం నాశనం చేయబడ్డాయని కొన్ని పర్యావరణ సంస్థలు వాదిస్తున్నాయి, ప్రపంచ భూభాగంలో 50 ఏళ్ల క్రితం సతత హరితారణ్యాలు 14% భూభాగంలో విస్తరించివున్నాయి, అవి ఇప్పుడు 6% శాతానికి క్షీణించాయి,[51] మరియు 2090నాటికి అన్ని సతత హరితారణ్యాలు కనుమరుగవతాయని అంచనాలు వెలువడ్డాయి.[51] ఇదిలా ఉంటే, లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన అలెన్ గ్రైంజెర్ మాత్రం సతత హరితారణ్య ప్రాంతంలో దీర్ఘ-కాలిక క్షీణత కనిపిస్తుందనేందుకు విశ్వసనీయ ఆధారం ఏదీ లేదని వాదించాడు.[76] వివాదాస్పద పుస్తకం ది స్కెప్టికల్ ఎన్విరాన్‌మెంటలిస్ట్ రచయిత జోర్న్ లాంబోర్గ్, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి ప్రపంచ అటవీ భాగం యొక్క పరిమాణం ఇప్పటికీ స్థిరంగా ఉందని పేర్కొన్నాడు.[77][78] ఇదిలా ఉంటే సతత హరితారణ్యాల్లో ప్రతి ఏటా ఒక ఎకరం భూమి అటవీ నిర్మూలనకు, బదులుగా ఉష్ణ మండలాల్లో 50 ఎకరాల భూమిలో కొత్త అడవులు పెరుగుతున్నాయని మరి కొందరు వాదించారు.[79]

ఉష్ణమండల అటవీ నిర్మూలన అంశంపై ఈ భిన్నాభిప్రాయాలు అనిశ్చితిని తీసుకొచ్చాయి. ఉష్ణమండలాల్లోని దేశాల్లో, అటవీ నిర్మూలన అంచనాలు చాలా అస్పష్టతను కలిగివున్నాయి మరియు వీటిలో +/- 50% దోషాలు కనిపిస్తుంటాయి,[80] 2002నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా జరిపిన విశ్లేషణ ప్రకారం ఆర్ద్ర ఉష్ణమండలాల్లో అటవీ నిర్మూలన రేటు సాధారణంగా పేర్కొనబడుతున్న రేట్ల కంటే సుమారు 23% తక్కువగా ఉందని (సుమారుగా ఏడాదికి 5.8 మిలియన్ హెక్టార్లు) సూచించింది.[81] దీనికి విరుద్ధంగా, ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారిత ఒక కొత్త అధ్యయనం అమెజాన్ సతత హరితారణ్యాల్లో అటవీ నిర్మూలన రేటు శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేసిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది.[82][83]

ఆర్థికేతర అటవీ విలువల పూడ్చలేని నష్టాన్ని తొలగించడంలో వైఫల్యం నిజమయితే[84] అటవీ నిర్మూలన ధోరణులు కుజ్నెట్స్ కర్వ్‌ను అనుసరించవచ్చని మరి కొందరు వాదించారు.[85][86]

ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) తన 2005నాటి నివేదికలో భూమిపై ఉన్న మొత్తం అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా 13 మిలియన్ హెక్టార్ల అడవులు క్షీణిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ అటవీ నిర్మూలన రేటు ఇటీవల కాలంలో నెమ్మదించిందని పేర్కొంది.[87][88] ఇప్పటికీ సతత హరితారణ్యాలు బాగా వేగంగా నాశనం చేయబడుతున్నాయని ఇతరులు వాదిస్తున్నారు.[89] "అతి కనిష్టంగా 10% చెట్లు కలిగివున్న ప్రాంతాలను కూడా అడవులుగా భావించే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని UN అంచనా రూపొందించబడిందని, దీని వలన సవన్నాల వంటి పర్యావరణ వ్యవస్థలు మరియు బాగా దెబ్బతిన్న అటవీ ప్రాంతాలు కూడా అడవులుగా పరిగణించబడుతున్నాయని" లండన్‌కు చెందిన రెయిన్‌ఫారెస్ట్ ఫౌండేషన్ పేర్కొంది.[90] అడవుల్లో రకాల మధ్య ఎటువంటి విభజన లేకుండా నివేదిక తయారు చేయబడింది,[91] మరియు సంబంధిత దేశాల అటవీ శాఖలు అందజేసిన సమాచారాన్ని ఇందులో పరిగణలోకి తీసుకున్నారు,[92] ప్రభుత్వాలు అందజేసే అధికారిక సమాచారాల్లో అడవుల్లోసాగే అక్రమ కలప రవాణా వంటి అనధికారిక కార్యకలాపాలు పరిగణలోకి తీసుకోబడవని FAO సమాచారంపై విమర్శలు వెల్లువెత్తాయి.[93]

అధ్యయనాలు, విశ్లేషణలపై అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ, సతత హరితారణ్యాలు నాశనం కావడాన్ని గణనీయమైన పర్యావరణ సమస్యగా పరిగణించడంపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. 1900వ సంవత్సరం నుంచి పశ్చిమ ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని 90% సతత హరితారణ్యాలు అటవీ నిర్మూలన కారణంగా కనుమరుగయ్యాయి.[94] దక్షిణ ఆసియాలో, 88% సతత హరితారణ్యాలు నిర్మూలించబడ్డాయి.[95] ప్రపంచంలో మిగిలివున్న సతత హరితారణ్యాల్లో ఎక్కువ భాగం అమెజాన్ పరివాహ ప్రాంతంలో ఉన్నాయి, అమెజాన్ సతత హరితారణ్యాలు సుమారు 4 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్నాయి.[96] 2000 మరియు 2005 మధ్యకాలంలో అధిక ఉష్ణమండల అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతాల్లో మధ్య అమెరికా, ఉష్ణమండల ఆసియా ప్రాంతాలు ఉన్నాయి — మధ్య అమెరికా ప్రాంతం ప్రతి ఏటా 1.3% అడవులను కోల్పోతుంది.[90] మధ్య అమెరికాలో 1950 నుంచి పల్లపుప్రాంత ఉష్ణమండల అడవుల్లో మూడింట రెండొంతుల భాగంలో పశువుల మేత పెంపకం కోసం అడవులను నరికివేశారు మరియు గత 40 ఏళ్లలో మొత్తం సతత హరితారణ్యాల్లో 40% కనుమరుగయ్యాయి.[97] బ్రెజిల్‌లోని మాటా అట్లాంటికా అరణ్య ప్రాంతం 90-95% మేర క్షీణించింది.[98] మడగాస్కర్ తూర్పు భాగంలోని సతత హరితారణ్యం 90% నిర్మూలించబడింది.[99][100] 2007 నుంచి హైతీ యొక్క మొత్తం అటవీ ప్రాంతంలో 1% కంటే తక్కువ ప్రాంతం మాత్రమే మిగిలివుంది.[101] మెక్సికో, భారతదేశం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మయన్మార్, మలేషియా, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, లావోస్, నైజీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, లిబేరియా, గునియా, ఘనా మరియు ఐవరీ కోస్ట్ దేశాలు భారీస్థాయిలో సతత హరితారణ్యాలను కోల్పోయాయి.[102][103] అనేక దేశాలు, ముఖ్యంగా బ్రెజిల్, వాటి యొక్క అటవీ నిర్మూలనను ఒక జాతీయ అత్యయిక పరిస్థితిగా ప్రకటించాయి.[104][105]

ప్రాంతాలవారీగా అటవీ నిర్మూలన

ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలన రేట్లలో వైవిద్యం కనిపిస్తుంది, ఆగ్నేయాసియా మరియు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో జరుగుతున్న అటవీ నిర్మూలన పర్యావరణ శాస్త్రజ్ఞులను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తుంది.

