"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అడిమైకళ్

From tewiki
Jump to navigation Jump to search

అడిమైకళ్ (బానిసలు, మలయాళం:അടിമകൾ) 1969లో నిర్మితమైన చిత్రాలలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి పొందిన మలయాళ సినిమా. ఈ సినిమాకు మలయాళ రచయిత బొమ్మన్ వ్రాసిన నవల ఆధారం. ఈ సినిమా తెలుగులో రజనీకాంత్ హీరోగా చిలకమ్మ చెప్పింది, తమిళంలో కమల్ హాసన్ హీరోగా నీళల్ నిజమాగిరాదుగా పునర్నించబడింది.

సంక్షిప్త చిత్రకథ

"ఈ బిడ్డకు తండ్రి ఎవరు?" అని వూళ్ళో వాళ్ళంతా పొన్నమ్మను నిలదీసి అడిగినప్పుడు ఆమెకు నోటి వెంట మాటరాలేదు. ఊళ్ళోవాళ్ళ నోళ్ళు మూయించడానికి ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యంగా చూసే చెవిటి రాఘవన్ 'నేనే ఆ బిడ్డకు తండ్రిని ' అన్నప్పుడు ఆమెకు నిజంగానే నోటివెంట మాటరాలేదు. పొన్నమ్మ రాఘవన్ రక్షణలోనో వుంది కానీ తనను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ పెద్దమనిషి కొడుకు ఆనందన్ వస్తాడని, తనను ఏలుకుంటాడని ఆమె ఎదురుచూడడం మానలేదు.

ఆనందన్‌కు మొదట ఆ ఉద్దేశం లేదు. ఆ తర్వాత తన మనసు మార్చుకున్నాడు. "ఆనందన్ మనసు మార్చుకున్నాడని, తన ఇంటికి తీసుకువెళ్ళడానికి రేపు ఉదయం వస్తున్నాడని" పొన్నమ్మకు వార్త అందింది.

ఈ వార్త రాఘవన్‌కు పిడుగు పాటయింది. కానీ ఏం చేయగలడు?

ఆ రాత్రి రోజూలాగే గుడిసె బయటి అరుగు మీద పడుకుని పసి పిల్లవాడిలా ఏడ్చాడు రాఘవన్. అతనిలో ఏదో అనిర్వచనీయమైన బాధ.

మరునాడు ఉదయం తన కోరిక తీర్చుకుని పారిపోయిన ప్రేమికుడు ఆనందన్ పొన్నమ్మనూ, బిడ్డనూ తీసుకు వెళ్ళడానికి వచ్చి నిలబడ్డాడు.

అప్పుడు పొన్నమ్మ అన్న మాటలకు ఆనందన్, రాఘవన్ ఇద్దరూ నిఘాంతపోయారు.

"నీతో రావడం నాకు ఇష్టం లేదు. ఈ బిడ్డను నీ కారణంవల్ల కన్నా, తండ్రిగా నీకు అనుబంధం ఉన్నా, నన్ను వూళ్ళో తల ఎత్తుకుని తిరిగేలా చేసి కష్టాల్లో ఆదుకున్నా ఈ రాఘవనే ఈ బిడ్డకు తండ్రి. నాకు భర్త" అందామె.

నటీనటులు

 • శారద - పొన్నమ్మ
 • ప్రేమ్‌ నజీర్ - చెవిటి రాఘవన్
 • సత్యన్
 • షీలా
 • ఆడూర్ భాసి
 • ఆడూర్ భవాని
 • బహద్దూర్
 • జెస్సీ
 • ఎన్.గోవింద కుట్టి

సాంకేతిక వర్గం

 • దర్శకుడు : కె.ఎస్.సేతమాధవన్
 • కథ: బొమ్మన్
 • సంభాషణలు : తొప్పిల్ భాసి
 • స్క్రీన్ ప్లే : తొప్పిల్ భాసి
 • సంగీతం : జి. దేవరాజన్

మూలాలు

బయటిలింకులు