అన్నాప్రగడ కామేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search
అన్నాప్రగడ కామేశ్వరరావు
అన్నాప్రగడ కామేశ్వరరావు
దస్త్రం:Annapragada kameswararao.jpg
అన్నాప్రగడ కామేశ్వరరావు
జననం
అన్నాప్రగడ కామేశ్వరరావు

1902 అక్టోబరు 21
మరణం1987 జనవరి 30
పూనే
జాతీయతభారతీయుడు
సుపరిచితుడుభారత విప్లవాత్మక భావాలు గల వ్యక్తి

అన్నాప్రగడ కామేశ్వరరావు స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు గుంటూరు నుండి ఎన్నికయ్యాడు.

జీవిత చరిత్ర

గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, కనుపర్రు గ్రామంలో లో 1902, అక్టోబరు 21 న జన్మించాడు.[1] మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. మొదటి ప్రపంచ యుద్ధం లో మిలటరీలో చేరి పనిచేశాడు.

1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు.1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు.1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పాఠశాలను మూసివేయించింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు.1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసనసభ్యుడు.

మూలాలు

  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113

వెలుపలి లంకెలు