అభయపత్రం

From tewiki
Jump to navigation Jump to search

వ్యాపారము మరియు చట్టబద్ధమైన లావాదేవీలలో, ఒక అభయపత్రం అనేది ఒక కొనుగోలుదారుడికి ఒక అమ్మకందారుడు కొన్ని వాస్తవాలు లేదా నియమాలు సత్యమైనవి లేదా కచ్చితంగా జరుగుతాయి అంటూ ఇచ్చే ఒక నమ్మకం; ఒకవేళ అమ్మకందారుడు దానిని అనుసరించని యెడల కొనుగోలుదారుడు ఈ అభయపత్రం ఆధారంగా కొన్ని రకాల పరిహారాలు పొందవచ్చు.

స్థిరాస్థి క్రయవిక్రయాలలో, కొనుగోలుదారుడికి ఫలానా హద్దులు కలిగిన భూమి యొక్క సర్వ హక్కులు పరిరక్షించబడతాయి అని అమ్మకందారు అభయపత్రాన్నే దస్తావేజు అంటారు.

ఒక అభయపత్రం స్పష్టమైనది లేదా ఊహజనితమైనది కావచ్చు.

స్పష్టమైన అభయపత్రం

ఒక వస్తువు యొక్క అమ్మకందారుడు ఆ వస్తువు యొక్క నాణ్యతకు మరియు పనితనమునకు భరోసా ఇచ్చిన కాలపరిమితిలో ఏదైనా అవాంతరం వచ్చిన యెడల ఎలాంటి నియమాలకు లోబడి ఆ వస్తువును వాపసు తీసుకోబడునో, మార్చి ఇవ్వబడునో లేదా మరమ్మత్తు చేసి ఇవ్వబడునో తెలియచెప్పే ఒక భరోసా. "అభయపత్రం"ను తరచుగా లిఖిత పూర్వక ప్రత్యేక పత్రం రూపంలో ఇస్తారు. అయినప్పటికీ, ఒక అభయపత్రం వస్తువు గురించి అమ్మకందారుడి యొక్క వివరణ మీద ఆధారపడి న్యాయపరమైన విధానం చేత కూడా ఉత్పన్నమవుతుంది, మరియు అప్పుడప్పుడు సూచించిన ఆ వస్తువు యొక్క వివరాలు ముడిసరుకు మరియు నాణ్యత, మరియు ఏదైనా వాడకూడని ముడి పదార్థం కూడా భరోసాని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక వాణిజ్య ప్రకటన ఒక ఉత్పత్తి యొక్క స్పష్టమైన అభయపత్రాలను వివరిస్తుంది; ఆ ప్రకటన కచ్చితంగా దేనినైతే వివరించిందో ఆ ఉత్పత్తి దానిని దృఢముగా నిర్ధారించాలి. ఈ కారణంగా చాలామంది ప్రకటనదారులు డిస్క్లైమర్ (క్రింద ఒక వాక్యము) ను జోడిస్తారు (ఉదాహరణకు, "అసలు రంగు/మైలేజ్(వాహనంలో ఉపయోగించిన చమురు ఎంత దూరం వస్తుంది అని తెలియచేయుట)/ఫలితాలు మారవచ్చు", లేదా "అసలైన ఆకారాన్ని చూపకపోవుట"). సాధారణంగా, లిఖితపూర్వక అభయపత్రాలు "ముడిసరుకు మరియు తయారీదారుడి" పొరపాట్లకు వ్యతిరేకంగా వస్తువు నాణ్యత గురించి కొనుగోలుదారుడికి భరోసా ఇస్తాయి. అభయ పత్రాన్ని తయారు చేయుటకు వాస్తవంగా అమ్మకందారుడి ఉద్దేశం లేకపోతే ఒక స్పష్టమైన అభయ పత్రముని మౌఖికంగా తయారు చేయవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రములలో, ఒక అమ్మకందారుడు ఒక వస్తువు గురించి అతని అభిప్రాయ వివరణలను వ్యక్తపరచుటకు అనుమతిస్తారు, దీనిని పఫరీ (ఒక వస్తువు నాణ్యత వర్ణించు వివరణలు) అని అంటారు, బేరం ఆధారంగా కొనుగోలుదారుడు దానిని నమ్మలేడు. ఉదాహరణకు, "ఈ వేట కత్తి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది" ఇది కేవలం పఫరి, కానీ "ఈ వేట కత్తిని అసలు పదును పెట్టాల్సిన అవసరం లేదు" ఆ కత్తిని అది తయారుచేసిన పనికి మాత్రమే వాడినన్ని రోజులు దీనిని స్పష్టమైన అభయపత్రంగా ఆపాదించవచ్చు. కొన్ని దేశాలలో (ఉదాహరణకు UK, కెనడా, మరియు తైవాన్), వాణిజ్య ప్రకటనదారులు చేసే అవాస్తవ లేదా నిర్ధారణ లేని వివరణలను ఎదుర్కొనుటకు వినియోగదారుడి రక్షణ చట్టములు ఉన్నాయి.

