"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (M)

From tewiki
Jump to navigation Jump to search

నిఘంటువు

 • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
 • This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as n added feature.
 • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
 • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: Ma-Me

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • mace, n. (1) గద; (2) జాపత్రి; జాజికాయ లోపల ఉన్న గింజ చుట్టూ వలలా ఉన్న కవచమే జాపత్రి; జాజికాయ ని nutmeg అనిన్నీ, జాపత్రిని mace అనిన్నీ అంటారు;
 • machination, n. పథకం; కుట్ర;
 • machine, n. యంత్రం; మర; జంత్రం; మిషను;
  • sewing -, ph. కుట్టు మిషను;
  • - learning, ph. యాంత్రికాభ్యాసం; యాంత్రిక అభ్యాసం; యంత్రాలకి స్వయం ప్రతిభతో పనులు చెయ్యడం ఎలాగో నేర్పే శాస్త్రం;

---Usage Note: machine, appliance, device, gadget, tool.

 • ---Machine is a generic word for a piece of equipment that needs electricity or another type of power. An appliance is a large machine that is used in the home.
 • machinery, n. యంత్రాంగం; యంత్రసముదాయం;
 • Machiavellian, n. మేకీవిల్లియం; కౌటిల్యం; కుటిల రాజనీతి;
 • macro, adj. స్థూలమైన; పేద్ద; మహా;
 • macrocosm, n. స్థూలప్రపంచం; విశ్వం; ప్రపంచం;
 • macrophage, n. మహాబక్షణి; కణబక్షక కణాలలో కల్లా పెద్దగా తినమరిగిన కణం;
 • mad, n. పిచ్చి; వెర్రి; ఉన్మత్తత;
 • madam, n. స్త్రీ;
 • mademoiselle, n. (మేమ్యుజెల్) కుమారి; అవివాహిత;
 • made, pt. & pp. make;
 • madness, n. పిచ్చితనం; వెర్రితనం; ఉన్మత్తత;
 • maelstrom, n. (1) సుడిగుండం; (2) గందరగోళమైన పరిస్థితి;
 • mafia, n. ముష్కరమూక; చట్టవ్యతిరేకమైన పనులు చేసే రహస్య ముఠా;
 • magazine, n. (1) పత్రిక; సంచికల వారీగా ప్రచురితమయే పత్రిక; (2) తుపాకీలో గుళ్ళు అమర్చే సొరుగులాంటి సదుపాయం; గుళ్ళగిడ్డంగి;
 • maggot, n. ఈగ గుడ్డు; మక్షిక డింభం;
 • magic, n. ఇంద్రజాలం; కనికట్టు; మాయ; మంత్రం;
  • - wand, ph. మంత్ర దండం;
 • magician, n. ఇంద్రజాలికుడు; మాంత్రికుడు; మాయలాడి;
 • magnate, n. ఘనుడు; అగ్రగణ్యుడు; పెద్ద;
  • business -, ph. పెద్ద వ్యాపారస్తుడు;
 • Magnesium, n. మగ్నం; మెగ్నీసియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 12, సంక్షిప్త నామం, Mg);
  • - sulfate, ph. మగ్నగంధకితం; మహాగ్నీషగంధకితము; MgSO4;
 • magnet, n. సూదంటురాయి; అయస్కాంతం; స్కాంతం; లోహకాంతం; చుంబకం;
  • bar -, ph. అయస్కాంతపు కడ్డీ; అయస్కాంత దండం; దండాయస్కాంతం;
  • iron -, ph. అయస్కాంతం;
 • magnetic, adj. అయస్కాంత తత్వం; చుంబక; చుంబకీయ;
  • - field, ph. అయస్కాంత క్షేత్రం;
  • - pole, ph. అయస్కాంత ధ్రువం;
 • magnetism, n. (1) అయస్కాంత తత్వం; లోహచుంబకత్వం; (2) ఆకర్షణ;
 • magnetite, n. కాకిరాయి; ఇనుము యొక్క ముడి పదార్థం; Fe3O4;
 • magnetization, n. అయస్కాంతీకరణం; స్కాంతీకరణం; ఒక వస్తువుకి అయస్కాంతపు లక్షణాలు వచ్చేలా చెయ్యడం;
 • magnetosphere, n. అయస్కాంతావరణం; భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం;
 • magnification, n. ఆవర్ధనం; పెద్దగా చెయ్యడం;
 • magnitude, n. పరిమాణం; పరిమేయత; స్థూలత్వం; కాయస్తం; మహత్వం; ప్రాముఖ్యం; తరగతి;
  • star of the first -, ph. మొదటి తరగతి తార; మొదటి తరగతి తార ఆరవ తరగతి తార కంటె 100 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; మొదటి తరగతి తార రెండవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; రెండవ తరగతి తార మూడవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; ఒక తరగతి తేడా ఉంటే వాటి ప్రక్శత్వంలో ఉరమరగా 100 కి పంచ-మూలం (fifth-root of 100) అంత తేడా ఉంటుంది. ఉదాహరణకి సిరియస్ నక్షత్రం ప్రకాశత్వం -1.47. అక్కడ నుండి 40 డిగ్రీలు ఈశాన్యంగా కనిపించే వసాత్ నక్షత్రం ప్రకాశత్వం 3.53. కనుక వసాత్ అయిదవ తరగతి నక్షత్రం అవుతుంది కనుక వసాత్ వసాత్ కంటె సిరియస్ ప్రకాశత్వం 100 రెట్లు ఎక్కువ!
  • star of the fourth -, ph. నాల్గవ తరగతి తార;
  • - of a star (absolute), ph. పరమ ప్రకాశత్వం; నక్షత్రాన్ని 10 పార్సెక్‍ లు = 36.6 జోతిర్వషాల దూరంలో ఉంచితే ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో అదే ఆ నక్షత్రం యొక్క పరమ ప్రకాశత్వం;
  • - of a star (apparent), ph. దృష్ట ప్రకాశత్వం; మామూలుగా నక్షత్రాన్ని కంటితో చూసినప్పుడు కనిపించే ప్రకాశత్వం; ఇది ఆ నక్షత్రం యొక్క స్వయం ప్రకాశత్వం మీదా, ఆ నక్షత్రానికీ, ప్రేక్షకునికీ మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుంది; దీనిని బట్టే నక్షత్రం యొక్క తరగతి నిర్ణయిస్తారు;
 • magnify, v. t. పెద్దదిగా చేయు;
 • magnifying glass, n. భూతద్దం;
 • maid, n. (1) కన్య; వివాహము కాని బాలిక; (2) ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
  • - servant, ph. దాసి; పనిమనిషి; ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
 • maiden, n. కన్య; పెళ్లి కాని పిల్ల;
 • maiden, adj. ప్రప్రథమమైన;
 • maim, v. t. గాయపరచు; అంగవైకల్యం చేయు; అవిటిగా చేయు;
 • main, adj. ప్రధాన; ముఖ్య;
  • - points, ph. ముఖ్యాంశాలు;
 • mainstay, n. ఆధారం;
 • maintain, v. t. (1) కాపాడు; రక్షించు; పోషించు; (2) నడిపించు;
 • maintainer, n. పరిపోషణ కర్త; సంరక్షకుడు; పోషకుడు;
 • maintenance, n. (1) పరిపోషణ; సంరక్షణ; పోషణ; కాపు; భృతి; ఆలన; (2) భరణం; మనువర్తి; (3) నిర్వహణ;
 • maize, n. మొక్కజొన్న; corn;
 • majestic, adj. గంభీరమైన;
 • major, n. యుక్తవయస్సు వచ్చిన వ్యక్తి; (ant.) minor;
 • major, adj. భారీ; పెద్ద; దీర్ఘ;
 • major axis, n. దీర్ఘ అక్షం; బృహదక్షం; దీర్ఘ వృత్తంలో కేంద్రం నుండి దూరబిందువు దిశలో గీసిన రేఖ;
 • majority, n. (1) సంఖ్యాధికత్వం; అధికసంఖ్యాకులు; మెజారిటీ; (2) యుక్తవయస్సు; మెజారిటీ;
  • silent -, ph. అధికసంఖ్యాక మౌనభూషణులు;
 • make, n. చేత; పని;
 • make, v. t. చేయు;
  • - believe, ph. నమ్మేటట్లు చేయు; నటన; కనుకట్టు;
 • makeup, n. (1) [cinema] ముస్తాబు; అలంకరణ; అంగరచన; రూపశిల్పం; (2) నిర్మాణం; నిర్మాణక్రమం;
 • mal, pref. తప్పు; చెడు; దుర్; వక్ర; కు; మల;
 • Malabar batmint, n. మాభేరి;
 • Malabar nightshade, n. అల్లుబచ్చలి;
 • Malabar nut, n. అడ్డసరం;
 • malady, n. వ్యాధి; జబ్బు; రోగం;
 • malapropism, n. అర్థం లేని శబ్ద ప్రయోగం;
 • malaria, n. మన్నెపు జ్వరం; కొండ జ్వరం; చలిజ్వరం; మలేరియా; (lit.) చెడుగాలి;
 • male, adj. మగ; కోడె; పోతు; పుంజు; గండు;
  • - bee, ph. పోతుటీగ;
  • - buffalo, ph. ఎనుబోతు;
  • - cat, ph. పోతుపిల్లి;
  • - cuckoo, ph. గండు కోయిల;
  • - elephant, ph. పోతుటేనుగు;
  • - fowl, ph. పుంజు;
  • - fox, ph. నక్కపోతు;
  • - snake, ph. కోడె త్రాచు;
 • male, n. మగవాడు; పురుషుడు; మగ జంతువు;
 • malevolence, n. అక్షాంతి; --see also envy
 • malice, n. ద్వేషం; కార్పణ్యం; ఈర్ష్య; జుగుప్స; శత్రుత్వం; పగ; దుష్టభావం;
 • malicious, adj. ద్వేషపూరిత; ద్రోహచింతగల;
 • malign, v. t. దుర్భాషలాడు; దూషించు;
 • mall, n. అంగడిల్లు; ఒకే చోట అనేక విక్రయ సాలలు ఉన్న భవనం;
 • malleable, adj. సుతిమెత్తని; సుత్తితో కొట్టుటవలన సాఁగునట్టి; ఒత్తిడి వల్ల రూపం మారే గుణం కల;
 • mallet, n. కొయ్యసుత్తి; కొయ్యగూటం; కర్ర సమ్మెట; కాజం;
 • malleus, n. కూటకము; మధ్య చెవిలో సుత్తి ఆకారంలో ఉండే ఒక చిన్న ఎముక;
 • malnutrition, n. కుపోషణ; పోషణ చాలకపోవడం; పోషణచాలిమి;
 • malodor, n. దుర్వాసన; దుర్గంధం; కంపు; నీచుకంపు; గవులు; పూతిగంధం; వసాగంధం; గబ్బు కంపు;
 • malodorous, adj. పూతిగంధిల; వసాగంధిల; దుర్గంధ పూరిత; దుర్గంధమైన; కంపుకొట్టే;
 • malt, n. నారు; మొలక; మోక; నిసువు; ఈరిక; ఉప్పిళ్లు;
  • - liquor, ph. నారునీరా; మొక్క మొలిచే వరకు బార్లీ గింజలని నానబెట్టి, వాటితో చేసిన సారా;
 • mammal, n. s. క్షీరదం; స్తన్యదం; పిల్లలకి పాలిచ్చే జంతువు; జరాయుజములు;
 • mammilla, n. ౘనుమొన;
 • man, n. (1) మానవుడు; మనిషి; జంతువు కాదనే భావం; (2) మగాడు; పురుషుడు; స్త్రీ కాదనే భావం; (3) పెద్దవాడు; పిల్లవాడు కాడనే భావం;
  • family -, ph. గృహమేధి; గృహస్థు;
  • middle -, ph. మధ్యవర్తి;
  • respectable -, ph. గృహమేధి;
 • man-made, adj. పౌరుషేయము; మనిషి చేసినది;
 • manage, v. t. నిర్వహించు; పెత్తనముచేయు; పరిపాలించు; అదుపులోపెట్టు; నడిపించు; నెట్టుకువచ్చు; అజమాయిషీ చేయు;
