"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమ్మోనియం సైనైడ్

From tewiki
Jump to navigation Jump to search
అమ్మోనియం సైనైడ్
Ammonium cyanide.png
Space-filling model of the ammonium cation
Space-filling model of the cyanide anion
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12211-52-8]
పబ్ కెమ్ 159440
SMILES [C-]#N.[NH4+]
ధర్మములు
NH4CN
మోలార్ ద్రవ్యరాశి 44.0559 g/mol
స్వరూపం colourless crystalline solid
సాంద్రత 1.02 g/cm3
బాష్పీభవన స్థానం 36 °C (97 °F; 309 K)
very soluble
ద్రావణీయత very soluble in alcohol
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium cyanide
Potassium cyanide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం సైనైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం. ఇది అస్థిరమైన అకర్బన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా NH4CN.

భౌతిక ధర్మాలు

అమ్మోనియం సైనైడ్ ఒక రంగులేని చతుర్క్కోణ స్పటిక ఘన పదార్థం[1]. ఈ సంయోగ పదార్థం యొక్క అణుభారం 44.055 గ్రాములు/మోల్[2]. అమ్మోనియం సైనైడ్ సాంద్రత 1.02 గ్రాములు/సెం.మీ3. ఈ సంయోగ పదార్థం యొక్క భాస్పిభవన ఉష్ణోగ్రత 36 °C. అమ్మోనియం సైనైడ్‌నీటిలో మరియు ఆల్కహాల్‌లో కరుగుతుంది.

రసాయన చర్యలు

అమ్మోనియం సైనైడ్‌ వియోగం చెందడం వలన అమ్మోనియా మరియు హైడ్రోజన్ సైనైడ్ ఏర్పడును. వియోగ ఫలితంగా తరచుగా నల్లని హైడ్రోజన్ సైనైడ్ పాలిమర్ ఏర్పడును.

NH4CN → NH3 + HCN

అమ్మోనియం సైనైడ్‌ ద్రావణం లోహ లవణాలతో చర్య వలన ఉభయ వియోగం చెందును. గ్లైఅక్షల్(glyoxal)తో చర్య వలన అమినోఅసిటిక్ ఆమ్లాన్ని(glycine)ఏర్పరచును.

NH4CN + (CHO)2 → NH2CH2COOH + HCN

అలాగే కిటోన్సుతో చర్య ఫలితంగా అమినో నైట్రైల్స్(aminonitriles)ఏర్పరచును.

NH4CN + CH3COCH3 → NH2CH2CH2CH2CN + H2O

ఉత్పత్తి

తక్కువ ఉష్ణోగ్రత వద్ద సజల అమ్మోనియాలో హైడ్రోజన్ సైనైడ్‌ను బబ్లింగ్ చెయ్యడం ద్వారా అమ్మోనియం సైనైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు.

HCN + NH3(aq) → NH4CN(aq)

కాల్షియం సైనైడ్ తో అమ్మోనియం కార్బోనేట్ రసాయనిక చర్య జరిపిన అమ్మోనియం సైనైడ్ఏర్పడును.

Ca(CN)2 + (NH4)2CO3 → 2 NH4CN + CaCO3

పొడి (dry)స్థితిలో ఉన్న పొటాషియం సైనైడ్ లేదా పొటాషియం పెర్రో సైనైడ్ , మరియు అమోనియం క్లోరైడ్ మిశ్రమాన్ని వేడి చేసి, ఆవిరి రూపంలో వెలువడిన అమ్మోనియం సైనైడ్‌ను స్పటికాలుగా మారునట్లు చల్లార్చటం ద్వారా కూడాతయారు చెయ్య వచ్చును.

KCN + NH4Cl → NH4CN + KCl

విష స్వభావం

అమ్మోనియం సైనైడ్‌ ద్రవంగా లేదా ఘన పదార్థంగా అత్యంత విషకారి.జీర్ణాశయంలో చేరిన మరణం సంభవించును. ఘన రూప అమ్మోనియం సైనైడ్ ప్రభావానికి గురైన ఇది అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ సైనైడ్,మరియు అమ్మోనియాగా విఘటన చెందటం వలన చాలా ప్రమాదకరం.

రసాయన విశ్లేషణ

అమ్మోనియం సైనైడ్‌లో ఉన్న మూలకాల నిష్పతి :హైడ్రోజన్( H): 9.15%,కార్బన్(C): 27.23%, నత్రజని(N): 63.55%.

మూలాలు