ఆంగ్లో ఇండియన్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:An Anglo-Indian gathering.jpg
ఆంగ్లోఇండియన్

మూస:Ethnic group

ఆంగ్లో-ఇండియన్లు అనగా భారతీయ మరియు బ్రిటీష్ వంశావళిని సమ్మేళనంగా కలిగిన ప్రజలు.[1] ఒకప్పుడు భారతదేశంలో ఉండే బ్రిటీష్‌‌వారు ఐరోపా మరియు భారతీయ సమ్మేళన సంతతిని "యూరసియన్" అనే పేరుతో సంబోధించేవారు (cf. జార్జ్ ఓర్వెల్స్ బర్మేస్ డేస్ ).

ఆధునిక రూపంలో చెప్పాలంటే, ఆంగ్లో-ఇండియన్ సమాజం అనగా భారతదేశంలో ఉద్భవించిన ఒక విశిష్ట, చిన్న మైనారిటీ సమాజం. బ్రిటీష్ మరియు భారతీయ వంశావళిని మిశ్రమంగా కలిగిన జనాభా ఈ ఆంగ్లో-ఇండియన్ సమాజంలో ఉంటారు. వీరి స్థానిక భాష ఆంగ్లంగా ఉంటుంది. ఆంగ్లో-ఇండియన్‌కు సంబంధించిన బ్రిటీష్ వంశావళి అనేది సాధారణంగా పితృ సంబంధ వారసత్వంగా ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366(2) నిర్వచనం ప్రకారం, ఆంగ్లో-ఇండియన్ అనగా "అతని తండ్రి లేదా అతని పితృ సంబంధ పూర్వీకులు ఐరోపా సంతతివారైనప్పటికీ, వారు భారతదేశ భూభాగంలో నివసిస్తుండాలి. అలాంటి వారి సంతానంగా అతను భారతదేశ భూభాగం పరిథిలో జన్మించినవాడై ఉండాలి. అతనికి జన్మస్థానమైన భారతదేశ భూభాగంలో అతని తల్లితండ్రులు శాశ్వతంగా నివసిస్తున్నవారై ఉండాలే తప్ప తాత్కాలిక ప్రయోజనం కోసం నివసిస్తున్నవారై ఉండకూడదు".[2][3] దీన్నిబట్టి "ఆంగ్లో-ఇండియన్" అనగా పూర్తిగా యూరోపియన్ (పితృ సంబంధ) సంతతివారై ఉండి భారతీయుల్లో కలిసినవారని ఈ నిర్వచనం పేర్కొంటుంది.

దీంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీలో కిరాయి సైనికులుగా చేరడంతో పాటు తమ కుటుంబాలను కూడా తమవెంట తీసుకువచ్చిన కోరమండల్ మరియు మలబార్ తీరానికి చెందిన పురాతన పోర్చుగీస్ కాలనీల వారికి కూడా ఈ నిర్వచనం వర్తిస్తుంది.[4] అదేవిధంగా గోవాలోని మెస్టికోస్ (పోర్చుగీస్ మరియు భారతీయ సమ్మేళన సంతతి) మరియు ఇండో-ఫ్రెంచ్, మరియు ఇండో-డచ్ సంతతి ప్రజలను కూడా ఈ నిర్వచనం తనలో కలుపుకుంటుంది.[5]

స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో ఒక మైనారిటీ సమాజం రూపంలో ఆంగ్లో-ఇండియన్లు బాగా తక్కువ సంఖ్యలో ఉండేవారు, అయితే నేడు భారతదేశం లోపల మాత్రమే కాకుండా వెలుపల కూడా పెద్ద సంఖ్యలో వీరు నివసిస్తున్నారు. అయితే, వీరిలో అనేకులు యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌కు మరియు కొద్దిసంఖ్యలో కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్‌కు వలసపోవడం వల్ల భారతదేశంలో వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.[citation needed]

పరిభాష

ఆంగ్లో-ఇండియన్ అనే పదం బ్రిటన్‌లోనూ సాధారణంగా వాడుకలో ఉంది. బ్రిటీష్ సంతతివారైనప్పటికీ, భారతదేశంలో పుట్టి పెరిగిన (రుడ్‌యార్డ్ కిప్లింగ్, లేదా అన్వేషక-ప్రకృతివేత్త జిమ్ కార్బెట్లాంటి) వారిని బ్రిటన్‌లో ఆంగ్లో-ఇండియన్లుగా చెప్పడం పరిపాటి. వారి తల్లితండ్రులు భారతదేశంలోని పరిపాలన లేదా సాయుధ దళాల్లో పనిచేసినవారై ఉండడమే అందుకు కారణం;[6] "ఆంగ్లో-ఇండియన్" అనే పదాన్ని "బ్రిటీష్ నివాసి" అనే మాటకు పర్యాయపదంగానూ వాడుకలో ఉంది.

ఆంగ్ల సాహిత్యాన్ని రచించిన భారతీయ రచయితలు విశేషణం రూపంలో ఉపయోగించిన "ఇండో-ఆంగ్లియన్," అనే పదాన్ని పోలి ఉన్నప్పటికీ ఆంగ్లో-ఇండియన్ అనే పదం ఏమాత్రం తికమకకు గురిచేయదు.[7]

చరిత్ర

భారతదేశం

భారతదేశంలో నివసించే బ్రిటీష్ ప్రజల గురించి చెప్పేందుకు మొట్టమొదటగా ఆంగ్లో-ఇండియన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ రకమైన నిర్వచనం భారతీయ రాజ్యాంగంలోనూ ఉంది. అయితే ప్రజల పరిభాషలో మాత్రం, పితృ వంశం బ్రిటీష్‌గాను మరియు మాతృ వంశం భారతీయతను కలిగిన రక్తాన్ని పంచుకు పుట్టిన సంతానాన్ని గురించి చెప్పేందుకు మాత్రమే ఈ ఆంగ్లో-ఇండియన్ అనే పదం పరిమితమైంది.[6] బ్రిటీష్ మరియు భారతీయ వంశపారంపర్యత సమ్మేళనమైన సంతతిని గతంలో 'యూరసియన్స్' అని సంబోధించినప్పటికీ, ప్రస్తుతం మాత్రం సాధారణంగా 'ఆంగ్లో-ఇండియన్లు' అని పిలవడం అలవాటుగా మారింది.[8]

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పాలన సాగించిన 18వ శతాబ్దం మొత్తంమీద మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు స్థానిక భారతీయ స్త్రీలను భార్యలుగాను, వారి ద్వారా యూరసియన్ పిల్లలను కలిగి ఉండడమనేది సర్వసాధారణం. అప్పట్లో భారతదేశంలో బ్రిటీష్ మహిళలు లేకపోవడమే అందుకు కారణం.[9][10] 19వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి భారతదేశంలో దాదాపు 40,000 మంది బ్రిటీష్ సైనికులు, 2,000 మందికి తక్కువ కాకుండా బ్రిటీష్ అధికారులు ఉండేవారు.[11] 19వ శతాబ్దం ప్రారంభం నుంచి మధ్యభాగం నాటికి బ్రిటీష్ స్త్రీలు పెద్ద మొత్తంలో బ్రిటీష్ ఇండియాకు తరలిరావడం జరిగింది. వీరిలో చాలామంది బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు కుటుంబ సభ్యులై ఉండేవారు. దీంతో భారతదేశంలో నివసించే బ్రిటీష్ వారి విషయంలో వర్ణాంతర వివాహాలనేవి చాలావరకు అసాధారణ విషయంగా మారింది. అలాగే 1857 భారతీయ తిరుగుబాటు[12] లాంటి ఘటనల తర్వాత పెద్ద సంఖ్యలో వర్ణ సంకర వ్యతిరేక చట్టాలు అమలులోకి రావడంతో బ్రిటీష్ మరియు భారతీయుల మధ్య వివాహం, పిల్లలు లాంటి విషయం అరుదైన వ్యవహారంగా మారింది.[13][14] దీని ఫలితంగా, భారతదేశంలోని యూరసియన్ల విషయంలో అటు బ్రిటీష్‌వారు ఇటు భారతీయులు ఇద్దరు కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారు.