 • manager, n. నిర్వాహకుడు; అధినేత; పెత్తందారు; అజమాయిషీదారు; వ్యవహర్త; ప్రవర్తకుడు; ఉపదర్శి; మేనేజరు; (rel.) యజమాని;
 • management, n. అజమాయిషీ; అధ్వర్యం; నిర్వాకం; పెత్తనం; యాజమాన్యం; యోజన;
  • financial -, ph. విత్తయోజన;
 • mandate, v. t. శాసించు; విధించు; ఆజ్ఞాపించు;
 • mandatory, adj. విధాయకమైన; తప్పనిసరి;
 • mandible, n. చిబుకాస్తి;
 • mane, n. జూలు; గుర్రం, సింహం మొ. జంతువుల మెడమీద వెంట్రుకలు;
 • man-eater, n. (1) నరమాంసానికి మరగిన పులి; (2) నరమాంస భక్షకుడు; పొలదిండి;
 • maneuver, n. జిత్తు; యుక్తి; ఉపాయం;
 • Manganese, n. మంగనం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 25, సంక్షిప్త నామం, Mn); [Lat. magnes = magnet];
 • manger, n. కొల్లం; పశువులకు మేత వేసే తొట్టి;
 • mango, n. (1) మామిడి; మావి; రసాలం; మాకంద పండు (2) మామిడిపండు; మామిడికాయ;
  • - juice, ph. మామిడి పండు రసం;
  • - fruit, ph. మామిడి పండు; మామిడి కాయ;
  • - stone, ph. మామిడి టెంక;
  • - pulp, ph. మామిడి పండు ముద్ద; తాండ్ర;
 • mangoes, types of, ph. పలురకాల మామిడిపళ్ళు; చెరకు రసాలు; పెద్ద రసాలు; చిన్న రసాలు; పంచదార కలశ; ఎండ్రాసు; నూజివీడు రసాలు; సువర్ణరేֻఖ; బంగినపల్లి; కలక్టరు; జహంగీరు; కోలంగోవా; నీలాలు;
 • mangrove, n. మడ; మడచెట్టు; నల్లమడ; సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు;
  • forest -, ph. మడాడవి; మడారణ్యం;
 • mania, n. వెర్రి; వేలంవెర్రి; వ్యామోహం; ఉన్మాదం; మేనియా;
  • kleptomania, ph. దొంగతనం చెయ్యాలనే వెర్రి కోరిక; చౌర్యోన్మాదం;
  • nymphomania, ph. విపరీతమైన లైంగిక వాంఛ;
 • maniac, n. వెర్రివాడు; అదుపులో లేని బుద్ధులు కలవాడు; ఉన్మాది;
  • kleptomaniac, ph. అసంకల్పచోరుడు; చౌర్యోన్మాది;
  • nymphomaniac, ph. రిరంసువు; విపరీతమైన లైంగిక వాంఛగల స్త్రీ; see also succubus and incubus;
 • manifestation, n. సాక్షాత్కారం; వ్యంజితం; వివర్తం; వ్యాకృతం; ఆవిర్భావం; వ్యక్తి;
 • manifested, n. వ్యక్తము; వ్యంజితం;
 • manifesto, n. ఆదర్శ తరంగిణి; ఆదర్శాలు రాసిన ప్రచురణ; ప్రణాళిక;
  • communist -, ph. కమ్యూనిష్టు వారి ఆదర్శాలు రాసిన ప్రచురణ;
  • election -, ph. ఎన్నికల ప్రణాళిక;
 • Manila envelope, n. టపా చెయ్యడానికి అనుకూలమైన గోధుమ రంగు కాగితపు సంచి;
 • mankind, n. మానవజాతి;
 • manliness, n. మగతనం; మగటిమి;
 • manner, n. తీరు; తరహా; వరస; వాటం; వైఖరి; వ్యవహారం; రీతి; విధం; ఫక్కీ; ప్రకారం; బాపతు; పగిది, pagidi
 • manners, n. నడవడి; ప్రవర్తన;
 • manor, n. భవనం;
 • manpower, n. అంగబలం; బలగం;
 • mansion, n. భవనం; సౌధం; హర్మ్యం; పటారం; హవేలీ;
 • manslaughter, n. నరవధ; నరహత్య;
 • mantel, n. తీనె;
 • mantis, n. గొల్లభామ; మిడత;
  • praying -, ph. దండాల మిడత;
 • mantissa, n. ఘాతభిన్నాంకం;
 • mantle, n. (1) ముసుగు; కప్పు; పైపొర; ప్రావారం; ఉత్తరీయం; వల్కలం; ఆచ్ఛాదనం; (2) ఒక రకం దీపపు వత్తి; (3) భూగర్భంలో ఉండే ఒక పొర;
 • manual, adj. కై; చేతి; కాయిక; చేతికి సంబంధించిన;
  • - labor, ph. కూలి; కాయ కష్టం;
  • - support, ph. కై దండ;
 • manual, n. చేతి పుస్తకం; కైపొత్తం;
 • mantle, n. (1) ముసుగు; కప్పు; వల్కలం; ఆచ్ఛాదనం; (2) ఒక రకం దీపపు వత్తి;
 • manufacture, n. తయారీ; ఉత్పత్తి;
 • manufacturers, n. ఉత్పత్తిదారులు; తయారీదారులు;
 • manure, n. ఎరువు; గత్త; గొబ్బరం; పాంశువు;
  • leaf -, ph. ఆకెరువు;
  • cow -, ph. పేడెరువు; సస్యార్ధసంచిత గోమయం;
 • manuscript, n. చేతితో రాసినది; చేతితో రాసిన గ్రంథం; (rel.) typescript;
 • many, adj. చాల; ఎన్నో; పెక్కు; పలు; అనేక;
  • - people, ph. ఎంతోమంది; పెక్కురు; పలువురు; అనేకులు;
 • map, n. పటం; దేశపటం; నక్ష; మానచిత్రం; మేపు;
 • mar, v. t. పాడుచేయు; చెడగొట్టు;
 • maraud, v. i. కొల్లగొట్టు;
 • marble, n. (1) పాలరాయి; చలువరాయి; సున్నపురాయి; సంగమల; (2) గోలీకాయ; అల్లికాయ;
 • march, v. i. నడుచు; పోవు;
 • march, v. t. నడిపించు;
 • mare, n. (1) ఆడగుర్రం; ఘోటిక; గోడిగ; బడబ; (2) ఆడ గాడిద;
 • mare's nest, ph. [idiom] గాడిద గుడ్డు; అసంభవమైనది; కుందేటి కొమ్ము;
 • margarine, n. వనస్పతి; మార్జరీను;
 • margin, n. బద్దె; అంచు; ఉపాంతం; వార; మార్జిన్;
  • bottom -, ph. నీచోపాంతం;
  • left -, ph. వామోపాంతం; ఎడమ అంచు;
  • right -, ph. కుడి బద్దె; కుడి అంచు; దక్షిణోపాంతం;
  • top -, ph. మీద బద్దె; మీద అంచు; శీర్షోపాంతం;
 • marginal, adj. ఉపాంతర; బొటాబొటీ;
 • marginalize, n. ఉపాంతరీకరించు;
 • margosa, n. వేప; same as neem;
 • mariana trench, n. మరియానా కందకం;
 • marigold, n. బంతి; బంతిపువ్వు;
 • marinate, v. t. ఊరబెట్టు;
 • marine, adj. సాగర;
 • mariner, n. నావికుడు;
 • marital, adj. వైవాహిక; దాంపత్యపు;
  • - problems, ph. దాంపత్యపు స్పర్ధలు;
 • marjoram, n. (1) మరువం; (2) పాశ్చాత్యదేశాల వంటలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum marjorana; ok
 • marijuana, n. గంజాయి; మేరువానా; [bot.] Cannabis sativa; గంజాయి మొక్క నుండి వచ్చిన మొగ్గలు, పువ్వులు, ఆకులు, వగైరా ని ఎండబెట్టి. చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; (rel.) హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు;
 • mark, n. (1) సూచిక; కెతనం; ఆనవాలు; (2) మరక; (3) గుణాంకం; మార్కు;
  • diacritical -, ph. శబ్దసూచిక; శబ్దలక్షణ సూచిక;
  • first -, ph. ప్రథమ గుణాంకం;
 • mark, v. t. గుర్తువేయు;
 • Markab, n. పూర్వాభాద్ర; ఒక నక్షత్రం పేరు;
 • marker, n. సాభిజ్ఞానం; గుర్తు;
 • market, v. t. అమ్ము; విక్రయించు;
 • market, n. సంత; అంగడి; బజారు; విపణి; మార్కెట్;
  • fish -, ph. మైలసంత; చేపల బజారు;
  • meat -, ph. మైలసంత;
  • vegetable -, ph. మడిసంత;
 • market street, ph. విపణి వీధి; అంగడి వాడ;
 • marketable, adj. అమ్ముడు పోగల;
 • marketing, n. విక్రయం;
 • marking nut, n. నల్ల జీడిపిక్క;
 • maroon, n. ముదరెఱుపు రంగు;
 • marriage, n. వివాహం; పెండ్లి; పెళ్ళి; దాంపత్యం; (rel.) wedding;
  • hypergamous -, ph. అనులోమ వివాహం;
  • hypogamous -, ph. ప్రతిలోమ వివాహం;
 • marrow, n. (1) మజ్జ; మూలుగు; మేద; మేదస్సు; కుల్యిక; అస్థిసారం; ఎముక సొన; ఎముకల లోపల ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం; (2) దవ్వ;
 • marry, v. i. వివాహమాడు; చేపట్టు; పెండ్లి చేసుకొను; పెండ్లాడు; చేసుకొను;
 • marry, v. t. వివాహం చేయు; పెండ్లి చేయు;
 • Mars, n. అంగారకుడు; అంగారక గ్రహం; మంగళ గ్రహం; కుజుడు;
 • marsh, n. చిత్తడినేల; పంకభూమి; మురుగునేల; ఉబ్బనేల; పర్ర; కరవాక;
  • salt -, ph. కరవాక;
  • - gas, ph. చిత్తడి వాయువు; పంక వాయువు;
మారుగుళ్ల దొడ్డి
 • marshalling yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు పెట్టలని ఒక వరసలో అమర్చడానికి వాడే ప్రదేశం;
 • mart, n. వ్యాపారస్థలం; కొట్టు; షాపు;
 • martin, n. ఏట్రింత పిట్ట;
 • martynia, n. తేలుకొండి కాయ;
 • martyr, n. త్యాగాళువు; త్యాగి; తన లక్ష్యసిద్ధికి ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి;
 • marvel, n. వింత; విడ్డూరం; విచిత్రం;
 • mascara, n. కాటుక; కళ్ళకి పూసుకునే ఒక అలంకారం; అంజనం;
 • macerated, adj. భావన; నానబెట్టిన; ఊరబెట్టిన;
  • - ginger, ph. భావన అల్లం; పంచదారలో ఊరబెట్టిన అల్లం;
 • masculine, adj. మగ; పుంభావ; పుం;
 • masculine gender, ph. పుంలింగం;
 • masculinity, adj. మగతనం; మగటిమి; పుంభావం;
 • mashed, adj. ఎనిపిన; ముద్ద చేసిన;
 • mask, n. ముసుగు; ప్రచ్ఛాదకి; బురఖా;
 • mask, v. t. ముసుగు వేయు; కప్పు; ప్రచ్చాదించు;
 • masochism, n. ఆత్మ హనన కారుణ్యం; మజోకిస్టులా ప్రవర్తించే తత్వం; తన శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడలో ఆనందం పొందలేని వింత మానసిక తత్వం; తనకు హాని జరిగే విధంగా ప్రవర్తించే తత్వం; see also sadism;
 • masochist, n. మజోకిస్టు; శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడను ఆనందించలేని వ్యక్తి; తనకే హాని జరిగే విధంగా ప్రవర్తించే వ్యక్తి;
 • mason, n. తాపీ పనివాడు; కాసీదు; కాసే పనివాడు; రాతి పనివాడు; ఇటిక పనివాడు; కుడ్యకారుడు;
 • mason's level, n. మూలమట్టం;
 • masonry, n. కట్టడం; రాతి కట్టడం; ఇటిక కట్టడం;
  • brick -, ph. ఇటిక కట్టడం;
  • stone -, ph. రాతి కట్టడం;
 • mass, adj. తండ; సామూహిక; మూకుమ్మడి;
  • - action, ph. తండ చర్య;
  • - arrests, ph. మూకుమ్మడి నిర్భంధాలు; మూకుమ్మడి ఆపుదలలు;
  • - burial, ph. సామూహిక ఖననం; తండ ఖననం;
