"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అతిథి

From tewiki
Jump to navigation Jump to search
అతిథి
(2007 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం సురేందర్ రెడ్డి
నిర్మాణం జి.రమేష్ బాబు
కథ వక్కంతం వంశీ
తారాగణం మహేష్ బాబు,
అమృతారావు,
మురళీ శర్మ,
ఆశీష్ విద్యార్ధి,
కోట శ్రీనివాసరావు,
నాజర్
బ్రహ్మానందం
మలైకా అరోరా
సునీల్,
రాజీవ్ కనకాల,
వేణుమాధవ్,
అస్మిత
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
కూర్పు గౌతం రాజు
పంపిణీ UTV మోషన్ పిక్చర్స్
నిడివి 157 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి 22 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అతిథి 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.

కథ

ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.

దస్త్రం:TeluguFilmFansPoster Atithi.JPG
అభిమానుల పోస్టరు

14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలునుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, అందువల్ల ఆ యువతి ఇప్పటికీ "అతిథి"ని ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. హైదరాబాదు చేరిన అమృతను చంపాలని ఆ పాత రౌడీ విలన్ కైజర్ ప్రయత్నిస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. అంతే కాకుండా నిజాయితీ పరునిగా పేరుపడ్డ ఒక పోలీసు ఆఫీసర్, గూండా లీడర్ కైజర్ ఒకరేనని కూడా హీరో తెలుసుకుంటాడు.

ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.

పాటలు

మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.

  • ఖబడ్దారనీ - నవీన్, రాహుల్ నంబియార్
  • గొన గొన గోనన్నగోనా - నవీన్, రీటా
  • సత్యం ఏమిటో - దీపు, ఉషా
  • ఖిలాడి కూనా - కార్తీక్, రీటా
  • రాత్రైనా ఓకే, నాకు పగలైనా ఓకే - రంజిత్, అనుష్కా (ఈ పాట బాగా విజయవంతమయ్యింది)
  • వాల్లా వాల్లా - రాహుల్ నంబియార్, ధర్మా

బయటి లింకులు

మూలాలు, వనరులు