"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆల్‍ఫ్రెడ్ నోబెల్

From tewiki
Jump to navigation Jump to search
ఆల్‌ఫ్రెడ్ నోబెల్
AlfredNobel adjusted.jpg
జననంఅక్టోబర్ 21, 1833
స్వీడన్ స్టాక్‌హోం, స్వీడన్
మరణండిసెంబర్ 10, 1896
Italy సన్రెమో, ఇటలీ
విశ్రాంతి ప్రదేశం59°21′24.52″N 18°1′9.43″E / 59.3568111°N 18.0192861°E / 59.3568111; 18.0192861
వృత్తిరసాయన శాస్త్రవేత్త
ఇంజనీరు
ఆవిష్కర్త
క్రొత్త వస్తువుల సృష్టికర్త
ప్రసిద్ధిడైనమేట్ , నోబెల్ బహుమతి
సంతకంAlfred Nobel Signature.svg
ఆల్‍ఫ్రెడ్ నోబెల్

About this sound ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్  ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసార

జీవితం

ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872), ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

నోబెల్‌ పురస్కారం

నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

సూచికలు

మూలాలు

యితర లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).