ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

From tewiki
Jump to navigation Jump to search
ఆర్టీసీ (ఆర్.టీ.సీ.)
రకం
ప్రభుత్వ రంగం
ISINLua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
పరిశ్రమబస్ సేవలు
అంతకు ముందువారుLua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
తరువాతివారుLua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
స్థాపించబడిందిఏప్రిల్ 16, 1853, 1951లో జాతీయం చేయబడినది
స్థాపకుడుLua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
ప్రధాన కార్యాలయం
విజయవాడ
,
పనిచేసే ప్రాంతాలు
ఆంధ్ర ప్రదేశ్
ప్రధాన వ్యక్తులు
ఎన్.వి.సురేంద్రబాబు, ఐపిఎస్ , వైస్ ఛైర్మన్ , ఎం.డి
ఉత్పత్తులుబస్ రవాణా, సరకుల రవాణా, సేవలు
ఆదాయం INR 1545 Crores (~30.5BUSD)
Lua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
Lua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
మొత్తం ఆస్థులుLua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).
ఉద్యోగుల సంఖ్య
Lua error in మాడ్యూల్:Wd at line 196: attempt to call field 'getGlobalSiteId' (a nil value).

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.యస్.ఆర్.టి.సి), ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999 (ఉమ్మడి రాష్ట్రంలో ) నమోదైనది.[1] 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 11,678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని, 55,628 సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది.

రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు పాండిచ్చేరి, తెలంగాణాలకు కూడా బస్సులు నడుపుతున్నది.14 మే 2015న అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుండి సంస్థ కొత్త ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.[2]

దస్త్రం:Rtcofficevijayawada.jpg
నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం విజయవాడ

రాష్ట్రంలో ఆర్.టి.సి. ప్రాముఖ్యత

ఆర్.టి.సి. ఒక ప్రభుత్వ యాజమాన్యంలో నడచే వ్యాపార సంస్థ అయినా గాని ప్రజలు దీనిని ప్రభుత్వం ముఖచిత్రంగా భావిస్తారు. కనుకనే ఆర్.టి.సి. ఛార్జీలు పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏవయినా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగితే అందులో భాగంగా ఆర్.టి.సి. ఆస్తులకు నష్టం జరగడం చాలా సార్లు సంభవించింది. ఆర్.టి.సి. ఇంతటి ప్రాముఖ్యాన్ని పొందడానికి కొన్ని కారణాలు:

 1. సామాన్యులకు అందుబాటులో ఉన్న ఛార్జీలు
 2. మూల మూల గ్రామాలకూ ప్రయాణ సదుపాయాలు
 3. ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక బస్సులు - జాతరలు, పెళ్ళిళ్ళు, రాజకీయ పార్టీ సమావేశాలు వంటివాటికి
 4. పెరుగుతున్న ప్రయాణావసరాలకు అనుగుణంగా ఆర్.టీ.సీ. అనేక మార్పులను ప్రవేశపెట్టింది.
 5. స్థానికీకరణ, అనేక వ్యాపార సంస్థలకు అసాధ్యమైన నెట్‌వర్క్. పల్లెటూరులోని జనులకు ఆర్.టి.సి. ఉద్యోగులు పరాయివారిలా అనిపించరు.

చరిత్ర

దస్త్రం:APSRTC 1932 bus.JPG
1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు

ఎర్ర బస్సు పుట్టుక

తెలంగాణాను నైజాం ప్రభువులు పాలించే రోజులలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నైజాంలో అప్పటికే "నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది.[3] నవంబరు 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు హైదరాబాదు రాష్ట్ర రవాణా సంస్థగా ఉండేది.

ప్రెవేటు రవాణా జాతీయం

దేశస్వాతంత్ర్యం, ఆ తర్వాత తెలంగాణా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని ఏకం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రెవేటు రవాణాను జాతీయం చేస్తూ 1958 జనవరి 11న "ఆంధ్ర ప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ" ఏర్పాటైంది. ఆంధ్ర ప్రాంతంలో దశల వారీగా ప్రైవేటు రవాణాను జాతీయం చేశారు. 1950లో కేంద్రప్రభుత్వం ఆర్.టి.సి. చట్టం చేసింది. దాని ప్రకారం ఆర్టీసీలో రాష్ట్రం, కేంద్రం 2:1 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి. ఆంధ్ర ప్రదేశ్ విషయానికొచ్చేసరికి 1988 వరకు ఈ నిష్పత్తి కొనసాగింది. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రం కూడా ఆర్టీసీకి నిధులు కేటాయింపు నిలిపి వేశాయి. అంత వరకు రాష్ట్రప్రభుత్వం 140 కోట్లు, కేంద్రం 70 కోట్లు కలపి మొత్తం 210 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పెట్టుబడి పెట్టాయి. 1989నుంచి ఈ పెట్టుబడుల కోసం ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది.