అటవీ నిర్మూలన నియంత్రణ

క్యోటో ఒప్పందం

అటవీ నిర్మూలనను నియంత్రించే కీలకాంశం క్యోటో ఒప్పందం నుంచి వస్తుంది. అటవీ నిర్మూలన మరియు అడవుల క్షీణత నుంచి ఉద్గారాలను తగ్గించే (REDD) వ్యవస్థలు, అటవీ నిర్మూలనను తప్పించేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనలు, భవిష్యత్ క్యోటో ఒప్పందంతో అమలు చేయబడతాయి.[106] ప్రస్తుతానికి, క్యోటో ఒప్పందం పరిధిలో నిర్వచించబడిన ఎటువంటి వశ్య వ్యవస్థల్లోనూ REDD అమలు చేయబడలేదు (క్లీన్ డెవెలప్‌మెంట్ మెకానిజమ్, జాయింట్ ఇంప్లిమెంటేషన్ మరియు ఎమిషన్స్ ట్రేడింగ్).

వ్యవసాయం

అధిక-దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ పంటలు, హరితగృహ, అటానమస్ బిల్డింగ్ గార్డెన్లు మరియు హైడ్రోఫోనిక్‌లు వంటి వ్యవసాయానికి సంబంధించిన కొత్త పద్ధతులు మరింత ముమ్మరంగా అభివృద్ధి చేయబడుతున్నాయి. అవసరమైన దిగుబడులను సాధించేందుకు ఈ పద్ధతులు తరచుగా రసాయన పదార్థాలపై ఆధారపడుతుంటాయి. చక్రీయ వ్యవసాయంలో, విరామంలో ఉన్న మరియు కొత్తగా బలం పుంజుకుంటున్న వ్యవసాయ భూమిలో పశువులను విడిచిపెడతారు. చక్రీయ వ్యవసాయం వాస్తవానికి మట్టిలో సారాన్ని పెంచుతుంది. అయితే ముమ్మర వ్యవసాయం పంట పెరుగుదలకు అవసరమైన ఖనిజలవణాలను బాగా గ్రహించి వేయడం ద్వారా మట్టిలో పోషకాలను తగ్గిస్తుంది.[citation needed]

అటవీ నిర్వహణ

సమాజాలు పతనం అవడానికి దారితీసే కొన్ని కారణాల్లో అటవీ నిర్మూలన వలన జరిగే పర్యావరణ నష్టం కూడా ఒకటని చాలా కాలం క్రితమే గుర్తించబడింది, ఈ కారణంగా అనేక శతాబ్దాల నుంచి అటవీ నిర్మూలనను నిలిపివేసే లేదా మందగింప జేసే చర్యలు తీసుకోబడ్డాయి. పారామౌంట్ పాలకులు టోంగాలో అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం వలన చేకూరే స్వల్ప-కాలిక లాభాలు మరియు అడవులు లేకపోవడం వలన దీర్ఘ-కాలంలో వచ్చే సమస్యల మధ్య వైరుధ్యాలను నిరోధించేందుకు విధానాలు అభివృద్ధి పరిచారు,[107] జపాన్‌లోని[108] టోకుగవా ప్రాంతంలో 17 మరియు 18వ శతాబ్దాల్లో షోగన్స్ రాబోయే శతాబ్దాల్లో అటవీ నిర్మూలనను నిలిపివేసేందుకు మరియు తిరిగి అడవులు పెంచేందుకు కలపను ఇతర ఉత్పత్తులను ప్రవేశపెట్టడం మరియు శతాబ్దాలుగా వ్యవసాయ భూములుగా మార్చబడిన ప్రదేశాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో కూడిన అత్యంత అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేశాడు. అటవీ నిర్మూలన సమస్యను ఎదుర్కొనేందుకు 16వ శతాబ్దంలో జర్మనీ భూస్వాములు సిల్వికల్చర్‌ను అభివృద్ధి చేశారు. అయితే, ఈ విధానాలు మంచి వర్షపాతం, పొడి వాతావరణం లేని పరిస్థితులు మరియు బాగా లేత నేలలు ఉన్న పర్యావరణాలకు ఈ విధానాలు పరిమితమయ్యాయి (వోల్కనిజం లేదా గ్లాసియేషన్ ద్వారా). పాత మరియు అతితక్కువ సారవంతమైన నేలల్లోని వృక్షాలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి కనుక సిల్వికల్చర్ లాభసాటిగా ఉండదు, అదే సమయంలో తీవ్ర వేడి వాతావరణం ఉండే ప్రదేశాల్లో అడవుల్లో అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉంది, అందువలన ఇటువంటి ప్రదేశాల్లో అడవుల పెంపకానికి ఎప్పుడూ ఈ ప్రమాదం పొంచివుటుంది.

వ్యవసాయ భూమి కోసం అడవుల్లోని చెట్లను "స్లాష్ అండ్ బర్న్" పద్ధతి ఆచరణలో ఉన్న ప్రాంతంలో "స్లాష్ అండ్ చార్" వంటి ప్రత్యామ్నాయాన్ని అమలు చేయడం ద్వారా వేగవంతమైన అటవీ నిర్మూలనను అడ్డుకోవచ్చు మరియు నేలల త్వరగా నిస్సారమవకుండా చూడవచ్చు. ఈ ప్రక్రియలో ఏర్పడిన జీవబొగ్గును తిరిగి నేలలో కలిసేటట్లు చేయడం అనేది ఒక శాశ్వితమైన కార్బన్ సీక్వెస్ట్రేషన్ పద్ధతి, అంతేకాకుండా ఇది నేలకు ఎంతో ప్రయోజనకర దిద్దుబాటుగా ఉపయోగపడుతుంది. జీవద్రవ్యంతో కలిసి ఇది టెర్రా ప్రెటా సృష్టిని తీసుకొస్తుంది, భూమిపై అత్యంత సారవంతమైన నేలల్లో ఇది కూడా ఒకటి, తనంతటతాను పునఃసృష్టి చేసుకునే నేల కూడా ఇదొక్కటే.