దీంతో తమదైన ఒక సమాజాన్ని రూపొందించడం కోసం అనేక తరాలపాటు అంగ్లో-ఇండియన్లు ఇతర ఆంగ్లో-ఇండియన్లను వివాహం చేసుకోవడం ప్రారంభించారు. ఈ కారణంగా ఆంగ్లో-ఇండియన్లకు మాత్రమే ప్రత్యేకమైన ఒక సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇలా ఆ తర్వాతి కాలంలో ఆంగ్లో-ఇండియన్ వంటకాలు, వస్త్రధారణ, భాష మరియు మతం లాంటివి స్థానిక జనాభా నుంచి ఆంగ్లో-ఇండియన్లను ఒక ప్రత్యేక సమాజంగా రూపొందించాయి. అదేసమయంలో ఆంగ్ల భాష మరియు సంస్కృతిపై దృష్టి పెట్టడం కోసం వారు ఒక పాఠశాల వ్యవస్థను స్థాపించడంతో పాటు, క్రిస్మస్ మరియు ఈస్టర్ లాంటి శుభసమయాల్లో కార్యక్రమాలు సాగించడం కోసం సాంఘిక క్లబ్బులు మరియు అసోసియేషన్లను స్థాపించారు.[6]

మరోవైపు కాలగమనంలో ప్రత్యేకించి కస్టమ్స్ మరియు ఎక్సైజ్, పోస్ట్ మరియు టెలిగ్రాఫ్, అటవీ విభాగం, రైల్వేలు మరియు విద్యాబోధన లాంటి వాటిల్లో ఆంగ్లో-ఇండియన్లను నియమించడం జరిగింది. అయితే, ఇతర రంగాల్లోనూ వారి నియామకాలు జరిగాయి. ఈ విధంగా అనేక రకాల అంశాలు ఆంగ్లో-ఇండియన్ల సమాజం వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. వారి ఆంగ్ల భాష పాఠశాల విధానం, వారి ఆంగ్లేయకేంద్రిత సంస్కృతి, మరియు ప్రత్యేకించి క్రీస్తు పట్ల వారి విశ్వాసం లాంటివి ఆంగ్లో-ఇండియన్లను ఒక సమాజంగా కలిపి ఉంచేందుకు తోడ్పడింది.[15]

నిజానికి, 1813 శాసనం VIII కింద ఆంగ్లో-ఇండియన్లు బ్రిటీష్ న్యాయ వ్యవస్థ నుంచి బహిష్కరించబడడంతో పాటు బెంగాల్‌లో కలకత్తా వెలుపల మొహమ్మదీన్ చట్టంలోకి తీసుకురాబడ్డారు - అలాగే వారు ఎవరని గుర్తించేందుకు వారి మధ్య అప్పటివరకు ఎలాంటి కులం లేదా హోదా లేకపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల్లో పాలుపంచుకునే విషయమై యువ యూరసియన్ల మనసుల్లో చోటు చేసుకున్న ద్వేష భావాన్ని తొలగించడం కోసం 1821లో, "ఇండో-బ్రిటన్స్ పరిస్థితిని మెరుగ్గా చేయడంపై ఆలోచనలు" అనే పేరుతో ఒక "ప్రయోగాత్మక సంస్కర్త" ద్వారా ఒక కరపత్రం రచించబడింది. దీని తర్వాత "ఇండో-బ్రిటన్స్ తరపున ఒక అప్పీలు" పేరుతో మరో కరపత్రం రచించబడింది. అదేసమయంలో తమకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుకోవడం కోసం బ్రిటీష్ పార్లమెంట్‌కు ఒక పిటిషన్‌ను పంపే దిశగా కలకత్తాలోని ప్రముఖ యూరసియన్లు కలిసి "ఈస్ట్ ఇండియన్ కమిటీ"ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా యూరసియన్ వివాద పరిష్కారానికి చొరవచూపినవారిలో ఆద్యుడైన Mr. జాన్ విలియం రికెట్స్, ఇంగ్లండ్ వెళ్లేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చారు. అలా ఆయన చేపట్టిన కార్యం విజయవంతం కావడంతో పాటు, మద్రాసు మార్గం ద్వారా ఆయన భారతదేశానికి తిరిగివచ్చిన సమయంలో తాను సాధించిన విజయానికి చిహ్నంగా సొంత వర్గీయుల నుంచి ఆయన గొప్ప సత్కారాన్ని అందుకున్నారు; తర్వాత కలకత్తాకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించబడిన ఆయన, అక్కడ కలకత్తా టౌన్ హాల్‌లో జరిగిన ఒక ప్రజా సమావేశంలో భాగంగా తన కార్యాచరణ నివేదికను చదివి వినిపించారు. అటుపై 1833 ఆగస్టులో జారీచేయబడిన పార్లమెంట్ చట్టాన్ని అనుసరించి 1834 ఏప్రిల్‌లో ఆంగ్లో-ఇండియన్లకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.[15]

ఇక స్వతంత్ర పోరాటం సమయంలో, అనేకమంది ఆంగ్లో-ఇండియన్లు బ్రిటీష్ పాలన ద్వారా గుర్తింపు పొందారు (లేదా గుర్తించబడినట్టు భావించారు), దీంతో భారత జాతీయవాదులపై వీరు అపనమ్మకాన్ని మరియు ద్వేషాన్ని పెంచుకున్నారు.[citation needed] ఈ కారణంగానే స్వతంత్ర పోరాటంలో ఆంగ్లో-ఇండియన్ల పాత్ర క్లిష్టంగా మారింది. దీంతోపాటు ఎవరూ ఊహించని విధంగా వారు బ్రిటీష్ "పాలన" పట్ల విశ్వాసం ప్రదర్శించారు. దీంతోవారు చిన్నపాటి సాంఘిక గుర్తింపును సాధించారు. (స్వతంత్ర సంగ్రామ సమయంలో ఆంగ్లో-ఇండియన్ సమాజం ఎదుర్కొన్న అస్తిత్వ సంక్షోభం గురించి భోవాని జంక్షన్ వివరించింది.) దీంతో వారు భారతదేశంలో తమకు రక్షణ లేదన్నట్టుగా భావించారు. ముఖ్యమైన ప్రభుత్వ హోదాల కోసం ముందస్తు అభ్యర్ధన అన్నట్టుగా వారు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే విషయంపై ఈ అంశం ప్రభావం చూపింది.