దస్త్రం:Ordinary Passenger.jpg
గ్రామీణ బస్సు
మేడ బస్సు
దస్త్రం:Super Express.jpg
ఎక్స్‌ప్రెస్ బస్సు
డీలక్స్ బస్సు
దస్త్రం:GARUDA4.jpg
గరుడా ఎ.సి. బస్సు

బస్సు స్టేషన్లు

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ
ద్వాకకాబస్ స్టేషన్ విశాఖ పట్నం

సంస్థ లక్ష్యాలు

ఆర్.టి.సి. సంస్థ క్రింది బాధ్యతలను నిర్వహించాలని వారి అధికారిక వెబ్‌సైటులో ఇవ్వబడింది[4].

ముఖ్య బాధ్యతలు
 1. ప్రయాణీకులకు పరిశుభ్రమైన, అనుకూలమైన, సమయానుగుణమైన ప్రయాణ సదుపాయాలను, సరసమైన ఛార్జీలతో అందించడం
 2. ఆర్థికంగానూ, మానవతా యుతంగానూ ఉద్యోగులకు సంతృప్తి కలిగే విధానాలు
 3. ఆర్థిక స్వయంసమృద్ధితో నిర్వహణ, ప్రగతి
 4. సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని సాధించడం
విధానాలు
 1. వ్యాపారాన్ని నిజాయితీగా, ప్రావీణ్యంగా, సత్ఫలితాలనిచ్చేలా నిర్వహించడం
 2. తమ వ్యాపారానికి పట్టుకొమ్మలైన వినియోగదారులను (ప్రయాణీకులను) గౌరవిస్తూ వారికి సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలను అందించడం
 3. సాంకేతికంగాను, ఆర్థికంగాను నూతన విధానాలను పరిశీలించి అనుసరించడం
 4. ప్రణాళికాబద్ధంగా, తగు శిక్షణతోను, సహకారంతోను ఉద్యోగుల ఉత్పాదకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం
 5. సంస్థ ఉద్యోగుల, వారి కుటుంబాల శ్రేయస్సుకై కృషి చేస్తూ సంస్థకు వారి తోడ్పాటును పెంపొందించుకోవడం
 6. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ, స్వయం సమృద్ధిని సాధించడం
 7. పర్యావరణానికి, సమాజానికి అవసరమైన విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ. కాలుష్య నివారణ
 8. వ్యాపారంలో ప్రభుత్వ విధానాలను సంపూర్ణంగా అనుసరించడం
 9. బస్సు రావాణా వ్యవస్థ నిర్వహణలో ఉన్నతమైన స్థాయిని సాధించి సమాజంలో సముచితమైన గౌరవమైన స్థానాన్ని పొందడం
2000 దశకంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిచిన మెట్రో బస్సులు

ప్రధాన గణాంకాలు

1958లో ప్రారంభమైన ఆర్.టి.సి. సంస్థ వనరులు 2017 జూలై నెల నాటికి ఇలా ఉన్నాయి[4]

వనరులు
 • వాహనాలు : 11,678
 • ఉద్యోగులు : 55,628
 • మొత్తం డిపోలు : 128
 • విభాగాలు : 12 రీజియన్లు, 4 జోనులు
 • బస్సు స్టేషన్లు : 426
 • బస్సు షెల్టర్లు : 790
 • సగటు రోజు ఆదాయం 1289 లక్షల రూపాయలు
 • సగటు రోజు ప్రయాణ మార్గం : 44 లక్షల కిలోమీటర్లు
 • సగటు రోజు ప్రయాణీకులు : 72 లక్షలు
 • మొత్తం రూట్లు : 3764
 • కలుపుతున్న గ్రామాలు : 14,123
 • ఇంకా చేరని గ్రామాలు : 3,669

నిర్వహణా గణాంకాలు (2017 జూలై నాటికి)

 • ఫ్లీటు వినియోగం : 99.57 %
 • Crew Utilization : 191 కి.మీ.
 • ఉద్యోగుల ఉత్పాదకత (Employees Productivity) : 1 కి.మీ.
 • సమయ పాలన (Punctuality) - ఏప్రిల్ 2007 : 94.37 %
 • ఇంధనం ఎఫిషియన్సీ: లీటరుకు 5.20 కి.మీ.
 • ఇంజిన్ ఆయిల్ ఎఫిషియన్సీ : లీటరుకు 1517 కి.మీ.
 • టైరు ఉపయోగ కాలం : 2.04 లక్షల కి.మీ.
 • ప్రతి 10,000 కి.మీ.కు బ్రేక్-డౌన్ రేటు : 0.04
 • ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాలు : 0.07
 • ప్రతి కిలోమీటరుకు ఆదాయం : 3549 పైసలు
 • ప్రతి కిలోమీటరుకు ఖర్చు : 37.34 పైసలు