కృత్రిమ అటవీ నిర్వహణ పద్ధతుల ధ్రువీకరణ

కృత్రిమ నిర్వహణ అడవుల నుంచి లభించే కలపకు మార్కెట్ డిమాండ్‌ను సృష్టించడం ద్వారా అటవీ నిర్మూలనను అడ్డుకునే ఉద్దేశంతో PEFC మరియు FSC వంటి అంతర్జాతీయ ధ్రువీకరణ వ్యవస్థలు ధ్రువీకరణను అందజేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రకారం, "కృత్రిమ అటవీ నిర్వహణను స్వీకరించేందుకు ఒక ప్రధాన షరతు ఏమిటంటే ఇటువంటి అడవుల నుంచి ఉత్పత్తి అయిన ఉత్పత్తులకు గిరాకీ ఉండటం మరియు వీటికి అధిక ధరలు చెల్లించేందుకు వినియోగదారు అంగీకారం. కృత్రిమ అడవుల నిర్వహణను ప్రోత్సహించేందుకు నియంత్రణ పద్ధతులు నుంచి మార్కెట్ ప్రోత్సహకాలవైపు దృష్టి పెట్టేలా ధ్రువీకరణ ఉపయోగపడుతుంది. కృత్రిమంగా నిర్వహిస్తున్న అడవుల నుంచి సేకరించిన అటవీ ఉత్పత్తుల యొక్క సానుకూల ధర్మాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ యొక్క గిరాకీవైపు ధ్రువీకరణ దృష్టి పెడుతుంది."[109]

తిరిగి అడవులను పెంచడం

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల్లో, తిరిగి అడవుల పెంపకం మరియు అటవీకరణ (వ్యవసాయ భూములను తిరిగి అడవులుగా మార్చడం) వలన అటవీ ప్రాంతాలు పెరుగుతున్నాయి.[110] ప్రపంచంలో ఎక్కువగా అడవులు కలిగిన 50 దేశాలను పరిగణలోకి తీసుకుంటే వాటిలో 22 దేశాల్లో కలపచెట్లు ఉన్న ప్రదేశ పరిమాణం పెరిగింది. ఆసియా ఖండం 2000 మరియు 2005 మధ్యకాలంలో 1 మిలియన్ హెక్టార్‌ల అటవీ భూమిని తిరిగి సంపాదించింది. El సాల్వడార్‌లోని ఉష్ణమండల అరణ్యం 1992 మరియు 2001 మధ్యకాలంలో 20% పైగా విస్తరించింది. ఈ పరిణామాల ఆధారంగా, ఒక అధ్యయన నివేదిక అంతర్జాతీయ అటవీ భూభాగం 2050నాటికి 10% మేర—భారతదేశం భూభాగం పరిమాణంలో-పెరుగుతుందని అంచనాలు వెలువరించింది.[111]

భారీస్థాయిలో అటవీ భూములు నాశనమైన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో, కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు ఒక నిబంధనను ప్రవేశపెట్టాయి, దీని ప్రకారం దేశంలోని 11 నుంచి 60 ఏళ్లలోపు వయస్సున్న ప్రతి పౌరుడు ఏడాదికి మూడు మొక్కలు నాటాలని లేదా ఇదే స్థాయిలో ఇతర అటవీ సేవలకు సంబంధించిన పని చేయాలి. 1982నాటి నుంచి చైనాలో ప్రతి ఏటా 1 బిలియన్ చెట్లు నాటబడ్డాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మొక్కలు నాటాల్సిన అవసరం లేనప్పటికీ, మార్చి 12న మాత్రం ప్రతి ఏటా చైనాలో ప్లాంటింగ్ హాలిడేను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చైనా ప్రభుత్వం గ్రీన్ వాల్ ఆఫ్ చైనా ప్రాజెక్టును కూడా ప్రవేశపెట్టింది, మొక్కలు నాటడం ద్వారా గోబి ఎడారి విస్తరించకుండా అడ్డుకునే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టులో భాగంగా నాటబడిన మొక్కల్లో ఎక్కువ భాగం చనిపోతుండటంతో (75% పేగా), ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది.[citation needed] 1970వ దశకం నుంచి చైనాలో 47-మిలియన్-హెక్టార్ల అటవీ భూమి అభివృద్ధి చేయబడింది.[111] ఈ ప్రాంతంలో మొత్తం పెంచబడిన చెట్ల సంఖ్య 35 బిలియన్లుకాగా, చైనా భూభాగంలో అడవుల పరిమాణం 4.55% పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం చైనా అటవీ భూభాగం 12% ఉండగా, ఇప్పుడు అది 16.55%నికి పెరిగింది.[112]

ఏరియల్లీ డెలివరెడ్ రీ-ఫారెస్టేషను అండ్ ఎరోజన్ కంట్రోల్ సిస్టమ్ మరియు సముద్రజల హరితగృహతో జతకలిసిన ప్రతిపాదిత సహారా ఫారెస్ట్ ప్రాజెక్టు అనే ప్రతిష్ఠాత్మక ప్రతిపాదనలను చైనా పరిశీలిస్తోంది.

పశ్చిమ దేశాల్లో, కృత్రిమ పద్ధతిలో ఉత్పత్తి చేసిన, పెంచిన కలప ఉత్పత్తులకు వినియోగదారుల డిమాండ్ పెరగడం, అటవీ భూమి యజమానులు మరియు అటవీ పరిశ్రమలు వారి యొక్క అటవీ నిర్వహణ మరియు కలప పెంపక పద్ధతులకు బాధ్యత కలిగివుండేలా చేస్తుంది.

అర్బోర్ డే ఫౌండేషన్ యొక్క రెయిన్ ఫారెస్ట్ రిస్క్ ప్రోగ్రామ్ అటవీ నిర్మూలనను నిరోధించేందుకు సాయపడే స్వచ్ఛంద కార్యక్రమం. ఈ స్వచ్ఛంద సంస్థ కలప కంపెనీలు కొనుగోలు చేయడానికి ముందుగానే సతత హరితారణ్య ప్రాంతాలను కొనుగోలు చేసేందుకు మరియు వాటిని సంరక్షించేందుకు నిధులు విరాళంగా ఇస్తోంది. ఆ తరువాత అర్బోర్ డే ఫౌండేషన్ ఈ భూభాగంలో అటవీ నిర్మూలన జరగకుండా కాపాడుతుంది. పురాతన గిరిజన జాతులు నివసించే అటవీ ప్రాంతాలను కూడా ఈ సంస్థ పరిరక్షిస్తుంది. కమ్యూనిటీ ఫారెస్ట్రీ ఇంటర్నేషనల్, కూల్ ఎర్త్, ది నేచర్ కన్జర్వాన్సీ, వరల్డ్ వైట్ ఫండ్ ఫర్ నేచర్, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మరియు గ్రీన్‌పీస్ వంటి సంస్థలు కూడా అటవీ సహజావరణాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌పీస్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించింది [2] మరియు ఈ సమాచారాన్ని ఇంటర్నెట్‌లో ప్రచురించింది.[113] మానవ యుగానికి ముందు ఉన్న (8000 సంవత్సరాల క్రితం) అడవుల పరిమాణాన్ని మరియు ప్రస్తుత (క్షీణించిన) అటవీ ప్రాంతం పరిమాణాన్ని చూపించే సరళమైన భావాచిత్రాన్ని[114] హౌస్టఫ్‌వర్క్స్ తయారు చేసింది.[115] మానవుడు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు చేపట్టాల్సిన అటవీకరణ పరిమాణాన్ని ఈ చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తాయి.

