అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల యొక్క ఏడు అలవాట్లు

From tewiki
Jump to navigation Jump to search
అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల యొక్క ఏడు అలవాట్లు
రచయితStephen R. Covey
దేశంAtlanis
SubjectSelf help
శైలిnon-fiction
ప్రచురణ కర్తFree Press
ప్రచురణ తేది1989
ISBN0-7432-6951-9
OCLC56413718
158 22
LC ClassBF637.S8 C68 2004
Followed byThe 8th Habit: From Effectiveness to Greatness

అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల యొక్క ఏడు అలవాట్లు అనేది స్టీఫెన్ R . కోవే రాసినటువంటి స్వయం సహాయక పుస్తకము. ఇది 1989లో మొట్టమొదటిసారిగా ప్రచురితమైనది. 2004లో విడుదల చేయబడిన ఈ పుస్తకము మొదటి ప్రచురణ నుండి 38 భాషలలో 15 మిలియన్ల ప్రతులు అమ్మబడినట్లు దాని యొక్క 15వ వార్షికోత్సవ ప్రతిలో తెలియచేయటము జరిగింది. కోవే లక్ష్య సాధనలో ప్రతిభావంతముగా ఉండుటకు కావలసిన విధానాన్ని తెలియచేయటము జరిగింది. దీనిని కోవే "ట్రు నార్త్"గా పిలుస్తూ వ్యక్తిత్వము యొక్క విలువలు అనేవి విశ్వజనీనము మరియు కాలానికి అతీతమయినవి అని పేర్కొనటము జరిగింది.[1]

ఏడు అలవాట్లు

ఒక్కొక్క అధ్యాయము ఈ క్రింద చూపబడిన ఒక్కొక్క అతి ముఖ్యమైన అలవాటుకు అంకితము చేయబడినది:

మొదటి మూడు అలవాట్లు, ఆధారిత స్థితి నుండి స్వతంత్ర స్థితి వైపు పయనించుట అనేదాని చుట్టూ ఉంటాయి (అనగా స్వయం నైపుణ్యము)

 • అలవాటు 1 : ఆశావహ ద్రుక్పదముతో ఉత్సాహముగా ఉండుట

సంక్షిప్తముగా: మనము తీసుకొనే నిర్ణయాలు (మరియు అవి జీవితము యొక్క విలువలతో ఎలా కలుస్తాయి అనేదాని పైన ఆధారపడి) మన జీవితము ఎంత ప్రతిభావంతముగా ఉంటుంది అనేదానిని నిర్ణయించే ప్రధాన అంశాలు అను విషయాన్ని గుర్తించి జీవితములో ప్రణాళికలను రూపొందించుకోవటము. మనము ఎంచుకున్న అంశాలకు మరియు వాటివల్ల వచ్చే పరిణామాలకు బాధ్యత వహించటము.

 • అలవాటు 2 : అంతిమ ఆలోచనను దృష్టిలో ఉంచుకొని మొదలుపెట్టుట

సంక్షిప్తముగా: నిన్ను నువ్వు అర్ధము చేసుకొనుట మరియు అత్యంత లోతైన స్వభావ విలువలలో మరియు జీవిత లక్ష్యాలలో స్పష్టతను ఏర్పరచుకొనుట. జీవితములో పోషించాల్సిన వివిధ పాత్రలకు మరియు భాంధవ్యాలకు ఉండవలసిన ఆదర్శవంతమైన లక్షణాలను ఊహించుకొనుట.

 • అలవాటు 3 :మొదట జరుగవలసిన వాటిని మొదటగా జరిపించుట

సంక్షిప్తముగా: ప్రణాళికను రూపొందించుకొనుట, ప్రాధాన్యతలను గుర్తించుట మరియు వారములో చేయవలసిన వాటిని వత్తిడితో కాకుండా వాటి ప్రాధాన్యతలకు అనుగుణముగా అమలుపరచుట. నీ యొక్క ప్రయత్నాలు నీవు కోరుకున్న వ్యక్తిత్వ విలువలను సూచించేవిగా ఉన్నాయా, నిన్ను నీ లక్ష్యము వైపు నడిపిస్తున్నాయా, రెండవ అలవాటులో విస్తృతముగా చెప్పబడిన పాత్రలను మరియు భాంధవ్యాలను పెంపొందించేవిగా ఉన్నాయా అనే విషయాన్ని మదింపు చేసుకొనుట.