ఈ కారణంగానే 1947లో చాలామంది ఆంగ్లో-ఇండియన్లు భారతదేశాన్ని విడిచివెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో లేదా ఆస్ట్రేలియా లేదా కెనడా లాంటి కామన్‌వెల్త్ దేశాల్లో కొత్త జీవితం ప్రారంభించగలమే విశ్వాసంతోనే వారు భారతదేశాన్ని విడిచివెళ్లారు. ఈవిధంగా ఆంగ్లో-ఇండియన్లు భారతదేశాన్ని విడిచివెళ్లడమనేది 1950ల్లో మరియు 1960ల్లో మరియు 1990ల్లోనూ సంభవించడమే కాకుండా ఇంకా మిగిలున్న వారు సైతం దేశాన్ని విడిచివెళ్లాలనే ఆకాంక్షతోనే ఉన్నారు.[16]

పార్శీ సమాజం తరహాలోనే ఆంగ్లో-ఇండియన్లు సైతం ప్రధానంగా పట్టణవాసులు. అయితే, పార్శీల్లా కాకుండా, మెరుగైన విద్య మరియు ఆర్థిక భద్రతల కోసం ఆంగ్లో-ఇండియన్లు ఇతర కామన్వెల్త్ దేశాలకు తరలివెళ్లిపోవడం ప్రారంభించారు.[6]

అయితే, అంతర్జాతీయ ఆంగ్లో-ఇండియన్ పునఃకలయికలు మరియు ఆంగ్లో-ఇండియన్లపై పుస్తకాల ప్రచురణ లాంటి రూపాల్లో 21వ శతాబ్దంలోనూ ఆంగ్లో-ఇండియన్ సంస్కృతిలో పునర్జీవనం చోటుచేసుకుంది. 2007 ఆగస్టులో టొరెంటోలో జరిగిన దానితో పాటు ఇప్పటివరకు ఏడుసార్లు ఆంగ్లో-ఇండియన్ పునఃకలయికలు జరిగాయి. ఆంగ్లో-ఇండియన్స్ - వానిషింగ్ రెమ్నెనంట్స్ ఆఫ్ ఏ బేగాన్ ఎరా [17] ప్రచురణ (2002), హంటిగ్ ఇండియా [18] ప్రచురణ (2003), వాయిస్ ఆన్ ది వెరాంద్ [19] ప్రచురణ (2004), ది వే వి వేర్ - ఆంగ్లో-ఇండియన్ క్రానికల్స్ [20] ప్రచురణ (2006) మరియు ది వే వి యార్ - ఏన్ ఆంగ్లో-ఇండియన్ మొజాయిక్ [21] ప్రచురణ (2008) లాంటి రచనలు ఆంగ్లో-ఇండియన్‌ల గురించి తెలియజేసే దిశగా వెలువడ్డాయి.

బ్రిటన్

బ్రిటీష్ ఇండియాలో జన్మించిన ఆంగ్లో-ఇండియన్లు (అప్పట్లో 'యూరోసియన్లు'గా సుపరిచితం) సాధారణంగా బ్రిటీష్ వంశావళిని తండ్రి తరంగాను మరియు భారత వంశావళిని తల్లి తరంగాను కలిగి ఉంటారు. దీనికి పూర్తి భిన్నంగా బ్రిటన్‌లో జన్మించిన ఆంగ్లో-ఇండియన్లు సాధారణంగా భారత వంశావళిని తండ్రి తరంగాను మరియు బ్రిటీష్ వంశావళిని తల్లి తరంగాను కలిగి ఉంటారు. 17వ శతాబ్దం నుంచి బ్రిటన్‌లో జాత్యాంతర వివాహాం సాధారణ విషయమైంది. ఈ సమయంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వేలాదిమంది భారతీయ స్కాలర్లు, కళాసీలు మరియు పనివారు (చాలావరకు బెంగాలీ మరియు/లేదా ముస్లిం) బ్రిటన్‌కు చేరడమే ఇందుకు కారణం. ఆ సమయంలో బ్రిటన్‌లో భారతీయ మహిళలు లేకపోవడంతో అక్కడికి చేరిన భారతీయుల్లో చాలామంది స్థానిక శ్వేత బ్రిటీష్ మహిళలు మరియు అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడం లేదా సహజీవనం సాగించడం జరిగింది. అయితే స్థానిక ఇంగ్లీష్ మహిళలు మరియు అమ్మాయిలు పెద్ద ఎత్తున ప్రత్యేకించి విదేశీ భారతీయ కళాసీతో వివాహానికి మరియు సహజీవనానికి ఏవిధంగా సిద్ధపడుతున్నారంటూ 1817లో లండన్ టవర్ హామ్లెట్ల ప్రాంత మెజిస్ట్రేట్ అసహ్యం వ్యక్తం చేయడంతో అప్పటినుంచి ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఏదేమైనప్పటికీ, భారతదేశంలో మాదిరిగా కాకుండా బ్రిటన్‌లో 'మిశ్రమ' వివాహాల విషయంలో ఎలాంటి చట్టబద్దమైన నియంత్రణ ఉండేది కాదు.[22][23][24] దీంతో దక్షిణాసియా కళాసీ తండ్రులు మరియు శ్వేత జాతి తల్లులు కలిసి బ్రిటన్‌ తీరప్రాంతాల్లో జాత్యాంతర సమాజాలను ఏర్పాటు చేశారు.[25] ఈ కారణంగా బ్రిటన్‌లో పెద్ద సంఖ్యలో "మిశ్రమ జాతి" పిల్లలు జన్మించడం జరిగింది. దీంతో "బ్రిటీష్ మరియు భారతీయుల మధ్య తేడాను, పాలకులు మరియు పాలించబడేవారి మధ్య అంతరాన్ని సులభంగా నిర్వచించడం కోసం" బ్రిటీష్ ఉన్నత వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.[11] మరోవైపు శ్వేత జాతి తల్లులకు మరియు భారతీయ తండ్రులకు జన్మించిన "హాఫ్-క్యాస్ట్ ఇండియన్" కుమార్తెల వల్ల బ్రిటన్‌లో శ్వేతేతర మహిళల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగింది.[26]

19వ శతాబ్దం అర్ధభాగానికి, దాదాపు 40,000 మందికి పైగా భారతీయ నావికులు, దౌత్యవేత్తలు, స్కాలర్లు, సైనికులు, అధికారులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు మరియు విద్యార్థులు బ్రిటన్‌కు చేరారు.[10] ఇక 19వ శతాబ్దం అర్ధభాగం తర్వాత మరియు 20వ శతాబ్దం ప్రారంభం నాటికి, దాదాపు 70,000 మంది భారతీయులు బ్రిటన్ చేరగా[27] అందులో 51,616 మంది కళాసీ నావికులుగా లెక్కతేలారు (ఈ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది).[28] వీరికి అధనంగా 19వ శతాబ్దంలో అనేకమంది బ్రిటీష్ అధికారులు మరియు సైనికులు భారతదేశంలోని తమ భారతీయ భార్యలను మరియు ఆంగ్లో-ఇండియన్ పిల్లలను తరచుగా బ్రిటన్ తీసుకురావడం ప్రారంభమైంది.[29] బ్రిటన్‌లోని ఆంగ్లో-ఇండియన్లు స్థానిక శ్వేతజాతి ప్రజలతో వివాహ సంబంధాలు నెరపడం ద్వారా బ్రిటీష్ సమాజంలో భాగస్వాములయ్యేవారు. ఈ కారణంగానే భారతదేశంలో మాదిరిగా బ్రిటన్‌లో వారు వైవిధ్యం కలిగిన సమాజంగా అవతరించలేదు. అయితే, బ్రిటన్‌కు పూర్తి విరుద్ధంగా భారతదేశంలోని ఆంగ్లో-ఇండియన్లు మాత్రం తమలో తామే పెళ్ళిళ్లు చేసుకోవాల్సి వచ్చేది.

