"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (C)

From tewiki
Jump to navigation Jump to search

Part 1: ca

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • C, c, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో మూడవ అక్షరం; (2) పరీక్షలలో బొటాబొటీగా ఉత్తీర్ణులైన వారికి వచ్చే గురుతు; (3) ఒక విటమిన్ పేరు; (4) కర్బనం అనే ఒక రసాయన మూలకం గుర్తు;
 • cab, n. బాడుగబండి; టేక్సీ; (ety.) shortened version of taxicab;
 • cabal, n. బందుకట్టు; కుట్రదారులు;
 • cabalistic, adj. అతి మర్మమైన; గోప్యమైన;
 • cabbage, n. కోసుకూర; గోబీ; ఆకుగోబి; కేబేజీ; గోబిగడ్డ;
 • cabin, n. గది; కొట్టు; గుడిసె;
 • cabinet, n. (1) మంత్రి మండలి; అమాత్య వర్గం; (2) బీరువా; పెట్టె;
  • medicine -, ph. మందుల బీరువా; మందుల పెట్టె;
 • cable, n. (1) మోకు; తాడు; రజ్జువు; (2) తీగ; తంతి; తంతిమోకు;
 • caboose, n. (1) కుంపటి; వంట గది; (2) రైలు బండిలో చివర వచ్చే పెట్టె;
కాకౌ చెట్టు, కోకో కాయలు
 • cacao, n. కకావ్; ఈ కకావ్ చెట్టు (Theobroma cacao) నుండి లభించే గింజలే కకావ్ గింజలు, లేదా కోకో (cocoa) గింజలు; ఈ గింజలలోని కొవ్వు పదార్థమే కోకో వెన్న; కోకో వెన్నతో పంచదార కలిపితే తెల్ల ఛాకొలేటు వస్తుంది; వెన్న తీసేసిన తర్వాత గింజలని వేయించి, పొడి చేస్తే వచ్చేదే కోకో. ఈ కోకోకి పంచదార, వెన్న కలిపితే వచ్చేదే బూడిద రంగులో ఉండే ఛాకొలేటు; ఈ చెట్టుకీ coca తుప్పకీ పేరులో పోలిక తప్ప మరే సంబంధమూ లేదు;
 • cacatoo, n. కాకతువ్వ; చిలకని పోలిన దక్షిణ అమెరికా పక్షి;
 • cache, n. ఉపనిధి; చిన్న కొట్టు; కోశం;
 • cackle, n. కూత; అరుపు;
 • cacography, n. పిచ్చిగీతలు; కెక్కిరిబిక్కిరి గీతలు;
 • cacophony, n. కర్కశ ధ్వని; గోల; అపశ్రుతి; కర్ణకఠోరం; కాకిగోల;
 • cactus, n. జెముడు; కంటాలం; బొమ్మజెముడు;
  • large -, ph. బొమ్మజెముడు; బొంతజెముడు; బ్రహ్మజెముడు;
 • cad, n. నీతిమాలన వ్యక్తి; తుచ్ఛుడు;
 • cadaver, n. కళేబరం; శవం; ప్రేతం; పీనుగు; కొయ్యడానికి సిద్ధపరచిన కళేబరం;
 • cadaverous, adj. ప్రేతకళతోనున్న; ప్రేతసదృశం; పీనుగువంటి; మృతప్రాయం;
 • cadence, n. లయ; స్వరం యొక్క అవరోహణ;
 • cadjan, n. తాటాకు; తాటి ఆకు; తాళపత్రం;
 • Cadmium, n. కాద్మము; వెండిలా తెల్లగా, తగరంలా మెత్తగా ఉండే లోహ లక్షణాలు కల రసాయన మూలకం; (సంక్షిప్త నామం, Cd; అణు సంఖ్య 48);
 • cadre, n. (కాడ్రే) బాపతు; ఉద్యోగులలో తరం; స్థాయి;
 • Caesium, n. సీజియం; పసుపు డౌలుతో ఉన్న వెండిలా మెరిసే రసాయన మూలకం; సంక్షిప్త నామం, Cs; అణు సంఖ్య 55); గది తాపోగ్రత వద్ద ద్రవంగా ఉండే అయిదు లోహపు మూలకాలలో ఇది ఒకటి;
 • cafeteria, n. కాఫీ కొట్టు; కాఫీ దొరకు స్థలం; కాఫ్యాగారం; స్వయంగా వడ్డన చేసికొనడానికి అమరిక ఉండే భోజన, ఫలహారశాల; [Spanish, cafe = coffee; teria = place];
 • caffeine, n. కెఫీన్; కాఫీలో ఉత్తేజాన్ని కలిగించే రసాయన పదార్థం; తెల్లగా, చేదుగా ఉండే ఒక క్షారార్థం; కాఫీ, టీ వగైరాలలో ఉండే ఉత్తేజితం; C8H10N4O2;
 • cage, n. పంజరం; బోను;
  • animal,-, ph. బోను;
  • bird -, ph. పంజరం;
 • cajole, v. t. బెల్లించు; లాలించు; సముదాయించు; బుజ్జగించు; కుస్తరించు; మోసగించు;
 • cake, n. (1) శష్కులి; కేకు; తీపి రొట్టె; కేకు; (2) ఉండకట్టిన పిండి పదార్థం;
  • - of oil seed, ph. తెలక పిండి; పిణ్యాకము; ఖలి;
 • caking, n. ఉండకట్టడం;
 • calamine, n, జింక్ ఆక్సైడులో 0.5 శాతం ఫెర్రిక్ ఆక్సైడుని కలిపి నీళ్లల్లో రంగరించగా వచ్చిన ముద్ద;
 • calamitous, adj. విపత్కరమయిన;
 • calamity, n. ఆపద; ఉపద్రవం; అరిష్టం; విపత్తు; ముప్పు; పెద్ద ఆపద; అనర్ధం; ఉత్పాతం; ఉపహతి;
 • calamus, n. వస; వానీరం; వేతసం; the sweet flag [bot. Acorus calamus];
 • calcaneus, n. [anat.] మడమ ఎముక;
 • calciferol, n. ఖటికథరాల్; విటమిన్ డి; స్పటికాకారి అయిన ఒక అలంతం; C28H43OH;
 • calcification, n. ఖటీకరణం;
 • calcination, n. భస్మీకరణం; బుగ్గి చెయ్యడం; నిస్తాపనం;
 • calcinated, adj. భస్మము చేయబడిన; బుగ్గి చేయబడ్డ;
 • calcinated mercury, ph. రసభస్మం;
 • Calcium, n. ఖటికం; ఒక రసాయన మూలకం; (సంక్షిప్త నామం, Ca; అణు సంఖ్య 20, అణు భారం 40.08); [Lat. calx = lime];
  • - arsenate, ph. ఖటిక పాషాణం; డి.డి. టి. రాక పూర్వం క్రిమి సంహారిణిగా వాడేవారు; Ca3 (AsO4)2
  • - carbide, ph. ఖటిక కర్బనిదం; CaC2;
  • - carbonate, ph. ఖటిక కర్బనితం; సున్నపురాయి; CaCO3;
  • - chloride, ph. ఖటిక హరిదం; CaCl2;
  • hydroxide, ph. సున్నం; ఖటిక జలక్షారం;
  • - oxide, ph. ఖటిక భస్మం;
 • calculate, v. i. లెక్కించు; లెక్కకట్టు; గణించు;
 • calculating machine, n. కలన యంత్రం; గణన సాధని;
  • analog -, సారూప్య కలన యంత్రం;
  • digital -, అంక కలన యంత్రం;
 • calculation, n. లెక్క; కలనం; గణనం;
 • calculator, n. (1) లెక్కిణి; కలని; గణక్; లెక్కలు చేసే యంత్రం; (2) లెక్కలు కట్టే మనిషి;
 • calculus, n. (1) కలనం; కలన గణితం; (2) మూత్రకృచ్ఛం; అశ్మరి;
  • differential -, ph. [math.] చలన కలనం;
  • integral -, ph. [math.] సమా కలనం; కలన గణితం;
  • renal -, ph. మూత్రపిండాశ్మరి; మూత్రపిండాలలోని రాయి;
  • urinary -, ph. మూత్రాశయాశ్మరి; మూత్రాశయంలోని రాయి;
 • caldron, n. కాగు; డెగిసా; చరువు; బాన; ద్రవములని మరిగించడానికి వాడే లోహపు పాత్ర;
 • Caledonian, adj. స్కాట్‍లండ్‍ దేశానికి సంబంధించిన;
 • calendar, n. (1) పంచాంగం; తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో హిందూ సాంప్రదాయ సిద్ధంగా వుండే పుస్తకం పంచాంగం; (2) కేలండరు; ఇంగ్లీషు సంప్రదాయంతో, నెల, వారం, సెలవురోజులు, వగయిరాలతో వుండేది కేలండరు; (3) రోజులు, వారాలు, నెలలు, ఋతువులు మొదలయిన కాలచక్ర విశేషాలని చూపే పుస్తకం;
  • - day, ph. పంచాంగ దినం; ఒక అర్ధరాత్రి నుండి తర్వాత అర్ధరాత్రి వరకు; ఒక రోజు;
  • - month, ph. పంచాంగ మాసం; నెల మొదటి రోజు నుండి, ఆఖరు రోజు వరకు;
  • - year, ph. పంచాంగ సంవత్సరం; జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు; (rel.) fiscal year అంటే 365 (లీపు సంవత్సరంలో అయితే 366) రోజుల వ్యవధి; దేశాచారాన్ని బట్టి ఎప్పుడేనా మొదలవవచ్చు; అమెరికాలో అక్టోబరు 1న fiscal year మొదలవుతుంది;
 • calf, n. (1) f. పెయ్య; ఆవుపెయ్య; తువ్వాయి; m. దూడ; క్రేపు; వత్సం; (2) కాలిపిక్క; పిక్క; జంఘ;
 • caliber, n. కొలత; ప్రమాణం; అధికారం;
 • calibrated, adj. క్రమాంకిత;
 • calibration, n. క్రమాంకనం; స్పుటీకరణం; ప్రమాణీకరణం;
 • calipers, n. వ్యాసమితి; వ్యాసాన్ని కాని మందాన్ని కాని కొలవడానికి వాడే సాధనం; రెండు స్థానాల మధ్య దూరాన్ని కొలిచే సాధనం;
 • calisthenics, n. కసరత్తు; కండబలం పెరగడానికి చేసే కసరత్తు; వ్యాయామం; see also aerobic exercise;
 • call, n. పిలుపు; కేక;
  • bird -, ph. కూత; పిట్టకూత; అభిక్రందం;
 • calligraphy, n. నగీషీరాత; సొగసైన రాత;
 • callus, callous, n. కాయ; కిణకము; కఠిన వస్తువుల స్పర్శ వల్ల ఏర్పడే కాయ; అరికాలులో కాని, అరిచేతిలో కాని పెరిగే కాయ; గాయమును కప్పుతూ ఏర్పడిన కణజాలం;
 • callous, adj. కఠినమైన; దయ లేని;
 • calm, adj. నిశ్చలమైన; నెమ్మదైన; ప్రశాంతమైన; గాలిలో కదలిక లేని; నీటిలో కెరటాలు లేని;
 • calm, n. నిశ్చలత; ప్రశాంతత;
 • calmness, n. ప్రశాంతత;
 • calm down, n. తగ్గు; నెమ్మదించు; ప్రశాంతపడు;
 • calomel, n. రసభస్మం; బస్తం; క్రిమి సంహారిణిగాను, శిలీంధ్ర సంహారిణిగాను వాడేవారు; Hg2Cl2; (rel.) corrosive sublimate;
 • calorie, n. కేలోరీ; వేడిని కొలిచే కొలమానం; (note) రెండు రకాల కేలరీలు ఉన్నాయి. వెయ్యి కేలరీలని పెద్ద కేలరీ (Calorie) అనీ కిలో కేలరీ (kilo calorie) అనీ అంటారు. ఆహారంలో పోషక శక్తిని కొలిచేటప్పుడు ఈ పెద్ద కేలరీలనే వాడతారు కానీ నిర్లక్ష్యంగా కేలరీ అనేస్తూ ఉంటారు;
 • calorimeter, n. ఉష్ణతామాపకం; వేడిని కొలిచే సాధనం; (rel.) ఉష్ణోగ్రతని కొలిచేది తాపమాపకం (లేదా ఉష్ణమాపకం, థర్మోమీటర్);
 • caltrop, n. (1) పల్లేరు కాయ; [bot.] Tribulus terrestris (Zygophyllaceae); (2) ఆకారంలోనూ, పరిమాణంలోనూ పల్లేరు కాయ లా ఉండే ఉక్కుతో చేసిన ఒక ఆయుధం;
 • calve, v. i. ఈనుట; పశువులు పిల్లలని కనడం;
 • calx, n. భస్మం;
 • calyx, n. పుష్పకోశం; ప్రమిద వలె ఉన్న పుష్పకోశం; రక్షక పత్రావళి;
 • came, n. రెండు గాజు పలకలని పట్టి బంధించే సీసపు బందు;
 • came, v. i. వచ్చెను; అరుదెంచెను; వేంచేసెను; విచ్చేసెను; ఏగుదెంచెను;
 • camel, n. ఒంటె; లోటిపిట; లొట్టియ; క్రమేలకం; m. ఉష్ట్రము; f. ఉష్ట్రిక;
 • camera, n. (1) కేమెరా; ఛాయాచిత్రములు తీసే పరికరం; (2) గది;
 • camp, n. మకాం; మజిలీ; విడిది; శిబిరం;
  • computer -, ph. a program offering access to recreational or educational facilities for a limited period of time
  • military -, ph. స్కంధావారం; శిబిరం;
  • summer -, a place usually in the country for recreation or instruction often during the summer;
 • campaign, n. (1) ఉద్యమం; పరికర్మ; ఎసవు; (2) ప్రచారం; (3) దండయాత్ర;
 • campaigners, n. ప్రచారకులు;
 • camphor, n. కర్పూరం; సితాభం; ఘనసారం;
 • campus, n. ప్రాంగణం; పాఠశాల యొక్క ప్రాంగణం;
 • can, v. i. (కెన్) శక్త్యర్ధకమైన క్రియావాచకం; కలను; కలడు; కలుగు; మొ.;
 • can, n. (కేన్) డబ్బా; డబ్బీ; డిబ్బీ; డొక్కు;
 • canal, n. (1) కాలువ; కాల్వ; క్రోడు; కుల్యం; కుల్లె; (2) నాళం;
  • ear -, ph. చెవి కాలువ;
  • alimentary -, ph. ఆహారనాళం;
  • irrigation -, ph. సేద్యకుల్యం; సాగుకుల్లె; సాగుకాల్వ;
 • canard, n. పుకారు; అసత్యవార్త;
 • cancel, v. i. రద్దగు;
 • cancel, v. t. రద్దుచేయు; కొట్టివేయు;
 • Cancer, n. (1) కర్కాటక రాశి; కర్కాటకం; (2) పీత; (3) పుట్టకురుపు; రాచపుండు; కేన్సరు; a malignant and invasive growth or tumor, esp. one originating in epithelium, tending to recur after excision and to metastasize to other parts of the body; (3) పీత; ఎండ్రకాయ;
 • candid, adj. నిష్కపటమైన; దాపరికం లేని; నిజమైన;
 • candidacy, n. అభ్యర్థిత్వం;
 • candidate, n. అభ్యర్థి; దరఖాస్తు పెట్టిన వ్యక్తి;
  • opposing -, ph. ప్రత్యర్థి;
 • candle, n. కొవ్వొత్తి; మైనపు వత్తి;
  • fat -, ph. కొవ్వొత్తి;
  • wax -, ph. మైనపు వత్తి;
 • candor, n. నిష్కాపట్యం; నిజం; యదార్థం;
 • candy, n. కలకండ; ఖండీ; మిఠాయి;
  • rock -, ph. కలకండ; పటికబెల్లము; కండచక్కెర; కండ; కలకండ; ఖండశర్కర; పులకండము; మత్స్యందిక;
 • cane, n. (1) బెత్తు; బెత్తం; (2) చేతి కర్ర;
  • rattan -, ph. బెత్తం;
  • - chair, ph. బెత్తు కుర్చీ;
 • canine, adj. కుక్కజాతి;
 • canines, n. కోరపళ్లు; రథనికలు;
 • Canis Major, n. శ్వానం; పెద్ద కుక్క; బృహత్ లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్ర రాశి; మృగశిరకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే సిరియస్ నక్షత్రం ఉంది;
 • Canis Minor, n. పూర్వ శ్వానం; చిన్న కుక్క; లఘు లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్రరాశి; మృగశిరకి తూర్పుదిశగాను; మిధునరాశికి దగ్గరగాను ఉన్న ఈ రాశిలోనే ప్రోకియాన్ నక్షత్రం ఉంది;
 • canister, n. డిబ్బీ; చిన్న డబ్బా;
 • canker, n. (1) పుండు; కురుపు; నోటిలో పుండు; (2) జంతువులలో కాని, చెట్లలో కాని గజ్జి కురుపుని పోలిన వాపు;
  • citrus -, ph. నిమ్మ గజ్జి;
 • canna, n. మెట్టతామర;
 • canned, adj. డబ్బాలో నిల్వ చేసిన; డబ్బా; డబ్బీ;
  • - food, ph. డబ్బా ఆహారం; డబ్బా ఆహార పదార్థం;
  • - juice, ph. డబ్బా రసం;
  • - milk, ph. డబ్బా పాలు;
  • - vegetables, ph. డబ్బా కూరగాయలు; డబ్బా సబ్‌జీ;
 • cannibal, n. నరమాంస బక్షకుడు; పొలదిండి; పొలసుదిండి;
 • cannibalism, n. నరమాంస భక్షణ; పంచజనచర్వణం; పొలదిండిత్వం;
 • cannon, n. ఫిరంగి; శతఘ్ని;
 • cannot, aux. v. చెయ్యలేను; (అధికార రీత్యా చెయ్యలేకపోవడం); చేయ వల్ల కాదు; (జరిగే పని కాదు); చేతకాదు (చేసే సమర్ధత లేదు);
 • canoe, n. దోనె; మువ్వ దోనె; సంగడి;
 • canola, n. కనోలా; రేపుమొక్క; [bot.] Brassica napus; B. campestris; a hybrid variety of rape plant, related to mustard, bred to produce oil low in saturated fatty acids;
 • canola oil, n. రేపు మొక్క విత్తనాలనుండి పిండిన నూనెకి కెనడాలో వాడే వ్యాపారనామం; can అంటే Canada, o అంటే oil, la అంటే low acid అని అర్థం;
 • canon, n. సూత్రం; సూత్రవాక్యం;
 • canonical, adj. శాస్త్రీయ; శౌత్ర; ధర్మశాస్త్ర ప్రకారం; ధార్మిక;
 • Canopus, n. అగస్త్య నక్షత్రం;
 • canopy, n. చందువా; చాందినీ; పందిరి; మేల్కట్టు; ఉల్లడ; కురాళము; పందిరి; వితానం:
  • tree -, ph. వృక్షప్రస్తారం; శాఖాఛాదితం; కురాళము కట్టినది; కొమ్మలచే కప్పబడ్డది;
  • - bed, ph. పందిరి మంచం;
 • canteen, n. ఫలహారశాల;
 • canthus, n. కనుకొలికి; కంటి ఎగువ రెప్పలు, దిగువ రెప్పలు కలిసే చోటు;
 • canto, n. కాండం; సర్గం; అధ్యాయం; స్కంధం; ఆశ్వాసం;
 • canvas, n. కిత్తనార గుడ్డ; కట్లంక; కేన్వాసు గుడ్డ;
 • canvass, v. t. ప్రచారం చేయు;
 • canyon, n. పెను లోయ; ప్రవహించే నీటితో దొలచబడి నిట్టనిలువుగా అటూ, ఇటూ కొండలు ఉన్న లోయ;
 • cap, n. టోపీ; మకుటం;
 • capability, n. స్తోమత; సమర్ధత; సామర్ధ్యం; యోగ్యత; శక్తి;
 • capacitor, n. [elec.] ధారణి; కెపేసిటర్;
 • capacity, n. ఉరవ; స్తోమత; సత్తా; పరిమాణం; ధారణశక్తి; గ్రహణశక్తి; తాహతు; శక్తి; సామర్థ్యం; ఆభూతి;
  • heat -, ph. ఉష్ణ ధారణశక్తి; ఉష్ణ గ్రహణశక్తి;
 • cape, n. (1) అగ్రం; త్రిభుజాకారపు భూభాగపు చివరి భాగం; (3) భుజాలమీదుగా వీపు వైపు కిందకి దిగజారే ఒక వ విశేషం;
 • capers, n. pl. (1) చిలిపి చేష్టలు; (2) చెంగనాలు
 • capillary, n. కేశనాళిక; రక్తనాళములలో అతి సూక్ష్మమైన నాళిక;
 • capital, adj. (1) పెట్టుబడి; (2) ముఖ్య; (3) ఉత్పాదక;
  • - goods, ph. ఉత్పాదక వస్తువులు; ఉత్పాదక సరంజామా;
  • - offense, ph. ఘోరాపరాధం;
  • - outlay, ph. పెట్టుబడిగా వినియోగించిన మూలధనం;
  • - punishment, ph. మరణ దండన; (rel.) ఉరిశిక్ష;
  • - investment, ph. మూలధనం; పెట్టుబడి;
  • - offense, ph. ఘోరాపరాధం;
  • - gains, ph. పెట్టుబడిలో లాభం; మూలధనం విలువలో పెరుగుదల; ఒక ఇల్లు ఆరు లక్షలకి కొని, పదిలక్షలకి అమ్మితే వచ్చిన నాలుగు లక్షల లాభం capital gains. ఈ ఇంటిని నెలకి వెయ్యి చొప్పున అద్దెకి ఇచ్చి ఉంటే, నెలనెలా వచ్చే అద్దె పెట్టుబడి మీద వచ్చే ఆదాయం మాత్రమే. ఈ అద్దె పెట్టుబడి మీద లాభం కాదు;
 • capital, n. (1) పెట్టుబడి; మూలధనం; మూలం; మదుపు; పరిపణం; (2) ముఖ్యపట్టణం;
  • fixed -, ph. స్థిరమూలం; స్థిర మూలధనం;
  • floating -, ph. చరమూలం; చర మూలధనం;
  • issued -, ph. జారీ చేసిన మూలధనం;
  • paidup -, ph. చెల్లించిన మూలధనం;
  • reserve -, ph. నిల్వ మూలధనం;
 • capitalism, n. పెట్టుబడిదారీ వ్యవస్థ; ధనస్వామ్యం; షాహుకారీ;
 • capitalist, n. పెట్టుబడిదారు; ధనస్వామి; షాహుకారు;
 • capitation, n. తలసరి రుసుం; విద్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ అయే ఖర్చుని తలవారీ పంచి పన్నులా విధించడం;
  • - fee, ph. ప్రవేశ నిమిత్త రుసుం; తలపన్ను; తల ఒక్కంటికి అని విధించే రుసుం;
 • capitulation, n. అంగీకారం; ఓటమి ఒప్పేసుకోవడం; రాజీపడడం;
 • capric, adj. మేష; మేకకి సంబంధించిన;
 • capric acid, n. మేషిక్ ఆమ్లం; దశనోయిక్ ఆమ్లం; Decanoic acid; CH3 (CH2)8COOH;
 • Capricorn, n. మకరరాశి; (lit. మేషరాశి); దక్షిణాకాశంలో ధనుస్సుకీ, కుంభానికీ మధ్య కనిపించే రాశి; ఉరమరగా డిసెంబరు 22న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు; మకరం అంటే మొసలి. కేప్రికారన్ అంటే మేక. ఇక్కడ భాషాంతరీకరణంలో భావం దెబ్బ తింది; (see Aries);
  • Tropic of -, ph. మకరరేఖ; మేకరేఖ;
 • caproic acid, n. మేషోయిక్ ఆమ్లం; షష్టనోయిక్ ఆమ్లం; Hexanoic acid; C6H12O2;
 • caprice, n. చాపల్యం; చాపల్యత; నిలకడ లేనితనం;
Caprylic-acid=మేషిలిక్ ఆమ్లం
 • caprylic acid, n. మేషిలిక్ ఆమ్లం; అష్టనోయిక్ ఆమ్లం; Octanoic acid; C8H16O2;
 • capsicum, n. మిరప; మిరప శాస్త్రీయ నామం;
ఎర్ర బెంగుళూరు మిరప
  • - peppers, ph. బుట్ట మిరప; బెంగుళూరు మిరప;
 • capsize, v. i. తలక్రిందులగు; పల్టీకొట్టు; మునుగు;
 • capsule, n. గుళిక; కోశం; గొట్టం;
 • captain, n. (1) దండనాయకుడు; కపితాను; (2) నౌకనేత;
 • caption, n. వ్యాఖ్య; వ్యాఖ్యావాక్యం; శీర్షిక;
 • capture, v. t. పట్టుకొను; హస్తగతం చేసుకొను;
 • car, n. బండి; పెట్టె; రథం; శతాంగం; అరదం; వయాళి; కారు;
  • rail -, ph. రైలు పెట్టె;
 • carafe, n. గాజు కూజా; సారాని వడ్డించే గాజు కూజా;
 • caramel, n. (1) వన్నె; కల్తీలేని జీళ్లపాకం; ముదర పాకం; (2) దోరగా మాడిన పంచదార;
 • carat, n. (1) వన్నె; కల్తీలేని బంగారానికి 24 వన్నెలు; పదహారో వన్నె బంగారం అంటే 16 పాళ్లు బంగారం, 8 పాళ్లు మరొక లోహం; సాధారణంగా ఈ రెండవ లోహానికి రాగి కాని, ప్లేటినంకాని, పెల్లేడియం కాని వాడతారు; (2) వజ్రాలు, మొదలయిన వాటిని తూచడానికి వాడే కొలత; దరిదాపు 0.2 గ్రాముల బరువు, లేదా 4 వడ్లగింజల ఎత్తు;
 • caravan, n. (1) బిడారు; బిడారము; ఒంటెల వరస; (2) ఊరేగింపులో ఒకదాని వెనక ఒకటిగా వెళ్లే వాహనాల సమూహం; (3) పధికులు; తండా;
  • serail -, ph. కాలంబ్యం;
 • caraway seed, n. షాజీరా; సీమసోపు; సీమసోపు విత్తులు; [bot.] Carum carvi;
 • carbide, n. కర్బనిదం;
 • carbo, pref. కర్బన;
 • carbohydrate, n. కర్బనోదకం; కర్బనోదజం; పిండి పదార్థం; (lit.) చెమర్చిన కర్బనం;
 • carbolic acid, n. కార్బాలిక్ ఆమ్లం; ఆంగిక రసాయనంలో తరచుగా తారసపడే ఆమ్లం;
 • Carbon, n. కర్బనం; అంగారం; బొగ్గు; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 12, సంక్షిప్త నామం, C); [Lat. carbo = charcoal];
 • carbon chain, n. కర్బనపు గొలుసు;
 • carbon chemistry, n. కర్బన రసాయనం;
 • carbon tetrachloride, n. కర్బన చతుర్ హరితం; చతుర్ హరిత పాడేను; CCl4;
 • carbonate, n. కర్బనితం;
 • carbonization, n. కర్బనీకరణం;
 • carbuncle, n. వ్రణం; రాచకురుపు; రాచపుండు; ప్రమేహపిటకం;
 • carburetor, carburettor (Br.), n. అంతర్‍దహన యంత్రాలలో ఇంధనాన్ని, గాలిని సరియైన పాళ్లల్లో కలిపి సిలిండర్‍లోకి పంపే ఉపకరణం;
 • carcass, n. కళేబరం; డొక్కి; తినడం కోసం చంపిన జంతువుల మృత దేహం;
 • carcinogen, n. కేన్సరుజని; కేన్సరు వ్యాధిని కలుగజేసే పదార్థం;
 • card, n. కార్డు; అట్టముక్క; ముక్క;
  • credit -, ph. అరువు కార్డు; క్రెడిట్ కార్డు;
  • playing -, ph. పేక ముక్క; చీట్ల పేక;
  • post -, ph. కార్డు ముక్క; ఉత్తరం;
 • cardamom, n. ఏలకి; ఏలకి కాయ; చిట్టేలకి; కోరంగి;
 • cardboard, n. అట్ట;
 • cardiac, adj. హృదయ; హృద్; గుండెకి సంబంధించిన;
  • - arrest, ph. గుండె ఆగిపోవడం;
  • - murmur, ph. గుండెలో గురగుర;
  • - edema, ph. గుండె వాపు;
 • cardigan, n. కార్డిగన్; ముందుభాగం తెరచివున్న స్వెట్టరు;
 • cardinal, adj. ఉత్తమ; ఉత్కృష్ట; ముఖ్య; ప్రధాన;
  • - counting, ph. ఉత్తమ గణనం;
  • - numbers, ph. ఉత్తమ సంఖ్యలు; వేదాంకములు; ఒకటి, రెండు, మూడు వగైరా అంకెలు;
  • - rule, ph. ఉత్తమ నియమం; వేదవాక్కు;
 • carding, n. దూదిని ఏకడం;
 • cardio, adj. హృదయ; హృద్; గుండెకు సంబంధించిన;
 • cardioid, n. హృదయాభం; ఒక రకం వక్ర రేఖ; epicycloid;
 • cardiology, n. హృదయ వైద్యశాస్త్రం; గుండెకి సంబంధించిన వైద్య శాస్త్రం;
 • care, n. (1) జాగ్రత్త; లక్ష్యం; (2) సంరక్షణ; చింత;
 • care, v. i. ఖాతరు చేయు; లక్ష్యపెట్టు;
 • career, n. వృత్తి;
 • carefree, adj. చీకు చింత లేకుండా;
 • careful, adj. జాగ్రత్త; అప్రమత్తత;
  • be -, ph. జాగ్రత్తగా ఉండు; అప్రమత్తతతో ఉండు; ఒళ్లు దగ్గర పెట్టుకో;
 • carefully, adv. జాగ్రత్తగా; అప్రమత్తంగా; ఊజ్జితంగా;
 • careless, adj. అజాగ్రత్త; ప్రమత్తత;
 • carelessly, adv. అజాగ్రత్తగా; అలవోకగా ; నిర్లక్ష్యముగా; అసడ్డగా;
 • carelessness, n. నిర్లక్ష్యం; అజాగ్రత్త; ప్రమత్తత; ఏమరిపాటు;
 • caress, v. t. నిమురు; దువ్వు; లాలించు; ముద్దాడు;
 • caret, n. హంసపాదుకి గుర్తు; హంసపాదు; అంచపదం;
 • caretaker, n. మాలి; సంరక్షకుడు;
  • - government, ph. ఆపద్ధర్మ ప్రభుత్వం;
 • cargo, n. సరుకులు, ఓడలలోనూ, విమానాలలోనూ, తదితర వాహనాలలోనూ వేసే సరుకులు;
 • cargo ship, ph. కప్పలి;
 • caricature, n. తూలికాచిత్రం; వ్యంగ్య చిత్రం; వికట వర్ణన;
 • caries, n. పుచ్చిపోయిన (దవడ) ఎముక;
  • dental -, ph. పుచ్చిపోయిన పన్ను; పుప్పి పన్ను;
 • carminative, n. వాతహరి; a medicine that subdues any gas in the stomach;
 • carnage, n. మారణహోమం; విధ్వంసకాండ; ఎంతోమందిని చంపడం, గాయపరచడం;
 • carnivore, n. మాంసాహారి; శాష్కలి; క్రవ్యాదం;
 • carol, n. ఏలపాట; ఏలపదం;
 • carotid artery, n. గళధమని; మన్యధమని; గ్రీవధమని;
 • carotene, n, అనేక కాయగూరలలో ఉండే ఒక రసాయనం; C40H56; విటమిన్ A తయారీకి కావలసిన ముడి పదార్థం;
 • carousel, n. (1) గుండ్రటి ఆకారం ఉండి గుండ్రంగా తిరిగేది; రాట్నం; (2) రంగులరాట్నం;
 • carp, n. గండుచేప; బెడిసమీను; శఫరం;
 • carpal, adj. మణికట్టుకి సంబంధించిన; మణిబంధిక;
  • - tunnel syndrome, ph. ఎక్కువగా టైపు కొట్టడం వంటి పనులు పదే పదే చెయ్యడం వల్ల కీళ్లల్లో నొప్పి మొదలగు లక్షణాలు పొడచూపుతూ వచ్చే సందర్భం;
 • carpenter, n. వడ్రంగి; త్వష్ట్ర; సూత్రధారుడు;
 • carpenter's planer, ph. చిత్రిక;
 • carpentry, n. వడ్రంగం;
 • carpet, n. తివాసీ; కంబళీ;
 • carporal, adj. శారీరకమైన;
  • - punishment, ph. బెత్తంతో కొట్టడం, శొంటిపిక్క పెట్టడం వంటి శారీరకమైన శిక్ష;
 • carpus, n. మనికట్టు;
 • carriage, n. కంచరం; బండి; వాహనం; పెట్టె;
 • carrier, n. (1) భారవాహుడు; రవాణాదారు; (2) భారవాహిక; రవాణా సాధనం; (3) మోపరి; రోగాన్ని మోసే వ్యక్తి; ఒక రోగంతో బాధ పడకుండా ఆ రోగాన్ని ఇతరులకి అంటించే స్తోమత ఉన్న జీవి; ఉదా. మలేరియా వ్యాధికి దోమ మోపరి; (4) వాహకం; వాహకి;
  • - wave, ph. [phys.] వాహక తరంగం;
 • carrot, n, ఎర్ర ముల్లంగి; పచ్చ ముల్లంగి; గాజర; గాదెర; కేరట్‍;
 • carry, n. బదిలీ; మిగులు; బదులు; కూడకంలో స్థానమందు వేసికొనే అంకె; (ant.) borrow;
 • carry, v. t. మోయు; ఎత్తుకొను;
 • carrot, n. ఎర్రముల్లంగి; పచ్చముల్లంగి; కేరట్;
 • cart, n. బండి; శకటం; బగ్గీ; రెండు చక్రాల బండి; కంచరం;
 • cartel, n. ఉత్పత్తిదారుల ఉమ్మడి సంఘం;
 • cartilage, n. తరుణాస్థి; ఉపాస్థి; మృదులాస్థి; కోమలాస్థి; కేకసం;
 • cartridge, n. తూటా; తూటాలో మందుగుండు సామాను, సీసపు గుండ్లు ఉంటాయి;
 • carton, n, డబ్బా; అట్టతో కాని, ప్లాస్టిక్‍తో కాని చేసిన డబ్బా;
 • cartoon, n. కొంటెబొమ్మ; పరిహాసచిత్రం; వ్యంగ్యచిత్రం;
 • carve, v. t. దొలుచు; చెక్కు; కోరు;
 • cascade, n. నిర్‌ఝరం; సెలయేరు; సోన;
 • case, n. (1) బడి; (2) పెట్టి; గలీబు; (3) వ్యాజ్యం; అభియోగం; (4) దృష్టాంతం; సందర్భం; (5) విభక్తి; grammatical function of a noun or pronoun in a sentence; (6) రోగి; ఉపతాపి;
  • ablative -, ph. [gram.] పంచమీ విభక్తి; వలన; కంటె; పట్టి;
  • accusative -, ph. [gram.] ద్వితీయా విభక్తి; ని; ను; కూర్చి; గురించి; కర్మకారకం; generally indicates the direct object of a verb;
  • conjunctive -, ph. [gram.] సహార్థక విభక్తి; తో, తోడ, మొదలగునవి;
  • dative -, ph. [gram.] చతుర్థీ విభక్తి; కొరకు; కై; generally used for a noun which receives something, something which moves toward that noun;
  • genitive -, ph. [gram.] షష్ఠీ విభక్తి; కి, కు, యొక్క, లో, లోపల; generally indicates that one noun is being modified by another noun;
  • in -, ph. ఒకవేళ; అయితే గియితే;
  • in any -, ph. ఏది ఏమైనప్పటికి;
  • instrumental -, ph. [gram.] కరణార్థక విభక్తి; తృతీయా విభక్తి; చే, చేత, మొదలగునవి; a noun usually used as a tool to complete action;
  • locative -, ph. [gram.] సప్తమీ విభక్తి; అందు; ఇందు; న; used to indicate location;
  • lower -, ph. చిన్నబడి; ఇంగ్లీషులో రాత అక్షరాలు;
  • nominative -, ph. [gram.] ప్రథమా విభక్తి; కర్తృకారకం;
  • pillow -, ph. తలగడ గలీబు;
  • special -, ph. పరిమితిగల సందర్భం; ప్రత్యేక సందర్భం;
  • upper -, ph. పెద్దబడి; ఇంగ్లీషులో అచ్చు అక్షరాలు;
  • vocative -, ph. [gram.] సంబోధనా ప్రథమా విభక్తి;
 • cash, n. నగదు; రొక్కం; పైకం; సొమ్ము;
  • petty -, ph. దినవెచ్చం; చిన్న చిన్న ఖర్చులకు కేటాయించిన డబ్బు;
  • - box, ph. గల్లాపెట్టి;
  • - cow, ph. నగదు ధేనువు; వ్యాపారంలో ఎల్లప్పుడు లాభాన్ని తెచ్చే వస్తువు;
 • cashew, n. జీడిమామిడి; ముంతమామిడి; ఎర్ర జీడి; [bot.] Anacardium occidentale;
 • cashews, n. జీడిపప్పు; ముంతమామిడి పప్పు;
 • cashew nuts, n. pl. జీడిపిక్కలు;
 • cashew apple, n. జీడిమామిడి పండు;
 • cashier, n. షరాబు; నగదు అధికారి; కేషియరు;
 • casino, n. జూదశాల;
 • cask, n. పీపా;
 • casket, n, (1) కరండం; పేటిక; (2) శవపేటిక;
 • Caspian sea, n. తురక కడలి;
 • cassava, n. ఒక రకం కర్ర పెండలం; సగ్గుబియ్యం చెయ్యడానికి వాడే దుంప; ఈ దుంప స్వస్థలం దక్షిణ అమెరికా; ఈ దుంపలలో సయనైడ్‍ అనే విష పదార్థం ఉంటుంది కనుక వీటిని నానబెట్టి, ఉడకబెట్టి, పిండి చేసిన తరువాతనే తినాలి; [bot.] Manihot esculenta;
 • cassette, n. కరండం; పెట్టె;
 • Cassiopea, n. [astro.] కాశ్యపీయులు; కశ్యప ప్రజాపతి సంతానం; అప్సరసలు; శర్మిష్ఠ నక్షత్రం;
 • cast, n. (1) నటీనటులు; తారాగణం; నటీనటవర్గం; (2) అచ్చు; ముద్ర;
 • cast, v. t. పోత పోయు;
 • castanet, n. చిడత;
 • cast iron, n. పోత ఇనుము;
 • castigate, v. t. దుయ్యబట్టు;
 • caste, n. కులం; వర్గం; తెగ; జాతి;
  • higher -, ph. అగ్రకులం;
  • scheduled -, ph. దళిత వర్గం; ఉపేక్షత వర్గం;
  • untouchable -, ph. అంటరాని కులం; దళిత వర్గం;
 • castle, n. కోట; దుర్గం;
 • Castor and Pollux, n. మిథునరాశి;
 • Castor, Pollux and Procyon, n. పునర్వసు నక్షత్రం;
 • castor oil, n. ఆముదం; చిట్టాముదం;
 • castoreum, n. సీమ కస్తూరి; కెనడా, రష్యా దేశాలలో తిరిగే బీవర్ జాతి జంతువుల పొట్ట దగ్గర ఉండే తిత్తులనుండి స్రవించే పదార్థం; దీన్ని సెంట్ల తయారీలో వాడతారు;
 • castration, n. శస్త్ర చికిత్స ద్వారా వృషణాలని తీసివెయ్యడం లేదా పనిచెయ్యకుండా చెయ్యడం;
 • casual, adj. దైవాధీనమైన; ఆకస్మికమైన; అచింతితమైన; యాదృచ్ఛికమైన; తాత్కాలిక;
  • - guest, ph. అనుకోకుండా వచ్చిన అతిథి; అభ్యాగతి;
  • - leave, ph. ఆకస్మికంగా కావలసి వచ్చిన శెలవు;
 • casually, adj. ఆనుషంగికంగా; ఆషామాషీగా; యథాజ్లాపంగా;
 • casualties, n. pl. హతక్షతాలు; హతక్షతులు;
 • casualty, n. (1) నష్టం; (2) యుద్ధంలో కాని, ప్రమాదంలో కాని దెబ్బలు తగిలినవారు, చనిపోయినవారు;
 • casuarina, n. సరుగుడు చెట్టు; సర్వీ చెట్టు;
 • cat, n. (1) పిల్లి, మార్జాలం; బిడాలం; ఓతువు; (2) పులి; సింహం;
 • cat's eye, n. వైడూర్యం; నవరత్నాలలో ఒకటి;
 • catabolism, n. విచ్ఛిన్న ప్రక్రియ; జీవకోటి శరీరాలలో సజీవ కణజాలాన్ని రద్దు సామగ్రిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ; same as destructive metabolism; (ant.) anabolism;
 • cataclysm, n. మహాప్రళయం;
 • catalog, catalogue (Br.), n. (1) జాబితా; పట్టిక; చలానా; (2) పట్టీ పుస్తకం; సూచీ గ్రంథం;
 • catalysis, n. ఉత్ప్రేరణం; రసాయన సంయోగాన్ని త్వరితపరిచే ప్రక్రియ;
 • catalyst, n. ఉత్ప్రేరకం; తోపు; రసాయన సంయోగాన్ని త్వరితపరచే పదార్థం;
 • cataract, n. (1) జలపాతం; పెద్ద జలపాతం; (2) శుక్లం; కంటిలో పువ్వు; మసక కమ్మిన కంటికటకం;
 • catarrh, n. (కేటర్‍) శైత్యం; చలువ; జలుబు; పడిశం; పీనస; గొంతు, ముక్కులలో పొర వాపు;
 • catastrophe, n. వినిపాతం; గొప్ప విపత్తు; ఆశనిపాతం; ఉత్పాతం;
  • - theory, ph. ఉత్పాత వాదం; అకస్మాత్తుగా జరిగే ప్రక్రియల ప్రభావాన్ని గణిత సమీకరణాలతో వర్ణించే పద్ధతి;
 • catch, v. t. అంటుకొను; పట్టుకొను; చేయు;
 • catch a thief, ph. దొంగని పట్టుకొను;
 • catching a cold, ph. జలుబు చేయు; పడిశం పట్టు;
 • catching fire, ph. అంటుకొను; రాజుకొను;
 • catchment, n. ఆరగాణి; ఏటిదండి; పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతం;
 • catchment area, n. పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతపు వైశాల్యం;
 • catchword, n. ఊతపదం;
 • catechu, n. కాచు;
 • categorical, adj. సంవర్గ;
 • categorization, n. వర్గీకరణ; కోవీకరణ; ఒక కోవలో పెట్టడం;
 • category, n. కోవ; వర్గం; తెగ;
 • catenary, n. రజ్జువక్రం; మాలావక్రం; రెండు రాటల మధ్య వేలాడే తాడు ఆకారపు వక్ర రేఖ;
 • caterer, n. మోదీ; వండిన భోజన పదార్థాలని సరఫరా చేసే వ్యక్తి లేదా సంస్థ;
 • caterpillar, n. ఆకుపురుగు;
  • hairy -, ph. గొంగళిపురుగు;
 • catfish, n, వాలుగ; ఒక జాతి చేప;
 • cathartic, n. విరేచనకారి; విరేచనాలు అవడానికి వాడే మందు; భేదిమందు;
 • catheter, n, సన్నని రబ్బరు గొట్టం; శరీరపు నాళాలలోనికి జొప్పించడానికి వాడే గొట్టం;
 • cathode, n. రునోడు; రుణధ్రువం;
 • catnap, n. కునుకు; కోడికునుకు;
 • cattle, n. పశువులు; గొడ్లు; పసరములు;
 • caucus, n. సమాలోచన;
 • caudal, adj. పుచ్ఛక; తోకకి సంబంధించిన;
 • cauldron, n. మరిగించడానికి వాడే అండా; బాన; కొప్పెర; కాగు; ఆండా;
  • metallic -, ph. కొప్పెర; డేగిసా;
 • cauliflower, n. కోసుకూర; ముట్టకోసు; కాలీఫ్లవర్;
 • causal, adj. (కాజల్) కారణ; కారకమైన; నైమిత్తిక;
 • causal body, ph. కారణ శరీరం; అంగ శరీరం; సూక్ష్మశరీరం;
 • causal, n. (కాజల్) నైమిత్తికం; కారణభూతం;
 • causative, adj. కారకం; హేతు;
 • causative agent, ph. కారకి; హేతు కర్త;
 • cause, n. కారణం; నిమిత్తం; హేతువు; హేతు కర్త; కతం; శకునం; ప్రేరణ; కారకం;
  • efficient -, ph. నిమిత్త కారణం;
  • material -, ph. ఉపాదాన కారణం;
 • cause and effect, ph. కారణ కార్యములు; ప్రేరణ స్పందనలు; జనక జన్యములు;
 • cause and effect relationship, ph. కారణ కార్య సంబంధం; పౌర్వాపర్యం; జనక జన్య సంబంధం;
  • with -, ph. సహేతుకంగా, సకారణంగా;
  • without -, ph. అకారణంగా;
సింగపూర్ ని మలేసియాతో కలిపే సేతువు
 • causeway, n. సేతువు; ఇది వంతెన కాదు కాని నీటిని దాటడానికి కట్టిన రహదారి; A causeway is a track, road or railway on the upper part of an embankment across "a low, or wet place, or a piece of water"; సముద్రం దాటి లంకకి వెళ్ళడానికి రాముడు కట్టినది సేతువు;
 • caustic, adj. దాహక; దహించేది; కాల్చునట్టిది; తాకిడి వలన శరీరాన్ని పొక్కించేది; గాఢ; తీక్షణ;
  • - alkali, ph. దాహక క్షారం;
  • - potash, ph. దాహక పొటాష్, potassium hydroxide;
  • - soda, ph. దాహక సోడా; sodium hydroxide;
 • cauter, n. వాతలు పెట్టే పుల్ల;
 • cauter, v. t. (1) వాతలు పెట్టు; (2) శస్త్ర చికిత్సలో శరీరాన్ని చిన్నగా కాల్చు; చిరిగిన చర్మాన్ని అతకడానికి చిన్నగా చురకలు పెట్టు;
 • caution, n. మందలింపు; హెచ్చరిక;
 • caution, v. t. మందలించు; హెచ్చరించు; జాగ్రత్త; భద్రత;
 • cavalry, n. ఆశ్వికసేన; ఆశ్వికదళం; గుర్రపు దండు; సాహిణి;
 • cave, n. గుహ; కుహరం; గహ్వరం; బిలం; కందరం;
  • interior of a -, ph. గుహాంతరం;
 • caveat, n. (కేవియాట్‍) షరతు; వివరణ; హెచ్చరిక; మెలి; మెలిక; ఆక్షేపణ; ఆటంకం;
 • caveat lector, ph. చదువరీ, జాగ్రత్త!; చదివిన అంశం లోని నిజానిజాలు నిర్ణయించే బాధ్యత చదువరిదే!
 • caveat emptor, ph. కొనుగోలుదారుడా, జాగ్రత్త!; కొన్న వస్తువు యొక్క మంచి చెడులు నిర్ణయించే బాధ్యత కొనుగోలుదారిదే!
 • caviar, n, (కేవియార్) ఉప్పులో ఊరవేసిన కొన్ని రకాల చేప గుడ్లు; ఒకొక్క జాతి చేప కడుపులోంచి తీసిన గుడ్లతో చేసిన కేవియార్‍ లక్ష డాలర్ల వరకు పలకవచ్చు;
 • cavity, n. (1) కుహరం; గది; గహ్వరం; కోటరం; వివరం; బిలం; రంధ్రం; (2) డొల్ల; పుచ్చు; పుప్పి పన్ను; నోటిలోని పన్ను పుచ్చడం;
  • abdominal -, ph. ఉదర కుహరం;
  • chest -, ph. హృదయ కుహరం;
  • thoracic -, ph. హృదయ కుహరం;
 • cayenne, n. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయల పొడి;
  • - peppers, ph. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయలు

Part 2: cb-cl

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • cease, v. i. ఆగు;
 • cease, v. t. ఆపు; ఉడుగు;
 • cease and desist letter, ph. "చేసూన్న పని ఆపు, మళ్లా చెయ్యకు" అని ఆజ్ఞ ఇస్తూ రాసిన ఉత్తరం; పేటెంటు హక్కులని ఉల్లంఘించిన సందర్భాలలో ఇటువంటి ఉత్తరాలు ఎక్కువ వాడతారు;
 • cease-fire, n. ధర్మదార; కాల్పుల విరమణ;
 • ceaseless, n. నిరంతరం;
 • ceaselessly, adv. ఆపకుండా; అదేపనిగా; ఎడతెగకుండా; నిరంతరంగా; హోరాహోరీగా;
 • cedar, n. దేవదారు; దేవదారు చెట్టు;
 • ceiling, n. సరంబీ; లోకప్పు; (rel.) roof;
 • ceiling brush, n. పట్లకర్ర;
 • celebrated, adj. ఖ్యాతివడసిన; వినుతికెక్కిన; కీర్తికెక్కిన; ప్రసిద్ధ; పేరున్న; విఖ్యాత; ఘనమైన; జేగీయమాన;
 • celebrity, n. m.చాంచవుఁడు; f.చాంచవి; ఖ్యాతివడసిన వ్యక్తి; కీర్తికెక్కిన వ్యక్తి; వినుతికెక్కిన వ్యక్తి; పేరుపొందిన వ్యక్తి;
 • celestial, adj. నభో; ఖగోళ; ఖ; అంతరిక్ష;
  • - body, ph. నభోమూర్తి; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు;
  • - equator, ph. ఖగోళమధ్యరేఖ; ఖమధ్యరేఖ; విషువద్ వృత్తం; నాడీవలయం; the great circle on the celestial sphere halfway between the celestial poles;
  • - horizon, ph. ఖగోళీయ క్షితిజం;
  • - meridian, ph. మధ్యాహ్నరేఖ;
  • - poles, ph. ఖగోళీయ ధ్రువములు; భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళాన్ని తాకే ఉత్తర, దక్షిణ బిందువులు;
  • - ship, ph. నభోతరణి; రోదసీనౌక;
  • - sphere, ph. ఖగోళం; నక్షత్రాలన్నీ తాపడం చేసినట్లు కనిపించే గోళం;
 • celibacy, n. బ్రహ్మచర్యం; (lit.) the divine act;
 • celibate student, n. బ్రహ్మచారి; (coll.) గోచిపాతరాయుడు;
 • cell, n. (1) కణము; జీవకణం; (2) చిన్నగది; అర; అర్ర; కోషికం; కోష్టం; (3) బందీగది; (4) ఘటం;
  • agranulose -, ph. కణికరహిత కణం;
  • apical -, ph. అగ్ర కణం;
  • blood -, ph. రక్త కణం;
  • daughter -, ph. పిల్ల కణం;
  • eucaryotic -, ph. నిజకేంద్రక కణం;
  • fuel -, ph. ఇంధన కోషికం; ఇంధన కోష్టం;
  • granulose -, ph. కణికసంహిత కణం;
  • mother -, ph. తల్లి కణం; మాతృ కణం;
  • procaryotic -, ph. పూర్వకేంద్రక కణం;
  • prothallial -, ph. ప్రథమాంకుర కణం;
  • red blood -, ph. ఎర్ర కణం;
  • sex -, ph. లైంగిక కణం; లింగ కణం;
  • sheath -, ph. తొడుగు కణం;
  • shield -, ph. డాలు కణం;
  • white blood -, ph. తెల్ల కణం;
  • - division, ph. కణ విభజన;
  • - membrane, ph. కణత్వచం; కణ పొర; కణ పటలం;
  • - phone, ph. చరవాణి; (note) here the word is translated from mobile phone; A mobile phone is a better descriptor because "cell phone" has been derived from "cellular technology" and a mobile phone need nor rely on cellular technology;
  • - nucleus, ph. కేంద్రకం; కణిక;
  • - sap, ph. కణసారం;
  • - theory, ph. కణ సిద్ధాంతం;
  • - wall, ph. కణ కవచం;
 • cellar, n. భూగృహం; నేలమాళిగ; భూమట్టానికి దిగువగా ఉన్న గది; (rel.) basement;
 • cellophane, n. కణపత్రం; కణోజుతో చేసిన పల్చటి, పారభాసకమైన, కాగితం వంటి రేకు;
 • cellulose, n. కణోజు; పేశిమయం; మొక్కల కణాలలో ఉండే ఒక పీచు పదార్థం కనుక కణోజు అన్నారు;
 • cement, n. సిమెంటు; సీమసున్నం; సంధిబంధం;
 • cement, v. t. అతుకు; కలుపు; సంధించు;
 • cemetery, n. శ్మశానం; రుద్రభూమి; ఖనన భూములు;
 • Cenozoic era, n. నవ్యజీవ యుగం; నవజీవ యుగం; The Cenozoic is also known as the Age of Mammals, because the extinction of many groups allowed mammals to greatly diversify; the current and most recent of the three Phanerozoic geological eras, following the Mesozoic Era and covering the period from 66 million years ago to present day.
 • censer, n. ధూపపు పాత్ర; ధూపం వెయ్యడానికి వాడే పాత్ర; చిన్న ఆనపకాయ ఆకారంలో ఉండి వేలాడదీయడానికి వీలుగా ఒక గొలుసు ఉన్న పాత్ర:
 • censor, v. t. కత్తిరించు; సెన్సారు; నిషిద్ధ దృశ్యాలని, రాతలని కత్తిరించే పద్ధతి; see also censure;
 • censoriousness, n, రంధ్రాన్వేషణ; పనికట్టుకుని తప్పులు పట్టడం;
 • censure, n. నింద; మందలింపు; అభిశంసనం; ఆక్షేపణ;
 • censure, v. t. దూషించు; నిందించు; మందలించు; అభిశంసించు;
 • census, n. జనాభా లెక్క; జనపరిగణన; జనగణనం; జనసంఖ్య;
 • cent, n. డాలరు వగైరా నాణేలలో నూరవ భాగం; పైస;
 • centaur, n. (1) నరతురంగం; గ్రీకు పురాణాలలో అగుపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ; (2) కింపురుషులు; హిందూ పురాణాలలో కనపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ; see also satyr;
 • centenarian, n. నూరేళ్ళు బతికిన వ్యక్తి;
 • centenary, n. శతవార్షికోత్సవం;
  • birth -, ph. శతవార్షిక జయంతి;
  • death -, ph. శతవార్షిక వర్ధంతి;
 • center, centre (Br.), n. కేంద్రం; నాభి;
  • - of gravity, ph. గరిమనాభి; గురుత్వ కేంద్రం;
  • - of mass, ph. గరిమనాభి; ద్రవ్యనాభి;
  • - of inertia, ph. జడనాభి;
 • centigrade, adj. శతపద; వంద భాగాలుగా చేసిన;
  • - thermometer, ph. శతపద ఉష్ణమాపకం; సెంటీగ్రేడ్‍ ఉష్ణమాపకం; వేడిని కొలవడానికి సున్న నుండి వంద డిగ్రీల వరకు ఉన్న మేరని వంద భాగాలుగా విభజించబడ్డ పరికరం;
 • centimeter, centimetre (Br.), n. సెంటీమీటరు; మీటరులో నూరవ వంతు;
 • centipede, n. శతపాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి; జెర్రి; రోకలిబండ అనే ఎరట్రి క్రిమి; (lit.) నూరు పాదములు కలది; నిజానికి శతపాదికి 32-40 కాళ్లే ఉంటాయి;
 • central, adj. కేంద్రీయ; కేంద్ర; మధ్య;
  • - government, ph. కేంద్ర ప్రభుత్వం;
  • - nervous system, ph. కేంద్ర నాడీమండలం;
 • centralization, n. కేంద్రీకరణం; కేంద్రీకృతం;
 • centrifugal, adj. అపకేంద్ర; కేంద్రం నుండి బయటకు పోయే ;మధ్యత్యాగి; మధ్యస్థలాపకర్షిత;
 • centripetal, adj. కేంద్రాభిముఖ; వృత్తంలో పరిధి నుండి కేంద్రం వైపు సూచించే దిశ; మధ్యాకర్షిత; మధ్యాభిగామి;
 • century, n. శతాబ్దం; శతాబ్ది; నూరేళ్లు;
 • cephalic, adj. కాపాలిక; కపాలానికి సంబంధించిన;
 • ceramic, adj. పక్వమృత్త; కాలి గట్టి పడిన;
 • ceramic, n. మృణ్మయం; మృత్తిక;
 • cereals, n. తృణధాన్యాలు;
 • cerebellum, n. చిన్నమెదడు; అనుమస్తిష్కం;
 • cerebral, adj. మస్తిష్క; మూర్ధన్య; మెదడుకి కాని బురక్రి కాని సంబంధించిన;
  • - hemispheres, ph. మస్తిష్క గోళార్ధాలు; మెదడులో కనిపించే రెండు అర్ధ భాగాలు;
 • cerebrals, n. [ling.] మూర్ధన్యములు; గొంతుక వెనక భాగం నుండి ఉచ్చరింపబడే హల్లులు;
 • cerebrospinal, adj. మస్తిష్కమేరు; మస్తిష్కసుషుమ్న;
  • - fluid, ph. మస్తిష్కమేరు ఐర; మస్తిష్కమేరు జలం;
 • cerebrum; n. పెద్దమెదడు; బృహన్మస్తిష్కం;
 • ceremony, n. (1) క్రతువు; (2) ప్రత్యేకమైన పండుగ; (3) ఆబ్దికం;
  • funeral -, ph. దినవారాలు;
 • certain, n. తధ్యం; తప్పనిది; ఖాయం;
 • certainty, n. తధ్యం; ఖాయం;
 • certainly, interj. అవశ్యం; తప్పకుండా;
 • certificate, n, నిర్ణయపత్రం; యోగ్యతాపత్రం; ధ్రువపత్రం; ప్రమాణపత్రం; మహాజరునామా; ఒరపురేకు;
  • birth -, ph. జన్మ పత్రం, జన్మ నిర్ణయ పత్రం
  • death -, ph. మరణ పత్రం, మరణ నిర్ణయ పత్రం;
 • cervical, adj. గ్రీవ;
 • Cesium, n. ఆకాశనీలం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 55, సంక్షిప్త నామం, Cs); [Lat. caesius = sky blue];
 • cess, n. పన్ను; same as tax, still used in British colonial countries;
 • cesspool, n. గంధకుండం; పీతిరి గుంట; మురికి కుండీ; కూపం;
 • cetacean, n. తిమింగలం;
 • chaff, n. (1) పొట్టు; పొల్లు; పప్పుల మీద ఉండే తొక్క; (2) ఊక; వరి మొదలైన ధాన్యాల మీద ఉండే తొక్క;
 • chagrin, n. మనస్థాపం; విసుగు; వేసట;
 • chain, adj. గొలుసు; శృంఖల;
  • - isomerism, ph. శృంఖల సాదృశం;
  • - reaction, ph. శృంఖల చర్య; గొలుసుకట్టు చర్య;
  • - rule, ph. శృంఖల సూత్రం; పరంపర ప్రమాణం;
 • chain, n. (1) గొలుసు; చయనిక; శృంఖలం; (2) నాను; హారము; పేరు; సరం; (3) దామము; దండ; మాలిక; (4) వరుస; పరంపర;
  • side -, ph. పక్కగొలుసు;
  • - rule, ph. గొలుసుకట్టు సూత్రం;
 • chair, n. కుర్చీ; కుర్చీపీట; పీఠం;
  • easy -, ph. పడక కుర్చీ; ఆసందీ;
  • lounging -, ph. పడక కుర్చీ; ఆసందీ;
 • chairman, n. సభాపతి; అధ్యక్షుడు; పీఠాధిపతి;
 • chalcedony, n. పుష్యరాగం; కురువిందం; కురింజి;
 • chalice, n, పంచపాత్ర; కలశం; చర్చిలో మధుపానం కొరకు వాడే పాత్ర;
 • chalk, n. సుద్ద; పాలమన్ను; ధవళ మృత్తిక; calcium carbonate;
  • piece of -, ph. సుద్ద ముక్క;
  • red -, ph. శిలాజిత్తు; గైరికం; అరదళం;
 • challenge, n. సవాలు;
గరుడ ఫలం
 • chalmogra, n, గరుడఫలం; ఈ ఫలం రసంతో లేపనం చేస్తే బొల్లి మచ్చలు పోతాయంటారు; [bot.] Hydnocarpus wightiana;
 • chalmogroil, n, గరుడతైలం; గరుడఫల తైలం;
 • chamber, n. (1) వేశ్మము; గది; కోష్ఠం; కోష్ఠిక; పేటిక; (2) మండలం;
  • cloud -, ph. జీమూత కోష్ఠిక;
  • small -, ph. కోష్ఠిక; పేటిక;
  • - of commerce, ph. వాణిజ్య మండలం;
 • chameleon, n. (కమీలియాన్) ఊసరవెల్లి; మూడు వన్నెల తొండ;
 • chamois, n. (షామీ) కొండజింక; మేకని పోలిన ఒక రకం కొండ లేడి; [biol.] Rupicapra rupicapra;
  • - leather, ph. కొండజింక తోలు; జింక తోలు; జింక చర్మం;
 • chamomile, n. (కేమోమిల్) సీమ చేమంతి; కేమోమిల్లా; [bot.] Marticaria Chamomilla;
 • champion, n. జెట్టి; వస్తాదు;
  • world -, ph. జగజ్జెట్టి;
 • chance, n. అవకాశం; తరుణం; అదను; తరి; సమయం;