అటవీ చెట్ల పెంపకం

ప్రపంచంలో కలప అవసరాలను తీర్చేందుకు, అడవులకు సంబంధించిన రచనలు చేసిన బోత్‌కిన్స్ మరియు సెడ్జో వంటి రచయితలు ఎక్కువ-ఫలితాలు ఉచ్చే అటవీ చెట్ల పెంపకం సరైన మార్గమని సూచించారు. చెట్ల పెంపకం ద్వారా ఏడాదికి ప్రతి హెక్టార్‌కు 10 ఘనపు మీటర్లు చొప్పున కలపను పొందవచ్చని, దీని ద్వారా ప్రపంచంలో మిగిలివున్న అటవీ భూభాగంలో 5% భాగంపై జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యానికి అవసరమైన మొత్తం కలపను సరఫరా చేయవచ్చని అంచనా వేశారు. దీనికి విరుద్ధంగా, సహజ అడవులు ప్రతి హెక్టార్‌కు 1-2 ఘనపు మీటర్ల కలపను ఉత్పత్తి చేస్తాయి; అందువలన గిరాకీని తీర్చేందుకు 5 నుంచి 10 రెట్లు ఎక్కువ అటవీ ప్రాంతాన్ని నాశనం చేయాల్సి ఉంటుంది. అడవుల నిర్వహణలో సుశిక్షితుడైన చాడ్ ఆలీవర్ అధిక-దిగుబడి అందించే అటవీ భూములతో ఉన్న ఒక అటవీ పొడతెగ పరిరక్షణ భూములతో కలిసిపోతాయని సూచించాడు.[116]

FAO సమాచారం యొక్క ఒక విశ్లేషణ అటవీకరణ మరియు తిరిగి అడవుల పెంపకానికి సంబంధించిన ప్రాజెక్టులు "30 ఏళ్లలో అంతర్జాతీయ అటవీ భూముల క్షీణతను తిరోగమింపచేయగలవని" సూచించింది.[117]

వాతావరణ మార్పుల కారణంగా మారుతున్న అవక్షేపణ నమూనాల నుంచి చెట్లు నాటడం ద్వారా తిరిగి అడవుల పెంపకం ప్రయోజనం పొందగలదు. ఎక్కడ అవక్షేపణం పెరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉందో (గ్లోబలిస్ రూపొందించిన "2050 అవక్షేపణం" ఇతివృత్త రేఖాచిత్రం చూడండి) అధ్యయనం చేయడం ద్వారా దీనిని అమలు చేయాలి, ఇటువంటి ప్రాంతాల్లో తిరిగి అడవుల పెంపకానికి సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టాలి. నైజెర్, సియెరా లియోన్ మరియు లిబేరియా వంటి ప్రాంతాలు ముఖ్యంగా ఇటువంటి ప్రాజెక్టులు అమలు చేయాల్సిన ప్రదేశాలు, ఎందుకంటే ఈ ప్రదేశాలు ఎడారి (సహారా) విస్తరించబడే ముప్పును ఎదుర్కోవడంతోపాటు జీవవైవిద్యాన్ని కోల్పోతున్నాయి (ఈ ప్రదేశాలు జీవవైవిద్యానికి కీలకప్రదేశాలుగా ఉన్నాయి).

మిలిటరీ సందర్భం

ఒకినోవా యుద్ధంలో జపాన్ ఫిరంగి దళం చేతిలో కంగుతిన్న అమెరికన్ షెర్మాన్ ట్యాంకులు.

వ్యవసాయం మరియు పట్టణ అవసరాలకు సంబంధించిన గిరాకీని తీర్చేందుకు అటవీ నిర్మూలన ఎక్కువగా జరిగినప్పటికీ, మిలిటరీ కారణాల వలన కూడా అడవులు నిర్మూలించబడ్డాయనేందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వీటిలో ఒక ఉదాహరణ ఏమిటంటే, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలో U.S. ఆక్రమణ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా అటవీ నిర్మూలన జరిగింది. ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభ దశకు ముందు పరాజితమైన జర్మనీని భవిష్యత్ భాగస్వామ్య దేశంగా భావించకుండా, భవిష్యత్ ముప్పు పొంచివున్న దేశంగానే పరిగణించారు. ఈ భవిష్యత్ సంభావ్య ముప్పును నిరోధించేందుకు, జర్మనీ పారిశ్రామిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయి, ఈ ప్రయత్నాల్లో అడవుల నాశనం కూడా ఒక భాగమైంది. "జర్మనీ అడవుల యొక్క యుద్ధ సామర్థ్యాన్ని చివరివరకు నాశనం చేయడం" ద్వారా యుద్ధ సంభావ్యతను నిరోధించే ప్రయత్నం జరిగిందని U.S. ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరించాయి. ఈ అటవీ నిర్మూలన చర్య కారణంగా బాధిత ప్రదేశంలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఒక శతాబ్దానికిపైగా అడవులను పెంచాల్సిన అవసరం ఏర్పడింది.[118]

అటవీ నిర్మూలకు యుద్ధం కూడా ఒక కారణమైంది, వియత్నాం యుద్ధం సందర్భంగా ఏజెంట్ ఆరంజ్‌[119], బాంబులు, బుల్డోజర్లు ఉపయోగించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేశారు, ఆ సమయంలో ఈ చర్యల వలన 44% అటవీ భూభాగం ధ్వంసమైంది,[120] లేదా యుద్ధం కారణంగా అనుకోకుండా అడవులు నాశనమైన సందర్భానికి ఉదాహరణ 1945నాటి ఒకినావా యుద్ధం, ఈ యుద్ధంలో ఫిరంగి దాడులు మరియు ఇతర యుద్ధ కార్యకలాపాల వలన ఉష్ణమండల అటవీ భాగం బురద నేలలు, సీసం, క్షయం మరియు పురుగులు, క్రిములతో నిండిన ప్రదేశాలుగా రూపాంతరం చెందింది.[121]

యుద్ధరంగ నేపధ్యము :

అడవుల యొక్క నిర్మూలనకు వ్యవసాయం మరియూ పట్టణ ప్రాంత విస్తర్ణము ప్రధాన కారణములైనప్పటికీ యుధ్ధముల వలన కూడా నాశనము చేయబడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి . రెండవ ప్రపంచ యుధ్ధము ముగిసిన తర్వాత, జర్మనీ దేశము ఓడిపోయినప్పటికినీ భవిషయత్తులో విపత్తును కలిగించగలదు అను ఉద్దేశము తో, అమెరికా ఆ దేశము యొక్క వన సంపదను నిర్మూలించెను .

