ఆంధ్రోద్యమం

From tewiki
Jump to navigation Jump to search

తెలుగు వారికి రాజకీయంగా, ఉద్యోగాలపరంగా, సాంస్కృతికంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నాయని, భాష ప్రాతిపదికన తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలంటూ చేసిన ఉద్యమం ఆంధ్రోద్యమం. 20వ 1911లో ఈ ఉద్యమం ప్రారంభం కాగా, 1953 నాటికి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆపైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఫలించింది. గుంటూరులో ఓ తమిళ జడ్జి డఫేదారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న పలువురు స్థానికులు, అర్హులను కాదని కుంభకోణం నుంచి సాటి తమిళుణ్ణి తీసుకువచ్చి నియమించారు. పలువురు తెలుగు నాయకులకు తమిళులకు భాషా పరంగా ఉన్న వివక్ష, తద్వారా ఉద్యోగ రంగంలో తాము అనుభవిస్తున్న అణచివేత తెలిసినా, ఈ సంఘటన వేడిపుట్టించి కదిలించడంతో ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. 1912లో ఆంధ్రమహాసభ ప్రారంభమై మద్రాసు నుంచి ఆంధ్రను విడదీసి వేరే ప్రావిన్సు చేయాలన్న డిమాండ్ చేశారు.[1]

1913లో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ నిర్వహించారు. తొలి దశలో ఆంధ్రోద్యమ లక్ష్యాల విషయమై తర్జన భర్జనలు జరిగాయి. అవి ఓ కొలక్కి వచ్చి, 1910 దశకం ముగిసేనాటికే ఆంధ్రులకై ప్రత్యేక ప్రావిన్సు ఏర్పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారి ప్రదేశ్ కాంగ్రెస్ లు ఏర్పరిచినప్పుడు భాషా ప్రాతిపదికన ప్రావిన్సులు ఏర్పరచడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆ ప్రకారమే తమ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసింది. సూత్రప్రాయంగా తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని 1923లోనే ఏర్పరిచారు.

మూలాలు

  1. సాక్షి, విలేకరి (7 ఫిబ్రవరి 2016). "ఆంధ్రోద్యమం". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 11 April 2016. సాక్షి ఫ్యామిలీలో