"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (N, O)

From tewiki
Jump to navigation Jump to search

నిఘంటువు

 • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
 • This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as n added feature.
 • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
 • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

19 Aug 2015.

Part 1: N

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • nadir, n. నీచ; అధోబిందువు;
 • nag, v. t. సాధించు; నసపెట్టు; సణుగు; వేధించు;
 • nail, n. (1) గోరు; నఖం; కరజం; (2) మేకు;
  • - clipper, n. నఖోత్పాటని; గోళ్ల కత్తెర; కరజ కత్తెర;
 • naive, adj. (నయీవ్) అమాయకపు; కుటిలం కాని; వెర్రిబాగుల; పిచ్చి; కపటరహిత; బోళా; పున్నపూస;
  • - man, ph. వెర్రిబాగుల వాడు; అమాయకుడు;
  • - woman, ph. వెర్రిబాగులది; అమాయకురాలు;
 • naivetè, n. (నయీవెట్టే) అమాయకత్వం; ముగ్ధత్వం; బోళాతనం; సరళత;
 • naked, adj. (1) నగ్న; దిగంబర; దిసమొల; అంగమొల; దడ్డు; అనావృత; బిత్తలి; (2) అలంకారంలేని;
  • - beauty, ph. నగ్న సౌందర్యం;
  • - eye, ph. నగ్న నయనం;
  • - man, ph. దిగంబరుడు; నగ్నుడు; అవధూత; బిత్తలి;
  • - truth, ph. నగ్న సత్యం; పచ్చి నిజం;
 • name, n. (1) పేరు; నామధేయం; నామం; (2) కీర్తి;
  • christian -, ph. పెట్టిన పేరు;
  • descriptive -, ph. అన్‌వర్థ నామం; సార్థక నామం;
  • family -, ph. ఇంటి పేరు;
  • fanciful -, ph. యౌగిక పదం;
  • first -, ph. పెట్టిన పేరు;
  • given -, ph. పెట్టిన పేరు;
  • last -, ph. ఇంటి పేరు;

---Usage Note: names

 • ---Use first names when you know the person well. Use someone's title and last name in formal situations : Professor Mitra, could I make an appointment to see you? You can use title alone without using their last name: What is wrong with me, Doctor? However, the titles Mr., Mrs., Ms. Can only be used if you are also saying someone's last name : Hello! Mrs. Gupta, how are you? Last names are rarely used alone, unless you know each other very well. When someone has the title Sir, use the title with their first name : Say, Sir Winston, not Sir Churchill.
 • name, v. t. పేరుపెట్టు; నామకరణం చేయు;
 • nameless, adj. పేరులేని; అనామక;
 • namesake, n. పేరింటిగాడు; పేరింటిగత్తె;
 • nano, adj. pref. నేనో; అత్యాతి సూక్ష్మ; బిలియనులో ఒక పాలు మోతాదులో ఉన్న భాగాలని సూచించే ప్రత్యయం;
 • nanometer, n. నేనో మీటరు; మీటరులో బిలియనో వంతు; 10−9 మీటరు;
 • nanosecond, n. నేనో సెకండు; సెకండులో బిలియనో వంతు;
 • nameplate, n. నామఫలకం;
 • nap, n. కునుకుబాటు; అల్పనిద్ర;
 • napalm, n. భగ్గుమని మండే రసాయనం; naphthalene + palmitic acid
 • nape, n. మెడ; కంధరం; గ్రీవం; గొంతుక యొక్క వెనుక భాగం;
 • napkin, n. చిరుతుండు; చిన్న తువ్వాలు;
 • naphthalene balls, n. pl. కల్రా ఉండలు;
 • narcissism, n. ఆత్మవ్యామోహం;
 • narcissist, n. స్వయంమోహితుడు; మోతాదు మించిన ఆత్మాభిమానం కలిగి ఉండే వ్యక్తి; సహానుభూతి లేకపోవడం, గర్వంతోటీ, అహంభావంతోటీ ఉండడం, తానే మొనగాడినని అనుకోవడం, ఇతరుల ప్రశంశలకొరకు ఎదురు చూడడం, వంటి లక్షణాలు ప్రదర్శించే ఒక మానసిక రోగి; ఈ వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. (rel.) psychopath కూడా స్వయం మోహితుడే కాని ఈ వ్యక్తి చెడ్డ పని చేసినప్పుడు నలుగురు ఏమనుకుంటాఋఓ అనే భయం ఉండదు;(see also sociopath and psychopath)
 • narcissistic, adj. స్వయంమోహిత;
 • narcosis, n. మత్తు;
 • narcotic, n. మాదకం; బుద్ధిని మందగింప చేసే పదార్థం; (ety.) [Gr. narcos = stupor]; English adjective stupid is also derived from this; opium and its derivatives like morphine, codeine, and heroine are examples of narcotics;
 • nares, n. ముక్కురంధ్రములు; చెరమలు; ముక్కుపచ్చలు;
 • narrate, v. t. చెప్పు; వివరించు;
 • narration, n. (1) కథ; (2) కథనం; కథాగమనం; కథితం; ఆఖ్యానం; చెప్పడం;
 • narrative, n. ఆఖ్యానం; ఉపాఖ్యానం; కథనం; వృత్తాంతం; కథ; కథితం; ఉదంతం, udaMtaM;
 • narrator, n. ఆఖ్యాత; m. కథకుడు; కథావాచకుడు; ఆఖ్యాయికుడు; f. కథావాచకి;
 • narrow, adj. సన్నని; ఇరుకైన; సంకుచితమైన; వెడల్పు కాని;
  • - mindedness, ph. సంకుచిత మనస్తత్వం; సంకుచిత స్వభావం;
 • nasal, adj. అనునాసిక; నాసికా; ముక్కుకి సంబంధించిన;
  • - cavities, ph. చెరమలు;
 • nasals, n. అనునాసికములు; ముక్కుతో పలికే అక్షరాలు; ణ, న, మ, ం;
 • nascent, adj. నవజాత; సద్యోజాత; ఉద్భవ; ప్రారంభ దశలో ఉన్న; అప్పుడే పుట్టిన;
  • - state, ph. నవజాత స్థితి; ఆరంభ దశ; సద్యోజాత స్థితి;
 • nasopharynx, n. నాసికా సప్తపథ;
 • nasty, adj. ఏభ్య; రోతైన; అసహ్యమైన;
  • - fellow, ph. ఏభ్రాసి = ఏభ్య + రాసి;
 • natal, adj. పుట్టుకకి సంబంధించిన; జన్మకి సంబంధించిన;
 • nates, n. pl. పిరుదులు;
 • nation, n. జాతి; దేశం; రాజ్యం;
  • father of the -, ph. జాతిపిత;
 • national, adj. జాతీయ; దేశ; దేశీయ;
  • - anthem, ph. జాతీయ గీతం;
  • - consciousness, ph జాతీయ చైతన్యం;
  • - debt, ph. జాతీయ రుణం;
  • - monument, ph. జాతీయ స్థూపం;
  • - wealth, ph. జాతీయ సంపద;
 • national, n. m. దేశస్థుడు; పౌరుడు;
 • nationalist, n. జాతీయవాది;
 • nationality, n. దేశీయత;
 • nationalization, n. జాతీయీకరణం;
 • nationwide, adj. దేశవ్యాప్తంగా;
 • native, adj. సహజ; స్వంత; సొంత; ప్రాకృత; దేశీ; దేశవాళీ; స్వదేశీ; మాతృ; నాటు; నిసర్గ;
  • - crop, ph. దేశవాళీ పంట;
  • - land, ph. మాతృభూమి; అభిజనం;
  • - stuff, ph. నాటు సరుకు; దేశవాళీ సరుకు;
  • - tongue, ph. మాతృభాష;
  • - place, ph. సొంత ఊరు; స్వంత ఊరు; స్వస్థలం;
  • - vocabulary, ph. దేశీ పదజాలం;
 • native, n. s. (1) ఒక ప్రదేశానికి చెందినది; (2) జాతకుడు;
 • natives, n.pl. నిసర్గములు; నిసర్గులు;
 • natural, adj. ప్రకృతి సిద్ధమైన; ప్రాకృతిక; స్వతసిద్ధమైన; స్వభావ సిద్ధమైన; స్వభావికమైన; సిద్ధ; సహజమైన; నైజ; నైసర్గిక; ఆధిభౌతిక;
  • - forces, ph. ప్రకృతి శక్తులు; సహజ శక్తులు;
  • - gas, ph. వంటవాయువు; సహజ వాయువు;
  • - luminosity, ph. నైసర్గిక తేజం;
  • - numbers, ph. సహజ సంఖ్యలు;
  • - oil, ph. సిద్ధ తైలం;
  • - period, ph. [gram.] సిద్ధ బిందువు; వాక్యం చివర వచ్చే విరామ సంకేతం;
  • - philosophy, ph. ఆధిభౌతిక శాస్త్రం;
  • - property, ph. నైసర్గిక గుణం;
  • - selection, ph. నైసర్గిక నిర్ణయం; ప్రాకృతిక వరణం; సహజ సంవరణ;
 • naturality, n. స్వాభావికత;
 • nature, n. (1) ప్రకృతి; నిసర్గము; (2) స్వభావం; స్వయంభు; నైజం; స్వతహా; సహజం; లక్షణం; ప్రవృత్తి;
  • by -, ph. స్వతహాగా;
  • - or nurture?, ph. ప్రకృతా, పెంపకమా?
 • naturopathy, n. ప్రకృతి వైద్యం; కూరగాయ వైద్యం;
 • naught, n. సూన్యం; సున్న;
 • naughty, adj. ఆకతాయ; కొంటె; ఉలిపి;
 • nausea, (నాసియా) n. కడుపులో తిప్పు; వికారం; వమనేచ్ఛ;
 • nauseating, adj. కడుపులో తిప్పు కలిగించే; వికారం కలిగించే; అసహ్యకరమైన;
 • nauseous, (నాషస్) adj. కడుపులో తిప్పుపెట్టు; అసహ్యం కలిగించు;
 • nautical, adj. నావిక; సముద్రానికి సంబంధించిన;
  • - almanac, ph. నావిక పంచాంగం;
  • - mile, ph. దూరాన్ని కొలవడానికి భూమి చుట్టుకొలత ఆధారంగా నిర్ణయించిన కొలమానం; ఒక డిగ్రీలో 60 వ వంతు దూరంలో ఉన్న అక్షాంశం యొక్క దూరం; 1 nautical mile = 1.508 statute mile; (note) 1 nautical mile/sec = 1 knot;
 • naval, adj. నావిక; నౌకాదళానికి సంబంధించిన;
  • - base, ph. నావికా పీఠం; నావికా స్థావరం;
 • navel, n. బొడ్డు; నాభి;
  • - orange, n. బొడ్డు నారింజ; నాభి నారింజ;
 • navigable, n. నావ్యం; పడవలు వెళ్లడానికి వీలైనది;
 • navigation, n. మాలిమి; మార్గనిర్దేశకం; నౌకాగమనశాస్త్రం;
 • navigator, n. నియామకుడు; మార్గదర్శక్; మాలిమి; మాలిమికాడు; నావని నడపడానికి దారి చూపే వ్యక్తి;
 • navy, n. నౌకాదళం; నౌకాబలం;
 • near, adj. దగ్గర; సమీప;

---Usage Note: near, close

 • ---Use near and close to talk about short distances. Close is usually followed by to, but near is not: We live close to the temple; There is a market near our house.
 • nearby, adj. దగ్గరలో; సమీపంలో;
 • nearsightedness, n. హ్రస్వదృష్టి, దగ్గర వస్తువులని మాత్రమే చూడగలగటం; myopia;
 • nebula, n. నీహారిక; తేజోమేఘం; జ్యోతిర్మేఘం; వెలిమబ్బు; శుక్లపటలం; ఆకాశంలో, కొద్ది కాంతితో, తెల్లని మబ్బులా కనిపించే నభోమండలాలకి ఇది సామాన్య నామం;
  • planetary -, ph. గ్రహరూప నీహారిక;
  • ring -, ph. అంగుళ్యాకార నీహారిక;
 • necessity, n. ఆవశ్యకత; తప్పనిసరి అవసరం; జరూరు;
 • neck, n. మెడ; గొంతు; పీక; కంఠం; కుత్తుక; అర్రు;
 • neck deep, adj. కుత్తుకబంటి;
 • necklace, n. నేవళం; తావళం; కంఠహారం; గొలుసు; ప్రాలంబం; నెక్లేసు; త్రిసరం;
 • necromancy, n. భవిష్యత్తుని చెప్పించడానికి ప్రేతాత్మని పిలవడం;
 • necropolis, n. శ్మశానవాటిక; శ్మశానం;
 • nectar, n. మకరందం; మరందం; పూదేనె; శీధువు;
 • nectary, n. మకరంద కోశం;
 • need, n. అవసరం; అక్కర; జరూరు; గర్జు; ప్రయోజనం;
  • future -, ph. ఊర్జస్సు;
  • immediate -, ph. ఇష;
 • needful, adj. కావలసిన;
 • needle, n. సూది; సూచి; కంటకం; ముల్లు;
  • point of a -, ph. సూది మొన; సూచీముఖం;
 • needlessly, adv. అనవసరంగా;
 • needy, n. అవసరం ఉన్నవారు; బీదవారు; లేనివారు;
 • neem, n. వేప; నింబ; see also margosa;
 • nefarious, adj. ఘోర; అధమ; క్రూర; దుర్మార్గ;
 • negate, v. t. ఖండించు; తిరస్కరించు; రద్దు చేయు;
 • negative, adj. రుణ; రుణాత్మక;
  • - electricity, ph. రుణ విద్యుత్తు;
  • - pole, ph. రుణ ధ్రువం;
  • - quantity, ph. రుణ రాశి;
  • - sign, ph. రుణ సన్న;
 • negative, n. వ్యతిరేకం; వ్యతిరేకార్థం;
 • neglect, v. i. అశ్రద్ధ చేయు; ఉపేక్షించు; తాత్సరం చేయు;
 • negligence, n. అశ్రద్ధ; ఉపేక్ష; తాత్సారం; యాలం;
 • negligible, n. అశ్రద్ధచేయదగినంత; ఉపేక్షణీయమైన; ఉపేక్షించదగినంత; స్వల్పమైన;
 • negotiate, v. t. సంప్రదించు; చర్చించు;
 • negotiations, n. సంప్రదింపులు;
 • neighborhood, n. పొరుగు; నికటం; వాడకట్టు; చేరువు; చేరుబడి; పరిసరం; పేట; సామంతి; ఆజుబాజు;
 • neighboring, adj. సామంత; పరిసర;
 • neighbors, n. పొరుగువాళ్లు; ఇరుగువాళ్ళు; ఇరుగు పొరుగులు; సామంతులు;
 • nematode, n. నులిపురుగు జాతి పురుగు;
 • neo, adj. నూతన; కొత్త; నవ; నవ్య; అధునాతన;
 • neoclassical, adj. నవ్యసంప్రదాయిక;
 • Neodymium, n. నియొడీమియం (Nd), అణుసంఖ్య = 60, విరళ మృత్తిక మూలకం, ఇది నిజానికి అంత అరుదైన (విరళ) మూలకం కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; (note) నియోబియం (Niobium) అనేది 41వ మూలకం, దీని హ్రస్వనామం Nb)
 • neolithic age, n. కొత్తరాతి యుగం; నవశిలా యుగం;
 • nephron, n. మూత్రపిండంలోని సూక్ష్మ కణం;
 • nephritis, n. మూత్రపిండముల వాపు; వృక్కశోఫ;
 • nepotism, n. బంధు పక్షపాతం; ఆశ్రీత పక్షపాతం;
 • Neptune, n. (1) సౌర కుటుంబంలో ఒక గ్రహం; (2) రోమను పురాణాలలో సముద్రాలకి అధిపతి;
 • nerve, n. నరం; నాడీతంతువు; మజ్జాతంతువు; నాడి;
  • afferent -, ph. అంతర్ముఖ నాడి;
  • auditory -, ph. శ్రవణ నాడి;
  • efferent -, ph. బహిర్ముఖ నాడి;
  • motor -, ph. చలన నాడి; చాలక నాడి;
  • - center, ph. నాడీ కేంద్రం;
  • - fiber, ph. నాడీ తంతువు;
 • nervous, adj. (1) నాడీ మండలానికి సంబంధించిన; (2) ఆత్రుతతో చిరచిరలాడు;
  • - system, ph. నాడీ మండలం;

---Usage Note: nervous, concerned, anxious

 • ---Use nervous when you feel worried or frightened about something that is going to happen soon : Bhaskar was nervous about talking in front of the class. Concerned also means "worried but it is used when you are worried about a specific problem. Padma is concerned about the impact of pollution on public health. Use anxious when you are worried that something bad has happened to someone you know : Her husband became anxious when her flight was delayed.'
 • nescience, n. అవిద్య;
 • ness, suff. తనం;
 • nest, n. గూడు; పక్షుల నివాసం;
 • nestling, n. గూటిపిట్ట;
 • net, adj. నికర;
  • - income, ph. నికరాదాయం;
 • net, n. వల;
 • nether world, n. పాతాళం;
 • nettle, n. దురదగొండి మొక్క; దూలగొండి మొక్క;
 • network, n. జాలం; పరివాహం; వలయం;
  • electrical -, ph. విద్యుత్ వలయం;
  • neural -, ph. నాడీవలయం;
 • neuralgia, n. నాడీ తంతులు పాడవడం వల్ల వచ్చే పోటు, మంటతో కూడిన నొప్పి; నాడీ తంతులు పాడవడానికి అనేక కారణాలు ఉండొచ్చు;
  • trigeminal -, ph. వాచిన రక్తనాళం మెదడు నుండి ముఖం మీదకి వచ్చే నాడీ తంతిని తాకి ఒత్తిడి పెడితే ఈ రకం నొప్పి వస్తుంది;
 • neurology, n. నాడీ మండల శాస్త్రం;
 • neuron, n. నాడీ కణం;
 • neurosis, n. భౌతిక లక్షణాలు బయటకి పొడచూపని మానసిక రోగం;
 • neurotmesis, n. శరీరంలో ఉపరితలానికి చేరువలో ఉన్న నాడీతంతువు తెగిపోవడం; ఇలా జరిగినప్పుడు శరీరం పూర్తిగా కోలుకోలేదు;
 • neuter, adj. నపుంసక;
 • neutral, adj. తటస్థ; ఉదాసీన; ఉపేక్ష; నిష్పాక్షిక; మధ్యస్థ;
  • - equilibrium, ph. తటస్థ నిశ్చలత; ఉదాసీన సంతుల్యం;
 • neutrality, n. తాటస్థ్యం; ఉదాసీనత;
 • neutralization, n. తటస్థీకరణ; ఉదాసీనకరణ; నిర్బలీకరణ; నిరాకరణ;
 • neutralize, v. t. తటస్థీకరించు; ఉదాసీనపరచు; నిర్బలీకరించు;
 • nevertheless, adv. అయినప్పటికీ; ఎటొచ్చీ;
 • never mind, ph. పరవాలేదు;
 • new, adj. కొత్త; నూతన; వినూత్న; నవ్య; నవ; అభినవ; నవీన; (rel.) modern;
  • brand -, ph. సరికొత్త; క్రొంగొత్త;

---Usage Note: new, recent, modern, current, contemporary, up-to-date, latest

 • ---Use new to talk about something that has existed for a short time: Have you seen Taroor's new book? Is this a new car? Use recent to talk about something, especially an event, that happened a short while ago: He won a first prize in the recent national debates. Use modern to describe things that exist now and are different from the previous versions: modern machinery, modern English. Use current to describe something that exists now but that may change: the current stock market crisis. Use contemporary to describe things or people that existed at the same tie: Nehru and Patel were contemporaries. Use up-to-date to describe the newest: up-to-date technology. Use latest to describe the newest thing in a series of similar things: the latest issue of India Today.
 • newfangled, adj. పిదపకాలపు;
  • - ideas, ph. పిదపకాపలు బుద్ధులు;
 • newmoon, n. కొత్త చంద్రుడు; బాల చంద్రుడు; నెలవంక;
  • - day, ph. అమావాస్య;
 • news, n. వార్త; వార్తలు; సమాచారం; ఉదంతం; వృత్తాంతం; కబురు; కబుర్లు; విశేషాలు; సుద్ది; వర్తమానం; వక్కాణము, వాచికం; జనశ్రుతి; మతలబు;
  • ---(note) news అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా దీనిని తెలుగులో వార్త అని ఏక వచనంలో అనవచ్చు లేదా వార్తలు అని బహు వచనంలో అనవచ్చు;
  • orally conveyed -, కబురు; కబుర్లు; వాచికం;
 • newsletter, n. వార్తాపత్రం; చిన్న వార్తాపత్రిక;
 • newspaper, n. వార్తాపత్రిక;
 • newt, n. నల్లికండ్లపాము;
 • next, adj. మరుసటి; తర్వాత; వచ్చే; రాబోయే;
  • - day, ph. మరునాడు; తర్వాత రోజు; మరుసటి రోజు;
  • - of kin, ph. ఆప్తులు; సన్నిహితులు; తర్వాత వారు;
  • - week, ph. వచ్చే వారం;
 • nib, n. పాళీ;
 • nibble, v. t. కొంచెం కొంచెం తిను;
 • nice, adj. మంచి; బాగున్న; ఉల్లాసకరమైన;
 • nicely, adv. బాగా;
 • niche, (నీచ్) n. ఉనికిపట్టు; స్థావరం; గూడు; అరగూడు; గోడలో దొలిచిన బెజ్జం;
 • Nickel, n. నికెల్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 28, సంక్షిప్త నామం, Ni);
 • nickname, n. ముద్దుపేరు; వేడుక పేరు; మరోపేరు;
 • niggard, n. లోభి; పిసినిగొట్టు;
 • night, n. రాత్రి; రేయి; నిసి; నిశీధి; మాపు; నక్తము; తమి; రాతిరి; నిశ; విభావరి; రజని; యామిని;
  • at -, ph. రాత్రికి; మాపటికి;
  • dead of -, ph. అపరాత్రి;
 • night blindness, n. రేచీకటి;
 • nightmare, n. పీడకల;
 • night stalker, n. నక్తంచరుడు;
 • night-vision goggles, n. నిశాదర్శిని;
 • nihilism, n. శూన్యవాదం;
 • nil, n. పూజ్యం;
 • nimbus cloud, n. వృష్టిక మేఘం; కారుమబ్బు;
 • nip, v. t. తుంచు;
 • nipple, n. (1) తిత్తి; పీక; చూచుకం; (2) చనుమొన; కుచాగ్రం; స్తనాగ్రం;
 • nirvana, n. నిర్వాణం; అపవర్గం; మోక్షం; మహదానందం;
 • nit, n. పేను గుడ్లు; ఈపి కట్టు;
 • nitration, n. నత్రీకరణ;
 • nitre, n. సురేకారం; పెట్లుప్పు;
 • nitric acid, n. నత్రికామ్లం;
 • Nitrogen, n. నత్రజని; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు; (అణుసంఖ్య 14, సంక్షిప్త నామం, N);
 • nitwit, n. తమందం;
 • no, adv. కాదు;
 • no, it is not so. ph. అలా కాదు;
 • nobility, adj. గౌరవ సూచక;
  • - particle, ph. పేరులో ఎక్కడో ఒక చోట గౌరవ సూచకంగా తగిలించే ప్రత్యయం; ఉదా. టంగుటూరి ప్రకాశం పంతులు; మహర్షి బులుసు సాంబమూర్తి; వాస్కో డి గామా; పియర్ డి ఫెర్మా; మొదలైనవి; ఇవి దేశ, కాల, పరిస్థితులని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాలలో వీటిని కేవలం మర్యాదకి మాత్రమే వాడి, చట్టపరమైన దస్తావేజుల వంటి కాగితాలలో వాడరు;
 • nobility, n. (1) ప్రభువులు; గొప్పవారు; ఆర్యులు; గౌరవనీయులు; (2) ఉదారత;
 • noble, adj. గొప్ప; ఉత్కృష్ట; ఉదాత్త;
 • nobleman, n. ప్రభువు; ఘనుడు; ధనికుడు; గొప్పవాడు; అమీరు;
 • nocturnal, adj. నిశాచర; రాత్రించర; స్వప్న;
  • - bird, ph. నిశాచర పక్షి;
  • - emission, ph. స్వప్నస్కలనం;
 • nod, v. t. తల పంకించు; తల ఆడించు; తల ఊపు; సమ్మతి తెలుపుతూ తలని పైకీ కిందికీ ఆడించడం; see also shake;
 • node, n. (1) ముడి; కణుపు; గ్రంధి; స్కంధాంతం; స్కంధశిఖరం; గంటు; పర్వం; కన్ను; (2) [astron.] గ్రహపాతం; కక్ష్యాపాతం;
 • nodes, n. pl. [astron.] రాహు,కేతువులు; సూర్య, చంద్రుల కక్ష్యా ఖండన బిందువులు;
 • nodule, n. కుదుపం; ప్రావరం; కంతి;
  • olfactory -, ph. గంధ కుదుపం; గంధ ప్రావరం;
  • polar -, ph. ధ్రువ కంతి;
 • noise, n. రొద; గోల; శబ్దం; సద్దు; సవ్వడి; చడి; సడి; చప్పుడు; ధ్వని; అలికిడి; అలబలం; కలకలం; గొల్లు;
  • radio -, ph. రేడియో రొద;
  • thermal -, ph. తాపపు రొద;
  • white -, ph. తెల్ల రొద;