1902లో, సర్ విలియం హట్ కర్జాన్ వైలీ మరియు లార్డ్ జార్జ్ హామిల్టన్ లాంటివారు బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులు, రాజులు (రాచరికం), సిపాయిలు (సైనికులు) మరియు కళాసీలు (నావికులు) స్థానిక శ్వేతజాతి మహిళలతో సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు వ్యక్తం చేశారు.[30] 1909లో, C. హామిల్టన్ మెక్‌గునీస్ పేర్కొన్న ప్రకారం, బ్రిటన్‌లో "బస్సుల్లోను, వీధుల్లోను, థియేటర్లలో మరియు ప్రతిఒక్కరూ వెళ్లే ప్రదేశాల్లో" శ్వేతజాతి మహిళలతో భారతీయ పురుషులు కనిపించడం సర్వసాధారణమైంది. ఈ విధమైన జాత్యాంతర సంబంధాల నేపథ్యంలో శ్వేతజాతి మహిళ "గౌరవాన్ని" రక్షించే దిశగా ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చినప్పప్పటికీ ఆరకమైన ప్రయత్నం విజయవంతం కాలేదు.[31]

ప్రపంచ యుద్ధం I సమయంలో, దాదాపు 135,000 మంది భారతీయ సైనికులు బ్రిటన్‌లో పనిచేయడంతోపాటు ఫ్రాన్స్‌లో అనేకమంది శ్వేతజాతి మహిళలను వివాహమాడడం మరియు వారితో కలిసి ఉండడం జరిగింది.[32] అయితే, ఈ రకమైన భిన్న జాతుల మధ్య సంబంధం గురించి ఆసమయంలో ఫ్రెంచ్ అధికారులు ఆందోళనపడనప్పటికీ, బ్రిటీష్ అధికారులు మాత్రం గాయపడి బ్రిటన్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయ దళాలకు మహిళా నర్సులు చికిత్స చేయకుండా నిరోధించడం లాంటి కర్ఫూ ప్రవేశపెట్టడం ద్వారా జాత్యాంతర సంబంధాలను పరిమితం చేసే ప్రయత్నం చేశారు.[33] ప్రపంచ యుద్ధం I తర్వాత, బ్రిటన్‌లో మహిళల సంఖ్య బాగా ఎక్కువ కావడం[34] తో పాటు విదేశాల నుంచి వచ్చే నావికులు ప్రత్యేకించి భారత ఉపఖండంకు చెందినవారు బ్రిటన్‌కు రావడం పెరిగింది. ఈ రకమైన పరస్థితి వల్ల విదేశీయులు స్థానిక శ్వేతజాతి మహిళలను వివాహం చేసుకోవడం మరియు వారితో సంసార జీవితం సాగించడం లాంటి పరిస్థితికి దారితీసింది, అదేసమయంలో ఈ రకమైన సంబంధాల వల్ల జన్మిస్తున్న సంకర సంతానం గురించి ఆందోళనలు పెరగడంతో పాటు ఆసమయంలో అనేక జాతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి.[35] భారతీయ నావికులతో శ్వేతజాతి కౌమార అమ్మాయిలు సంబంధాన్ని ఏర్పరచుకోవడంపై 1920ల్లో తరచుగా ఆందోళనలు తలెత్తాయి.[36] ఇక 1920ల నుంచి 1940ల వరకు అనేక మంది రచయితలు 'మిశ్రమ జాతి' జనాభాపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ రకమైన జనాభా ప్రధానంగా విదేశీ ఆసియా (చాలావరకు భారతీయులు) తండ్రులు మరియు స్థానిక శ్వేతజాతి తల్లుల వల్ల వృద్ధి చెందుతుండేది, అప్పుడప్పుడు కనీసం పెళ్ళి కూడా లేకుండా ఈ రకమైన సంతానం జన్మించడం జరిగేది. ఆసియా మగవారితో శ్వేతజాతి మహిళలు జతకట్టడాన్ని వారు 'సిగ్గుచేటు'గా భావించడంతో పాటు 'మిశ్రమ జాతి' సంతానం వృద్ధి చెందడంపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ రకమైన ఆందోళనల ఫలితంగా తెరమీదకు వచ్చిన సంకర సంతాన వ్యతిరేక చట్టాలు ఏమాత్రం విజయం సాధించలేదు.[37] అయితే, 1970ల నుంచి కుటుంబ సభ్యుల రూపంలో పెద్ద సంఖ్యలో భారతీయ మహిళలు బ్రిటన్‌కు రావడం ప్రారంభమైంది. దీంతో బ్రిటన్‌లోని మెజారిటీ భారతీయలు భారతదేశం నుంచి వచ్చిన మహిళలను వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో భిన్న జాతుల మధ్య వివాహాల జోరు తగ్గినప్పటికీ, బ్రిటీష్ ఇండియన్ సమాజంలో మాత్రం జనాభా పెరుగుదల ఎప్పటిలాగే కొనసాగింది.

యునైటెడ్ కింగ్‌డమ్ జనాభా లెక్కలు 2001 ప్రకారం, దక్షిణాసియా నుంచి వచ్చిన అన్ని జాతుల బృందాలుకు చెందిన బ్రిటీష్ ఆసియా పురుషులు ఆసియా మహిళల కంటే ఇతర జాతుల బృందాల (శ్వేత మరియు నల్లవారితో కలిపి)తో అంతర్గత వివాహాలు చేసుకోవడమే ఎక్కువగా జరిగింది. ఆసియా వారి మధ్య ఉండే బ్రిటీష్ ఇండియన్‌లు విభిన్న జాతి బృందానికి చెందిన వారిని అంతర్గత వివాహాం చేసుకునే విషయంలో శ్వేత, నల్లవారి తర్వాత కచ్చితంగా బ్రిటీష్ పాకిస్థానీలు మరియు బ్రిటీష్ బంగ్లాదేశీయులు ఉండేవారు. బ్రిటన్‌లో జరిగే మొత్తం జాతి అంతర్గత వివాహాల్లో శ్వేత మరియు భారతీయుల మధ్య జరిగే వివాహాలు 11% కాగా, బ్రిటన్‌లో జరిగే జాతి అంతర్గత వివాహాల్లో శ్వేత మరియు 'మిశ్రమ-జాతి' (ఆంగ్లో-ఇండియన్లతో సహా) ప్రజల మధ్య జరిగే వివాహాలు 26%గా నమోదయ్యాయి.[38] ఇక 2005లో, అంచనాల ప్రకారం బ్రిటన్‌లోని కనీసం ఐదు శాతం మంది భారతీయ పురుషులు శ్వేతజాతి మహిళలను భాగస్వాములుగా కలిగి ఉన్నారు.[39] 2006 అంచనాల ప్రకారం, మిశ్రమ శ్వేత మరియు దక్షిణాసియా (చాలావరకు భారతీయులు)కు చెందిన 246,400 మంది బ్రిటీష్ పౌరులు బ్రిటన్‌లో నివసిస్తున్నారు.[40] 'బ్రిటీష్ మిశ్రమ-జాతి' జనాభాలో ఈ సంఖ్య 30% వరకు ఉంటుంది.