---Usage Note: chance, opportunity

 • ---Use these words to talk about something you are able to do because of luck. Chance also means possibility.
 • chandelier, n. దీపవిన్యాసం; కందీలు; (ety.) candle lights;
 • change, n. (1) మార్పు; ఫిరాయింపు; (2) పరిణామం; వికారం; (3) చిల్లర డబ్బు;
  • gradual -, ph. క్రమ పరిణామం;
  • phonetic -, ph. ధ్వని పరిణామం;
  • semantic -, ph. అర్థ విపరిణామం;
 • change, v. i. మారు; ఫిరాయింపు;
 • change, v. t. మార్చు; ఫిరాయించు;
 • channel, n . (1) మార్గం; దారి; పరీవాహం; (2) సహజమైన జలమార్గం; జలసంధి; see also canal; (3) ఛానల్;
 • chaos, n. (కేయాస్) కల్లోలం; అస్తవ్యస్తత; అవ్యక్త స్థితి; అయోమయం; గందరగోళం; గజిబిజి; అరాజకత్వం;
 • chaperon, n. f. పెద్దదిక్కు; రక్షకురాలు;
 • chaplain, n. గురువు; ఆచారి; పురోహితుడు;
 • chappals, n. pl. [Ind. Engl.] చెప్పులు; (rel.) sandals; flip-flops; slip-on shoes;
 • chapped, adj. పగుళ్లు వేసిన; బీటలు వేసిన;
 • chapter, n. అధ్యాయం; ప్రకరణం; ఆశ్వాసం; సర్గం; కాండం; పర్వం; స్కంధం; పరిచ్ఛేదం;
 • character, n. (1) శీలం; నడవడి; నడవడిక; (2) స్వభావం; లక్షణం; తత్వం; గుణం; శీలత; (3) మూర్తి; శాల్తీ; ఆసామీ; పాత్ర; శీలత; (4) వర్ణం; అక్షరాంకం;
  • alphabetical -, ph. అక్షరమూర్తి;
  • alphanumerical -, ph. అక్షరాంకికమూర్తి;
  • person of good -, ph. గుణవంతుడు; గుణవంతురాలు;
  • - actor, ph. గుణచిత్ర నటుడు; గుణచిత్ర నటి; ప్రధాన పాత్రలు కాకుండా ఇతర ముఖ్య పాత్రలు పోషించగలిగే నటుడు;
  • - set, ph. వర్ణ సంచయం;
 • characteristic, adj. లాక్షణిక; స్వాభావిక; విశిష్ట;
 • characteristic, n. స్వభావం; ముఖ్య లక్షణం; తత్వం; గుణం; విశిష్టత; కారకత్వం;
 • characteristic equation, n. లాక్షణిక సమీకరణం;
 • characteristics, n. pl. లక్షణాలు; గుణగణాలు;
 • characterize, v. t. ఉపలక్షకరించు; వర్ణించు; చిత్రించు;
 • charcoal, n. బొగ్గు; అంగారం;
  • animal -, ph. శల్యాంగారం; జంతుబొగ్గు;
  • wood -, ph. కఱ్ఱబొగ్గు; ద్రుమాంగారం; దార్వాంగారం;
  • - grill, ph. కుంపటి; అంగారిణి; అంగారధానిక; బొగ్గుల కుంపటి;
 • charge, n. (1) ఘాతం; ఆవేశం; భాండం; విద్యుత్‍వంతం; తటిత్వంతం; తటి; ఛార్జి; (2) అప్పగింత; హవాలా; (3) ఫిర్యాదు; (4) దాడి;
  • electrical -, ph. విద్యుదావేశం; విద్యుత్‍వంతం; తటి;
  • false -, ph. అభాండం;
 • charge, v. t. ఆరోపించు; నిందమోపు; మీదకి దూకు; మీద పడు; (2) ఖాతాలో వేయు; (3) అప్పగించు; భారం వేయు;
  • - sheet, ph. (1) ఆరోపణ పత్రం; నేరారోపణ పత్రం; (2) అప్పగింత పత్రం;
 • charisma, n. సమ్మోహన శక్తి; జనాకర్షక శక్తి;
 • charitable, adj. దాతృత్వ; ధర్మ;
  • - organization, ph. దాతృత్వ సంస్థ;
  • - trust, ph. దాతృత్వ నిధి; ధర్మనిధి; ధర్మసంస్థ;
 • charitableness, n. దాతృత్వశీలత; త్యాగశీలత;
 • charity, n. ఉదాత్తత; దాతృత్వం; ఈగి; తిరిపెం;
 • charlatan, n. అల్పజ్ఞుడు; పండితమ్మన్యుడు; కుహనా మేధావి; దుర్విదగ్ధుడు; లోతైన జ్ణానము లేని వ్యక్తి;
 • charm, n. రక్తి; మనోజ్ఞత; కమ్రం;
 • charming, adj. రమణీయ; మనోహర; కమ్రమైన;
 • chart, n, పటం; బొమ్మ; చక్రం;
  • natal -, ph. జన్మ చక్రం; జాతక చక్రం;
 • chartered, adj. శాసనపూర్వకముగా పొందిన;
 • chase, v. t. తరుము; వెంటాడు;
 • chasm, n. (కేజం) అగాధం; పెద్ద బీట; లోతైన గొయ్యి;
 • chassis, n. (ఛాసీ) చట్రం; బండి చట్రం; కారు చట్రం;
 • chaste, adj. (ఛేస్ట్) శీలవతి అయిన; నిర్దోషి అయిన;
 • chastise, v. t. (ఛేస్టయిజ్) దండించు; తిట్టు; కొట్టు;
 • chastity belt, n. ఇనప కచ్చడం;
 • chat, v. t. ముచ్చటించు; కబుర్లు చెప్పు;
 • chatterbox, n. డబ్బా; వసపిట్ట; వాగుడునోరు; వదరుబోతు;
 • chauffeur, n. (షోఫర్) కారు నడిపే వ్యక్తి; డ్రైవరు;
 • chauvinism, n. డంబాచారం; దురతిశయం;
  • cultural -, ph. సాంస్కృతిక దురతిశయం;
  • male -, ph. పురుష డంబాచారం; పురుషాధిక్యత;
 • chayote squash, n. బెంగుళూరు వంకాయ;
బెంగుళూరు వంకాయ
 • cheap, n. (1) చవుక; అగ్గువ; (2) చవుకబారు; (3) లేకి;
 • cheat, v. t. మోసగించు; వంచించు; మస్కా కొట్టు;
 • cheater, n. m. మోసగాడు; వంచకుడు; తక్కిడి; బకవేషి; అటమటీడు; f. మోసకత్తె; వంచకురాలు;
 • check, n. (1) చెక్కు; బరాతం; బ్యాంకు హుండీ; (Br.) cheque; (2) తనిఖీ; పరీక్ష;
 • checkers, n. చదరంగం బల్ల వంటి బల్ల మీద ఆడే ఒక ఆట;
 • check up, n. తనిఖీ; పరీక్ష;
 • cheek, n. చెంప; చెక్కిలి; బుగ్గ; లెంప; కపోలపాలిక; కపోలం;
 • cheekiness, n. చిలిపితనం;
 • cheese, n. కిలాటం; దధికం; మరిని;
 • cheetah, n. చిఱుతపులి; [bio.] Acinonyx jubatus;
 • chef, n. వంటరి; వంటమనిషి; సూనరి; m. వంటవాఁడు; సూదుఁడు; పాకశాసనుఁడు; f. వంటలక్క; వంటగత్తె; సూదురాలు;
 • chemical, n. రసాయనం; రసాయన పదార్థం;
 • chemical, adj. రసాయన; రసాయనిక;
  • - affinity, ph. రసాయన అనురాగం;
  • - analysis, ph. రసాయన విశ్లేషణ;
  • - change, ph. రసాయన మార్పు;
  • - combination, ph. రసాయన సంయోగం;
  • - compound, ph. రసాయన మిశ్రమం;
  • - decomposition, ph. రసాయన వియోగం;
  • - element, ph. రసాయన మూలకం; రసాయన ధాతువు;
  • - equation, ph. రసాయన సమీకరం;
  • - process, ph. రసాయన ప్రక్రియ;
  • - science, ph. రసాయన శాస్త్రం;
  • - substance, ph. రసాయన పదార్థం;
  • - synthesis, ph. రసాయన సంశ్లేషణ;
  • - warfare, ph. రసాయన యుద్ధం;
 • chemicals, n. రసాయనాలు; రసాయన పదార్థాలు; రసాయన ద్రవ్యాలు;
 • chemist, n. రసాయనుడు; రసాయన శావేత్త;
 • chemistry, n. రసాయనం; రసాయన శాస్త్రం;
  • bio -, ph. జీవ రసాయనం;
  • food -, ph. ఆహార రశాయనం;
  • industrial -, ph. పారిశ్రామిక రసాయనం;
  • inorganic -, ph. వికర్బన రసాయనం; అనాంగిక రసాయనం; మూలక రసాయనం;
  • organic -, ph. కర్బన రసాయనం; సేంద్రియ రసాయనం; ఆంగిక రసాయనం; భూత రసాయనం;
  • photo -, ph. తేజో రసాయనం;
  • physical -, ph. భౌతిక రసాయనం;
  • synthetic -, ph. పౌరుష రసాయనం; సంధాన రసాయనం;
 • chemotherapy, n. రసాయన చికిత్స; కేన్సరుకి వాడే మందులు;
 • cherimoya, n. సీతాఫలం; custard apple;
 • cherry tomatoes, n. చిట్టి టొమేటోలు; పింపినెల్లా (సోంఫు) ఆకులని పోలిన ఆకులు కలది; [bot.] Lycopersicon pimpinellifollium;
 • chess, n. చతురంగం; చదరంగం;
 • chest, n. (1) రొమ్ము; ఛాతీ; అక్కు; బోర; ఎద; వక్షస్థలం; హృదయఫలకం; భుజాంతరం; (2) పెట్టె; బీరువా; మందసం;
  • medicine -, ph. మందుల బీరువా;
 • chest of drawers, n. సొరుగుల బల్ల;
 • chew, v. t. నములు; చర్వణం చేయు;
 • chew the cud, v. t. నెమరువేయు;
 • chewed, adj. నమిలిన; చర్విత;
 • chewing, n. నమలడం; చర్వణం;
 • chickadee, n. చుంచుపిచ్చుక; also called as Titmice and Tit bird
 • chick peas, n. pl. శనగలు; see also garbanzos;
 • chick weed, n. దొగ్గలి కూర;
 • chicken, n. కోడిపిల్ల;
 • chicken pox, n. ఆటలమ్మ; తడపర; చిన్నమ్మవారు; పొంగు; వేపపువ్వు; ఒక వైరస్‍ వల్ల వచ్చే జబ్బు; varicella;
 • chide, v. t. మందలించు;
 • chief, adj. ముఖ్య; ప్రధాన;
 • chief justice, ph. ముఖ్య న్యాయాధిపతి; ప్రధాన న్యాయమూర్తి;
 • chief minister, ph. ముఖ్యమంత్రి;
 • chief, n. అధిపతి;
 • chilblains, n. ఒరుపులు; చలికి చేతి వేళ్లల్లోను, కాలి వేళ్లల్లోను రక్త నాళాలు సంకోచించటం వల్ల రక్త ప్రవాహం తగ్గి, ఆయా భాగాలు ఎర్రగా కంది, నొప్పితో బాధ పెట్టే వ్యాధి;
 • child, n. బిడ్డ; పాప; శిశువు; కందు; కూన; బుడుత; బాల; పట్టి; బొట్టె; m. పిల్లడు; బిడ్డడు; డింభకుడు; బాలుడు; గుంటడు; f. పిల్ల; బాలిక; గుంట; శాబకం; మాటలు మాట్లాడడం వచ్చిన తరువాత దశ;
 • child, adj. బాల; శిశు;
 • childcare, ph. శిశు సంరక్షణ;
 • child welfare, ph. శిశు సంక్షేమం; శిశు సంరక్షణ;
 • childhood, n. బాల్యం; బాల్యావస్థ; చిన్నతనం; పసితనం; చిన్నప్పుడు; శైశవం; కైశోరం; చిరుత ప్రాయం;
 • childish, adj. కైశోరక; కురత్రనపు; కుర్ర తరహా;
 • childishness, n. చంటితనం; పసితనం; కుర్రతనం;
 • childless, n. నిస్సంతు;
  • - woman, ph. గొడ్రాలు;
 • children, n. పిల్లలు;
  • one's -, ph. బిడ్డలు; పిల్లలు;

