అల్లం నారాయణ

From tewiki
Jump to navigation Jump to search
అల్లం నారాయణ
దస్త్రం:Allam Narayana.jpg
అల్లం నారాయణ
జననండిసెంబర్ 13, 1958
జాతీయతభారతీయుడు
వృత్తిసీనియర్‌ జర్నలిస్ట్‌, నమస్తే తెలంగాణ దినపత్రిక మాజీ ఎడిటర్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌

అల్లం నారాయణ సీనియర్‌ జర్నలిస్ట్‌, నమస్తే తెలంగాణ దినపత్రిక మాజీ ఎడిటర్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌[1].

జననం

మూడు దశాబ్దాలకుపైగా పత్రికారంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ, అల్లం నర్సయ్య బుచ్చమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని మండలం తాలుకా గాజులపల్లి గ్రామంలో 1958లో, డిసెంబర్ 13 న జన్మించారు.

చదువు - ఉద్యమం

సోవియూలజీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ. (సోషియాలజీ, 1982-84) చదివారు. 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యోగం

అల్లం నారాయణ మొదట కరీంనగర్ నుంచి వెలువడిన జీవగడ్డలో 1985-86 వరకు పనిచేశారు. అప్పట్లో ఆయన ఆ పత్రికలో రాసిన వెన్నెలకోనల్లో అనే కాలమ్‌కు విశేష పాఠక ఆదరణ లభించింది. అప్పుడే యాది మనాది, జగిత్యాల పల్లె కవితా సంకలనాలను వెలువరించారు. 1986-87 ఆంధ్రప్రభ బెంగళూరులో, 1987-2000దాకా ఆంధ్రజ్యోతి (విజయవాడ) లో చీఫ్ సబ్ / చీఫ్ రిపోర్టర్ గా, 2000-2001 ఆంధ్రా పాలిటిక్స్.కామ్ న్యూస్ ఎడిటర్ గా, 2001-2002 ప్రజాతంత్రకు అసిస్టెంట్ ఎడిటర్ గా, 2002-2010 ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ గా, 2010 నుంచి నమస్తే తెలంగాణ దినపత్రికకు వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు.

కుటుబం

భార్య: అల్లం పద్మ - టీచరు; కూతురు: రవళి - సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్; అల్లుడు: ఈర్ల అనిల్ వర్మ - సివిల్ ఇంజనీర్, మల్టీ నేషనల్ కంపెనీ; కూతురు: భావన - మెడిసిన్, హౌస్ సర్జన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ; కుమారుడు: రాహుల్ - ఇంజినీరింగ్; అన్నలు: అల్లం రాజయ్య - విరసం, సిమెంట్ కంపెని మేనేజర్ (విశ్రాంత) ; అల్లం వీరయ్య - టీచర్, పాటల రచయిత.

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి

2014 జూలై 14న తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్ గా అల్లం నారాయణ నియమితులయ్యారు.[1] జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ల మంజూరు విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి నుండి ప్రెస్ అకాడమీకి వచ్చిన రూ.20 కోట్ల నిధులతో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటుచేసి, అధ్యక్షుడి వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికాలం 2016, జూలై 13తో ముగియడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణ పదవీకాలాన్ని మరో మూడేండ్లు (2019, జూన్ 30 వరకు) పొడిగించారు.[2]

రచనలు

  1. జగిత్యాల పల్లె (కవితా సంపుటి)
  2. యాది మనాది (దీర్ఘ కవిత)
  3. ఎన్నెల కోనల్లో
  4. అల్లం కారం
  5. లైఫ్ లైన్
  6. ప్రాణహిత కాలమ్స్
  7. అయ్యంకాళి (స్వేచ్ఛానుకరణ, హైదరాబుక్ ట్రస్ట్)

మూలాలు

  1. 1.0 1.1 నమస్తే ఆంధ్ర. "ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ". namastheandhra.com. Retrieved 18 November 2016.[permanent dead link]
  2. www.namasthetelangaana.com (14 July 2016). "అల్లం నారాయణ పదవీకాలం పొడిగింపు". Retrieved 18 November 2016.