"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అవయవ దానం
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్ళు,గుండె,కాలేయం,మూత్రపిండాలు,ఊపిరితిత్తులు,క్లోమం,పెద్ద,చిన్నపేగులు,ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది. తరచు అడుగు ప్రశ్నలు
ఎప్పుడు సేకరిస్తారు?
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.