తరువాత మూడు అలవాట్లు ఇతరుల పై ఆధారపడినవి (అనగా ఇతరులతో కలిసి పనిచేయుటకు సంబంధించినవి)

 • అలవాటు 4 : ఇద్దరికీ ఉపయోగకరముగా ఉండేలా లేదా ఏ విధమైన ఒప్పందము లేకుండా ఉండేలా చూచుట

సంక్షిప్తముగా: నీ యొక్క భాంధవ్యాలలో నిజాయితీగా ఇరువురికీ ఉపయోగకరమైన మార్గాంతరాలను లేదా ఒప్పందాలను ఏర్పరచుకొనుటకు కృషిచేయుట. అందరికి "విజయము" కలగాలి అనే విషయాన్ని అర్ధము చేసుకొని వ్యక్తులకు విలువను మరియు గౌరవాన్ని ఇవ్వటమనేది కేవలము ఒక సంఘటనలోని ఒకే వ్యక్తి తనకు కావలసిన దానిని పొందే దాని కంటే నిజమైన దీర్ఘకాలము ఉండే ఉత్తమమైన అంతిమ నిర్ణయము.

 • అలవాటు 5 : మొదట అర్ధము చేసుకోవటానికి ప్రయత్నించి తరువాత అర్ధము చేసుకోబడాలి అని అనుకోవటము

సంక్షిప్తముగా: వ్యక్తిచేత నిజముగా ప్రేరేపింపబడుటకు మరియు వారికి సమాధానము చెప్పుటకు దయతో వినుట, ప్రేమతో, గౌరవముతో మరియు ఆశావహ సమస్యాపూరణ వాతావరణమును కలుగచేసి ఎదుటి వారిని ప్రేరేపించుటకు విశాల దృక్పదముతో ఉండుట.

 • అలవాటు 6 : సహకరించుకొనుట

సంక్షిప్తముగా: కేవలము ఒకే వ్యక్తి సాధించలేని లక్ష్యాలను వ్యక్తుల యొక్క బలాలను కూడగట్టుట ద్వారా ఆశావహ ఉమ్మడి కృషితో సాధించుట. అర్ధవంతమైన పనిని అభినందిస్తూ, ప్రభావవంతమైన మరియు సహాయకారియైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఒక వ్యక్తుల గుంపు నుండి అత్యంత ఉత్పాదకతతో కూడిన పనిని రాబట్టుట.

చివరి అలవాటు వ్యక్తి ఉత్తేజానికి సంబంధించినది;

 • అలవాటు 7 : రంపమునకు పదును పెట్టుట

సంక్షిప్తముగా: నీ యొక్క వనరులను, శక్తిని మరియు ఆరోగ్యాలను దీర్ఘకాలిక స్వయంసమృద్దితో కూడిన జీవన విధానాన్ని ఏర్పరచుకొనుట కొరకు సమతూకమును ఏర్పరచుకొని మరియు పునరుత్తేజితము చేసుకొనుట.'

విస్తారమైన స్వభావము

కోవే విస్తారమైన స్వభావము లేదా విస్తారమైన ఆలోచన అనే పదాలను, వ్యక్తులు ఇతరులతో పంచుకొనుటకు సరిపడినన్ని వనరులు ఉన్నాయి అని నమ్ముతారు అనే సిద్ధాంతములో ఉపయోగించారు. ఈ విస్తార స్వభావము, సాధారణముగా ఒకవేళ ఒక స్థితిలో ఇతరులు విజయమును సాధిస్తే అది నేను ఓడిపోయినట్లు అని భావిస్తూ అన్ని వర్గాలు విజయము సాధించినట్లే (ఏదో ఒక రూపములో) అని ఆలోచించలేని స్థితిని సూచించే సిద్ధాంతము పైన ఆధారపడిన కరవు అనే స్వభావానికి విరుద్దమైనది. విస్తారమైన స్వభావముతో ఉన్న వ్యక్తులు ఇతరుల యొక్క విజయాన్ని చూసి భయపడరు మరియు దానిని సంతోషముతో స్వీకరించగలుగుతారు.[2]

ఈ ఆలోచనను చర్చించిన నాటి నుండి ఈ విషయం పై వ్యాపార ముద్రణాలయాల్లో ఈ విషయం పై అనేక పుస్తకాలు ముద్రించబడ్డాయి.[3] విస్తారమైన స్వభావము అనే ఆలోచన ఉన్నతమైన స్వయం విలువ మరియు స్వయం రక్షణ (1 2 మరియు 3 అలవాట్లను చూడండి) అనేవాటిని కలిగి ఉండటము నుండి వస్తుంది మరియు లాభాలను, గుర్తింపును మరియు బాధ్యతను పంచుకోవటమునకు దారితీస్తుంది.[4] వ్యాపారాన్ని నిర్వహిస్తున్నపుడు సంస్థలు కుడా విస్తారమైన స్వభావము అనే విషయాన్ని అన్వయించుకోవచ్చు.[5]

