"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
|
ఆగమనం |
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఔరంగజేబ్ · కులీ కుతుబ్ షా |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్బందీ · షియా · అహ్లె హదీస్ |
ఆంధ్రప్రదేశ్ లో మస్జిద్లు · ఆంధ్రప్రదేశ్ లో దర్గాల జాబితా |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్లె సున్నత్ ఉద్యమం |
భారతదేశంలో ఇస్లాం,హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు. 2011 గణాంకాల ప్రకారం, 14.7% ముస్లింలు గలరు.[1][2][3][4][5] అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ రెండవ స్థానంలో గలరు. సంఖ్యాపరంగానూ, శాతం పరంగానూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు, కాశ్మీర్, అస్సాం, ప.బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్నాటక ల తరువాత స్థానంలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 2001 గణాంకాల ప్రకారం ముస్లింలు 9.4% గలరు.
Contents
- 1 చరిత్ర
- 2 సూఫీ తత్వము మరియు ఇస్లాం వ్యాప్తి
- 3 పండుగలు
- 4 ప్రముఖ సూఫీ గురువులు
- 5 స్వాతంత్రోద్యమ పోరాటం
- 6 ఆంధ్రప్రదేశ్ విమోచనోద్యమం
- 7 నిజాం వ్యతిరేక పోరాటం
- 8 చట్టం మరియు రాజకీయాలు
- 9 నవీన ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు
- 10 ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ముస్లింలు
- 11 ప్రభుత్వ నివేదికలు
- 12 విద్యాలయాలు
- 13 గణాంకాలు
- 14 సాంప్రదాయాలు
- 15 కళలు మరియు నిర్మాణ శైలులు
- 16 దుస్తులు
- 17 సాహిత్యము
- 18 చిత్రమాలిక
- 19 ఇవీ చూడండి
- 20 మూలాలు
- 21 బయటి లింకులు
చరిత్ర
- దక్షిణాసియాలో ముస్లింల దండయాత్రల మూలంగా భారత్ లో ఇస్లాం ప్రవేశించిందని, సాధారణంగా ఓ నమ్మకమున్నది. చరిత్రను చూస్తే క్రింది విషయాలు ద్యోతకమవుతాయి.
- భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) క్రీ.శ. 612లో చేరామన్ పెరుమాళ్ కాలంలో కేరళలో నిర్మింపబడింది. ఈ కాలం ముహమ్మద్ ప్రవక్త జీవితకాలం. (క్రీ.శ. 571 - 632 ). కేరళ లోని కొడుంగళూర్లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మింపబడింది.[6][7][8]
- మాలిక్ బిన్ దీనార్, ఒక సహాబీ, మలబార్ లోని మాప్పిళాలు, భారదేశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి సమూహం. వీరి సంబంధ బాంధవ్యాలు, వర్తకపరంగా అరబ్బులతోనూ మరియు ఇతరులతోనూ ఉండేవి. మాలిక్ బిన్ దీనార్ ఆధ్వర్యంలో మతప్రచారాలు జరిగిన ఫలితంగా ఇక్కడ ఇస్లాం వ్యాప్తి జరిగింది. ఇచ్చటి అనేక సమూహాలు ఇస్లాంను స్వీకరించాయి. ఈ ప్రాంతాలలో నేటికినీ అరబ్బు జాతులను చూడవచ్చు.[9] 7 వ శతాబ్దంలో సహాబీలు (మహమ్మద్ ప్రవక్త అనుచరులు) కేరళ మరియు తమిళనాడులో వర్తకం కొరకునూ మరియు ధర్మప్రచారం కొరకునూ వచ్చి, స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. దక్షిణ భారతంలో వీరి ప్రచారం కారణంగా ముస్లింల సంఖ్య రాను రాను పెరిగింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరువాత కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ల లోనూ వీరి ధర్మప్రచారం కారణంగా ముస్లిం సముదాయం పెరిగింది.