---Usage Note: noise, sound

 • ---Sound is something you hear. Noise is loud unpleasant sounds.
 • noma, n. నోటిపూత;
 • nomad, n. దిమ్మరి; దేశ దిమ్మరి; సంచారి;
 • nomenclature, n. పరిభాష; see also jargon; notation;
 • nominal, adj. నామకః; నామకార్థం; నామమాత్రం; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే;
 • nominate, v. i. ప్రతిపాదించు; నియమించు; నియోగించు; పేర్కొను; నామినేటు చేయు;
 • nominative case, n. [gram.] కర్తృకారకం;
 • nomination, n. ప్రతిపాదన; నియామకం; నామనిర్దేశం; నామినేషన్;
 • nominator, n. ప్రతిపాదకుడు; ప్రతిపాదకి;
 • nominee, n. ప్రతిపాదితుడు; నియుక్తుడు; నియోజితుడు;
 • non, pref. ఇతర;
 • non-aligned, adj. అలీన; తటస్థ;
 • non-aligned countries, ph. అలీన దేశాలు; తటస్థ దేశాలు;
 • non-Andhras, n. ఆంధ్రేతరులు;
 • non-committal, adj. ఉదాసీన;
 • non-empty, adj. అక్షయ;
 • non-conventional, adj. సంప్రదాయేతర;
 • non-entity, n. అపదార్థం;
 • non-existence, adj. నకించనత్వం;
 • non-formal, adj. నియతేతర;
 • non-ideal, adj. ఆదర్శేతర;
 • non-stop, adj. ఎకాయకీ; ఎడతెరపి లేకుండా; ఆగకుండా; ఏకబిగిన; ఏకధాటిగా;
 • nonagon, n. నవభుజి;
 • nonane, n. నవేను; తొమ్మిది కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం;
 • non-detailed text, ph. ఉపపాఠ్యం;
 • non-dual, adj. అద్వైత;
 • none, adj. ఎవరూ కాదు; ఏదీకాదు; (ety.) no one; a rare example of sandhi in English;
 • non-edible, adj. అఖాదీ;
 • non-edible oil, ph. అఖాదీ తైలం;
 • non-existent, adj. అభూత;
 • nonlinear, adj. విరళ; వక్ర; నరాళ; వంకర అయిన;
  • - equation, ph. విరళ సమీకరణం; నరాళ సమీకరణం;
  • - differential equation, ph. విరళ అవకలన సమీకరణం;
  • - partial - -, ph. విరళ పాక్షిక అవకలన సమీకరణం;
 • non-metal, n. అలోహం; లోహం కానిది; ఉ: ఉదజని, కర్బనం, మొదలైనవి 20+ ఉన్నాయి;
 • non-productive, adj. అనుత్పాదక;
 • nonprofit organization, ph. లాభాపేక్షలేని సంస్థ;
 • nonsense, n. కొక్కిరాయి మాటలు;
 • non-stop, adj. ఏకధాటిగా; ఏకబిగిన; నిరంతరం; అవిరతం; అశ్రాంతం;
 • non-uniform, adj. చాపు;
 • nonviolence, n. అహింస;
 • noon, n. మధ్యందినం; మిట్టమధ్యాహ్నం; మధ్యాహ్నం;
 • noose, n. ఉచ్చు;
 • normal, adj. (1) సాధారణమైన; ప్రమాణాంకిత; ప్రమాణయుక్త; (2) అభిలంబ; నిట్ర;
 • normal, n. (1) సామాన్యం; (2) లంబం; నిట్రం;
 • normalization, n. ప్రమాణాంకితం; ప్రమాణాంకీకరణ;
 • normally, adv. సామాన్యంగా; సాధారణంగా;
 • normative, adv. నిర్ణాయక;
 • north, n. ఉత్తరం; ఉత్తరపు దిక్కు;
 • northeast, n. ఈశాన్యం; ఈశాన్య దిశ; ఈశాన్య మూల;
 • northwest, n. వాయవ్యం; వాయవ్య దిశ; వాయవ్య మూల;
 • northern, adj. ఉత్తర; ఔత్తరాహ; ఉదీచీన;
  • - direction, ph. ఉత్తర దిశ;
  • - lights, ph. ఉత్తర జ్యోతులు; ఉదీచీన ఉద్యోతాలు; ఉదీచీన జ్యోతిర్వస్త్రాలు;

