"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (H)

From tewiki
Jump to navigation Jump to search

marqimal

నిఘంటువు

  • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
  • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
  • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: H

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • habeas corpus, n. నిందితుని న్యాయస్థానానికి తీసుకు రమ్మన్న ఆనతి;
  • habit, n. అలవాటు; ఆచారం; అభ్యాసం;
    • bad -, ph. దురలవాటు; దురాచారం; వ్యసనం; దురభ్యాసం;
    • good -, ph. సదాచారం; మంచి అలవాటు;

---Usage Note: habit, custom, tradition

  • ---A habit is something that someone does often, usually without even thinking about it: Smoking is a bad habit. A custom is a way of doing something that people in a particular society think it is normal, and that everyone does. The custom here is to shake hands when we meet. A tradition is a belief or a way of doing something that a particular group or society has followed for a very long time.
  • habitable, adj. వాసయోగ్యమైన;
  • habitat, n. ఉనికిపట్టు; సహజావరణం; ఆవాసం; అవసదము; జంతువులు, మొక్కలు సహజంగా పెరిగే ఆవరణం;
  • habitation, n. అవసదము; నివాస స్థలం; ఇల్లు;
  • habitual, adj.అలవాటు పడ్డ; వాడుక అయిన; మామూలు అయిన;
  • habitual offender, ph. అపరాధానికి అలవాటు పడ్డ వ్యక్తి; కేడీ;
  • hackneyed, adj. (1) సర్వసాధారణమైన; పాతబడిపోయిన; నవ్యత లేని; (2) అలవాటుపడ్డ; మరిగిన;
  • hadrons, n. [phy.] మోటురేణువులు; రేణు భౌతిక శాస్త్రంలో తారసపడే ఒక రకం మోటు రేణువులు; రెండు కాని, అంతకంటె ఎక్కువ కాని క్వార్కులని త్రాణిక బలంతో బంధించినప్పుడు మోటురేణువులు పుడతాయి (బణువులలోని అణువులు విద్యుదయస్కాంత బలంతో బంధించబడినట్లు ఉపమానం చెప్పుకోవచ్చు);
  • haft, n. పిడి;
  • hail, n.s. వడగళ్లు; (ety.) వడ = heat, కల్లు = stone;
  • hail storm, ph. వడగళ్ల వాన;
  • hair, n. జుత్తు; కేశములు; కురులు; రోమాలు; వెంట్రుకలు; చూడ; తల;
    • - of the head, ph. తలనీలాలు;
    • - oil, ph. తలనూనె; కేశ తైలం;
    • - ornament, ph. చూడామణి;
    • blonde -, ph. జొన్న జుత్తు;
    • comb the -, ph. తల దువ్వుకొను;
    • curly -, ph. ఉంగరాల జుత్తు; నొక్కుల జుత్తు;
    • dressing of the -, ph. కేశకర్మ;
    • gray -, ph. పండు జుత్తు; నెరిసిన జుత్తు;
    • part in the -, ph. పాపిడి; కేశవీధి;
    • plaited -, ph. జడ; కేశపాశం; అల్లిన జుత్తు;
    • - dresser, కేశకర్త; తల వెంట్రుకలని కత్తిరించి అందంగా అమర్చే వ్యక్తి;
    • - pin, n. జడపిన్ను; జడచీల;
  • haircut, n. క్షవరం; ఆయుష్కర్మం; తల వెంట్రుకలని కత్తిరించడం;
  • hairs, n. జుత్తు; వెంట్రుకలు; రోమాలు;
  • half, adj. అర్ధ; అర; కపల;
  • half, n. సగం; సంగోరు; అర్ధం;
    • better -, ph. భార్యాభర్తలలో ఒకరు;
    • former -, ph. పూర్వార్ధం;
    • later -, ph. ఉత్తరార్ధం;
  • half-baked, adj, [idiom] మిడిమిడి;
    • - knowledge, ph. మిడిమిడి జ్ఞానం;
  • half-hearted, adj. అర్ధాంగీకారంతో;
  • half-life, n. అర్ధాయువు; అర్ధాయుశ్శేషం; రేడియో ధార్మికత్వం ఉన్న మూలకాల విచ్ఛిత్తిని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానం;
  • half-mast, adj. అవనతం చేయబడ్డ; అవాగ్రం చేయబడ్డ;
  • half-month, n. పక్షం;
    • waning part of lunar-, ph. కృష్ణపక్షం;
    • waxing part of lunar-, ph. శుక్లపక్షం;
  • half-opened, adj. అరవిరి;
  • half-share, n. సంగోరు; అర్ధవాటా;
  • half-way, n. మధ్యేమార్గం; మధ్యస్థం;
    • - house, ph. ఖైదు నుండి విడుదలయి బయటకి వచ్చిన వ్యక్తి సంఘ జీవితానికి అలవాటు పడే వరకు పోలీసుల పర్యవేక్షణలో నివసించే ఇల్లు;
  • half-year, n. అర్ధసంవత్సరం; ఆయనం;
  • half-yearly, adj. షాణ్మాసిక; అర్ధసంవత్సరానికొకసారి;
  • halitosis, n. నోటి కంపు; శ్వాస దుర్వాసన;
  • hall, n. మందిరం; పడసాల; చావడి; హాలు; వసారా;
    • concert -, ph. గానమందిరం;
  • hallmark, n. ముఖ్యలక్షణం;
  • hallucination, n, భ్రమ; భ్రాంతి; మానసిక భ్రాంతి; దృక్‌భ్రమ;
  • halo, n. కాంతివలయం; ఉపసూర్యకం; కాంతి కిరీటం; గాలిగుడి;
  • halophyte, n. చవిటి నేలలలో పెరిగే మొక్క; ఉప్పు నీటిలో సాగు చెయ్యడానికి అనుకూలమైన మొక్క;
  • halogen, n. లవజని; లవణములను పుట్టించేది; ఉదా. F, Cl, Br, I;
  • halt, n. మజిలీ; మకాం; బస; బండి నిలిచే స్థలం; (rel.) stop;
  • halt, v. i., v. t. తాళు; నిలు; నిలువరించు; కొద్దిసేపు నిలుపు; (rel.) stop;
  • halter, n. పొట్టి రవిక; మగవారిని నిలువరించగలిగే రవిక;
  • halva, n. హల్వా; కేసరీ బాత్; గోధుమ రవ్వతో చేసిన ఒక తీపి వంటకం;
  • halve, v. t. సగానికి తగ్గించు;
  • ham, n. పంది పిఱుఁదుల దగ్గర, వెనక కాళ్ల దగ్గఱ నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి తయారు చేసిన పదార్థాన్ని "హ్యామ్" (ham) అంటారు; (rel.) "బేఖన్" అనేది పంది కడుపు దగ్గఱ నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి, పొగపెట్టి తయారు చేసిన పదార్థం; సహజంగా లభ్యం అయే పంది మాంసాన్ని "పోర్క్" అంటారు;
  • hamlet, n. గూడెం; పల్లి; పల్లెటూరు; కుగ్రామం; కుప్పం; కండ్రిగ;
  • hammer, n. సుత్తి;
    • blacksmith's -, ph. కమ్మరి సుత్తి;
    • claw -, ph. పటకా సుత్తి;
  • hammer, v. t. బాదు; సుత్తితో కొట్టు;
  • hammock, n. ఉల్లడ; రెండు రాటల మధ్య వేల్లాడగట్టిన ఊయల;
  • hamper, v. t. అడ్డుతగులు; ఆటంకపరచు;
  • hamper, n. మాసిన బట్టలబుట్ట;
  • hand, n. (1) చేయి; చెయ్యి; కరం; పాణి; హస్తం; కేలు; కై; మనికట్టు కింద భాగం; మనికట్టుకి మోచేయికి మధ్యనుండేది మీజెయ్యి; (2) గడియారం ముల్లు;
    • back of the -, ph. మండ; మీదుచెయ్యి; పెడచెయ్యి;
    • helping -, ph. చేదోడు;
    • hour -, ph. చిన్న ముల్లు; గడియారంలో గంటలు చూపే చిన్న ముల్లు;
    • left -, ph. ఎడమ చెయ్యి; పుర్ర చెయ్యి; వామహస్తం;
    • minute -, ph. పెద్ద ముల్లు; గడియారంలో నిమిషాలు చూపే పెద్ద ముల్లు;
    • right -, ph. కుడి చెయ్యి; దక్షిణ హస్తం;
    • second -, ph. పరుగు ముల్లు; గడియారంలో సెకండ్లను చూపే ఎర్ర ముల్లు;
    • sleight of -, ph. చేవడి; హస్తవేగం; హస్తలాఘవం; చేవాటితనం;
    • top of the -, ph. అరచెయ్యి; లోజేయి; కరతలం;
  • handbag, n. కరతిత్తి; చేతిసంచి; హస్తసేవకం;
  • handbook, n. కైపొత్తం; చేతి పుస్తకం;
  • handcuffs, n. బేడీలు; అరదండాలు;
  • handedness, n. చేతివాటం; కరత్వం;
    • left -, ph. పుర్ర చేతివాటం; ఎడమ చేతివాటం; వామకరత్వం;
    • right -, ph. కుడి చేతివాటం; దక్షిణకరత్వం;
  • handful, n. (1) చేరెడు; పిడికెడు; పట్టెడు; (2) చేతినిండా;
    • - of rice, ph. చేరెడు బియ్యం;
    • - of work, ph. చేతినిండా పని;
  • handicap, n. (1) అడ్డంకి; (2) అంగవైకల్యం;
  • handicrafts, n. హస్తకళలు; చేతితో చేసిన వస్తువులు;
  • handkerchief, n.రుమాలు; చేతిరుమాలు;
  • handle, n. పిడి; గురుజు; కొమ్ము; చేపట్టు; హస్తకం: దండం; తండూకం; మేడి; హలాంగం;
  • handle, v. t. చేపట్టు; కైకొను;
  • handlebar, n. పిడిదండం; హస్తమాను; కొమ్ముల కడ్డీ;
  • handloom, n. చేమగ్గం;
  • handmade, adj. ఖాదీ;
  • handout, n. (1) కరపత్రం; ప్రకటన; (2) బిచ్చం;
  • handover, v. t. కైవశం చేయు; అప్పగించు;
  • hands, n. pl. చేతులు; హస్తములు; కరములు;
  • handshake, n. కరచాలనం;
  • handsome man, n. రూపవంతుడు; రూపసి; స్పురద్రూపి;
  • handspun, adj. ఖద్దరు; ఖాదీ;
  • handspun, n. ఖద్దరు; ఖాదీ;
  • handshake, n. కరచాలనం;
  • handsome, adj. అందం;
    • - person, ph. అందగాడు; స్పురద్రూపి; రూపసి;
  • handwriting, n. దస్తూరి; చేవ్రాలు;
  • handy, adj. అందుమాటులోనున్న;
  • hang, v. i. వేలాడు; v.t. వేలాడదీయు; ఉరితీయు;
  • hangar, n. (1) విమానశాల; (2) ఒంకీ; దండెం; చిలక్కొయ్య; (3) మలారం;
    • bangle -, ph. గాజుల మలారం;
    • clothes -, ph. దండెం; బట్టల మలారం;
  • hanging, n. ఉరితీయుట;
  • hanging, adj. వేలాడే;
    • - ear-ring, ph. లోలకు; (ety.) లోల + ఆకు = oscillating leaf;
  • hangman, n. వధకుడు;
  • haphazard, adj. అకటావికట; చెల్లాచెదురు; అరకొర;
  • hapless, adj. దురదృష్టపు;
  • haplo, pref. ఏక; సరళ;
  • haploid, adj. ఏకస్థితిక;
  • happen, v. i. తటస్థించు; తటస్థపడు; జరుగు; సంభవించు;

