అభిమానవంతులు

From tewiki
Jump to navigation Jump to search
అభిమానవంతులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రామిరెడ్డి
నిర్మాణం బి.నరసింహారావు
తారాగణం కృష్ణంరాజు,
శారద
నిర్మాణ సంస్థ శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్
భాష తెలుగు

అభిమానవంతులు 1973 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ పతాకంపై ఎం. రామకృష్ణారెడ్డి, బి.నరసింహారావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, శారద ప్రధాన తారాగనంతో నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.పి. కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]

కథ

సీత (శారద) ధనవంతుడు, గర్విష్టి అయిన వ్యాపారవేత్త రాఘవరావు (ఎస్.వి.రంగారావు) కుమార్తె. అతను సమాజంలో డబ్బు, వ్యక్తి హోదాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అనాథ, పేదవాడు అయిన రాము (కృష్ణరాజు) తో సీత ప్రేమలో పడుతుంది. సీత తండ్రి రాఘవ రావు సీత, రాముల వివాహాన్ని నిర్వహించడానికి అంగీకరించడు. కానీ సీత అతన్ని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. ఆమె తల్లి అన్నపూర్ణ (అంజలి దేవి) అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది. అయితే రాఘవరావు తన కుమార్తెను అంగీకరించే విషయం ఈ సినిమా కథాంశం.

తారాగణం

సాంకేతిక వర్గం

పాటలు[2]

  1. ఉయ్యాల జంపాల ఊగరా ఊగరా అందాల బాబు - పి.సుశీల - రచన: దాశరథి
  2. ఎప్పటివలె కాదురా నా స్వామి ఎప్పటివలె - వాణీ జయరామ్ - రచన: డా.సినారె
  3. ఓ మనసు దోచిన చెలికాడా మమత పెంచినచినవాడా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరథి
  4. ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం - పి.సుశీల - రచన: డా.సినారె
  5. చేయి గలిపి మనసు నిలిపి చేలు - పి.సుశీల, ఎస్.పి.బాలు,నవకాంత్,కౌసల్య బృందం: రచన: కొసరాజు

మూలాలు

  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అభిమానవంతులు - 1973". అభిమానవంతులు - 1973. Retrieved 2020-08-10.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు