"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆర్కిమెడిస్ సూత్రం

From tewiki
Jump to navigation Jump to search

ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుంది. ఈ సూత్రం నీటిలో మునిగిన లేదా తేలియున్న వస్తువుల ప్రవర్తనను వివరించింది.

వివరణలు అన్నివుంటాయి

ఉర్థ్వ ఒత్తిడి అనగా వస్తువు ద్రవములో మునిగినపుడు అది కొంత భారమును కోల్పోయినట్లు అనిపిస్తుంది. అనగా ఊర్థ్వ దిశలో కొంత బలం పనిచేస్తుంది. ఉదాహరణకు 100 ఘనపు సెం.మీ గలిగిన ఒక లోహపు దిమ్మ ద్రవంలో మునిగినపుడు ఇది అంతే ఘనపరిమాణము గల నీటిని తొలగిస్తుంది. ఇది సుమారు ఒక న్యూటన్ బరువు కలిగి ఉంటుంది. అనగా ఆ లోహపు దిమ్మ ఒక న్యూటన్ బరువును కోల్పోయింది అని చెప్పవచ్చు.
నీటి కంటే సాంద్రత తక్కువ గల ఒక వస్తువు నీటిలో కొంతభాగం తేలియాడుచున్నది అనుకొనుము. అపుడు ఆ వస్తువు కోల్పోయిన నీటి బరువు ఆ వస్తువు భారం కన్నా యెక్కువ ఉండును. కాని నీటిలో కొంత మునిగి యున్న వస్తుభాగము యొక్క బరువు ఆ వస్తువు తొలగించబడ్డ నీటి బరువుకు సమానము అవుతుంది.

ప్లవమాన వస్తువులు

ఒక చెక్క దిమ్మ యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా 6/10 వ వంతు ఉండును. ఈ దిమ్మ నీటిలో తేలినపుడు 6/10 ఘనపరిమాణం గల భాగం మాత్రమే నీటిలో మునిగి ఉంటుంది. అనగా తొలగింపబడిన నీటిభారం ఆ చెక్క దిమ్మ బరువుకు సమానంగా ఉండును.ఒక సాంద్రత గలిగిన వస్తువు కూడా కొన్ని ఆకారాలలో ఉన్నపుడు నీటిలో తేలుటకు కారణం కూడా ఆర్కిమెడిస్ సూత్రమే. ఒక యినుప దిమ్మ నీటిలో మునుగుతుంది. కాని దానిని రేకులా చేసి పడవను చేసినట్లయితే నీటిపై తేలుగుంది.

పడవ నీటిలో ఎందుకు తేలుతుంది

ఒక పడవ నీటిలో తేలుతుంది. దానిలో అధిక బరువులు ఉన్నప్పటికీ నీటిపై తేలుతుంది. దీనికి కారణం నీరు దానికి ఊర్థ్వ బలాన్ని అధికంగా అందజేస్తుంది. ఆ పడవ మంచి నీటిలో కాకుండా సముద్రపు నీటిలో ప్రయాణించటం వలన ఆ నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది కనుక అంది హెచ్చు నీటిని తొలగించును. అందువల్ల ఆ పడవకి సరిపోయే ఊర్థ్వ ఒత్తిడి లభిస్తుంది.

వెస్ట్ అర్చ్మడీస్

ప్లవన సూత్రాలు ప్లవమాన వస్తువులు

సూచికలు