  • number, ph. గరిమ సంఖ్య; ఒక మూలకపు అణుగర్భంలో ఉండే ప్రోటానులు, నూట్రానుల మొత్తపు సంఖ్య; ఉదాహరణకి సాధారణ కర్బనంలో 8 ప్రోటానులు, 4 నూట్రానులు ఉంటాయి కనుక కర్బనం గరిమ సంఖ్య 12; ఒక మూలకానికి సమభాగులు ఉన్నయెడల ప్రోటానులని, నూట్రానుల సగటు విలువని కలపగా వచ్చిన సంఖ్య;
 • mass, n. రాసి; ద్రవ్యరాసి; ధుర; తండం; పుద్గాలం; గరిమ; ముద్ద; భారం; కాయస్థం;
  • center of -, ph. గరిమనాభి;
  • inertial -, ph. గరిమ గురుత్వం; జడత్వ గురుత్వం;
 • massacre, n. జనసంహారం; నరమేధం;
 • massage, n. మర్దనా; మాలీసు; సంవహనం;
 • massage, v. t. మర్దనా చేయు; మాలీసు చేయు; ఒత్తు; పిసుకు;
 • masseur, n. m. సంవాహకుడు; అంగమర్ధనుడు; మర్దనా చేసే పరిచారకుడు;
 • masseuse, n. f. మర్దనా చేసే పరిచారిక; సంవహనకి;
 • masses, n. జనాలు; ప్రజ; ప్రజానీకం; మంది; జనసామాన్యం; జనబాహుళ్యం; జనసందోహం;
 • massive, adj. గురుతరమైన; స్థూల;
 • massiveness, n. గురుత్వం; గరిమత్వం; భారీతనం;
 • mass number, ph. గరిమ సంఖ్య; అణు గర్భంలో ఉండే ప్రోటానులు, నూట్రానులు ఎన్ని ఉన్నాయో చెప్పే పూర్ణాంకం;
 • mast, n. కూపకం; స్తంభం; తెరచాప కొయ్య; కంబం;
 • master, n. (1) యజమాని; ఓజు; ఖామందు; (2) గురువు; ఆచార్య; (3) ప్రవీణుడు; నేర్పరి; (4) సంధాత;
  • - of ceremonies, ph. కార్యక్రమపు సంధాత;
  • - plan, ph. బృహత్ ప్రణాళిక; పెద్ద ప్రణాళిక;
 • masticate, v. t. నములు;
 • mastication, n. నములుట; చర్వణం;
 • mastitis, n. స్తనసోఫ; స్తనముల వాపు;
 • masturbation, n. ముష్టిమైథునం; హస్తప్రయోగం; మర్మస్థానాలని చేతితో తాకి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం;
 • mat, n. చాప; కిలంజం;
  • - for meditation, ph. చిత్రాసనం;
 • match, n. (1) అగ్గిపుల్ల; (2) ఉజ్జీ; ఉద్ది; జత; సమానమైనది; ఎన; పొంతన; (3) ఆట; పందెం; ఎదురు; పోటీ; (4) సంబంధం; వివాహనిర్ణయం;
  • - box, ph. అగ్గిపెట్టె;
  • - stick, ph. అగ్గిపుల్ల;
 • matching, adj. నప్పిన; జోడు కుదిరిన;
 • matchless, adj. ఎనలేని; సాటిలేని; అతులిత;
 • matchmaker, n. పెళ్ళిళ్ళ పేరయ్య;
 • mate, n. భార్య; సహధర్మచారిణి; భార్య; సహధర్మచారుడు; సహాధ్యాయి; సహాధ్యాయుడు;
 • mate, v. i. జత చేరు; వివాహం చేసికొను; రతిక్రీడ చేయు;
 • Materia medica, n. పదార్థ గుణ సంహిత; ఔషధ లక్షణ సంగ్రహం; వస్తుగుణ ప్రకాశిక; వస్తుగుణ దీపిక;
 • material, adj. భౌతికమైన; స్థూల; వస్తు; ఉపాదాన;
  • - body, ph. స్థూల దేహం;
  • - cause, ph. ఉపాదాన కారణం;
  • - resources, ph. భౌతిక వనరులు;
  • - world, ph. భౌతిక ప్రపంచం; స్థూల ప్రపంచం;
  • - universe, ph. భౌతిక ప్రపంచం; వస్తు ప్రపంచం;
 • material, n. (1) పదార్థం; సరుకు; సంభారం; (2) విషయం; (3) గుడ్డ;
  • raw -, ph. ముడిపదార్థం; ముడిసరుకు; ముడి సంభారాలు;
 • materialist, n. కుక్షింభరుడు; కుక్షింభరి; భౌతికవాది; ప్రత్యక్షంగా కనిపించేదే ప్రధానమని వాదించే వ్యక్తి; అనాత్మవాది; లోకాయతికుడు;
 • materialistic, adj. కుక్షింభర; ప్రాపంచిక; భౌతిక; లోకాయత;
 • materialism, n. కుక్షింభరత్వం; భౌతికవాదం; లోకాయతం; భోగలాలసం;
 • materialize, v. i. (1) జరుగు; సంభవించు; (2) మూర్తీభవించు; కార్యరూపం దాల్చు; అకస్మాత్తుగా కనబడు;
 • maternal, adj. తల్లివైపునుండి; తల్లికి సంబంధించిన;
  • - uncle, ph. మేనమామ;
  • - uncle's daughter, ph. మేన వదిన; మేన మరదలు;
  • - uncle's son, ph. మేనబావ; బావ;
  • - uncle's wife, ph. మాతులాని; అత్త; అత్తమ్మ;
  • - grand mother, ph. అమ్మమ్మ;
 • maternity, adj. గర్భవతికి సంబంధించిన; ప్రసవానికి సంబంధించిన; పురిటికి సంబంధించిన; ప్రసూతి;
  • - hospital, ph. ప్రసూతి వైద్యశాల;
  • - ward, ph. పురుళ్ల వార్డు; ప్రసూతి విభాగం;
 • mathematical, adj. గణితాత్మక; గణిత; లెక్కల;
  • - brain, ph. లెక్కల బుర్ర;
  • - operation, ph. గణితాత్మక సంక్రియ; గణితాత్మక పరికర్మ;
 • mathematics, n. గణితం; లెక్కలు; గణిత శాస్త్రం; అంకశాస్త్రం; అంకవిద్య; అంకతంత్రము;
 • mathematician, n. గణిత శావేత్త; గణితాచారి;
 • matinee, n. పగటాట;
 • matriarch, n. f. మూలమగువ; కుటుంబానికి అధిపతిగా ఉన్న స్త్రీ;
 • matriarchal, n. మాతృస్వామ్య; మాతృతంత్ర; మాతృయజమాన;
 • matriarchy, n. మాతృస్వామ్యం; మాతృతంత్రం; మాతృ అధికారం;
 • matricide, n. మాతృ హత్య; మాతృఘాతం;
 • matrix, n. (1) అచ్చు; మూస; వరుధారణి; ప్రస్థారం; (2) చిక్కు; అల్లుడు; పడుగు, పేకలతో అల్లబడ్డది; (3) మాతృక; అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉన్న ఒక గణిత విన్యాసం; (ety.) an arrangement of ites with rows and columns; (4) ఖనిజ నిక్షేపాలతోపాటు కనిపించే శిలామయ, మృత్తికామయ నేపథ్య పదార్థం;
  • - algebra, ph. మాత్రిక బీజగణితం;
 • matter, n. (1) పదార్థం; ద్రవ్యం; (2) విషయం; బాపతు;
  • anti -, ph. నిష్‌పదార్థం;
  • dark -, ph. కృష్ణపదార్థం;
 • mattress, n. పరువు; తల్పం; తలిమం;
 • matty, adj. చాపీయ; చాపలా ఉన్న; అల్లబడ్డ;
  • - cloth, ph. అల్లినట్టు కనిపించే బట్ట;
 • mature, adj. ఎదిగిన; ఈడువచ్చిన; ముదిరిన; పక్వమైన; పండిన; ముగ్గిన; సిద్ధమైన; తయారైన; ప్రౌఢ;
 • maturity, n. ఈడు; పరిపక్వత; ప్రౌఢిమ; ప్రౌఢత్వం;
 • maul, v. t. చీల్చి చెండాడు;
 • mausoleum, n. మసోలీ; అద్భుతమైన గోరీ; సమాధి;
 • maw worm, n. నులి పురుగు;
 • maxilla, n. దవడలు;
 • maxi, pref. పెను; పెద్ద;
 • maxim, n. సూక్తి; నీతివాక్యం; పన్నా; నిజం అని అందరూ ఒప్పుకున్న సూత్రం; see also paradox;
 • maximization, n. గరిష్టీకరణం;
 • maximum, n. అత్యధికం; గరిష్ఠం; పరమం; మహత్తమం; ఊర్ధ్వతమం;
  • - limit, ph. గరిష్ఠ పరిమితి;
 • maze, n. చిక్కు; వ్యూహం;
 • meadow, n. మైదానం; పచ్చిక బయలు; క్షేత్రం; బీడు;
 • meager, n. చాలీచాలని; బహుకొద్దిగా;
 • meal, n. (1) భోజనం; బోనం; భుక్తి; కూడు; ప్రాశనం; ఒక నిర్ధిష్టమైన వేళకి తినే తిండి; (2) పిండి;
  • corn -, ph. మొక్కజొన్న పిండి;
 • meals, n. భోజనాలు; బోనాలు;
 • meal time, n. భోజనాల వేళ;

---Usage note: meal time

 • ---The first meal of the day is breakfast, which is eaten after getting up. Lunch is the meal that is eaten around 12.00 p.m. In most western countries, dinner, which is eaten around 6.00 p.m., is the main meal of the day. Supper is an informal or light evening meal. Brunch, a hybrid between breakfast and lunch, is eaten fairly late in the morning.
 • mean, adj. నీచ; అల్పబుద్ధిగల;
  • - fellow, ph. నీచుడు; లుచ్ఛా;
 • mean, n. సగటు; సరాసరి;
 • meander, v. i. మెలికలు తిరుగు;
 • meandering river, n. తిరుగుళ్ల గంగ;
 • meaning, n.అర్థం; ఉద్దేశం; భావం;
  • figurative -, ph. గౌణార్థం; ఉద్దిష్టార్థం;
  • literal -, ph. వాచ్యార్థం;
  • precise -, ph. రూఢ్యర్థం;
  • special -, ph. విశిష్టార్థం;
  • word by word -, ph. ముక్కస్య ముక్కార్థం;
 • meaningful, adj. సార్థక; అర్థవంత; అర్థయుక్త;
 • meaningfulness, n. సార్థక్యం; అర్థవంతం; అర్థయుక్తం;
 • meaningless, adj. అర్ధంలేని; అర్థరహిత; నిరర్థక; భావశూన్య; కదర్థ;
  • - task, ph. అర్ధంలేని పని;
 • means, n. సాధనం; తెరువు; మార్గం; వెరపు;
 • meanwhile, adv. అందాకా; అంతలో; ఈలోగా;
 • measles, n. పొంగు; తట్టు; రోమాంతిక; ఒక జాతి వైరస్‍ వల్ల వచ్చే జబ్బు; (rel.) chicken pox;
 • measure, n. (1) కొలత; మానం; ప్రమ; ప్రమాణం; ప్రస్థం; తన్మాత్ర; (2) కొలబద్ధ;
 • measurement, n. కొలత; మితి; మానం; మాపనం; కొలువడి;
 • measuring, adj. కొల; కొలత;
  • - cup, ph. కొలమానిక; ప్రస్థమానం;
  • - instrument, ph. కొలమాపకం;
  • - jar, ph. కొలజాడీ; కొలముంత; ప్రస్థమానం;
  • - rod, ph. కొలబద్ధ; మానదండం;
  • - tape, ph. కొలపట్టీ; మానసూత్రం;
  • - tool, ph. కొలముట్టు;
  • - vessel, ph. కొలజాడీ; కొలత గిన్నె; ప్రస్థమానం;
  • - wire, ph. కొలత్రాడు; మానరజ్జువు;
 • meat, n. మాంసం; పొలసు; పిసితం; పలం;
  • chicken (-), ph. కోడిమాంసం;
  • mutton (-), ph. మేఁకమాంసం;
  • beef (-), ph. గోమాంసం; గొడ్డుమాంసం;
  • pork (-), ph. పందిమాంసం;
  • man (-), ph. పొల; నరమాంసం;

---USAGE NOTE: meat

 • The meats of some animals have special names: The meat from a cow (or bull or ox) is beef. The meat from a calf is veal. The meat from a pig is pork or ham. The meat from a goat is mutton. The meat from a deer is venison. Usually the meat from birds is same as the bird’s name: chicken, duck, etc.