ప్రస్తుత ఆంగ్లో-ఇండియన్ సమాజం

సమాజాలు మరియు మతాలు మరియు భాషాపరమైన మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుసరించి ఆంగ్లో-ఇండియన్లు సొంతంగా పాఠశాలలు నడిపేందుకు మరియు వాటిల్లో ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా ఉపయోగించేందుకు అవకాశం లభించింది. అయితే అతిపెద్ద సమాజమైన భారతదేశంలో, సమాజ ఏకీకరణలో భాగంగా ఆంగ్లో-ఇండియన్ పాఠశాల్లో నిర్ణీత సంఖ్యలో ఇతర భారత సమాజానికి చెందిన విద్యార్థులను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిబంధన విధించింది.[citation needed]

ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నిబంధనల ప్రకారం ఆంగ్లో-ఇండియన్ల విషయంలో అధికారిక వివక్ష ఉందనేందుకు ఎలాంటి ఆధారం లేదు. అయితే, స్థానిక భాషలను చక్కగా నేర్చుకునే విషయంలో ఆంగ్లో-ఇండియన్లు శ్రద్ధ చూపకపోవడమే ఆధునిక భారతదేశంలో వారి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోంది.

అయితే సైన్యం విషయంలో ఆంగ్లో-ఇండియన్లకి ఘనమైన చరిత్ర ఉంది. ఎయిర్ వైస్-మార్షల్ మౌరిస్ బార్కర్ భారతదేశ మొదటి ఆంగ్లో-ఇండియన్ ఎయిర్ మార్షల్‌గా గుర్తింపు సాధించారు. బార్కర్ తర్వాత మరో ఏడుగురు ఆంగ్లో-ఇండియన్లు ఆ పదవిని అలంకరించారు. ఒక చిన్న సమాజానికి ప్రతినిధులైన వారు పెద్ద సంఖ్యలో అలాంటి ఉన్నత స్థానాన్ని అందుకోవడం ఒక గొప్ప విషయం. మరికొందరు ఆంగ్లో-ఇండియన్లు సైతం అత్యున్నత సైనిక పదవులను అలంకరించారు. 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో విజయాన్ని అందించిన వ్యక్తిగా ఎయిర్ మార్షల్ M.S.D. వులెన్ గౌరవిచబడుతుంటారు.[41] భారత నౌకాదళం మరియు సైన్యం రెండింటిలోనూ ఆంగ్లో-ఇండియన్లు విలక్షణమైన సేవలందించారు.[42]

ఈ రెండు రంగాలతో పాటు విద్యా రంగంలోనూ ఆంగ్లో-ఇండియన్లు ఘన విజయం సాధించారు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన మెట్రుక్యులేషన్ విద్యార్హత అయిన ICSEని వారు ముందుకు తెచ్చారు. ఆంగ్లో-ఇండియన్ సమాజంలో బాగా సుపరిచితులైన పలువురు విద్యావేత్తలు దీన్ని ప్రారంభిచారు, వీరిలో ఫ్రాంక్ ఆంథోనీ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించగా, A.E.T. బారో దాదాపు అర్ధ శతాబ్దం పాటు కార్యదర్శిగా పనిచేశారు. కనీసం ప్రాథమిక విద్య సైతం పూర్తి చేయనివారితో సహా అనేకమంది ఆంగ్లో-ఇండియన్లు పాఠశాలల్లో టీచర్లుగా చాలా సులభంగా ఉద్యోగం సాధిస్తుంటారు. ఆంగ్ల భాషపై వారు మంచి పట్టు కలిగి ఉండడమే అందుకు కారణం.

ఇక క్రీడా విభాగంలోనూ ఆంగ్లో-ఇండియన్లు చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు, ప్రత్యేకించి ఒలింపిక్ స్థాయిలో నార్మన్ ప్రిట్చర్డ్ భారతదేశం తరపున మొట్టమొదటి ఒలింపిక్ పతక విజేతగా నిలిచారు. ఫ్రాన్స్‌లోని ప్యారీస్‌లో జరిగిన 1900 ఒలింపిక్ క్రీడల్లో ఆయన రెండు రజత పతకాలను సాధించారు. క్రికెట్‌ విషయాన్ని తీసుకుంటే భారత జట్టు విజయం సాధించిన 1983 ప్రపంచ కప్‌లో రోజర్ బిన్నీ అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచారు. అలాగే విల్సన్ జోన్స్ భారత మొట్టమొదటి వరల్డ్ ప్రొఫెసనల్ బిలియర్డ్స్ ఛాంపియన్‌గా పేరు సాధించారు.

భారతదేశంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆంగ్లో-ఇండియన్ సమాజం కోసం విదేశాల్లో అనేక ఛారిటీలు నెలకోల్పడం జరిగింది. ఇటువంటి ఛారిటీల్లో మొట్టమొదటిదైన CTR (కలకత్తా టిల్‌జలాహ్ రిలీఫ్ - USA నుంచి పనిచేస్తోంది)ను 300 మంది వృద్ధులకు ప్రతినెలా ఫించను ఇవ్వడం కోసం ప్రారంభించారు. దీంతోపాటు 200 పిల్లలకు సైతం CTR విద్యాదానం చేస్తుంది.[43]

నేడు, కనీసం 80,000 మంది ఆంగ్లో-ఇండియన్లు భారతదేశంలో ఉన్నట్టు అంచనా. ఇందులో అత్యధికులు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు, మరియు ముంబై లాంటి నగరాల్లో నివసిస్తున్నారు. దీంతోపాటు కొచ్చి, గోవా, పూణే, సికింద్రాబాద్, విశాఖపట్నం, లక్నో, ఆగ్రాలతో పాటు బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ లాంటి పట్టణాల్లోనూ ఆంగ్లో-ఇండియన్లు నివసిస్తున్నారు. ఒరిస్సాలోని రద్దీ రైల్వే జంక్షన్ అయిన ఖోర్డా పట్టణంలోనూ ఆంగ్లో-ఇండియన్లు పెద్దమొత్తంలో నివసిస్తున్నారు.[44]

విదేశాల విషయానికి వస్తే, బ్రిటన్, అస్ట్రేలియా, కెనడా, USA, మరియు న్యూజీలాండ్ లాంటి దేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. గణాంకాల ప్రకారం, భారతదేశం నుంచి వలసపోయిన దాదాపు ఒక మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ మంది (పూర్వీకులతో సహా)[citation needed]లో కొంతమంది ఆసియా దేశాలైన పాకిస్థాన్ మరియు మయన్మార్‌లతో పాటు యూరోపియన్ దేశాలైన స్విట్జర్లాండ్, జర్మనీ మరియు ఫ్రాన్స్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆంగ్లో-ఇండియన్ల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న తమ సమాజాన్ని కలపడం కష్టమైన పనేమీ కాదు.[45] మయన్మార్‌లో ఉండే ఆంగ్లో-ఇండియన్ సమాజం తరచూ స్థానిక ఆంగ్లో-బర్మీయులతో అంతర్గత వివాహాల ద్వారా ఏకమవుతుంటుంది. అయితే, బర్మా సైన్యం 1962లో ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఇక్కడున్న ఈ రెండు సమాజాలు ప్రతికూల వివక్షను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇక్కడున్న చాలామంది ఆంగ్లో-ఇండియన్లు విదేశాలకు తరలిపోతున్నారు.