ఒక పేరున్న వ్యాపారచిహ్నం దుర్వినియోగం చేయటం కూడా స్పష్టమైన అభయపత్రాన్ని సృష్టిస్తుంది, ఇలాంటి అతిక్రమణను "పాసింగ్ ఆఫ్(అనగా ఒక వ్యక్తిని అవాస్తవ విజ్ఞాపనలతో నమ్మించుట) అని పిలుస్తారు; సరకు యొక్క వనరులు మరియు నాణ్యతలు అవాస్తవంగా ఉంటాయి.

అభయపత్రం అమలు

కొన్ని ఉత్పత్తులు కొన్ని మాసాలకు, సంవత్సరాలకు లేదా జీవితకాలానికి మరమ్మతు లేదా వస్తు మార్పిడి అనే అభయపత్రం యొక్క నమ్మకంతో వస్తాయి. సిద్ధాంతంలో, ఒక వ్యక్తి మరమ్మత్తు కోసం ఒక ఉత్పత్తిని "పంపిణీదారుడికి" వాపసు చేయగలడు, కానీ అలాంటి ఉత్పత్తులను అమ్మే చాలా దుకాణాలు మరియు తయారీదారులు కూడా మరమ్మత్తుల వసతి కల్పించుటలో వెనుకబడి ఉన్నారు. చాలామంది ప్రజలు క్రొత్త కార్లను కొనుగోలు చేయటానికి కారు వ్యాపారులు మరమ్మత్తుల దుకాణాలను కూడా కలిగి ఉండటం కూడా ఒక ముఖ్య కారణం. 1990లలో కంప్యూటర్ వ్యాపారులు మరియు వినియోగదారుల-విద్యుత్పరికరాల వ్యాపారులు ఇటువంటి దుకాణాలు కలిగి ఉండేవారు, కానీ వాటిలో చాలా వరకు ఇప్పుడు కనుమరుగైయ్యాయి. వాడుకలో, ఒక వస్తువు ఒక మాసంలోనే పాడయితే దుకాణం యొక్క భరోసా మీద దానిని మార్చుకోవచ్చును; లేదా ఒక వస్తువు దుకాణం ఇచ్చిన కాలపరిమితి యొక్క భరోసా మురిగిపోయిన తరువాత, తయారీదారుడి కాలపరిమితికి ముందు విఫలం అయితే ఆ వస్తువు తయారీదారుడి వద్ద మార్చుకొనవచ్చు-దుకాణం యొక్క భరోసా మరియు తయారీదారుడి యొక్క అభయపత్రం పరస్పరం భిన్నమైనవి. ఒకప్పుడు క్షవరం చేసుకునే విద్యుత్పరికరం లేదా దీపాలు మరియు టోస్టర్ (రొట్టె ముక్కలను కాల్చుకునే యంత్రం) వంటి చిన్న చిన్న విద్యుత్ ఉపకరణాల కొరకు అభయపత్ర సేవలను అందించుటకు మరమ్మత్తుల దుకాణాలు ఉండేవి; కానీ 1980లలో చాలావరకు తయారీదారుడికి ఉత్తరాల ద్వారా అభయపత్రం ఉన్న ఉత్పత్తులని మార్చుకొనుట జరుగుతూ ఉండేది; కానీ అదికూడా 1990లలో కనుమరుగు అయిపోయింది.[citation needed]

కొన్ని మినహాయింపులు: కొన్ని సంస్థలు-ముఖ్యంగా తోషిబా—అభయపత్రం క్రింద నిజంగా వస్తువులకు మరమత్తు చేస్తాయి. థామస్ ఫ్రైడ్మాన్ తోషిబా అభయపత్రం యొక్క విధానాన్ని UPS ద్వారా ఎలా సమకూర్చుతుందో తెలియ చెప్పారు; తోషిబా వెబ్ సైట్ ద్వారా ఒక కంప్యూటర్ ను కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడు UPS ద్వారా తోషిబాకు సరిగా పనిచేయని ఆ కంప్యూటర్ ను పంపగలడు. వాస్తవంగా అది ఎప్పటికీ తోషిబాకు చేరదు. బదులుగా UPS తన స్వంత తోషిబా-కంప్యూటర్ మరమ్మత్తు దుకాణాన్ని నడుపుతుంది. UPS వినియోగదారుడి కంప్యూటర్ ను అందుకున్నప్పుడు, అది దానిని UPS దుకాణానికి చేర్చుతుంది అక్కడే అది మరమ్మత్తు చేయబడి, పరీక్షించి తిరిగి వినియోగదారుడికి ముందుగా చెప్పబడిన నియమిత కాలంలోనే తిరిగి ఇవ్వబడుతుంది. సాధారణంగా, వినియోగదారుడి యొక్క సాఫ్ట్వేర్ మరియు సమాచారము సంరక్షించబడుతుంది.[1]

ఊహాజనిత అభయపత్రం


ఒక ఉహాజనితమైన అభయపత్రం అమ్మకందారుడు వెల్లడించే వివరణలకి బదులు లావాదేవీ యొక్క స్వభావం మీద, కొనుగోలుదారుడి యొక్క సహజసిద్ధ అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.

