"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్సర్

From tewiki
Jump to navigation Jump to search

కడుపులోని ఆమ్లం పరిమాణంలో మార్పులు వచ్చినప్పుడు తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, గ్యాస్‌ ఏర్పడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఆమ్ల పరిమాణం పెరిగినా, తగ్గినా పేగుల్లో ఇబ్బందులు మొదలై పుండ్లు తయారవుతాయి.

ఇతర కారణాలు

  • హెలికోబాక్టర్‌ పైలోరీ అనే బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా అల్సర్ల సమస్య తలెత్తుతుంది.
  • కీళ్లనొప్పుల కోసం చాలాకాలంగా మందులు వాడే వారిలో అల్సర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
  • మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి కూడా అల్సర్లను తీవ్రం చేస్తాయి. అందుకే ఒత్తిడి నుంచి బయటపడడానికి యోగా, ధ్యానం చేయడం అవసరం.
  • మలబద్దకం అల్సర్లను అధికం చేస్తుంది. కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బందులు తగ్గుతాయి.

జాగ్రత్తలు

  • ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు లాలాజలం బాగా ఉత్పన్నమవుతుంది. దీనికి ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకే ఆదరాబాదరాగా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది.
  • అల్సర్‌ వల్ల కడుపులో మరీ నొప్పిగానో లేదా మంటగానో ఉన్నప్పుడు బాగా నీరు తాగాలి.
  • అల్సర్‌ ఉన్నవాళ్లు ఏదీ అతిగా ఉండకూడదు. ఉప్పు, కారం, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
  • పొగ తాగడం వల్ల పేగుల్లో ఉండే మ్యూకస్‌ పొర పలుచబడి ఆమ్లం సులభంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యం, టీ, కాఫీలు కూడా బాగా తగ్గించాలి.
  • కడుపులో మరీ మంటగా ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవచ్చు. అలాగే తేనె తీసుకోవడం ఉత్తమం.
  • కొన్ని ఆహార పదార్థాలు అల్సర్లను అధికం చేస్తాయి. అలా పడనివేవో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.

ar:قرحة da:Ulcus de:Geschwür es:Úlcera fr:Ulcère he:אולקוס it:Ulcera ja:潰瘍 lt:Opa nl:Zweer pl:Wrzód pt:Úlcera ru:Язва (заболевание) simple:Ulcer