రాజకీయ పరిస్థితి

భారతదేశ పార్లమెంటులో లోక్‌సభ (కింది సభ)కు తమ సొంత ప్రతినిధులను నామినేట్ చేసుకునే అవకాశం కలిగిన ఏకైక భారతీయ సమాజంగా ఆంగ్లో-ఇండియన్ సమాజం వర్థిల్లుతోంది. అఖిల భారత ఆంగ్లో-ఇండియన్ అసోసియేషన్‌కు మొదటి మరియు దీర్ఘకాల అధ్యక్షుడిగా వ్యవహరించిన ఫ్రాంక్ అంథోనీ, నెహ్రూ నుంచి ఈ రకమైన హక్కును దక్కించుకున్నారు. దీనిఫలితంగా ఆంగ్లో-ఇండియన్ సమాజం నుంచి ఇద్దరు సభ్యులు సభకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఈ సమాజానికి సొంత రాష్ట్రం లేని కారణంగా ఈ విధమైన ఏర్పాటు జరిగింది. ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, బీహార్,పశ్చిమ బెంగాల్,కర్ణాటక మరియు కేరళ లాంటి రాష్ట్రాలు సైతం తమ రాష్ట్ర శాసనసభల నుంచి ఒక్కో సభ్యుడిని నామినేట్ చేస్తాయి.

ఆంగ్లో-ఇండియన్ సంతతిలో ప్రముఖమైన వ్యక్తులు

యురోపియన్ సంతితి యొక్క ఆంగ్లో-ఇండియన్స్(అసలైన నిర్వచనం)

 • పేట్ బెస్ట్ - బీట్‌లెస్‌కు అసలైన డ్రమ్మర్.
 • S.L.J. గాల్యట్ - F.E.R.A (ప్రస్తుతం F.E.M.A) మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ .
 • ఎంగెల్‌బెర్ట్ హమ్‌పెర్‌డింక్ - గాయకుడు.
 • వివియన్ లై[citation needed], హాలీవుడ్ నటి.
 • క్లిఫ్ రిచ్చర్డ్ - పాప్ గాయకుడు (అసలు పేరు, హ్యారీ వెబ్)

యూరేషియన్ సంతతికి చెందిన ఆంగ్లో-ఇండియన్లు (కొత్త నిర్వచనం)

 • సెబాస్టియన్ కోయే,[46] బ్రిటిష్ అథ్లెట్ మరియు పీర్
 • రిచ్చర్డ్ నేరూర్కర్ - బ్రిటిష్ లాంగ్-డిస్టెన్స్ రన్నర్
 • రస్సెల్ పీటర్స్,[47] కెనడియన్ స్టాండ్-అప్ కామిక్ మరియు యాక్టర్
 • కోలిన్ మథుర-జేఫ్ఫ్రీ న్యూ-జీల్యాండ్ మోడల్ మరియు నటి
 • నార్మన్ డగ్లస్ హచ్చిన్‌సన్ రాయల్ పెయింటర్.
 • అడ్మిరల్ O. S. డాసన్ - భారత నౌకాదళ చెఫ్ (1982–1984).
 • మెలనియే సైకె‌స్ - మోడల్ మరియు TV సమర్పకులు.
 • టోనీ బ్రెంట్ - సింగర్.
 • హెన్రీ గిడ్నీ - విద్యావేత్త (1873–1942).
 • బెట్టి నుథాల్ - టెన్నిస్ క్రీడాకారుడు (1930లో U.S. నేషనల్స్ గెలిచిన మొదటి నాన్ అమెరికన్).[citation needed]
 • అన్నా లెనోవెన్స్ (1834–1915), సియమీస్ కోర్టుకు బ్రిటిష్ అధికారి
 • లూయిస్ T. లెనోవెన్స్ (1856–1919), సియమీస్ క్యావలరీ అధికారి మరియు వర్తకుడు; అన్నా లెనోవెన్స్ కుమారుడు
 • ఆలిస్టైర్ మెక్‌గోవన్ - ఇంప్రెషనిస్ట్, హాస్య నటుడు మరియు నటుడు
 • ఫ్రెడ్రిక్ అక్బర్ మొహమద్ - ఫిజీషియన్; సేక్ డీన్ మొహమద్ మనుమడు
 • నికోల్లెట్ షెరిడన్ - నటి.
 • టిమో రైసనేన్ - స్వీడెన్‌కు చెంది ఇండీ నటి.
 • ఫ్రాంక్ ఆంథోనీ, లాయర్, ఆంగ్లో-ఇండియన్ కార్యకర్త, రాజకీయ నాయకుడు, విద్యావేత్త, యునైటెడ్ నేషన్స్ లో ఇండియన్ రాయబారి, బ్రిటన్స్ బెట్రయల్ ఇన్ ఇండియా: ది స్టొరీ అఫ్ ది ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ, సైమన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్ లండన్
 • ఆనంద్ సత్యానంద్ - న్యూజీల్యాండ్ గవర్నర్ జనరల్.
 • గ్యాబ్రియేల్ అన్వర్ - నటి
 • రోగర్ బిన్నీ, మాజీ భారత క్రికెటర్
 • లెస్లీ క్లాడియస్, ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు, 1948-1960 మధ్య కాలంలో 4 ఒలంపిక్ పతకాలు (3 స్వర్ణం, 1 రజతం) గెలిచాడు.
 • షెల్లీ కాన్, నటి
 • పేషియన్స్ కోపెర్, భారత చలనచిత్ర నటి.
 • పమేలా బాలన్టైన్, ప్రచారకర్త, కార్యకర్త. జాతి సమానత్వ సేవలకు గాను QE II చే MBE అవార్డు
 • హెన్రీ డెరోజియో, 1809–1831, కలకట్టా కవి, హార్ప్ అఫ్ ఇండియా రచయత.
 • నోయెల్ జోన్స్, బ్రిటిష్ రాయబారి.
 • బోరిస్ కార్లోఫ్, యాక్టర్; అన్నా లెనోవేన్స్ మనుమడు
 • సారా కార్లోఫ్, రచయిత;బోరీస్ కార్లోఫ్ కుమార్తె
 • జాన్ మేయర్, వయోలిన్ విద్వాంసుడు, కంపోజర్ మరియు ఉపాధ్యాయుడు. 1967లో ఇండో-జాజ్ ఫ్యుషన్స్ డబుల్ క్వార్టర్‌ను జత చేసారు.
 • ఆంథోనీ డి మెల్లో, భారత్‌లో బోర్డు అఫ్ కంట్రోల ఫర్ క్రికెట్ వ్యవస్థాపకుడు.
 • మెర్లే ఒబెరాన్, నటి, భారతదేశంలో జననం.
 • డయానా క్విక్, నటి
 • జాస్మిన్ సాబు, ఫిలిం-మేకర్ మరియు జంతు శిక్షకుడు.
 • పాల్ సాబు, సంగీత విద్వాంసుడు.
 • పీటర్ సర్స్‌టెడ్, పాప్ గాయకుడు-గేయ రచయిత.
 • స్టీఫెన్ హెక్టార్ టేలర్-స్మిత్, ఇండియా "రాకెట్ మెయిల్" ప్రవర్తకుడు, మరియు పోస్టేజ్ స్టాంప్‌తో సజీవులుగా నిలిచారు.
 • అల్లాన్ సీలీ, నవలా రచయిత
 • డెంజిల్ కీలర్, పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో IAF హీరో
 • అయేషా టాకియా, నటి
 • ట్రెవోర్ కీలర్, పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో IAFహీరో
 • గ్లెన్ డంకన్, రాచయిత
 • జుల్స్ ఫైఫ్, ప్రపచం సంగీత గిటారిస్ట్
 • హెలెన్ రిచర్డ్‌సన్ ఖాన్, బాలీవుడ్ నటి
 • కెవిన్ కీలన్, నార్విచ్ సిటీ గోల్ కీపర్[citation needed]
 • మైఖేల్ చోప్రా, న్యూకాసిల్ యునైటెడ్ మరియు సుందర్‌ల్యాండ్ AFC స్ట్రైకర్
 • మార్క్ ఎల్లియట్, నటుడు
 • డెరెక్ O'బ్రియాన్, క్విజ్ మాస్టర్
 • డయానా హేడెన్, నటి మరియు మాజీ మిస్ వరల్డ్
 • విల్సన్ జోన్స్, మాజీ బిల్లియర్డ్స్ వరల్డ్ చాంఫియన్
 • లియోన్ ఐర్లాండ్, ఇండియన్ రాక్ మ్యూజిక్ బ్యాండ్ మోక్షలో ప్రధాన గాయకుడు
 • కత్రీనా కైఫ్, మోడల్ & నటి
 • క్రిస్ పోవెల్, ప్రఖ్యాత డ్రమ్మర్ మరియు పెర్‌క్యూషనిస్ట్, బ్యాండ్ బ్యాన్డిష్ వ్యవస్థాపకుడు, ఇదువరకు ఇండియన్ బ్యాండ్ యూఫోరియాతో గతంలో కలిసి పనిచేశారు.