స్పష్టంగా పేరుచే హక్కు వదులుకోకుంటే, లేదా అమ్మకమును "ఉన్న స్థితి" అనే పదముతో లేదా "అన్ని లోపాలతో" అని గుర్తిస్తే వర్తకం యొక్క అభయపత్రం ఊహజనితమైనది. "అమ్మకం" జరగాలంటే, సరుకు ఒక సాధారణ కొనుగోలుదారుడి యొక్క నమ్మకాలను నిర్ధారించాలి అంటే అవి ఎటువంటివి అని చెప్పారో అలాగే ఉండాలి. ఉదాహరణకు, ఒక పండు చూచుటకు మరియు వాసనకు మంచిగా ఉంటుంది, కానీ అంతర్గతంగా లోపాలు ఉండవచ్చు, ఒకవేళ ఆ పండు యొక్క నాణ్యత "వాణిజ్యంలో సాధారణంగా నడిచే నాణ్యత" యొక్క విధానాలతో ఏకీభవించక పోయినా దీని వలన ఊహాజనిత అభయపత్రంకి భంగం వాటిల్లుతుంది. మసాచూసెట్స్ లో వినియోగదారుడి పరిరక్షణ చట్టంలో, వినియోగదారులకు అమ్మిన గృహొపకరణాలు మొదలైన సరుకుల విషయంలో ఈ విధమైన అభయపత్రాన్ని పరిత్యజించటం చట్టవిరుద్ధం.

ఒక కొనుగోలుదారుడు ఒక ప్రత్యేకమైన పనికి సరిపడే సరకుని ఎంచుకొనుటకు అమ్మకందారుడి మీద ఆధార పడినప్పుడు ఒక నిర్దిష్టమైన కారణం కొరకు అభయపత్రం యొక్క సామర్ధ్యం ఊహాజనితం. ఉదాహరణకు ఒక కొనుగోలుదారుడు మంచు చక్రాల కొనుగోలు కొరకు ఒక మరమ్మత్తుదారుడిని కోరినప్పుడు ఆ కొనుగోలుదారుడు మంచులో ఉపయోగించకూడని చక్రాలను అతని నుండి పొందితే ఈ అభయపత్రానికి భంగం వాటిల్లుతుంది. తద్వారా అయోగ్యమైన వాటిలో ఉండే సమస్యను కొనుగోలుదారుడికే తిరిగి పంపి ఈ ఊహాజనిత అభయపత్రాన్ని కూడా స్పష్టంగా పేరుతో పరిత్యజించవచ్చు.

జీవితకాల అభయపత్రం

ఒక జీవిత కాల అభయపత్రం వినియోగదారుడి జీవిత కాలానికి సంబంధం లేకుండా వ్యాపార సముదాయంలో వస్తువు యొక్క జీవిత కాలానికి సంబంధించింది[2] (కచ్చితమైన అర్ధం అభయపత్రం ప్రతిలో విపులంగా నిర్వచింపబడాలి). ఒకవేళ ఒక వస్తువు యొక్క ఉత్పత్తి నిలిచిపోతే మరియు అది అందుబాటులో లేకుండా పోతే, అభయపత్రం ఒక పరిమిత కాలంలో ముగిసిపోతుంది. ఉదాహరణకు, సిస్కో లిమిటెడ్ జీవిత కాల అభయపత్రం ఒక ఉత్పత్తి నిలిచిపోయిన 5 సంవత్సరాల తరువాత ముగిసిపోతుంది.[3]

పాత ఉత్పత్తుల అభయపత్రం

21 శతాబ్దపు ఆరంభం నుండి మొత్తం వ్యాపార సముదాయంలో (నూతన+పాత) భాగంగా ఉపయోగించిన/పాత ఉత్పత్తుల వ్యాపారం యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంది. పాత ఉత్పత్తులలో అంతకు ముందు వేరొక వినియోగదారుడు ఉపయోగించిన ఉత్పత్తులు ఉంటాయి. వినియోగదారులు ఒక్కోసారి వారి వస్తువులు మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మార్చివేస్తూ ఉంటారు. కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ల వంటి ఉపకరణాలకు తక్కువ జీవిత కాలం ఉంటుంది మరియు ప్రతి రోజు క్రొత్త క్రొత్త సాంకేతికతలు విడుదల అవుతూ ఉంటాయి. ఫలితంగా పాత ఉత్పత్తుల వ్యాపారమును పెంచుతున్న క్రొత్త ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్టుతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, 1990 మరియు 2005 మధ్య ఫ్రాన్సులో ఉపయోగించిన (పాత) కార్ల యొక్క అమ్మకాలు 4.7 మిలియన్ల నుండి 5.4 మిలియన్లకు పెరిగాయి, అదే సమయంలో క్రొత్త కార్ల అమ్మకాలు 2.3 మిలియన్ల నుండి 2.07 మిలియన్లకు పడిపోయాయి.