- చరిత్రకారులు ఈలియట్ మరియు డౌసన్ తమ పుస్తకం "హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్" ప్రకారం, ముస్లిం యాత్రికులకు చెందిన నౌక, క్రీ.శ. 630లో వీక్షించబడింది. హెచ్.జి.రాలిన్సన్, ఇతని పుస్తకం: "ఏన్షియంట్ అండ్ మెడీవల్ హిస్టరీ ఆఫ్ ఇండియా" [10] ప్రకారం, ముస్లింలు 7వ శతాబ్దంలో భారత్ తీరంలో స్థిరనివాసాలు యేర్పరచుకున్నారు. షేక్ జైనుద్దీన్ మఖ్దూమ్ పుస్తకం; 'తుహ్ఫతల్-ముజాహిదీన్' ప్రకారం ఇదే విషయం విశదీకరింపబడింది.[11].'స్టర్రాక్ జే., దక్షిణ కెనరా మరియు మద్రాసు జిల్లా మాన్యువల్ (2 vols., మద్రాసు, 1894-1895) This fact is corroborated, by J. Sturrock in his South Kanara and Madras Districts Manuals, మరియు "హరిదాస్ భట్టాచార్య" తన కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా Vol. IV.[12] పుస్తకం లో, ఇస్లాం మరియు అరబ్బులు, ప్రపంచంలో 'సాంస్కృతిక యుగ కర్త' లని అభివర్ణించాడు. అరబ్బు వర్తకుల ద్వారా ఇస్లాం అనేక చోట్ల వ్యాపించింది, వీరెక్కడ వర్తకాలు చేశారో అచ్చట ఇస్లాంను వ్యాపింపజేశారు.[13]
- తమిళనాడు కాంజీపురం జిల్లా కోవళంలో సహాబీ అయిన హజ్రత్ తమీం అంసారీ 7 వశతాబ్దంలో స్థిర నివాసం ఏర్పరచుకొని, ఇస్లాం ధర్మప్రచారాన్ని కొనసాగించాడు. ఇతడు దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఇస్లాం వ్యాప్తికి కృషి చేసాడు.
సూఫీ తత్వము మరియు ఇస్లాం వ్యాప్తి
భారతదేశంలోను మరియు ప్రత్యేకించి ఆంధ్రపదేశ్ లోనూ ఇస్లాం వ్యాపించడానికి ముఖ్యకారకుల్లో సూఫీ తత్వజ్ఞులు విశేషమైనవారు. వీరు ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం వేళ్ళూనుకొనుటకు తమ పాత్రను అమోఘంగా పోషించారు; మరియు సఫలీకృతులైనారు. 12 శతాబ్దానికి చెందిన పెనుకొండ బాబా ఫక్రుద్దీన్, హైదరాబాద్కు చెందిన హజ్రత్ యూసుఫైన్ చిష్తీ, హజ్రత్ షర్ఫుద్దీన్ సహర్ వర్ది, హజ్రత్ షరీఫైన్ చిష్తి, కడపకు చెందిన ఖ్వాజా పీరుల్లా హుసేనీ, హజ్రత్ నాయబే రసూల్, నాగూరుకు చెందిన ఖాదిర్ ఔలియా మున్నగువారు ఈ కోవకు చెందినవారు. ఈ సూఫీ తత్వము, ఆంధ్రప్రదేశ్ లోని అన్నివర్గాలనూ ఇస్లాంలోకి ఆహ్వానించడానికి చక్కని కారకమైనది. హిందూ తత్వజ్ఞానమూ, ఇస్లాం సూఫీ తత్వమూ, బొమ్మా-బొరుసుల్లా, ఒకే నాణేనికి రెండువైపుల వలె ప్రజలకు కానవచ్చాయి. ఇస్లాంలోని ఏకేశ్వరోపాసన, సమాన సౌభ్రాతృత్వాలూ, సాదాసీదా జీవనం, ఈ సూఫీ తత్వానికి తోడై, ప్రజలు తండోపతండాలుగా ఇస్లాంలో ప్రవేశించుటకు మార్గం సుగమం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సూఫీలు, ఎక్కడనూ సంఘర్షణపడ్డారని, లేదా సంఘర్షణాత్మక ధోరణి అవలంబించారని, లేదా హింసామార్గాలను అవలంబించారని, చరిత్రలో కానరాదు. వీరు శాంతియుతంగా ప్రజలతో మెలగారు. సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యత, కులవిధానాలు, వర్ణవిభేదాలు కూడా, ఇస్లాం వ్యాప్తికి పరోక్షంగా తోడ్పడ్డాయి. అహ్మద్ సర్హిందీ, నఖ్ష్బందీ సూఫీలు శాంతియుతంగా ఎందరో హిందువులను ఇస్లాం వైపు ఆకర్షితులయేటట్లు చేయగలిగారు.
