అబ్దుల్ ఖాదర్ వేంపల్లి

From tewiki
Jump to navigation Jump to search

అబ్దుల్‌ ఖాదార్‌ వేంపల్లి, చిత్రకారుడు, నటుడు. కవిగా, నటుడిగా పలుసత్కారాలు అందు కున్నారు. కుందుర్తి జాతీయ సాహితీ పురస్కారం తీసుకున్నారు[1].ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇ.సి మెంబరుగా యుండేవారు.[2].వీరు చిత్తూరు కథను సంపద్వంతం చేసినవారిలో ముఖ్యులు.[3]

జీవిత విశేషాలు

ఆయన చిత్తూరు జిల్లా కలికిరి గ్రామంలో 1945 జూలై 1 న వేంపల్లి హుస్సేన్‌ బీబి, హుసేన్‌ దంపతులకు జన్మించారు.వీరు ఎం.ఏ, బి.ఇడి. చదివారు. అబ్దుల్‌ ఖాదార్‌ వేంపల్లి చిత్రలేఖనం ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించి తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ విరమణ చేశారు.

రచనా వ్యాసంగము

1966లో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో ప్రచురితమైన 'జీవితచక్రం' అనే కవితతో వీరి రచనా వ్యాసంగం ప్రారంభమైనది. అప్పటినుండి కథలు, వచన కవితలు, మొదలగునవి ఎన్నో వ్రాశారు.

సాహిత్య కళారంగాలు

అబ్దుల్‌ ఖాదార్‌ వేంపల్లి గారు వ్రాసి ప్రచురించిన వాటిలో ముఖ్యమైనవి.

 1. చినుకు (వచన కవితా సంపుటి)
 2. మల్లెరేకు (కథాసంపుటి)
 3. వాకిలి (సాహిత్య వ్యాసాలు) [4]
 4. మేఘం (వచన కవితా సంపుటి) [5]
 5. లోగిలి (శతకం)
 6. మెరుపు
 7. వర్తకం

ఖాదర్ అష్టావధానం, నాట్యావధానం వంటివాటిలోనూ భాగస్వామిగా పాల్గొన్నారు. చిత్రకారునిగానూ, నటునిగానూ, కవిగానూ పలు పురస్కారాలు పొందారు.

అవార్డులు- పురస్కారాలు

అబ్దుల్ ఖాదర్ వేంపల్లి అందుకున్న పురస్కారాలు

 1. 1999లో రంజని కుందుర్తి జాతీయ సాహితీ పురస్కారం
 2. 2000 సంవత్సరములో ఎక్స్‌రే అవార్డు
 3. 2003లో పులికిం సాహితీ సంస్కృతి పురస్కారం
 4. 2004లో ప్రవాసాంధ్రా వసంతోత్సవ పురస్కారం
 5. 2005 లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా పురస్కారం

లక్ష్యం

ప్రజలను మానవతా మూర్తులుగా తీర్చి దిద్దే ప్రయత్నమే వీరి లక్ష్యంగా పనిచేస్తున్నారు.

మూలాలు

 1. అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, చిరునామా వినుకొండ - 522647,పుట 33
 2. vempalli abdul khadar svu ex ec member
 3. చెరకు తీపి చింత పులుపు చిత్తూరు కథ
 4. వాకిలి :సాహిత్య వ్యాస సంపుటి by అబ్దుల్ ఖాదర్, వేంపల్లి.[permanent dead link]
 5. Vempalli Abdul Khadar పుస్తకాల వివరాలు

ఇతర లింకులు