"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అభిలాష (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
అభిలాష
(1983 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం ఎ.కోదండరామరెడ్డి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ యొక్క అభిలాష నవల ఆదారంగా నిర్మింపబడిన చిత్రం. చిరంజీవి సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది. కె.యస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించాడు. ఐపీసీ 302 ని శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తూ కథానాయకుడు పడ్డ ప్రయత్నం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇదే సినిమా తమిళంలో కూడా పునర్నిర్మించారు.

కథ

లాయరుగా పెద్దగా ప్రాక్టీసులేని చిరంజీవి (చిరంజీవి) తమ రూమ్మేటుతో కలిసి ఓ గదిలో నివసిస్తూ ఉంటాడు. తని తండ్రికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడగని ఐపీసీ 302 ని భారతీయ శిక్షాస్మృతి నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంటాడు.

పాటలు