---Usage Note: north, south, east, west

 • ---Use north / south / east /west as an adjective phrase to tell where a place is located: Goa is south of Mumbai: Vindhya mountains are to the north of Mumbai. However you must use northern, southern, eastern, or western with the name of a place: He has a job somewhere in northern India.
 • Northern cross, [astron.] ph. రాజహంస మండలం;
 • northerner, n. ఉత్తరాదివాడు; ఔత్తరాహ్యుడు;
 • northeast, n. ఈశాన్యం;
 • nose, n. ముక్కు; నాసిక; ఘ్రాణం;
  • saddle -, ph. తప్పట ముక్కు;
  • stout -, ph. బుర్రముక్కు;
 • nostalgia, n. జ్ఞాపకాలు; భావోద్రేకంతో కూడిన జ్ఞాపకాలు;
 • nostril, n. ముక్కు చెరమ; ముక్కు రంధ్రం; నాసాపుటం; మంజెరం;
 • not, n. కాదు; లేదు;
 • notable, n. గమనార్హం; గణనీయం; గుర్తింపదగ్గది;
 • notation, n. సంజ్ఞామానం;
 • notch, n. గంటు; గాటు; కచ్చు; పరిఖ;
 • notch, v. t. గంటుపెట్టు; నరుకు;
 • note, v. i. గమనించు;
 • note, n. (1) చీటీ; పత్రం; కాగితం; యాదాస్తు; పురోణి; నోటు; (2) గమనిక; షరా; (3) స్వరం; (4) షడ్జమం (స), రిషభం (రి), గాంధారం (గ), మధ్యమం (మ), పంచమం (ప), దైవతం (ద), నిషాదం (ని), స;
  • flat -, కోమల స్వరం;
  • nonmovable -, ph. అచల స్వరం; ఉదాహరణకి స, ప లు అచల స్వరాలు; స, ప ల తరచుదనం (frequency) ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది;
  • pure -, ph. శుద్ధ స్వరం; శుద్ధ స్వరం కంటే తక్కువ తరచుదనం ఉన్నదానిని కోమల స్వరం అంటారు;
  • sharp -, ph. తీవ్ర స్వరం; మ కి తీవ్ర స్వరం ఒక్కటే ఉంది; మ కి కోమల స్వరం లేదు;
  • high -, ph. తార స్వరం;
  • one rupee -, ph. రూపాయి కాగితం;
 • note book, n. పుస్తకం; యాదాస్తు పుస్తకం; నోటు పుస్తకం;
 • noted, adj. పేరున్న; ప్రసిద్ధికెక్కిన;
 • noteworthy, adj. గమనార్హమైన; చెప్పుకోతగిన;
 • noteworthy, n. గమనార్హం;
 • nothing, n. పూజ్యం; ఏమీ లేదు;
 • notice, n. ప్రకటన; గమనిక; తాఖీదు; నోటీసు;
 • notice, v. i. గమనించు; చూడు;
 • noticeable, adj. గమనార్హం; గమనార్హమైన;
 • noticeability, n. గమనార్హత;
 • notification, n. తెలియపరచుట; చాటింపు; ప్రకటన; విజ్ఞాపన; అధిసూచన;
 • notify, v. t. తెలియపరచు; ప్రకటించు;
 • notion, n. తలంపు; భావం; ఊహ; కల్పన; అభిప్రాయం;
 • notwithstanding, conj. అయినప్పటికి;
 • noun, n. [gram.] నామవాచకం; విశేష్యం; వాచకం;
  • abstract -, ph. గుణ వాచకం;
  • collective -, ph. సామూహిక వాచకం;
  • common -, ph. జాతి వాచకం;
  • compound -, ph. సంయుక్త వాచకం;
  • concrete -, ph. ఇంద్రియ వాచకం;
  • proper -, ph. సంజ్ఞా వాచకం;
  • verbal -, ph. క్రియా వాచకం; కృదంతం;
  • - phrase, ph. వాచక పదబంధం;
  • - with post-positive adjective, ph. విశేషణోత్తర కర్మధారయము; ఉ. కపోతవృద్ధము; president elect;
 • nourishing, adj. పోషకమైన; బలవర్ధకమైన;
 • nourishment, n. పుష్టి; పరిపోషణ;
 • nova, n. నవ్యతార;
 • nove, n. pl. (నోవీ) నవ్యతారలు;
 • novel, adj. కొత్తదైన; కొత్త; వింత అయిన;
 • novel, n. నవల;
 • novelette, n. నవలిక; చిన్న నవల;
 • novella, n. నవలిక; చిన్న నవల;
 • novelty, n. (1) కొత్తదనం; నవ్యత; అభినవత్వం; (2) తాయం; తాయిలం;
 • novice, n. (1) శిశువు; (2) కొత్తగా నేర్చుకున్న వ్యక్తి; ప్రావీణ్యత లేని వ్యక్తి; (3) m. అర్భకుడు;
 • now, adv. ఇప్పుడు;
 • now and then, ph. అప్పుడప్పుడు;
 • nowadays, adv. ఈ రోజుల్లో; ఈ కాలంలో;
 • nozzle, n. నాసిక;
 • nuance, n. మెళుకువ;
 • nucleic acid, n. కణికామ్లం; కణామ్లం; కదష్ఠికామ్లం;
 • nucleolus, n. గర్భకణిక; గర్భాష్ఠి; కేంద్రకాంశం;

