"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షను

From tewiki
Jump to navigation Jump to search

ఆవశ్యక నూనెలను కలిగిన మొక్కలనుండి నూనెలను 1.శోషణ విధానం,2. హైడ్రొ డిస్టిలెసను పద్ధతి,3. సాల్వెంట్ ఎక్సుట్రాక్క్షను పద్ధతులలోనే కాకుండగా సూపర్ క్రిటికల్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో కూడా ఆవశ్యక నూనెలను ఉత్పత్తి చెయ్యడం జరుగుచున్నది. ఈ విధానం మిగతా విధానాలకన్న కాస్త భిన్నమైనది, వైవిధ్యమున్నది. సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్క్షన్ విధానం ఎక్కువ వత్తిడిలో చేయుదురు. అందుచే ఈపద్ధతిలో వినియోగించు పరికరాలు/పాత్రలు (vessels) అన్నియు ఎక్కువవత్తిడిని (pressure) తట్టుకొనే విధంగా నిర్మించవలసి ఉంది.కనీసం 100 కే.జిలు/సెం.మీ2. వత్తిడిని తట్టుకొనేలా వుండాలి.సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షన్‍లో కార్బనుడయాక్సైడును సాల్వెంట్‍గా ఉపయోగించెదరు. కార్బనుడయాక్సైడు మాములు వాతావరణంలో వాయువు రూపంలో వుండును. వాయువురూపంలో వున్న కార్బనుడయాక్సైడునుపయోగించి ఆవశ్యక నూనెలను ఉత్పత్తిచెయ్యడం వీలుకాదు. వాయురూపంలోని కార్బనుడయాక్సైడును ద్రవంవంటి రూపానికి (thick fog, like liquid) మార్చినచో, ఈద్రవంవంటి రూపంలోని కార్బన్‍డయాక్సైడ్కు ద్రావణి (solvent) లక్షణాలు వచ్చును. కార్బన్‍డయాక్సైడును ఎక్కువవత్తిడిని ప్రయోగించి సంకోచింపచేసిన (compress), అది ద్రవరూపానికి మారును. ఆధికవత్తిడిలో వున్నంతవరకు కార్బన్‍డయాక్సైడ్ ద్రవరూపంలో వుండును. వత్తిడిని తొలగించిన తిరిగి కార్బన్‍డయాక్సైడ్ వాయురూపంలోనికి రూపాంతరం చెందును. ఇళ్ళలో వంటకై ఉపయోగించు పెట్రొలియం గ్యాస్‍ను కూడా వత్తిడిలో సంకోచింపచేసి ద్రవంగామార్చి సిలెండరులలో నింపెదరు.LPG ఆనగా liquified Petroleum Gas అని అర్ధము. సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షన్ విధానంలో ఉత్పత్తి తయారుచేయు ఆవశ్యకనూనెల క్వాలిటి మిగతాపద్ధతులలో తయారుచేసిన నూనెలకన్న కాస్తమెరుగుగా వుండును. రంగు తక్కువగా వుండును.

సూపర్ క్రిటికల్ ఎక్సుట్రాక్షన్ విధానము

సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షన్‍పద్ధతిలో ఆవశ్యక నూనెలను తయారుచేయుటకు ఈదిగువ పెర్కొన్న పరికరసముదాయం,, కార్బన్‍డయాక్సైడ్ కావలయును.

  • 1. కార్బన్‍డయాక్సైడ్ వాయువు.
  • 2. కంప్రెస్సరు,, కండెన్సరు
  • 3.ద్రవ కార్బన్‍డయాక్సైడ్ నిల్వపాత్ర
  • 4. ఎక్సుట్రాక్టరు
  • 5. ఎవపరెటరు

కార్బన్‍డయాక్సైడ్ వాయువు

కార్బనును నేరుగా ఆక్సిజనుతో మండించడం ద్వారా కార్బన్‍డయాక్సైడ్ తయారగును.కార్బన్‍ను ఆక్సిజనుతో మండించినప్పుడు రెండుదశలలో కార్బన్‍డయాక్సైడ్ ఉత్పత్తిఅగును.మొదట కార్బను అక్సిజనుతో సంయోగంచెందుట వలన కార్బనుమోనక్సైడు (CO) ఏర్పడును.కార్బన్‍మోనాక్సైడు తిరిగిఆక్సిజనుతో సంయోగంచెందటం వలన కార్బన్‍డయాక్సైడ్ (CO2) ఏర్పడును. గాలితో కూడా కార్బనుపదార్థాలను మండించి కార్బనుడయాక్సైడ్ను తయారుచెయ్యవచ్చును. కాని ఇలాఏర్పడిన కార్బన్‍డయాక్సైడ్‍లో నైట్రొజన్, సల్ఫర్ వంటి ఇతరవాయువులశాతం అధికంగావుండును. అందుచే కార్బనును అధికంగావున్న పదార్థాలను నేరుగాఅక్సిజనుతో మండించడం వలనమాత్రమే స్వచ్ఛమైన కార్బన్‍డయాక్సైడ్ తయారగును.