 • meatless, adj. ఆమిష శూన్య;
 • mechanic, n. యంత్రసూరి;
 • mechanical, adj. యంత్ర; యాంత్రిక; కీలు;
  • - advantage, ph. యంత్రలాభం;
  • - behavior, ph. యాంత్రిక ప్రవర్తన;
  • - doll, ph. కీలు బొమ్మ;
  • - energy, ph. యాంత్రిక శక్తి;
  • - horse, ph. కీలు గుర్రం;
 • mechanic, n. యంత్ర సూరి; యంత్రములని మరమ్మత్తు చేసే వ్యక్తి;
 • mechanics, n. యాంత్రిక శాస్త్రం; యంత్ర శాస్త్రం; యంత్రగతి శాస్త్రం; ప్రయోగించిన బలాన్ని, దానివల్ల కలిగే కదలికనీ అధ్యయనం చేసే శాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behaviour of physical bodies when subjected to forces or displacements;
  • celestial -, ph. ఖగోళ యంత్రగతి శాస్త్రం; ఖగోళ యంత్రశాస్త్రం; నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ శాల్తీల కదలికలకి సంబంధించిన శాస్త్రం
  • classical -, ph. సంప్రదాయక యంత్రగతి శాస్త్రం; సంప్రదాయక యంత్రశాస్త్రం;
  • Hamiltonian -, ph. హేమిల్టనీయ యంత్రగతి శాస్త్రం; హేమిల్టనీయ యంత్రశాస్త్రం;
  • Lagrangian -, ph. యంత్రగతి శాస్త్రం; లగ్రాంజీయ యంత్రశాస్త్రం;
  • Newtonian -, ph. లగ్రాంజీయ యంత్రగతి శాస్త్రం; నూటనిక యంత్రశాస్త్రం;
  • orbital -, ph. కక్ష్యలని నిర్ణయించే యంత్రగతి శాస్త్రం;
  • quantum -, ph. గుళిక యంత్రగతి శాస్త్రం; గుళిక యంత్రశాస్త్రం; క్వాంటం యంత్రశాస్త్రం;
  • relativistic -, ph. సాపేక్ష యంత్రగతి శాస్త్రం; సాపేక్ష యంత్రశాస్త్రం; కాంతి వేగం దరిదాపుల్లో ప్రయాణించే రేణువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం
  • statistical -, ph. సాంఖ్యక యంత్రగతి శాస్త్రం; సాంఖ్యక యంత్రశాస్త్రం; పదార్థాల సమూహ ఉష్ణగతిక లక్షణాల గురించి వివరించే శాస్త్రం
 • mechanism, n. యంత్రాంగం;
  • balance -, ph. సంతులన యంత్రాంగం;
 • mechanized, adj. యంత్రసజ్జిత;
 • medal, n. పతకం; బిరుదుబిళ్ళ; మెడలు;
 • media, n. pl. [phys.] (1) యానకాలు; (2) మాధ్యమాలు; ప్రసార మాధ్యమాలు; (sing.) medium;
  • multi -, ph. బహుళ మాధ్యమాలు;
  • yellow -, ph. పచ్చ మాధ్యమాలు; ప్రజలని ఉద్రేకపరచడానికి నిజంతో నిమిత్తం లేకుండా రంగురంగుల బొమ్మలతోటీ, పతాక శీర్షికలతోటీ వార్తలని ప్రసారం చెయ్యడం;
 • median, n. నడిమి; మధ్య రేఖ;
 • median strip, ph. రహదారి యొక్క ఇరువైపుల బాటలకీ మధ్యనున్న జాగా;
 • mediation, n. మాధ్యస్థం; మధ్యవర్తిత్వం;
 • mediator, n. మధ్యవర్తి; మాధ్యస్థుడు;
 • medical, adj. వైద్యసంబంధమైన; ఆరోగ్య సంబంధమైన;
  • - treatment, ph. చికిత్స;
 • medicated, adj. ఔషధీకృత;
 • medicine, n. (1) (మెడ్సిన్) మందు; ఔషధం; ఆయుర్‌ద్రవ్యం; (2)(మెడిసిన్) వైద్యశాస్త్రం; వైద్య విద్య;
 • medicinal, adj. ఔషధీయ; రోగనాశక; మందులకు పనికివచ్చే;
  • - herb, ph. ఓషధి;
 • meditation, n. మననం; జపం; ధ్యానం; ఉపాసన;
 • meditation room, ph. మనన మందిరం; ధ్యాన మందిరం;
 • medium, adj. మధ్యస్థమైన;
 • medium, n. (1) యానకం; (2) మాధ్యమం;
  • aqueous -, ph. జల మాధ్యమం; నీటి మాధ్యమం;
  • communication -, ph. ప్రసార మాధ్యమం; ప్రసార యానకం;
  • organic -, ph. కర్బన మాధ్యమం;
  • reaction -, ph. చర్యా మాధ్యమం;
  • Telugu -, ph. తెలుగు మాధ్యమం;
 • Mediterranean sea, n. మధ్యధరా సముద్రం; నడిపుడమి కడలి;
 • medulla, n. దవ్వ; దూట; ఏ శరీరాంగానికి అయినా అంతర్భాగంలో ఉండే కట్టడం;
  • - oblongata, ph. మజ్జా ముఖం; మెదడు వెనక ఉండి మన శ్వాసని నియంత్రించే ఒక కట్టడం;
 • medulloblastoma, n. చిన్న పిల్లలకి మెదడులో వచ్చే ఒక రకమైన కేన్‌సరు కంతి;
 • meet, v. t కలుసుకొను; తగులు;
 • meeting, n. సభ; సమావేశం; కలయిక; మీటింగు;
  • closed-door -, ph. జనాంతిక సమావేశం;
  • orientation -, ph. దృగ్విన్యాస సమావేశం;
  • summit -, ph. శిఖరాగ్ర సమావేశం;
 • mega, adj. మహత్; బృహత్; స్థూల; మెగా;
 • Mega, pref. (1) మిలియను; 1,000,000; (2) కంప్యూటరు రంగంలో మెగా అంటే 1,048,576=220;
 • Megabits, n. మిలియను ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1,048,576=220 ద్వింకములు; మెగా బిట్లు;
 • Megrez, n. అత్రి నక్షత్రం; సప్తర్షి మండలం (Big Dipper) లో కాంటివిహీనమైన తార;
 • melanosis, n. శరీరపు రంగు నల్లగా మారటం; మెలనిన్ తయారీ ఓపం వల్ల వచ్చే లక్షణం;
 • melee, n. (మేలే) తొక్కిసలాట;
 • mellifluous, adj. తేనెవలె తియ్యనైన;
 • melodrama, n. మోతాదు మించిన ఉద్వేగంతో, సాధారణంగా సుఖాంతం అయే నాటకం కాని, సినిమా కాని; నాటకీయత ఎక్కువ, పాత్ర పోషణ తక్కువ ఉన్న నాటకం కాని, సినిమా కాని; (note) ఎత్తిపొడవడానికి వాడే మాట; key constitutive factors: pathos, overwrought or heightened emotion, moral polarization (good vs. evil), non-classical narrative structure (e.g., use of extreme coincidences);
 • melodious, adj. శ్రావ్య; శ్రవణపేయ; కర్ణపేయ; సుశ్రావ్య;
 • melody, n. శ్రావ్యత;
 • melon, n. కర్బూజా; పుచ్చపండు; తర్బూజా;
  • musk -, ph. కర్బూజా; పుచ్చపండు;
  • water -, ph. పుచ్చపండు;
 • melt, v. i. కరుగు; v. t. కరగించు; చలించు;
 • melting point, n. కరుగు స్థానం; ద్రవీభవన స్థానం; కరిగే ఉష్ణోగ్రత;
 • member, n. సభ్యుడు; సభ్యురాలు; కూటరి; మెంబరు;
 • membrane, n. పొర; త్వచం; త్వక్కు; పటలం; కుబుసం; జిలి;
  • cell -, ph. కణ త్వచం; కణ పటలం;
 • memento, n. జ్ఞాపిక; స్మృతి చిహ్నం;
 • memo, n. రాసిన ప్రతిపాదన; short for memorandum;
 • memorable, adj. చిరస్మరణీయ;
 • memorandum, n. నివేదిక; వినతిపత్రం; విన్నపం; మనవి; విజ్ఞాపన; యాదాస్తు; జ్ఞాపిక; స్మరణలేఖ్యం; గిల్లుపత్రం; దరఖాస్తు; తాఖీదు; మెమో; మెమొరాండం;
 • memorial, adj. సంస్మరణ;
 • memorial, n. (1) స్మారక సభ; (2) స్మారక చిహ్నం;
 • memorize, v. i. కంఠస్థం చేయు; ధారణ చేయు;
 • memory, n. (1) జ్ఞాపకం; జ్ఞాపకశక్తి; స్మృతి; ధారణ; (2) [comp.] కొట్టు; కోఠీ; గరిస; కంప్యూటరులో దత్తాంశాలని, ఆదేశాలని దాచే ప్రదేశం;
 • memoirs, (మెమ్వార్స్) n. pl. జీవితానుభవాలు; పూర్వస్మృతులు;
 • men, n. పురుషులు; మగవారు; (note) man అన్నది ఉభయ లింగాలకీ వర్తిస్తుంది కాని, men అంటే మాత్రం పురుషులు అనే అర్థమే వస్తుంది;
 • menarche, n. సమర్తాడడం; పెద్దమనిషి అవడం; రజస్వల అవడం; పుష్పవతి అవడం;
 • mendacity, n. అబద్ధం;
 • menorrhagia, n. ఎరక్రుసుమ; రక్తప్రద; స్త్రీ రుతు కాలంలో అతిగా జరిగే రక్త స్రావం;
 • menses, n.ముట్టు; రుతు స్రావం; రుతు కాలం; బయటుండుట; వాకిటుండుట;
 • mend, v. t. మరమ్మత్తు చేయు; బాగు చేయు;
 • mendicant, n. m. అవధూతుడు;
 • menial, n. గులాము; దాసుడు;
 • menopause, n. రజోనివృత్తి; ముట్లుడుగు కాలం;
 • menstruation, n. రుతువు; రుతుకాలం; బయటుండడం; వాకిటుండడం; ముట్టవడం;
 • menstrual, adj. రుతు;
  • - discharge, ph. రుతు స్రావం;
  • - period, ph. రుతు కాలం;
 • mensuration, n. మాపన శాస్త్రం; మాపనం; కొలతలకి సంబంధించిన లెక్కలు; కొలత; భూమి కొలత; క్షేత్రమితి;
 • mental, adj. మానసిక; మానస; మనస్; మనో;
  • - debility, ph. మానసిక దౌర్బల్యం; కశ్మలం;
  • - hospital, ph. పిచ్చాసుపత్రి;
 • mentality, n. మానసికతత్వం; మనస్తత్వం; మనోగతి; చిత్తవృత్తి;
 • menthol, n. పుదీనా కర్పూరం; పుదీనా ఆకులలో నుండి తీసిన ఒక సుగంధ ద్రవ్యం; రసాయన శాపు దృష్ట్యా ఇది ఒక ఒలంతం (alcohol); see also mint camphor;
 • mention, v. i. పేర్కొను; చెప్పు; నుడువు;
 • menu, n. (మెన్యూ) (1) వడ్డనకి తయారైన వంటకాల జాబితా; వాటి ధరలు; మెన్యూ; (2) ఎంపిక అంశాల పట్టిక; ఎంపిక జాబితా;
 • mercenary, n. కిరాయి సైనికుడు; కూలికి యుద్ధం చేసే వ్యక్తి;
 • merchandise, n. సరుకులు; సామానులు; దినుసులు; వస్తువులు; సామగ్రి; సార్థములు;
 • merchant, n. వణిజుడు; వ్యాపారస్తుడు; సార్ధవాహుడు; సెట్టి; సాహుకారు;
  • - marine, ph. వాణిజ్య నౌకాదళం;
 • mercuric chloride, n. రసహరితం; ఖాండవ కర్పూరం; Mercury (II) chloride; corrosive sublimate; HgCl2;
 • mercuric sulphide, n. ఇంగిలీకం; రససింధూరం; Mercury (II) sulfide; HgS;
 • mercurous chloride, n. రసకర్పూరం; Mercury (I) chloride; white sublimate of mercury; Hg2Cl2;
 • Mercury, n. (1) బుధుడు; బుధగ్రహం; (2) పాదరసం; రసం; పారదం; రసపతి; రసరాట్టు; తడివెండి; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 80, సంక్షిప్తనామం = Hg [Lat. hydrargyrum = liquid silver];
 • mercy, n. దయ; కనికరం; కృప; కరుణ;
 • mere, adj. కేవలం; ఉత్త;
 • merely, adv. కేవలం; ఫక్తు;
 • merger, n. కలిసిపోవుట; ఐక్యమగుట; లయమగుట; లీనీకరణ;
 • meridian, n. (1) మధ్యాహ్న రేఖ; యామ్యోత్తర రేఖ; (2) ధ్రువవృత్తం; మయామ్యోత్తర రేఖ; ఖగోళంలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రేక్షకుని శిరస్సు మీదుగా వెళ్లే ఊహా వృత్తం;
 • merit, n. యోగ్యత; శ్రేష్టత;
 • merit certificate, ph. యోగ్యతా పత్రం; ప్రశంసాపత్రం;
 • merits, n. యోగ్యతలు; సలక్షణాలు;
  • - and demerits, ph. గుణగణాలు; లాభనష్టాలు;
 • merry-go-round, n. రంగులరాట్నం; మెర్రీగుర్రం;
 • mesa, n. నెత్తం; పీఠభూమి; సానువు; కొండ మీద చదునైన ప్రదేశం;
