"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అష్టకాల నరసింహరామశర్మ

From tewiki
Jump to navigation Jump to search

అష్టకాల నరసింహరామశర్మ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.[1] జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడు. అవధాని, సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత. ఇతనికి అవధాన కళాప్రపూర్ణ, సారస్వత శిరోమణి, బ్రాహ్మీ విభూషణ, కవితా సుధాకర, కవికేసరి మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇతడు తెలుగు, సంస్కృత భాషలలో అనేక గ్రంథాలను రచించాడు. ఉపాధ్యాయుడిగా ఇతని సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి 2003లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. ఇతని షష్టిపూర్తి సందర్భంగా 2010లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఇతడిని స్వర్ణకంకణంతో సత్కరించాడు. ఇతని అనుయాయులచే కనకాభిషేక, తులాభార సత్కారాలను కూడా పొందాడు.

ఇతడు తన 16వ యేట 1960లో బాసర క్షేత్రాన్ని దర్శించాడు. అప్పుడు 56రోజులపాటు ధ్యానంలో నిమగ్నం కాగా సరస్వతీదేవి కటాక్షించి తన దేవాలయాన్ని నిర్మించవలసినదిగా కోరింది. దేవి ఆదేశానుసారం ఇతడు మెదక్ జిల్లా, అనంతసాగర్ ప్రాంతంలో తన జీవితమంతా వెచ్చించి శ్రీ సరస్వతీ దేవాలయాన్ని నిర్మించాడు[2][3].

ఇతడు తన మొదటి అష్టావధానాన్ని నారాయణఖేడ్‌లో అనుకోకుండా పూర్తి చేశాడు. అప్పటి నుండి కొన్ని వందల అవధానాలను నిర్వహించాడు.

పురస్కారాలు

మూలాలు

  1. శ్రీ సరస్వతీ క్షేత్రం జాలస్థలిలో అష్టకాల నరసింహరామశర్మ వివరాలు[permanent dead link]
  2. Vidya Saraswathi Kshetram[permanent dead link]
  3. చదువులతల్లి నెలకొన్న శ్రీ సరస్వతీ క్షేత్రము, అనంతసాగర్
  4. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 6 June 2020.

ఇతర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).