---Usage Note: children

 • ---Baby and infant mean very small child, but infant is more formal. A child who is under 3 and who can walk is a toddler. Children aged 13 to 19 are teenagers. Use kids in informal situations for all these categories.
 • Chile saltpeter, n. సురేకారం; యవక్షారం; ఒక రకమైన, తినడానికి వీలు కాని, ఉప్పు; potassium nitrate; sodium nitrate;
 • chilies, n. మిరపకాయలు;
 • chill, n. (1) చల్లదనం; చలి; (2) ఒణుకు; (3) భయం;
 • chill, v. t. చల్లార్చు; చల్లబరచు;
 • chilly, n. చలి; చలిగానుండు; చలివేయు;
 • chimera, n. (కిమేరా) (1) వింతజంతువు; సింహం తల, మనిషి శరీరం లేక మనిషి తల, చేప శరీరం మొదలయిన రెండు విభిన్న జంతువుల శరీరాలను కలపగా వచ్చిన కొత్త జంతువు; In mythology, the Chimera was a magnificent monster. It was an unusual mélange of animals, with a lion's head and feet, a goat's head sprouting off its back, and a serpentine tail.(2) కంచర జీవి; ఒకే శరీరంలో రెండు విభిన్న జాతుల జీవకణాలు ఉన్న జీవి; A chimera is essentially a single organism that's made up of cells from two or more "individuals" — that is, it contains two sets of DNA, with the code to make two separate organisms;
 • chimney, n. పొగగొట్టం; పొగగూడు; చిమ్నీ;
 • chimpanzee, n. చింపంజీ; ఆఫ్రికా అడవులలో నివసించే, మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని జంతువు; [biol.] Pan troglodytes of the Pongidae family;
 • chin, n. గడ్డం; చుబుకం;
 • China-rose, n. మందారం; జపపూవు;
 • chink, n. బీట; పగులు; చిరుగు;
 • chip, n. (1) బిళ్ళ; తునక; ముక్క; (2) అవకర్త; అతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరాలు చెయ్యడానికి వాడే సిలికాన్ బిళ్ళ;
 • chip off the old block, ph. [idiom.] పుణికి పుచ్చుకుని పుట్టిన వ్యక్తి;
 • chip on the shoulder, [idiom] ముక్కుమీది కోపం;
 • chirality, n. [chem.] (కీరాలిటీ) కరత్వం; చేతివాటం; handedness;
 • chirping, n, పక్షులు చేసే కిచకిచ ధ్వని;
 • chisel, n. ఉలి; చీరణం;
 • chit, n. చీటీ; కాగితపు ముక్క; ఉల్లాకి;
 • chital deer, n, జింక; దక్షిణ ఆసియాలో కనబడే ఒక జాతి చుక్కల లేడి;
 • chitchat, n. బాతాఖానీ; లోకాభిరామాయణం; చొల్లు కబుర్లు;
 • chives, n. pl. కింజిల్కం; కేసరం; ఉల్లికాడల జాతికి చెందిన పత్రి; [bot.] Allium schoenoprasum;
 • chloral, n. హరితాల్; నిద్ర మందుగా వాడబడే ఒక రకమైన కర్బన రసాయనం; C13CCHO;
 • chloraldehyde, n. హరితపిపీలికం; ఒక రకమైన కర్బన రసాయనం;
 • chores, n. pl. పనులు; చిల్లర మల్లర పనులు;
  • domestic -, ph. ఇంటి పనులు;
  • office -, ph. కచేరీ పనులు;
 • chloride, n. హరిదం;
 • chloride of zinc, ph. యశద హరిదం;
 • chlorine, n. హరితం; హరిత వాయువు; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 17, సంక్షిప్త నామం, Cl);
 • chloroform, n. త్రిహరితపాడేను; క్లోరోఫారం; ఒక మత్తు మందు; CHCl3;
 • chlorophyll, n. పత్రహరితం; పైరుపచ్చ; వృక్షజాతికి ఆకుపచ్చ రంగునిచ్చే పదార్థం;
 • chloroplast, n. హరితపత్రం; (lit.) green leaf;
 • choice, n. ఎంపిక;
 • choir, n. (క్వాయర్) మేళపాటగాళ్లు;
 • choke, n. ఊపిరి తిరగకుండా చేయు; ఉక్కిరిబిక్కిరి చేయు;
 • choker, n. కుత్తిగంటె; మెడకు బిగుతుగా పట్టే ఆభరణం;
 • cholagogue, adj. పిత్తహరి; పిత్తాన్ని హరించేది;
 • cholera, n. వాంతిభేది; విషూచి; మహామారి; మరిడివ్యాధి; కలరా; ఒక రకమైన సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధి;
 • cholesterol, n. పిత్తఘృతాల్; కొలెస్టరోల్; జంతువుల కొవ్వులో ఉండే ఒక ఘృతామ్లం;
 • cholum, n. జొన్నలు;
 • choose, v. t. ఎంపిక చేయు;
 • chop, v. t. ముక్కలుగా కోయు; తరుగు;
 • chord, n. జ్యా; వృత్తం యొక్క పరిధిమీద ఉంచిన రెండు బిందువులని కలిపే సరళరేఖ; (2) వాద్యసాధనం యొక్క తీగ;
 • chordates, n. [biol.] మేరోమంతములు; తాత్కాలికంగాకాని; శాశ్వతంగాకాని వెన్నెముక ఉన్న జంతుజాతి;
 • chordophones, n. pl. తంతు వాద్యములు; చేతి గోళ్లతో మీటి వాయించే వాద్యములు; ఉ. తంబురా; వీణ; సితార్;
 • chores, n. pl. చిల్లరమల్లర పనులు; జీవితంలో దైనందినం చేసుకునే పనులు;
 • choreography, n. నాట్యలేఖనం; నాట్యం ఎప్పుడు ఎలా చెయ్యాలో రాసుకోవడం;
 • chorus, n. వంతపాట;
 • chough, n. లోహతుండకాకోలం; సువర్ణతుండ కాకువు; శీతల ప్రాంతాలలో కనిపించే ఒక రకం కాకి;
 • choultry, n. [Ind. Engl.] సత్రవ; ధర్మశాల; a place where free accommodation and sometimes free meals are provided for travelers and pilgrims;
 • chowry, n. చామరం; ఒక రకం విసనకర్ర;
 • Christian, adj. క్రైస్తవ; క్రీస్తవ; కిరస్థానీ;
 • Christian, n. m. క్రైస్తవుడు; క్రీస్తవుడు; కిరస్థానీవాడు;
 • Chromium, n. వర్ణం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 24, సంక్షిప్త నామం, Cr); [Lat. chroma = color];
 • chromoplasts, n. వర్ణకణములు;
 • chromosome, n. వారసవాహిక; వంశబీజం; జీవకణాలలో దారాల రూపంలో ఉండే జన్యు పదార్థం; డి.ఎన్.ఏ. అన్నా ఇదే;
 • chromosphere, n. వర్ణావరణం;
 • chromatograph, n. వర్ణలేఖిని; వర్ణపాత లేఖిని;
 • chromatography, n. వర్ణలేఖనం; వర్ణపాత లేఖనం;
 • chronic, adj. దీర్ఘ; విలంబిత; జీర్ణించుకుపోయిన; జీర్ణ; సదా; పురాణ; జగమొండి;
 • chronic disease, ph. దీర్ఘవ్యాధి; విలంబిత వ్యాధి; సదారోగం; జీర్ణించిన వ్యాధి; జగమొండి రోగం; ఏళ్ళ తరబడిగా ఉన్న జబ్బు; బాగా ముదిరిన వ్యాధి;
 • chronicle, n. చరిత్ర; కవిలె;
 • chronicler, n. చరిత్రకారుడు;
 • chronological, adj. తిథివారీ; చారిత్రక క్రమవారీ; అనుపూర్విక;
 • chronology, n. చారిత్రక క్రమం; తైధిక క్రమం; కాలక్రమం; అనుపూర్వికం; భూతకథానుక్రమణిక; కాలవృత్తాంతం;
 • chronometer, n. కాలమాపకం; శ్రేష్ఠమైన గడియారం;
 • chrysalis, n. పురుగుగూడు; పిసినికాయ; గొంగళీ; పట్టుపురుగు మొ. కట్టుకునే గూడు;
 • chrysanthemum, n. చామంతి;
 • chuckle, v. i. ముసిముసి నవ్వు; చిన్నగా నవ్వు; ఇకిలించు; సకిలించు;
 • chum, n. దగ్గర స్నేహితుడు; ఆప్తుడు; దగ్గర స్నేహితురాలు; ఆప్తురాలు;
 • church, n. (1) క్రైస్తవుల దేవాలయం; క్రైస్తవుల ప్రార్ధన మందిరం; (2) క్రైస్తవ మత వ్యవస్థ యొక్క అధిష్టాన వర్గం;
 • churlish, adj. అమర్యాదకరమైన; మోటు;
 • churn, v. t. మథించు; చిలుకు; త్రచ్చు; కవ్వించు;
 • churner, n. కవ్వం;
 • churning, n. మథనం; చిలకడం; త్రచ్చుట; త్రచ్చడం; తిప్పడం;
 • churning rod, n. చల్లగుంజ; కవ్వం; చిలికే కర్ర;
 • chutney, n. పచ్చడి; తొక్కు; చట్నీ;
 • chutzpa, n. (హూట్స్‌పా), మొండి ధైర్యం; తెగువ; సాహసం; చొరవ;
 • cicada, n. ఇలకోడి; చిమ్మట; ఈలపురుగు; grey cricket;
 • cide, suff. హత్య; హారి; సంహారి; ఆరి;
  • homicide, n. హత్య; మానవహత్య;
  • infanticide, n. శిశుహత్య; శిశుమేధం;
  • insecticide, n. కీటకారి;
  • matricide, n. మాతృహత్య;
  • patricide, n. పితృహత్య;
  • suicide, n. ఆత్మహత్య;
 • cider, n. కొద్దిగా పులియబెట్టిన పళ్ళరసం; ముఖ్యంగా ఏపిల్ పళ్ళ రసం;
 • cigar, n. చుట్ట; పొగచుట్ట;
 • cigarette, n. సిగరెట్టు;
 • cilantro, n. కొత్తిమిర; ధనియాల మొక్క; [bot.] Coriandrum sativum;
  • Chinese -, [bot.] Allium tuberosum;
 • cilia, n. నూగు;
 • cinchona, n. సింకోనా; మలేరియాకి వాడే ఒక ఔషధం; హోమియోపతీ మందులలో వాడే ఛైనా ఈ సింకోనా నుండే చేస్తారు; [bot.] China officinalis;
 • cinder, n. దాలి; మావి పట్టిన నిప్పులు;
 • cinder pit, ph. దాలి గుంట;
 • cine, adj. చలనచిత్రాలకి సంబంధించిన; సినిమా;
 • cinema, n. చలనచిత్రం; చిత్రకథ; సినిమా;
 • cinema hall, n. చిత్ర ప్రదర్శనశాల; సినిమా హాలు;
 • cinnabar, n. ఇంగిలీకం; హింగుళం; రససింధూరం; HgS;
 • cinnamon, n. దాల్చినచెక్క; లవంగపట్ట;
 • cinnamon bark, ph. దాల్చినచెక్క;
  • Ceylon -, ph. [bot.] Cinnamonum zeylanicum;
  • Saigon -, ph. [bot.] Cinnamonum loureririi;
 • cipher, n. (1) శూన్యం; సున్న; హళ్ళి; హుళక్కి; పూజ్యం; గగనం; (2) రహస్యలిపి;
  • big -, ph. గుండుసున్న; బండిసున్న;
 • circa, adv. సుమారుగా; ఆ రోజులలో;
A       triangle with       incircle, incenter (I),       excircles, excenters (JA, JB, JC).
 • circle, n. వృత్తం; వర్తులం; వలయం; చక్రం; మండలం; అల్లి; హళ్ళి;
  • circumscribed -, ph. పరివృత్తం;
  • escribedcircle, ph. బహిర్‌ వృత్తం; ఒక త్రిభుజం బయట ఒక భుజాన్నీ, మిగిలిన రెండు భుజాల పొడుగింపులనీ స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • excircle, ph. బహిర్‌ వృత్తం; ఒక త్రిభుజం బయట ఒక భుజాన్నీ, మిగిలిన రెండు భుజాల పొడుగింపులనీ స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • Great Circle -, ph. మహావృత్తం;
  • incircle, ph. అంతర్‌ వృత్తం; ఒక త్రిభుజం లోపల మూడు భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • inner -, ph. (1) అపసిద్ధ బిందువు; అంతర్‌లిఖిత వృత్తం; (2) ఆంతరంగికులు;
  • inscribed circle, ph. అంతర్‌ వృత్తం; ఒక త్రిభుజం లోపల మూడు భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం;
  • nine-point -, ph. నవబిందు వృత్తం;
  • viscious -, ph. విష వలయం;
 • circuit, n. (1) మండలం; పరిధి; ప్రదక్షిణం; (2) పరీవాహం; పరిపథం; జాలం; వలయం; see also network;
  • electrical -, ph. విద్యుత్ పరీవాహం; విద్యుత్ వలయం;
 • circuitous, adj. డొంకతిరుగుడు; చుట్టుతిరుగుడు;
 • circular, adj. (సర్క్యులార్) గుండ్రని; వృత్తాకారమైన; వర్తులాకారమైన; చక్రీయ; వట్రువ; బటువు;
 • circular, n. (సర్క్యులర్) కరపత్రం; తాకీదు; వర్తులం; వర్తుల లేఖ;
 • circulate, v. t. తిప్పు; నలుగురికీ చూపించు; చేతులు మార్చు;
 • circulating, adj. వ్యావర్తక;
 • circulation, n. (1) ప్రసరణ; (2) చలామణి; చెల్లుబడి;
  • blood -, ph. రక్త ప్రసరణ;
  • in widespread -, ph. బాగా చలామణీలో ఉంది;
 • circulator, n. పంకా; విసనకర్ర; సురటి;
 • circum, pref. ప్ర; పరి;
 • circumambulation, n. ప్రదక్షిణం; చుట్టూ తిరగడం;
 • circumcised, n. సున్నతుడు;
 • circumcision, n. సున్నతి; సుంతీ; (ant,) uncircumcised = అసున్నతులు;
 • circumference, n. పరిధి; చుట్టుకొలత; కైవారం;
 • circumpolar, adj. ప్రరిధ్రువ;
 • circumpolar stars, ph. ప్రరిధ్రువ తారలు; ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణం చేసే తారలు;
 • circumspection, n. జాగరూకత; అప్రమత్తత;
 • circumstance, n. పరిస్థితి; స్థితిగతి;
 • circumstantial, adj. స్థితిగత్యానుసార; అప్రత్యక్ష; పరిస్థితిసంబంధ; సంభవాత్మక; ప్రాసంగిక;
 • circumstantial evidence, ph. స్థితిగత్యానుసార ప్రమాణం; ఉత్తరోత్తర ఆధారాలు; సంభవాత్మక ప్రమాణం; ప్రాసంగిక ప్రమాణం;
 • circumterrestrial, adj. పరిభౌమిక; భూమి చుట్టూ;
 • circumvent, v. t. దాటిపోవు; దాటు;
 • cirrhosis, n. అవయవములు గట్టిపడి పరిమాణం తగ్గుట;
 • cirrhosis of the liver, ph. కాలేయం గట్టిపడడమనే ఒక వ్యాధి; జలోదరం;
 • cis, adj. pref. [chem.] గ్రహణ; పక్కగా; see also trans;
 • cis fat, ph. [chem.] ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఒక పక్కనే గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు వంకరగాఉంటుంది;
 • cistern, n. కుండీ; గోలెం; తొట్టి;
నల్లేరు
 • cissus, n. నల్లేరు; [bot.] Cissus quadrangularis;
 • citadel, n. దుర్గం; కోట;
 • citation, n. (1) చేసిన తప్పుని చూపి జరిమానా వెయ్యడం; (2) ఉపప్రమాణం; ఒకరు చేసిన మంచి పనులని ఎత్తి చూపి సత్కరించడం; (3) ఒకరి రచనలని ఎత్తి చూపి ఉదహరించడం;
 • cite, v. t. ఉదహరించు; చూపించు; ఎత్తి చూపు;
 • citron, n. మాదీఫలం; దబ్బపండు;
 • citizen, n. m. పౌరుడు;
 • citizenship, n. పౌరసత్వం;
 • citric acid, n. పండ్లలో ఉండే ఒక ఆమ్లం; తెల్లటి, పుల్లటి చూర్ణం; C6H8O7:H2O;
 • citrus, adj. నిమ్మ;
 • citrus canker, ph. నిమ్మగజ్జి తెగులు;
 • city, n. నగరం; పట్టణం; పురం; ప్రోలు; మహానగరం; బస్తీ; పెద్ద ఊరు;
 • civet, n. జవాది; జవాది పిల్లి మర్మస్థానాల నుండి స్రవించే తేనె వంటి పదార్థం; దీన్ని సెంట్లు, అత్తరులలో వాడతారు;
 • civet cat, n. జవాది పిల్లి; పునుగు పిల్లి; పునుగు; బూతపిల్లి; కమ్మపిల్లి; గంధ మృగం; గంధ మార్జాలం; మార్జారిక; ఆఫ్రికా, ఇండియా, మలేసియా దేశాలలో నివసించే ఒక మాంసాహారి;
civitone=జవాది నిర్మాణ క్రమం
 • civetone, n. జవాది; జవ్వాది; సంకు; పునుగు పిల్లుల శరీరం నుండి స్రవించే కొవ్వు వంటి మదజలం [see also musk];
 • civic, adj. విద్యుక్త; పురజన; పౌర;
  • - duty, ph. విద్యుక్త ధర్మం;
  • - reception, ph. పౌరసన్మానం;
  • - responsibility, ph. విద్యుక్త ధర్మం;
  • - sense, ph. పౌరకర్తవ్య భావన;
  • - society, ph. పుర సంఘం; పౌర సంఘం;
 • civil, adj. (1) నాగరిక; సభ్య; (2) పౌర; షవన; (3) దివానీ; సర్కారీ; ధనోద్భవ; (ant.) criminal; military; religious;
  • - code, ph. పౌర స్మృతి;
  • uniform - code, ph. ఉమ్మడి పౌర స్మృతి;
  • - court, ph. దివానీ అదాలతు;
  • - day, ph. షవన దినం;
  • - supplies, ph. పౌర సరఫరాలు; సర్కారీ సరఫరాలు;
  • - war, ph. అంతర్ కలహం; అంతర్ యుద్ధం;
  • - disobedience, ph. సత్యాగ్రహం; శాసనోల్లంఘనం;
 • civilian, adj. లౌక్య;
  • - dress, ph. లౌక్య వేషం;
 • civility, n. నాగరికత; సభ్యత; మర్యాద;
 • civilization, civilisation (Br.), n. నాగరికత; సభ్యత;
 • clad, adj. ధరించిన; తొడుక్కున్న; పరివేష్టితమైన;
 • claim, n. హక్కు; అర్హత; స్వత్వం; విల్లంగం;
 • claim, v. i. తనకు రావలసినదాని కొరకు పోరాడు; దావా వేయు;
 • clairvoyance, n. దివ్యదృష్టి; యోగదృష్టి; కంటికి ఎదురుగా కనిపించని వస్తువులని చూడగలిగే దివ్య శక్తి;
 • clamor, n. సద్దు; సందడి;
 • clamp, n. బందు; బిగించు సాధనం;
 • clan, n. కులం; జాతి; వర్గం;
 • clandestine, adj. లోపాయకారీ; రహస్యమయిన;
 • clarification, n. విశదీకరణ; స్పష్టీకరణ; వివరణ;
 • clarify, v. t. విశదీకరించు; స్పష్టం చేయు; స్పష్టపరచు; వివరించు;
 • clarity, n. స్పష్టత; సుబోధకత; తెరిపి; వ్యక్తత;
 • clarified, adj. తేటపరచిన; శుద్ధి అయిన;
  • - butter, ph. నెయ్యి; ఘృతం; ఆజ్యం; హవిస్; శుద్ధి చెయ్యబడ్డ వెన్న;
 • clash, v. i. డీకొట్టుకొను; వికటించు;
 • class, n. (1) తరగతి; (2) వర్ణం; (3) వర్గం; తెగ; కులం; జాతి; తరం; see also caste; (4) తరగతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు మూడవ వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom, phylum, class, order, family, genus, and species;
  • labor -, ph. శ్రామిక వర్గం;
  • ruled -, ph. పాలిత వర్గం;
  • ruling -, ph. పాలక వర్గం;
  • - conflict, ph. వర్గ వైరం;
  • - struggle, ph. వర్గ సంఘర్షణ;
 • classical, adj. శాస్త్రీయ; సనాతన; సంప్రదాయిక; (ety.) belonging to the upper and ruling classes;
  • - literature, ph. సంప్రదాయిక సాహిత్యం; ప్రాచీన సాహిత్యం; (ant.) modern literature
  • - mechanics, ph. సంప్రదాయిక యంత్రశాస్త్రం; (rel.) quantum mechanics
  • - music, ph. శాస్త్రీయ సంగీతం; (ant.) light music
 • classics, n. pl. సనాతన గ్రంథాలు; ప్రామాణిక గ్రంథాలు; గణనీయ గ్రంథాలు;
 • classification, n. వర్గీకరణం; తరీకరణం;
  • natural -, ph. స్వాభావిక వర్గీకరణం;
 • classified, adj. (1) తరంవారీ; వర్గీకృత; తరగతులుగా విడగొట్టబడిన; (2) రహస్యంగా ఉంచవలసిన; బహిరంగపరచకుండా ఉంచవలసిన;
  • - advertisements, ph. తరంవారీ ప్రకటనలు; వర్గీకృత ప్రకటనలు;
  • - research, ph. వర్గీకృత పరిశోధన; రహస్యంగా ఉంచవలసిన శాస్త్రీయ పరిశోధన;
 • classifier, n. తరందారు; తరగతులుగా విడగొట్టునది;
 • classify, n. వర్గీకరించు; తరగతులుగా విభజించు;
 • clause, n. ఉపవాక్యం;
  • main -, ph. ప్రధాన ఉపవాక్యం;
 • clavicle, n. జత్రువు; కంటియెముక; మెడయెముక; collar bone;
 • claw, n. (1) పంజా; (2) పట్టుకొమ్ము; సుత్తిలో మేకులని ఊడబెరికే కొస;
 • clay, n. బంకమన్ను; బంకమట్టి; రేగడిమన్ను; మృత్తిక;
  • white -, ph. పాలమన్ను; సుద్ద; నాము; ధవళ మృత్తిక;
 • clear, adj. (1) స్పష్టమైన; స్ఫుటమైన; విశదమైన; స్వచ్ఛమైన; (2) తెరిపి; మబ్బు లేకుండా; నిర్మల; స్వచ్ఛ;
 • clear, n. కళంకం లేని స్థితి; స్పుటం;
 • clear, v. t. ఖాళీ చేయు;
 • clearly, adv. విదితముగా; విశదంగా; స్పష్టంగా;
 • clean, adj. (1) శుభ్రమైన; శుచియైన; (2) నున్ననైన; బోడి;
 • clean, v. t. (1) శుభ్రం చేయు; శుభ్రపరచు; (2) నున్నగా చేయు;
 • clean, n. శుభ్రం; నిర్మలం;
 • cleaning paste, ph. ధావన ఖమీరం;
 • cleaning powder, ph. ధావన చూర్ణం;
 • cleanliness, n. శుచి; శుభ్రం; శౌచం; శుభ్రత; నైర్మల్యం; నిర్మలత;
 • clean-shaven head, n. బోడిగుండు;
 • cleansing, n. ప్రక్షాళన;
 • clear, v. t. శుభ్రం చేయు; తుడిచి వేయు; చెరుపు; చెరిపివేయు;
 • clear, adj. తేరిన; తేట తేరిన; నిర్మలమైన;
  • - fluid, n. తేట; తేట తేరిన ద్రవం;
 • clearing nut, n. ఇండుప గింజ; చిల్ల గింజ; అందుగు గింజ;
 • cleavage, n. (1) చీలిక; (2) ఆడదాని చన్నుల మధ్యనున్న చీలిక వంటి స్థలం;
 • cleave, v. t. పగలదీయు; విడదీయు;
 • cleft lip, ph. గ్రహణపు మొర్రి; తొర్రి;
 • cleft palate, ph. అంగుట్లో ఉన్న మొర్రి;
 • clemency, n. దయాభిక్ష; కనికరించి క్షమించడం;
 • clepsydra, n. నీటిగడియారం;
 • clergyman, n. క్రైస్తవుల చర్చిలో పురోహితుని వంటి మతాధికారి;
 • clerical error, ph. హస్తదోషం; చేతప్పు; రాతలో జరిగిన తప్పు;
 • clerk, n. గుమస్తా; ముసద్దీ; రాసేవాడు; లేఖరి;
 • clerkship, n. రాయసం; రాతకోతలు నేర్చుకునే దశ;
 • cleverness, n. వైదగ్ధ్యం; విదగ్ధత; నేర్పరితనం; నేర్పు; చాతుర్యం;
 • client, n. కాతాదారు; కక్షదారు;
 • climate, n. (1) సదావరణం; ఒక ప్రదేశంలో దీర్ఘకాల సగటు పరిస్థితులు – అంటే దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఉండే పరిస్థితులని వర్ణించడానికి వాడతారు. “దీర్ఘకాలం” అంటే కనీసం 30 సంవత్సరాలు ఉండాలని ఒక ఒప్పందం ఉంది; (2) వాతావరణం; (3) శీతోష్ణస్థితి; ఇది వాతావరణం యొక్క పరిస్థితిని (state of the atmosphere) వర్ణించే మాట. తరుణకాల శీతోష్ణస్థితి అంటే వెదర్, దీర్ఘకాల శీతోష్ణస్థితి అంటే క్లయిమేట్ అని వివరణ చెప్పవచ్చు; (rel.) weather;
  • desert -, ph. ఎడారి వాతావరణం;
  • Mediterranean -, ph. మధ్యధరా వాతావరణం;
  • political -, ph. రాజకీయ వాతావరణం;
 • climax, n. పరాకాష్ఠ; పతాక సన్నివేశం; బిగి; రసకందాయం;
 • climb, v. i. ఎక్కు; అధిరోహించు; ఆరోహించు;
 • clinch, v. t. తేల్చు;
 • cling, v. i. పట్టుకుని వేలాడు; కరచి పట్టుకొను;
 • clinic, n. ఆరోగ్యశాల; వైద్యశాల; వైద్యాలయం; ఆసుపత్రి;
 • clip, v. t. కత్తిరించు;
 • clip, n. కత్తిరించిన భాగం;
  • - art, ph. అతికడానికి వీలైన చిన్న చిన్న బొమ్మలు;
 • clique, n. సన్నిహితుల గుంపు; ఇతరులని చేరనీయని సన్నిహితుల గుంపు;
 • clitoris, n. భగలింగం;
 • cloak, n. కండువా వంటి బట్ట; మెడ దగ్గర ముడికట్టి వెనకకి జారవిడచే వం;
 • clock, n. గడియారం; గంటల గడియారం; పెద్ద గడియారం; ఘడి; ఘటీకారం;
 • clockwise, adj. అనుఘడి; దక్షిణావర్త; ప్రదక్షిణ; అవిలోమ;
  • - direction, ph. అనుఘడి దిశ; దక్షిణావర్త; దిశ; సవ్య దిశ; ప్రదక్షిణ దిశ; (ant.) anticlockwise;
 • clockwork, n. ఘటీయంత్రాంగం; ఘటీయంత్రం;
 • clod, n. గర; గడ్డ;
 • close, adj. దగ్గర; సన్నిహిత; సమీప;
 • close relative, ph. దగ్గర బంధువు; సన్నిహిత బంధువు;
 • close, v. t. మూతవేయు; మూయు; మూసివేయు; మోడ్చు; ముకుళించు; నిమీలించు;
 • closed, adj. మూతవేసిన; మూసిన; మూతపడ్డ; మూయబడ్డ; మోడ్చిన; ముకుళించిన; సంవృత; ఆవృత; నిమీలిత;
 • closed system, ph. సంవృత వ్యవస్థ;
  • half -, ph. అరమోడ్చిన; అర్ధ నిమీలిత; అర్ధ సంవృత;
 • closet, n. చిన్న గది; కొట్టు; కొట్టుగది; అర;
 • closure, n. సమాపకం; సంవృతం; వివారం; సమాప్తి; మూసివేత;
 • clot, n. గడ్డ; దొబ్బ;
  • blood -, ph. రక్తపు కదుం; గడ్డకట్టిన రక్తం; దొబ్బ;
 • clot, v. i. పేరుకొను; గడ్డకట్టు; గరకట్టు;
 • clotting, n. పేరుకొనుట; గడ్డకట్టుట; గడ్డకట్టడం;
 • cloth, n. (క్లాత్) బట్ట; గుడ్డ; వలువ; చేలం;
  • muslin -, ph. ఉలిపిరి బట్ట;
 • cloths, n. pl. (క్లాత్స్) గుడ్డ ముక్కలు;

---Usage Note: cloth, fabric

 • ---Use cloth as an uncountable noun to talk about the cotton, wool, etc. that is used to make clothes. Fabric can be countable or uncountable, and can be used about things other than clothes.
 • clothe, v. t. (క్లోద్) దుస్తులు తొడుగు; బట్టలు వేయు;
 • clothed, adj. సచేల; దుస్తులతో ఉన్న; బట్టలు కట్టుకున్న;
 • clothes, n. pl. దుస్తులు; కుట్టిన బట్టలు;
 • clothesline, n. దండెం; బట్టలు ఆరవేసుకొనే తాడు;
cumulus clouds=పుంజ మేఘములు
 • cloud, n. మేఘం; మబ్బు; మొగులు; మొయిలు; ఖచరం; అభ్రం; పయోధరం; ఘనం; జీమూతం; జలధరం;
  • altostratus -, ph. మధ్యమ స్తార మేఘం;
  • altocumulus -, ph. మధ్యమ పుంజ మేఘం;
  • cirrocumulus -, ph. అలకా పుంజ మేఘం;
  • cirrus -, ph. అలకా మేఘం;
  • cumulus -, ph. పుంజ మేఘం; సమాచి మేఘం;
  • cumulonimbus -, ph. పుంజ వృష్టిక మేఘం;
  • dark -, ph. కారుమేఘం;
  • nimbus -, ph. వృష్టిక మేఘం;
  • stratocumulus -, ph. స్తారపుంజ మేఘం;
  • stratus -, ph. స్తార మేఘం;
  • thunder -, ph. పర్జన్యం;
  • rain -, ph. అభ్రం;
  • - chamber, ph. [phy.] జీమూత కోష్ఠిక; భౌతిక శాస్త్ర పరిశోధనలో వాడే ఒక ఉపకరణం;
 • cloudy, adv. మబ్బుగా; మసకగా; మెయిలుగా;ముసాబుగా;
 • clove, n. పాయ; చీలిక; తొన; తునక;
 • clover, n. గడ్డి మైదానాలలో పెరిగే ఒక జాతి కలుపు మొక్క;
 • cloves, n. pl. లవంగాలు; లవంగపు చెట్టు యొక్క ఎండిన మొగ్గలు; దేవకుసుమం; కరంబువు; [bot.] Eugenia caryophyllata;
 • clown, n. m. విదూషకుడు; కోణంగి; గంథోళిగాడు; హాస్యగాడు;
 • clue, n. ఆధారం; ఆచూకీ; ఆరా; జాడ; పత్తా; కిటుకు; సవ్వడి;
 • clownish, adj. వెకిలి;
 • club, n. (1) కర్ర; దుడ్డు కర్ర; (2) సంఘం; జట్టు;
 • club, v. t (1) కర్రతో కొట్టు; బాధు; (2) జోడించు;
 • clubs, n. కళావరు; (ety.) clover shaped;
 • clumsy, adj. వికృత; వికార; నేర్పులేని;
 • cluster, n. (1) గుంపు; గుచ్ఛం; రాశి; వితతి; గమి; (2) సంయుక్తాక్షరం; (3) గెల; అత్తం; గుత్తి; చీపు;
 • cluster beans, n. గోరుచిక్కుడు;
 • clutch, n. (1) పట్టెడు; (2) పట్టు;
  • a clutch of mosquito eggs, ph. ఒక పట్టెడు దోమ గుడ్లు;
 • clutch, v. t. పట్టుకొను;