నివారణా చర్యలు :

ప్రపంచములో ఉన్న ప్రధాన సంస్థలైన ప్రపంచ బ్యాంక్ మరియూ యూ.యెన్.ఓ ( యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ) అటవీ నిర్మూలనను నివారించటానికి కఠిన చర్యలు మొదలుపెట్టాయి . వ్యవసాయములో తక్కువ ఖర్చును ఉపయోగించి యెక్కువ ఉత్పత్తిని ఇవ్వగల హైబ్రిడ్ రకాల జాతులను అభివృద్ధి చేయటం జరిగింది . వ్యవసాయం చేయటానికి కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టటం జరిగింది . అడవుల నిర్మూలనను గుర్తించటానికి ఉపగ్రహాలను కూడా ఉపయిగించటం జరుగుతుంది . అంతరించిపోతున్న జంతువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి, వాటిని కలిగి ఉన్న దేశాలను అప్రమత్తం చేసి, అక్కడ చర్యలను కఠీనతరం చేయబడింది . మన దేశములో అంతరించిపోతున్న బెంగాల్ పులిని రక్షించేందుకు చర్యలు జరుగుతున్నాయి .

ఇవి కూడా చూడండి

మూస:Portalbox

సూచనలు

గమనికలు
 1. రిటర్నింగ్ ఫారెస్ట్స్ ఎనలైజ్డ్ విత్ ది ఫారెస్ట్ ఐడెంటిటీ, 2006, పెక్కా E. కౌపీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోలాజికల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హెల్సింకీ విశ్వవిద్యాలయం), జెస్సీ H. ఆసుబెల్ (ప్రోగ్రామ్ ఫర్ ది హ్యూమన్ ఎన్విరాన్‌మెంట్, రాక్‌ఫెల్లెర్ విశ్వవిద్యాలయం), జిన్‌గ్యున్ ఫాంగ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకాలజీ, పెకింగ్ విశ్వవిద్యాలయం), అలెగ్జాండర్ S. మథర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్‌మెంట్, అబెర్డీన్ విశ్వవిద్యాలయం), రోజెర్ A. సెడ్జో (రీసోర్సెస్ ఫర్ ది ఫ్యూచర్), అండ్ పాల్ E. వాగోనెర్ (కనెక్టికట్ అగ్రికల్చరల్ ఎక్స్‌పరిమెంట్ స్టేషను) రూపొందించారు
 2. యూజ్ ఎనర్జీ, గెట్ రిచ్ అండ్ సేవ్ ది ప్లానెట్, న్యూయార్క్ టైమ్స్, ఏప్రిల్ 20, 2009
 3. Burgonio, T.J. (January 3, 2008). "Corruption blamed for deforestation". Philippine Daily Inquirer.
 4. "WRM Bulletin Number 74". World Rainforest Movement. September 2003.
 5. "Global Deforestation". Global Change Curriculum. University of Michigan Global Change Program. January 4, 2006.
 6. 6.0 6.1 Alain Marcoux (August 2000). "Population and deforestation". SD Dimensions. Sustainable Development Department, Food and Agriculture Organization of the United Nations (FAO).
 7. Butler, Rhett A. "Impact of Population and Poverty on Rainforests". Mongabay.com / A Place Out of Time: Tropical Rainforests and the Perils They Face. Retrieved May 13, 2009.
 8. Jocelyn Stock, Andy Rochen. "The Choice: Doomsday or Arbor Day". Retrieved May 13, 2009.
 9. Ehrhardt-Martinez. "Demographics, Democracy, Development, Disparity and Deforestation: A Crossnational Assessment of the Social Causes of Deforestation". Paper presented at the annual meeting of the American Sociological Association, Atlanta Hilton Hotel, Atlanta, GA, Aug 16, 2003. Retrieved May 13, 2009. Unknown parameter |second= ignored (help)
 10. "The Double Edge of Globalization". YaleGlobal Online. Yale University Press. June 2007.
 11. Butler, Rhett A. "Human Threats to Rainforests—Economic Restructuring". Mongabay.com / A Place Out of Time: Tropical Rainforests and the Perils They Face. Retrieved May 13, 2009.
 12. Susanna B. Hecht, Susan Kandel, Ileana Gomes, Nelson Cuellar and Herman Rosa (2006). "Globalization, Forest Resurgence, and Environmental Politics in El Salvador" (PDF). World Development Vol. 34, No. 2. pp. 308–323.CS1 maint: multiple names: authors list (link)
 13. Hance, Jeremy (May 15, 2008). "Tropical deforestation is 'one of the worst crises since we came out of our caves'". Mongabay.com / A Place Out of Time: Tropical Rainforests and the Perils They Face.
 14. 14.0 14.1 Pearce, David W (2001). "The Economic Value of Forest Ecosystems" (PDF). Ecosystem Health, Vol. 7, no. 4. pp. 284–296. Unknown parameter |month= ignored (help)
 15. Erwin H Bulte; Mark Joenje; Hans G P Jansen (2000). "Is there too much or too little natural forest in the Atlantic Zone of Costa Rica?". Canadian Journal of Forest Research; 30:3. pp. 495–506.CS1 maint: multiple names: authors list (link)
 16. 16.0 16.1 16.2 Arild Angelsen, David Kaimowitz (February 1999). "Rethinking the causes of deforestation: Lessons from economic models". The World Bank Research Observer, 14:1. Oxford University Press. pp. 73–98.
 17. Laurance, William F. (December 1999). "Reflections on the tropical deforestation crisis" (PDF). Biological Conservation, Volume 91, Issues 2-3. pp. 109–117.
 18. Helmut J. Geist And Eric F. Lambin (February 2002). "Proximate Causes and Underlying Driving Forces of Tropical Deforestation" (PDF). BioScience, Vol. 52, No. 2. pp. 143–150.
 19. "NASA - Top Story - NASA DATA SHOWS DEFORESTATION AFFECTS CLIMATE".
 20. "Massive deforestation threatens food security".
 21. డీఫారెస్టేషను, సైన్స్‌డైలీ
 22. కన్‌ఫైర్మ్‌డ్: డీఫారెస్టేషను ప్లేస్ క్రిటికల్ క్లైమేట్ చేంజ్ రోల్, సైన్స్‌డైలీ, మే 11, 2007
 23. డీఫారెస్టేషను కాజెస్ గ్లోబల్ వార్మింగ్, FAO
 24. 24.0 24.1 ఫిలిప్ M. ఫియర్న్‌సిడెల్ మరియు విలియం F. లారెన్స్, ట్రోపికల్ డీఫారెస్టేషను అండ్ గ్రీన్‌హౌస్-గ్యాస్ ఎమిజన్స్ , ఎకలాజికల్ అప్లికేషన్స్, వాల్యూమ్ 14, ఇష్యూ 4 (ఆగస్టు 2004) పేజీలు. 982–986
 25. "Fondation Chirac » Deforestation and desertification".
 26. http://www.ipcc.ch/pdf/assessment-report/ar4/wg1/ar4-wg1-chapter7.pdf IPCC ఫోర్త్ అసెస్‌మెంట్ రిపోర్ట్, వర్కింగ్ గ్రూప్ I రిపోర్ట్ "ది ఫిజికల్ సైన్స్ బేసిస్", సెక్షన్ 7.3.3.1.5 (పేజి. 527)
 27. I.C. ప్రెంటిస్. "ది కార్బన్ సైకిల్ అండ్ ఎట్మాస్పియరిక్ కార్బన్ డైయాక్సైడ్" IPCC, http://www.grida.no/CLIMATE/IPCC_TAR/wg1/pdf/TAR-03.PDF
 28. బ్రింగింగ్ ‘REDD’ ఇన్‌టు ఎ న్యూ డీల్ ఫర్ ది గ్లోబల్ క్లయిమేట్ , S. వెర్‌ట్జ్-కనౌనికోఫ్, L. జిమెనా రూబియో ఆల్వరెడో, అనాలసిస్, n° 2, 2007, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవెలప్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్.[1]
 29. 29.0 29.1 "How can you save the rain forest. October 8, 2006. Frank Field".
 30. బ్రోయ్‌కెర్, వాలస్ S. (2006). "బ్రీతింగ్ ఈజీ: ఈవెన్ యు, O2." కొలంబియా విశ్వవిద్యాలయం http://www.columbia.edu/cu/21stC/issue-2.1/broecker.htm.
 31. మోరన్, E.F., "డీఫారెస్టేషను అండ్ ల్యాండ్ యూజ్ ఇన్ ది బ్రెజిలియన్ అమెజాన్", హ్యూమన్ ఎకాలజీ, వాల్యూమ్ 21, నెం. 1, 1993"
 32. "Underlying Causes of Deforestation: UN Report".
 33. "Deforestation and Landslides in Southwestern Washington".
 34. చైనా ఫ్లడ్స్: ఈజ్ డీఫారెస్టేషను టు బ్లేమ్?, BBC న్యూస్
 35. "Underlying Causes of Deforestation: UN Report".
 36. "సాయిల్, వాటర్ అండ్ ప్లాంట్ కారెక్టెరిస్టిక్స్ ఇంపార్టెంట్ టు ఇరిగేషన్". నార్త్ డకోటా రాష్ట్ర విశ్వవిద్యాలయం.
 37. http://www.actionbioscience.org/environment/nilsson.html డు వి హావ్ ఎనఫ్ ఫారెస్ట్స్? స్టెయిన్ నిల్సన్ రచన
 38. "Deforestation".
 39. రెయిన్‌ఫారెస్ట్ బయోడైవర్శిటీ షోస్ డిఫెరింగ్ పాట్రన్స్, సైన్స్‌డైలీ, ఆగస్టు 14, 2007
 40. "BMBF: Medicine from the rainforest".
 41. సింగిల్-లార్జెస్ట్ బయోడైవర్శిటీ సర్వే సేస్ ప్రైమరీ రెయిన్‌ఫారెస్ట్ ఈజ్ ఇర్రీప్లేసబుల్, బయో-మెడిసిన్, నవంబరు 14, 2007
 42. ట్రోపికల్ రెయిన్‌ఫారెస్ట్స్ - ది ట్రోపికల్ రెయిన్‌ఫారెస్ట్, BBC
 43. "Tropical Rainforest".
 44. U.N. కాల్స్ ఆన్ ఆసియన్ నేషన్స్ టు ఎండ్ డీఫారెస్టేషను, ర్యూటర్స్
 45. "Rainforest Facts".
 46. ట్రోపికల్ రెయిన్‌ఫారెస్ట్స్ - రెయిన్‌ఫారెస్ట్ వాటర్ అండ్ న్యూట్రియంట్ సైకిల్స్, BBC
 47. ప్రైమరీ రెయిన్‌ఫారెస్ట్ రిచెర్ ఇన్ స్పీసిస్ దాన్ ప్లాంటేషన్స్, సెకండరీ ఫారెస్ట్స్, జులై 2, 2007
 48. పిమ్, స్టువర్ట్ L, రసెల్, గారెత్ J, గిటెల్‌మాన్, జాన్ L, బ్రూక్స్, థామస్ M. 1995 "ది ఫ్యూచర్ ఆఫ్ బయోడైవర్శిటీ" సైన్స్ 269:5222 347-341
 49. 49.0 49.1 తిమోతీ ఛార్లస్ అండ్ వైట్‌మోర్, జెఫ్రే సేయర్, 1992 "ట్రోపికల్ డీఫారెస్టేషను అండ్ స్పీసిస్ ఎక్స్‌టిన్‌క్షన్" ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నాచురల్ రీసెర్సెస్ కమిషన్ ఆన్ ఎకాలజీ.
 50. 50.0 50.1 పిమ్, స్టువర్ట్ L, రసెల్, గారెత్ J, జిటెల్‌మాన్, జాన్ L, బ్రూక్స్, థామస్ M.1995 "ది ఫ్యూచర్ ఆఫ్ బయోడైవర్శిటీ" సైన్స్ 269:5222 347-341
 51. 51.0 51.1 51.2 "www.rain-tree.com/facts.htm".
 52. లీకే, రిచర్డ్ అండ్ రోజెర్ లెవిన్, 1996, ది సిక్స్త్ ఎక్స్‌టిన్‌క్షన్: పాట్రన్స్ ఆఫ్ లైఫ్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్‌కైండ్ , యాంకర్, ISBN 0-385-46809-1