అభయపత్ర ద్రోహం

సరుకు అనుకున్నట్లు లేనప్పుడు అమ్మేటప్పుడు లోపాలు స్పష్టంగా ఉన్నా లేకున్నా, ఇచ్చిన భరోసా పూర్తిచేయలేనప్పుడు ఒక అభయపత్రానికి భంగం వాటిల్లుతుంది. అమ్మకందారుడు సరి అయిన కాలములో వాపసు తీసుకుని లేదా మార్చి ఇచ్చి అభయ పత్రాన్ని గౌరవించాలి. ఒకవేళ అమ్మకందారుడు అభయపత్రానికి గౌరవం ఇవ్వకుండా తిరస్కరిస్తే వస్తువు యొక్క అమ్మకం పరిమితుల చట్టమునకు లోబడి ఒక న్యాయస్థానంలో అభయపత్రం ద్రోహం క్రింద ఫిర్యాదు చేయవచ్చు. పొడిగించిన సమయానికి ఒక అమ్మకందారుడు కానీ లేదా తయారీదారుడు సరుకు మార్చి ఇచ్చుటకు లేదా మరమ్మత్తు చేసి ఇచ్చే అదనపు సేవ చేయు ఒప్పందంలో విఫలం అయ్యే సందర్భంలో "పొడిగించిన అభయపత్రం" ఉన్నప్పుడు తరచుగా ఈ సమయాన్ని పరిగణలోకి తీసుకోరు. అయినప్పటికీ, ఒకవేళ సరకులో అమ్మకం జరిగే సమయంలో లోపాలు ఉన్నా, మరియు సంబంధిత పరిమితి చట్టం యొక్క కాలం ముగిసిపోకుండా ఉన్నా, ఆ సమయంలో "పొడిగించిన అభయపత్రం" యొక్క కాలపరిమితి లేదా ఉనికి అప్రస్తుతం: ప్రస్తుత అభయపత్రం యొక్క ద్రోహానికి అమ్మకందారుడు బాధ్యుడు అవుతాడు.

సంబంధంలేని ముగిసిపోయిన పొడిగించిన అభయపత్రంతో ప్రస్తుత అభయపత్రం ద్రోహాన్ని తప్పించుటకు ప్రయత్నం చేయటం అనేది అన్యాయమైన మరియు మోసపూరితమైన వ్యాపార విధానం (ఒక చట్టపరమైన మోసం). ఒక పరిమిత చట్టం మీద ఒక ఒప్పంద పోరాటం ఒక మోసపూరితమైన పోరాటం కన్నా చిన్నది (లేదా పెద్దది) కావచ్చు, మరియు కొన్ని అభయపత్ర ద్రోహాల వ్యాజ్యాలు ఆలస్యంగా నమోదు చేసి మరియు మోసపూరితమైన లేదా ఏ సంబంధిత మోసానికి సంబంధించిందో వర్గీకరించబడతాయి.

ఉదాహరణకు, ఒక వినియోగదారుడు ఒక వస్తువుని కొని దానిని డబ్బాలో నుండి బయటకు తీయక ముందే విరిగినట్లు కానీ లేదా కొన్ని భాగాలు లేనట్లుగా గాని గుర్తించినప్పుడు ఇది వర్తిస్తుంది. ఇది ఒక లోపపూరితమైన ఉత్పత్తి మరియు అమ్మకందారుడి "తిరిగి తీసుకునే విధానం" ఒకవేళ "పొడిగించిన అభయపత్రం" యొక్క కాలము కూడా మురిగిపోయిన తరువాత వరకు కూడా లోపాన్ని కనుగొనలేకపోతే (పాత లేదా ఒక వస్తువుని ఈ పరిస్థితిలో ఉన్నా అలాగే కొనుగోలు జరిగే అమ్మకాలలో పరిమిత మినహాయింపులతో) అని ప్రకటిస్తున్నా సంబంధం లేకుండా డబ్బు తిరిగి పొందుటకు లేదా మార్చుకొనుటకు ఆ వస్తువును అమ్మకందారుడికి తిరిగి ఇచ్చివేయవచ్చు. అదేవిధంగా, ఒకవేళ ఆ ఉత్పత్తి ముందుగానే విఫలం అయితే, అది అమ్మకం జరిగేటప్పుడే లోపపూరితంగా ఉండవచ్చు మరియు దానిని మార్చుకొనుట గాని తిరిగి ఇచ్చివేయుట గాని చేయగలరు. ఒకవేళ అమ్మకందారుడు అభయ పత్రాన్ని గౌరవించని యెడల న్యాయస్థానంలో ఒప్పంద వ్యాజ్యం మొదలు పెట్టవచ్చు.

ఇది కూడా చూడండి ఉత్పత్తి బాధ్యత , తయారీ లోపం వ్యక్తిగత గాయానికి కారణం అయితే అభయపత్రం యొక్క కాలం మించి పోయినా కూడా నిర్లక్ష్య రూపకల్పన లేదా తయారీ ఖచ్చితమైన బాధ్యత వహించాలి.

