"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్లం నూనె

From tewiki
Jump to navigation Jump to search

అల్లం
Zingiber officinale - Köhler–s Medizinal-Pflanzen-146.jpg
Secure
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
Z. officinale
Binomial name
Zingiber officinale
Roscoe

మూస:Taxonbar/candidate

అల్లం
అల్లం నూనె

అల్లం నూనే ఒక ఆవశ్యక నూనె. అల్లం నూనెను ఆంగ్లంలో జింజరు ఆయిల్ అని హిందిలో అద్రక్కి తేల్ అంటారు. అల్లం అనేది నేలలో ఆడ్దంగా పెరిగే వేరు.తెలుగులో ప్రకందం అనికూడా అంటారు. ఆంగ్లంలొ రైజోమ్(Rhizome)అందురు. అల్లం నూనె ఘాటైన వాసన రుకి కల్గిన నూనె.అల్లంను మాసాలా దినుసుగా రుచికి, వాసనకు వంటల్లో ఉపయోగిస్తారు. అల్లం మరియు అల్లం నూనె వలన పలు ప్రయోజనాలు వున్నవి. అల్లం నూనెను వైద్యపరంగా, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అలాగే మందులతయారి రంగులో ఉపయోగిస్తారు. అల్లం నూనెలో మోనో మరియు సెస్కుయి టేర్పే నాయిడులు వున్నవి. అందువలన ఘాటైన వాసన కారం రుచి కల్గి వున్నది. నూనెలో నెరల్, జెరానియెల్,1,8-సినేయోల్,జింజీ బెరేన్,బీటా-బిసబోలెన్,మరియు బీటా సేసిక్యూ పెల్లాన్డ్రెన్ రసాయన సమ్మేళనాలను కలిగి వున్నది. ఆంతేకాదు బీటా పినేన్, కాంపేన్, లినలూల్, బోర్నియోల్, గామా టెర్పినోల్,నేరోల్.జెరానియోల్, మరియు జెరానైల్ ఆసిటేటులను కూడా కల్గి వున్నది.అల్లం నూనె నొప్పులనివాఱిగా పనిచేయునని . అంతేకాక రక్త ప్రసరణను మెరుగు పరచును.ఆరోమా థెరపిస్టులు అల్లం నూనెను సూథింగు మరియు వార్మింగు ఆయిల్ గా ఉపయోగిస్తారు.[1]

అల్లం మొక్క

అల్లం మొక్క ఒక ఓషది మొక్క.అల్లం మొక్క ఒక దుంప వేరు మొక్క.మొక్క యొక్క భూమిలో అడ్డంగా పెరుగు వేరునే (rhizome)అల్లంగా ఉపయోగిస్తారు.అల్లాన్ని పలువంటల్లో రుచికి, వాసనకు మరియు ఆరోగ్యపరమైన ప్రయోజనాలకై ఉపయోగిస్తారు. అల్లం మొక్క జింజీబెరేజియే కుటుంబానికి చెందిన మొక్క. అల్లం మొక్క వృక్షశాస్త్ర నామం జింజిబర్ అఫిసినేల్ (Zingiber officinale).ఇది బహువార్షిక ఓషది మొక్క.మూడు నాలుగు అడుగుల ఎత్తువరకు పెరుగును.సన్నన్ని, పొడవైన ఈటె వంటి ఆకారపు పత్రాలు వుండును.తెలుపు లేదా పసుపు రంగు పూలను పుష్పించును.భూమిలోపల లావైన వేర్లుదుంపలా అభివృద్ధి చెంది వుండును.అల్లం వేరు పై చర్మం బ్రౌన్ రంగులో వుండును.అల్లం లోని లోపల కండ పసుపు రంగులో వుండును.కొన్ని సార్లు రకాన్ని బట్టి తెల్లగా లేదా ఎర్రగా కూడా వుండును.[1]

మొక్క వ్యాప్తి

అల్లం జన్మ స్థానం తూర్పు ఆసియాలోని ఇండియా నుండి మలేసియా వరకు ఉన్న ప్రాంతాలు.కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ముఖ్యంగా చైనా,ఇండియా,గ్రీకు దేశాల్లో అల్లం యొక్క విశిష్ట తను గురించి వైద్యంలో,వంటల్లో ఉపయోగించారు. క్రీ,పూ 4వేల సంవత్సరాల నాటిదిగా భావించే సంస్కృత మహాభారతంలో అల్లం ఉపయోగించిన వంట ప్రస్తావన ఉన్నది.ఆయుర్వేద వైద్యంలో అల్లం మొక్కను ప్రముఖమైనదిగా పెర్కోన బడినది.[1]

నూనె

అల్లం నూనె లేత పసుపు రంగులో వుండి,ఘాటైన వాసన ,అల్లం రుచిని కల్గివున్నది.తాజా అల్లం నుండి ఉత్పత్తి చేసిన నూనె మంచి సువాన ఇచ్చును.[1]

నూనెలోని సమ్మేళన రసాయనాలు

అల్లం నూనెలో జింజీబెరెన్ అనే సమ్మేళన పదార్థం10-16% వరకు అల్లం మొక్క రకాన్ని బట్టి వుండును.అల్లం నూనెలో వుండు మరికొన్ని రసాయనాలు ఈ-సిట్రాల్ ,జెడ్ సిట్రాల్,కంపెన్, మరియు ఓసిమేన్.ఈ-సిట్రాల్ 16%వరకు,జెడ్ సిట్రాల్ 8*9%వరకు,కంపెన్ 7-8%వరకు వుండును.[2]అల్లం నూనెలోని మరికొన్ని అరోమాటిక్ రసాయనాలైన ఆల్ఫా పినేన్,బీటా పినెన్,జెరానియోల్,బోరానియోల్,నేరాల్,జెరానైల్ ఆసిటేట్,సిట్రాల్,బీటా బిసబోలెమ్,లినలూల్,నేరోల్,గామా టేర్పెనియోల్‌ లను కల్గివున్నది.[3]

భౌతిక గుణాలు

నూనె యొక్క భౌతిక గుణాలు[4]

వరుస సంఖ్య గుణం మితి
1 సాంద్రత25°Cవద్ద 0.871గ్రా/సెం.మీ3
2 వక్రీభవన సూచిక 1.49
3 భాష్పీభవన స్థానం 254 °C
4 flaash point 175°F

నూనె సంగ్రహణ

అల్లం నుండి నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.

అల్లం నూనె ఉపయోగాలు

  • కడుపులోని అస్వస్థను తగ్గించును. ఆహార జీర్ణానికి దోహదపడును.అంటురోగాల సంకరమణను నిరోధించును.వాంతులు/డోకులు లను తగ్గించును. శ్వాసకోశ ఇబ్బందులు తొలగించును. జలుబు,ఫ్లూ వంటి వాటిని తగ్గించును.[5]
  • వాతుహరి(వాతహరము)గా,బాక్టిరియా నాశనిగా,బాధానివారకం( దేహనొప్పి నివారణి)గా,శ్లేష్మహరి( శ్లేష్మమును తొలగించు)గా, వీర్యవృద్ధికరమైనమందుగా,యాంటి ఆక్సిడెంట్‌గా,ప్రేరకంగా,చెడకుండ కాపాడు ఔషధము(antiseptic)గా పనిచేయును.[3]

ఇవికూడా చూడండి

మూలాలు

మూస:ఆవశ్యక నూనె