"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్లంరాజు రంగశాయి కవి

From tewiki
Jump to navigation Jump to search
అల్లంరాజు రంగశాయి కవి
జననం1860
మరణం1936
వృత్తికవి
తల్లిదండ్రులు

అల్లంరాజు రంగశాయి కవి (1860 - 1936) ప్రముఖ తెలుగు కవి.

వీరు ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు, హరితసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తల్లి: చిన్నమాంబ, తండ్రి: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజాశ్వయుజ శుక్ల తృతీయ సౌమ్యవాసరము. నిర్యాణము: 1936. యువ సంవత్సర చైత్ర బహుళ దశమి.

రచించిన గ్రంథాలు

తెలుగు గ్రంథాలు

 • 1. శ్రీమదాంధ్రచంపూభారతము (ఆంధ్రీకరణము. 1913 ముద్రి)
 • 2. రామాయణ చంపువు
 • 3. రఘురామ శతకము.
 • 4. పరమాత్మ శతకము
 • 5. సర్వేశ్వర శతకము.
 • 6. గోవింద శతకము.
 • 7. లక్ష్మీ శతకము.
 • 8. మాధవ శతకము.[1]
 • 9. కుక్కుటలింగ శతకము.
 • 10. గోపాలస్వామి శతకము.
 • 11. మల్లికార్జున శతకము.

సంస్కృత గ్రంథాలు

 • 1. దైవస్తోత్రరత్నావళి.
 • 2. నారాయణానందలహరి.
 • 3. కవిమానసరంజని.

మూలాలు

 • అల్లంరాజు రంగశాయి కవి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 186-191.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).