Part 3: cm-cz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • co-, pref. తోటి; జంట; యుగళ;
 • co-ordinates, n. తోటి అక్షములు; నిరూపకములు;
 • coach, n. (1) బండి; శకటం; (2) శిక్షకుడు; తరిఫీదు ఇచ్చే మనిషి;
 • coagulate, v. i. పేరుకొను; గడ్డకట్టు; గట్టిపడు; చిక్కపడు;
 • coagulation, n. స్కందనము; గడ్డకట్టుట;
 • coal, n. రాక్షసిబొగ్గు; నేలబొగ్గు; రాతిబొగ్గు; గనిబొగ్గు; శిలాంగారం; రాక్షసాంగారం;
  • - gas, ph. అంగార వాయువు;
  • - tar, ph. తారు; వాడకీలు;
 • Coal Sacs, n. [astro.] శ్యామ సీమలు; మిల్కీవే గేలక్సీలో నల్లటి భాగాలు;
 • coarse, adj. స్థూలమైన; ముతక; ముదుక; కోరా; అనణువైన; మోటు; మడ్డి; గరుకు; బరక;
  • - language, ph. మోటు భాష;
  • - paper, ph. ముతక కాగితం; మడ్డి కాగితం; గరుకు కాగితం;
  • - silver, ph. మట్ట వెండి;
  • - sugar, ph. బెల్లం;
 • coast, n. కోస్తా; సముద్రతీరం;
 • coastal, adj. కోస్తా; సాగర; వేలా;
  • - country, ph. సాగర సీమ;
  • - districts, ph. కోస్తా జిల్లాలు;
 • coat, n. (1) కోటు; (2) కళాయి; పూత; పొర;
  • long -, ph. అంగరకా;
 • coating, n. పూత; గార; కళాయి; పోసనం; పోష్;
  • gold -, ph. జల పోసనం; జర పోసనం; బంగారు పూత;
 • coax, v. t. లాలించు; బెల్లించు; ఒప్పించు; పుసలాయించు;
 • coaxial, adj. ఏకాక్షక; సమాక్షక; సహాక్షక;
 • Cobalt, n. మణిశిల; నల్లకావి రాయి; గనిజం; కోబాల్టు; ఒక రసాయన (అణుసంఖ్య 27, సంక్షిప్త నామం, Co.); మూలకం; [Gr. cobalo = mine];
 • cobbler, n. మాదిగ; చెప్పులు కుట్టేవాడు;
 • cobra, n. నాగుపాము; తాచు పాము;
  • king -, ph. రాజనాగు;
 • cobweb, n. సాలెపట్టు; సాలెగూడు; దూగరం; ధుంధుమారం;
కోకా మొక్క
 • coca, n. కోకా; ఈ తుప్ప ఆకులలో 14 రకాలైన ఔషధాలు ఉన్నాయి; ఈ ఔషధాలలో ముఖ్యమైనది కోకెయిన్; దక్షిణ అమెరికాలోని ఇండియన్లు ఈ ఆకులని తమలపాకులలా వాడతారు. ఈ ఆకులకి సున్నం రాసుకుని తింటే కొద్దిగా నిషా ఎక్కుతుంది; సా. శ. 1885 లగాయతు 1905 వరకు కోకా-కోలా కంపెనీ ఈ ఆకులనుండి కొన్ని రసాయనాలని సంగ్రహించి వారి పానీయాలలో వాడేవారు;
 • cocaine, n. కొకెయిన్; (1) స్థానికంగా నొప్పి తెలియకుండా చెయ్యడానికి వాడే ఒక మందు; (2) తెల్లటి గుండ రూపంలో దొరికే ఈ మందుని దురలవాటుగా, ముక్కుపొడుంలా వాడి, దుర్వినియోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది;
 • coccyx, n. ముడ్డిపూస; అనుత్రికం; త్రోటిక; గుదాస్థి;
 • cock, n. m. కోడిపుంజు; కుక్కుటం; f. hen;
  • - and bull stories, ph. బూటకపు కథలు; కల్లబొల్లి మాటలు;
 • cockroach, n. బొద్దింక;
 • coconut, adj. కొబ్బరి; నారికేళ;
  • - fiber, ph. కొబ్బరి పీచు;
  • - fiber rope, ph. నులక; చాంతాడు; కొబ్బరి తాడు;
  • - fruit, ph. కొబ్బరి కాయ;
  • - gratings, ph. కొబ్బరి కోరు;
  • - juice, ph. కొబ్బరి పాలు; కొబ్బరి ముక్కలని పిండగా వచ్చే తెల్లటి పాలు;
  • - meat, ph. కొబ్బరి;
  • - milk, ph. కొబ్బరి నీళ్లు; కొబ్బరి కాయలో ఉండే నీళ్ళు;
  • - palm, ph. కొబ్బరి చెట్టు;
  • - tree, ph. కొబ్బరి చెట్టు;
 • coconut, n. కొబ్బరికాయ; టెంకాయ; నారికేళం;
  • grated -, ph. కోరిన కొబ్బరి; కొబ్బరి కోరు;
 • cod, n. గండుమీను;
 • code, n. (1) ధర్మశాస్త్రం; స్మృతి; సంహిత; (2) ఏర్పాటు; నియమం; నియమావళి; (3) రహస్యలిపి; గుర్తు; సంక్షిప్తం; కోడు; (4) కంప్యూటరులో వాడే క్రమణిక లేక ప్రోగ్రాము;
  • - of conduct, ph. ధర్మ సంహితం; ప్రవర్తన నియమావళి;
  • - of justice, ph. ధర్మ శాస్త్రం;
  • - name, ph. రహస్య నామం;
 • codicil, n. వీలునామాకి అనుబంధించిన తాజా కలం;
 • codify, v. t. సూత్రీకరించు;
 • coding, v. t. (1) రహస్యలిపిలో రాయడం; సంక్షిప్తంగా రాయడం; (2) కంప్యూటరు ప్రోగ్రాము రాయడం;
 • co-eds, n.pl. f. సహపాఠులు; తరగతిలో ఉండే అమ్మాయిలు;
 • coefficient, n. [math.] గుణకం; ఒక గణిత సమీకరణంలో చలన రాసులని గుణించే ఒక గుణకం; ఉదాహరణకి అనే సమీకరణంలో 7 నీ, -3 నీ గుణకాలు అంటారు, 1.5 ని స్థిరాంకం అంటారు; కాని అనే సమీకరణంలో "a," "b," "c" లని పరామీటర్లు (parameters) అంటారు;
  • - of absorption, ph. శోషణ గుణకం;
  • - of diffusion, ph. విసరణ గుణకం; ఒక నిర్దిష్ట కాల పరిమితి (ఉ. సెకండు) లో ఒక పదార్థం ఎంత ప్రాంతం లోకి వ్యాప్తి చెందుతుందో చెప్పే సంఖ్య;
  • - of viscosity, ph. స్నిగ్ధతా గుణకం; చిక్కదనాన్ని తెలిపే గుణకం; నీటి చిక్కదనం 1 అనుకుంటే ఆముదం చిక్కదనం 1 కంటె ఎక్కువ ఉంటుంది, తేనె చిక్కదనం ఇంకా ఎక్కువ ఉంటుంది;
 • coerce, v. t. జులుం చేయు; బలవంతం చేయు; మొహమాటం పెట్టు;
 • coercion, n. జులుం; బలవంతం; బలాత్కారం; మొహమాటం;
 • coffee, n. కాఫీ;
  • - beans, ph. కాఫీ గింజలు;
  • - powder, ph. కాఫీ గుండ; కాఫీ పొడి;
 • coffin, n. శవపేటిక;
 • cog, n. పళ్ళ చక్రంలో పన్ను;
 • cogitations, n. ఆలోచనలు; దీర్ఘాలోచనలు;
 • cognac, n. (కోన్యాక్‍), ప్రాంసు దేశంలో, కోన్యాక్‍ అనే ప్రాంతంలో తయారయే బ్రాందీ;
 • cognate, adj. [ling.] సజాతీయ; జ్ఞాతి; సవర్ణ; సహజాత; సోదర;
 • cognitive, adj. ఎరుక;
 • cognitive disorder, ph. ఎరుక లేమి
 • cognizable, adj. [legal] న్యాయస్థానంలో హాజరు పరచగలిగేటటువంటి అనే జ్ఞానం కల; నేరముగా గుర్తించబడ్డ;
 • cognizable offense, ph. [legal] న్యాయస్థానంలో హాజరు కావలసినటువంటి నేరం; నేరముగా గుర్తించబడ్డది;
 • cognizance, n. ఎరుక; తెలుసుకోవడం; జ్ఞానం:
 • cohabitation, n. సహవాసం; సహనివాసం;
 • coherent, adj. సంబద్ధం; సంగతం; పొంత; పొందిక; పొత్తు; సామరస్యం;
 • coherent light, ph. పొంత కాంతి;
 • cohesive, adj. సంలగ్న;
 • coiffure, n. కొప్పు; కొప్పు ముడి; కేశాలంకారం; ముడి; మూల; ధమ్మిల్లం;
 • coil, n. కుండలి; చుట్ట; తీగ చుట్ట;
  • - of wire, ph. తీగ చుట్ట;
 • coil, v. t. చుట్టు;
 • coin, n. నాణెం; బిళ్ల; రూప్యం;
  • gold -, ph. గద్యాణం; మాడ;
  • minted -, ph. రూప్యం;
  • rupee -, ph. రూపాయి; రూపాయి కాసు; రూపాయి బిళ్ల;
  • silver -, ph. రూక;
 • coin, v. t. తయారుచేయు; ప్రయోగించు;
 • coincidence, n. కాకతాళీయం; యాదృచ్ఛికం; అవితర్కిత సంభవం; సంపాతం;
 • coitus, n. రతి; సంభోగం; స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంయోగం;
 • colander, n. చాలని; కర్కరి; సిబ్బితట్ట; వంటకాలలోని నీటిని బయట పారబోయడానికి వాడే చిల్లుల పాత్ర;
 • cold, adj. (1) చల్లనైన; శీతల; (2) కఠినమైన;
  • - blooded, ph. (1) అతి ఘోరమైన; అమానుషమైన; (2) శీతల రక్తపు;
  • - blooded animals, ph. బయట ఉండే శీతోష్ణతలతో శరీరం ఉష్ణోగ్రత మారే జంతుజాలం;
  • - eye, ph. శీత కన్ను;
  • - pressed oil, ph. గానుగలో ఆడించిన నూనె;
  • - shoulder, ph. అనాదరణ;
 • cold, n. (1) చలి; శీతలం; (ant.) warmth; (2) జలుబు; పడిశం; రొంప; పీనసం; (3) శీతం; (ant.) heat;
 • colic, n. శూల; కడుపులో తీవ్రంగా వచ్చే నొప్పి; (note) పసిపిల్లలు పాలు తాగిన తరువాత త్రేనుపు చెయ్యకపోతే పాలతో మింగిన గాలి కడుపులో చిక్కుపడి ఈ రకం నొప్పిని కలుగజేస్తుంది;
 • collaborate, v. i. సహకరించు; కలసి పనిచేయు;
 • collaboration, n. సహకారం;
 • collaborator, n. సహకారి;
 • collapse, v. i. కూలు; కుదేలు అగు; (ety.) In playing card games, Indians use a term called కుందేలు, which is a step below బేస్తు; because బేస్తు means a marginal win, కుదేలు, probably a distortion of కుందేలు, means total loss or collapse of the bet;
 • collapsed star, n. కూలిన తార; నల్ల నక్షత్రం; కాల రంధ్రం;
 • collar, n. కంటె; పొన్ను; నేమి;
  • metal -, ph. పొన్ను;
  • - around the circumference of a wheel, నేమి;
 • collar bone, n. కంటె ఎముక;
 • collate, v. i. పుటల వారీగా పత్రాలని అమర్చడం;
 • collateral, adj. అనుషంగిక; పక్కగా జరిగిన;
  • - agreement, ph. అనుషంగిక ఒడంబడిక;
  • - damage, ph. అనుషంగిక నష్టం; అనుషంగిక హాని; అనుకున్నదానికే కాకుండా చుట్టుప్రక్కల వాటికి దెబ్బతగలడం;
  • - evidence, ph. అనుషంగిక సాక్ష్యం;
 • collateral, n. తాకట్టు పెట్టిన వస్తువ;
 • colleagues, n. pl. సహోద్యోగులు; ఒకే చోట పనిచేసే వ్యక్తులు;
 • collect, v. t. దండు; పోగుచేయు; కూడబెట్టు; వసూలుచేయు; సేకరించు; సమాహరించు;
 • collection, n. (1) పోగయినది; వసూళ్లు; వసూలు చేసినది; సేకరించినది; జమా; (2) సంహితం; సమాహారం; (3) సమితి; సముదాయం; పటలం; పటలి; ఝాటం; వారం; తతి; కురుంబం; కూటమి; కూటువ;
 • collection box, ph. హుండీ;
 • collections, n. pl. వసూళ్ళు; పోగయిన మొత్తం; వసూలు చేసినది; సేకరించినది;
 • collective, adj. సామూహిక; సమూహ; సమష్టి; సాముదాయిక; మూకుమ్మడి; బహుగత;
 • collectively, adv. సామూహికంగా; సమష్టిగా; సాముదాయికంగా;
 • collector, n. దండుదారు; సేకర్త; కలెక్టరు;
 • college, n. కళాశాల; కాలేజీ;
 • collide, v. i. ఢీకొను; గుద్దుకొను; సంఘర్షించు;
 • collision, n. అభిఘాతం; సంఘర్షణ; సంఘాతం; గుద్దుకోవడం; ఢీకొనడం;
  • elastic -, ph. స్థితిస్థాపక సంఘాతం; ఈ రకం సంఘాతంలో పతన పదార్థాల (incident objects) మొత్తం గతిజ శక్తి క్షీణించకుండా పరావర్తన పదార్థాల మొత్తం గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An elastic collision is a collision in which there is no net loss in kinetic energy in the system as a result of the collision. Both momentum and kinetic energy are conserved quantities in elastic collisions. Suppose two similar trolleys are traveling toward each other with equal speed. They collide, bouncing off each other with no loss in speed. This collision is perfectly elastic because no energy has been lost.
  • inelastic -, ph. ఘన సంఘాతం; కేరం బల్ల మీద పిక్కలు గుద్దుకున్నప్పుడు ఈ రకం సంఘాతం; జరుగుతుంది; ఈ రకం సంఘాతంలో పతన పదార్థాల మొత్తం గతిజ శక్తిలో సింహ భాగం క్షీణించి, మిగిలినది పరావర్తన పదార్థాల గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An inelastic collision is a collision in which there is a loss of kinetic energy. While momentum of the system is conserved in an inelastic collision, kinetic energy is not. This is because some kinetic energy had been transferred to something else. Thermal energy, sound energy, and material deformation are likely culprits. Suppose two similar trolleys are traveling towards each other. They collide, but because the trolleys are equipped with magnetic couplers they join together in the collision and become one connected mass. This type of collision is perfectly inelastic because the maximum possible kinetic energy has been lost. This doesn't mean that the final kinetic energy is necessarily zero; momentum must still be conserved.
 • colloid, n. జిగార్ధం; జిగురువంటి పదార్థం; శ్లేషాభం; కాంజికాభం; see also gel;
 • colloidal, adj. జిగార్ధ; బంధక; కాంజికాభ;
  • - clay, ph. జిగార్ధ మృత్తికం; బంధక మృత్తికం;
 • colloquial, adj. వ్యావహారిక; ప్రచలిత; సంభాషణలో వాడే;
 • collusion, n. లాలూచీ; గూడుపుఠానీ; కుట్ర; లోపాయకారీ; రహశ్య ఒప్పందం;
 • collyrium, n. సురుమా; కాటుక రూపంలో కళ్లకి పెట్టుకునే మందు;
 • colon, n. (1) పెద్దపేగు; బృహదాంత్రం; (2) న్యూన బిందువు; వాక్యంలో విరామ చిహ్నం;
 • colonel, n. (కర్నెల్), సైన్యంలో లుటునెంట్ (లెఫ్టినెంట్) పై అధికారి;
 • colony, n. (1) సహనివేశం; (2) వలస రాజ్యం;
  • ant -, ph. చీమల సహనివేశం;
 • colophon, n. గద్య; శతకం చివర కాని, ఒక అధ్యాయం చివర కాని గ్రంథకర్త తన గురించి తెలిపే వాక్య సముదాయం;
 • color, colour (Br.), n. రంగు; వర్ణం; రాగం; కాంతి కిరణం యొక్క పౌనఃపున్యం;
  • fast -, ph. పక్కా రంగు;
  • fugitive -, ph. కచ్చా రంగు;
  • light -, ph. లేత రంగు;
  • magenta -, ph. బచ్చలిపండు రంగు;
  • mordant -, ph. కసటు రంగు;
  • saffron -, ph. చెంగావి;
  • multi-colored, ph. బహురంగి; రంగురంగుల;
  • two-colored, ph. దోరంగి;
  • - blindness, ph. వర్ణాంధత్వం; రంగులలో భేదం కంటికి కనిపించకపోవడం;
 • colorless, adj. నిరంజన; వివర్ణ; రంగు లేని;
 • color scheme, ph. వర్ణకల్పన;
 • colostrum, n. జున్నుపాలు; పశువులు ఈనిన తరువాత మొదటి రెండు, మూడు రోజులూ ఇచ్చే పాలు; ఈ పాలు చూడడానికి తెల్లగా ఉండవు; నీళ్లల్లా ఉంటాయి;
 • colt, n. మగ గుర్రప్పిల్ల;
 • column, n. (1) స్తంభం; కంబం; (2) దొంతి; కుందం; వరుస; నిలువు వరుస; నిరుస; మొగరం; స్థూపం; ధారణి; ఓజ;
 • column of liquid, ph. ద్రవస్తంభం; ద్రవకంబం;
  • vertical -, ph. ధారణి; నిలువు వరుస; నిరుస; ఓజ;
 • coma, n. అపస్మారకం; కుంభనిద్ర; స్థిరనిద్ర; చిరనిద్ర; స్మృతిరహిత నిద్ర; స్మృతివిహీనత; ఒంటి మీద తెలివిలేని స్థితి; కోమా;
 • comatose, adj. అపస్మారక స్థితిలో ఉన్న; కుంభనిద్రలో ఉన్న;స్మృతిరహితనిద్రలో ఉన్న; స్మృతివిహీన;
 • comb, n. దువ్వెన; పన్ని; చిక్కట్ట; కంకతము;
 • comb, v. t. (1) దువ్వు; (2) వెతుకు; గాలించు;
 • combination, n. మేళనం; సంయోగం; సంమ్మిశ్రమం;
  • chemical -, ph. రసాయన సంయోగం;
 • combine, v. t. మేళవించు; సంయోగించు; సంయోగపరచు; కలుపు; కలబోయు; జమిలించు; జమాయించు;
 • combining, n. సంయోజనం;
 • combined, adj. సంయుక్త; సమయోజిత; సమైక్య; కలసిన; కలసిపోయిన; %check this సమయోజిత
 • combined state, ph. సమైక్య రాష్ట్రం; సమైక్య స్థితి;
 • combustible, adj. దాహక; కాలే గుణం గల; మండగల;
 • combustibility, n. దహ్యత;
 • combustion, n. దహనం; నిర్ధహనం; నిర్ధగ్ధం; జ్వలనం; ప్లోషం; మంట; జ్వాల;
  • heat of -, ph. దహనోష్ణత;
  • internal -, ph. అంతర్ దహనం;
  • supporter of -, ph. దహనాధారం;
  • - boat, ph. దహన తరణి;
  • - temperature, ph. జ్వలన ఉష్ణోగ్రత;
  • - tube, ph. దహన నాళం;
 • come, inter. రా; రాండి;
 • come, v. i. వచ్చు; అరుదెంచు; వేంచేయు; విచ్చేయు; ఏగుదెంచు; ఏతెంచు; అరుదెంచు;
 • comedian, n. m. హాస్యగాడు; విదూషకుడు; ప్రహసనకుడు;
 • comedienne, n. f. హాస్యగత్తె; విదూషకి;
 • comedy, n. (1) ప్రహసనం; హాస్యరస ప్రధానమయిన నాటకం; (2) సుఖాంతమైన నాటకం;
 • comet, n. తోకచుక్క; ధూమకేతువు;
 • come-upper, n. [idiom] అగస్త్యభ్రాత; అతి తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి;
 • comfort, n. సౌకర్యం; సుఖస్థితి; నెమ్మి;
 • comfort, v. t. ఊరడించు;
 • comic, adj. హాస్యరస ప్రధానమయిన; హాస్య; హాస్య స్పోరక; నవ్వు పుట్టించే;
 • comical, adj. హాస్యమయ;
 • coming, adj. రాబోయే; వచ్చే; రాబోతూన్న;
 • command, n. అనుశాసనం; ఉత్తరువు; ఉత్తర్వు; ఆదేశం; నిర్దేశం; ఆనతి; ఆన; ముదల;
  • peremptory -, ph. వశిష్ట వాక్యం;
 • command line, ph. [comp.] ఆదేశ పంక్తి; ఆదేశ వాక్యం;
 • commander, n. దళవాయి; దళపతి; దండనాయకుఁడు; సేనాధిపతి; నిర్దేష్ట; వాహినీపతి; అవవాదుఁడు;
 • commander-in-chief, n. సర్వసేనాధిపతి;
 • commandments, n. ఆదేశాలు; అనుశాసనాలు;
 • commence, v. i. మొదలుపెట్టు; చేపట్టు; ఆరంభించు; ఉపక్రమించు;
 • commendable, adj. ముదావహమైన;
 • commendable, n. ముదావహం; ప్రశంసనీయం;
 • commensurable, adj. (1) సమానభాజకముగల, having a common measure; divisible without remainder by a common unit; (2) పరిగణనీయ; సాపవర్తకమైన; అపవర్తనముగల;
 • comment, n. వ్యాఖ్య; వ్యాఖ్యానం;
  • no -, ph. నిర్వాఖ్య;
 • commentator, n. భాష్య కారుడు; వ్యాఖ్యాత;
 • commentary, n. టీక; టిప్పణం; వ్యాఖ్యానం; వ్యాఖ్య; భాష్యం;
  • brief -, ph. టిప్పణం;
  • - on commentary, ph. టీకకు టీక;
 • commerce, n. వ్యాపారం; వాణిజ్యం; వర్తకం;
 • commission, n. అడితి; కాయిదా; అడిసాటా;
  • - business, ph. అడితి వ్యాపారం; కాయిదా వ్యాపారం;
  • - business shop, ph. కాయిదా కొట్టు;
  • - merchant, ph. అడితిదారుడు,
 • commitment, n. నిబద్ధత; సంకల్పం; అంకితభావం; ప్రతిశబ్దత; అభినివేశం; నిరతి; శ్రద్ధాభక్తులు;
  • - to service, ph. సేవానిరతి;
 • committee, n. బృందం; మండలి; కమిటీ;
 • commodity, n. సరకు;
 • common, adj. (1) సామాన్య; లోక; సమాహారక; ఏకోను; (2) ఉమ్మడి; ఉభయ;
  • - factor, ph. సామాన్య భాజకం; ఉమ్మడి భాజకం;
  • - practice, ph. పరిపాటి; రివాజు;
  • - property, ph. ఉమ్మడి ఆస్తి;
  • - sense, ph. లోకజ్ఞానం; వ్యవహారజ్ఞానం;
  • - term, ph. సమాహారక పదం; ఉమ్మడి పదం;
 • commotion, n. అలజడి; సంచలనం; గొడవ; గందరగోళం;
 • communal, adj. సాముదాయిక; సంఘానికి సంబంధించిన;
 • communalism, n. కులతత్త్వం; సామాజికవర్గ తత్త్వం;
 • communicable, adj. సంక్రామిక;
  • - disease, సంక్రామిక వ్యాధి, సంక్రామిక రోగం;
 • communication, n. వార్త; విశేషం; సందేశం;
 • communications, n. pl. వార్తాసౌకర్యాలు;
 • communion, n. సత్సంగం; [సత్ = God, సంగం = union ];
 • communique, n. ప్రసారమాధ్యమాలకి అందించే అధికార ప్రకటన;
 • communism, n. సామ్యవాదం;
 • community, n. సమాజం;
 • community development center, ph. సమాజ వికాస కేంద్రం;
 • commute, v. t. (1) తగ్గించు; (2) ఇంటి నుండి ఉద్యోగ స్థలానికి రోజువారీ ప్రయాణం చేయు; పాయకరీ;
 • commuter, n. పాయకారీ; ఇటూ అటూ తిరిగేది;
 • compact, adj. మట్టసమైన; చిన్నదైన; కుదిమట్టమైన; కురుచైన; సాంద్ర; (ant.) diffuse;
 • compact, n. ఒడంబడిక; ఒప్పందం;
 • compact, v. t. కుదించు;
 • compactor, n. దిమ్మిస;
  • rolling -, ph. దిమ్మిస రోలు;
 • companion, n. సహవాసి; తోడు;
 • companionship, n. సహచర్యం;
 • company, n. (1) తోడు; సహవాసం; సావాసం; (2) నిగమ్; కంపెనీ; వ్యాపార బృందం;
 • comparative, adj. తులనాత్మక; సామ్య; పోల్చదగిన;
 • comparative grammar, ph. తులనాత్మక వ్యాకరణం;
 • comparative philology, ph. తులనాత్మక భాషా చరిత్ర;
 • compare, v. t. పోల్చు; సరిపోల్చు; సరిచూచు; ఉపమించు; బేరీజు వేయు; తైపారు వేయు;
 • comparison, n. పోలిక; సామ్యం;
 • compartment, n. గది; అర; రైలు పెట్టెలో ఒక గది; see also bogie;
 • compass, n. దిక్‌సూచి;
 • compassion, n. కరుణ; దయ; జాలి; అనుకంపం; దాక్షిణ్యం; సంయమనం;
  • - for living creatures, ph. భూతదయ;
 • compassionate, adj. కరుణామయ; దయగల; జాలిగల; అనుకంప;
 • compatible, adj. అవిరుద్ధ;
 • compatibility, n. పొంత; పొందిక; పొత్తు; అవిరుద్ధత; క్షమత;
 • compatriot, n. స్వదేశీయుడు;
 • compendium, n. సంకలనం;
 • compensation, n. (1) పరిహారం; నష్ట పరిహారం; (2) జీతం;
 • competence, n. ప్రయోజకత్వం; సామర్ధ్యం; దక్షత;
 • competition, n. పోటీ; దంటీ;
 • competitor, n. పోటీదారు; ప్రతియోగి; స్పర్ధాళువు; దంట;
 • compilation, n. కూర్పు; సంహితం;
 • compile, v. t. కూర్చు; సేకరించు;
 • compiled, n. కూర్పబడినది; ప్రోతం; గ్రథితం;
 • compiler, n. (1) కూర్పరి; సంకలన కర్త; (2) ఒక ఉన్నత భాష నుండి మరొక నిమ్న భాషకి తర్జుమా చెయ్యటానికి కంప్యూటరు వాడే క్రమణిక;
 • complainant, n. ఫిర్యాది; ఫిర్యాదు చేసే వ్యక్తి;
 • complaint, n. చాడీ; అభియోగం; ఫిర్యాదు; (ety.) [Hin.] ఫిర్ యాద్ means "remind again;
 • complement, n. [math.] పూరకం; ఉదాహరణకి దశాంశ పద్ధతిలో y యొక్క దశాంశ పూరకం (ten’s complement) అంటారు. అలాగే y యొక్క నవాంశ పూరకం (nine’s complement of y). ద్వియాంశ పద్ధతిలో y అనే ద్వియాంశ సంఖ్య యొక్క "ఒకట్ల" పూరకం (one’s complement of y).
  • binary -, ph. ద్వియాంశ పూరకం;
  • decimal -, ph. దశాంశ పూరకం;
  • - addition, ph. పూరక సంకలనం; కంప్యూటర్లలలో సంకలన వ్యవకలనాలు చెయ్యడానికి అనువైన పద్ధతి;
  • - subtraction, ph. పూరక వ్యవకలనం;
 • complementary, adj. ఉల్టా; పూరక; పరస్పర పరిపూరక;
  • - event, ph. ఉల్టా సంఘటన; పూరక సంఘటన;
 • complete, v. t. (1) పూర్తిచేయు; పూరించు; (2) నింపు; (3) భర్తీచేయు;
 • complete, adj. అంతా; పూర్తిగా; యావత్తు; నిండుగా; సాంగంగా; పరిపూర్ణంగా; సంపూర్ణంగా;
 • complex, adj. సంకీర్ణ; మిశ్రమ; క్లిష్ట; జటిల; సంశ్లిష్ట;
 • complex issue, ph. క్లిష్ట సమస్య; జటిలమయిన సమస్య;
 • complex number, ph. సంకీర్ణ సంఖ్య; సమ్మిశ్ర సంఖ్య; క్లిష్ట సంఖ్య;
 • complex sentence, ph. సంశ్లిష్ట వాక్యం;
 • complex, n. క్లిష్ట మానసిక స్థితి; జటిల మానసిక స్థితి; సంశ్లిష్ట మానసిక స్థితి;