కంప్రెస్సరు,, కండెన్సరులు

కార్బన్‍డయాక్సైడును కంప్రెస్సరుకు పంపి సంకోచింపచేయుదురు.కంప్రెస్సరులో కార్బన్‍డయాక్సైడును సంకోచింపచేసినప్పుడు అధికమైన వేడి వుత్పన్నమగును.ఈ వేడిని తగ్గించుటకై వెంటనే కార్బన్‍డయాక్సైడును కండెన్సరుకు పంపి చల్లబరెచదరు.సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షనుకు అయ్యినచో కార్బన్‍ డయాక్సైడ్ ఉష్ణోగ్రతను310C వరకుతగ్గించెదరు, ప్రెస్సరును 750 kg/cm2 వరకు పెంచెదరు.మాములు కార్బన్‍డయాకైడ్ ఎక్సుట్రాక్షన్ అయ్యినచో కార్బన్‍డయాక్సైడ్ ప్రెస్సరు 71కే.జి/సెం.మీ2వరకు, ఉష్ణోగ్రతను130C వుండెలా చేయుదురు.

ఎక్సుట్రాక్టరు

మందమైనస్టెయిన్‍లెస్ స్టీల్ లోహంతో నిర్మించబడి, అధిక వత్తిడిని తట్టుకొనేలా నిర్మించబడివుండును.నిలువుగా స్తుపాకారంగావుండి, రెండుచివరలు అర్ధవృత్రాకారంగా వుండును.లోపల వరుసగా ఒకదానిమీద మరొకటి చొప్పున ట్రేలు అమర్చబడివుండును.ఈట్రేలలో నూనె తీయవలసిన ఎండినపూలను వుంచెదరు.కార్బన్‍డయాక్సైడును సర్కులేట్ చెయ్యుటకు అధికవత్తిడిలో పనిచెయ్యగల పంపు వుండును.

ఎవపరెటరు

ఎక్సుట్రాక్టరులో సర్కులేట్ చెయ్యబడి, ఆవశ్యకనూనెలను కలిగివున్న సూపర్ క్రిటికల్ కార్బన్‍డయాకైడును ఈఎవపరెటరులోకి స్ఫ్రే చేయుదురు. ఈఎవపరేటరు మాములు వాతావరణ వత్తిడిలో వుండును. అధికవత్తిడి కలిగివున్న, ఇంచుమించు ద్రవరూపంలోవున్న కార్బన్‍డయాక్సైడ్ ఈఎవపరేటరులో వెంటనే వాయురూపంలోకి మారును. ఆవశ్యక నూనె ద్రవరూపంలో ఎవపరెటరులో వుండిపోవును. ఈవిధానంలో ఆవశ్యక నూనె ఎటువంటి ఉష్ణోగ్రతను ఉపయోగించకుండానే వేరుచెయ్యబడును.

ఉత్పత్తి చేయుట

కార్బన్‍డయాక్సైడ్ వాయువును ఉత్పత్తిచేసి, దానిని కావలసిన ప్రెస్సరుకు కంప్రెస్సరులో సంకోచింపచేసి, అవసరమైన ఉష్ణోగ్రతకు చల్లబరచెదరు.ఈసూపరు క్రిటికల్ కార్బన్‍డయాక్సైడును ఎక్సుట్రాక్టరులో ట్రేలలో వున్నపూల మీద సర్కులేట్ చేయుదురు.సర్కులెట్ అయ్యి ఆవశ్యక నూనెను సంగ్రహించిన కార్బన్‍డయాక్సైడును ఎవపరెటరులోకి పంపి కార్బన్‍డయాక్సైడును వాయురూపంలోకి మార్చి ఆవశ్యకనూనెను పొందెదరు.

ఈ విధానం అత్యధిక వత్తిడిలో నిర్వహించ వలసివున్నందున్న ఎక్సుట్రాక్టరు ఘనపరిమాణం చాలాచిన్నదిగా వుండును.అధికవత్తిడిని తట్టుకొనేలా పెద్ద ఘనపరిమాణంలో వెసల్సును తయారు చేయడం కొంచెం కష్టమైనపని.అధికవత్తిడిని తట్టుకొనుటకై వెస్సల్సును ప్లేట్ తో కాకుండా మందమైనగొట్టాలను వర్తులాకారంగా చుట్టి వాటికిమందమైన తొడుగు (outer shell) ను కప్పివుంచాల్సి ఉంది.అధిక వత్తిడివద్ద పని చెయ్యవలసివున్నందున చాలాజాగ్రత్తలు తీసుకోవాలి.అత్యధికవత్తిడి తట్తుకోలేక వెసల్సు (vessels) బద్దలైన జరిగేప్రాణ, ఆస్తి ప్రమాద నష్టం బారీస్దాయిలో వుండును.