"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్

From tewiki
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 1976 లో స్వచ్ఛంద సంస్థగా నమోదయ్యింది.[1]. వైజ్ఞానిక రీతులలో చరిత్ర అధ్యయనాలను ప్రోత్సహించడం దీని ప్రధానవుద్దేశ్యం. 1998లో జరిగిన 22 వ సావంత్సరిక సదస్సులో సమగ్ర చరిత్రను 7 సంపుటాలలో మొత్తం 5000 ముద్రించిన పేజీలలో రూపొందించాలని నిర్ణయించారు. 2008 వార్తల ఆధారంగా 9 సంపుటాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి 300 మంది పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ పనికి 1960లో బీజం బడగా 1970 లో అప్పటి అంతర్జాతీయ తెలుగు సంస్థ, ఆ తరువాత తెలుగు అకాడమీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం కృషిచేశాయి. మేధో పరంగా ఆంధ్ర ప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌, ఆర్థిక పరంగా తెలుగువిశ్వవిద్యాలయం దీనిలో పాల్గొంటున్నాయి.[2]

 • 2003 లో మొదటి సంపుటి, పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు [3] ఎమ్ ఎల్ కె మూర్తి సంపాదకత్వంలో విడుదలైంది.[4]
 • రెండవసంపుటి: ఆంధ్ర ప్రదేశ్ తొలి చరిత్ర (క్రీపూ 500- క్రీశ 640) ( Early History of Andhra Pradesh 500 B.C. to 640 A.D.)
 • 2009 లో మూడవ సంపుటి తొలి మధ్యయుగ ఆంధ్ర ప్రదేశ్[5] బి రాజేంద్రప్రసాద్ సంపాదకత్వంలో విడుదలైంది.
 • 10 జులై 2011 నాడు నాలుగో సంపుటం ” మధ్య యుగాల తెలుగు చరిత్ర(క్రీ.శ.1000-1324) ” విడుదలైంది.[6]
 • ఆధునికచరిత్ర మూడు సంపుటాలు (1325నుండి 1991 వరకు ) తయారీలో ఉన్నాయి.

వనరులు

 1. "తెలుపు.కామ్ లో వివరము". Archived from the original on 2012-07-19. Retrieved 2012-07-21.
 2. 2015 నాటికి 9 సంపుటాల చరిత్ర ఆంధ్రప్రభలో 2008లో వచ్చిన వార్త[permanent dead link]
 3. Pre and Protohistory till 500BC (పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు) గూగుల్ బుక్స్ లో మునుజూపు
 4. Looking back in time , news story on first volume release in 2003
 5. "Early Medieval Andhra Pradesh, Vol 3 ( తొలి మధ్యయుగ ఆంధ్ర ప్రదేశ్,మూడవ సంపుటి) తూలికబుక్స్ లో సమీక్ష". Archived from the original on 2016-04-05. Retrieved 2012-07-21.
 6. నాలుగో సంపుటం విడుదలవార్త[permanent dead link]