  • diana -, ph. మగ పోకడలకి పోవాలనే ఆడదాని కోరిక; మాటలలోను, చేతలళోను పురుశ్హిడిలా ఉండాలనే కోరిక;
  • electra -, ph. తండ్రితో కామ సంబంధాలు నెరపాలని కూతురు అంతరాంతరాలలో వాంఛించడం;
  • inferiority -, ph. ఆత్మన్యూనతా భావం;
  • superiority -, ph. అధిక్యతా భావం;
 • complexion, n. ఛాయ; వర్చస్సు; వర్ణం; రంగు; శరీరపు రంగు;
  • swarthy -, ph. చామనఛాయ;
 • complexity, n. క్లిష్టత; సంక్లిష్టత;
 • compliance, n. ఆచరణ; అనుసరణ; పాటింపు; కట్టుబడి;
 • compliment, n. పొగడ్త; మెచ్చికోలు; అభినందన; ప్రశంస; శుభాకాంక్ష;
 • complimentary, adj. గౌరవార్ధక;
 • comply, v. t. పాటించు; ఆచరించు; అనుసరించు; అనువర్తించు; అనుష్టించు; అమలు చేయు;
 • component, n. అంశీభూతం; అంశం; భాగం; అనుఘటకం;
 • compose, v. t. (1) రచించు; అల్లు; (2) పేర్చు; కూర్చు;
 • composing stick, n. మరబందు; అచ్చొత్తేముందు అక్షరాలని కూర్చడానికి వాడే పనిముట్టు;
 • composite, adj. సంయుక్త;
 • composition, n. (1) రచన; అల్లిక; (2) పేర్పు; కూర్పు;
 • compositor, n. అక్షరసంధాత; అక్షరకూర్పరి;
 • compost, n. (కాంపోస్ట్) ఆకుపెంట; పెంట; చీకుడు ఎరువు;
  • - pile, ph. పెంటపోగు;
 • composure, n. నిబ్బరం;
 • compound, adj. మిశ్రమ; సంయుక్త; సమ్మిశ్ర; ద్వంద్వ;
  • - eye, ph. సంయుక్తాక్షము; సంయుక్తాక్ష;
  • - sentence, ph. ద్వంద్వ వాక్యం;
  • - interest, ph. చక్రవడ్డీ; ఇబ్బడి వడ్డీ;
  • - fraction, ph. మిశ్రమ భిన్నం;
  • - number, ph. సంయుక్త సంఖ్య;
  • - word, ph. సమాసం;
  • - wall, ph. ప్రహరి గోడ; ప్రాకారం; ప్రాంగణ ప్రాకారం;
 • compound, n. (1) మిశ్రమ ధాతువు; (2) ప్రాంగణం; లోగిలి;
 • compoundable, adj. [legal] రాజీ కుదుర్చుకోకూడనిది లేదా రాజీ కుదుర్చుకోడానికి వీలు కాని నేరం;
 • comprehend, v. t. గ్రహించు; అర్ధం చేసుకొను;
 • comprehensible, n. సుబోధకం; అర్థం అయేవిధంగా ఉన్నది;
 • comprehension, n. గ్రహింపు; గ్రహణం; ఆకళింపు; ఆకలనం; అవగాహన; అవగతం;
 • comprehensive, adj. సమగ్ర; సర్వతోముఖ;
 • comprehensively, adv. సమగ్రంగా; సర్వతోముఖంగా; సాంగోపాంగంగా; సాకల్యంగా;
 • compress, v. t. కుదించు; దట్టించు;
 • compression, n. సంపీడనం; సంఘాతం;
 • compromise, n. రాజీ;
 • compromise, v. i. రాజీపడు;
 • compulsion, n. నిర్బంధం; ప్రసభం;
 • compulsory, adj. విధిగా; విధాయకంగా; వెట్టి; నిర్బంధ; అనివార్య; ఆవశ్యక; తప్పనిసరి;
  • - education, ph. నిర్బంధ విద్యావిధానం;
  • - labor, ph. వెట్టి చాకిరీ; బేగారి చాకిరీ;
 • computation, n. గణన; లెక్కింపు;
 • computational, adj. లెక్కింపు పద్ధతులకి సంబంధించిన; గణన పద్ధతులకి సంబంధించిన;
  • - methods, ph. లెక్కింపు పద్ధతులు; గణన పద్ధతులు;
 • compute, v. t. సంగణీకరించు;
 • computer, n. (1) గణకుడు; గణకి; లెక్కలు చూసే వ్యక్తి; (2) కలనయంత్రం; గణాంకయంత్రం; గణిత యంత్రం; సంగణకం; కంప్యూటరు;
  • analog -, ph. సారూప్య కలనయంత్రం;
  • digital -, ph. అంక కలనయంత్రం;
  • hybrid -, ph. సంకర కలనయంత్రం;
 • concatenate, v. t. జతపరచు; జోడించు; తగిలించు; కలుపు;
 • concave, adj. పుటాకారమైన, నతోదర; ఉత్తాన;
 • concave lens, ph. నతోదర కటకం; పుట కటకం; పుటాకార కటకం;
 • concede, v. i. ఒప్పేసుకొను; ఓటమిని అంగీకరించు;
 • conceit, n. అతిశయం; టెక్కు; డాంబికం; అహమహమిక;
 • conceited, adj. అతిశయంతో కూడిన; టెక్కుతో; ఆడంబరపు;
 • conceive, v. i. (1) గర్భం ధరించు; కడుపుతోనుండు; (2) ఊహించు; భావించు; అనుకొను;
 • concentrate, v. i. లగ్నముచేయు; ధారణ చేయు; కేంద్రీకరించు;
 • concentrate, v. t. గాఢతని పెంచు; నిర్జలీకరించు;
 • concentrate, n. (1) లగ్నం; ధరణి; (2) నిర్జలి;
 • concentrated, adj. గాఢ; నిర్జల; సాంద్రీకృత; see also anhydrous;
 • concentration, n. (1) అవధానం; ఏకాగ్రత; ధారణ; ధ్యానం; నిధిధ్యాసము; తితీక్ష; (2) గాఢత; సాంద్రీకరణం; (3) నిర్జలత;
  • power of -, ph. ధారణశక్తి;
 • concentration, v. t. నిర్జలీకరణ;
 • concentric, adj. ఏకకేంద్రక; కేంద్రకయుత;
  • - circles, ph. ఏకకేంద్రక వృత్తములు;
  • - spheres, ph. ఏకకేంద్రక గోళములు;
 • concept, n. భావం; భావన; మనోగతి; ఊహ; ఊహనం; అధ్యాహారం; గ్రాహ్యం; పోహ (అపోహ కానిది);
  • - formation, ph. భావ సంకల్పన;
 • conception, n. ఆవయం; శిశుసంకల్పన;
 • conceptual, adj. అధ్యాహారిక; ఊహాత్మక; పోహిక; పౌహిక;
 • conceptually, adv. భావనాత్మకంగా;
 • concern, n. బెంగ; తాపత్రయం; ధ్యాస;
 • concert, n. కచేరీ; పాటకచేరీ;
  • musical -, ph. గాన కచేరీ; పాట కచేరీ;
 • concerto, n. (కంచెర్టో) సంగీత స్వర కల్పన; a musical composition;
 • concerted, adj. సమైక్య; కూడబలుక్కొన్న;
 • concession, n. రాయితీ;
 • concessional, adj. రాయితీ;
  • - stand, ph. రాయితీ బడ్డీ; క్రీడా స్థలాల వంటి బహిరంగ ప్రదేశాలలో కిరాయికి కుదుర్చుకున్న కిరాణా దుకాణాల వంటి బడ్డీలు;
 • conch, n. శంఖం;
  • - shell, ph. శంఖం; చిందం;
 • conciliation, n. రాజీ; ఒప్పందం; అంగీకారం;
 • concise, adj. సంక్షిప్త; క్లుప్త;
 • conclave, n. సమాలోచన సభ; కొద్దిమంది ముఖస్థంగా మాట్లాడుకుందికి సమావేశమయే గది;
 • conclude, v. t. ముగించు; ఉపసంహరించు; పూర్తిచేయు; విరమించు; నిష్కర్షించు; సమాప్తం చేయు; కడతేర్చు;
 • conclusion, n. ముగింపు; పర్యవసానం; ముక్తాయింపు; ఉపసంహారం; ఉద్యాపన; సమాప్తి; నిష్కర్ష; విరమింపు; అవసానం; (ant.) beginning; takeoff;
 • concoct, v. i. కిట్టించు; అల్లు;
 • concomitant, adj. అనుషంగిక; ప్రధానం కాని; ముఖ్యం కాని;
 • concord, n. సామరస్యం;
 • concrete, adj. సంయుక్త; మూర్త; యదార్థ; వాస్తవిక; నిర్ధిష్ట; (ant.) abstract;
  • - objects, ph. మూర్త పదార్థాలు;
 • concrete, n. (1) కాంక్రీటు; (2) యదార్థం; వాస్తవం;
  • not cast in - ph. [idiom] రాతి మీద గీత కాదు;
 • concreteness, n. మూర్తత;
 • concubine, n. ఉంపుడుకత్తె; ఉపపత్ని; చేరుగొండి; ముండ;
 • concur, v. i. ఏకీభవించు;
 • concurrent, adj. అనుషక్త; జమిలి;
 • condemn, v. i. ఖండించు; దుయ్యబట్టు; నిందించు; గర్హించు;
 • condemnatory, adj. నిందాత్మక మయిన; నిందించేటట్టి;
 • condensation, n. (1) కుదింపు; సంగ్రహణ; సంధానం; బణుసంధానం; రెండు అణువులని జతపరచుట; (2) ద్రవీభవనం; సంఘననం; (rel.) liquefaction;
 • condense, v. t. (1) కుదించు; సంగ్రహించు; (2) గడ్డ కట్టించు; సంధించు;
 • condensed, adj. గడ్డకట్టబడిన; సంఘటిత; సాంద్రీకృత; సాంద్రీకృత;
 • condensed book, ph. సంఘటిత పుస్తకం;
  • - milk, ph. గడ్డ పాలు;
 • condiments, n. సంభారములు; సంబరువులు; పరివ్యయములు; వంటలలో వాడే సుగంధ ద్రవ్యములు;
 • condition, n. (1) నిబంధన; నియమం; షరతు; (2) పరిస్థితి; స్థితి; అవస్థ;
 • conditional, adj. నైబంధిక; నియమ; షారత;
  • - lease, ph. నైబంధిక కౌలు; మద్దతు కౌలు;
  • - probability, ph. నైబంధిక సంభావ్యత;
  • - sale, ph. నైబంధిక క్రయం; షారత క్రయం; మద్దతు అమ్మకం;
 • conditioning, n. నియంత్రీకరణ;
  • air -, ph. వాత నియంత్రీకరణ;
 • condole, v. t. పరామర్శించు; పరామర్శ చేయు;
 • condolence, n. సానుభూతి; సంతాపం; పరామర్శ;
 • condom, n. తొడుగు; లింగతొడుగు; పిల్లలు పుట్టకుండాను, సుఖరోగాలు రాకుండాను తప్పించుకుందికి రతి సమయంలో లింగానికి తొడిగే రబ్బరు తొడుగు;
 • condominium, n. ఉమ్మడి పరిపాలన; ఉమ్మడి వాటాదారులుగా ఉన్న ఇల్లు; (rel.) flat; apartment;
 • condone, v. t. క్షమించు;
 • condor, n. గూళి; సాళువ డేగ;
 • conduce, v. i. దోహదం చేయు;
 • conduct, n. (కాండక్ట్) ప్రవర్తన; శీలం; నడవడిక; నడత;
 • conduct, n. (కండక్ట్) జరిపించు; నడిపించు; నిర్వహించు; నెరపు; కానిచ్చు;
 • conduction, n. వహనం;
 • conductivity, n. వాహకత్వం;
 • conductor, n. (1) వాహకి; వాహకం; (2) యాజి; నిరవాకి; ప్రవర్తకుడు; వ్యవహర్త; కండక్టరు;
  • semi -, ph. అర్ధవాహకి; అర్ధవాహకం;
  • tour -, ph. యాత్రిక యాజి;
 • conduit, v. t. (కాండూట్) కాలువ; తూము; గొట్టం; మార్గం;
 • cone, n. శంఖం; శంఖు;
 • conical, adj. .శంఖాకార;
 • confection, n. మోదకం; చాకలేట్లు, బిళ్ళలు, మొ. తీపి సరుకులు;
 • confederation, n. సమాఖ్య;
 • conference, n. సభ; సమావేశం; సదస్సు; సమ్మేళనం;
  • summit -, ph. శిఖరాగ్ర సమావేశం;
  • video -, ph. దృశ్య సమావేశం;
  • - hall, ph. సభాస్థలి;
 • confess, v. i. ఒప్పేసుకొను;
 • confidants, n. pl. (కాన్ఫిడాంట్‌‌స్) ఆంతరంగికులు; సన్నిహితులు;
 • confidence, n. ధీమా; నమ్మకం; విశ్వాసం; దీలాసా; భరవసం; ధిషణ;
  • self-confidence, ph. ఆత్మవిశ్వాసం;
 • confidential, adj. గుప్త; రహస్య; ఆంతరంగిక;
  • - communication, ph. గుప్త నివేదన;
  • - secretary, ph. ఆంతరంగిక సచివుడు;
 • confidential, n. గుప్తం; రహస్యం; ఆంతరంగికం;
  • highly -, ph. దేవ రహస్యం;
 • confidentiality, n. ఆంతరంగికత; రహస్యం;
 • configuration, n. అమరిక; సమగ్రాకృతి;
 • confine, v. t. బంధించు; నిర్బంధించు;
 • confinement, n. బంధిఖానా; నిర్బంధం;
 • confirm, v. t. ఖాయపరచు; ధ్రువపరచు; ధ్రువీకరించు; రూఢిపరచు; రూఢిచేయు;
 • confirmation, n. ధ్రువీకరణ; దృఢీకరణ;
 • confiscation, n. జప్తు;
 • conflagration, n. దహనకాండ; మంటలు;
 • conflict, n. ఘర్షణ; సంఘర్షణ; లడాయి; విప్రతిపత్తి;
  • armed -, ph. సాయుధ సంఘర్షణ;
  • class -, ph. వర్గ సంఘర్షణ;
  • mental -, ph. భావ సంఘర్షణ;
  • - of interest, ph. విప్రతిపత్తి;
 • conflicting, adj. పరస్పర విరుద్ధ; పొందిక లేని; పొందు పొసగని; విప్రతిపన్న;
  • - objectives, ph. విరుద్ధ ప్రయోజనాలు;
 • confluence, n. నదీ సంగమం; సంగమం; కూడలి; సమూహం;
 • conform, v. i. బద్ధమగు;
  • - to contemporary trends, ph. సమయ బద్ధమగు;
 • conformal, adj. అనురూప;
 • conformational, adj. అనురూపాత్మక;
  • - analysis, ph. అనురూపాత్మక విశ్లేషణ;
  • - isomerism, ph. అనురూపాత్మక సాదృశం;
 • conformed, adj. సంబద్ధ;
 • conformist, n. సాంప్రదాయదాసుడు; అనుసారి;
 • confounded, n. కారాకూరం; %check this
 • confront, v. i. ఎదుర్కొను;
 • confuse, v. i. కంగారుపడు;
 • confuse, v. t. కంగారుపెట్టు;
 • confusion, n. కంగారు; గందరగోళం; తికమక; తొట్రుపాటు; కలత; ఆకులపాటు; గాసటబీసట; గజిబిజి; కకపిక;
  • - of mind, ph. ఆకులపాటు;
 • congeal, v. i. ముద్దకట్టు; గడ్డకట్టు; పేరుకొను;
 • congenial, adj. ఒకే స్వభావంగల; కలుపుగోలు;
 • congenital, adj. ఆగర్భ; ఆజన్మ; జన్మజ; పుట్టు; పుట్టుకతో వచ్చిన; జనుష; వంశ పారంపర్యంగా ఉన్నది కాదు;
  • - blindness, ph. పుట్టుగుడ్డితనం; జనుషాంధత్వం;
  • - disease, ph. పుట్టుకతో ఉన్న రోగం; ఆగర్భ రోగం;
 • congestion, n. ఇరుకు; ఇరకాటం; రద్దీ;
 • conglomerate, v. i. గుమిగూడు;
 • congratulation, n. అభినందన;
 • congregation, n. సమావేశం; సమాజం;
 • congress, n. సమావేశం; ప్రతినిధుల సభ;
 • congruence, n. ఆనురూపత;
 • congruent, adj. ఆనురూప; సమాన; సర్వసమాన; సమశేష; తాదాత్మ్య;
 • congruent class, ph. [math.] సమశేష వర్గం;
 • conifer, n. పైను, ఫర్‍ జాతి శంఖాకారపు చెట్టు; కోను కాయలను కాసే చెట్టు;
 • conjecture, n. ఊహ; ప్రతిపాదన;
 • conjoined, adj. సంయోజిత;
 • conjoint, adj. కూడిన; చేరిన; కలసి ఉన్న; కలసి ఒకటిగా ఉన్న;
  • - twins, ph. కలసి ఒకటిగా ఉన్న కవలలు; అతుక్కుపోయిన కవలలు;
 • conjugacy, adj. సంయుగ్మత;
 • conjugal, adj. జంటకి సంబంధించిన; వైవాహిక జీవితానికి సంబంధించిన; దాంపత్య;
  • - rights, ph. దాంపత్య హక్కులు;
 • conjugated, adj. సంయుగ్మ; సంయుక్త; సంబద్ధ; అనుబద్ధ; సంయోగ; జంటకి సంబంధించిన;
  • - double bond, ph. సంయోగ జంట బంధం;
 • conjugation, n. సంయోగం; సంయుగ్మం;
 • conjunctivitis, n. నేత్రాభిష్యందం; కండ్లకలక;
  • gonorrheal -, ph. ప్రమేహ నేత్రాభిష్యందం;
 • conjunction, n. యుతి; మిళితం; కలయిక; సంయోగం; (వ్యాకరణంలో) సముచ్ఛయం; పొంతనం;
  • - of planets, ph. గ్రహ పొంతనం; గ్రహాల యుతి;
 • conjurer, n. మాయావి; మాయలమారి; మాంత్రికుడు;
 • connect, v. t. అతుకు; కలుపు; తగిలించు; సంధించు; అనుసంధించు; అనుబంధించు;
 • connected, adj. శ్లిష్ట; అనుసంధాన;
 • connecting rod, n. లంకె ఊస; సంసక్త ఊస; ఇంజనుని చక్రాలకి తగిలించే ఊస;
 • connection, n. అతుకు; సంధి; సంబంధం; అనుసంధానం; స్పృక్కు; కైకట్టు; electrical connection;
 • connective, adj. అతికే; సంధాయక;
  • - tissue, ph. సంధాయక కణజాలం;
 • connoisseur, n. (కానసూర్) m. రసికుడు; రసజ్ఞుడు; f. రసికురాలు;
 • connotation, n. సందర్భార్ధం; సందర్భానికి సరిపోయే అర్ధం; see also denotation;
 • conquer, v. i. జయించు;
 • conqueror, n. జేత; విజేత; జైత్రుడు;
 • consanguine, n. m. సగోత్రీకుడు; రక్తసంబంధి;
 • consanguinity, n. సగోత్రీయత; రక్తసంబంధం; వావి; వావి-వరస;
 • conscience, n. (కాన్‌షన్స్) అంతర్వాణి; అంతరాత్మ; మనస్సాక్షి;
 • conscientious, adj. (కాన్‌షియన్‌షస్) మనస్ఫూర్తి అయిన శ్రద్ధ; మనస్సాక్షికి లోబడిన;
 • conscious, adj. (కాన్‌షస్) వ్యక్తమైన; స్పృహతో; మెలుకువతో; [psych.] వైఖరి; చేతన; జ్ఞాత;
  • sub -, ph. వ్యక్తావ్యక్తమైన; [psych.] ఉపచేతన; ఉపజ్ఞాత;
  • un -, ph. అవ్యక్తమైన; [psych.] సుప్తచేతన; సుప్తజ్ఞాత; అవ్యక్తచేతన;
  • - age, ph. బుద్ధి ఎరిగిన వయస్సు; వ్యక్త వయస్సు;
  • - state, ph. జాగ్రదావస్థ;
 • consciousness, n. స్పృహ; స్మృతి; స్మారకం; చేతస్సు; చైతన్యం; వ్యక్తచేతన; చిత్తాకాశం; చేతనం; చిత్; పరిజ్ఞానం; ప్రజ్ఞానం; జ్ఞాతం;
  • self -, ph. ఆత్మజ్ఞాన;
  • social -, ph. సామాజిక స్పృహ;
  • sub -, ph. అంతర్ చేతన;
  • un -, ph. అవ్యక్తచేతన;
  • stream of -, ph. చైతన్య స్రవంతి;
  • Universal -, ph. బ్రహ్మజ్ఞానం;
 • consecrate, v. t. పవిత్రం చేయు; పవిత్ర పరచు;
 • consecration, n. అభిషేకం; పవిత్రం చేసే తంతు;
 • consecutive, adj. నిరత; సతత; క్రమానుగత; పుంఖానుపుంఖంగా; ఒకదాని తర్వాత మరొకటి;
  • - numbers, ph. క్రమానుగత సంఖ్యలు;
 • consensus, n. అభిప్రాయసామ్యం;
 • consent, n. అంగీకారం; మేకోలు; ఈకోలు;
 • consent, v. i. ఒప్పుకొను; అంగీకరించు; ఎవరైనా ప్రతిపాదించిన దానిని గాని అడిగినదానిని కాని చెయ్యడానికి ఒప్పుకొనడం; అనుమతించు; see also assent, agree, concur, accede and acquiesce;
 • consequence, n. పర్యవసానం; పరిణామం;
  • negative -, ph. దుష్‌పరిణామం; రుణపరిణామం;
 • consequently, adv. తత్ఫలితంగా;
 • conservation, n. పరిరక్షణ;
 • conservation laws, n. విహిత నియమాలు; నిక్షేప నియమాలు;
 • conserve, n. నిల్వ పెట్టడానికి వీలుగా చేసిన సరుకు; ఊరగాయలు; అప్పడాలు; వడియాలు వంటి ఎండబెట్టిన సరుకులు; మురబ్బాలు;
 • conserve, v. t. నిక్షేపించు;
 • consider, v. i., v.t. పరిగణించు; ఆలోచించు; లెక్కలోనికి తీసికొను; చిత్తగించు; యోచించు; మానసించు;
 • consideration, n. పరిగణన; యోచన; పర్యాలోచన;
 • consign, v. i. కేటాయించు;
 • consignment, n. (1) కేటాయింపు; (2)) రవాణాసరుకు;
 • consistent, adj. అనుగుణ్యత; అవిరుద్ధ; అవిరోధత; సంగతత్వ; నియతి; నిలకడ; స్థిరత్వ;
 • consistency, n. స్థిరత్వం; సంగతత్వం;
 • consistently, adv. నియతంగా; నియతికాలికంగా; నియమాను సారంగా; క్రమం తప్పకుండా; సంగతంగా;
 • consolation, n. ఊరడింపు; ఓదార్పు; సాకతం; సాంత్వనం; సముదాయింపు; పరామర్శ;
  • - prize, ph. సాకత బహుమానం; సాంత్వన బహుమానం; ప్రోత్సాహక బహుమానం;
 • console, n. (కాన్‌సోల్) సాలారం;
  • computer -, ph. కలనయంత్ర సాలారం; సంగణక సాలారం;
 • console, v. t. (కన్‌సోల్) ఓదార్చు; సముదాయించు; ఊరడించు; పరామర్శించు;
 • consolidate, v. t. క్రోడీకరించు;
 • consolidated, adj. ఏకం చెయ్యబడ్డ; ఏకీకృత; సంఘటిత; సుసంఘటిత;
 • consolidation, n. క్రోడీకరించడం; ఒక చోటకి చేర్చడం;
  • - loan, ph. రుణార్ణం;
 • consonants, n. హల్లులు; వ్యంజనములు;
  • aspirated -, ph. ఒత్తు అక్షరములు;
  • double -, ph. జడక్షరములు;
  • conjunct -, ph. జంట అక్షరములు; సంయుక్తాక్షరాలు;
  • contact -, ph. స్పర్శములు;
  • fixed-, ph. స్థిరములు;
  • hard -, ph. పరుషములు; క, చ, ట, త, ప;
  • intermediate -, ph. అంతస్థములు;
  • pure -, ph. పొల్లు హల్లు;
  • soft -, ph. సరళములు; గ, జ, డ, ద, బ;
  • unaspirated -, ph. ఒత్తులు లేని అక్షరములు;
  • voiced -, ph. పరుషములు; క, చ, ట, త, ప;
  • voiceless -, ph. సరళములు; గ, జ, డ, ద, బ;
 • conspicuous, adj. స్పష్టముగా; కొట్టొచ్చినట్లు; స్పుటంగా;
 • conspiracy, n. కుట్ర; పన్నాగం; గూడుపుఠాణి;
 • conspire, v. t. కుట్రపన్ను;
 • constancy, n. స్థిరత్వం;
 • constant, adj. స్థిరమయిన; మారని; మార్పులేని;
 • constant, n. స్థిరాంకం; స్థిరరాసి; స్థిరం;
  • gas -, ph. వాయు స్థిరాంకం;
  • proportionality -, ph. అనుపాత స్థిరాంకం;
  • universal -, ph. సార్వత్రిక స్థిరాంకం;
 • constellation, n. రాశి; రాసి; రిక్క; తారావళి; నక్షత్ర సముదాయం; నక్షత్రమండలం; చూసే వాళ్ల సదుపాయం కొరకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కొన్ని గుంపులుగా విడగొట్టేరు; ఈ గుంపులే రాశులు; ఇటువంటి రాశులు 88 ఉన్నాయి; సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పయనించే నభోపథంలో ఉన్న నక్షత్రాలకి ఒక ప్రత్యేక స్థానం ఉండబట్టి వీటికి పెట్టిన పేర్లు అందరికీ బాగా పరిచయం; అవే మేష, వృషభాది ద్వాదశ రాశులు; ఈ పథంలో ఉన్న 27 నక్షత్ర సమూహాలే అశ్వని, భరణి, మొదలయిన నక్షత్ర రాసులు; see also asterism;
 • consternation, n. దిగ్‍భ్రాంతి; దిగ్‍భ్రమ; నివ్వెరపాటు;
 • constipation, n. మలబద్ధకం; (rel.) indigestion;
 • constituency, n. నియోజకవర్గం; ఎన్నికల సదుపాయానికిగా దేశాన్ని విడగొట్టిన పరిపాలనా భాగం;
 • constituent, n. అంగం; అంగరూపం; భాగం;
 • constitution, n. (1) రాజ్యాంగం; (2) శరీర తత్వం; నిర్మాణం; కట్టుబాటు; దేహపాకం;
  • written -, ph. లిఖిత రాజ్యాంగం;
 • constitutional, n. (1) రాజ్యాంగ బద్ధం; (2) తత్వ బద్ధం;
 • constitutionalist, n. రాజ్యాంగవాది;
 • constraint, n. ఆంక్ష; నిబంధన; కట్టుబాటు; నియమం; నిరోధం; సంయమనం; షరతు; ఆసేధం;
  • space -, ph. స్థానాసేధం;
  • time -, ph. కాలాసేధం;
 • construction, n. (1) నిర్మాణం; కట్టడం; (2) ప్రయోగం;
  • building -, ph. భవన నిర్మాణం; గృహనిర్మాణం;
  • passive -, ph. కర్మణి ప్రయోగం;
 • constructive, adj. నిర్మాణాత్మక;
 • consult, v. t. సంప్రదించు; సలహా తీసుకొను;
 • consultant, n. సలహాదారు; మంతవ్యుడు;
 • consultation, n. సంప్రదింపు; సమాలోచన;
 • consume, v. i. (1) తిను; భుజించు; ఆరగించు; (2) వాడు; ఖర్చుచేయు; వినియోగించు వినియోగపరచు; (3) దహించు;
 • consumers, n. భోక్తలు; వినియోగదారులు; అనుభోక్తలు;
 • consumerism, n. భోక్తత్వం;
 • consumption, n. (1) వాడకం; వినియోగం; (2) క్షయ; బేక్టీరియా వల్ల కలిగే ఊపిరితిత్తులని తినేసే ఒక రోగం;
 • contact, n. సన్నికర్షం; స్పర్శ; సంసర్గం; ఒరపు;
  • - lens, ph. కంటి కటకం; స్పర్శ కటకం; సన్నికర్ష కటకం;
  • electrical -, ph. విద్యుత్‌ సన్నికర్షం;
 • contagious, adj. అంటు; సోకుడు; సాంక్రామిక; సంక్రామిక; సంకలిత;
  • - disease, ph. అంటురోగం; సోకుడు రోగం; సంక్రామిక వ్యాధి;
 • container, n. పాత్ర; ఘటం;
 • contaminate, v. t. కలుషిత పరచు; పంకిలపరచు; మురికి చేయు; పాడు చేయు;
 • contemplation, n. ధ్యానం; దీర్ఘాలోచన; ధీయాలంబం;
 • contemporary, adj. సమకాలీన; సమకాలిక;
 • contemporary, n. సమకాలికుడు; సమకాలిక వ్యక్తి;
 • contempt, n. ధిక్కారం; తృణీకారం; ఏవగింపు; ఏహ్యం; అవజ్ఞ;
 • contemptuous silence, n. తూష్ణీం భావం;
 • content, adj. సంతృప్తి;
 • content, n. విషయం; సారం; సరుకు;
 • contention, n. పరిస్పర్ధ;
 • contentious, adj. స్పర్ధాత్మక;
  • - person, ph. స్పర్ధాళువు; పరిస్పర్ధాళువు;
 • contentment, n. పరితుష్టి; పరితృప్తి;
 • contest, n. పోటీ;
  • beauty -, ph. అందాల పోటీ; సుందరాంగుల పోటీ;
 • context, n. సందర్భం; ఘట్టము; తరి; పూర్వాపర సంబంధం;
 • contiguous, adj. ఉపస్థిత; పక్కపక్కనే;
 • continence, n. బ్రహ్మచర్యం; నిగ్రహం; ఆత్మనిగ్రహం;
 • continent, n. ఖండం;
 • continual, adj. అనుశృత; అదేపనిగా;