U.S.A & కెనడా

మూస:Howto చిల్లర వ్యాపారంలో, ఒక అభయపత్రం, (లేదా "పొడిగింపబడిన అభయ పత్రం") సాధారణంగా నమ్మకమైన ఉత్పత్తిని సాధారణంగా ఉపయోగించే నియమాల క్రింద ఇచ్చే భరోసాని సూచిస్తుంది. దీనిని "పొడిగించబడిన" అభయపత్రం అని ఎందుకు అంటారు అంటే ఇది వస్తువు యొక్క అమ్మకం జరిగిన తేది తరువాత ఏర్పడిన లోపాలకు కూడా భరోసా ఇస్తుంది. ఒక ఉత్పత్తి యొక్క అమ్మకం జరిగిన తరువాత ఒప్పందం ఉన్న సమయం లోపల అది సరిగా పని చేయకపోతే, తయారీదారుడు కానీ లేదా పంపిణీదారుడు కానీ ఆ ఉత్పత్తిని కొనుగోలుదారుడికి మార్చి ఇవ్వటం కానీ, మరమ్మత్తు చేసి ఇవ్వటం కానీ లేదా ఖరీదు తిరిగి చెల్లించుట కానీ చెయ్యాలి. ఇలాంటి అభయపత్రాలు సాధారణంగా ఏదైనా యాంత్రిక వైఫల్యం కాకుండా "సహజ సిద్ధంగా సంభవించే ఘటనలు", యజమాని యొక్క దుర్వినియోగం, ఇష్టపూర్వక విధ్వంసం, వాణిజ్యపరమైన ఉపయోగం ఇలా వ్యక్తిగతమైన దుర్వినియోగం చేస్తే అలాంటి వాటికి భరోసా ఇవ్వదు. చాలా రకాల అభయపత్రాలు వాడుతూ ఉండగా సహజంగా పాడయ్యేవి, మరియు ఒక సమయానికి మార్చవలసిన వస్తువులకు మినహాయింపుని ఇస్తాయి (ఉదాహరణకు వాహనానికి టైర్లు మరియు చమురు వంటివి). పొడిగించబడిన అభయ పత్రం కొనుగోలు ఖరీదుని పరిధిలోకి తీసుకుంటుంది, లేదా సమయానుకూలంగా అదనపు రుసుముని అధికం చేస్తుంది, మరియు వార్షిక విస్తరణలు ఇంకా పెద్ద ఒడంబడికలు ఉత్పత్తి యొక్క "జీవిత కాలాలు" వంటి వాటిని కూడా తన పరిధిలోకి తీసుకుంటుంది.

 • ఒక తయారీదారుడు లేదా పంపిణీదారుడు "అభయపత్రం పరిధి"లో ఉన్న ఇంకా ఏవైనా ఉత్పత్తుల భీమాకు సమర్ధవంతమైన సేవలకు లేదా వస్తువు ఖరీదుని తిరిగి ఇచ్చుటకు కొంత మూలధనమును వారి యొక్క ఆదాయ వ్యయ పట్టికలో పెట్టి ఉంచాలి.

పరోక్ష అభయపత్ర సేవలను అందించు సంస్థలు అనేక రకాల ఉత్పత్తులకి ఆ ఉత్పత్తుల యొక్క భీమా ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని కోరుకున్న వారికి "పొడిగించబడిన అభయ పత్రాలు" అందిస్తున్నాయి. చిన్న తరహా, స్వయం-భీమా వ్యాపార సంస్థలు అదే విధంగా బెస్ట్ బై మరియు సర్క్యూట్ సిటి వంటి పెద్ద వ్యాపార సంస్థల ద్వారా పరోక్ష భాగస్వాముల విక్రయం జరుగుతుంది. ఇతర తరహా భీమాలతో, వ్యాపార సంస్థలు ఉత్పత్తులు నమ్మకమైనవి అని, అభయపత్రాల అవసరం లేదని, లేదా ఏదైనా సమస్యలు అతి తక్కువ ధరతో పరిష్కరిస్తామని జూదపు మాటలు చెప్తాయి. JTF బిజినెస్ సిస్టమ్స్ వంటి కొన్ని పరోక్ష భాగస్వామ్య సంస్థలు వాటి యొక్క సహకారాన్ని అందిస్తున్నాయి; ఈ కంపెనీలు లోపలున్న భాగాలను తొలగించి మార్చుకొనుటకు తయారీదారుడికి తిరిగి పంపుతాయి.

