"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్రప్రదేశ్ లో విద్య

From tewiki
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

 1. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు [1]
 2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి.[2]
 3. సాంకేతిక విద్యా మండలి[3]
 4. ఉన్నత విద్యా పరిషత్ [4]

ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది.

చరిత్ర

స్త్రీ విద్య

1953 సంవత్సరం వరకూ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాజధానిగా కలిగిన మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. చారిత్రికంగా 1881 నాటికి అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరంలో దాదాపుగా 543 బాలికల పాఠశాలలు ఉండేవి. వాటిలో ఆనాటికి దాదాపుగా 32, 341మంది విద్యార్థినులే ఉన్నారు. మద్రాసులోనే 1908 నాటికి 1238 బాలికల పాఠశాలలు, వాటిలో చదువుకునేందుకు 1, 68, 697 మంది విద్యార్థినులు చదువుకునేవారు.[5]

విద్యా సంస్ధలు

ప్రధాన వ్యాసం: విద్యా సంస్థలు

పదవతరగతి ఆ తరువాత స్థాయి చదువులకు ప్రవేశ పరీక్షలు

 1. సీప్ (CEEP) : పాలిటెక్నిక్ (డిప్లమా) కోర్సులకోరకు.
 2. డైట్ సెట్ (DIETCET) : ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి) కోర్సులకొరకు
 3. ఎడ్సెట్ ( EdCET) : ఉపాధ్యాయ శిక్షణ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల (బిఇడి) కొరకు
 4. పిఈసెట్ (PECET) : ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆటల శిక్షణ) అండర్ గ్రాడ్యుయేట్, (బిపిఇడి) డిప్లొమా (యుజిడిపిడి) కోర్సులుకొరకు
 5. ఎంసెట్ (EAMCET) : ఇంజనీరింగ్, వ్యవసాయ, మెడికల్ కోర్సులకొరకు. (బిఇ, ఎమ్బిబిఎస్, బిఅగ్రి..)
 6. ఈసెట్ ( ECET) : ఇంజనీరింగ్, పార్మా డిగ్రీ కోర్సులో, మొదటి లేక రెండవ సంవత్సరంలో ప్రవేశానికి డిప్లొమా వారికి. (బిఇ, బిటెక్)
 7. ఐసెట్ (ICET) : ఎంబిఎ, ఎంసిఎ కోర్సులకు.
 8. పిజిఈసెట్ ( PG ECET) : ఇంజినీరింగ్, ఫార్మా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకొరకు (ఎమ్ఇ ఎమ్టెక్)
 9. లా సెట్: న్యాయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
 10. పిజిలాసెట్: న్యాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
 11. ఎమ్ఎ (MA) ప్రవేశ పరీక్ష
 12. ఎమ్ఎస్సి (MSc) ప్రవేశ పరీక్ష

విద్యార్ధుల వసతి గృహాలు

ప్రభుత్వం దాదాపు5000 విద్యార్ధుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది.వీటిలో 8 లక్షల మంది వుంటున్నారు.

విద్యార్థిఉపకార వేతనాలు

ప్రభుత్వం విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.

విద్య పరమార్ధం

విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్ధులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్ధులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్ధులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.

పూర్తి వ్యాసం కొరకు ఉద్యోగం చూడండి.

ఇవీ చూడండి

వనరులు

 1. "CSE Portal". Retrieved 2019-03-21.
 2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
 3. సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
 4. ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు
 5. వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Retrieved 6 March 2015.