ఆలీ షేక్

From tewiki
Jump to navigation Jump to search
ఆలీ షేక్
ఆలీ షేక్
జననం
ఆలీ షేక్

(1935-12-02) 1935 డిసెంబరు 2 (వయస్సు 85)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుకవితా వతంస, సద్భావనా కవిమిత్ర
విద్యఎం.ఎ., బి.ఇడి
వృత్తితెలుగు అధ్యాపకులు
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ మస్తాన్‌ బీ,
శ్రీ మహమ్మద్‌ ఖాశిం సాహెబ్‌
పురస్కారాలుకాట్రగడ్డ సాహితీ పురస్కారం, పట్నాయక్‌ నరసింహం ఫౌండేషన్‌ పురస్కారం. రాష్ట్రస్థాయి సాంస్కృతిక-సాహిత్య సంస్థలచే సన్మానాలు పొందారు

ఆలీ షేక్ సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. వీరు అనేక గద్య రచనలు చేశారు. వీరు సంపాదకుడిగా వెలువడిన గ్రంథాలు: 1. గురుదక్షిణ (1960), 2. కోగంటివారి భాషాసేవ (1962).

బాల్యము

ఆలీషేక్ గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా రమణప్పపాలెంలో 1935 డిశంబరు 2 న జననం. వీరి తల్లితండ్రులు: షేక్‌ మస్తాన్‌ బీ, మహమ్మద్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఎ., బి.ఇడి. ఉద్యోగం: తెలుగు అధ్యాపకులు. సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. 1950 నుండి పద్య రచన ఆరంభం.

రచనలు

శతకాలు

 1. మానస ప్రబోధము
 2. గురుని మాట (1970)
 3. అజింఖాన్‌ బాబా (1990)
 4. షిర్డి సాయి ప్రభు (1999)
 5. ఖాదర్‌ బాబా (2001)
 6. శిలువధారి (2003),
 7. ఆంజనేయ (2003)
 8. శ్రీ వాసవీ కన్యక (2008)
 9. చెన్నకేశవ శతకం (2009)

గద్యరచనలు

 1. రైతు బాంధవుడు (జీవితచరిత్ర) (2008)

కావ్యాలు

 1. విధి విలాసము (1985)
 2. ఆకాశవాణి (2000)
 3. ఇందిరా భారతము (2001)
 4. వ్యాస మంజిరి, 1994 (వ్యాస సంకలనం)
 5. సులభ వ్యాకరణము, 1993

సంపాదకుడిగా వెలువడిన గ్రంథాలు

 1. గురుదక్షిణ (1960)
 2. కోగంటివారి భాషాసేవ (1962)

బిరుదములు

కవితా వతంస, సద్భావనా కవిమిత్ర, పురస్కారాలు: కాట్రగడ్డ సాహితీ పురస్కారం, పట్నాయక్‌ నరసింహం ఫౌండేషన్‌ పురస్కారం. రాష్ట్రస్థాయి సాంస్కృతిక-సాహిత్య సంస్థలచే సన్మానాలు పొందారు.

మూలాలు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 42