 53. ది గ్రేట్ రెయిన్‌ఫారెస్ట్ ట్రాజడీ, ది ఇండిపెండెంట్
 54. బయోడైవర్శిటీ వైపౌట్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ ఏషియా, న్యూ సైంటిస్ట్, జులై 23, 2003
 55. నేచర్ లాస్ 'టు హర్ట్ గ్లోబర్ పూర్', BBC న్యూస్, మే 29, 2008
 56. http://atlas.aaas.org/pdf/63-66.pdf ఫారెస్ట్ ప్రొడక్ట్స్
 57. "Destruction of Renewable Resources".
 58. ప్రపంచంలోని ఉష్ణమండల అరణ్యాల్లో అటవీ నిర్మూలన పెద్దమొత్తంలో హరితగృహ వాయు ఉద్గారాలకు, తక్కువ ఆర్థిక ప్రయోజనాలకు కారణవుతుంది, CGIAR.orgలో ఉన్న ఒక కొత్త అధ్యయనం సూచన, డిసెంబరు 4, 2007
 59. "New ASB Report finds deforestation offers very little money compared to potential financial benefits at ASB.CGIAR.org".
 60. 60.0 60.1 Flannery, T (1994), The future eaters, Melbourne: Reed Books
 61. "Clearances and Clearings: Deforestation in Mesolithic/Neolithic Britain". Oxford Journal of Archaeology.
 62. "hand tool :: Neolithic tools -- Britannica Online Encyclopedia".
 63. "Neolithic Age from 4,000 BC to 2,200 BC or New Stone Age".
 64. C. మైఖేల్ హోగాన్. 2007 నోసోస్ ఫీల్డ్‌నోట్స్ , జి మోడరన్ యాంటిక్వెరైన్
 65. "www.school.eb.com/comptons/article-9310969?query=deforestation&ct=".
 66. జీర్డ్ H. వాన్ ఆండెల్, ఎబెర్‌హార్డ్ జాంజెర్, అన్నే డెమిట్రాక్, "ల్యాండ్ యూజ్ అండ్ సాయిల్ ఎరోజన్ ఇన్ ప్రీహిస్టారిక్ అండ్ హిస్టారికల్ గ్రీస్' జర్నల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్కియాలజీ 17.4 (శీతాకాలం 1990), పేజీలు. 379-396
 67. ది మిస్టరీ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్, స్మిత్‌సోనియన్ మేగజైన్, ఏప్రిల్ 01, 2007
 68. "Historical Consequences of Deforestation: Easter Island".
 69. "Jared Diamond, Easter Island's End".
 70. ఇన్ క్లోజింగ్ ది సివిలైజేషన్ ఆఫ్ మిడిల్ ఏజెస్: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఎ సివిలైజేషన్ (1993) పేజీలు 564f.
 71. 71.0 71.1 71.2 71.3 E. O. విల్సన్, 2002, ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ , వింటేజ్ ISBN 0-679-76811-4
 72. మ్యాప్ రివీల్స్ ఎక్స్‌టెంట్ ఆఫ్ డీఫారెస్టేషను ఇన్ ట్రోపికల్ కంట్రీస్, guardian.co.uk, జులై 1, 2008
 73. 73.0 73.1 మేకాక్, పాల్ F. డీఫారెస్టేషను . వరల్డ్‌బుక్ఆన్‌లైన్.
 74. 74.0 74.1 రాన్ నిల్సెన్, ది లిటిల్ గ్రీన్ హాండ్‌బుక్: సెవెన్ ట్రెండ్స్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ , పికాడర్, న్యూయార్క్ (2006) ISBN 978-0-312-42581-4
 75. రెయిన్‌ఫారెస్ట్స్ - ఫాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎబౌట్ ది రెయిన్‌ఫారెస్ట్.
 76. ఆడమ్, డేవిడ్. "గ్లోబల్ డీఫారెస్టేషను ఫిగర్స్ క్వచన్డ్". గార్డియన్ జనవరి 5, 2008
 77. "www.econlib.org/library/Enc/EnvironmentalQuality.html".
 78. Bjørn Lomborg (2001). The Skeptical Environmentalist. Cambridge: Cambridge University Press.
 79. న్యూ జంగిల్స్ ప్రాంమ్ట్ ఎ డిబేట్ ఆన్ రెయిన్ ఫారెస్ట్స్, న్యూయార్క్ టైమ్స్, జనవరి 30, 2009.
 80. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లయిమేట్ చేంజ్. ల్యాండ్ యూజ్, ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1998. మూస:Page number
 81. ఫ్రెడెరిక్ అచార్డ్, హగ్ D ఎవా, హాన్స్-జుర్గెన్ స్టిబిగ్, ఫిలిప్ మేయాక్స్ (2002). "డిఫారెస్టేషను ఆఫ్ డిఫారెస్టేషను రేట్స్ ఆఫ్ ది వరల్డ్స్ హ్యుమిడ్ ట్రోపికల్ ఫారెస్ట్స్." సైన్స్ 297:5583: పేజీలు. 999-1003.
 82. ఝా, అలోక్. "అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ వానిషింగ్ ఎట్ ట్వైస్ రేట్ ఆఫ్ ప్రీవియస్ ఎస్టిమేట్స్". గార్డియన్ . అక్టోబర్ 21, 2006.
 83. శాటిలైట్ ఇమేజెస్ రివీల్ అమెజాన్ ఫారెస్ట్ ష్రింకింగ్ ఫాస్టర్, csmonitor.com
 84. http://www.aseanenvironment.info/Abstract/41014849.pdf డీఫారెస్టేషను అండ్ ది ఎన్విరాన్‌మెంటల్ కుజ్నెట్స్ కర్వ్:ఎన్ ఇన్‌స్ట్యూషనల్ పర్స్‌పెక్టివ్
 85. ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్: ఎ డీఫారెస్టేషను కుజ్నెట్స్ కర్వ్?, నవంబరు 22, 2006
 86. "Is there an environmental Kuznets curve for deforestation?".
 87. "Pan-tropical Survey of Forest Cover Changes 1980-2000". Forest Resources Assessment. Rome, Italy: Food and Agriculture Organization of the United Nations (FAO).
 88. "www.fao.org/DOCREP/MEETING/003/X9591E.HTM".
 89. వరల్డ్‌వాచ్: వుడ్ ప్రొడక్షన్ అండ్ డీఫారెస్టేషను ఇంక్రీజ్ & రీసెంట్ కంటెంట్, వరల్డ్‌వాచ్ ఇన్‌స్టిట్యూట్
 90. 90.0 90.1 "World deforestation rates and forest cover statistics, 2000-2005".
 91. వైవిద్యం కలిగివున్న సతత హరితారణ్యాలు చాలా వేగంగా నిర్మూలించబడుతున్నాయి, ఇది తక్కువ వైవిద్యం ఉన్న, పొడి, ఉపరితల అడవుల పాక్షిక నెమ్మదైన నిర్మూలనకు కొంతవరకు ముసుగు వేస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ మినహాయింపు కారణంగా, అంతర్జాతీయ అటవీ నిర్మూలన రేటు తగ్గినప్పటికీ అటవీ నిర్మూలన యొక్క అత్యంత హానికర ప్రభావాలు (సహజావరణ నష్టం వంటి) పెరుగుతాయి.
 92. "Remote sensing versus self-reporting".
 93. బొలీవియాలో 80%, కొలంబియాలో 42% కలప అక్రమ రవాణా జరుగుతుందని, ఇదిలా ఉంటే పెరూలో అక్రమ కలప రవాణా వాటా 80% వరకు ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. (ప్రపంచ బ్యాంకు (2004). ఫారెస్ట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ .) (పెరూవియన్ ఎన్విరాన్‌మెంటల్ లా సొసైటీ (2003). కేస్ స్టడీ ఆన్ ది డెవెలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ఇల్లీగల్ లాగింగ్ విత్ ఎ వ్యూ టు సస్టెయినబుల్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ పెరూ .)
 94. "National Geographic: Eye in the Sky — Deforestation".
 95. "Rainforests & Agriculture".
 96. ది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్, BBC
 97. "The Causes of Tropical Deforestation".
 98. "What is Deforestation?".
 99. IUCN - త్రీ న్యూ సైట్స్ ఇన్‌స్క్రైబ్డ్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, జూన్ 27, 2007
 100. "Madagascar's rainforest".
 101. "International Conference on Reforestation and Environmental Regeneration of Haiti".
 102. "Chart - Tropical Deforestation by Country & Region".
 103. "Rainforest Destruction".
 104. అమెజాన్ డీఫారెస్టేషను రైజెస్ షార్ప్లీ ఇన్ 2007, USATODAY.com, జనవరి 24, 2008
 105. "Rainforest loss shocks Brazil".
 106. వాల్ష్, బ్రేయాన్. "గ్రీన్ బ్యాంక్స్: పేయింగ్ కంట్రీస్ టు కీప్ థెయిర్ ట్రీస్". TIME . డిసెంబరు 4, 2008.
 107. డైమండ్, జారెద్ కొలాప్స్: హౌ సొసైటీస్ చూజ్ టు ఫెయిల్ ఆర్ సక్సీడ్ ; వైకింగ్ ప్రెస్ 2004, పేజీలు 301-302
 108. డైమండ్, పేజీలు 320-331
 109. "స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్స్ 2009". ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ.
 110. జోనథన్ A ఫోలే, రూత్ డెఫ్రీస్, గ్రెగోరి P అస్నెర్, కరోల్ బార్‌ఫోర్డ్, మరియు ఇతరులు. 2005 "గ్లోబల్ కాన్‌సీక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ యూజ్" సైన్స్ 309:5734 570-574
 111. 111.0 111.1 జేమ్స్ ఒవెన్, 2006, "వరల్డ్స్ ఫారెస్ట్స్ రీబౌండింగ్, అధ్యయన సూచన" నేషనల్ జియోగ్రఫిక్ న్యూస్ http://news.nationalgeographic.com/news/2006/11/061113-forests.html
 112. జాన్ గిట్టింగ్స్, 2001, "బ్యాటిలింగ్ చైనాస్ డీఫారెస్టేషను" వరల్డ్ న్యూస్ http://www.guardian.co.uk/world/2001/mar/20/worlddispatch.china
 113. "World Intact Forests campaign by Greenpeace".
 114. ప్రపంచ అటవీ ఆవరణ చిత్రపటం
 115. "Alternative thematic map by Howstuffworks; in pdf" (PDF).
 116. నో మాన్స్ గార్డెన్ డేనియల్ B. బోట్కిన్ పేజి 246-247
 117. శాంపుల్, ఇయాన్. "ఫారెస్ట్స్ ఆఫ్ పొయీజ్డ్ టు మేక్ ఎ కమ్‌బ్యాక్, అధ్యయనం గుర్తింపు". గార్డియన్ నవంబర్ 4, 2006
 118. నికోలస్ బాలాబ్కిన్స్, "జర్మనీ అండర్ డైరెక్ట్ కంట్రోల్స్; ఎకనామిక్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిసార్మెంట్ 1945-1948, రుట్జెర్స్ యూనివర్శటీ ప్రెస్, 1964. పేజి. 119. బాలాబ్కిన్స్ చేత ఉపయోగించబడిన ఉల్లేఖనాలు వరుసగా; U.S. ఆఫీస్ ఆఫ్ మిలిటరీ గవర్నమెంట్, ఎ ఇయర్ ఆఫ్ పాట్స్‌డామ్: ది జర్మన్ ఎకానమీ సిన్స్ ది సరెండర్ (1946), పేజి70; అండ్ U.S. ఆఫీస్ ఆఫ్ మిలిటరీ గవర్నమెంట్, ది జర్మన్ ఫారెస్ట్ రీసోర్సెస్ సర్వే (1948), పేజి. II. ఇదేవిధమైన పరిశీలనలకు G.W. హార్మ్‌సెన్, రెపారేషియోనెన్, సోషల్‌ప్రొడక్ట్, లెబెన్స్‌స్టాండర్స్ (బ్రెమెన్: F. ట్రుజెన్ వెర్లాగ్, 1948), I, 48
 119. "ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ హిస్టరీ". రౌట్లెడ్జ్ 2006 ISBN 90-5702-407-1
 120. పాట్రిసియా మార్కాక్, "లాగింగ్ ది గ్లోబ్" పేజి 157
 121. "Okinawan History and Karate-do".
సాధారణ సూచనలు


