"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అల్లు శిరీష్
అల్లు శిరీష్ | |
---|---|
దస్త్రం:Allu Sirish filmfare.jpg షార్జాలో జరిగిన 2013 సైమా పురస్కారాలలో అల్లు శిరీష్ | |
జననం | అల్లు శిరీష్ మే 30, 1987 [1] |
ఇతర పేర్లు | శిరీష్ |
వృత్తి | నటుడు, పత్రిక ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2013 నుండి ఇప్పటివరకు |
బంధువులు | అల్లు అరవింద్, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్ తేజ |
అల్లు శిరీష్ సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు అర్జున్ సోదరుడు. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. శిరీష్ కె. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీరంగప్రవేశం చేసాడు.
అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగా నటించాడు. తన సోదరుడు అల్లు అర్జున్ నటన, రాం చరణ్ నటన ప్రభావంతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. ఆయనకు అనేక పెద్ద బ్యానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది. కానీ వాటిని తిరస్కరించాడు. ఎందుకంటే అపుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమే. కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించుటను ఛాలెంజ్ గా తీసుకున్నాడు.[2]
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2013 | గౌరవం | అర్జున్ | తెలుగు, తమిళ్ | మొదటి సినిమా |
2013 | కొత్త జంట | శిరీష్ | తెలుగు | |
2016 | శ్రీరస్తు శుభమస్తు | సిరి | తెలుగు |