---Usage Note: happen, occur, take place, happen to

  • ---Use happen to talk about past or future events that are accidental or that cannot be planned: What will happen if I change my job? Use occur to talk about a specific event that has already happened. Use take place to talk about a planned event: The wedding will take place on Sunday. Use happen to to say that a person or thing is affected by an event.
  • happiness, n. ఆనందం; సంతోషం; ఎలమి; ముదము;
  • happy, adj. సంతోషపు;
    • - event, ph. సంతోషపు సమయం; శుభ కార్యం;
    • - person, ph. సంతోషి;
  • happy, n. హాయి; సంతోషం;
  • harbinger, n. (1) వైతాళికుడు; అగ్రగామి; (2) రాబోవుదానిని సూచించేది; పురోసూచకం;
  • harass, v. t. వేధించు; బాధించు; క్షోభపెట్టు; పీడించు;
  • harbor, harbour (Br.), n. ఓడరేవు; నౌకాశ్రయం;
    • natural -, ph. సహజ నౌకాశ్రయం;
  • harbor, v. t. రక్షణ కల్పించు; దాచు; ఆశ్రయమిచ్చు;
  • hard, adj. గట్టి; గడ్డు; కఠినమైన; క్లిష్టమయిన; పటు; దృఢమైన; అసాధ్యమైన; దుర్ఘటమైన; దుస్తరమైన; కష్టమైన; ప్రయాసతో కూడిన;
    • - copy, ph. పటు ప్రతి;
    • - facts, ph. నిర్వివాదములైన నిజాలు; కఠిన సత్యాలు; కఠోర వాస్తవాలు;
    • - luck, ph. దురదృష్టం;
    • - question, ph. గడ్డు ప్రశ్న;
    • - rain, ph. జడివాన;
    • - rock, ph. చట్రాయి;
    • - stool, ph. పెంటిక;
    • - times, ph. కష్ట కాలం; గడ్డు రోజులు;
    • - water, ph. కఠిన జలం; చవిటి నీళ్ళు; సున్నపు నీళ్లు; సబ్బు నురుగ రాని నీరు;
  • hard c, ph. [phon.] కకారం; [rel.] soft c is చకారం
  • hard g, ph. గకారం; [rel.] soft g is జకారం
  • hardness, n. గట్టితనం;
  • hardship, n. ఇబ్బంది; కష్టం; రాయిడి; కక్కసము;
  • hardened, adj. కరడు కట్టిన; గట్టిబడ్డ; తోడుకున్న; బిళ్లకట్టిన;
  • hardness, n. గట్టితనం; కక్కరం; కాఠిన్యత; ధృతగుణం; బిరుసుతనం; కఠినత్వం;
  • hardship, n. ఇబ్బంది; కష్టం; బెడద; కక్కసం;
  • hardware, n. (1) గట్టిసరుకు; ఇనపసామాను; ఇత్తడి సామాను; (2) కాయం; దేహం; బొంది; (3) యంత్రాంశం; యంత్రసామగ్రి; బహిర్యామి; స్థూలకాయం; కలనయంత్రాంగాలలో క్రమణికలు కానివి; కంప్యూటర్లలో చేతితో ముట్టుకోడానికి అనువైన భాగాలు; ఉ. కలన కలశం ఉన్న సిలికాన్‌ చితుకు, దత్తాంశాలు దాచుకోడానికి నిర్మించిన వ్యవస్థలు, మీటల ఫలకం; తెర; మూషికం, తీగలు, వగైరాలు;
  • hardy, adj. దృఢమైన;
  • hare, n. కుందేలు; చెవుల పిల్లి;
  • harebrained, adj. తెలివిమాలిన; మూఢ;
  • harem, n. అంతఃపురం; అంతర్మందిరం;
    • - attendant, ph. m. సౌవిదల్లుఁడు; f. సౌవిదల్లిక; అంతఃపురంలో సేవచేసేవారు;
  • harlot, n. లంజ; గణిక; వేశ్య; (rel.) hooker
  • harm, n. హాని; అపకారం; కీడు; చెరుపు; చెడు;
  • harmful, n. హానికరం;
  • harmonic, adj. (1) [music] సరళ; సరళావర్త; కల; శ్రావ్యమైన; మధురమైన; సామరస్య; స్వరాత్మక; శ్రావ్యమైన; మధురమైన; (2) [math] హరాత్మక;
    • - motion, ph. సరళావర్త గతి; సమతాళ గమనము;
    • - series, ph. [math] హరాత్మక శ్రేణి;
  • harmonics, n. అతిస్వరాలు; స్థూలంగా చెప్పాలంటే ప్రాధమిక ధ్వని తరంగం (fundamental), దాని అతిస్వరాలు (harmonics) కలిపి అనుస్వరాలు అవుతాయి; ఇక్కడ అతిస్వరాల పౌనఃపున్యం, ప్రాధమిక స్వరాల పౌనఃపున్యం మధ్య ఉండే నిష్పత్తి పూర్ణాంకం అయి ఉండాలి; అప్పుడే ఆ స్వర సమ్మేళనాలు శ్రావ్యంగా ఉంటాయి;
  • harmonious, adj. కల; సామరస్య;
    • - voice, ph. కలకంఠం;
  • harmonize, v. t. క్రమ పరచు;
  • harmony, n. శ్రావ్యత; రమ్యత; స్వరసమ్మేళనం; సామరస్యం; ఏకతాళం;
  • harness, n. జీను; (rel.) rein;
  • harness, v. t. (1) జీను తొడుగు; జీను వేయు; (2) సజ్జీకరించు; ఉపయోగించు; నియంత్రణకి తెచ్చు;
  • harpoon, n. పంట్రకోల; రువ్వుటీటె; చేపలని పట్టడానికి ఈటెకి తాడు కట్టి నీళ్ళల్లోకి రువ్వే ఈటె;
  • harrow, n. గుంటక; గొఱ్ఱు; మత్యం; మత్తెం; నాగలి పెళ్లగించిన బెడ్డలని గుండగా చేసే పనిముట్టు;
  • harsh, adj. గడ్డు; పరుషమైన; నిర్దయతోకూడిన; కఠోరమైన; కఠోర; తీవ్రమైన; తీవ్ర; కటువైన;
    • - days, ph. గడ్డు రోజులు;
    • - facts, ph. కఠోర వాస్తవాలు;
    • - words, ph. పరుషవాక్కులు;
  • harshness, n. బెట్టిదం;
  • hartal, n. [Ind. Engl.] హర్తాల్; (Hin.) హట్ట + తాళ; అంగళ్ళకి తాళాలు వెయ్యడం; సమ్మె; పని మానెయ్యడం;
  • harvest, n. పంట; పంటకోత;
  • hashish, n. గంజాయి; భంగు; హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; మేరువానా అనేది గంజాయి మొక్క ఆకులని, మొగ్గలని ఎండబెట్టి తయారు చేస్తారు; (note) The word assasin is derived from hassasin which is related to hashish;
  • hash tag, ph. n. ఒక గుర్తు; కంప్యూటర్‍ కీ ఫలకం మీద ఉండే రెండు అడ్డ గీతలు, వాటి మీద రెండు నిలువు గీతలు ఉన్న ఒక గుర్తు;
  • haste, n. తొందర; తొందరపాటు; ఉరవడి; జోరు;
  • hasten, v. i. తొందర పడు; v. t. తొందర పెట్టు;
  • hastiness, n. తొందరపాటు; దుందుడుకు;
  • hatch, v. t. గుడ్లని పొదుగు;
  • hatchet, n. పరశువు; చిన్న గొడ్డలి; చేతి గొడ్డలి;
  • hate, v. t. ద్వేషించు;
  • hater, n. ద్వేషి; విరోధి; గిట్టనివాడు;
  • hatred, n. ద్వేషం;ఒంటమి;
  • haul, v. t. ఈడ్చు; లాగు;
  • haunt, n. చుట్టుకొని తిరిగే చోటు; సంచరించే చోటు; ఇరువు; విహార స్థలం;
  • have, v. ఉండు, ఉండుట, కలిగి ఉండుట,
  • have to, modal verb. తప్పకుండా చెయ్యవలసిన పరిస్ఠితి; to be forced to do something because someone makes you do it, or the situation makes it necessary;