---Usage Note: continual, continuous

 • ---Use continual when some-thing happens repeatedly often over a long time. Use continuous when something continues without stopping.
 • continuation, n. కొనసాగింపు;
 • continue, v. i. కొనసాగించు; కానిచ్చు;
 • continuing, adj. అవినాభావ;
 • continuity, n. అవిరళత; నిరంతరత; అవిచ్ఛిన్నత;
 • continuous, adj. నిత్య; నిరంతర; నితాంత; అవిచ్ఛిన్న; అనవరత; అనునిత్య; అఖండిత; అవిరళ; అవిరత; అవ్యాహత; అనుశ్రుత; ధారాళమైన; నిరత;
  • - flow, ph. ధారాళమైన ప్రవాహం;
  • - fraction, ph. అవిచ్ఛిన్న భిన్నం;
  • - spectrum, ph. అవిచ్ఛిన్న వర్ణమాల;
 • continuously, adv. నిత్యం; సదా; ఎల్లప్పుడు; నితాంతంగా; నిరంతరాయంగా; అవిచ్ఛిన్నంగా; ఏకటాకీగా, ఏకథాటిగా; నిరాఘాటంగా;
 • continuum, n. [phy.] సమవాయం; ఒకే స్థలానికి పరిమితం కాకుండా అవిచ్ఛిన్నంగా ఉన్న ప్రదేశం;
 • contour, n. ఈనెగట్టు; ఆకార రేఖ; రూపురేఖ;
  • - lines, ph. ఈనెగట్టు గీతలు;
 • contraband, adj. నిషేధించబడ్డ; నిషిద్ధ;
 • contract, n. గుత్త; ఒడంబడిక; ఒప్పందం; ఏర్పాటు; కరారునామా; ముస్తాజరీ;
 • contract labor, n. గుత్త కూలి;
 • contract, v. i. సంకోచించు;
 • contraction, n. సంకోచం;
 • contractor, n. గుత్తదారుడు; గుత్తేదారు; ముస్తాజరు; కంట్రాక్టరు; ఇంత అని ముందు ఒప్పుకొని పని సాంతం జరిపించే వ్యక్తి;
 • contradict, v. t. ఖండించు; వ్యతిరేకించు; నిరాకరించు;
 • contradiction, n. విరుద్ధం; విరుద్ధోక్తి; వ్యాఘాతం; వ్యత్యాస్తం; వ్యతిక్రమం; వ్యాఘాతం; ఏడాకోడం; ఖండన;
  • proof by -, ఖండన ఉపపత్తి;
  • self -, ph. స్వవచో వ్యాఘాతం;
 • contraindication, n. [med.] కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కలిగే ప్రమాదం;
 • contraption, n. కందువ;
 • contrarily, adv. వ్యత్యాస్తంగా; విరుద్ధంగా; వ్యతిక్రమంగా;
 • contrary, adj. విరుద్ధమయిన; వ్యతిరేకమైన;
 • contrast, n. వైషమ్యం; భేదం;
 • contribute, v. t. దోహదం చేయు;
 • contribution, n. (1) చందా; (2) దోహదం;
 • contributor, n. (1) దాత; (2) దోహదకారి;
 • contributory, adj. దోహదప్రాయమైన;
 • contrivance, n. ఉపాయం; ప్రకల్పితం;
 • contrite, adj. పశ్చాత్తాపముతో నిండిన; అనుతాపముతో;
 • contrive, v. t. ప్రకల్పించు; రూపొందించు;
 • contrived, n. ప్రకల్పితం; రూపొందించబడినది;
 • control, n. ఆధిపత్యం; అధీనత; అదుపు; నియంత్రణ; ఖాయిదా; ఏలుబడి; నియతి; నియామకం;
  • birth -, ph. కుటుంబ నియంత్రణ;
 • control, v. i. నిగ్రహించుకొను; తమాయించుకొను;
 • control, v. t. నియంత్రించు; అదుపుచేయు; తమాయించు; చేవలించు; చెప్పుచేతలలో ఉంచుకొను;
 • controllability, n. దమనీయత; నియంత్రీయత;
 • controller, n. యంత; నియంత; నియంత్రకి; నిర్వాహకుడు; చేవలి; నిర్వాహకి; నేత; నిరోధకి; దమనకి; అధిపతి; ఈశ్వరుడు;
 • controversial, adj. వివాదాస్పద మైన;
 • controversy, n. వివాదం; వాదప్రతివాదం;
 • contusion, n. బొప్పి; బొప్పికట్టిన దెబ్బ; కదుం; కమిలిన చర్మం;
 • conundrum, n. పొడుపుకథ; ప్రహేళిక; కుమ్ముసుద్దు; కైపదం; పజిలు; పజిల్; తలబీకనకాయ; బురక్రి పని చెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య;
 • convection, n. సంవహనం; స్థితిభ్రంశవ్యాప్తి; పారప్రేషణం;
 • convene, v. t. సమావేశపరచు;
 • convener, n. m. సంచాలకుడు; సంధాత; సంధాయకుడు;
 • convenience, n. సదుపాయం; హంగు; సౌలభ్యం; వీలు; అనువు; అనుకూలం; వసతి; సానుకూలం; సుకరం:
 • convenient, adj. అనుకూలమైన; అనువయిన; హంగులతో కూడిన; వీలయిన; సుకరమైన;
 • convention, n. (1) సభ; సమావేశం; (2) ఆచారం; లోకసమ్మతి; లోకమర్యాద;
 • conventional, adj. ఆనువాయి;
 • conventions, n. ఆచారములు; ఆనవాయితీలు; మరియాదలు; లోకమర్యాదలు;
 • converge, v. i. కూడు; గుమిగూడు; చేరు; కలియు; అభిసరించు;
 • convergence, n. కూడిక; చేరిక; కలయిక; సంగమం; పరిచ్ఛిన్నం; అభిసరణం; కేంద్రాభిసరణం;
 • convergent, adj. అభిసార; ఆసన్నమాన; అభిసరణ;
 • conversant, adj. తెలిసిన; నైపుణ్యం ఉన్న;
 • conversation, n. సంభాషణ; సల్లాపం; గోష్ఠి; మాటలు; సంకథ;
  • friendly -, ph. బాతాకానీ; పిచ్చాపాటీ; ఇష్టాగోష్ఠి; సరస సల్లాపం;
 • converse, adj. (కాన్‌వర్స్) విపర్య;
 • converse, v. i. (కన్‌వర్స్) మాట్లాడు; సంభాషించు;
 • converse, n. (కాన్‌వర్స్) విపర్యం; వ్యత్యాస్తం;
 • conversely, adv. వ్యత్యాస్తంగా; విపర్యంగా;
 • conversion, n. (1) మార్పు; పరివర్తన; సంయోజకం; (2) మార్పిడి; (3) మతం మార్పిడి;
 • convert, n. (కాన్‌వర్ట్) మారిన మనిషి; మతం మారిన వ్యక్తి;
 • convert, v. t. (కన్‌వర్ట్) మార్చు; పరివర్తించు;
 • converter, n. మార్పరి; పరివర్తరి; సంయోజకి;
 • convex, adj. కుంభాకారమైన; ఉబ్బెత్తు; ఉన్నతోదర;
  • - lens, ph. కుంభాకార కటకం; కుంభ కటకం;
  • - mirror, ph. ఉన్నతోదర దర్పణం; కుంభాకార దర్పణం;
  • - polygon, ph. ఉన్నతోదర బహుభుజి; కుంభ బహుభుజి;
  • - region, ph. ఉన్నతోదర ప్రదేశం; కుంభాకార ప్రదేశం;
 • convexity, adj. కుంభాకారత్వం; ఉబ్బెత్తుతనం; ఉన్నతోదరత్వం;
 • conveyance, n. యానం; ప్రయాణం చెయ్యడానికి అనుకూలమైన బండి;
 • convict, n. (కాన్విక్ట్) దోషి; అపరాధి; శిక్షితుడు; నిర్వాది;
 • convict, v. t. (కన్విక్ట్) దోషి అని నిర్ధారణ చేయు;
 • convicted criminal, ph. శిక్షింపబడిన నేరస్థుడు;
 • conviction, n. నమ్మిక; నిర్వాదం; అధ్యవసానం; అధ్యవసాయం;
 • convocation, n. పట్టప్రదానోత్సవం;
 • convulsion, n.ఈడ్పు; కంపము; వంపులు తిరగడం;
 • cook, n. వంటరి; వంటమనిషి; వల్లవ; m. వంటవాడు; శూదుడు; f. వంటలక్క; వంటకత్తె; అడబాల; పాచకురాలు;
 • cook, v. t. వండు; పచనముచేయు; ఉడికించు;
 • cooked, adj. వండిన; పచనమైన; ఉడికించిన; పక్వ;
  • - in ghee, ph. ఘృతపక్వ;
  • - rice, ph. అన్నం; ఉడికించిన బియ్యం;
 • cooker, n. (1) వంటపాత్ర; (2) వంటపొయ్యి;
 • cooking, adj. వంట; వంటకి సంబంధించిన;
  • - gas, ph. వంటవాయువు;
  • - laddle, ph. వంటగరిటె; తెడ్డు; కరండి;
  • - oil, ph. వంటనూనె; మంచినూనె;
 • cooking, v. t. వండడం; వండటం;
 • cool, adj. (1) చల్లని; (2) నిదానమైన;
 • cool, v. i. చల్లారు; చల్లబడు;
 • cool, v. t. చల్లార్చు; చల్లబరచు; చల్లారబెట్టు;
 • co-operate, v. t. సహకరించు;
 • co-operation, n. సహకారం; కూడుదల;
  • non -, ph. సహాయ నిరాకరణం;
 • co-operative, adj. సహకార;
  • - society, ph. సహకార సంఘం;
 • co-ordinate, n. [math.] అక్షం; కోభుజం; నిరూపకం;
  • - system, ph. అక్ష వ్యవస్థ; నిరూపక వ్యవస్థ;
 • co-ordinate, v. t. సానుకూలపరచు; సంధాన పరచు;
 • co-ordinator, n. సంధాత;
 • co-ownership, n. ఉమ్మడి హక్కు;
 • cop, n. పోలీసు;
 • coplanar, adj. ఏకతల; ఒకే సమతలంలో ఉన్న;
 • Copper, n. రాగి; తామ్రం; ఉదుంబలం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 29, సంక్షిప్త నామం, Cu);
  • - foil, ph. రాగి రేకు; రాగి తగడు;
  • - oxide, ph. తామ్ర భస్మం; చిలుం;
  • - sulfate, ph. మయిలుతుత్తం; మైలతుత్తం; ఇంగిలీకం; మయూరకం; కాసీసం; తామ్ర గంధకితం; CuSO4
 • copra, n. కొబ్బరి; కొబ్బరి కురిడీ; కొబ్బరికాయలోని తెల్లటి చెక్క;
 • coprophagic, adj. మలభోజిక; మలభుక్కు; పీతిరి; పీతి;
  • - dog, ph. పీతి కుక్క; అశుద్ధం తినే కుక్క;
 • copulation, n. మైథునం; రతిక్రీడ;
 • copy, n. (1) నకలు; ప్రతికృతి; ప్రతిలేఖ;(2) ప్రతి;
  • another -, ph. ప్రత్యంతరం;
  • fair -, ph. సాపు ప్రతి; సాపు నకలు;
  • hard -, ph. పటు ప్రతి; కఠిన నకలు;
  • rough -, ph. చిత్తు ప్రతి; చిత్తు నకలు;
  • soft -, ph. మృదు ప్రతి; కోమల నకలు;
 • copy, v. i. నకలు తీయు; చూసి రాయు; అచ్చుదించు;
 • copying, n. నకలు తీయడం; ప్రతిలేఖనం;
 • copyright, n. ప్రచురణ హక్కు; గ్రంథప్రచురణ హక్కు; గ్రంథస్వామ్యం; సర్వాధికారం;
 • coquetry, n. టెక్కు; బోగం టక్కులు; వగలమారితనం; లిటీలిట విభ్రమం;
 • coquette, n. వయ్యారి; వయ్యారిభామ;
 • coral, n. పగడం; ప్రవాళం; విద్రుమం; సముద్రంలో నివసించే ఒక రకం జీవియొక్క శరీర అవశేషాలు; the stony skeletons of corals or marine anthozoa;
  • red -, ph. ఎర్ర పగడం; నవ రత్నాలలో నొకటి;
  • - atoll, ph. పగడపు దీవి;
  • - island, ph. పగడపు దీవి;
  • - polyp, ph. పగడపు జీవి;
  • - reef, ph. పగడపు దిబ్బ;
  • - rock, ph. పగడపు శిల;
 • cord, n. (1) తాడు; పాశం; సూత్రం; పగ్గం; దారం కంటె ముతకగా ఉండేది, మోకు కంటె సన్నంగా ఉండేది; (2) తీగ; తంత్రి; (3) 128 ఘనపుటడుగుల పరిమాణం గల వంటచెరకు;
  • telephone -, ph. టెలిఫోను తాడు;
  • umbilical -, ph. బొడ్డుతాడు;
  • spinal -, ph. వెన్నుపాము;
  • vocal -, ph. నాదతంత్రి; స్వరతంతువు;
 • cordial, adj. సౌమనస్య;
 • cordiality, n. సౌమనస్యత;
 • core, n. మూలాంశం;
 • corer, n. కోరాము;
 • coriander seed, n. ధనియాలు;
 • coriander leaf, n. కొత్తిమీర;
 • cork, n. (1) బెరడు; బెండు; త్వచము; (2) బెండుబిరడా; బెండుతో చేసిన బిరడా;
 • pith -, ph. జీలుగు బెండు;
 • corm, n. [bot.] దుంప; కంద, చేమ వంటి దుంప;
 • cormels, n. pl. [bot.] పిల్లదుంపలు; కంద, చేమ వంటి దుంపలు; దుంప పిలకలు;
 • cormorant, n. నీటికాకి;
 • corn, n. (1) మొక్కజొన్న; (2) ఆనికాయ; కదర; అరికాలిలో వేసే ఒకరకమయిన పుండు;
  • ear of -, ph. మొక్కజొన్న కంకి; మొక్కజొన్న పొత్తు;
  • pop corn -, ph. మొక్కజొన్న పేలాలు; పేలాల మొక్కజొన్న;
  • - on the cob, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న పొత్తు; పొత్తు;
  • - field, ph. మొక్కజొన్న చేను; జొన్న చేను;
  • - flakes, ph. మొక్కజొన్న రేకులు; జొన్న రేకులు;
  • - meal, ph. మొక్కజొన్న పిండి; జొన్న పిండి;
  • - oil, ph. మొక్కజొన్న నూనె; జొన్న నూనె;
 • cornea, n. కంటిపాప మీద ఉండే పారదర్శకమైన పొర; see also eye ball;
 • cormorant, n. నీటికాకి;
 • corner, n. మూల; కోణం; చెరగు;
 • corolla, n. [bot.] ఆకర్షక పత్రావళి;
 • corollary, n. [math.] ఉపసిద్ధాంతం; అర్ధాపత్తి; ఫలితం;
 • corona, n. కిరీటిక, kirITika; కాంతికిరీటం; కాంతివలయం; ఉపసూర్యకం;
 • coronary, adj. [med.] (1) గుండెకు సంబంధించిన; (2) సీసక; మకుట; కిరీట; కిరీటపు ఆకారంలో ఉన్న;
 • coronary artery, ph. కిరీట ధమని; హృదయ ధమని; సీసక ధమని; మకుట ధమని;
 • coronation, n. పట్టాభిషేకం;
 • coroner, n. మరణ విచారణాధికారి; రాజవైద్యుడు; మకుట వైద్యుడు;
 • corporal, adj. శారీరక, శరీర సంబంధమైన;
 • corporate, adj. సభ్యులతో కూడిన; ప్రాతినిధ్య;
 • corporation, n. ప్రతినిధి వర్గం; మండలి; సంస్థ; వాటాదారులు ఉన్న వ్యాపార సంస్థ;
  • municipal -, ph. పురపాలక సంఘం;
 • corporeal, adj. పాంచభౌతికమైన; శారీరక; పార్ధివ;
 • corps, n. (కోర్) దండు; సైన్యం; పటాలం;
 • volunteer -, ph. ఉమేదువారీ పటాలం;
 • corpse, n. (కార్‌ప్స్) శవం; మానవ కళేబరం; కుణపం; (rel.) carcass; carrion;
 • corpuscle, n. రక్తకణం;
  • red -, ph. ఎర్ర కణం;
  • white -, ph. తెల్ల కణం;
 • correct, adj. సరి అయిన; ఉచితమయిన;
 • correct, v. t. తప్పులు దిద్దు; సవరించు; సరిదిద్దు;
 • correction, n. సవరణ; సంశోధనం; దిద్దుబాటు;
 • corrected, adj.సంశోధిత; దిద్దిన;
 • correlate, v. t. సహసంబంధించు; సహసమన్వయించు;
 • correlation, n. సహసంబంధం; సహసమన్వయం;
 • correspondence, n. (1) అనురూపత; (2) ఉత్తరప్రత్యుత్త రాలు;
 • corresponding, adj. అనురూప;
 • corridor, n. నడవ; వసారా; వరండా;
 • corrigendum, n. తప్పొప్పుల పట్టిక; అచ్చయిపోయిన పుస్తకంలో దొర్లిన తప్పులని సవరించిన పట్టిక;
 • corrola, n. [bot.] ఆకర్షక పత్రావళి;
 • corrugated, adj. ముడతలు పెట్టబడ్డ; ముడతలు పడ్డ;
 • corrosive sublimate, n. రసకర్పూరం;
 • corruption, n. (1) వికృతి; (2) లంచగొండితనం;
 • cortex, n. పట్ట; బెరడు; వల్కలం; దేహాంగాలని సంరక్షించే పొర;
  • adrenal -, ph. [med.] వృకోపరి వల్కలం;
  • lower -, ph. [med.] అధో వల్కలం;
 • cortical, adj. [med.] వల్కిక;
 • corundum, n. కురువిందం; కురింజిరాయి;
 • Corvus, n. హస్త; ఈ రాసిలో ఉన్న 5 ప్రకాశవంతమైన నక్షత్రాల సమూహమే హస్తా నక్షత్రం;
 • coryza, n. [med.] పడిశం; జలుబు;
 • cosmetic, adj. (1) సౌగంధిక; (2) పై మెరుగుకి సంబంధించిన;
 • cosmetician, n. సౌగంధికుడు;
 • cosmetics, n. సుగంధ ద్రవ్యాలు; సౌగంధికాలు; మైపూతలు; అంగరాగాలు; సురభిళ విలేపనాలు; అలంకరణ సామగ్రి;
 • cosmic, adj. రోదసీ; రోదసికి సంబంధించిన; విశ్వ; కాస్మిక్‍;
 • cosmic dust, ph. విశ్వ పరాగం; విశ్వధూళి; కాస్మిక్ పరాగం; విశ్వ దూసరం
 • cosmic rays, ph. విశ్వకిరణాలు; కాస్మిక్ కిరణాలు;
 • cosmogony, n. విశ్వోత్పత్తి; విశ్వసృష్టి శాస్త్రం; విశ్వనిర్మాణ శాస్త్రం; ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగిందో అధ్యయనం చేసే శాస్త్రం;
 • cosmology, n. విశ్వశాస్త్రం; విశ్వోద్భవ శాస్త్రం; రోదసీ శాస్త్రం; విశ్వాంతరాళాన్ని అధ్యయనం చేసే శాస్త్రం;
 • cosmonaut, n. వ్యోమగామి; జ్యోతిర్గామి;
 • cosmopolitan, adj. సార్వజనిక;
 • cosmos, n. విశ్వం; రోదసి; deep space;
 • cost, n. ఖరీదు; ఖర్చు; ధర; మూల్యం; దారణ; ఒక వస్తువుని కొనడానికి అయే డబ్బు;
 • cost of labor, ph. చేతకూలి; మజూరీ;
 • costume, n. వేషం; ఒక కాలానికి కాని, వ్యాపారానికి కాని సంబంధించిన దుస్తులు;
 • costs, n. ఖర్చులు; తగులుబడి; తగులుబాటు;

---Usage Note: cost, price, value

 • ---Use cost to talk about how much you have to pay for something. Use price only to talk about the amount of money you have to pay to buy something. Use charge while talking about the amount of money someone makes you pay. Use value to talk about how much something is worth. Use expense while talking about large sums of money.
 • cot, n. మంచం; పర్యంకం;
  • camp -, ph. మకాం మంచం;
  • folding -, ph. మడత మంచం;
 • coterie, n. జట్టు; ముఠా; మూక; బృందం; ఒకే విధంగా ఆలోచించే సన్నిహిత బృందం;
 • cottage, n. కుటీరం; పాక; పర్ణశాల;
 • cottage industry, n. కుటీర పరిశ్రమ; గృహ పరిశ్రమ;
 • cotter pin, ph. తమిరె;
 • cotton, adj. ప్రత్తి; దూది; తూలిక;
  • - candy, ph. పీచుమిఠాయి;
  • - fiber, ph. నూలుపోగు;
  • - swab, ph. తూలినాళిక; చిన్నపుల్ల చివర దూదిని తగిలించగా వచ్చిన సాధకం; చెవులను శుభ్రపరచుకొనుటకు ఉపయోగించబడేది;
 • cotton, n. ప్రత్తి; దూది; తూలిక;
  • ginned -, ph. దూది; పిక్క తీసిన ప్రత్తి;
  • raw -, ph. ముడి ప్రత్తి;
 • cotyledon, n. నూగాకు; విత్తు మొలకెత్తేటప్పుడు మొదట వచ్చే ఆకు; (ant.) కోటాకు;
 • couch, n. శయ్య; పడక; పల్యంకం; (rel.) Sofa;
  • - potato, ph. [idiom.] శయ్యాళువు;
 • cougar, n. బూదిపులి; అమెరికా కొండలలో తిరుగాడే, బూడిద రంగు చర్మం గల ఒక రకం చిన్న పులి;
 • cough, n. దగ్గు; కాసం; కాస;
  • dry -, ph. పొడి దగ్గు; శుష్క కాస;
  • phlegmatic -, ph. తడి దగ్గు; కఫ కాస;
 • cough drop, n. దగ్గు బిళ్ల; కాస బిళ్ల;
 • council, n. సభ; సంఘం; సమితి; పరిషత్తు; మంత్రాంగ సభ;
  • privy -, ph. మంత్రి పరిషత్తు; అత్యున్నత న్యాయసభ;
  • village -, ph. పంచాయతీ;
 • counsel, n. (1) వకీలు; వకీళ్ల బృందం; (2) సలహా;
 • counselor, n. (1) సలహాదారుడు; (2) వకీలు;
 • count, n. లెక్క; లెక్కింపు; పరిగణన;
 • count, v. i. లెక్కించు; లెక్కపెట్టు; పరిగణించు;
 • countable, adj. గణనీయం; గణీయ; సంఖ్యేయ; గణ్య;
  • - infinity, ph. గణనీయ అనంతం; సంఖ్యేయ అనంతం; A set is countably infinite if its elements can be put in one-to-one correspondence with the set of natural numbers. In other words, one can count off all elements in the set in such a way that, even though the counting will take forever, you will get to any particular element in a finite amount of time;
 • countenance, n. వదనం; ముఖం; ఆననం;
 • counter, n. (1) లెక్కిణి; లెక్కపెట్టే పరికరం; (2) మెత్తపలక; సొమ్ము లెక్కపెట్టుకుందికి వాడే బల్ల; (3) పని చేసుకుందికి వీలుగా, చదునుగా ఉన్న తీనె; (4) వ్యాపార స్థలాలలో డబ్బు చెల్లించే కిటికీ;
 • counter, adj. pref. ప్రతి; ప్రతికూల; ఎదురు;
  • - argument, ph. ప్రతివాదన;
  • - clockwise, ph. ప్రతిఘడి; వామావర్త; అప్రదక్షిణ;
  • - example, ph. ప్రత్యుదాహరణ;
  • - productive, ph. ప్రతికూల ఫలసిద్ధి;
  • - suit, ph. అడ్డుదావా;
 • counterfeit, adj. నకిలీ; దొంగ నకలు; మోసపుచ్చడానికి తయరు చేసిన నకలు;
 • counterpart, n. (1) ఉల్టాభాగం; (2) ప్రత్యర్థి; (3) సహస్థానీయుడు;
 • countless, adj. అసంఖ్యాకములయిన;
 • country, adj. దేశీ; నాటు; పల్లెటూరి;
  • - bumpkin, ph. బైతు; పల్లెటూరి గబ్బిలాయి;
  • - fig, ph. అత్తి;
  • - made goods, ph. నాటు సరుకు; దేశవాళీ వస్తుసముదాయం;
  • senna, ph. తంగేడు మొక్క;
 • country, n. దేశం; పల్లెటూరు; వర్షం; సీమ;
  • developing -, ph. వర్ధమాన దేశం; ‘వెనుకబడ్డ’ అనడానికి బదులు ‘వర్ధమాన’ అంటే బాగుంటుంది;
  • foreign -, ph. విదేశం; పరదేశం; సీమ;
 • countryside, n. పల్లెపట్టు; గ్రామీణ ప్రాంతం; జనపదం;
 • coupe, n. (కూపె) కూపం; చిన్న గది, వాహనాలలో ఇద్దరు ప్రయాణీకుకి సరిపడే చిన్న గది; (rel.) bogie and compartment;
 • couple, n. (1) జంట; జోడీ; జత; యుగళం; యుగ్మము; ద్వయం; ద్వయి; దంట; (2) ఆలుమగలు; మిథునం; దంపతి; దంపతులు; (note) couple అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా తెలుగులో దానికి అనువాదమయిన దంపతులు అనే మాట బహువచనం అన్నది గమనార్హం.
 • couple, v. t. జోడించు; జతచేయు; జంటపరచు;

