"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమృతాంజనం

From tewiki
Jump to navigation Jump to search
అమృతాంజనం
250px
అమృతాంజన్ నొప్పి నివారణి ఔషధ తైలం
రకంతలనొప్పి నివారిణి
ఆవిష్కర్తకాశీనాథుని నాగేశ్వరరావు
ప్రారంభ తేదీ1893 (1893)
కంపెనీఅమృతాంజన్ హెల్త్ కేర్
లభ్యతఅందుబాటులో ఉంది
ప్రస్తుత సరఫరాదారుఅమృతాంజన్ హెల్త్‌కేర్

అమృతాంజనం (ఆంగ్లం: Amrutanjan) అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది.[1][1]

పేరు

అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది.

చరిత్ర

అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు.[2] ఈ ఔషధం తో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది.[3]

వైద్యంలో ఉపయోగాలు

ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు.

హోల్డింగ్ కంపెనీ

ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్ కు చెందినది. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.

మూలాలు

ఇతర లింకులు