 • mesh, n. వలయం; జల్లి; జాలీ; see also grid;
 • mesh, v. i. సరితూగు; అమురు; జతపడు;
 • mesmerism, n. మెస్మరీయం; మెస్మరిజం; ఒక వ్యక్తికి ఒక విధమైన మైకం కల్పించి ఆ వ్యక్తిచేత చెప్పిన విధంగా ప్రవర్తింపజేసే పద్ధతి;
 • meso, pref. మధ్య;
 • mesoblast, n. మధ్యాస్తరం; అంతశ్చర్మానికి, బహిశ్చర్మానికి మధ్యనున్న పొర; mesoderm;
 • mesosphere, n. మధ్యావరణం;
 • mesozoic era, n. మధ్య జీవయుగం;
 • mess, n. (1) భోజనశాల; పాకశాల; మెస్సు; (2) చాలా చిందరవందరగా ఉన్న స్థితి;
 • message, n. సందేశం; వర్తమానం; వార్త; మాట; దూతిక; దూతం; కబురు; సమాచారం; కచేలం;
 • messenger, n. వార్తాహరుడు; దూత; వార్తికుడు; చారుడు;
 • messenger RNA, ph. దూతిక రైకామ్లం;
 • meta, pref. మధ్య; తో; ఆవలి; లోకోత్తర; బీజాతీత; అధిభౌతిక; ఉన్నత;
 • metabolism, n. పాచకం; జీవనప్రక్రియ; చయాపచయం;
 • metacarpal bones, n. పాణిశలాకలు; కరభాస్థికలు; అరచేతిలోని ఎముకలు;
 • metacarpals, n. కరభాస్థికలు; పాణి శలాకలు; అరచేతిలోని ఎముకలు;
 • metastasis, n. శరీరంలో వ్యాధి ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం చేయుట; ముఖ్యంగా కేన్సరు వ్యాధి యెడల ఈ పదం ఉపయోగిస్తారు
 • metal, n. (1) లోహం; ధాతువు; (2) కంకర;
  • base -, ph. హీన ధాతువు; పరుష లోహం; ఇనుము, రాగి, సీసము, మొ.;
  • noble -, ph. రాచ ధాతువు; వెండి, బంగారము, మొ.;
  • - collar, ph. పొన్ను;
 • metallic, adj. లోహ; ధాతు;
  • - luster, ph. లోహ ద్యుతి; ధాతు ద్యుతి;
 • metallurgy, n. లోహ సంగ్రహణ శాస్త్రం;
 • metamorphosis, n. మార్పు; పరిపూర్ణమైన మార్పు; రూపవిక్రియ; రూపపరిణామం;
 • metaphor, n. రూపకాలంకారం; అధ్యారోపం;
 • metaphysics, n. అధిభౌతిక శాస్త్రం; పారలౌకిక శాస్త్రం; ఆధ్యాత్మిక విద్య;
 • metatarsal bones, n. ప్రపాదాస్థికలు; పాద శలాకలు; పాదములోని ఎముకలు;
 • metathesis, n. [ling.] వర్ణవ్యత్యయం; శబ్ద ఉచ్చారణలో అక్షరాల వరస మారుగుళ్లు అవడం;
 • metempsychosis, n. పరకాయప్రవేశం;
 • meteor, n. ఉల్క; వాతావరణం లోనికి ప్రవేశించిన తల తెగిన తోకచుక్క; అంతరిక్షం నుండి వాతావరణం గుండా కిందకి పడే ఒక ఘన పదార్థం;
 • meteor shower, ph. ఉల్కాపాతం;
 • meteorite, n. ఉల్కాశిల; భూపతనమైన ఉల్క; కింద పడ్డ ఉల్క;
 • meteoroid, n. తల తెగిన తోకచుక్క; శిధిలమైన తోకచుక్క; సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూన్న రాయి వంటి ఘనపదార్థం; సౌర కుటుంబంలో ఇటువంటివి చాలా ఉన్నాయి; ఇవి భూమి వాతావరణంలో ప్రవేశించి భూపతనమైతే అప్పుడు వాటిని ఉల్కలు అంటారు;
 • meteorology, n. వాతావరణ శాస్త్రం; [Gr. meteoron = గాలిలో ఉండేది];
 • meter, metre [Br.] n. (1) మీటరు; మాపకం; కొలమానం; మితి; (2) పద్యపాదంలో ఉన్న గణాల సమాఖ్య;
  • barometer, n. భారమితి; వాతావరణంలోని గాలి బరువుని కొలిచేది;
  • thermometer, n. ఉష్ణమితి; ఉష్ణంపుల్ల; వేడిని కొలిచేది; థర్మామీటరు;
 • methanal, n. పాడాల్; కాష్టాల్; మెతనాలు; ఫార్మాల్డిహైడు; CH2O;
 • methane, n. ఏకేను; పాడేను; మెతేను; చిత్తడి వాయువు; పంక వాయువు; CH4;
 • methanoic acid, n. పాడోయిక్ ఆమ్లం; పిపీలికామ్లం; ఫార్మిక్ ఆమ్లం; HCOOH;
 • methanol, n. పాడోల్; కాష్టోల్; మెతనోలు; మెతల్ ఆల్కహాలు; CH3OH;
 • method, n. పద్ధతి; మార్గం; విధి; విధానం;
  • commonsense -, ph. లౌకిక పద్ధతి;
  • historical -, ph. చారిత్రక పద్ధతి;
  • systematic -, ph. క్రమ పద్ధతి;
 • methyl alcohol, n. కాష్టోల్; పాడోల్; కర్రసారా; మెతనోలు; మెతల్ ఆల్కహాలు;
 • methyl group, n. మెతల్ గుంపు;
 • methyl radical, n. మెతల్ రాసి;
 • meticulously, adv. అతి జాగ్రత్తగా;
 • metonymy, n. ఇంగ్లీషు భాషలో ఒక అలంకారం; ఒక మాటకి బదులు దానికి దగ్గర సంబంధం ఉన్న మరొక మాటని వాడడం; ఉ. సనాతన ధర్మం నశించి పోతోందని శృంగేరీ మఠం ఆక్రోశించింది అన్నప్పుడు శృంగేరీ మఠాధిపతి సంతాపం వెలిబుచ్చేరని అర్థం చెప్పుకోవాలి;
 • metre, n. మీటరు; (note) మెట్రిక్ పద్ధతిలో ఈ వర్ణక్రమాన్నే వాడాలి;
 • metric system, n. మెట్రిక్ పద్ధతి; శతాంశ పద్ధతులని ఉపయోగించి, బరువులని, దూరాలని కొలవడం;
 • metropolis, n. మహానగరం; ప్రధాన నగరం; కస్బా; ముఖ్య పట్టణం;
 • Mexican poppy, n. బ్రహ్మదండి; బలురక్కెస;

Part 2: Mf-Mz

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • miasma, n. దోషం; మౌలిక దోషం; రోగకారణం; హోమియోపతీ శాస్త్రం ప్రకారం, శరీరంలో ఒక మౌలికమైన దోషం ఉన్నప్పుడు శరీరం రోగగ్రస్త మవుతుంది;
 • mica, n. అభ్రకం; గిరిజం; కాకిబంగారం; గనులలో దొరికే ఒక రకం అల్లూమినో సిలికేటు అనే ఖనిజం;
 • micro, adj. సూక్ష్మ;
 • microbe, n. సూక్ష్మజీవి; రోగకారకమైన సూక్ష్మజీవి; same as microorganism;
 • microgravity, n. సూక్ష్మ గురుత్వం; ఒక కక్ష్యలో తిరుగుతున్న నభోనౌకలో అనుభవానికి వచ్చేఅతి కొద్ది గురుత్వ బలం;
 • micrometer, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రాను;
 • micron, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రోమీటరు;
 • microorganism, n. సూక్ష్మజీవి; మైక్రోబు; బేక్టీరియాలు, వైరసులు, రికెట్సియాలు, స్పైరోకీట్లు, ప్రోటోజోవాలు సూక్ష్మజీవులకి ఉదాహరణలు;
 • microprocessor, n. సూక్ష్మసంకలిని; మైక్రోప్రాసెసర్; వేలి గోరు ప్రమాణంలో ఉన్న అర్ధవాహిని చితుకు మీద నిర్మించిన కలన యంత్రం;
 • microscope, n. సూక్ష్మదర్శిని; కంటికి కనబడనంత చిన్నగా ఉన్న వస్తువులని చూడడానికి వాడే పరికరం;
 • microsome, n. సూక్ష్మకాయం; (lit.) small body;
 • mid, adj. మధ్య; నడు; అర్ధ;
 • middle, adj. మధ్య; నడుమ; అంతరాళం;
  • - man, ph. మధ్యవర్తి; దలారి;
 • midnight, n. అర్ధరాత్రి; నడురేయి; నడిరేయి;
 • midrib, మధ్యశిర; ఈనె;
 • midwife, n. మంత్రసాని;
 • migrain, n. అనంతావర్తం; ఒక రకమైన విపరీతమైన తలనొప్పి;
 • migrant, n. ప్రవాసి; వలస పోయిన వ్యక్తి;
 • migration, n. వలస;
  • - routes, ph. వలస వీధులు;
 • mil, n. సహస్రాంశము; వెయ్యవ భాగం;
 • mild, adj. సన్న; మంద; మేదక;
  • - breeze, ph. మందమారుతం;
 • mildew, n. బూడిద తెగులు; మజ్జిగ తెగులు;
 • mile, n. మైలు; (note) 8 కిలోమీటర్లు 5 మైళ్లకి సమానం;
 • milestone, n. మైలురాయి;
 • milieu, n. సంగతి, సందర్భం; సామాజిక వాతావరణం;
 • military, n. సైన్యం; మిలిటరీ;
 • militia, n. పౌరసేన;
 • milk, adj. పాల; క్షీరం; గొల్ల;
 • milk, n. పాలు; క్షీరం; దుగ్ధం; పయస్సు;
  • breast -, ph. చనుబాలు; స్తన్యం;
  • condensed -, ph. చిలువాలు;
  • powder -, ph. పాలపొడి;
  • skimmed -, ph. వెన్న తీసేసిన పాలు;
 • milk, v. t. పితుకు; పిండు;
  • - products, ph. పయస్యములు; పాలనుండి వచ్చే పదార్థాలు; పెరుగు, వెన్న, నెయ్యి, చీజు, వగైరాలు;
 • milkmaid, n. గొల్లభామ;
 • milkshake, పాలసుగంధి; పాలల్లో ఐస్‌క్రీమ్ కలిపి రంగరించగా వచ్చినది;
 • milkteeth, n. పాలపండ్లు;
 • Milkyway, n. పాలపుంత; సోమధార; పాలకడలి; ఆకాశ గంగ; దివిజ గంగ; మన క్షీరసాగరం (గేలక్సీ) పేరు;
  • thicker -, ph. పాలకడలి;
  • thinner -, ph. ఆకాశ గంగ; దివిజ గంగ;
 • mill, n. మర; గానుగ; తిరుగలి; మిల్లు;
 • mill, v. t. మరపట్టు; ఆడించు; మరపట్టించు; ఆడు; ఆడించు;
 • milled, adj. మరపట్టిన; మరాడించిన;
 • millennials, n. pl. జనాభాలో సా. శ. 1980 - 2000 మధ్యలో పుట్టినవారు;
 • millennium, n. సహస్రాబ్దం; వెయ్యి సంవత్సరముల కాలం;
 • millets, n. (1) చిరు ధాన్యాలు; సిరు ధాన్యాలు; జొన్నలు, సజ్జ, రాగి, మొదలగునవి; (2) జొన్నలు;
  • barnyard -, ph. ఊదలు; ఊదర్లు;
  • browntop -, ph. అండు కొర్రలు;
  • finger -, ph. రాగి; రాగులు;
  • foxtail -, ph. కొర్ర; కొర్రలు;
  • great -, ph. జొన్న; జొన్నలు;
  • Italian -, ph. కొర్ర; కొర్రలు;
  • kodo -, ph. ఊద; ఊదలు; అరికె; అరికెలు;
  • little -, ph. సామ; సామలు;
  • spiked -, ph. సజ్జ; సజ్జలు;
 • million, n. పది లక్షలు; మిలియను;
 • millipede, n. సహస్ర పాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి; (lit.) వెయ్యి పాదములు కలది; నిజానికి సహస్రపాదికి 200-400 కాళ్లే ఉంటాయి;
 • millstone, n. తిరగలి; తిరుగలి; తిరుగలి రాయి;
 • mime, n. మూకాభినయం;
 • mimesis, n. అనుకరణ;
 • mimic, v. t. అనుకరించు;
 • mimicry, n. పరిహాసానుకరణ;
 • mince, v. t. పొట్టుచేయు; చిన్న ముక్కలుగా తరుగు;
 • minced jack fruit, ph. పనస పొట్టు;
 • mind, n. మనస్సు; మది; అంతఃకరణం; అంతరంగం; ఉల్లము; డెందము; ఎద; ఎడద; చేతనం; చేతస్సు; చిత్తము; భౌతికమైన మెదడులో, కంటికి కనపడని విధంగా, భౌతికమైన ఉనికి లేని మనస్సు ఉంటుందనే భావం ఒకటి ఉంది; ఈ మెదడుకి, మనస్సుకీ మధ్య ఉండే లంకెనే ఆత్మ అంటారని తాత్వికుడు రెనే డెకార్ట్ అంటారు; ఇంగ్లీషులో mind అనే మాటలో వేదాంతం నాలుగు స్థాయిలను గుర్తిస్తుంది: (1) మనస్సు - ఆలోచనలకు మూలం. (2) బుద్ధి అంటే వివేకము. అనగా, ఈ ఆలోచన మంచిది, ఆ వాక్యము సత్యము అనుకునే తెలివితేటలు. (3) చిత్తము. ఇంగ్లీషు అనువాదం consciousness. Krishna consciousness అంటే చిత్తములో కృష్ణునికి తప్ప ఎవరికీ స్థానం ఉండకపోవడం. అందుకే ఆయన చిత్తచోరుడు. (4) అహంకారము. అహం అంటే నేను. మమ అంటే నాది. నేను చాలాగొప్పవాణ్ణి అనుకోవడం అహంకారం. అన్నీ నావి అనుకోవడం మమకారము.