పండుగలు
- మొహర్రం పండుగ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో అన్ని మతాలవారూ జరుపుకునే పండుగగా ఉంది. స్థానికంగా పీర్ల పండుగగా ఈ పండుగను వ్యవహరిస్తుంటారు. తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు.[14]
ప్రముఖ సూఫీ గురువులు
- హైదరాబాదు :
- పెనుకొండ : హజ్రత్ బాబా ఫకృద్దీన్ [15][16]
- కడప : అమీన్ పీర్, షాహ్ మీర్ ఔలియా
స్వాతంత్రోద్యమ పోరాటం
ప్రధాన వ్యాసం స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు
ఆంధ్రప్రదేశ్ విమోచనోద్యమం
నిజాం వ్యతిరేక పోరాటం
మగ్దూం మొహియుద్దీన్, హసన్ నాసిర్, సులేమాన్ అరీబ్ షోయబుల్లా ఖాన్
చట్టం మరియు రాజకీయాలు
భారతదేశంలో ముస్లింలు ముస్లిం వ్యక్తిగత చట్టం అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ వైయక్తిక జీవితాలు గడుపుతారు.[17] ఈ చట్టం, ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా మరియు వారసత్వాలు, అన్నీ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం, అమలుపరచ బడేలా చూస్తుంది.[18] భారతదేశంలోని న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని, సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్థాపించబడింది.
నవీన ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రచయితలు
ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ముస్లింలు
- డా. జాకిర్ హుసేన్.
- కులీ కుతుబ్ షా, సాలార్ జంగ్, ముకర్రం జాహ్, ఉస్మాన్ అలీ ఖాన్, మక్దూం మొహియుద్దీన్, అబుల్ అలా మౌదూది, సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ .
- పత్రికారంగంలో ఎందరో ప్రముఖులు తమ వనరులను భారతదేశమును పటిష్ఠ స్థితిలో ఉంచుటకు నిర్విరామ కృషి చేస్తున్నారు. ఉదాహరణకు, జాహెద్ అలీ ఖాన్ (సియాసత్ ఉర్దూ) హైదరాబాదు, అస్లం ఫర్షోరీ, ఆబిద్ అలీ ఖాన్.