పొడిగించబడిన అభయపత్రాలు సాధారణంగా తయారీదారుడి ద్వారా అందించబడవు, కానీ అవి స్వతంత్ర పాలనా అధికారుల ద్వారా పొడిగించబడతాయి. వ్యాపార సంస్థ వెలుపల కొనుగోలు మరియు/లేదా సేవ పొందిన ఉత్పత్తికి భరోసా కొన్ని పరిస్థితులలో వినియోగదారుడికి లబ్ది చేకూరుస్తాయి. ఉదాహరణకు, ఒక ఆటో యొక్క అభయపత్రం కారు వ్యాపారం ద్వారా అందించబడితే, అక్కడ తరచుగా సేవలను, శ్రామికులను మరియు తక్కువ నాణ్యత కలిగిన విడిభాగాలకు తగ్గించి వాహనం యొక్క మరమ్మత్తులు తక్కువ ఖరీదుతో అందిస్తారు, అది సాధారణంగా ఒక ఉప-ఒప్పంద అభయపత్రం (తరచుగా ఒక చిల్లర వ్యాపారి నుండి తక్కువ కానుకతో). చాలా సమయాల్లో ఈ తరహా అభయపత్రాలు వలన అనుకోకుండా మరమ్మతులకి వినియోగదారుడి జేబులో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎలాంటి ఖర్చు అంటే: -అభయపత్ర ఒడంబడికలో లేని అనుకోని సేవలను అందించినప్పుడు -భీమాలో లేని విభాగాలు మరియు శ్రామిక వేతనాలు వ్యాపారాలు/అభయపత్ర నివేదన కార్యాలయాల ద్వారా డబ్బు తిరిగి చెల్లించే సౌకర్యాన్ని సమకూర్చినప్పుడు పూర్తి బాకీ చెల్లించాల్సి వచ్చినప్పుడు కొందరు యంత్ర మరమ్మత్తు చేసేవారు మరియు సేవా కేంద్రాలు వారి యొక్క సేవలను నిలిపివేయవచ్చు, లేదా చేయవలసిన మరమ్మత్తు ముందే వ్యాపారం యొక్క అభయపత్రం మురిగిపోయినా అప్పుడు ఆ కేంద్రంలో ఆ మరమ్మత్తుకు వేయవలిసిన ఖరీదు వీలుకానప్పుడు, లేదా ఆ దుకాణం యొక్క సాధారణ ఖరీదు వేయవలసి ఉంటుంది.

 • మొత్తం ఉమ్మడి ఆస్తి విలువ $4800+ ఉన్న U.S. వినియోగదారులు (స్థిర విద్యుత్ పరికరాలు, విలాస విద్యుత్ పరికరాలు, పురాతన మరియు సమీకరించిన పరికరాలు, గృహోపకరణాలు, వాహనాలు, గృహాలు మొదలైనవి) లేదా మొత్తం ఉమ్మడి గృహ ఆదాయం సంవత్సరానికి $122,000 డాలర్ల కన్నా తక్కువ ఉండే వినియోగదారులు, వారి ఉత్పత్తులు, గృహము, లేదా వాహనాల విలువను 86% వరకు పెంచుకునే వీలు ఉంటుంది మరియు ప్రభుత్వ దస్తావేజులు మరియు అభయపత్రాల భీమా చెల్లించవలసి వచ్చినప్పుడు బహుశా అవి వారి పొదుపు మొత్తాలకు మూడు వంతులు ఎక్కువ ఉండవచ్చు (విలువలో $4800 మించిన ఆస్తి మీద అభయపత్ర విస్తరణ విలువకు ప్రతిగా యోగ్యమైన సేవల విలువ మరియు మరమ్మత్తులు). ~drp.నివేదిక2007

మీ యొక్క పొడిగించిన ఆటో అభయపత్రం యొక్క నాణ్యతను నిర్ణయించుటకు భీమా సేవ ఒప్పందం యొక్క నిజమైన సాహిత్యం అన్నింటి కంటే ముఖ్యమైన కోణం. కొన్నిసార్లు టోకు ధరకే లేదా అదే ధరకు గుర్తించినప్పుడు ఒక పూర్తి భీమా పొందిన ఆటో అభయపత్రం ఏవైనా ధరలో తేడాలు ఉన్నా చెల్లుతుంది. వాస్తవ సాహిత్యము అనేది నీ వైపు నుండి వ్రాసిన ఒక ఒప్పందం మరియు ఇందులో నీ పేరు కచ్చితం గా ఉండాలి మరియు కాగితంపనిలో నీ ఉత్పత్తి యొక్క ID సంఖ్యను (PIN) లేదా వాహన ID సంఖ్య (VIN) ను కచ్చితం గా చేర్చాలి. ఇది వాస్తవ సాహిత్యము, మరియు ఏవైనా ఒప్పందాలలో ఎప్పుడూ వివిధ "ఒడంబడికలు & నియమాలు" ఉంటాయి, అందువలన సేవా ఒప్పందాలను అందించు వ్యాపార సంస్థలతో కచ్చితంగా ఉండాలి (తరచుగా ప్రస్తుత అర్జీలు అవసరం అవుతుంటాయి). ఈ తరహా అభయపత్రాలను అందించు వ్యవస్థలు ఉప-ఒప్పంద, అదే వ్యవస్థలో, చిల్లర వ్యాపార వ్యవస్థ మరియు పరోక్ష భాగస్వామ్య వ్యవస్థలకు భిన్నమైనవి, ఎందుకంటే అధిక దుకాణ ఖరీదులను తగ్గించి వినియోగదారుడికి వివిధ మరమ్మత్తుదారులు దుకాణం వెలుపల మరియు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండునట్లు చేస్తుంది. భీమా ఉండే అభయపత్రాలు తరచుగా వాహనాల లేదా ఉత్పత్తుల మరమ్మత్తులకు, శ్రామిక వేతనాలకు యజమాని నుండి నామ మాత్రపు రుసుము/తీసివేయబడే రుసుము వసూలుచేసి మిగిలిన రుసుమును ఆ భీమా సంస్థలు చెల్లిస్తాయి.