  • frame of -, ph. చిత్తవృత్తి;
  • peace of -, ph. మనశ్శాంతి;
  • state of -, ph. చిత్తవృత్తి;
  • subconscious -, ph. ఉపచేతనం;
 • mine, n. (1) గని; ఖని; (2) ఆకరం; (3) మందుపాతర;
 • mine, poss. pron. నాది; నావి; అస్మదీయం;
 • miner, n. m. ఖనకుడు;
 • mineral, n. ఖనిజం;
  • - salt, ph. ఖనిజ లవణం;
  • - oil, ph. ఖనిజ తైలము; ఖనిజపు చమురు;
  • - pitch, ph. గంజిత్తు; గని+జిత్తు;
  • - spring, ph. గనిజబ్బుగ్గ;
 • mineralogy, n. ఖనిజ శాస్త్రం;
 • mini, pref. పిట్ట; పిల్ల; చిన్న;
 • miniature, adj. చిట్టి; బుల్లి; లఘు;
 • minimal, adj. అల్పిష్ఠ; కనిష్ఠ; కనీస;
 • minimization, n. కనిష్ఠీకరణం;
 • minimize, v. t. అత్యల్పించు; కనిష్ఠీకరించు;
 • minimum, n. అత్యల్పం; కనిష్ఠం; కనీసం; అధమం;
  • at the -, ph. హీనపక్షం;
 • minister, n. (1) మంత్రి; అమాత్యుడు; సచివుడు; (2) క్రైస్తవ మత గురువు; చర్చిలో ఒక మతాధికారి;
 • ministry, n. (1) మంత్రివర్గం; అమాత్య కూటమి; (2) మంత్రిత్వం;
 • minor, adj. చిరుత; చిన్న; లఘు; మంద;
  • - axis, ph. లఘు అక్షం;
  • - offence, ph. స్వల్పనేరం; మందాపరాధం;
 • minor, n. బాలుడు; బాలిక; 18 సంవత్సరముల వయస్సు నిండని వ్యక్తి; అయుక్తుడు; మైనరు;
  • - crime, ph. ఉపపాపం; చిన్నతప్పు;
 • minorities, n. బడుగు వర్గాలు; అల్పసంఖ్యాక వర్గాలు;
 • minority, n. (1) చిరుత ప్రాయం; బాల్యదశ; లేబ్రాయము; అయుక్తవయస్సు; కౌమారత్వం; (2) అల్పసంఖ్యాక వర్గం;
 • mint, n. (1) టంకశాల; (2) పొదీనా; [bot.] Mentha viridis;
 • minuend, n. వియోజ్యం; శోధనీయము; 4 నుండి 3 ని తీసివేసినప్పుడు, 4 వియోజ్యం; 3 వ్యవకలితం; see also subtrahend;
 • minute, adj. (మైన్యూట్) స్వల్పమైన; అతిచిన్నదైన; సూక్ష్మమైన; అణు;
 • minute, n. (మైన్యూట్) స్వల్పం; అల్పం; అల్పిష్ఠం; ఆణకం; అణుప్రమాణం; (rel.) tiny; subtle;
 • minute, n. (మినిట్); (1) నిమిషము; గంటలో అరవైయ్యవ వంతు; లిప్త; కల; (2) డిగ్రీలో అరవైయ్యవ వంతు;
 • minutes, n. pl. (మినిట్స్) సభలలో జరిగే వ్యవహార సంగ్రహం;
 • miracle, n. మహాత్మ్యం; మహాద్భుతం;
 • mirage, n. ఎండమావి; మృగతృష్ణ; మరీచిక;
 • mire, n. రొంపి; ఊబి; బురదనేల; రొచ్చు; అడుసు; పంకం; పంకిలం; జంబాలం; ఉబ్బలి;
 • mirror, n. అద్దం; దర్పణం; కర్కరం; ఆదర్శనం; ముకురం;
  • - image, ph. బింబం; ప్రతిబింబం; దర్పణ బింబం;
  • - symmetry, ph. దర్పణ సౌష్ఠవం;
 • misanthrope, n. మానవద్వేషి; నరద్రోహి;
 • miscarriage, n. (1) గర్భస్రావం; గర్భపాతం; అకాల ప్రసవం; కట్టుక; (2) అక్రమరీతి; అక్రమ వైఖరి; అన్యాయం; భంగపాటు; వ్యాఘాతం; విఘాతం;
  • - of justice, ph. న్యాయానికి అన్యాయం జరిగిపోవడం;
 • miscellaneous, adj. వివిధ; చిల్లర మల్లర; చిల్లర; నానా; నానావిధ;
 • miscellaneous, n. అమాంబాపతులు; చిల్లర మల్లర; చిల్లర; మ్రుక్కడి;
 • miscellany, n. కలగూరగంప; కదంబం;
 • mischief, n. పెంకితనం; అల్లరి; దుండగం; ఆగడం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం;
  • - maker, ph. పెంకి పిల్ల; అల్లరి పిల్ల; పెంకివాడు; అల్లరివాడు; దుండగీడు;
 • mischievous fellow, ph. పెంకి పిల్లాడు; రాలుగాయి; ఆకతాయి;
 • mischievousness, n. పెంకితనం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం; దుడుకుతనం;
 • misconception, n. అపోహ; భ్రమ, తప్పుభావము; అపార్థము; దురూహ;
 • misconduct, n. దుష్‌ప్రవర్తన; దుర్నడత;
 • misdeed, n. పొరపాటు; చెడ్డపని; దుష్కృత్యం; కాకృత్యం;
 • misdemeanor, n. కపటచేష్ట; చెడ్డపని; కీలు; అకృత్యం; దుష్‌కృతం; దుష్‌ప్రవర్తన; దురాకృతం; దుశ్చేష్ట; వికర్మ; ఉన్మార్గం; చెడు దారి; చట్టవిరుద్ధమైన పని;
 • miser, n. లోభి; పిసినిగొట్టు; పిసినారి; పీనాసి; కింపచానుఁడు; అడియరి; టక్కుఁడు;
  • extreme -, ph. పరమ లోభి;
 • miserliness, n. లోభం; లోభత్వం; కాపీనం; పిసినారితనం; పిసినిగొట్టుతనం;
 • misfortune, n. దురదృష్టం; ఓగు;
 • misgiving, n. సందేహం; సంశయం;
 • mishap, n. దుర్ఘటన; విపత్తు; అశ్రి;
 • misinterpretation, n. వక్రీకరణం; తప్పు అర్థం చెప్పడం; దురర్థం చెప్పడం;
 • mislead, v. t. తప్పుదారిలో పెట్టు; మభ్యపరచు;
 • misleading statement, ph. విప్రలంభం;
 • mismatch, n. విజ్జోడు; జత కలవకపోవడం;
 • mismatched pair, ph. విజ్జోడు;
 • misnomer, n. దుర్నామం; లక్షణాలకి సరిపడని పేరు;
 • misogynist, n. ఆడవారంటే చులకన భావం కల వ్యక్తి; పురుషాహంకారి; ఆడ జాతి యెడల వివక్ష చూపే వ్యక్తి;
 • misprint, n. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
 • misrepresentation, n. మభ్యపరచుట; అసత్యకథనం; తప్పుగా వర్ణించడం;
 • missile, n. కంపణము; అవాయి; క్షిపణి;
  • guided -, ph. మార్గణ క్షిపణి; మార్గణం;
  • heat-seeking -, ph, ఉష్ణ మార్గణం;
 • missing, adj. తొస్సి;
 • missing tooth, ph. తొస్సి పన్ను;
 • missing syllable, ph. తొస్సి మాట;
 • mission, n. (1) మఠం; (2) ప్రచారక వర్గం; (3) బృహత్కార్యం;
 • missionaries, n. మతబోధకులు; మతప్రచారకులు; మిషనరీలు;
 • mist, n. కుహేళి; తుషారం; సూక్ష్మమైన బిందువులు గాలిలో తేలియాడిన పరిస్థితి;
 • mistake, n. పొరపాటు; తప్పు; కైతప్పు;
  • printing -, ph. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
 • mistrust, n. అపనమ్మకం;
 • mistletoe, n. బదనిక; పరభుక్కి అయిన ఒక జాతి మొక్క;
 • mistress, n. ఉపపత్ని; ఉంపుడుకత్తె;
 • misunderstanding, n. అపార్థం;
 • misuse, n. దుర్వినియోగం;
 • mite, n. తవుటి పురుగు;
 • mitigation, n. ఉపశాంతి;
 • mix, v. t. కలుపు; రంగరించు; కలబోయు; మిళాయించు; మేళవించు;
 • mix, n. మాదక ద్రవ్యాలలో కలిపే పళ్లరసం వంటి పానీయం;
 • mixed, adj. కలగలసిన; కలగలుపు; కదంబ; మిళిత; చంపూ;
 • mixture, n. మిశ్రమం; కలగలుపు; కరంబం; కదంబకం; మిళితం;
 • mix-up, n. తారుమారు; గందరగోళం; తికమక;
 • Mizar, n. వసిష్ట నక్షత్రం;
 • mnemonics, n. pl. స్పోరకములు; జ్ఞాపకార్థం ఉంచుకొనే గుర్తులు;
 • moan, n. మూలుగు; నిట్టూర్పు;
 • moat, n. కందకం; ఆగడ్త; పరిఖ; దవంత్రి;
 • mob, n. మూక; దండు; తొంబ; మూకప్రజ; గుంపు, అల్లరిమూక; క్రమశిక్షణ పాటించని జన సమూహం;
  • - battle, ph. సంకుల సమరం;
  • - disorder, ph. దొమ్మీ;
 • mobile, adj. చర; చలన; చంచత్; జంగమ; జంగమాత్మక; చరిష్ణు; గమనశీల; కదలాడునట్టి;
  • - computing, ph. చలన కలనం; జంగమ కలనం;
  • - phone, ph. చరవాణి; జంగవాణి;
 • mobility, n. చలనశీలత; చంచలత; జంగమత్వం; కదలే గుణం; గమనశీలత;
 • mock, v. t. (1) పరిహసించు; ఎకసక్కేలాడు; ఎగతాళి చెయ్యు; ఎద్దేవాచేయు; (2) అనుకరించు
  • - parliament, ph. శాసన సభని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం;
  • - trial, ph. న్యాయస్థానంలోని విచారణని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం;
  • - theta function, ph. శ్రీనివాస రామానుజన్ కనిపెట్టిన కొత్త రకం ప్రమేయం;
 • mockery, n. అపహాస్యం; గేలి; అవహేళన;
 • mode, n. వెరవు;
 • model, n. (1) నమూనా; మాదిరి; ప్రతిరూపం; మోస్తరు; (2) మేలుబంతి; ఒరవడి;
 • moderately, adv. మితంగా; పరిమితంగా;
 • moderates, n. మితవాదులు;
 • moderation, n. మోతాదు; మితి;
 • modern, adj. అధునాతన; ఆధునిక; నూతన; నవీన; నవయుగ; అభినవ; నాజూకైన; కొత్త;
 • modernity, n. ఆధునికత;
 • modernization, n. నవీకరణ; అధునీకరణం; ఆధునికీకరణ;
 • modest, adj. వినీత;
  • - person, ph. వినీతుడు; సొంత డబ్బా కొట్టుకోని మనిషి;
 • modesty, n. వినయం; నమ్రత; అణకువ;
 • modicum, n. మోతాదు;
 • modification, n. మార్పు; సవరింపు;
 • modular, adj. గుళిక;
  • - arithmetic, ph. గుళిక గణితం; ఘడీ గణితం;
  • - form, ph. గుళిక స్వరూపం;
 • module, n. గుళిక;
 • mofussil, adj. [Ind. Engl.] గ్రామీణ; నగరేతర; పరిసర;
 • mogul, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు; see also tycoon;
 • moist, adj. తేమగల; చెమ్మగిల్లిన; తడిసిన; క్లిన్న;
 • moisten, v. t. తడుపు; తడిపి పెట్టు; పదును పెట్టు;
 • moisture, n. తేమ; చెమ్మ; తడి; నెమ్ము;
 • molar, adj. బుగ్గకి సంబంధించిన;
 • molars, n. దంతములు; బుగ్గవేపు పళ్లు;
 • molasses, n. ఇక్షుసారం; మొలాసిస్;
 • mold, v. t. మలుచు;
slime mold=ఒక రకం బూజు
 • mold, [Br.] mould, n. (1) బూజు; బూడిద తెగులు; చెమ్మగానున్న ఆహారపదార్థాలపై మొలిచే బూజు; ఒక రకం శిలీంధ్రం; (2) అచ్చు; మూస;
  • slime -, ph. జిగురు బూజు;
 • mold, [Br.] mould, v. t. తీర్చిదిద్దు;
 • mole, n. (1) పుట్టుమచ్చ; (2) భూమిలో బొరియ చేసికొని బతికే ఒక ఎలుక జాతి చిన్న జంతువు; (3) మన మధ్యలో చేరిన శత్రుపక్షం వారి గూఢచారి; (4) ఒక బణువులో పదార్థం ఎంతుందో చెప్పే ఒక కొలమానం;
 • mole, n. (1) పుట్టుమచ్చ; (2) మన గూఢచారి వర్గంలో శత్రుపక్షం వారి మనిషి మన మనిషిలా నక్కి ఉన్న వ్యక్తి;
 • molecular formula, ph. బణు సాంఖ్యక్రమం; ఒకొక్క బణువులో ఎన్నెన్ని అణువులు ఉన్నాయో సూచించే పద్ధతి;
 • molecular weight, ph. బణుభారం;
 • molecule, n. బణువు; (ety.) బహుళంగా, అంటే మెండుగా, ఉన్న అణు సముదాయం;
 • molt, n. పాము కుబుసం; పాము పొర; నిర్మోకం;
 • molten, adj. కరిగించిన; కరగబెట్టిన;
 • molting, v. i. కుబుసం విడవడం; పొర విడవడం; ecdysis;
 • Molybdenum, n. మోలిబ్డినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 42, సంక్షిప్త నామం; Mo) [Gr. molybdos = lead];