---Usage Note: have to, have got to, must

  • ---Use all these phrases to talk about what is necessary to do. Use have to to say that something is necessary, and you do not have a choice about it: I have to study for the examination. Use must to say that something is necessary and you think it is a good idea: I really must study harder. Use have got instead of have to or must in order to emphasize how important something is: I have got to talk to him.
  • haven, n. (హేవెన్‍). రేవు; ఆశ్రయం; నివాసం;
  • havoc, n. నాశనం; ధ్వంసం;
  • hawk, n. (1) డేగ; జాలె; కురుజు; సాళ్వం; వేసడం; ఒరణం; (2) కయ్యానికి కాలు దువ్వే వ్యక్తి; యుద్ధానికి సిద్ధపడే వ్యక్తి;
  • hay, n. ఎండుగడ్డి; గాదం; గవతం;
  • hay fever, n. గవత జ్వరం; గడ్డి జాతి మొక్కల పుప్పొడి పడక వచ్చే ఒక రకం ఎలర్జీ;
  • haystack, n. గడ్డిమేటు; గడ్డివాము; యావసం;
  • hazard, n. ప్రమాదం; అపాయం; గండం; విపత్తు;
  • hazardous, adj. ప్రమాదకరమైన; ప్రమాదపూర్వకమైన; ప్రమాదకారకమైన; హాని కలిగించే;
  • hazel nuts, n. pl. new name for filberts; ఒక రకం పిక్క; ఈ పిక్క లోపలి గింజలు తింటారు;
  • hazmat, n. ప్రమాదార్థం; ప్రమాదకరనమైన + పదార్థం; hazardous + material
  • he, pron.(1) remote. అతడు; అతగాడు; అతను; వాడు; (2) proximate. ఇతడు; ఇతగాడు; ఇతను; వీడు; (3) respectful & remote. ఆయన; (4) respectful & proximate, ఈయన; (5) sneering & proximate. ఈయన గారు; (6) sneering & remote. ఆయన గారు;
  • head, n. (1) తల; బుర్ర; నెత్తి; శిరస్సు; శిరం; శీర్షం: మస్తకం; మూర్ధం; (2) పెద్ద; అధిపతి; see also heads; scalp;
    • pressure -, ph. [engr.] పీడన శిరం;
    • suction -, ph. [engr. ] పీలుపు శిరం;
  • head clerk, n. పెద్ద గుమాస్తా;
  • headache, n. తలనొప్పి;
    • migraine -, ph. అనంతావర్తం; ఒక రకం తలనొప్పి;
  • headed pin, n. గుండుసూది;
  • header, n. శిరోవాక్యం;
  • heading, n. శీర్షిక; తలకం;
  • headline, n. శీర్షిక; వార్తాశీర్షిక; ముఖ్య సమాచారం;
    • banner -, ph. పతాక శీర్షిక;
    • running -, ph. పుటాక్షరం;
  • headlights, n. pl. తలదీపాలు;
  • headmaster, n. ప్రధాన ఉపాధ్యాయుడు;
  • heads, n. బొమ్మ; నాణెం యొక్క బొమ్మ వైపు;
  • heads or tails? ph. బొమ్మా, బొరుసా?
  • headstrong, adj. తలబిరుసైన;
  • headwind, ph. ఎదురుగాలి; గోగంధనం;
  • heal, v. i. మాను; v. t. మాన్చు;
  • health, n. ఆరోగ్యం;
  • healthful, adj. ఆరోగ్యదాయకం; ఆరోగ్యకరం:
  • healthy, adj. (1) ఆరోగ్యవంతం; (2) ఆరోగ్యకరం;
  • healthy child, ph. ఆరోగ్యవంతమైన బిడ్డ;
  • healthy imagination, ph. చురుకైన ఊహాశక్తి;
  • heap, n. కుప్ప; పోఁగు; ప్రోఁవు; గుట్ట; వామి; తిట్ట; రాశి; చయం; నివహం; గుమి; ఉత్కరం;
  • heaping, v. t. పోగు చెయ్యడం; చయనం; ప్రోవించుట;
  • hear, v. t. విను;