- రాజకీయాలలో ముస్లిం ప్రముఖులు : సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, మగ్దూం మొహియుద్దీన్, ముహమ్మద్ జాని, ముహమ్మద్ అలీ షబ్బీర్, లాల్ జాన్ బాషా
అమెరికాలో 2011 లో జరిపిన ఒక సర్వేప్రకారం భారత్ కు చెందిన 25 అంతర్జాతీయ వ్యక్తులలో 10 మంది హైదరాబాద్ దక్కనుకు చెందినవారు. వారిలో ప్రొ.రజియుద్దీన్ సిద్దీకి, ముహమ్మద్ కులీ కుతుబ్ షా, డా.జాకిర్ హుసేన్, మగ్దూం మొహియుద్దీన్, ప్రొ.అబ్దుల్ ఖదీర్ సిద్దీకి హజ్రత్, హజ్రత్ అబ్దుల్లా షా సాహెబ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్, నవాబ్ బహాదుర్ యార్ జంగ్, సయ్యద్ ఖలీలుల్లా హుసైనీ, మెహబూబ్ హుసేన్ జిగర్ మొదలగువారు తమ ఉన్నత విలువల జీవితాలకు ప్రసిద్ధి గాంచారు.[19]
ప్రభుత్వ నివేదికలు
సచార్ కమిటీ
సచార్ కమిటీ నివేదిక (ఇది ప్రభుత్వ నివేదిక) ప్రకారం, ముస్లింలు అనేక రంగాలలో ఉదాహరణకు ప్రభుత్వ మరియు సామాజిక రంగాలు, తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[20][21][22]
ప్రభుత్వ రంగాలలో ముస్లింల ఉద్యోగాలు (సచార్ నివేదికల ఆధారంగా)[23]
రంగం | ముస్లిం % |
---|---|
మొత్తం | 4.9 |
PSUs | 7.2 |
ఐఏఎస్, ఐఎఫ్ఎస్ మరియు ఐపీఎస్ | 3.2 |
రైల్వేలు | 4.5 |
న్యాయం | 7.8 |
ఆరోగ్యం | 4.4 |
రవాణా | 6.5 |
హోం affairs | 7.3 |
విద్య | 6.5 |
ముస్లింలు, వ్యవసాయ, సేవా, సహజ వనరుల అభివృద్ధి రంగాలలో రావాలి. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలోనూ రావాలి. సచార్ కమిటీ నివేదికల ప్రకారం, భారతదేశంలో 14.7% ఉన్న ముస్లింలకు, వ్యవసాయ భూమి కేవలం 1% ఉంది. అనగా వీరు వ్యవసాయ రంగంలో లేరు. వీరు ప్రభుత్వాలనుండి భూములు పొంది వ్యవసాయ రంగంలో ముందుకు రావాలి. ముస్లింలు పట్టణ మరియు నగర ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. గుడిసెల ప్రాంతాలలో నివాసాలెక్కువ. పల్లెలలో నివాసాలు తక్కువ, దీనికి కారణాలు వెతకాలి.
రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే అన్ని మతాల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలను ఎస్సీ పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దు చేయాలని పేర్కొంది. ఎస్సీ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేస్తూ అప్పట్లో ఆ ఉత్తర్వులిచ్చారు. అనంతరం బౌద్ధులు, సిక్కులకు కూడా అవకాశం కల్పించారు. (ఈనాడు19.12.2009)
విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ లో అనేక ముస్లిం విద్యాసంస్థలున్నాయి.
ధార్మిక విద్యాసంస్థలు
- దారుల్ ఉలూం, హైదరాబాద్.
- జామియా నిజామియా, హైదరాబాద్.
గణాంకాలు
మతపరమైన ఆధారముగా:
భాషాపరంగా:
First Languages of Andhra Pradesh in 2010[24]
ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అతిపెద్ద మైనారిటీ మతం. ముస్లింలు 2001 జనగణనాల ప్రకారం 9.4% లేదా 0.8 కోట్లమంది జనాభా కలరు. కానీ కొందరు, ఈ సంఖ్యకన్నా ఎక్కువ ముస్లింలున్నారని చెపుతారు.