అభయపత్రాల యొక్క న్యాయ సంబంధిత విషయాలు మరియు డిస్క్లైమర్లు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, సరకు యొక్క కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడి యొక్క హక్కులు మరియు నివారణలు ఆర్టికల్ 2 యొక్క యూనిఫాం కమర్షియల్ కోడ్ (UCC) ఏలుబడిలో ఉంటాయి, ఇవి రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య కొన్ని తేడాలతో అమలులో ఉంటాయి. UCC స్పష్టమైన మరియు ఉహజనిత అభయపత్రాలను రెండిటిని పాలిస్తుంది. ఇది ఇంకా అమ్మకందారుడు పరిత్వజించే కొన్ని ప్రత్యేక అభయపత్రాల మేర కూడా దృష్టి సారిస్తుంది. (ఉదాహరణకు వ్యాపారతత్వం లేదా ఒక నిర్దిష్ట కారణముకు సమర్ధత వంటి అభయపత్రాలు, "ఉన్న పరిస్థితి లోనే కొనుగోలు జరిగిన సరుకు యొక్క విషయంలో కూడా పరిత్యజించవచ్చు."

U.S.లో అభయపత్రాలు న్యాయ పరిరక్షణలో వ్రాయబడతాయి, మిగిలిన దేశాలలో అభయపత్రాలు కొన్ని ప్రత్యేక చట్టాల పాలనలో ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక దేశం యొక్క న్యాయం సరకుకు అమ్మకందారుడు 12 మాసాలకు భరోసా ఇచ్చి ఉంటే ఆ ఉత్పత్తి విఫలం అయితే ఉండే హక్కులు మరియు నివారణలు కూడా తెలియచేయాల్సి రావచ్చు. అయినప్పటికీ, U.S.లో కూడా అభయపత్రాలను మరియు అభయపత్రాలను పోలినటువంటి భరోసాలను కొనుగోలుదారుడికి తెలియచేయుటకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు, చాలా రాష్ట్రాలు కొత్త ఇంటి నిర్మాణం పై చట్టబద్ధ అభయపత్రాలను కలిగి ఉన్నాయి, మరియు పునరావృతం అయ్యే లోపాలతో ఉన్న నూతన మోటారు వాహనాలు నియంత్రించే అనేక న్యాయాలని "లెమన్ లాస్" అని పిలుస్తారు.

విజ్ఞాపనలు మరియు వారంటీలు

క్లిష్టమైన వాణిజ్య లావాదేవీలలో, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు కొన్ని ప్రత్యేక వివరణలు మరియు అభయపత్రాలు పరస్పరం తయారు చేసుకుంటారు. వాడుక భాషలో వీటిని "రెప్స్ మరియు వారెంటీస్" అని అంటారు. ఇవి ఒక భాగస్వామి వేరొక భాగస్వామికి భరోసాగా ఇచ్చే కొన్ని వివరణలు, మరియు ఆ వివరణల మీద ఆ భాగస్వామి ఆధారపడి ఉండవచ్చు. ఈ సందర్భంలో, ఒక విజ్ఞాపన సాధారణంగా ఒక వాస్తవాన్ని నిజమా కాదా అని పరిశీలించే ఒక ప్రకటన, ఉదాహరణకు "అమ్మకందారుడు ఇది ఒక క్రమమైన మరియు డెలివేర్ స్టేట్ చట్ట పరిధిలో ఉన్న వాణిజ్య సంస్థ" అని నివేదిస్తాడు. ఇక్కడ, ఒక అభయపత్రం యొక్క ప్రాధాన్యత ఒక భరోసా కన్నా ఎక్కువ కావచ్చు, ఉదాహరణకు "పంపిణీదారుడు ఈ ప్రణాళికలో పనిచేసే అందరు ఉద్యోగులు ద్రోహానికి తక్షణ ఉపశమనము పొందుటకు రహస్య ఒప్పందాలకు అధికారపత్రాలను ఇస్తాడు." ఒకవేళ వివరణలు మరియు అభయపత్రాలు కచ్చితంగా లేకపోయినా లేదా పూర్తిచేయలేకపోతే తరచుగా అనుసరించాల్సిన కొన్ని ప్రత్యేక నివారణలను మరియు పరిణామాలను తెలియచేసారు. ఉదాహరణకు, ఒక అమ్మకందారుడు అమ్మే వస్తువుకు పూర్తి యాజమాన్య బాధ్యత నివేదిస్తాడు మరియు భరోసా ఇస్తాడు, మరియు ఆ లావాదేవీతో అమ్మకందారుడి విధానాలకు చట్టపరమైన ప్రతిబంధకాలు ఏమీ ఉండవు. అమ్మకందారుడి వద్ద పూర్తి వివరాలు లేకున్నా లేదా అమ్మకాన్ని అడ్డుకునే ఏదైనా ఒప్పందం ఉన్నా దానిని వదిలి వెయ్యాలి, మరియు ఈ వాస్తవాలు కొనుగోలుదారుడి యొక్క యాజమాన్యాన్ని లేదా వ్యయాన్ని కలిగించటం మీద ప్రభావాన్ని చూపెడతాయి, కొనుగోలుదారుడుకి అమ్మకందారుడి నుండి ఉపశమనం పొందుటకు ఒప్పందం క్రింద కొన్ని నివారణ మార్గాలు ఉంటాయి. ఈ లావాదేవీల భాగస్వాములు వారికి సంబంధించిన విషయాలను పరిష్కరించుకొనుటకు ముఖ్యంగా ఈ వివరణలను మరియు అభయపత్రాలను కోరుకుంటారు. విజ్ఞాపనలను మరియు అభయపత్రాలను రూపొందించు ఈ పరిణామాల మూలంగా, భాగస్వాములు వారు చేసే వాటి మేర హద్దులో ఉంచుటకు ప్రయత్నిస్తారు. ఈ రెండు విషయాల అభిప్రాయాల మధ్య ఉన్న ఉద్రిక్తత భాగస్వాముల మధ్య ఒప్పందాలకు సంబంధించి ఒడంబడికలు మరియు నియమాల రాజీలను రూపొందించుటకు సహాయపడుతుంది.