 • మానవ చరిత్రను రాటుదేల్చిన భూగోళ అంశాలపై BBC 2005 TV సిరీస్ (పేరు?)
 • ఎ నాచురల్ హిస్టరీ ఆఫ్ యూరప్ - 2005 BBC మరియు ZDF సహ-ఉత్పాదన
 • వైట్నీ, గోర్డాన్ G. (1996). ఫ్రమ్ కోస్టల్ వైల్డెర్నెస్ టు ఫ్రూటెడ్ ప్లెయిన్ : ఎ హిస్టరీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ ఇన్ టెంపరేట్ నార్త్ అమెరికా ఫ్రమ్ 1500 టు ది ప్రజంట్ . కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1972. ISBN 0-521-57658-X
 • విలియమ్స్, మైఖేల్. (2003). డీఫారెస్టింగ్ ది ఎర్త్ . యూనివర్సిటీ అఫ్ చికాగో ప్రెస్, చికాగో. ISBN 0-226-89926-8
 • వుండర్, స్వెన్. (2000). ది ఎకనామిక్స్ ఆఫ్ డీఫారెస్ట్రేషన్: ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఈక్వెడార్ . మాక్‌మిలన్ ప్రెస్, లండన్. ISBN 0-333-73146-8
 • FAO&CIFOR రిపోర్ట్: ఫారెస్ట్స్ అండ్ ఫ్లడ్స్: డ్రాయింగ్ ఇన్ ఫిక్షన్ ఆర్ థ్ర్యూవింగ్ ఆన్ ఫాక్ట్?
 • Fenical, William (1983), "Marine Plants: A Unique and Unexplored Resource", Plants: the potentials for extracting protein, medicines, and other useful chemicals (workshop proceedings), DIANE Publishing, p. 147, ISBN 1428923977 Unknown parameter |month= ignored (help)
ఇథియోపియా అటవీ నిర్మూలన సూచనలు


