"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అనుదైర్ఘ్య వికృతి

From tewiki
Jump to navigation Jump to search

[[దస్త్రం:Http://physicscatalyst.com/mech/elas[permanent dead link] fig4.gif|thumbnail]] ఏకరీతి మధ్యచ్చేద వైశాల్యము, పొదవూ ఉన్న సన్నని కడ్డీమీద అనుదైర్ఘ్య బలం పనిచేస్తుందనుకొందాము.అప్పుడు కడ్డీలోని ప్రతికణము అనుదైర్ఘ్య స్ధానభ్రంశాన్ని పొందుతుంది.సన్నని కడ్డీలోని ప్రతికణమూ అనుదైర్ఘ్య స్థానభ్రంశాన్ని (ξ) పొందుతుంది.సన్నని కడ్డీలలో ఏదైనా మధ్యచ్చేదతలంలోని ప్రతికణానికి ఒకే విలువ ఉంటుంది.ప్రయోగించినబలం కాలంతో మారితే కణ స్థానభ్రంశము కాలం (T) మీదా కణస్థానం మీదా ఆధారపడి ఉంటుంది.

ξ=ξ (x, t)

కడ్డీ రెండు చివరనిరూపకాలుx=O, x=i అనుకొందాము.x, x+dx ల మధ్య ఉన్న చిన్నఖండం dxను పరీశీలిద్దాము.తరంగచలనం వల్ల x వద్ద ఉన్న తలం కుడి వైపుకు ξ స్థానభ్రంశం చెదిందనుకొందాము.అదే విధంగా x+dx వైపు స్థానభ్రంశం ξ+dξ కుడివైపుకు ధనసూచికతోను ఎడమవైపు ఋణసూచికతోను సూచిస్తాము. dx విలువ తక్కువ అని భావించడం వల్ల, x+dx వద్ద స్థానభ్రంశం ξ+dξని టైలర్ శ్రేణిలోని మొదటి రెండు పదాలతోను కింది విధంగా సూచించవచ్చు.

ξ+dξ=ξ+(δξ/δx)dx

ఎంచు కున్న ఖండం dxలో తరంగ చలనం వల్ల కలిగిన మార్పు

(ξ+dξ)-ξ=dξ=(δξ/δx)dx
దైర్ఘ్యవికృతి=(δξ/δx)dx/dx=δξ/δx

x, tల ప్రమేయం ξ కావడం వల్ల పాక్షిక అవకలనాలనే వాడవలె. సంపూర్ణ అవకలనాలను వాడకూడదు.కాలంతోబాటు వికృతి, కణ స్థానమూ మారడం వల్ల కడ్డీలో అనిదైర్ఘ్యతరంగాలు ప్రసారమవుతాయి. అనుదైర్ఘ్యవికృతిని రేఖాంశ జాతి అని కూడా అంటారు. "రేఖాంశ జాతి యొక్క రూపంను శరీరంలో ఒక యూనిట్ పొడవు ప్రకారము దిశలో దరఖాస్తు లోడ్ గా కూడా నిర్వచించవచ్చు."

ఇవి కూడా చూడండి

ములాలు

  • [ద్రవ్య ధర్మాలు-ద్వని]

బయట లంకెలు