అమ్మాయికి మొగుడు మామకు యముడు

From tewiki
Jump to navigation Jump to search
అమ్మాయికి మొగుడు మామకు యముడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం అమృతం
నిర్మాణం మురహరి సెల్వం
తారాగణం కృష్ణ,
రజనీ శర్మ,
సత్యనారాయణ,
రాజ్యలక్ష్మి
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ పూంపుహార్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

చిత్రకథ

ఆ వూరి జమీందారు దానశీలి, ధర్మాత్ముడు అని పేరుగాంచాడు. అయితే నిజానికి అతడు పరమ దుర్మార్గుడు, దయాదాక్షిణ్యం లేనివాడు. తన మార్గానికి అడ్డువచ్చేవారిని వదల్చుకోవడానికి వారిని చంపడానికైనా వెనకాడడు. ఈ జమీందారు నిజస్వరూపం తెలుసుకున్న ఒక స్త్రీని హత్య చేస్తాడు. ప్రమాదవశాత్తు ఆమె మరణించిందని లోకాన్ని నమ్మిస్తాడు. కాని ఆ దృశ్యం కళ్ళారా చూసిన ఆమె కుమారుడు జమీందారుపై కత్తికడతాడు. తాను చూసిన నిజాన్ని కన్నతండ్రి కూడా నమ్మకపోవడంతో ఇంటినుండి ఆ కుర్రాడు పారిపోతాడు. పట్నం పోయి పెద్ద చదువులు చదివి, జమీందారుకు కార్యదర్శిగా తిరిగి ఊరికి వస్తాడు అతడు. జమీందారు నైజాన్ని బయటపెట్టాలని సంకల్పించుకున్న ఆ యువకుడు జమీందారు కూతురుతో స్నేహం పెంచుకుంటాడు. ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. గత్యంతరం లేక జమీందారు తన కూతురుని అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అప్పటి నుండి ఆ యువకుడు అమ్మాయికి మొగుడు మామకు యముడిగా తయారవుతాడు. మామ అకృత్యాలను అల్లుడు ఎలా బయట పెడతాడు అనేది తర్వాత జరిగే సంఘటనల స్వరూపం.