 • mom, n. అమ్మ;
 • moment, n. (1) క్షణం; సమయం; (2) ఘాతిక; భ్రామకం;
  • dipole -, ph. ద్విధ్రువ భ్రామకం;
  • every -, ph. క్షణక్షణం; అనుక్షణం;
  • - of inertia, ph. జడత్వ భ్రామకం;
 • momentum, n. (1) [Phy.] భారగతి; (exp.) భారం అంటే weight, గతి అంటే motion అనీ అనుకోవాలి; రయజాతం; (exp.) రయం అంటే velocity కనుక రయం నుండి పుట్టినది రయజాతం; ద్రవ్యవేగం; (exp.) ద్రవ్యం అంటే mass, వేగం అంటే velocity అనీ అనుకుంటే దీని అర్థం అవగతం అవుతుంది; momentum = mv = mass x velocity; (2) ఊపు; ఉద్వేగం; ఆవేగం;
  • angular -, ph. కోణీయ ఉద్వేగం; కోణీయ రయజాతం; angular momentum = mvr = momentum x radius;
  • orbital angular -, ph. గతి కోణీయ ఉద్వేగం; ప్రదక్షణం చెయ్యడం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
  • spin angular -, ph. భ్రమణ కోణీయ ఉద్వేగం; ఆత్మభ్రమణం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
 • monad, n. సూక్ష్మాత్మ;
  • finite -, ph. ప్రత్యగాత్మ;
 • monarch, n. m. ఏకరాజు; సార్వభౌముడు; చక్రవర్తి;
 • monarchy, n. సార్వభౌమత్వం; రాచరికం;
 • monastery, n. విహారం; సాధువులు, భిక్కులు, మొదలైన మత నిష్ఠాపరులు నివసించే చోటు;
 • Monday, n. సోమవారం; ఇందువారం;
 • monetary, adj. ద్రవ్యసంబంధ; డబ్బు సరఫరా, ప్రసరణలకి సంబంధించిన; (rel.) fiscal;
 • money, n. డబ్బు; ధనం; ద్రవ్యం; సొమ్ము; అర్థం; పైకం; రొక్కం; విత్తం; దుడ్డు;
  • coin -, ph. నగదు; నాణేల రూపంలో ఉన్న డబ్బు;
  • earnest -, ph. ధరావత్తు; బయానా;
  • hush -, ph. నోరు మూసుకుని ఉన్నందుకు ఇచ్చే లంచం;
  • ready -, ph. రొక్కం;
 • monger,n. వ్యాపారి; వర్తకుడు;
  • fishmonger, ph. చేపల వ్యాపారి;
 • mongoose, n. ముంగిస; నకులం; [biol.] Viverra ichneumon;
 • mongrel, n. కంచరం; వేరు వేరు జంతువులకి పుట్టినది;
 • monitor, n. పరివీక్షకి; పరివీక్షకుడు;
 • monitor, v. t. పరివీక్షించు;
 • monk, n. సన్యాసి; క్రైస్తవ సన్యాసి; ముని; [Gr. monakos = one who is alone];
 • monkey, n. కోతి; మర్కటం; వానరం; తిమ్మడు; తిమ్మి; మల్లు;
 • mono, pref. ఏక;
 • monoaction, n. ఏకపాత్రాభినయం;
 • monochloromethane, n. ఏకహరితఏకేను; క్లోరోమెతేను; మెతల్‍ క్లోరైడ్‍; ఒక కర్బన రసాయనం పేరు; CH3Cl;
 • monochromatic, adj. ఏకవర్ణపు;
 • monogram, n. ఏకరాత; గొలుసుకట్టు రాత; కలం పైకి ఎత్తకుండా పేరు రాయడం; పేరులోని పొడి అక్షరాలని ఈవిధంగా రాయడం;
 • monograph, n. ఒకే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాసిన గ్రంథం;
 • monolith, n. ఏకశిల;
 • monologue, n. ఏకభాష్యం; ఏకభాషణ; ఏకాంతభాషణ;
 • monopolist, n. గుత్తదారు; గుత్తాధిపతి; ఏకాధికారి; మస్తాౙరు; ఒక సరకును తాను మాత్రమే అమ్ముటకు అవకాశము పొందినవాఁడు;
 • monopoly, n. గుత్తవ్యాపారం; గుత్తాధిపత్యం; ఇజారా; ముస్తాజరీ; మక్తా; [Gr. mono = one, poly= trade];
 • monosaccharide, n. ఏకచక్కెర; గ్లూకోజు ఒక ఉదాహరణ;
 • monosodiumglutamate, n. చైనా ఉప్పు; గ్లూటామిక్ ఆమ్లంతో సోడియం కలవగా వచ్చే లవణం; చైనా, జపాను వంటలలో ఈ ఉప్పుని విరివిగా వాడతారు; MSG; C5H8NNaO4;
 • monotheism, n. ఏకేశ్వరోపాసన;
 • monotone, n.ఏకదిష్టం; ఏకశృతం;
 • monotonic, adj. ఏకదిష్ట; ఏకశృత;
 • monotonic function, ph. ఏకదిష్ట ప్రమేయం;
 • monotonous, adj. ఏకస్వన; ఏకరూప; ఒకే విధంగా ఉండడం వల్ల విసుగు పుట్టించెడు;
 • monotony, n. ఏకరూపత; ఏకస్వరత; విసుగు;
 • monotype, n. అక్షరాల కూర్పు; పాత రోజులలో అచ్చు వేసే పద్ధతి; (rel.) linotype;
 • monsoon, n. (1) వర్షాకాలం; వర్షరుతువు; (2) రుతుపవనాలు;
 • monsoon winds, ph. రుతుపవనాలు;
 • month, n. నెల; మాసం;
  • anomalistic -, ph. 27.55455 రోజులు; చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నపుడు ఒక సమీప బిందువు నుండి, అదే సమీప బిందువుకి చేరుకోవడానికి పట్టే కాలం;
  • draconic -, ph. 27.21200 రోజులు;
  • excalary -, ph. లుప్తమాసం; క్షయమాసం;
  • intercalary -, ph. అధికమాసం;
  • last -, ph. పోయిన నెల; గత మాసం;
  • nodical -, ph. 27.21200 రోజులు;
  • per -, ph. నెలకి; నెలసరి; నెల ఒక్కంటికి; మాసానికి;
  • sidereal -, 27.32166 రోజులు; దూరంగా ఉన్న నక్షత్రాల నేపథ్యంలో చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడానికి పట్టే కాలం;
  • supernumerary -, ph. అధిక మాసం,
  • synodic -, ph. 29.530588 రోజులు; అమావాస్యనుండి అమావాస్య వరకు ఉన్న కాలం;
  • - by month, ph. నెల నెలా;
 • monthly, adj. నెలవారీ; నెలసరి; నెల ఒక్కంటికి;
 • monthly, n. మాసపత్రిక;
 • monument, n. స్మారకం; స్మారక భవంతి; స్మారక కట్టడం;
 • mood, n. మనస్సు; మనస్థితి; మనోభావం; మనోదశ; మానసికావస్థ; భావావేశం;
  • imperative -, ph. [gram.] విధ్యర్థం; ఆజ్నార్డకం;
  • indicative -, ph. నిశ్చితార్దకం;
  • infinitive -, ph. తుమున్నర్ధకం;
  • subjunctive -, ph. సంశయార్ధకం;
 • moody, adj. ముసురు మూతితో ఉండు; మూతి ముడుచుకుని ఉండు;
 • moon, n. చంద్రుడు; నెల; నెలరాజు; రేరాజు; జాబిల్లి; శశి; ఇందు; ఉడుపతి; కడలి మీగడముద్ద; కడలి వెన్న;
  • crescent -, చంద్రవంక; నెలవంక; శశిరేఖ; బాలచంద్రుడు;
  • full -, ph. పూర్ణచంద్రుడు; రాకాచంద్రుడు; నిండు చంద్రుడు;
  • half -, ph. అర్థచంద్రుడు;
  • once in a blue -, ph. ఏటికో, కోటికో, యుగానికో ఒకసారి;
  • waning -, ph. క్షీణచంద్రుడు;
  • waxing -, ph. వర్ధమాన చంద్రుడు;
 • moonlight, n. వెన్నెల; చంద్రరశ్మి; చంద్రకాంతి; చంద్రిక; సుధాకర భాతి; కౌముది;
 • moonquake, n. చంద్రకంపం;
 • moonshine, n. పరిపక్వం చెందని విష్కీ జాతి మాదక ద్రవ్యాలు
 • moonstone, n. ఏణాంక మణి;
 • moor, n. బీడు; బీడు భూమి; మెరక; వ్యవసాయానికి పనికిరాని మెరక భూమి;
 • mooring, n. ఠావు; తావు;
 • mop, n. అలుగ్గుడ్డ; అలుకుజుట్ట;
 • moral, adj. నైతిక;
  • - governor, ph. నైతిక పాలకుడు;
  • - normativity, ph. నైతిక ధార్మికత; నైతికత;
  • - values, ph. నైతిక విలువలు;
 • moral, n. నీతి; కథయొక్క ముఖ్య ఉద్దేశం;
 • morality, n. నీతి; నీతి, నియమం;
 • morass, n. బాడవ నేల;
 • morbid, adj. (1) అనారోగ్యాన్ని సూచించే; రోగాన్ని సూచించే; రోగసూచక; (2) మరణసూచక;
  • - dilation, ph. రోగాన్ని సూచించే ఉబ్బు;
 • morbidity, n. అనారోగ్యం; రోగగ్రస్తం; అనారోగ్యానికి కారణం;
 • mordant, n. వర్ణబంధకి; వర్ణలగ్ని; వర్ణస్థాపకి; color binder;
 • moreover, adv. పైపెచ్చు; పైగా; అంతే కాకుండా;
 • morning, n. ఉదయం; ప్రొద్దు; ప్రభావితం; వరువాత; వేఁకువ; ప్రాతఃకాలం; దివాది;
  • early -, వేఁకువ; ప్రభాతం; తెల్లవారుజాము;
  • good -, శుభోదయం; సుప్రభాతం;
 • morning sickness, ph. వేవిళ్లు;
 • moron, n. మొద్దు; మొద్దావతారం; పశుప్రాయుడు;
 • morph, n. రూపం; పదాంశం;
 • morphemes, n. pl. [ling.] పదాంశాలు; ఒక్క మాటలో అర్థవంతమైన కనిష్ఠాంశాలు; ఉ. చురుకుతనం అనే మాటలో "చురుకు" "తనం" అనే రెండు పదాంశాలు ఉన్నాయి;
  • bound morpheme, ph. నిబద్ధ రూపం; విసంధి లేని మాటలు; ఉదా. ఇంగ్లీషులో inept ని in, ept అని విడదీసి అర్థాలు చెప్పలేము; తెలుగులో చెలులు అన్న మాటని చెలు, లు అని విడదీయలేము;
 • morphine, n. అభిని; నొప్పిని తగ్గించే ఒక బలమైన మందు;
 • morphology, n. రూపనిర్మాణ శాస్త్రం; రూపనిర్మాణం; స్వరూప శాస్త్రం;
 • mortal, adj. మరణించేది; మరణం కలిగించేది;
 • mortality, adj. మరణించేది; చావు; మృత్యువు; మర్త్యత్వం;
 • mortar, n. (1) పొత్రం; ఱోలు; గార; కల్వం; (2) బెందడి; సున్నం; చెక్కసున్నం; సిమెంటు; ఱాతి సున్నం; గార;
 • mortgage, n. గిరవు; తనఖా; కుదువ; అడమానం; ఆయకం;
  • - loan, ph. ఆయకం; గృహార్ణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు;
 • mortician, n. శవసంరక్షకుడు; కాటికాపరి;
 • mortise, n. కుసి బెజ్జం; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రలో పెట్టే బెజ్జం; రెండవ కర్రకి ఉండే ముక్కుని కుసి అంటారు;
 • morsel, n. ముద్ద;
 • mosque, n. మసీదు;
 • mosquito, n. దోమ; చీకటీగ; దంశము; మశకము;
  • - net, ph. దోమతెర;
 • most, adj. గరిష్థ;
 • moss, n. నాచు; పాకుడు; పాచి; శైవాలం; green slime floating in dirty water;
 • mote, n. నలుసు; త్రసరేణువు; చూరు చోంచి వచ్చే కిరణవారంలో తేలియాడుతూ కనిపించే దుమ్ము రేణువు;
 • motel, n. (మొటేల్) కార్లలో ప్రయాణం చేసే ప్రయాణీకుల సౌకర్యం కొరకు కట్టిన హొటేల్; motor + hotel;
 • moth, n. చిమ్మెట; చిల్లక; శలభం; బట్టలను తినే పురుగు; Lepidoptera జాతికి చెందిన పరుపు రెక్కల పురుగు; see also butterfly;
 • mother, adj. తల్లి; మాతృ;
 • mother cell, ph. తల్లి కణం;
  • - land, ph. మాతృభూమి;
  • - planet, ph. మాతృగోళం; మాతృగ్రహం;
  • - tongue, ph. మాతృభాష; తల్లిబాస;
 • mother, n. అమ్మ; అంబ; తల్లి; మాత; జనని; జనయిత్రి; ధాత్రి; తాయి;
  • adoptive -, ph. పెంపుడు తల్లి; పెంచుకున్న తల్లి;
  • birth -, ph. జనక తల్లి; కన్న తల్లి;
  • step -, ph. సవతి తల్లి; మారటి తల్లి;
 • mother-in-law, n. అత్తగారు; భార్య తల్లి; భర్త తల్లి;
 • mother-of-pearl, n. ముత్యపు చిప్ప; ఆలిచిప్ప; ముత్యపు చిప్పలో ఉండే పొర;
 • mothers-in-law, n. pl. అత్తలు;
 • motherhood, n. మాతృత్వం;