భారతదేశంలో 2001 జనగణనాల ప్రకారం ముస్లింల జనాభా.[3]
|
మతాల ఆధారంగా, జనాభా విభజన శాతం - : 1961 నుండి 2001 గణాంకాలు (అస్సాం మరియు జమ్మూ కాశ్మీరు లను తప్పించి.) [25]
1961 - 2001 గణాంకాల ఆధారంగా, భారతదేశంలో మతాల ఆధారంగా సమూహాల శాతం (అస్సాం మరియు జమ్మూ కాశ్మీరులను కలుపుకుని).[26]
|
సాంప్రదాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింల సముదాయం, అధికంగా, సున్నీ,బరేల్వీ,సూఫీ సాంప్రదాయాలను అనుకరిస్తారు. ఈ సూఫీ తరీఖా, షరియా సూత్రాలకు కొంత విరుద్ధంగా కనిపించినా తత్వజ్ఞానం మారిఫత్, అవలంబీకరణ్ తరీఖత్, సత్యం హకీకత్ ల చుట్టూనే ఉంటుంది. కానీ సూఫీలు ప్రవచించిన మార్గానికి విరుద్ధంగా సమాధుల చుట్టూ తమ ధార్మిక సమయాలను గడుపుకుంటూ, తాత్విక ఆలోచనలకు బదులుగా హంగామాలు సృష్టించుకుంటూ, ఈ హంగామాలే తమ మోక్షాలకు మార్గమని నడుచుకుంటున్న నేటి ముస్లిం సముదాయం, నిజంగా సూఫీలు ఏమి అమలు చేశారు అని ఒక్క సారి బేరీజు వేసుకొని మరీ తమ భక్తిని చాటుకునే సమయం ఆసన్నమైనది. సూఫీలు ఏకేశ్వరోపాసనే గాక, ఈశ్వరప్రేమను పొందే ప్రేమమార్గాన్నీ బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక ఔలియాలు ఇతర ప్రాంతాలనుండి, ప్రముఖంగా అరబ్ మరియు పర్షియా ప్రాంతాలనుండి వచ్చి ఇస్లాం ధార్మిక ప్రచారం చేశారు. అలాగే అనేక ఔలియాల శిష్యగణం కూడా ఈ ధార్మక ప్రచారం గావించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముస్లింలు సూఫీ సంతులైన ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, హజరత్ నిజాముద్దీన్ ఔలియా లను గౌరవించే సాంప్రదాయం గలిగి ఉన్నారు. వీరు, సవ్యమైన మార్గంలో పయనించిన ఔలియాలుగా ప్రసిద్ధి. కొందరైతే, ఈ ఔలియాల మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పి, ఆయా ఔలియాల పేరుతో ఉర్సు కార్యక్రమాలలో మునిగితేలుతున్నారు. ఈ కార్యక్రమాలలో తాత్విక ఆలోచనలు, ధార్మిక శోధనలూ, ఆధ్యాత్మిక చింతనలూ, కానరావు. ఔలియాల సమాధులపై పుష్పగుచ్చాలుంచి, ఖవ్వాలీలను రాత్రంతా వింటే, అల్లాహ్ ప్రసన్నమైపోతాడనే వింత ఆలోచనలు మాని, ఆయా ఔలియాలు బోధించిన మార్గాలు, వాటిలోని సూక్ష్మ విషయాల సంగ్రహణ ముఖ్యం. ఖవ్వాలీ లలో సినిమా పాటల రాగాలు, వాటి అనుకరణలు, ఔలియాల పొగడ్తలకు జోడించి ఆలపించుకోవడంకూడా భక్తి క్రింద భావించుకునే పామరులు, అమాయకులూ గల ఈ సముదాయాలలోని ముస్లింలను చూస్తే, చుక్కాని లేని నావలో ప్రయాణం సాగిస్తున్నవారిలా కనిపిస్తారు. ఐననూ, సూఫీలలో, పీర్ (గురువు), మురీద్ (శిష్యుడు) ల సాంప్రదాయం, అంచెలంచెలుగా పెరుగుతూ పోతున్నది. ప్రతిఒక్కరికీ గురువు ఉండడం సముచితం, ఆ గురువుకి ధార్మికజ్ఞానం ఉండడం ఇంకనూ సముచితం. ధార్మిక జ్ఞానం గల గురువులు భారతదేశంలో లెక్కకు మించినవారున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సూఫీ సాత్విక చింతన వర్థిల్లుతూ ఉంది కూడా. ఈ కోవకు చెందిన వారు నాలుగు తరీఖాల వారు, ఆ తరీఖాలు, ఖాదరియా, చిష్తియా, నఖ్ష్బందియా మరియు సహర్వర్ధియా లేక సుహర్వర్దియా. ఈ తరీఖాల పరంపరలు కొనసాగుతూ ప్రజలకు ధార్మిక బోధనలు గావిస్తూ, ఇస్లామీయ తత్వం అనే మార్గంపై నడిపిస్తూనే ఉన్నాయి.