USAGE NOTE: hear and listen

  • Use both of these words to talk about sounds. Listen means to pay attention to what someone says: She never listens to me. Hear usually means to recognize that a sound is being made: Did you hear the alarm ring?
  • hearing, n. విచారణ; వినడం; వినికిడి;
  • hearsay, n. వినికిడి; విన్నమాట; జనశ్రుతి; కింవదంతి; శ్రుతపాండిత్యం;
    • - evidence, ph. వినికిడి సాక్ష్యం; శ్రుతం; శ్రుత సాక్ష్యం; చూసినది కాదని అర్థం;
  • hearse, n. శవపేటికని లాగే బండి; పాడె;
  • heart, n. (1) హృదయం; గుండె; గుండెకాయ; (2) మది; డెందం; ఉల్లం; ఎద;
    • getting by -, ph. కంఠస్థం చెయ్యడం; ధారణ చెయ్యడం;
    • - attack, ph. గుండె పోటు; హృద్‌ఘాతం;
    • - beat, ph. హృదయ స్పందనం; గుండె కొట్టుకోవడం;
    • - burn, ph. (1) ఆమ్లపిత్తం; గుండెమంట; అజీర్తి వల్ల ఛాతీలో కలిగే మంట; (2) [idiom] అక్కసు;
  • heartfelt, adj. మనస్పూర్తిగా; హృదయపూర్వకంగా; హార్ధిక;
  • hearth, n. అంతిక; పొయ్యి;
    • long -, ph. ఆలెపొయ్యి; గాడి పొయ్యి;
  • heartless, adj. నిర్దాక్షణ్యంగా;
  • heartily, adv. (1) మనః పూర్వకంగా; (2) ఉత్సాహంగా;
  • hearty, adj. హృదయపూర్వక; హార్ధిక;
  • heat, n. వేడి; ఉడుకు; సెగ; ఉబ్బ; ఉక్క; ఉమ్మ; వడ; ఉష్ణం; ఊష్మం; తాపం; ఆతపం; దగ; ఆవి; కాక; విదాహం;
    • latent -, ph. గుప్తోష్ణం; తాపోగ్రత మారకుండా ఒక పదార్థాన్ని ఘన రూపం నుండి ద్రవ రూపం లోకి కానీ, ద్రవ రూపం నుండి వాయు రూపం లోకి కాని మార్చడానికి కావలసిన వేడి;
    • specific -, ph. విశిష్ట ఉష్ణం; ఒక (గ్రాము) పదార్థపు తాపోగ్రతని ఫలానా (ఒక డిగ్రీ) మేరకి పెంచడానికి కావలసిన వేడి;
    • - ray, ph. తాపకిరణం; ఉష్ణకిరణం;
    • - stroke, ph. వడదెబ్బ;
  • heat, v. t. వేడిచేయు; కాచు; కాగబెట్టు;
  • heat-proof, adj. ఉష్ణజిత;
  • heave, v. t. (1) లాగు; ఎత్తు; లేవనెత్తు; విసరు; రువ్వు; తోయు; పనులని ఎక్కువ శ్రమతో చేయు;
    • - a sigh, ph. బలంగా నిట్టూర్చు;
  • heaven, n. స్వర్గం; దివి; సురలోకం; నాకం; పరమపదం; వినువు;
  • heavenly, adj. విను;
    • - highway, ph. విను వీధి;
    • - body, ph. నభోమూర్తి; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు;
  • heavy, adj. బరువైన; భారీ; భార; గురు;
    • - elements, ph. భారీ ధాతువులు; భారీ మూలకాలు;
    • - industries, ph. భారీ పరిశ్రమలు;
    • - metals, ph. భారీ లోహాలు;
    • - rains, ph. భారీ వర్షాలు; కుండపోత;
    • - water, ph. భారజలం; బరువునీరు;
  • heavy-duty, adj. దిట్టమైన; భారీ; రాటుకీ పోటుకీ ఓర్చుకోగల;
  • heavy-handedness, n. అన్యాయమైన నిక్కచ్చితనం;
  • Hebrew, n. ఇస్రయెల్ దేశపు అధికార భాష; ఇడ్డిష్ భాష;(rel.) Yiddish
  • heckling, n. అవహేళన;
  • hectare, n. హెక్టరు; 2.471 ఎకరముల భూమి;
  • hedge, n. కొరడు; దడి; కంచె; మొక్కలతో నిర్మించిన కంచె;
  • hedonism, n. (హీడనిజం) భోగలాలసత్వం; భోగలాలసత; స్వయంసుఖవాదం; ఆనందమే జీవిత పరమావధి అని నమ్మే తత్త్వం;
  • heel, n. మడమ; చీలమండ;
  • heifer, n. (హీఫర్) గృష్టి; కుర్రి; ఇంకా ఈనని ఆవు పెయ్య;
  • height, n. (1) ఎత్తు; ఉన్నతి; పొడుగు; పొడవు; తనర్పు; ఉద్దము; (2) ఔన్నత్యం; పరాకాష్ఠ;
  • heir, n. (ఎయిర్); వారసుడు;
    • fellow -, ph. జ్ఞాతి;
  • heirloom, n. మిరాసి; వారసత్వపు సొత్తు; పారంపర్యంగా వచ్చు సరుకు;
  • heist, n. దోపిడీ;
  • helianthus, n. సూర్యకాంతపు పువ్వు; పొద్దు తిరుగుడు పువ్వు;
  • helical spring, n. కమానుకట్ట;
  • helicopter, n. సర్పిలపక్షి;
  • heliotrope, n. గురుగు చెట్టు; తేలుమణి;
  • heliotropic, adj. ప్రకాశానువర్త; సూర్యానువర్త; పొద్దుతిరుగుడు;
  • heliotropism, n. ప్రకాశానువర్తనం; పొద్దుతిరుగుడుతనం; వెలుతురు వచ్చు దిశకు తిరిగే స్వభావం;
  • heliport, n. helicopter + airport; సర్పిలాశ్రయం;
  • Helium, n. రవిజని; (అణుసంఖ్య 2, సంక్షిప్త నామం, He); (ety.) రవి పుట్టుటకు కారణమైనది; ఒక రసాయన మూలకం; [Gr. helios = Sun];
  • helix, n. సర్పిలం; కుండలిని;
  • hell, n. నరకం; దారుణం;
  • Hellenic, adj. యూనాని; గ్రీకు నాగరికతకు సంబంధించిన;
  • helm, n. చుక్కాని;
  • helmet, n. శిరస్త్రాణం; శిరస్కం; టొపారం; తలకి దెబ్బ తగలకుండా వేసుకొనే లోహపు టోపీ;
  • help, n. (1) సహాయం; సహకారం; సాయం; బాసట; తోడ్పాటు; ఉపకారం; కూడుదల; (2) ఉపకారి; సహాయపడే వ్యక్తి;
  • help, v. t. సహాయం చేయు; సహాయపడు; సాయపడు; తోడ్పడు; ఉపకారం చేయు;
  • helpful, adj. సహాయభూత;
  • helpless, adj. హతాశులైన; అసహాయులైన;
    • - farmers, ph. హతాశులయిన రైతులు;
  • helplessness, n. నిస్సహాయత;
  • hem, n. అంచు;
  • haematology, n. రక్తశాస్త్రం; అసృక్ శాస్త్రం;
  • hemicrania, n. పార్శ్వపు తలనొప్పి;
  • hemisphere, n. అర్ధగోళం; గోళార్ధం;
  • hemo, pref. రక్త; రక్తసంబంధమైన;
  • hemoglobin, n. రక్తచందురం;
  • hemorrhage, haemorrhage, (Br.) n.రక్తస్రావం;
  • hemorrhoids, haemorrhoids, (Br.) n. మూలశంక; మొలలు;
  • hemp, n. గోగు; ఒక రకం గంజాయి;
    • - fibre, ph. కిత్తనార; గోగు నార;
  • hen, n. f. పెట్ట; కోడిపెట్ట; కుక్కుటి; pl. కోళ్లు;
  • henceforth, adv. ఇకమీదట; ఇకముందు; ఇటుతర్వాత;
  • hen-pecked husband, n. భార్యాజితుడు; భార్యాటికుడు;
  • henna, n. గోరింటాకు;
  • hepatic, adj. కాలేయానికి సంబంధించిన; కాలేయ;
  • hepatitis, n. కాలేయపు వాపు; కాలేయశోఫం; కామెర్లు; పచ్చ కామెర్లు; ఇది సాధారణ హెపటైటిస్. ఇది కాకుండా హెపటైటిస్ A, B. C. Delta అని రాకరకాల పేర్లతో హెపటైటిస్ చెలామణీలో ఉంది. వీటికీ పచ్చ కామెర్లకీ పేరులో పోలిక తప్ప మరేవిధమైన సంబంధమూ లేదనే చెప్పుకోవచ్చు;
  • heptagon, n.సప్తభుజి; డెమ్మూఁపి;
  • heralder, n. యుగకర్త; వైతాళికుడు; ఆద్యుడు;
  • herb, n. (ఎర్‌బ్) (1) మూలిక; శాకం; ఆకు; పత్రం; ఆకుపత్రి; వంటలో సువాసన కొరకు వాడే మొక్క; (2) ఓషధి; మందులలో వాడే మూలిక;
  • herbicide, n.గుల్మసంహారిణి; కలుపు మొక్కలని చంపే రసాయనం;
  • herbivore, n. (ఎర్బివోర్) తృణాహారి; శాకాహారి;
  • herculean task, ph. కష్టసాధ్యమైన పని; భగీరధ ప్రయత్నం;
  • hepta meter, n. ఏడు గణాలు ఉన్న పద్య పాదం;
  • herd, n. మంద;
  • herd of cattle, ph. ఆలమంద; మొదవు; కదుపు;
  • herd, v. t. మందని తోలు; మందని కాపలా కాయు;
  • herder, n. కాపరి;
  • here, adv. ఇక్కడ; ఇహ; ఇచ్చట;
  • hereabouts, adv. ఈ చుట్టుప్రక్కల; ఇక్కడిక్కడ;
  • hereafter, adv. ఇకముందు; ఇకపైన; ఇకమీదట; ఇక;
  • hereby, adv. ఈ రూపేణా;
  • hereditarily, adv. వంశానుగతంగా; ఆనువంశికంగా;
  • hereditary, adj. వంశపారంపర్య; వారసత్వ; ఆనువంశిక; పరంపరాగత;
  • heredity, n. వారసత్వం; పారంపర్యం; వంశపారంపర్యం; పారంపర్య బలం; వంశానుగతం;
  • heredity, n. వారసత్వం; వంశపారంపర్యం; వంశానుగతం;
  • heresy, n. సంప్రదాయ విరుద్ధత; వ్యతిరేకత; నాస్తికత్వం;
  • heretic, n. పాషండుడు; పాషండి;
  • heritage, n. వారసత్వం; వారసత్వంగా లభించినది; అనువంశికం;
  • hermeneutics, n. మీమాంశ; గ్రంథాల తత్త్వవిచారణ; see also exegesis;
