ఆర్మూరు

From tewiki
Jump to navigation Jump to search
  ?ఆర్మూరు
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828Coordinates: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 26.07 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) నిజామాబాద్ జిల్లా
జనాభా
జనసాంద్రత
43,903[2] (2011 నాటికి)
• 1,684/కి.మీ² (4,362/చ.మై)
భాష (లు) తెలుగు
పురపాలక సంఘం ఆర్మూరు పురపాలక సంఘము


ఆర్మూరు, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి చెందిన పట్టణం[3]

భౌగోళీకంగా ఆర్మూరు నిజామాబాదు జిల్లా ఉత్తరాన ఆదిలాబాదు సరిహద్దున ఉంది. జాతీయ రహదారి నెం.7 నుంచి సుమారు ఒక కి. మీ. లోపలికి ఉంది. ఈ పట్టణం నిజామాబాదు నుంచి 27 కిలో మీటర్లు, హైదరాబాదు నుంచి 175 కిలో మీటర్ల దూరంలో ఉంది.

పట్టణ చరిత్ర

దాదాపు 200 సంవత్సరాలకు పూర్వము ఆర్మూర్ ని నవనాతపురం అని పిలిచేవారు. ప్రధాన రహదారి మీదనున్న ఆర్మూరు వచ్చేపోయే వాహనాలకు సహజమైన స్టాపు. శిలామయమైన ఇక్కడి కొండలు లక్షల సంవత్సరాల సహజసిద్ధమైన రాపిడి వలన యేర్పడినవి. దక్షిణ దిశయందు ఉన్న కొండ మీద నవనాథ సిద్దేశ్వర ఆలయం ఉంది.[4] స్థానిక ప్రజలు నవనాథులు లేదా సిద్ధులు ఈ ప్రాంతంలోని సహజమైన గుహలు, కొండ చరియలలో ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు. ఇక్కడికి సమీపమున పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న ఒక నీటిబుగ్గ యొక్క నీటికి రోగములు, వైకల్యములు నివారించే శక్తి ఉన్నదని భావిస్తారు.సందర్శకులు నిత్యం వస్తుంటారు. గుట్టపైన అందాలు ఆరబోసినట్లు పచ్చని ప్రకృతి, అందమైన గుహలు, గుహలో వెలసిన నవనాథ సిధ్దేశ్వర దేవాలయం, గుట్ట మధ్యన విశాలమైన స్థలంలో నిర్మితమైన రామాలయం చూడముచ్చటైనది. గుట్టకు దక్షిణం వైపు రహదారి మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా వాహనాలు గుట్ట పైకి వెళ్ళవచ్చు. ఉత్తరం వైపు పట్టణం విస్తరించి ఉంది. ఉత్తరం వైపు గతంలో నిర్మించిన మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల గుండ గుట్టపైకి వెళ్ళెటప్పుడు పొందే అనుభూతి మధురం. గుట్టపైన కొండల మధ్య చిన్నపాటీ చెరువు ఉంది. మెట్ల మార్గంలో అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం వలస వచ్చిన ఓ సన్యాసి (ప్రస్తుత పూజారి) పరిరక్షిస్తున్నారు. ఆయన అమ్మ వారి కొలువును వదిలి ఇప్పటి వరకు గుట్ట దిగిరాలేదు. అక్కడి నుండి గుట్టపైకి ఎక్కే మార్గంలో హనుమాన్ మందిరం ఉంది.

ప్రభుత్వం , రాజకీయాలు

పౌర పరిపాలన

ఆర్మూరు పురపాలక సంఘం 2006 లో స్థాపించబడింది. దీనిని మూడవ గ్రేడ్గా విభజించారు. ఈ పట్టణంలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. దీని అధికార పరిధి 26.07 కి.మీ2 (10.07 చ. మై.).[1]

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,21,987 - పురుషులు 59,814 - స్త్రీలు 62,173

మూలాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-30.
  4. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 35

వెలుపలి లంకెలు