20వ శతాబ్దంలో తబ్లీగీ జమాత్ అనే ఓ సమూహమూ బయలుదేరినది. వీరు ప్రముఖంగా తబ్లీగ్ లేదా ఇస్లాం సూక్ష్మ ధర్మాలను ప్రపంచానికి చేరవేయుట అనే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. వీరి ఉద్దేశ్యమూ ఆహ్వానించదగినదే. ధార్మిక చింతలు నశిస్తున్న ఈ కాలంలో తిరిగి ప్రజలలో ధార్మిక చింతనలు కలుగజేయడం శుభసూచకమే. ఇదో ప్రత్యేక మైన సంస్థ కాదు. ఇదో పిలుపు. ఇహ, పరలోకాలలో అల్లాహ్ ను ఏవిధంగా ప్రసన్నుడిని చేసుకోవాలనే తపన వీరిలో మెండుగా కనిపిస్తుంది. ఈ జమాత్ కు ఓ రూపం ఇచ్చిన వారిలో మౌలానా ఇలియాస్, అష్రఫ్ అలీ థానవీ, మౌలానా జకరియా మొదలగువారు ఉన్నారు. వీరి తపన, ప్రజలలో తిరిగి స్వచ్ఛత పెంపొందించడం. అల్లాహ్ పట్ల భయభక్తులు పెంపొందించడం, తమ 'ఆమాల్' అనగా నడవడికలను శుద్ధి చేసుకొనవలెనని, వీటిద్వారా కలుగు అల్లాహ్ దయను పొందవలెనని ప్రగాఢ తాపత్రయం. ఈ తబ్లీగ్, ఇంకోవిధంగా చెప్పాలంటే, "సత్ప్రవర్తనల పునరుజ్జీవనం". భారత్ లోనే కాక, ప్రపంచంలోని ముస్లిం సమూహాలన్నీ, ఇస్లామీయ పాఠశాలల భేదాలను మరచి, ఈ 'స్వీయ ప్రచ్ఛాళనా ఉద్యమం' లో తండోపతండాలుగా ప్రవేశిస్తున్నారు. ఇస్లామీయ ధార్మిక చింతనలు గలవారికి ఈ ఉద్యమం కొంత ఊరటను కలుగజేస్తుంది.
కళలు మరియు నిర్మాణ శైలులు
ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం నిర్మాణాలు దక్కను శైలిలో కానవస్తాయి. ఇస్లామీయ నిర్మాణాలలో 'ఆర్క్' ల ఉపయోగాలెక్కువ. ఇస్లాంలో జంతుజీవజాలబొమ్మలు, మానవుల బొమ్మలు, శిల్పాలు, నిషేధం. అందుకొరకే, పూల తీగలు, సన్నని పూల, తీగల, సన్నని చెట్ల రూపాలు అధికంగా కానవస్తాయి. ఇరాన్ డిజైనుల శైలి పియత్రా దురా శైలి ఎక్కువగా కనబడుతుంది. అరబ్బులు, తురుష్కులు, మస్జిద్ లు, మీనార్ లను ఎక్కువగా నిర్మించారు. వీరి నిర్మాణాలలో మస్జిద్ లు, మీనార్లు కోట లు, నగరాలు, సమాధులు (కుతుబ్ షాహీ సమాధులు, కానవస్తాయి.
