అలంపూర్ రోడ్ రైల్వే స్టేషన్

From tewiki
Jump to navigation Jump to search
Alampur Road Rail Station

అలంపూర్ రోడ్ రైల్వే స్టేషనుమహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల నుండి కర్నూల్కు వెళ్ళు మార్గంలో ఈ రైల్వేస్టేషను ఉంటుంది. కర్నూలు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళు మార్గంలో ఇదే మొదటి స్టేషను. 44 వ జాతీయ రహదారిపై గల అలంపూర్ చౌరస్తా నుండి అలంపూర్కు వెళ్ళు మార్గంలో 5 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషను ఉంటుంది. జోగులాంబ హాల్ట్, కర్నూల్ సిటీ రైల్వే స్టేషనులను ఈ స్టేషను కలుపుతుంది. ఈ స్టేషనుకు అతి సమీప గ్రామం భైరాపూర్. అలంపూర్‌కు ఈ స్టేషనే అతి దగ్గర. కాని స్టేషనుకు రోడ్డు మార్గానికి దూరం ఉండటం, అలంపూర్ రోడ్డు స్టేషను మొత్తం సమీప రాయలసీమ ప్రాంతపు పరిశ్రమల అవసరార్థం దిగుమతి చేసే బొగ్గు డంప్ యార్డ్‌గా మారడం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. అందుకే ఇక్కడి నుండి ప్రయాణికులు ప్రయాణాలు చేయడం బహు అరుదు. అందుకే అలంపూర్‌కు వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు రహదారికి మరింత దగ్గరగా జోగులాంబ దేవత పేరు మీదుగా జోగులాంబ హాల్ట్ ఏర్పాటు చేశారు. కొత్త స్టేషను ఏర్పడ్డాకా ఈ స్టేషను‌లో రద్దీ మరింతగా తగ్గిపోయింది. ఐనా భైరాపూర్, బస్వాపూర్, ఇమాంపూర్, కాశీపూర్ తదితర సమీప గ్రామాల ప్రజలు స్థానిక ప్రాంతాలకు ఈ స్టేషను నుండి ప్రయాణాలు చేస్తుంటారు.

చిత్రమాలిక