  • hermetically, adj. నివాత;
    • - sealed, ph. గాలి లేకుండా సీలు చేయబడ్డ;
  • hermit, n. వానప్రస్థి; వనవాసి; రుషి; ఒంటరిగా జీవించు రుషి;
  • hermitage, n. ఋష్యాశ్రమం; ఋషివాసం;
  • hernia, n. గిలక రోగం; ఆంత్రవృద్ధి;
    • inguinal -, ph. ఆంత్రవృద్ధి; గజ్జమీది గిలక;
    • femoral -, ph. తొడమీది/గజ్జకింది గిలక;
    • strangualted -, ph. అడ్డుపడ్డ/అణిగిపోయిన గిలక;
    • umbilical -, ph. బొడ్డుగిలక.
  • hero, n. m. (1) నాయకుడు; కథానాయకుడు; (2) వీరుడు; ధీరుడు; యోధుడు;
  • heroic, adj. వీర; ధీర;
  • heroine, n. f. నాయకి; కథానాయకి; ధీర; (rel.) నాయకురాలు is used to imply a leader;
  • heroism, n. ధీరోదాత్తత;
  • heron, n. బకం; కొంగ; కొక్కెర; కొక్కిరాయి; నారాయణపక్షి;
    • pond -, ph. కోనేటి కొంగ;
    • gray -, ph. బూడిద కొంగ; బూది కొంగ;
    • purple -, ph. ఊదా కొంగ; ఎఱ్ఱనీల కొంగ;
  • herpes, n. విసర్పిణి; సర్పివ్యాధి; చప్పిరోగం;
  • herpes frontals, n. లలాటిక విసర్పిణి; ఒక వైరసు వ్యాధి;
  • herpes labials, n. ఓష్ఠిక విసర్పిణి; పెదవుల దగ్గర వచ్చే ఒక వైరసు వ్యాధి;
  • herpes zoster, n. మేఖలిక విసర్పిణి; దద్దురులతో వచ్చే ఒక వైరసు వ్యాధి;
  • hesitate, v. i. తటపటాయించు; తడబడు; జంకు; అర్రాడు; అల్లాడు; సంశయించు; సందేహించు; సంకోచించు;
  • hesitation, n. తటపటాయింపు; జంకు; నదురు; బెరుకు; అరమరిక;
  • heterodox, adj. సంప్రదాయ విరుద్ధమైన; (ant.) orthodox;
    • - Hindu, ph. వేద పాషండుడు; నాస్తికుడు;
  • heterodox, n. పాషండుడు; పాషండి; non believer; heretic; freethinker; rebel;
  • heterogeneous, adj. విజాత; విషమజాతీయ; వివిధ;
  • heteronym, n. (1) ఒకే వర్ణక్రమం ఉండి, ఉచ్చారణలోనూ, అర్థం లోనూ తేడా ఉన్న ఇంగ్లీషు మాటలు; ఉదా: tear (టేర్) = చించు; tear (టియర్) = కన్నీటి బొట్టు; primer (ప్రిమర్) - మొదటి పుస్తకం, primer (ప్రైమర్) = రంగులు వేసేటప్పుడు వాడే మొదటి పూత;
  • heterosexual, n. పరలింగాళువు; వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి;
  • heterospory, n. భిన్న సిద్ధబీజత;
  • heterotrichous, adj. విషమ తంతుక;
  • heuristic, n. ఆనుభవికం; A rule of thumb, intuitive guess, or educated guess that reduces or limits the search for solutions in domains that are difficult and poorly understood;
  • hexagon, n. షడ్‌కోణి; షడ్‌భుజం;
  • hexadecimal, adj. షోడశాంశ; పదహారు అంశలు ఉన్న;
  • hexadeconic acid, n. షోడశోయిక్‍ ఆమ్లం; పదహారు కర్బనపు అణువుల గొలుసు ఉన్న గోరోజనామ్లం;
  • hexanoic acid, n. షష్ఠోయిక్‍ ఆమ్లం; మేషిక్‍ ఆమ్లం; కేప్రిలిక్‍ ఆమ్లం;
  • hexameter, n. ఆరు గణాలు ఉన్న పద్య పాదం;
  • hey, inter. (ఏయ్); ఇదిగో; ఇదిగో నిన్నే; ఇటు చూడు;
  • hexose, n. షడోజు; షడ్భుజి ఆకారంలో నిర్మాణక్రమం ఉన్న చక్కెర జాతి రసాయనం;
  • hexose sugar, n. షడ్‌చక్కెర; ఆరు కర్బనపు అణువులు ఉన్న చక్కెర జాతి;
  • hiatus, n. తెరిపి; విశ్రాంతి;
  • hibernation, n. శీతశ్వాసం; శీతనిద్ర;
  • hibiscus, n. మందార పూవు; జపాపుష్పం;
  • hiccups, n. ఎక్కిళ్లు; వెక్కిళ్లు; హిక్కలు;
  • hidden, adj. దాక్కొన్న; నక్కిన; గుప్తపరచిన; గర్భిత;
  • hidden, adv. గుప్తంగా; రహస్యంగా; ప్రచ్ఛన్నంగా;
  • hide, n. చర్మం; పశువుల చర్మం;
    • - and seek, ph. దాగిలిమూతలు; దాగుడు మూతలు; గుప్త కేళి; దొంగాట;
  • hide, v. i. దాగు; దాక్కొను; నక్కు;
  • hide, v. t. దాచు; గుప్తపరచు;
  • hierarchy, n. తరతమశ్రేణి; తరతమ అంతస్తు; సోపానక్రమం; పదానుక్రమం; అనుక్రమం; అనువంశం;
  • hieroglyphic, adj. రూపసంకేత;
  • hieroglyphics, n. చిత్రలేఖనం;
  • hieroglyphs, n. చిత్రలిపి; రూపసంకేతాలు; ఈజిప్టులో కనిపించిన అతి పురాతనమైన రాతలు;
  • high, adj. (1) ఎత్తయిన; మిట్ట; ఉత్తుంగ; ఉన్నతమైన; (2) మేలి; మంచి; (3) అధిక;
    • - command, ph. అధిష్టాన వర్గం;
    • - grade, ph. మేలి రకం;
    • - noon, ph. మిట్ట మధ్యాహ్నం;
    • - tide, ph. పోటునీటి మట్టం; పోటు;
    • - school, ph. ఉన్నత పాఠశాల;
    • municipal - school, ph. పురపాలక ఉన్నత పాఠశాల;
  • highlights, n. ముఖ్యాంశాలు; అగ్రవర్చస్సులు;
  • high-speed, adj. విక్రమ; శరవేగ; జోరుగా నడచే; జవాతిశయ;
  • higher, adj. పర; (ant.) అపర;
  • highest, adj. ఉచ్చిష్ట;
  • highlands, n. మెరక నేలలు;
  • highlight, n. ఉద్వర్ణం;
  • highway, n. రహదారి; రాజమార్గం; రస్తా; హట్టమార్గం; బండిబాట; దండుబాట; రోడ్డు; ఒక ఊరినుండి మరొక ఊరికి వెళ్లే రోడ్డు;
  • hill, adj. కొండ; గిరి;
    • - tribes, ph. గిరిజనులు;
  • hill, n. కొండ; దిబ్బ; గిరి; అద్రి; నగం;
  • hillbilly, n. బైతు; పల్లెటూరి బైతు; చదువు, నాగరికత లేని వ్యక్తి;
  • hillock, n. మిట్ట; మెట్ట; చిన్నకొండ;
  • hilt, n. పిడి; కత్తి పిడి;
  • hinder, v. t. ఆటంక పరచు;
  • hindrance, n. ఆటంకం;
  • Hindu, adj. హిందూ; హైందవ;
  • Hindu, n. హిందువు; సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి; (ety.) Some say this is a corrupt form of Sindh; some say this came from the Persian where hind means "black";
  • Hindustani, adj. హిందూ-ముస్లిం సమ్మిళితమైన; a hybrid of Hindu and Islamic;
  • hinge, n. బందు; అరరి; మడత బందు; ఉత్తరాసి; ఉతక; తలుపుని దర్వాజాకి బిగించే సాధనం;
  • hinged joint, n. మడతబందు కీలు;
  • hint, n. సూచన; ఇంగం;
  • hinterland, n. అంతర్వేది;
  • hip, n. తుంటి;
  • hip bone, n. తుంటి ఎముక;
  • hip girdle, n. తుంటి వేష్టనం;
  • hip joint, n. తుంటి కీలు;
  • hippie, n. హిప్పీ; 1960 దశకంలో, ముఖ్యంగా అమెరికాలో, సంఘపు కట్టుబాట్లు నిరసిస్తూ, సంస్కారం లేకుండా జుత్తు పెంచడం, చిరిగిన బట్టలు వేసుకోవడం, చట్టవిరుద్ధమైన మందులతో ప్రయోగాలు చెయ్యడం వంటి పనులు చేసే వ్యక్తి;
  • hippopotamus, n. నీటిగుర్రం; జలాశ్వం;
  • hire, n. కిరాయి; బాడుగ;
  • hire, v. t. కిరాయికి కుదుర్చు; బాడుగకి కుదుర్చు; అద్దెకి తీసుకొను;
  • hireling, n. కిరాయికి దుర్మార్గాలు చేసే వ్యక్తి; కిరాయికి ఖూనీ చేసే వ్యక్తి; బాడుగబందీ; క్షేత్రదాసుడు;
  • his, pos. pron. (1) neutral, remote, వాని; అతని; (2) neutral, proximate. వీని; (3) respectful, remote. వారి; (4) respectful, proximate, వీరి; familiar or disrespectful, remote. వాడి; (6) familiar or disrespectful, proximate, వీడి;
  • hiss, n. బుస; ఫూత్కారం;
  • histogram, n. స్తంభలేఖనం; A stacked column graph in which one places the columns close together to emphasize differences in the data items within each stack;
  • histology, n. ధాతుశాస్త్రం; కణజాల శాస్త్రం;
  • historians, n. pl. చరిత్రకారులు;
  • historic, adj. ప్రసిద్ధికెక్కిన; జ్ఞాపకం ఉంచుకోదగ్గ; చారిత్రాత్మక;
  • historical, adj. చారిత్రాత్మక;
  • history, n. చరిత్ర; ప్రవర; ఇతిహాసం; చరితం;
    • ancient-, ph. ఇతిహాసం;
  • histrionics, n. వేషాలు; కృత్రిమ ప్రవర్తన; నాటకీయత; అభినయం;
  • hit, n. కొట్టు; మొత్తు; బాదు;