కారు అభయపత్రం

ఒక కారుకి అభయపత్రం అత్యల్పంగా 1 సంవత్సరం, సాధారణంగా 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. అదే సమయంలో కొందరు కార్ల తయారీదారులు 10 సంవత్సరాల వరకు కూడా ఇస్తారు. క్రేట్ ఇంజిన్ తయారీదారులు కూడా తయారీదారుల మరియు తయారీదనం ఆధారంగా అభయ పత్రాలు ఇస్తారు.

కొన్ని సంస్థలు 12 సంవత్సరాల పాత వాహనాలకు కూడా పొడిగించిన అభయ పత్రాలు లేదా వినియోగించిన కారు అభయపత్రాలు అందిస్తున్నాయి. పొడిగించిన అభయపత్రం అను పదం. తయారీ లేని వాహనాల ఆధారిత అభయపత్రాలను సాంకేతికంగా మోటారు వాహనాల సేవా ఒప్పందాలు లేదా సేవా ఒప్పందాలు అని పిలుస్తారు.

గృహ అభయపత్రం

ఒక గృహ అభయపత్రం గృహం యొక్క, ఉపకరణాల మరమ్మత్తుల అధిక ధరలకు వ్యతిరేకంగా గృహాలకు, గృహాల సముదాయాలకు, ఉమ్మడి గృహాలకు, చలన గృహాలకు మరియు నూతనంగా నిర్మించిన భవనాలకు భీమాను అందిస్తూ రక్షిస్తుంది. భీమా ఉన్న ఉపకరణాలకు చలువ యంత్రాలకు లేదా కొలిమి వంటి యంత్ర పరికరాలకు ఏదైనా సమస్య సంభవించినపుడు, దీనికి సంబంధించిన సాంకేతిక నిపుణుడు దాన్ని మరమ్మత్తు చేసి లేదా మార్చి ఇస్తాడు. గృహం యొక్క యజమాని ఒక సేవ పిలుపునకు మాత్రమే ఖరీదు చెల్లిస్తాడు, మరియు ఆ గృహ అభయపత్రం ఇచ్చిన సంస్థ భీమా ఉన్నా వస్తువు యొక్క మరమ్మత్తుకు లేదా మార్చి ఇచ్చినందుకు ఖరీదు చెల్లిస్తుంది.

వీటిని కూడా చూడండి

 • అభయపత్ర సుంకం చెల్లింపు
 • వ్యాపార చట్టం
 • వినియోగదారుడి రక్షణ
 • డ్యూ డిలిజెన్స్ వివరణలు మరియు వారంటీలు
 • పొడిగించిన అభయ పత్రం వినియోగదారుడికి అందిస్తున్న ఒక అధిక లేదా పొడిగింపబడిన అభయపత్రం
 • మగ్నసన్-మోస అభయపత్ర చట్టం (USA) అభయపత్రం ఉన్న వస్తువులో మార్పులపై ఆధారపడి కాలం చెల్లిపోయిన అభయపత్రాలకు లేదా నిరాకరించబడిన వాటికి రక్షణ
 • నమ్మకం (భరోసా)
 • భూమి యొక్క లావాదేవీలలో అభయపత్ర దస్తావేజు
 • FGMW ఫైనాన్షియల్ గ్లోబల్ మానిటరీ వారెంటీ

సూచనలు

 1. ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్: 21 శతాబ్దం యొక్క ఒక సంక్షిప్త చరిత్ర. ఫ్రైడ్మాన్, థామస్, ఫర్రార్, స్ట్రాస్, రీస్, మరియు గిరాక్స్, 2005.
 2. USA Today. 2001-01-18 http://www.usatoday.com/money/perfi/columnist/lamb/0004.htm. Retrieved 2010-05-27. Missing or empty |title= (help)
 3. "Cisco Limited Lifetime Hardware Warranty Terms". Retrieved 2008-09-10.

బాహ్య లింకులు

yi:ערבות