"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్రప్రదేశ్‌లో విద్య

From tewiki
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

 1. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు [1]
 2. ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్).[2]
 3. సాంకేతిక విద్యా మండలి[3]
 4. ఉన్నత విద్యా పరిషత్ [4]

ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది.

చరిత్ర

స్త్రీ విద్య

1953 సంవత్సరం వరకూ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాజధానిగా కలిగిన మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. చారిత్రికంగా 1881 నాటికి అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరంలో దాదాపుగా 543 బాలికల పాఠశాలలు ఉండేవి. వాటిలో ఆనాటికి దాదాపుగా 32, 341మంది విద్యార్థినులే ఉన్నారు. మద్రాసులోనే 1908 నాటికి 1238 బాలికల పాఠశాలలు, వాటిలో చదువుకునేందుకు 1, 68, 697 మంది విద్యార్థినులు చదువుకునేవారు.[5]

విద్యా సంస్ధలు

ప్రధాన వ్యాసం: విద్యా సంస్థలు

చదువులకు ప్రవేశ పరీక్షలు

ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశాలు

తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్పస్థానం, సమాజంలో గౌరవం ఉపాధ్యాయులకే ఉంది. దీనికొరకు వివిధ ప్రవేశపరీక్షలున్నాయి[6]

 1. డైట్ సెట్ (DIETCET) : ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి) కోర్సులకొరకు: రెండు సంవత్సరముల ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి) కోర్సులకొరకు ప్రవేశ పరీక్ష. 23 ప్రభుత్వ జిల్లా ఉపాధి, శిక్షణ సంస్థ (District Institute of Education and Training ), 220 ప్రైవేటు సంస్ధలలో ఈ కోర్సులు ఉన్నాయి. పరీక్ష ఏప్రిల్, మే నెలలో జరుగుతుంది. ఇంటర్మీడియట్ విద్య (వృత్తి సంబంధము కాని కోర్సులు) లేక సరిసమానమైన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత అర్హత. సామాజిక (sc, st), శారీరక బలహీన వర్గాలకు సడలింపు ఉంది. వయస్సు పరంగా సెప్టెంబరు 1 న 17 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
 2. ఎడ్సెట్ ( EdCET) : ఉపాధ్యాయ శిక్షణ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల (బిఇడి) కొరకు
 3. పిఈసెట్ (PECET) : ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆటల శిక్షణ) అండర్ గ్రాడ్యుయేట్, (బిపిఇడి) డిప్లొమా (యుజిడిపిడి) కోర్సులుకొరకు

ఇతర వృత్తివిద్యల ప్రవేశాలు

 1. సీప్ (CEEP) : పాలిటెక్నిక్ (డిప్లమా) కోర్సులకోరకు.
 2. ఎంసెట్ (EAMCET) : ఇంజనీరింగ్, వ్యవసాయ, మెడికల్ కోర్సులకొరకు. (బిఇ, ఎమ్బిబిఎస్, బిఅగ్రి..)
 3. ఈసెట్ ( ECET) : ఇంజనీరింగ్, పార్మా డిగ్రీ కోర్సులో, మొదటి లేక రెండవ సంవత్సరంలో ప్రవేశానికి డిప్లొమా వారికి. (బిఇ, బిటెక్)
 1. లా సెట్: న్యాయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.

పిజి పరీక్షల ప్రవేశాలు

 1. ఎమ్ఎ (MA) ప్రవేశ పరీక్ష
 2. ఎమ్ఎస్సి (MSc) ప్రవేశ పరీక్ష
 3. ఐసెట్ (ICET) : ఎంబిఎ, ఎంసిఎ కోర్సులకు.
 4. పిజిఈసెట్ ( PG ECET) : ఇంజినీరింగ్, ఫార్మా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకొరకు (ఎమ్ఇ ఎమ్టెక్)
 5. పిజిలాసెట్: న్యాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.

విద్యార్థుల వసతి గృహాలు

ప్రభుత్వం దాదాపు 5000 విద్యార్థుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది.వీటిలో 8 లక్షల మంది వుంటున్నారు.

విద్యార్థిఉపకార వేతనాలు

ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.

విద్య పరమార్ధం

విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.

పూర్తి వ్యాసం కొరకు ఉద్యోగం చూడండి.

ఇవీ చూడండి

వనరులు

 1. "CSE Portal". Archived from the original on 2019-03-22. Retrieved 2019-03-21.
 2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
 3. సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
 4. "ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు". Archived from the original on 2010-06-19. Retrieved 2010-03-28.
 5. వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబర్ 2017. Retrieved 6 March 2015. Check date values in: |archive-date= (help)
 6. "ఉన్నతమైన కెరీర్‌ ఏ ఉపాధ్యాయ వృత్తి". ప్రజాశక్తి. 2018-04-22. Archived from the original on |archive-url= requires |archive-date= (help).