---Usage Note: hit, strike, beat

  • ---Use hit to talk about most kinds of hitting. Strike is more informal and means to hit very hard. Beat means to hit someone or something many times. You can hit or strike someone or something accidentally, but you beat deliberately.
  • hither, n. ఇటు; ఇవతల; ఇటువైపు;
  • hive, n. పట్టు; తుట్టె;
  • hives, n. చలితం; ఎఱ్ఱటి దద్దురులు; ఒక రకం ఎలర్జీ; same as urticaria;
  • hoard, n. కూడబెట్టి దాచినది; నిక్షేపం; సంచితం;
  • hoarfrost, n. ఠారం; శీతలప్రాంతాలలోని ఆకులపై సూదిగా కప్పబడిన మంచు స్ఫటికాలు;
  • hoarse, adj. బొంగురుపోయిన; (ant.) shrill;
  • hoax, n. లాభాపేక్షతో కాకుండా, కేవలం అల్లరి చేసే ఉద్దేశంతో చేసిన మోసకారి పని;
  • hobby, n. వ్యావృత్తి; అభిరుచి;
  • hoe, n. తొళ్లిక; తౌఁగోల;
  • hog, n. పంది;
  • hog plum, n. మారేడు;
  • hog weed, n. పునర్ణవా అనే మూలిక; గలిజేరుపల్లి; జీవలోధసి;
  • hoist, v. t. లేవనెత్తు;
  • hold, v. t. పట్టుకొను; కుంభించు;
  • holder, n. మలారం;
    • - of bangles, ph. గాజుల మలారం;
  • holding, n. కమతం; వ్యవసాయం చేసే భూమి;
  • hole, n. కన్నం; బెజ్జం; బొక్క; బొరియ; కలుగు; కంత; లాగ; బిలం; రంధ్రం; వివరం; లొటారం; ఛిద్రం; సుషిరం; గర్త;
  • holidays, n. పర్వదినాలు; పండుగ రోజులు; ప్రభుత్వముచే ప్రకటింపబడిన శలవు దినాలు; see also vacation;
    • Christmas -, ph. క్రిస్‌మస్ శలవులు;
    • summer -, ph. వేసంగి శలవులు;
  • holistic, adj. పూర్ణదృక్పథ;
  • hollow, adj. గుల్లగానున్న;
  • hollow, n. తొర్ర; డొల్ల; డొలక; బోలు;
  • holocaust, n. మారణహోమం; ప్రత్యేకంగా జెర్మనీ నియంత హిట్లరు యూదుల యెడల చేసిన మారణహోమం;
  • holograph, n. చేవ్రాలు; స్వహస్తంతో రాసినది;
  • hologram, n. ప్రతిచ్ఛాయ; ప్రతికృతి; ఆకారానికి నకలు ఆకారం;
  • holy, adj. పవిత్రమైన; ఆర్ష;
  • holy basil, n. తులసి;
  • homage, n. ప్రణామం; వందనం;
  • home, adj. ఇంటి;
    • - remedy, ph. ఇంటి వైద్యం; కరక్కాయ వైద్యం: గోసాయి చిట్కా;
  • home, n. ఇల్లు; కొంప; నివాస స్థలం; ఉనికిపట్టు; నెలవు; గృహం; మనుకువ; ధామం; నికేతనం; నివసనం; నివాసం; నివేశనం; నిలయం;
  • homemaker, n. f. గృహిణి;
  • homeopathy, n. హోమియోపతి అను చికిత్సా విధానం;
  • homecoming, n. స్వస్థలాగమనం;
  • homely, adj. (1) అందముగా లేని; అనాకారమైన; (2) సంసారపక్షమైన;
  • homemaker, n. f. గృహిణి;
  • homemaker, n. m. గృహస్తు;
  • homespun, n. (1) ఖద్దరు; ఇంటనే వడికినది; (2) ముతకైనది;
  • homework, n. చింతనం; ఇంటి దగ్గర చెయ్యవలసిన పాఠ్యాంశాలు;
  • homicide, n. నరమేధం; నరవధ; నరహత్య; హత్య; ఖూనీ;
    • culpable -, ph. సదోష నరమేధం; దోషయుక్త నరహత్య; దండార్హ నరహత్య;
  • Hominid, n. నరవానర గణం; మానవులు, మానవులని పోలిన వానరగణాలు; వివేక మానవులు, దాక్షిణాత్య వానరాలు, మొదలైన జాతులన్నిటిని గుత్తగుచ్చి వాడే పదం; ఒరాంగ్-ఉటాన్‍, గిబ్బన్‍, గొరిల్లా, చింపంజీ, మొదలైనవి;
  • homo, pref. (1) సజాతీయ; సమ; (2) మనిషి; మానవ జాతి (genus) ని సూచించే మాట;
  • Homo erectus, n. నిటారు మనిషి;
  • Homo ergaster, n. పని మనిషి; పనిచేసే మనిషి; (ety.) homo = man; ergaster = workman; (ex.) Turkana Boy;
  • homogeneity, n. సజాతీయత; సమఘాతీయ;
  • homogeneous, adj. సజాతీయ; సాజాత్య;
  • Homo habilis, n. చేతివాటు మనిషి; పనిముట్లు తయారు చెయ్యడం నేర్చిన మనిషి; (ety.) homo = man; habilis = handy; talented with hands; కొందరు వీరిని ఆస్ట్రాలోపితికస్ వర్గంలో చేర్చుతారు;
  • Homo heidelbergensis, n. హైడెల్‌బర్గ్ మనిషి;
  • homologous, adj. సధర్మ; సంగత; సమజాత; స్థానంలో కాని, విలువలో కాని, కట్టడిలో కాని గట్టి పోలికలు ఉన్న;
    • - chromosomes, ph. సంగతత్త్వం ఉన్న వారసవాహికలు;
  • homologue, n. సంగతకం; ఒకే జాతికి చెందినవి; ఒకే కుటుంబానికి చెందిన;
  • homology, n. సంగతత్త్వం;
  • homonyms, n. pl. వర్ణక్రమంలో తేడా ఉన్నా ఒకే విధంగా ఉచ్చరించే మాటలు;
Comparison_of_faces_of_Homo_sapiens_and_Neanderthal.jpg
  • Homo neanderthalensis, n. నియాండెర్తాల్ మనిషి; కొందరు వీరిని బుద్ధ మనిషి వర్గంలో చేర్చుతారు;
  • Homo rudolfensis, n. రూడాల్ఫు మనిషి, (ety.) homo = man; rudolfensis = related to Lake Rudolf;
  • Homo sapiens, n. తెలివైన మనిషి; బుద్ధ మనిషి; (ety.) homo = man; sapiens = intelligent; wise;
  • homophile, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి; (ant.) heterophine;
  • homosexual, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి; (ant.) heterosexual;
  • homosexuality, adj. స్వలింగ ఆకర్షణ; స్వలింగాళువులతో సంపర్కం పొందాలనే ఆకాంక్ష;
  • homosporous, adj. సమసిద్ధబీజవంత; ఒకే రకపు "స్పోరులని" ఉత్పత్తి చేసే:
  • hone, n. శాణం; సానఱాయి; --see also touch stone
  • hone, v. t. పదునుపట్టు; సానపట్టు; మెరుగులు దిద్దు;
  • honest, adj. (ఆనెస్ట్) సచ్చీల; అవ్యాజ్య; నిజాయతీ; అకుటిల;
  • honesty, n. (ఆనెస్టీ) నిజాయితీ; సచ్ఛీలత; చిత్తశుద్ధి; ఆర్జవం; అక్కలత;
  • honey, n. తేనె; మధువు; మకరందం; భామరం; పుష్పరసం; క్షౌద్రం; (rel.) nectar;
    • pure -, ph. కురుజు తేనె;
  • honeybee, n. తేనెటీగ; పెర ఈగ;
  • honeycomb, n. తేనెపట్టు; తేనెతుట్టె; పెర;
  • honor, honour (Br.), n. గౌరవం; మర్యాద;
  • honor, v. t. గౌరవించు; గౌరవం చేయు;
  • honorable, adj. గౌరవనీయ; వందనీయ;
  • honorarium, n. గౌరవవేతనం;
  • honorary, adj. గౌరవ;
  • hood, n. (1) పడగ; ఫణం; స్ఫట; (2) శిఖరం; టొపారం;
  • hoodlum, n. గూండా;
  • hoodwink, v. t. బుకాయించు; దగాచేయు; మోసం చేయు;
  • hoof, n. డెక్క; గిటీ; గొరిజ; రింఖ; గిట్ట; ఖురం;
  • hook, n. (1) కొంకి; కొక్కెం; ఒంకీ; (2) క్రికెట్‌లో బంతిని వెనక్కి కొట్టు పద్ధతి; బేస్కెట్‌బాల్ ఆటలో ఒక విధంగా బంతిని విసిరే పద్ధతి;
  • hookworm, n. కొంకిపురుగు;
  • hooligan, n. రౌడీ; దుండగీఁడు;
  • hop, v. i. కుప్పించు; జవుకళించు; ఎగురు; దూకు; గెంతు;
  • hope, n. ఆశ; see also greed;
    • ray of -, ph. ఆశాకిరణం;
    • vain -, ph. అడియాస;
  • hopeful, adj. ఆశావహ; ఆశాజనక;
  • hopeless, adj. నిరాశాపూరిత; హతాశులయిన;
  • hopelessness, n. నిరాశ;
  • hopper, n. శంకుతొట్టి; గరాటుతొట్టి; గరాటు;
  • horde, n. మంద; తొంబ;
  • horizon, n. క్షితిజం; దిగ్మండలం; దిగంతం; దిక్‌చక్రం; చక్రవాళం:
