"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్వాల్ చెరువు

From tewiki
Jump to navigation Jump to search
అల్వాల్ చెరువు
View of Old Alwal lake.JPG
అల్వాల్ చెరువు
స్థానంహైదరాబాద్, తెలంగాణ
భౌగోళికాంశాలు17°30′28″N 78°30′41″E / 17.50778°N 78.51139°E / 17.50778; 78.51139Coordinates: 17°30′28″N 78°30′41″E / 17.50778°N 78.51139°E / 17.50778; 78.51139
సరస్సు రకంజలాశయం
ప్రవహించే దేశాలుభారతదేశం
స్థావరాలుసికింద్రాబాదు, హైదరాబాద్

అల్వాల్ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న చెరువు. సికింద్రాబాదుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.[1]

ప్రదేశం

ఈ చెరువు అల్వాల్ ముఖ్యప్రాంతంలో సికింద్రాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంది. ఈ రైల్వే ట్రాక్ నుండిగానీ, అల్వాల్ రైల్వే స్టేషన్ నుండిగానీ చూస్తే అందమైన అల్వాల్ చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు పక్కన రహదారి కూడా ఉంది.

వాడకం

ఈ చెరువు వివిధ రకాలుగా ఉపయోగించబడుతుంది. దీని సమీపంలో చాలా పక్షులు మరియు జంతువులు నివసిస్తుంటాయి. సాయంత్రం సమయంలో చాలామంది ఈ చెరువు దగ్గరికి వచ్చి ఆహ్లాదంగా గడిపి వెలుతుంటారు.

వినాయకచవితి సమయంలో వినాయకుడి విగ్రహాలను ఈ సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఆ సందర్భంగా చెరువు సమీపంలో ఉన్న రహదారిలో అదనపు లైట్లు మరియు అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 11 December 2017.