మస్జిద్లు : మస్జిద్ ల నిర్మాణాలలో, స్తంభాలతో గూడిన వరండా, ఆవరణం, మింబర్, మిహ్రాబ్, గుంబద్ మరియు మీనార్లు కానవస్తాయి. ఇవియేగాక వజూ కొరకు వజూఖానాలు, నీటికొలనులు 'హౌజ్' లూ కానవస్తాయి.
సమాధులు : కుతుబ్ షాహీ, ఆసఫ్జాహీ మరియు నిజాంల సమాధులు, నవాబుల సమాధులు, వీటినే మక్బరాలు అని వ్యవహరిస్తారు. ధార్మిక సంతులైన ఔలియాల సమాధులు, ఆస్తానాలు, వీటిని దర్గాలు లేదా 'రౌజా'లని వ్యవహరిస్తారు. ఆస్తానాలలోని మసీదులు, దర్గాలు ప్రముఖ నిర్మాణాలు. ఇలాంటి నిర్మాణాలను ఇస్లామీయ శైలి అనే కంటే, ముస్లింల సమాధుల శైలి అంటే బాగుంటుంది, (ఇస్లాం ధర్మాను సారం సమాధులపై నిర్మాణాలు నిర్మించరాదు). ఈ సమాధుల నిర్మాణశైలి, హుజ్రాహ్, జరీహ్, మగ్బరా, ఖబ్ర్, గుంబద్ మరియు రౌజా లతో కూడి ఉంటుంది.
ఇస్లామీయ నిర్మాణ శైలులను మూడు వర్గాలుగా విభజించవచ్చును :
- ఢిల్లీ శైలి (1191 నుండి 1557 వరకు);
- రాష్ట్రాల శైలి, ఉదాహరణకు జౌన్ పూరు మరియు దక్కను;
- మొఘల్ శైలి (1526 నుండి 1707 వరకు).[30]
కళాకారులు
దుస్తులు

అరబ్, తుర్కీ, పర్షియన్, పంజాబీ, అఫ్ఘానీ, భారతీయ దుస్తుల సాంప్రదాయాల సముదాయం కానవస్తుంది.
- పురుషులు: సల్వార్ కమీజ్, సల్వార్ కుర్తా, కుర్తా-పైజామా, పేంట్-షర్ట్, ధోతీ-కుర్తా, లుంగీ-కుర్తా, పంచీ-కుర్తా, ధరించడం ఆనవాయితీ. తలకు షమ్లా, అమామా, పేఠా, టోపీ, రుమాల్ లేక దస్తీ ధరించడం సాంప్రదాయం.
- స్త్రీలు : సల్వార్ కమీజ్, చూరీదార్, ఘాగ్రా-చోలీ, షరారా, లాచా, లెహంగా-చోలీ, శారీ, పంజాబీ డ్రెస్, ఓణీ, దామ్నీ, దుపట్టా, బుర్ఖా, చాదర్ ధరించడం సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయ నగలు ధరించడం, ఉదాహరణకు, లచ్చా (తాళిబొట్టు), జుంకీలు, గల్సర్, నెక్లెస్, టీకా, మాంగ్ టీలా, కాళ్ళకు పాజేబ్, పట్టీలు, పాయల్, ధరించడం సాంప్రదాయం. అలాగే భారతీయ సాంప్రదాయ నగలైన ముక్కుపుడక, కమ్మలు, మెట్టెలు, నడుంపట్టీ, కాళ్ళగజ్జెలు, ముంజేతి కంకణం లాంటివి సర్వసాధారణమే.
సాహిత్యము
- ధార్మిక సాహిత్యం:
- ఉర్దూలో ఇస్లామీయ సాహిత్యం :
- తెలుగులో ఇస్లామీయ సాహిత్యం : తెలుగులో ఇస్లామీయ సాహిత్యానికి అనేకులు పాటుపడ్డారు. అందులో డాక్టర్ చిలుకూరి నారాయణరావు 1925 లో "కురాను షరీఫు" అనే పేరుతో కురాన్ ను తెలుగులో తర్జుమా చేశారు. మాడపాటి హనుమంతరావు గారి ప్రోద్బలముతో ముహమ్మద్ ఖాసిం ఖాన్ గారు కురానును తెలుగులో తర్జుమా చేశారు. ఆ తరువాత మౌల్వీ అబ్దుల్ గఫూర్, అబుల్ ఇర్ఫాన్ గార్లు, కురానును తెలుగులో తర్జుమాలు చేశారు.