వీటిని కూడా చూడండి.

 • బ్రిటిష్ ఆసియన్
 • బ్రిటిష్ ఇండియన్, నైతికంగా భారతీయులైన యునైటెడ్ కింగ్‌డం పౌరులు
 • బ్రిటిష్ మిక్స్‌డ్-రేస్
 • బర్జెర్ ప్రజలు, పాక్షికంగా యూరోపిన్ సంతతికి చెందిన శ్రీలంక ప్రజలు
 • యురేషియన్ (మిశ్రమ వంశీయులు)
 • FIBIS - బ్రిటిష్ ఇండియా సొసైటీలో కుటుంబాలు
 • రోమనికల్- ఇంగ్లాండ్ యొక్క రోమాని ఎథ్నిక్ గ్రూప్

సూచికలు

 1. ఆంగ్లో-ఇండియన్ , Dictionary.com.
 2. ""Constitution of India"". Commonlii.org. 2004-01-07. Retrieved 2010-10-27.
 3. "ట్రీటి బాడీస్ డేటాబేస్- డాక్యుమెంట్ - స్టేట్ పార్టీ రిపోర్ట్" యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ వెబ్‌సైట్. ఏప్రిల్ 29, 1996
 4. చూడండి స్టార్క్ , op. cit.
 5. డోవెర్, సెడ్రిక్. సిమ్మెరీ ఆర్ యురేసియన్స్ అండ్ దేర్ ఫ్యూచర్: ఏన్ ఆంగ్లో ఇండియన్ హెరిటేజ్ బుక్ . లండన్: సిమోన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్, 2007. పేజెస్ 62-63
 6. 6.0 6.1 6.2 6.3 స్టార్క్, హెర్బెర్ట్ అల్లిక్. హొస్టేజెస్ టు ఇండియా: ఆర్ ది లైఫ్ స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ రేస్. మూడవ సంచిక. లండన్: ది సిమన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్: సం|| 2: ఆంగ్లో ఇండియన్ హెరిటేజ్ బుక్స్
 7. ఆంథోనీ, ఫ్రాంక్. బ్రిటన్స్ బెట్రయల్ ఇన్ ఇండియా: ది స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ . రెండవ ఎడిషన్. లండన్: ది సిమన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్, 2007. పేజెస్ 18-19, 42, 45.
 8. "Eurasian". Dictionary.com. Retrieved 2009-01-13.
 9. Fisher, Michael Herbert (2006), Counterflows to Colonialism: Indian Traveller and Settler in Britain 1600-1857, Orient Blackswan, pp. 111–9, 129–30, 140, 154–6, 160–8, ISBN 8178241544
 10. 10.0 10.1 Fisher, Michael H. (2007), "Excluding and Including "Natives of India": Early-Nineteenth-Century British-Indian Race Relations in Britain", Comparative Studies of South Asia, Africa and the Middle East, 27 (2): 303–314 [304–5]
 11. 11.0 11.1 Fisher, Michael H. (2007), "Excluding and Including "Natives of India": Early-Nineteenth-Century British-Indian Race Relations in Britain", Comparative Studies of South Asia, Africa and the Middle East, 27 (2): 303–314 [305]
 12. Beckman, Karen Redrobe (2003), Vanishing Women: Magic, Film, and Feminism, Duke University Press, pp. 31–3, ISBN 0822330741
 13. Kent, Eliza F. (2004), Converting Women, Oxford University Press US, pp. 85–6, ISBN 0195165071
 14. Kaul, Suvir (1996), "Review Essay: Colonial Figures and Postcolonial Reading", Diacritics, 26 (1): 74–89 [83–9], doi:10.1353/dia.1996.0005
 15. 15.0 15.1 మహేర్, జేమ్స్, రెజినాల్డ్. (2007). దీస్ ఆర్ ది ఆంగ్లో-ఇండియన్స్. లండన్: సైమన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్. (ఆంగ్లో-ఇండియన్ వారసత్వ పుస్తకం)
 16. ఆంథోనీ, ఫ్రాంక్. బ్రిటన్స్ బెట్రయల్ ఇన్ ఇండియా: ది స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. సెకండ్ ఎడిషన్. లండన్: ది సిమోన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్, 2007 పేజెస్ 144- 146, 92.
 17. Blair Williams. "Anglo-Indians - Vanishing Remnants of a Bygone Era". Blairrw.org. Retrieved 2010-10-27.
 18. Blair Williams. "Haunting India". Blairrw.org. Retrieved 2010-10-27.
 19. Blair Williams (2004-12-03). "Voices on the Verandah". Blairrw.org. Retrieved 2010-10-27.
 20. Blair Williams. "The Way We Were - Anglo-Indian Chronicles". Blairrw.org. Retrieved 2010-10-27.
 21. Blair Williams. "The Way We Are - An Anglo-Indian Mosaic". Blairrw.org. Retrieved 2010-10-27.
 22. Fisher, Michael Herbert (2006), Counterflows to Colonialism: Indian Traveller and Settler in Britain 1600-1857, Orient Blackswan, pp. 106, 111–6, 119–20, 129–35, 140–2, 154–8, 160–8, 172, 181, ISBN 8178241544
 23. Fisher, Michael Herbert (2006), "Working across the Seas: Indian Maritime Labourers in India, Britain, and in Between, 1600–1857", International Review of Social History, 51: 21–45, doi:10.1017/S0020859006002604
 24. Ansari, Humayun (2004), The Infidel Within: The History of Muslims in Britain, 1800 to the Present, C. Hurst & Co. Publishers, p. 58, ISBN 1850656851
 25. "Growing Up". Moving Here. Retrieved 2009-02-12.
 26. Laura Levine Frader, Sonya O. Rose (1996), Gender and Class in Modern Europe, Cornell University Press, p. 184, ISBN 0801481465