వ్యవస్థ స్వరూపం

వనరులు

కార్మికులు

బస్సులు

వ్యాపార భాగస్వాములు

ఇతర వనరులు

ఆర్టీసీకి ప్రస్తుతమున్న అప్పులు రూ.1250 కోట్లు. వీటిపై ఏటా రూ.80 కోట్లకు పైబడి వడ్డీ కింద చెల్లిస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1500 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిలో వెయ్యి ఎకరాలకు పైబడి జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్నాయి. ఈ స్థలాల్ని బీవోటీ ప్రాతిపదికన లీజుకు ఇస్తే రూ.500 కోట్లకు పైబడి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

సేవలు

ప్రయాణ సదుపాయాలు

 • ఆర్టీసీ బస్సులు ఇక ప్రయాణికులు నిర్దేశించినట్టు, ప్రయాణికుల సూచనలు, కోరికల ప్రకారం సర్వీసులను నడపటానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.[5]
 • దేశంలో ఏ ప్రాంతంలోని రోడ్డు రవాణాకు సంబంధించి అయినా,దేశంలో ఏ ప్రాంతంలోని బస్సైనా, అది ఏ రాష్ట్ర రవాణాసంస్థకు చెందినదైనా సరే ఆ బస్సు ఎప్పుడు బయలుదేరింది.. ప్రస్తుతం ఎక్కడ ఉంది.. ఎంతసేపట్లో ఫలానా బస్సుస్టాప్‌/స్టేషను‌కు చేరుకొంటుంది.. టిక్కెట్‌ రుసుం ఎంత? ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వంటి వివరాలన్నీ ఇకపై కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో తెలుసుకునే సౌకర్యం త్వరలో రాబోతోంది. ఇందుకోసం ఒక యూనిఫైడ్‌ యాక్సెస్‌ నంబరు 155220ను కేంద్ర టెలీకమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ కేటాయించింది. ఇందుకోసం కేవలం లోకల్‌కాల్‌ ఛార్జీ మాత్రమే వసూలుచేస్తారు.[6]

స్టేషను సదుపాయాలు

భద్రత

సమస్యలు-లాభమార్గాలు

 • సరుకు రవాణా రంగంలోకి దిగటం
 • వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రాజెక్టు చేపట్టటం
 • ఖాళీ స్థలాలను బీఓటీ కింద లీజుకివ్వటం
 • పల్లెలకు బస్సులు తిప్పటం వల్ల,బస్సు పాస్ ల వల్ల వస్తున్న నష్టాన్నిసబ్సిడీగా ఇవ్వటం
 • ప్రైవేటు ఆపరేటర్లకు ముకుతాడు వేయటం
 • డీజిల్‌పై అమ్మకం పన్ను,టోల్ టాక్స్, వాహనపన్నులు,ఎక్సైజ్ డ్యూటీ, స్పేర్‌పార్ట్స్, ఆస్తి పన్నులు మినహాయించటం.

కార్మికుల అసంతృప్తి, సమ్మె లు,బందు లు

బందులు, ఉద్యమాల సమయంలో రాజకీయ పార్టీలు గానీ, సంస్థలు గానీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే వారి నుంచే నష్టపరిహారాన్ని రాబట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. నష్ట పరిహారం వసూలును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.బస్సుల ధ్వంసం కారణంగా ఆర్టీసీకి రూ.200 కోట్ల వరకు నష్టం జరిగింది. (ఈనాడు 4.2.2010)

ప్రైవేటు రంగం పోటీ

ఇవి కూడా చూడండి

గ్రేటర్ ఆర్.టి.సి.

మూలాలు

 1. http://www.apsrtc.gov.in/About%20Us/Awards/Awards.htm
 2. "Division of APSRTC to begin from May 14". times of india. Retrieved 2018-06-12.
 3. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 డిసెంబర్ 2019. Retrieved 7 December 2019. Check date values in: |archivedate= (help)
 4. 4.0 4.1 ఆర్.టి.సి. సంస్థ అధికారిక వెబ్‌సైటు
 5. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది29.11.2009
 6. ఈనాడు దినపత్రిక, తేది 9.11.2009

బయటి లింకులు