- సూఫీ సాహిత్యం:
- సాధారణ సాహిత్యం :
- ముస్లిం రచయితలు :
- ముస్లిం కవులు : అంజద్ హైదరాబాదీ
చిత్రమాలిక
కడప పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్
పెనుకొండ లోని బాబా ఫకృద్దీన్ చే నాటబడిన దర్గాలోని 750 ఏళ్ల నాటి వృక్షం.
ఇవీ చూడండి
- బహమనీ సామ్రాజ్యము
- హైదరాబాద్ రాష్ట్రం
- మైసూరు సామ్రాజ్యము
- కర్నూలు నవాబులు
- కడప నవాబులు
- బనగానపల్లె నవాబులు
- మచిలీపట్నం నవాబులు
- ఆర్కాడు నవాబులు
- ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం జాగీర్దారులు
- ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు
- ఆంధ్రప్రదేశ్ లో సూఫీలు
- ఆంధ్రప్రదేశ్ లో ఔలియాలు
- ఆంధ్రప్రదేశ్ లో దర్గాలు
- ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రముఖులు
- తెలుగు ముస్లిములు
- తమిళ ముస్లిములు
మూలాలు
- ↑ Census of India. Government website with detailed data from 2001 census.
- ↑ International Religious Freedom Report 2007 - India
- ↑ 3.0 3.1 Indian Census 2001 - Religion
- ↑ CIA's The World Factbook - India
- ↑ Bureau of South and Central Asian Affairs - Background Note: India
- ↑ -Cheraman Juma Masjid A Secular Heritage
- ↑ Bahrain tribune World’s second oldest mosque is in India
- ↑ -A mosque from a Hindu king
- ↑ - Genesis and Growth of the Mappila Community
- ↑ ISBN 81-86050-79-5 Ancient and Medieval History of India
- ↑ ISBN 983-9154-80-X
- ↑ ISBN 81-85843-05-8 Cultural Heritage of India Vol. IV
- ↑ -Genesis and Growth of the Mappila Community
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ http://babafakhruddin.com/
- ↑ http://www.saintsofislam.com/hazrat-baba-fakhruddin-ra
- ↑ The Muslim Personal Law (Shariat) Application Act, 1937 Vakilno1.com
- ↑ India, Republic of Emory School of Law
- ↑ http://www.siasat.com/english/news/10-vips-hyderabad-included-25-international-personalities-india
- ↑ Summarised Sachar Report on Status of Indian Muslims
- ↑ Sachar report to be implemented in full
- ↑ The Missing Muslim, the Sunday Express. Full coverage on Sachar Report
- ↑ Frontline Magazine, pay. Hindu.com. This article is based on Sachar Report.
- ↑ "Commissioner Linguistic Minorities (originally from Indian Census, 2001)". Archived from the original on 8 October 2007.
- ↑ Indian Census తిరిగి గణన ఏప్రిల్ 4, 2007 ల ప్రకారం.
- ↑ Indian Census. Retrieved on April 4, 2007.
- ↑ "Tables: Profiles by main religions: Hindus" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Archived from the original (PDF) on 2005-04-06. Retrieved 2007-04-17.
- ↑ Cite error: Invalid
<ref>
tag; no text was provided for refs namedcensusmuslim
- ↑ 29.0 29.1 29.2 "A snapshot of population size, distribution, growth and socio economic characteristics of religious communities from Census 2001" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. pp. pp1–9. Archived from the original (PDF) on 2005-12-16. Retrieved 2007-04-20.CS1 maint: extra text (link)
- ↑ (Courtesy: Culturopedia.com)