 27. Radhakrishnan Nayar (January 5, 2003). "The lascars' lot". The Hindu. Retrieved 2009-01-16.
 28. Ansari, Humayun (2004), The Infidel Within: The History of Muslims in Britain, 1800 to the Present, C. Hurst & Co. Publishers, p. 37, ISBN 1850656851
 29. Fisher, Michael Herbert (2006), Counterflows to Colonialism: Indian Traveller and Settler in Britain 1600-1857, Orient Blackswan, pp. 180–2, ISBN 8178241544
 30. Teo, Hsu-Ming (2004), "Romancing the Raj: Interracial Relations in Anglo-Indian Romance Novels", History of Intellectual Culture, University of Calgary, 4 (1): 8–9
 31. Lahiri, Shompa (2000), Indians in Britain, Taylor and Francis, pp. 140–2, ISBN 0714680494
 32. Enloe, Cynthia H. (2000), Maneuvers: The International Politics of Militarizing Women's Lives, University of California Press, p. 61, ISBN 0520220714
 33. Greenhut, Jeffrey (April 1981), "Race, Sex, and War: The Impact of Race and Sex on Morale and Health Services for the Indian Corps on the Western Front, 1914", Military Affairs, Society for Military History, 45 (2): 71–74, doi:10.2307/1986964
 34. Ansari, Humayun (2004), The Infidel Within: The History of Muslims in Britain, 1800 to the Present, C. Hurst & Co. Publishers, p. 94, ISBN 1850656851
 35. Bland, Lucy (April 2005), "White Women and Men of Colour: Miscegenation Fears in Britain after the Great War", Gender & History, 17 (1): 29–61
 36. Jackson, Louise Ainsley (2006), Women Police: Gender, Welfare and Surveillance in the Twentieth Century, Manchester University Press, p. 154, ISBN 0719073901
 37. Ansari, Humayun (2004), The Infidel Within: The History of Muslims in Britain, 1800 to the Present, C. Hurst & Co. Publishers, pp. 93–4, ISBN 1850656851
 38. "Inter-Ethnic Marriage: 2% of all Marriages are Inter-Ethnic". National Statistics. 2005-03-21. Retrieved 2008-07-15.
 39. Bland, Lucy (April 2005), "White Women and Men of Colour: Miscegenation Fears in Britain after the Great War", Gender & History, 17 (1): 29–61 [51–2]
 40. "Resident Population Estimates by Ethnic Group, All Persons". National Statistics. June 2006. Retrieved 2009-01-15.
 41. "Anglo-Indians in the Indian Air Force". Sumgenius.com.au. Retrieved 2010-10-27.
 42. ఆంథోనీ, ఫ్రాంక్. బ్రిటన్స్ బెట్రయల్ ఇన్ ఇండియా: ది స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. సెకండ్ ఎడిషన్. లండన్: ది సిమోన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్.
 43. "Calcutta Tiljallah Relief". Blairrw.org. Retrieved 2010-10-27.
 44. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named escholarshare.drake.edu
 45. ది ఆంగ్లో-ఇండియన్ ఆస్ట్రేలియన్ స్టొరీ: మై ఎక్స్‌పీరియన్స్, జెల్మా ఫిలిప్స్‌ 2004
 46. Johnson, Angella (13 December 2009). Daily Mail. London http://www.dailymail.co.uk/femail/article-1235341/Lord-Coe-Punjabi-Playboy.html. Missing or empty |title= (help)
 47. "FAQ". RussellPeters.com. 2009-01-25. Retrieved 2010-10-27.

పుస్తకాలు

 • ఆంథోనీ F "బ్రిటైన్స్ బెట్రయల్ ఇన్ ఇండియా: ది స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ" సైమన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్, అమెజాన్ బుక్స్.
 • చాప్‌మ్యాన్, పాట్ "టెస్ట్ అఫ్ ది రాజ్, హొడర్ & స్టౌటన్, లండన్ — ISBN 0-340-68035-0 (1997)
 • డాడీ D S "స్కాటర్డ్ సీడ్స్: ది డయాస్పోరా అఫ్ ది ఆంగ్లో-ఇండియన్స్" పగోడ ప్రెస్
 • గ్యాబ్ ఏ "1600-1947 ఆంగ్లో-ఇండియన్ లెగసీ"
 • హవేస్ C "ప్యూర్ రిలేషన్స్: ది మేకింగ్ అఫ్ ఏ యురేషియన్ కమ్యూనిటీ"
 • మూర్ G J "ది ఆంగ్లో ఇండియన్ విజన్"
 • స్టార్క్ H A "హొస్టేజస్ టు ఇండియా: ఆర్ ది లైఫ్ స్టొరీ అఫ్ ది ఆంగ్లో ఇండియన్ రేస్" సైమోన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్.
 • మహేర్, రెజినాల్ద్ "దీస్ యార్ ది ఆంగ్లో-ఇండియన్స్" - (ఆంగ్లో-ఇండియన్ వంశ పారంపర్య పుస్తకం) సైమోన్ వాలెన్‌బెర్గ్ ప్రెస్
 • ఫిలిఫ్స్ Z "ది ఆంగ్లో-ఇండియన్ ఆస్ట్రేలియన్ స్టొరీ: మై ఎక్స్‌పీరియన్స్. ఆంగ్లో-ఇండియన్ వలస వారసత్వ కథల సేకరణ"
 • బ్రిడ్జెట్ వైట్-కుమార్ "ది బెస్ట్ అఫ్ ఆంగ్లో-ఇండియన్ క్యుసిన్ - ఏ లెగసీ", "ఫ్లేవర్స్ అఫ్ ది పాస్ట్", "ఆంగ్లో-ఇండియన్ డెలికసీస్", "ది ఆంగ్లో-ఇండియన్ ఫెస్టివ్ హంపెర్ ", " ఏ కలెక్షన్ ఆఫ్ ఆంగ్లో-ఇండియన్ రోస్ట్స్, కేస్‌రోస్స్ మరియు బేక్స్"

బాహ్య లింకులు

మూస:NRI-PIO