---Usage Note: couple, pair

 • ---Use couple to talk about any two things of the same kind: There are a couple of cars. Use pair to talk about something that has two main parts that are joined together: a pair of pants; a pair of scissors. Pair is also used to talk about things that are used together: a pair of shoes.
 • couplet, n. (1) ద్విపద; రెండు పాదాలు ఉన్న పద్యం; (2) ద్వికం;
 • coupling, n. జోడించేది; జంటపరచేది; జంటకి; ద్వికి;
 • courage, n. ధైర్యం; సాహసం; నిర్భయం; నిబ్బరం; చేవ; కలేజా; దిలాసా;
 • courier, n. m. జాంఘికుడు; వార్తాహరుడు; వార్తావాహకం;
 • course, n. (1) గతి; కదలికకి అనుకూలమైన బాట; (2) పాఠావళి; విషయం; మందలం; విద్య నేర్చుకోడానికి కావలసిన పాఠ్యాంశాల సంపుటి; (3) భోజనపు వడ్డనలో ఒక భాగం;
 • course, v. i. ప్రవహించు; ప్రయాణం చేయు;
 • court, n. (1) కచేరీ; దర్బారు; దివాణం; మొగసాల; (2) న్యాయస్థానం; ధర్మాసనం; ధర్మదర్భారు; కోర్టు; (3) ఆటస్థలం;
  • appeals -, ph. ఉత్తర దర్బారు; అప్పీలు కోర్టు;
  • high -, ph. ఉన్నత న్యాయస్థానం;
  • king's -, ph. రాజ్యసభ; రాజ్యాంగనం;
 • courtesy, n. (1) మర్యాద; (2) సౌజన్యం;
 • courtiers, n. సభాసదులు;
 • courtesan, n. m. అజ్జుకుఁడు; f. అజ్జుక;
 • courtship, n. ఉపసర్పణం;
 • courtyard, n. నాలుగిళ్ల వాకిలి; ముంగిలి; చావడి; ప్రాంగణం; మండువా; చతుశ్శాలిక; అంకణం; అంగణం; హజారం;
 • cousin, n. జ్ఞాతి; దాయ; సజన్ముడు; మాతృష్యస్రీ; పితృష్యస్రీ;
  • paternal -, ph. దాయ;
 • covalent, adj. సహసంయోజక;
  • - bond, ph. సహసంయోజక బంధం;
 • cover, n. (1) మూత; కప్పు; ఉపదేహం; (2) మూకుడు (మూయు + కుడుక); (3) కవరు;
 • covered, adj. కప్పబడ్డ; పిహిత; అవగుంఠిత;
 • covering, n. ఆచ్ఛాదనం; ఆస్తరణం; తొడుగు; గుంఠనం;
  • gold -, ph. జల పోసనము;
  • table -, ph. మేజా పోసనము;
  • wall -, ph. కుడ్య పోసనము;
  • well -, ph. వాపీ పోసనము; బావితొడుగు; బావిమూఁత; వీనాహువు;
 • covering, v. t. కప్పడం;
 • covert, adj. రహస్య; ప్రచ్ఛన్న;
 • covert war, ph. ప్రచ్ఛన్న యుద్ధం;
 • cow, n. ఆవు; గోవు; గిడ్డి; ధేనువు; మొదవు; అనడుహి;
  • black -, ph. కర్రావు;
  • brown -, ph. పుల్లావు;
  • white -, ph. వెలిమొదవు;
  • - dung, ph. ఆవుపేడ;
 • cowhitch, n. దూలగొండి; దురదగొండి;
 • cow-pen, n. పశువుల సాల; గోష్ఠము;
 • cowage, n. దూలగొండి; దురదగొండి;
 • coward, n. పిరికి పంద; పారుబోతు; భీరువు; భీరుడు; m. పిరికివాడు; f. పిరికిది;
 • cowardice, n. పిరికితనం;
 • cow-pox, n. గోస్తనవ్యాధి; గోసూచికం;
 • cowrie, n. గవ్వ; కపర్ది;
 • cows, n. pl. ఆవులు; ఆలు; గోవులు; ధేనువులు;
 • coxalgia, n. తుంటి కీలులో నొప్పి;
 • coyote, n. (ఖయోటీ లేదా ఖయోడీ) గుంటతోడేలు; ఉత్తర అమెరికాలో తిరిగే చిన్న తోడేలు వంటి జంతువు;
 • crab, n. పీత; ఎండ్రకాయ; కులీరం; కర్కటం; కర్కాటకం;
 • crack, n. (1) పగులు; బీట; నెరద; నెరియ; సరియ; ఓడు; (2) పిచ్చి మనిషి;
 • crack, v. i. పగులు; చిట్లు; బీట వేయు; నెరద; ఓడు;
 • crackling sound, ph. చిటపట; చిటచిట చప్పుడు;
 • cradle, n. తొట్టి; లాలి; జంపాల; పిల్లలని పడుకోబెట్టే ఊయల;
 • craft, n. చేతిపని; నైపుణ్యంతో చేసే పని; వృత్తి;
 • craftsman, n. చేతిపనిలో నైపుణ్యం గల వ్యక్తి;
 • craftsmanship, n. పనితనం;
 • cramps, n. pl. కండరములు బిగుసుకొని కొంకర్లు పోవడం;
 • crane, n. (1) కొంగ; బకం; కొక్కెర; కొక్కిరాయి; (rel.) heron; stork; (2) బరువులనెత్తు యంత్రం;
 • crank, n. (1) ముసలకం యొక్క ముందు, వెనక కదలికని చక్రాలని గిర్రున తిప్పడానికి వీలు చేసే పరికరం; (2) తిక్కశంకరయ్య;
 • cranky, adj. సులభంగా చిరాకు పడే స్థితి;
 • cranium, n. కపాలం; పుర్రె;
 • crap, n. చెత్త; వ్యర్థం; బాగులేని పనితనం;
  • that movie is a -, ph. ఆ సినిమా చెత్తగా ఉంది;
 • crash, n. టోత్కారం; కూలుడు;
 • crate, n, పెట్టె; కట్టె పెట్టె; సరకుల రవాణా కొరకు కర్రతో కాని, అట్టతో కాని, ప్లేస్టిక్‍తో కాని చేసిన పెట్టె;
 • crawl, v.i. (1) ప్రాకు; పాకాడు; దోగాడు; జరుగు; (2) పాకురు; నేలకి మోకాళ్ళని, చేతులని ఆనించి నాలుగు కాళ్ళ మీద నడిచినట్లు ముందుకు కదలడం; (3) అతి నెమ్మదిగా కదులు;
 • crayons, n. pl. మైనపు బలపాలు; బొమ్మలకి రంగులు వెయ్యడానికి వాడే సుద్ధ బలపాలు;
 • craze, n. వేలంవెర్రి; కొత్త వస్తువుల మీద అలవాట్లమీద విపరీతమైన మోజు;
 • crazy, n. వెర్రి అభిమానం;
 • craziness, n. ఉన్మత్తత; పిచ్చి; వెర్రి;
 • creak, v. i. కిర్రుమను; కిర్రుమని చప్పుడు చేయు;
 • cream, n. (1) మీగడ; మస్తు; కోవా; (2) బాగా చిక్కబరచబడ్డ పాలు; (3) నూక; రవ్వ; (4) సారం; సారాంశం;
 • cream, v. t. చితక్కొట్టు; బాధు;
 • cream of wheat, ph. గోధుమ నూక; గోధుమ రవ్వ;
 • crease, n. (1) మడత; బట్టలో మడత; (2) ముడత; చర్మంలో మడత;
 • creation, n. సృష్టి; సృజనం; నిర్మాణం; ఏర్పాటు; అభిసర్గం;
  • - theory of life, ph. జీవసృష్టి వాదం;
 • creative, adj. సృజనాత్మక;
 • creativity, n. సృజనాత్మకత; స్రష్టత్వం; సర్జనశక్తి; కల్పనాశక్తి;
 • creator, n. సృష్టికర్త; స్రష్ట; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త;
 • creature, n. జన్మి; ప్రాణి; జీవి;
 • credence, n. నమ్మిక; విశ్వాసం;
 • credible, adj, నమ్మదగ్గ; విశ్వసనీయ;
 • credibility, n. విశ్వసనీయత; అర్థగౌరవం;
 • credit, n. (1) పరపతి; ప్రతిష్ఠ; (2) అరువు; అప్పు; ఉత్తమర్ణం;(3) జమ; (4) నమ్మకం;
  • - transaction, ph. అరువు బేరం;
 • credit, v. t. జమకట్టు;
 • creditor, n. అప్పిచ్చువాడు; అప్పులవాడు; రుణదాత; జమాజవాను; ఉత్తమర్ణుడు; (ety.) ఉత్తమర్ణ = ఉత్తమ+ఋణ(గుణసంధి);
 • credits and debits, n. జమాఖర్చులు;
 • creditworthy, adj. పరపతి;
 • creditworthiness, n. నమ్మదగిన; పరపతి ఉన్న;
 • creed, n. నమ్మకాలు; నమ్మకం;
 • creep, v. i. డేకురు; నేలకి కడుపుని కాని, ముడ్డిని కాని ఆనించి ముందుకు జారడం;
 • creeper, n. లత; పాదు; తీగ; అలము; వల్లి;
 • cremation, n. దహనం; దహన సంస్కారం;
  • - grounds, ph. శ్మశానం; శ్మశాన వాటిక; దహనవాటిక; పురాంతక భూములు; రుద్ర భూములు;
 • crepe, n. (1) పల్చటి అట్టు; ఫ్రాన్స్ దేశపు అట్టు; కాగితం దోసె; (2) ఒక రకమైన పల్చటి గుడ్డ;
 • crescendo, n. పరాకాష్ఠ; ఉత్కర్ష;
 • crescent moon, n. నెలవంక; చంద్రవంక; చంద్రరేఖ;
 • crest, n. శిఖ; తలాటం; ఉత్తంసం;
 • crest and trough, ph. శిఖ, గర్త;
 • crestfallen, adj. విషాధపూరిత; ఉత్సాహరహిత;
 • crew, n. సిబ్బంది; సరంగులు; కర్మచారులు;
 • crib, n. పసిపిల్లలు పడుక్కోడానికి కటకటాలు ఉన్న తొట్టి మంచం;
 • cricket, n. (1) కీచురాయి; చీరండ; ఇలకోడి; శలభం; కుమ్మరిపురుగు; (2) క్రికెట్ అనే ఒక ఆట;
 • crime, n. అపరాధం; బృహన్నేరం; నేరం; కంటకం; ఏనస్సు;
 • criminal, n. నేరస్థుడు;
 • criminal, adj. అపరాధ; హింశోధ్భవ; క్రిమినలు;
 • criminal code, ph. దండవిధి; దండన వ్యవహార సంహితం; శిక్షా స్మృతి;
 • criminal procedure code, ph. దండవిధి; దండన వ్యవహార సంహితం; శిక్షా స్మృతి;
 • criminology, n. నేరవిచారణ శాస్త్రం;
 • crimson, n. రక్తిమ; అరుణిమ; అరుణ వర్ణం; ఎరుపు; ఎరట్రి రక్తపు రంగు; కెంపు రంగు;
 • cripple, n. అవిటి వ్యక్తి;
 • crippled, adj. అవిటి;
 • crisp, adj. (1) కరకరలాడే; సరికొత్త; (2) బిగువైన;
 • crisp style, ph. బిగువైన శైలి; చురుకైన శైలి;
 • crisis, n. విషమ పరిస్థితి; చిక్కు; సంక్షోభం;
 • criterion, n. ప్రమాణం; కొలబద్ధ; గీటురాయి;
  • literary -, ph. సాహిత్య విమర్శ; ఒక గ్రంథంలోని లోపాలోపాలను, ఔచిత్య, అనౌచిత్యాలను, భావ గంభీరతను అలంకార రచనా పాటవాన్ని, ధ్వని విశేషాల్ని, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తు నిర్మాణ సౌష్టవాన్ని, పాత్ర పోషణ, రస పోషణ, సన్నివేశ కల్పనలను, ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి సాహిత్యంలో ఆ గ్రంథానికి ఉన్న స్థానాన్ని నిర్ణయించడాన్ని సాహిత్య విమర్శగా పేర్కొనవచ్చు;
 • critic, n. (క్రిటిక్) విమర్శకుడు; విమర్శకురాలు; బెన్‌జాన్సన్.. ‘విమర్శకుడు దోషాల్ని చెప్పడమే కాకుండా, దోష రహితంగా ఎలా ఉండాలో’ చెప్పాలన్నారు.
 • critical, adj. కీలక;
 • critical, n. కీలకం;
 • criticism, n. (1) విమర్శ; (2) ఆక్షేపణ; హడ్సన్ విమర్శ విధులను వివరిస్తూ...'Criticism may be regarded as having two different functions that of interpretation and that of Judgement' అని అన్నారు.
 • criticize, v. t. (1) విమర్శించు; (2) ఆక్షేపించు;
 • critique, n. (క్రిటీక్) విమర్శ; వివేచన; 'మృశ్’ అనే ధాతువుకు ‘వి’ అనే ఉపసర్గ చేరి ‘విమర్శ’ అనే పదం ఏర్పడింది. విమర్శ అనే పదానికి పరిశీలించడం, పరీక్షించడం, పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే అర్థాలున్నాయి. ఒకరు చేసిన పనిలో బాగోగులను ఇంకొకరు వివేచించి తెలపడాన్ని ‘విమర్శ’ అంటారు;
 • critter, n. జంతువు; పురుగు; పురుగు, పుట్ర;
 • Cro Magnon, n. (క్రో మేన్యన్) ఐరోపా‌లో నియాన్‌డ్రథాల్ తర్వాత ప్రభవించిన ఒక జాతి మానవుల వంటి తెగ; ఈ జాతి ఇప్పుడు నశించిపోయింది;
 • croaking of frogs, ph. కప్ప అరుపు; బెకబెక మను; టర్టరాయణం;
 • crocodile, n. మొసలి; మకరం; నక్రం; కుంభీరం;
 • crocodile tears, ph. మొసలి కన్నీరు; మకరాశ్రువులు; [idiom.] కడుపులో దుఃఖం లేకపోయినా కళ్ళ వెంబడి వచ్చే నీళ్ళు;
 • crook, n. కుటిలుడు;
 • crooked, adj. కుటిల; వంకర టింకర; అడ్డదిడ్డం; అష్టావక్ర;
 • crooked, n. (క్రుకెడ్) అష్టావక్రం;
 • crop, n. (1) పంట; ఫలసాయం; సస్యం; (2) కత్తిరించి తీర్చి దిద్దడం;
  • cash -, ph. వర్తకపు పంట;
  • first -, ph. సారువా పంట;
  • second -, ph. దాళవా పంట;
  • summer -, ph. పునాస పంట;
  • third -, ph. పునాస పంట;
 • crop pest, n. పంట తెగులు; తెగులు;
 • Cross, n. శిలువ; క్రైస్తవ మతానికి గుర్తు;
 • cross, adj. (1) పర; (2) వజ్ర; అడ్డ;
  • - multiplication, ph. వజ్ర గుణకారం; అడ్డ గుణకారం; ఒక భిన్న సమీకరణంలో ఒక పక్కనున్న లవాన్ని రెండవ పక్క ఉన్న హారంతో గుణించడం;
  • - pollination, ph. పర పరాగ సంపర్కం;
  • - ratio, ph. వజ్ర నిష్పత్తి;
  • - section, ph. అవచ్ఛేదం; అడ్డుకోత;
 • cross, v. t. (1) పరాగ సంపర్కం చేయు; రెండు మొక్కల జన్యుపదార్థాలని కలపడం; (2) పొర్లించు; రెండు జంతువుల జన్యుపదార్థాలని కలపడం;
 • crossing, n. (1) దాటడం; (2) తరణం; (3) సంధి స్థలం;
  • - out, ph. కొట్టివేత;
 • crossover, v. t. దాటు; తరించు;
 • crossroads, n. నాలుగు రోడ్ల కూడలి; చౌరస్తా; శృంగాటకం;
 • crossword, n. పదవిన్యాసం; గళ్లనుడికట్టు; పదకేళి; పలుకుల పందిరి; జల్లికట్టు;
 • crotch, n. కచ్చ; కిస్తా; తొడలు, కటి ప్రదేశం కలిసే స్థానం;
 • croton, n. భూతాంకుశం; క్రోటను;
 • crow, n. కాకి; కాకం; భస్మచ్ఛవి కాకం; వాయసం; కరటకం; ఐంద్రి; బలిభుక్కు; బలిపుష్ఠం; అరిష్టం; కారవం; పికవర్ధనం; ధ్వాంసవర్ధనం; శీతర్తుబలీయం; చిరప్రాణం; పరభ్రుత్‍; ఆత్మఘోషం; ఏకాక్షి; సకృత్‍ప్రజా; (rel.) raven;
 • crow pheasant, n. జెముడుకాకి;
 • crowbar, n. గునపం; గడ్డపార; పలుగు;
 • crowd, v. i. ముసురు; మూగు; గుమిగూడు;
 • crowd, n. గుంపు; మూక; జనసమ్మర్దం; గుమి; సంకులం;
 • crowded, adj. సంకులమైన;
 • crown, n. శిఖ; కిరీటం; కోటీరం; మకుటం; బొమిడికం;
 • crucial, n. కీలకం;
 • crucible, n. మూస; ద్రోణి; దొన్నె; పుటం; ప్రమిద; దొప్ప;
  • - tongs, ph. పటకారు;
 • crucifix, n. కొరత; శిలువ;
 • crucify, v. t. (1) కొరత వేయు; (2) [idiom] గట్టిగా చివాట్లు పెట్టు;
 • crude, adj. ముతక; ముడి; ఆమమైన; నాటు; కచ్చా; మోటు; చిత్తు;
  • - oil, ph. ముతక నూనె; ముడి నూనె; మట్టినూనె; శిలతైలం; ఆమనూనె;
 • cruel, adj. క్రూరమైన; దారుణమైన;
  • - murder, ph. దారుణమైన కూనీ; చిత్రవధ;
  • - violence, ph. చిత్రహింస;
 • cruelty, n. క్రూరత్వం; దౌష్ట్యం; దుష్టత్వం;
 • cruise, n. (క్రూజ్) నౌకాయానం; షికారా; పడవ ప్రయాణం;
 • crumb, n. (1) చిన్న ముక్క; తిండి పదార్థాలని చిదిపినప్పుడు రాలే ముక్క; (2) [idiom] పిసరు;
 • crusade, n. ఉద్యమం;
 • crush, v. t. (1) పిండు; నలుపు; (2) అణగదొక్కు; చిత్తుచేయు;
 • crush, n. పిండగా వచ్చిన రసం;
 • crusher, n. పేషకి; పేషకం; పేషణ యంత్రం;
 • crust, n. పటలం; పెచ్చు; ఉల్లె; అప్పం;
 • crutch, n. (1) ఊతకోల; ఆనుకర్ర; (2) ఊత; ఆను;
 • crux, n. కీలకం; ఆయువుపట్టు; మర్మం;
 • Crux Australis, n. త్రిశంకుడు; దక్షిణార్ధగోళంలోని ఆకాశంలో, శిలువ ఆకారంలో, స్పుటంగా కనిపించే నక్షత్ర మండలం;
 • cry, n. ఏడ్పు; రోదన; అరుపు; బొబ్బ; కూత;
 • cry, v. i. ఏడ్చు; రోదించు; అరచు; వాపోవు; అలమటించు;
 • cryptic, adj. అంతర్నిహితమైన; నర్మగర్భమైన;
 • cryptogram, n. అంతర్లాపి; నర్మగర్భలేఖ;
 • cryptography, n. ఆరండకము; నర్మగర్భలేఖనం; గూఢలేఖనశాస్త్రం;
 • crystal, n. స్ఫటికం; పలుగు;
 • crystalline, adj. స్ఫటికపు; స్ఫటికముతో చేయబడిన; స్ఫటికాకారముతో;
 • crystallization, n. స్ఫటికీకరణం;
 • crystallography, n.స్ఫటికలేఖనం;
 • crystalloid, n. స్ఫటికార్థం; (ety.) స్ఫటికం వంటి పదార్థం;
 • crystals, n. స్ఫటికములు; స్ఫటికాదులు;
 • cube, n. (1) ఘనం; ఘనచతురస్రం; (2) ముక్క;
 • cube-root, n. ఘనమూలం;
 • cubebs, n. pl. చలవ మిరియాలు; తోక మిరియాలు;
 • cubit, n. మూర; మూరెడు;
 • cuckoo, n. కోకిల; కోయిల;
 • cucumber, n. దోసకాయ; కీరా;
 • cudgel, n. దుడ్డు; దుడ్డు కర్ర; లక్కక;
 • cuff links, n. బేడీ బొత్తాలు; అరదండాలు;
 • cuffs, n. (1) బేడీలు; అరదండాలు; నిగడాలు; (2) పొడుగు చేతుల చొక్కాలకి పెట్టుకునే ఒక రకం బొత్తాములు;
 • cuisine, n. (క్విజీన్) వంట; వండే పద్ధతి; కుశిని;
 • cul-de-sac, n, (1) ఒక పక్కనే తెరచి ఉన్న సంచి వంటి శరీర కట్టడం; (2) సంచీ సందు; ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న వీధి;
 • culinary, adj. పాకశాస్త్ర;
 • culpable, adj. నింద్యమయిన; దోషయుక్త;
  • - homicide, ph. నిందార్హమైన నరవధ; దోషయుక్తమయిన హత్య;
  • - negligence, ph. దోషయుక్తమైన ఉపేక్ష;
 • culprit, n. నేరస్థుడు; అపరాధి; నేరము చేసిన వ్యక్తి;
 • cultivable, adj. సేద్యయోగ్య;
 • cultivar, n. సాగురకం; (ety.) cultivated + variety;
 • cultivation, n. సాగు; సేద్యం; జిరాయితీ;
  • contour -, ph. ఈనెగట్టు సేద్యం;
  • wet -, ph. దంపసాగు; దంపసేద్యం;
 • cultivator, n. రైతు;
 • culture, n. (1) సంస్కృతి; (2) తోడు; పాలని తోడు పెట్టడానికి వేసే మజ్జిగ; (3) సూక్ష్మజీవులని ప్రయోగశాలలో పెంచే పద్ధతికి అనుకూలపడే మధ్యమం; (4) పెంపకం; (5) వ్యవసాయం;
 • culture, suff. సాయం; పెంపకం;
  • agriculture, వ్యవసాయం;
  • arboriculture, చెట్ల పెంపకం;
  • monoculture, ఏకసాయం; ఒకే రకం పంటని పదేపదే పండించడం;
  • pisciculture, చేపల పెంపకం;
  • polyculture, బహుసాయం; ఒకే పొలంలో ఒకదాని తర్వాత మరొకటి చొప్పున, పంటలని మార్చి పండించడం;
  • viticulture, ద్రాక్ష పెంపకం;
 • culvert, n. తూము; మదుం; కలుజు; కానాగట్టు, kAnAgaTTu
 • cumbersome, n. యాతన; భారం; ప్రతిబంధకం;
 • cumin seed, n. జీలకర్ర;
 • cummerbund, n. కటివం; దట్టి; కమ్మరబొందు;
 • cumulative, adj. సంచాయిత;
 • cuneiform writing, ph. శరాకార లిపి;
 • cunning, n. కపటత; టక్కు;
 • cunnilingus, n. యోని ద్వారాన్ని నోటితో ఉత్తేజ పరచడం;
 • cup, n. దొన్నె; పిడత; చషకం; చమసం; చిట్టి; చిప్ప; మరిగ; కప్పు;
  • - made of stone, ph. రాతిచిప్ప; రాచ్చిప్ప; మరిగ;
 • cupboard, n. అలమారు; చిట్టటక; కప్పులు పెట్టుకొనే బీరువా;
 • cupful, n. చిట్టెడు; కప్పుడు; కప్పు;
 • curator, n. భాండాగారి;
 • curb, kerb (Br.), n. చపటా, వీధి చపటా,
 • curd, n. (1) పెరుగు; దధి; కలుఁపు; ఆమిక్ష; (2) కోలకం; గడ్డగా గట్టిగా ఉండేది;
 • curdle, n. గర; గడ్డ; విరుగుడు;
 • curdle, v. t. గరకట్టు; విరుగు; గడ్డకట్టు; పేరుకొను;
 • cure, n. (1) వైద్యం; మందు; నివారణ; (2) స్వస్థత;
  • nature -, ph. ప్రకృతి వైద్యం;
 • cure, v.t. (1) నయము చేయు; కుదుర్చు; మానిపించు; స్వస్థపరచు; (2) నిల్వ చేయు;
 • cured, adj. (1) నిల్వ చేసిన; (2) రోగం నయం చేయబడ్డ;
  • - meat, ph. నిల్వ చేసిన మాంసం;
 • curiosity, n. ఉత్సుకత; ఆసక్తి; బుభుత్స; వ్యాసక్తత;
 • curlew, n. క్రౌంచపక్షి; కంకపక్షి;
 • curls, n. కురులు; ఉంగరాల జుత్తు; నొక్కుల జుత్తు; వక్ర కేశములు; కుటిల కుంతలములు;
 • curly, adj. కుటిల; ఉంగరాల;
  • - hair, ph. కుటిల కుంతలాలు; ఉంగరాల జుత్తు;
 • currency, adj. వాడుకలోనున్న; చెల్లుబడి అయే; చలామణిలో ఉన్న;
 • currency, n. వాడుకలోనున్న డబ్బు; చెల్లుబడి అయే డబ్బు;
 • current, adj. ప్రస్తుత; వర్తమాన; సమకాలీన; చాలూ; అర్జు;
 • current account, ph. చాలూ కాతా; అర్జు కాతా;
 • current phase, ph. వర్తమాన దశ;
 • current, n. (1) ప్రవాహం; విద్యుత్ ప్రవాహం; ఆపూరం; విద్యుత్తు; కరెంటు; (2) సమకాలీనం; ప్రస్తుతం;
  • alternating -, ph. ప్రత్యావర్తక ప్రవాహం;
  • direct -, ph. అజస్ర ప్రవాహం; అభిద్య ప్రవాహం;
  • electric -, ph. విద్యుత్ ప్రవాహం;
  • induced -, ph. ప్రేరిత ప్రవాహం;
 • curriculum vitae, n. జీవిత సంగ్రహం; (lit.) the course of one's life;
 • curry, n. (1) కూర; వండిన కూర; (2) కూరలో వేసే మసాలా;
  • - favor, ph. కాకా పట్టు;
  • - powder, ph. కూరలో వేసే మసాలా పొడి;
 • curry-leaf, n. కరివేపాకు;
 • cursive, adj. జిలుగు; గొలుసుకట్టు;
  • - writing, ph. జిలుగు రాత; గొలుసుకట్టు రాత;
 • cursor, n. [comp.] తెరసూచి; సారకం; తెర మీద బొమ్మలని చూపించే గుర్తు; An on-screen blinking character that shows where the next character will appear;
 • cursory, adj. పైపైన; నామకః;
 • curtain, n. తెర; యవనిక; కనాతి; కండవడము; (rel.) screen;
 • curvature, n. వట్రువు; వంపు; వంకర; వంకీ; వంకరతనం;
 • curve, n. వంపుగీత; వక్రరేఖ;
 • curved, adj. వట్ర; వక్ర; వరాళ;
  • - surface, ph. వట్రతలం; వక్రతలం;
 • cushion, n. తలాపి; దిండు; కశిపు; మెత్త; గాది; ఉపధానం;
 • cuss-cuss, n. వట్టివేరు; కురువేరు; అవురుగంట వేరు; ఉసీరం; లఘులయము; అవదాహం; [bot.] straw of Andropogon muriaticum;
 • custard, n. గుడ్లు, పాలు, చక్కెర, కలిపి చేసే మెత్తటి, జున్ను వంటి వంటకం;
 • custard apple, n. సీతాఫలం; cherimoya;
 • custody, n. (1) స్వాధీనత; స్వాధీనం; (2) నిర్బంధం;
 • custom, n. ఆచారం; అలవాటు; వాడుక; రివాజు; సంప్రదాయం; ఆనవాయితీ; మామూలు; వ్యవహారం;
  • ancient -, ph. వృద్ధాచారం; పాత అలవాటు;
  • daily -, ph. నిత్యవ్యవహారం;
 • customary, adj. మామూలు; రివాజు; వ్యావహారికం; యౌగికం;
 • customer, n. ఖాతాదారు; రివాజురాజు; వినియోగదారు; ఒక దుకాణంలో సరుకులు కొనే వ్యక్తి కాని, సేవలు అందుకొనే వ్యక్తి కాని;

---Usage Note: customer, client

 • ---When you go out to buy things, you are a shopper. When you go out to buy things from a particular store, then you are that store's customer. If you are paying someone such as lawyer for professional services, then you are a client. If you are seeing a doctor, you are a patient. If you are staying at a hotel, you are a guest.
 • customs, n. (1) ఆచారాలు; (2) దిగుమతి సుంకములు;
 • cut, n. (1) కత్తిరింపు; కోత; గాటు; గంటు; కచ్చు; పరిఖ; (2) దెబ్బ; గాయం;
 • cut, v. i. తెగు;
 • cut, v. t. కత్తిరించు, kattiriMcu; ఉత్తరించు, uttariMcu; కోయు; నరుకు; తరుగు; తెంచు; కొట్టు; ఛేధించు;
  • - the cloth, ph. గుడ్డని కత్తిరించు;
  • - the tree, ph. చెట్టుని కొట్టు;
  • - the vegetable, ph. కూరగాయలని తరుగు;
 • cutting, n. (1) కత్తిరింపు; ఖండం; (2) కత్తిరించిన ముక్క; ఖండిక;
 • cyan, n. పాలపిట్ట రంగు;
 • cyanosis, n. శరీరం నీలివర్ణం పొందడం; (ety.) సయనైడు వల్ల మరణించిన వారి శరీరం ఇలా నీలంగా మారుతుంది కనుక ఈ పేరు వచ్చింది;
 • cyberspace, n. జాలావరణం; అంతర్జాలావరణం; (note) cyberspace is a poorly coined word; it is better to use Internet space, instead;
 • cycle, n. (1) చక్రం; ఆవృత్తం; ఆవర్తం; (2) సైకిలు; తొక్కుడుబండి; రెండు చక్రాల వాహనం;
  • hydrological -, ph. జల చక్రం;
  • seasonal -, ph. రుతు చక్రం; ఋతు చక్రం;
 • cycle of time, ph. కాలచక్రం;
 • cyclic, adj. చక్రీయ; వృత్తస్థిత;
  • - substances, ph. చక్రీయ పదార్థాలు;
  • - symmetry, ph. చక్రీయ సౌష్ఠవం; చక్రీయ సౌష్ఠత, cakrIya saushThata;
 • cyclo, pref. చక్రీయ;
 • cyclohexane, n. [chem.] చక్రీయ షడ్జేను, cakrIya shadjEnu
 • cyclone, n. తుఫాను; గాలివాన; దూదర; (rel: tornado =చక్రవాతం; storm = గాలివాన)
  • tropical -, ph. ఉష్ణమండలంలో వచ్చే తుఫాను;
 • cyclopropane, n. [chem.] చక్రీయత్రయేను; చక్రీయప్రోపేను;
 • cylinder, n. (1) స్థూపకం; వర్తులస్తంభం; (2) సిలిండరు;
 • cylindrical, adj. స్థూపాకార; స్తంభాకార;
 • cymbal, n. కాంస్యతలం;
 • cyst, n. తిత్తి; కోష్ఠము;
 • cytology, n. కణ శాస్త్రం;
 • cytoplasm, n. కణసారం; జీవరసం; కణద్రవం; కోశరసం; ప్రోటోప్లాసమ్‌లో కణికని మినహాయించగా మిగిలినది;
 • czar, n. (1) పూర్వపు రష్యా దేశపు చక్రవర్తి; ; (2) ప్రభుత్వంలో సర్వాధికారాలు గల వ్యక్తి;

మూలం

వర్గం