    • celestial -, ph. ఖగోళీయ క్షితిజం;
  • horizontal, n. క్షితిజసమాంతరం;
  • horizontal, adj. క్షితిజ; క్షితిజ సమాంతర; సమతల; అడ్డుగా;
    • - acceleration, ph. క్షితిజ వేగోత్కర్షణ; క్షితిజ త్వరణం;
    • - line, ph. అడ్డుగీత;
    • - plane, ph. క్షితిజ సమతలం;
  • hormone, n. ఉత్తేజితం; గ్రంథులచే తయారు కాబడ్డ ఒక రకం ఉత్తేజపరచే రసాయన పదార్థం;
  • horn, adj. కొమ్ముతో చేసిన; శృంగ; విషాణ; శింగాణి;
  • horn, n. (1) కొమ్ము; శృంగం; విషాణం; (2) బూరా;
  • hornbill, n. ధనేశ పక్షి; ఎబ్బెరపక్షి;
    • greater -, ph. మహాధనేశ పక్షి; రాజధనేశ పక్షి; కొండయెబ్బెర పక్షి;
  • horned animal, ph. శృంగి;
  • hornet, n. కందిరీగ;
  • horoscope, n. (1) జాతకం; (2) జాతక పత్రిక; జన్మ పత్రిక;
  • horrible, adj. భీషణ; బీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ;
  • horror, n. బీభత్సం; భీకరం; భయానకం
  • hors d'ouevres, n. pl. (ఆర్డొర్వుస్‍), భోజనం ముందు తినే వెచ్చవెచ్చటి చిరు భక్ష్యాలు; చల్లగా ఉన్న చిరు భక్ష్యాలని "ఆంటీపాస్తో" అంటారు;
  • horse, n. గుర్రం; అశ్వం; హయం; తురంగం; ఘోటకం; ఘోటం; వాజి; గుండు; వారువం; మయం; యయువు;
  • horsefly, n. జోరీగ;
  • horse-gram, n. ఉలవలు;
  • horseplay, n. మోటు సరసం;
  • horseradish, n. మునగవేరు; బాగా ఘాటుగా ఉండే ఒక రకం దుంప;
  • horse power, n. అశ్వ సత్వం; 550 పౌనుల బరువుని ఒక సెకండు కాలవ్యవధిలో ఒక అడుగు పైకి లేవనెత్తడానికి కావలసిన సత్వాన్ని అశ్వ సత్వంఅని నిర్వచించేరు; ఒక సామాన్యుడి శరీరంలో ఉరమరగా ఒకటింట పదోవంతు అశ్వశక్తి ఉంటుంది;
  • horse rider, n. రౌతు;
  • horse sacrifice, n. అశ్వమేధం; వాజపేయం;
  • horseshoe, n. లాడం; గుర్రపులాడం;
  • horticulture, n. ఉద్యానకృషి; వనసాయం; తోటల పెంపకం;
  • hosiery, n. లోపలి దుస్తులు; లోదుస్తులు;
  • hose, n. మెత్తటి గొట్టం;
    • rubber-, ph. రబ్బరు గొట్టం;
  • hospital, n. ఆసుపత్రి; వైద్యశాల;
    • charity -, ph. ధర్మాసుపత్రి;
  • ladies -, ph. ఘోషాసుపత్రి;
  • hospitality, n. ఆదరణ; మర్యాద; ఆతిథ్యం; అతిథి సత్కారం; అతిథిధర్మం;
  • host, n. అతిధేయుడు; అతిథిని ఆదుకునే మనిషి;
  • hostage, n. జామీనుగా ఉంచబడిన వ్యక్తి; బందీ;
  • hostel, n. వసతిగృహం; ఆవసధం; సదనం; విద్యార్థులు నివసించే వసతి గృహం;
  • hostile, adj. ప్రతికూల; విరుద్ధ; వ్యతిరేక; వైర;
  • hostility, n. వైరం; విరోధం; ప్రాతికూల్యం;
  • hot, adj. (1) వేడి; వడ; తప్త; (2) తాజా; (3) కారం; వర్ర; పొగరు;
    • red -, ph. అరుణ తప్త;
    • white hot -, ph. శ్వేత తప్త;
    • - wind, ph. వడగాలి;
  • hotel, (హొటేల్) n. హొటేలు; పడక సదుపాయాలని అతిథులకి అందించే భవనం; హొటేలులో పడక గదులే కాకుండా, ఫలహారశాలలు, తదితర సదుపాయాలు ఎనై్ననా ఉండవచ్చు; (note) ఈ మాటని హోటల్ అని ఉచ్చరించే అలవాటు ఆంధ్రదేశంలో ఉంది కానీ, హొటేలు అన్నది అసలు ఉచ్చారణకి దగ్గర; see also restaurant; motel;
  • hound, n. వేటకుక్క; గాలికుక్క; సారమేయము; ఉడుప కుక్క;
  • hour, n. గంట; హోర; వేళ;
  • hourglass, n. గంటసీసా; గంటగరాటు; హోరకాచం;
  • hourly, n. గంట గంటకీ; గంటకొకమారు; ప్రతిగంటా;
  • house, n. ఇల్లు; గృహం; అగారం; లోఁగిలి; ఆలయం; కొంప; పంచ; నెలవు;
    • - of cards, ph. పేకమేఁడ;
    • - made of lumber, ph. మచ్చు; మిద్దె; మాడుగు;
    • - sparrow, ph. ఇంటిపిచ్చుక; చిమణి;
    • doll -, ph. బొమ్మరిల్లు;
    • green -, ph. హరితగృహం; పచ్చటిల్లు;
    • interior of a -, ph. లోఁగిలి;
  • household, n. కాఁపురం; సంసారం; కుటుంబం;
    • entire -, ph. ఇంటిల్లిపాదీ;
    • - appliance, ph. గృహోపకరణం;
  • householder, n. గృహపతి; గృహస్థువు; గృహస్థు; గృహమేధి; గేస్తు; ఇంటిదొర;
  • housekeeping, n. గృహనిర్వహణ; ఇంటికాపు;
  • housewife, n. ఇల్లాలు; ఇంటికి ఆడది; గృహిణి; గరిత;
  • hover, v.t. ముసురు;
  • how, inter. ఎలా; ఎట్లా; ఏవిధంగా;
  • howdah, n. అంబారీ; ఏనుగు మీద సవారీ చెయ్యడానికి వీలయిన కుర్చీ;
  • howitzer, n. పొట్టి ఫిరంగి;
  • how many, adv. neuter. ఎన్ని;
  • how many people, adv. ఎంతమంది; ఎందఱు;
  • how much, adv. ఎంత?
  • hub, n. (1) నడిబొడ్డు; నాభి; చక్రనాభి; బండికన్ను; నట్టు; చక్రంలోకి ఇరుసు వెళ్లే స్థానం; (2) కూడలి; రహదారులు కానీ, తీగలు కానీ ఒక చోట కలుసుకునే స్థలం;
  • hubbub, n. హంగామా; హడావిడి; గడబిడ; అలజడి; కోలాహలం; గలభా; సందడి;
  • hue, n. వన్నె; డౌలు; జిగి; చాయ; ఒకే రంగులో ఉండే వివిధ చాయలు; colors with the same hue are distinguished with adjectives referring to their lightness and/or colorfulness, such as with "light blue", "pastel blue", "vivid blue". Exceptions include brown, which is a dark orange;
  • hug, n. ఆలింగనం; కౌఁగిలింత; పరిష్వంగం;
  • huge, adj. పెను; పెద్ద;
  • huge demon, ph. పెనుభూతం;
  • huge wind, ph. పెనుగాలి;
  • hull, n. (1) పొట్టు; (2) పడవ మట్టు;
  • hull, v. t. పొట్టు తీయు; దంచు;
  • hulled, adj. దంచిన;
    • - paddy, ph. బియ్యం;
    • - sesame seed, ph. పొట్టు తీసిన నువ్వులు; ఛాయ నూపప్పు;
  • hum, n. (1) రొద; సన్నని శబ్దం; (2) కూనిరాగం; (3) కలకలం; కోలాహలం; సందడి;
  • hum, v. i. కూనిరాగం తీయు;
  • human, adj. మానవ; మానవీయ; నర; పురుష; మానుష;
    • - rights, n. pl. మానవ హక్కులు; మానవాధికారాలు;
    • - endeavor, ph. పురుష ప్రయత్నం; మానవ ప్రయత్నం;
    • - sacrifice, ph. నరబలి;
  • human, n. మనిషి; m. మానవుడు; నరుడు; f. మానవి;
  • humane, adj. కరుణామయ; మానవత్వం గల; దయాళు; కృపాళు; సహృదయ; దయామయ; మానవోచిత;
  • humanism, n. మానవతా వాదం;
  • humanitarian, n. మానవతావాది; ఉపకారి; కరుణాళువు;
  • humanities, n. మానవీయ శాస్త్రాలు; మానవ అనుభవాలని, మానవ సంస్కృతులని వర్ణించే అధ్యయనాంశాలు; తత్త్వం, శిల్పం, కళలు, సాహిత్యం, సార్స్వతం, తర్కం, వగైరాలు ఈ శాఖలోకి వస్తాయి;
  • humanity, n. (1) మానవాళి; మానవకోటి; నరజాతి; మానవజాతి; (2) మానుషత్వం; మానవత్వం; మానవత; భూతదయ; కనికరము; పరహితేచ్ఛ;
  • humble, adj. గర్వం లేని; వినయం కల;
  • humbug, n. (1) మాయ; మోసం; (2) మాయలాడి; మోసగాడు;
  • humerus, n. దండెుముక;
  • humidity, n. తేమ; చెమ్మ; చెమ్మదనం; తడి; ఆర్ద్రత;
  • humiliate, n. అవమానపరచు; చిన్నబుచ్చు;
  • humiliation, n. అవమానం; పరాభవం;
  • humility, n. నిరాడంబరత్వం; అణకువ; వినయం; వినమ్రత; see also obedience;
