అర్థపంచకము

From tewiki
(Redirected from అర్థము)
Jump to navigation Jump to search

అర్థపంచకము నారాయణ పరివ్రాట్కృత మగు గ్రంథము, పంచవిషయపద్ధతిని దెలుపును.[1]

పంచ ప్రధాన విషయములు

పంచప్రధాన విషయములు ఐదు అవి: 1. జీవము, 2. ఈశ్వరుడు, 3. ఉపాయము, 4. ఫలము లేక పురుషార్థము, 5, విరోధము.

మరల నివి యొక్కొక్కటి యైదు తెరగులుగా ఉంటాయి. అవి:

  1. నిత్య, ముక్త, కేవల, ముముక్షు, బద్ధము లనునవి జీవము లోని యైదు తెరగులు.
  2. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చలు ఈశ్వరుని యందలి పంచప్రకారములు.
  3. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తియోగ, ఆచార్యాభిమానయోగములు పంచోపాయములు.
  4. ధర్మ, అర్థ, కామ, కైవల్య, మోక్షములు పంచవిధ పురుషార్థములు.
  5. స్వస్వరూపవిరోధము, పరస్వరూపవిరోధ, ఉపాయవిరోధ, పురుషార్థవిరోధ, ప్రాప్తివిరోధములు.

వివరణ

ఉపాసన చేయువలెనన్న ముందు సౌఖ్యముగా ఉపాప్య వస్తువు యొక్క స్వరూపమును, తర్వాత ఉపాసన చేయువారి స్వరూపమును, ఉపాసన చేయు మార్గమును, ఆ ఉపాసన చేయుటచే గలుగు ఫలమును, ఉపాసన చేయుటలో గలుగు విఘ్నములను గూర్చి బాగుగా తెలిసికొనవలయును. ఈ ఐదు విషయములకే అర్థ పంచకమని పేరు. దీనిని తెలుసుకోకపోతే సాధన నెరవేరదు. అనేక లోపములు తటస్థించుచుండును. విక్షేపము చెందుటకవకాశము ఉంది.[2]

మూలాలు

  1. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart2.pdf/494
  2. కుందుర్తి వేంకటనరసయ్య (1952). అర్థపంచకము.