 • పారీ, J. (2003). త్రీ చొప్పర్స్ బికమ్ ట్రీ ప్లాంటర్స్. అప్రాప్రియేట్ టెక్నాలజీ, 30 (4), 38-39. 2006 నవంబరు 22న, ABI/INFORM గ్లోబల్ డేటాబేస్ నుంచి సేకరించబడింది. (డాక్యుమెంట్ ID: 538367341).
 • హిల్‌స్ట్రోమ్, K & హిల్‌స్ట్రోమ్, C. (2003). ఆఫ్రికా అండ్ ది మిడిల్ ఈస్ట్. ఎ కాంటినెంటల్ ఒవర్‌వ్యూ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్. శాంతాబార్బరా, CA: ABC CLIO.
 • విలియమ్స్, M. (2006). డీఫారెస్టింగ్ ది ఎర్త్: ఫ్రమ్ ప్రీహిస్టరీ టు గ్లోబల్ క్రీసిస్: ఎన్ అబ్రిడ్జ్‌మెంట్. చికాగో: యూనివర్శిటీ ఆఫ్ చికాగో ప్రెస్.
 • మెక్‌ఆన్. J.C. (1990). ఎ గ్రేట్ అగ్రేరియన్ సైకిల్? ప్రొడక్టివిటీ ఇన్ హైలాండ్ ఇథియోపియా, 1900 నుంచి 1987 వరకు. జర్నల్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లీనరీ హిస్టరీ, xx: 3,389-416. 2006 నవంబరు 18న, JSTOR డేటాబేస్ నుంచి సేకరించబడింది.

బాహ్య లింకులు

మీడియాలో
ఆన్‌లైన్‌లో చలనచిత్రాలు