 • motif, n. పదే పదే ప్రత్యక్షమయే ప్రసక్తి; కళాత్మక రచనలో ప్రధాన ఆంశం;
 • motility, n. చలనశక్తి; చలనత్వం;
 • motion, n. (1) గతి; చలనం; గమనం; కదలిక; చారణం; చోపనం; (2) విరేచనం; (3) అర్జీ దాఖలు చేయుట; ప్రతిపాదన;
  • forward -, ph. ఋజుర్గతి; ఋజుగతి;
  • proper -, ph. నిజ గమనం; నక్షత్ర నిజగతి;
  • retrograde -, ph. వక్రగతి; పశ్చగమనం; గ్రహచేష్ట; గ్రహం వెనక్కి నడచినట్లు కనబడడం;
 • motion picture, n. చలన చిత్రం; సినిమా;
 • motionless, adj. నిశ్చల;
 • motivate, v. i. అభిముఖీకరించు; అంగీకరించునట్లు చేయు; ప్రేరేపించు;
 • motivation, n. ప్రచోదనం; ప్రేరణ; ప్రేరణకారణం;
 • motive, n. ప్రేరణ; ప్రేరణకారణం; ఉద్దేశము; నిమిత్తము;
 • motor, adj. చలన; చాలక; గతివాహక; జంగమ;
  • - nerves, ph. చలన నాడులు; చాలక నాడులు;
  • - strip, ph. చలనచార; మెదడులో ఈ చెవి వద్దనుండి ఆ చెవి వరకు ఉన్న మేర;
 • motor, n. చాలకం;
  • electrical -, ph. విద్యుచ్చాలకం;
  • mechanical or manual -, ph. చేచాలకం; కైచాలకం; మానవచాలకం;
  • hydro -, ph. జలచాలకం; వాశ్చాలకం;
 • mottle, n. డాగు; మచ్చ; మరక;
 • mount, n. (1) శిఖరం; (2) వాహనం;
 • mound, n. తిప్ప; దిబ్బ; గుట్ట;
 • mount, n. వాహనం; తత్తడి; సవారీ చెయ్యడానికి అనువైన సాధనం;
 • mount, v. t. (1) ఎక్కు; సవారీ చేయు; (2) తొక్కు; పొర్లు;
 • mountain, n. పర్వతం; నగం; గిరి; అద్రి; కొండ; చట్టు;
  • - peak, ph. పర్వత శిఖరం; నగ శృంగం;
 • mourn, v. i. దురపిల్లు;
 • mouse, n. చుంచు; చుంచెలుక; చిట్టెలుక; అంజలిక; గిరిక; ఆఖువు;
  • field -, ph. కల్లెలుక;
 • mouth, n. నోరు; మూతి; వాయి;
 • movable, adj. చర; జంగమాత్మక;
  • - property, ph. చరాస్తి;
 • move, n. (1) ఎత్తు; ఆటలో ఒక ఎత్తు; (2) బదిలీ;
 • move, v. i. (1) జరుగు; (2) కదులు; మెదులు; అదురు; చలించు; (3) తిరుగు; మసలు; చెరలాడు; త్రిమ్మరు; క్రుమ్మరు;
  • do not -, ph. జరగకు; కదలకు; మెదలకు;
  • - with gusto, ph. అదురు;
 • move, v. t. జరపు; కదపు; మెదపు; తరలించు; నప్పు;
  • do not -, ph. జరపకు; కదపకు; మెదపకు;
 • moved, v. i. జరిగిన; కదలిన; మెదలిన;
 • movement, n. (1) చలనం; కదలిక; ఇసిరింత; ధూపనం; గతి; గమనం; (2) ఉద్యమం; (3) ఆందోళన;
  • fast -, ph. ద్రుత గమనం;
  • national -, ph. జాతీయోద్యమం;
  • slow -, ph. మెదలిక;
  • women's liberation -, ph. స్త్రీ విమోచన ఉద్యమం;
 • moving, adj. కదులుచున్న; ఉచ్చల;
 • mrigal, n. ఎర్రమీసు; ఎరమీను; ఒక రకం చేప;
 • mowing, n. లవనము; గడ్డిని కోయడం;
 • mucilage, n. తెమడ; క్లేదము; జిగురు;
 • mucus, n. అమత్వక్కు నుండి స్రవించే ద్రవం; ఇది శ్లేష్మం, కఫం, కళ్లె, చీమిడి, ఏదయినా కావచ్చు; see also phlegm;
 • mucus membrane, n. అమత్వక్కు;
 • mud, n. బురద; బెందడి; పంకము; అడుసు; ఉబ్బలి;
 • muddy, adj. బురద; పంకిలము;
 • muddy-up, adj. కెలుకు; బురద చేయు; పంకిల పరచు;
 • mud minnow, n. మట్టగిడస; ఒక జాతి చేప;
 • muffle, v. t. నొక్కు; అణచివేయు;
 • mug, v. t. మీదపడి కొట్టు;
 • mug, n. పాన పాత్ర; చేతితో పట్టుకోడానికి చెవి ఉన్న పాత్ర; ఒక రకం కప్పు;
 • muggy, adj. ఉక్కగా ఉన్న; ఉమ్మదముగా ఉన్న; వాతావరణంలో వేడి, చెమ్మదనం ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండే అనుభూతి;
 • mujahideen, n. (ముజహిదీన్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; బహువచనంలో ముజహిదీన్;
 • mule, n. కంచర గాడిద; వేసడం; వేష్ట్రం;
 • multi, pref. బహు;
 • multidimensional, adj. బహుప్రమాణ;
 • multifaceted, adj. విశ్వతోముఖ; బహుముఖ;
 • multilingual, adj. బహుభాషా;
  • - center, ph. బహుభాషా కేంద్రం;
 • multilingualism, n. బహుభాషితం;
  • multimedia, n. pl. బహుళ మాధ్యమాలు;
 • multinationals, n. pl. బహుళజాతి కంపెనీలు;
 • multiple choice, adj. ph. బహూత్తర; బహుళైచ్చిక;
 • multiplex, adj. బహుముఖ;
 • multiplexer, n. బహుముఖి; ఒక వాకేతాన్ని అనేక దిశలలో పంపిణీ చేసే యంత్ర సాధనం;
 • multiplicand, n. గుణ్యం;
 • multiplication, n. గుణకారం; హెచ్చవేత; నిహతం;
  • cross -, ph. వజ్రగుణకారం; అడ్డగుణకారం;
  • - table, ph. ఎక్కం; గుణకార సారణం; గుణసారణి;
 • multiplier, n. గుణకం;
 • multiply, v. i. వృద్ధిపొందు;
 • multiply, v. t. గుణించు; హెచ్చవేయు;
 • multipurpose, adj. బహుళార్థక; బహుళార్థసాధక;
 • multitude, n. సందోహం;
 • mumble, v. i., v. t., సణుగు; గొణుగు;
 • mummy, n. చిరకాలం శిధిలమైపోకుండా ఉన్న శవం;
 • mumps, n. గవదలు; గాలిబిళ్లలు; పాషాణగర్ధభం; చెవుల వెనక ఉన్న గ్రంథులు వాచడం; ఒక వైరస్‍ వల్ల వచ్చే జబ్బు;
 • mundane, adj. (1) ప్రాపంచిక; లౌకిక; ఇహలోక సంబంధమైన; (2) నిరుత్తేజమైన; ఉత్సాహం లేని; బోరు కొట్టే;
 • municipal, adj. పురపాలక;
  • - high school, ph. పురపాలక ఉన్నత పాఠశాల;
 • municipality, n. పురపాలక సంఘం;
 • munificence, n. ధాతృత్వం;
 • murals, n. భిత్తి చిత్రాలు; గోడ మీద చిత్రించబడే చిత్రాలు;
 • murder, n. హత్య; ఖూనీ; హననం;
 • murderer, n. హంత; m. హంతకుడు; f. హంతకి; హంతకురాలు;
 • murmur, n. మురముర; గుసగుస; ముర్మర ధ్వని; గొణుగుడు;
 • muscle, n. కండరం; స్నాయువు; పేశి;
  • biceps -, ph. ద్విసిర కండరం; దండ;
  • triceps -, ph. త్రిసిర కండరం;
 • museum, n. సంగ్రహాలయం; చిత్రవస్తు ప్రదర్శనశాల;
 • mushroom, n. పుట్టగొడుగు; పుట్టకొక్కు; అహిచ్ఛత్రం; కవకం; క్యాకువు; ఒక రకమైన శిలీంధ్రం; -- see also toadstool
 • music, n. (1) సంగీతం; గీత వాద్య సమ్మేళనం; (2) స్వరకల్పన;
  • classical -, ph. శాస్త్రీయ సంగీతం;
  • extempore -, ph. మనోధర్మ సంగీతం; మనోధర్మం;
  • folk -, ph. జానపద సంగీతం;
  • instrumental -, ph. వాద్య సంగీతం; వాదనం;
  • orchestra -, ph. బహువాద్య సమ్మేళన సంగీతం; బహువాద్య సమ్మేళనం;
  • vocal -, ph. గాత్ర సంగీతం; గాత్రం;
 • musical, adj. సంగీత; స్వర;
  • - composition, ph. సంగీత రచన; స్వరకల్పన;
  • - notes, ph. స్వరములు; భారతీయ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అనే 7 స్వరములు వాడతారు. పాశ్చాత్య సంగీతంలో అదే వ్యవధిలో 12 స్వరములు వాడతారు; స, రి, రి, గ, గ, మ, ప, ప, ద, ద, ని, ని అని వాడతారు;
  • - instruments, ph. వాద్యములు;
  • - score, ph. స్వరకల్పన;
 • musical, n. సంగీత నాటకం; యక్షగానం;
 • musings, n. ఊహాగానాలు;
 • musk, n. కస్తూరి; మృగనాభి; కురంగనాభం; ఇఱ్ఱి గోరజం; హరిణమదం; ఒక జాతి లేడి పొట్ట దగ్గర ఉండే తిత్తులలో దొరికే ఎరుపు రంగు బంక లాంటి పదార్థం; దీన్ని సుగంధ అత్తరుల తయారీలో వాడతారు;
 • musk deer, n. కస్తూరి మృగం; కుచ్చుల మెకం; కస్తూరి కురంగం; ఇఱ్ఱి;
 • musk rat, n. కంపెలుక; చుచ్చుందరం;
 • muslin, adj. ఉలిపిరి;
 • muslin cloth, ph. ఉలిపిరి బట్ట; పలుచని బట్ట;
 • mustache, n. మీసం; శ్మశ్రువు;
  • wearing a -, ph. మీస ధారణ;
 • mustard, n. ఆవాలు;
  • black -, ph. నల్ల ఆవాలు; [bot.] Brassica nigra;
  • Indian -, ph. ఎర్ర ఆవాలు; [bot.] Brassica juncea;
  • white -, ph. తెల్ల ఆవాలు; కదంబకం; [bot.] Brassica alba;
 • muster, n. పనివాళ్ల పేర్ల జాబితా;
 • musty, adj. గవులు కంపు; ముక్క వాసన; గుహల వాసన;
 • mutability, n. మార్పు; మారే తత్త్వం;
 • mutadis mutandis, ph. వివరములలో తగిన మార్పులతో;
 • mutagen, n. ఉత్పరివర్తకం;
 • mutation, n. ఉత్పరివర్తన; యాధృచ్ఛిక పరివర్తన; మార్పు;
  • dominant -, ph. ప్రబల ఉత్పరివర్తన;
  • recessive -, ph. మసక ఉత్పరివర్తన;
 • mutiny, n. తిరుగుబాటు;
 • muttering, n. గొణుగుడు; సణుగుడు;
 • mutton, n. మేకమాంసం; గొర్రె మాంసం;
 • mutual, adj. పరస్పర; పారస్పర్య; అన్యోన్య; ఉభయ;
  • - agreement, ph. పరస్పర అంగీకారం; ఒకరితో మరొకరు అంగీకరించడం;
  • - dislike, ph. ఒకరినొకరు నచ్చుకోకపోవడం;
 • mutually, adv. ఉభయతారక; పరస్పర;
  • - beneficial, ph. ఉభయతారకం; పరస్పరం లాభకరం;
  • - complimentary concepts, ph. పరస్పర పూరక భావాలు;
  • - dependent, adj. పరస్పరాశ్రయ;
  • - dependent, n. పరస్పర ఆశ్రయాలు;
  • - exclusive, adj. పరస్పర వ్యావర్తక;
  • - exclusive environments, ph. పరస్పర వ్యావర్తక పరిసరాలు;
  • - opposed, ph. విప్రతిపన్నం;
 • muzzle, n. (1) ముట్టె; పశువుల మూతి భాగం; (2) తుపాకి; ఫిరంగి మొదలైన ఆయుధాల మూతి;
 • my, pos. pron. నా; నాది; మదీయ; నా యొక్క;
 • mycelium, n. బూజు; శిలీంధ్రజాలం;
 • mycology, n. శిలీంధ్రశాస్త్రం;
 • myna, n. మైనా పిట్ట; గోరువంక; గోరింక;
 • myopia, n. హ్రస్వదృష్టి; దగ్గర వస్తువులు మాత్రమే కనబడే దృష్టి దోషం; (ant.) presbyopia;
 • myriad, n. అయుతం; చెప్పలేనన్ని; బోలెడు; లెక్కకు మీరిన;
 • myrrh, n. సాంబ్రాణి;
 • mystery, n. (1) హేత్వాతీతం; హేతువుకి అందనిది; గుహ్యము; (2) అపరాధ పరిశోధక కథ;
 • mystic, n. m. తాంత్రికుడు; ఆధ్యాత్మికుడు; మార్మికుడు;
 • mystique, n. (మిస్టీక్)(1) కొందరి వ్యక్తుల చుట్టూ ఉండే భయ-భక్త వాతావరణం; (2) కొన్ని కార్యక్రమాలచుట్టూ ఉండే రహశ్య వాతావరణం;
 • mystical, adj. ఆధ్యాత్మిక; తాంత్రిక; దురవగాహమైన; సులభంగా ఆకళింకు లొంగని;
 • myth, n. (1) సత్యదూరం; బూటకం; కల్పిత గాథ; పుక్కిటి పురాణం; (2) పురాణము; పురాణ కథ;
 • mythological, adj. పౌరాణిక;
 • mythology, n. పౌరాణిక కథ; పురాణ గాథా సర్వస్వం; పురాణం;

మూలం