  • humor, humour (Br.) n. (1) హాస్యరసం; హాస్యం; (2) రసం;
    • aqueous -, ph. నేత్ర రసం; జలాకార రసం;
    • vitrious -, ph. స్పటికాకార రసం; మేధ పటలం;
  • humorous, adj. హాస్యస్ఫోరక;
  • hump, n. (1) మూపురం; పశువుల వీపు మీద ఎత్తుగా ఉండే అవయవం; (2) దిబ్బ; ఎత్తుగా ఉన్న ప్రదేశం; (3) చిన్న అవరోధం;
  • hunchback, n. గూనివాఁడు; కుబ్జుఁడు;
  • hundred, n. వంద; నూఱు; శతం; నలుబాతిక;
    • - thousand, ph. లక్ష; వంద వేలు; మిలియనులో పదో వంతు;
    • - year lifespan, ph. శతాయుష్షు;
    • - poems, ph. శతకం:
  • hundredweight, n. 100 పౌండ్ల బరువు;
  • hunger strike, n. నిరాహార దీక్ష; నిరశన వ్రతం;
  • hunger, n. ఆఁకలి; క్షుత్తు; క్షుధ; అంగద;
  • excessive -, ph. అర్రాఁకలి;
  • hunt, n. వేఁట;
  • hunt, v. t. వేఁటాడు;
  • hunter, n. వేటగాఁడు; వ్యాధుఁడు; కిరాతుఁడు; బోయవాఁడు; భిల్లుఁడు; మృగయుఁడు; చెంచుఁడు;
  • huntress, n. f. వేటగత్తె; కిరాతకి; బోయది; భిల్లి; చెంచి;
  • hurdle, n. అడ్డంకి; ఆటంకం;
  • hurl, v. t. ఱువ్వు;
  • hurly-burly, n. సందడి;
  • hurricane, n. ప్రభంజనం; పెద్ద గాలివాన;
  • hurt, v. t. నొప్పించు;
  • husband, n. మగఁడు; పెనిమిటి; భర్త; పతి; నాధుఁడు; ఏలిక;
    • hen-pecked -, ph. భార్యా విధేయుఁడు;
  • husbandry, n. పెంపకం; కృషి; నిర్వహణ;
  • hush money, n. లంచం; లాంఛనం;
  • husk, n. ఊఁక; పొట్టు; పొల్లు; చిట్టు;
  • hut, n. (1) గుడిసె; కుటి; కుటీరం; (2) పర్ణశాల;
  • hyacinth, n. హయరింఖ; ఒక రకం నీటి మొక్క;
  • Hyades, n. రోహిణీ సహిత నక్షత్రాలు; సప్తర్షి నక్షత్రాలు;
  • hybrid, adj. సంకర; కంచర;
  • hybrid, n. ఇబ్బంది; కంచరం; అయ్యపరెడ్డి; cross-breed;
  • hybrid, adj. సంకర; కంచర; చంపూ, caMpU
  • hybridization, n. సంకరీకరణం; సంకరణం;
  • Hydra, n. (1) ఆశ్రేష నక్షత్ర సమూహం; హైడ్రాలోని డెల్టా, ఎప్సిలాన్, ఈటా, రో అనే నక్షత్రాలని గుత్తగుచ్చి ఆశ్రేష అంటారు; (2) ఒక జంతువు;
  • hydrated, adj. ఉదన్వంతం;
  • hydraulic, adj. జలపీడిత;
  • hydraulics, n. నీటిలోని ఒత్తిడిని శక్తిగా మార్చే విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం;
  • hydrocarbon, n. ఉదకర్బనం; (lit.) liquid carbon; carbon in liquid form;
    • straight -, ph. బారు ఉదకర్బనం;
    • cyclic -, ph. చక్రీయ ఉదకర్బనం;
    • - radical, ph. ఉదకర్బన రాశి; ఒకటికి మించి ఉదజని అణువులని తొలగించగా రిక్త హస్తాలతో మిగిలిన ఉదకర్బనపు బణువు;
  • hydrocele, n. బుడ్డ; వరిబీజం;
  • hydrocephalus, n. జలశీర్షం; మస్తిష్కశోఫ; శీర్షబూదరం:
  • hydrochloric acid, n. ఉదహరి కామ్లం; శంఖ ద్రావకం; HCl;
  • hydrocotyle, n. సరస్వతీ ఆకు;
  • hydrodynamics, n. జలచలనం; జలగతి శాస్త్రం;
  • hydroelectricity, n. జలోద్భవ విద్యుచ్ఛక్తి; జలవిద్యుత్తు;
  • hydrogen, n. ఉదజని; (ety.) నీటియొక్క జననానికి కారణమైనది; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 1, సంక్షిప్త నామం, H)
    • - bond, ph. ఉదజని బంధం; రెండు బణువుల మధ్య ఉండే విద్యుదయస్కాంతతత్త్వంతో కూడిన ఆకర్షక బంధం; ఒక కర్బనం అణువుతో ఉదజని అతుక్కుని ఉదకర్బనాలుగా తయారయేటప్పుడు ఈ రకం బంధం కనిపిస్తుంది;
  • hydrogenated, adj. ఉదజనీకృత;
    • - oil, ph. ఉదజనీకృత తైలం; వనస్పతి; (వనస్పతి అంటే ఉదజనీకృత శాకజనిత తైలం);
  • hydrogenation, n. వనస్పతీకరణం; ఉదజనీకృతం; నూనెలలోకి ఉదజనిని పంపి గడ్డకట్టించడం;
  • hydrology, n. జలరాశిశాస్త్రం; జలతంత్రం;
  • hydrolysis, n. జలవిశ్లేషణ; జలవిచ్ఛేదన;
  • hydrophobia, n. జలోన్మాదం; నీటిని చూసినా, నీటి శబ్దం విన్నా నీటిని తాకినా భయం వెయ్యడం; (note) ఈ లక్షణాలు పిచ్చి కుక్క కరచినప్పుడు కాని అడవి జంతువులు కరచినప్పుడు కాని వచ్చే రేబీస్ వ్యాధికి గుర్తు;
  • hydrosphere, n. జలావరణం;
  • hydroxide, n. ఉదామ్లం;
    • calcium -, ph. ఖటిక ఉదామ్లం; సున్నం;
  • hydroxyl, adj. [chem.] ఉదామ్ల;
  • hydroxyl group, ph. [chem.] ఉదామ్ల గుంపు; (-OH)
  • hyena, n. (హయీనా) దుమ్ములగొండి; గాడిదపులి; కొర్నవగండు;
  • hygiene, n. ఆరోగ్యశాస్త్రం; ఆరోగ్య సూత్రాలు;
  • hygroscopic, adj. జలశోషణ;
  • hymen, n. కన్నెతెర; యోనిమార్గంలో ఉండే పొర;
  • hymn, n. కీర్తన; స్తోత్రం; దండకం; పొగుడుతూ పాడే పాట;
  • hyper, adj. pref. అతి; ఎగువ; పెద్ద; పై; అధి;
  • hyperbola, n. (హైపర్ బొలా) అతివలయం;
  • hyperbole, n. (హైపర్ బొలీ) అతిశయోక్తి; ఉన్నదానిని గొప్పగా వర్ణించుట;
  • hyperbolic, adj. అతివలయ ఆకారపు;
  • hyperbolic space, ph. అతివలయ ఆవరణం;
  • hyper-conjugation, ph. అతి సంయుగ్మం;
  • hyper-correct, adj. అతిశోధిత;
  • hypergamous, adj. అనులోమ; (lit.) along the direction of the hair; along the grain;
  • hyperhydrosis, n. అతిస్వేదం; అతిగా చెమట పట్టడం;
  • hyperlink, n. అధిలంకె; పరిలంకె; పరిసంధి; అతిఅంకె; కంప్యూటర్లలో ఒక పుటలోని ఉన్న పాఠ్యాంశాన్ని మరొక చోట విపులంగా వివరించడానికి గాను రెండు పాఠ్యాంశాలని బంధించే లంకె;
  • hypermetropia, n. చత్వారం;
  • hypersphere, n. అతిగోళం;
  • hypertension, n. రక్తపోటు; అతిపోటు; రక్తపు పీడనం పెరగడం;
  • hypertext, n. కంప్యూటర్లలో ఒక పుటలోని ఉన్న పాఠ్యాంశాన్ని మరొక చోట విపులంగా వివరించడానికి గాను పాఠ్యాంశాన్ని అమర్చే విధానం;
  • hypnospores, n. సుప్తబీజాలు;
  • hypnosis, n. నిద్ర తెప్పించే శాస్త్రం; నిద్ర తెప్పించి వశీకరించుకునే వైద్య పద్ధతి;
  • hypnotize, v. t. నిద్ర తెప్పించి వశీకరించు;
  • hypochondria, n. రోగభ్రాంతి; రోగభ్రమ;
  • hypo, pref. తక్కువ; దిగువ; కింద; చిన్న; లోనికి; లోనికి వెళ్ళే; లోనికి పీల్చుకునే;
  • hypocrisy, n. ఆత్మవంచన; జిడికిరింత; డంభాచారం; బూటకం; కైతవం; కాపట్యం; కపటత్వం; ఛలం; మిథ్యాచారం;
  • hypocrite, n. కాప్యకారి; రుద్రాక్షపిల్లి; బూటకాలమారి; ఆత్మవంచకుడు; కపటశీలి; డంభాచారి;
  • hypodermic, adj. చర్మం లోనికి పోయే;
  • hypogamous, adj. ప్రతిలోమ; (lit.) against the direction of the hair; against the grain;
  • hypotenuse, n. కర్ణం; దీర్ఘ కర్ణం; సమకోణ త్రిభుజంలో లంబకోణానికీ ఎదురుగా ఉన్న భుజం;
  • hypothermic, adj. వేడిని పీల్చుకొనే;
  • hypothesis, n. s. ప్రాతిపదిక; ప్రతిపాదన; ప్రాక్కల్పన; ఉపపాద్యం; పరికల్పన; ప్రకథనం; అభిప్రాయం; pl. hypotheses;
  • hypothetical, adj. ఊహాత్మక; ప్రతిపాదనాత్మక;
  • hysteria, n. కాకిసొమ్మ; అపస్మారం; అపస్మారకం;

మూలం