ది అప్వార్డ్ స్పైరల్

కోవే "అప్వార్డ్ స్పైరల్" అనే విధానాన్ని రంపమునకు సాన పట్టుట అనే భాగములో వివరిస్తాడు. మన యొక్క అర్ధవంతమైన మరియు స్థిరమైన అభివృద్ధితో కలసిన విలువల ద్వారా స్పైరల్, అభివృద్ధి, మార్పు, మరియు స్థిరమైన పెరుగుదల వైపుకు దారితీస్తుంది. ముఖ్యముగా, ఒక విధానము ఎల్లప్పుడు 7 అలవాట్లలో చెప్పబడిన విలువలను అత్యంత ఉన్నతమైన స్థాయిలలో పునరావృతమైన ప్రతిసారి సమీక్రుతము చేయుటకు మరియు నైపుణ్యమును సాధించుటకు ప్రయత్నిస్తుంది. ఏదైనా అలవాటును అనుసరించిన అభివృద్ధి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తుంది మరియు నీవు విలువలను మరింత లోతుగా నేర్చుకోవటము జరుగుతుంది. అప్వార్డ్ స్పైరల్ విధానము మూడు భాగాలను కలిగి ఉంది: నేర్చుకో, అంకితం అవ్వు, చెయ్యు. కోవే ప్రకారము, ఎవరైనా అప్వార్డ్ స్పైరల్ లో పెరిగి అభివృద్ధి సాధించాలంటే విలువల గురించి విస్తారముగా జ్ఞానమును పెంచుకోవాలి. జ్ఞానము ద్వారా పునరుత్తేజితము చేయబడటము అనే ఆలోచన వ్యక్తిని వ్యక్తిగత స్వతంత్రము, రక్షణ, జ్ఞానము మరియు అధికారము/శక్తి అనే దారి వెంట నడిపిస్తుంది.[6]

కొనసాగింపులు

ఈ పుస్తకము విస్తృతమైన ప్రఖ్యాతిని సంపాదించినది మరియు కావేని బహిరంగ ప్రసంగాలు మరియు వర్క్ షాప్ లలో పాల్గొనేలా చేసింది. ఈ పుస్తకమును అనుసరించి అతను అనేక పుస్తకాలు వ్రాశాడు:

 • ఫస్ట్ తింగ్స్ ఫస్ట్
 • ప్రిన్సిపల్ సెంటర్డ్ లీడర్షిప్
 • ది పవర్ ఆఫ్ ది 7 హేబిట్స్: అప్లికేషన్స్ అండ్ ఇంసైట్స్
 • సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టీవ్ ఫ్యామిలీస్
 • బియాండ్ సెవెన్ హాబిట్స్
 • లివింగ్ ద సెవెన్ హాబిట్స్, జీవితములో ఏడు అలవాట్లను ఆచరించిన వ్యక్తుల నుండి సేకరించిన కథలు
 • The 8th Habit: From Effectiveness to Greatness 2004లో ప్రచురితమైన ఏడు అలవాట్లకు కొనసాగింపు
 • ది లీడర్ ఇన్ మీ, ఇది ముఖ్యముగా పాఠశాలలలోని చిన్న పిల్లల ఏడు అలవాట్లను ఉపయోగించుటకు సంబంధించి 2008లో ప్రచురితమైన పుస్తకము.

సియాన్ కోవే (స్టీఫెన్ యొక్క కుమారుడు) యువకుల కొరకు సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టీవ్ టీన్స్ అనే పుస్తకము వ్రాసాడు. ఈ ప్రతిలో, యువ పాఠకులు సమర్దవంతముగా అర్ధము చేసుకొనుట కొరకు ఏడు అలవాట్లను సరళతరము చేసారు. 2006 సెప్టెంబర్ లో సియాన్ కోవే ది 6 మోస్ట్ ఇమ్పోర్తంట్ డెసిషన్స్ యు విల్ ఎవర్ మేక్: ఏ గైడ్ ఫర్ టీన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ మార్ఘదర్శి యువకుల జీవితములోని అత్యంత ముఖ్య కాలాలను చూపిస్తూ ఆ సమయములో ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని సూచిస్తుంది.

స్టీఫెన్ కావే యొక్క పెద్ద కుమారుడు స్టీఫెన్ M. R. కావే ది స్పీడ్ ఆఫ్ ట్రస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు.

సూచనలు

 1. బిల్ గోర్డాన్: " స్టీఫెన్ కావే మరియు అతని యొక్క 7 అలవాట్లను పరికించి చూచుట" అపోలోజేటిక్స్ జాబితా, 23 డిసెంబర్ 2007న పునరుద్దరించబడింది.
 2. English, L (2004). "The 7 Habits of Highly Effective Information Professionals, Part 7" (pdf). DM Review. September/October '04: 60–61.
 3. ఉదాహరణ కొరకు కరోలిన్ సింప్సన్ యొక్క హై పెర్ఫార్మెన్స్ త్రూ నేగోషిఎషన్ చూడండి.
 4. Covey, S (2004). The Power of Character. Unlimited Publishing. p. 103. ISBN 1588321061.
 5. Krayer, Karl J.; Lee, William Thomas (2003). Organizing change: an inclusive, systemic approach to maintain productivity and achieve results. San Diego: Pfeiffer. p. 238. ISBN 0787964433.CS1 maint: multiple names: authors list (link)
 6. Covey, S. R. (1989). Organizing change:Upward Spiral. Free Press. ISBN 0743269519.

బాహ్య లింకులు