...USAGE NOTE: atomic, nuclear

 • ... The words "atomic" and "nuclear" are used carelessly and interchangeably in both English and Telugu. The nucleus is the central core of an atom as well as the ecntral core of a living cell. An "atomic bomb" uses either uranium or plutonium and relies on fission, a nuclear reaction in which a nucleus or an atom breaks apart into two pieces. ... The "hydrogen bomb" relies on fusion, the process of taking nucleii of two separate atoms and fusing them together to form the nucleus of a third atom.
 • nuclear, adj. [biol.] జీవకణ కేంద్రానికి (కదష్ఠికి) సంబంధించిన; [phys.] అణు కేంద్రకానికి సంబంధించిన; అణు;
  • - reactor, ph. అణువిద్యుత్ కేంద్రం;
  • - - vessel, ph. కేంద్రక క్రియాకలశం;
  • - device, ph. కేంద్రక విస్పోటన పరికరం; అణు బాంబు;
  • - energy, ph. అణు శక్తి; కేంద్రక శక్తి;
  • - propulsion, ph. అణు చాలనం; కేంద్రక చాలనం;
 • nucleus, n. (1) [biol.] కణిక; బీజం;అష్ఠి; కదష్ఠి; (2)[phys.] కేంద్రకం;
 • nudity, n. నగ్నత్వం;
 • nudge, v. i. తొయ్యడం; తట్టి లేపడం; ఉసి కొల్పడం; మోచేత్తో తోసి ప్రేరేపణ చెయ్యడం;
 • nugget, n. కణిక; తునక;
  • gold -, ph. బంగారు కణిక;
 • nuisance, n. నస; గొడవ; చీడ; కంటకం;
  • public -, ph. లోకకంటకం;
 • null, n. శూన్యం; పూజ్యం;
 • numb, n. అచేతనం;
 • numbness, n. తిమ్మిరి;
 • number, adj.. [నమ్మర్] ఎక్కువ తిక్కిరిగా ఉండు; ఎక్కువ అచేతనంగా ఉండు;
 • number, n. [నంబర్] (1) సంఖ్య; నెంబరు; అంకె; అంకము; (2) వచనం;
  • binary -, ph. ద్వియాంశ అంకము; ద్వింకము;
  • cardinal -, ph. ముఖ్య సంఖ్య; ఉ. ఒకటి; రెండు, మూడు, మొదలగునవి.
  • complex -, ph. సమ్మిశ్ర సంఖ్య; సంకీర్ణ సంఖ్య; జంట సంఖ్య;
  • consecutive -, ph. క్రమానుగత సంఖ్య;
  • even -, ph. సరి సంఖ్య;
  • finite -, ph. పరిమితాంకం; మితాంకం; మితసంఖ్య;
  • fractional -, ph. భిన్నాంకం;
  • imaginary -, ph. కల్పన సంఖ్య;
  • irrational -, ph. అనిష్ప సంఖ్య; కరణీయ సంఖ్య;
  • natural -, ph. సహజ సంఖ్య; ఏకోత్తర సంఖ్య;
  • negative -, ph. రుణ సంఖ్య;
  • odd -, ph. బేసి సంఖ్య;
  • ordinal -, ph. క్రమ సంఖ్య; ఒకటవ, రెండవ, మూడవ, మొదలగునవి;
  • perfect -, ph. పరిపూర్ణ సంఖ్య;
  • plural -, ph. బహువచనం;
  • prime -, ph. ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య; అభేధ్యాంకం; ప్రధానాంకం; అవిభాజ్యం; అభాజ్య సంఖ్య;
  • positive -, ph. ధన సంఖ్య;
  • rational -, ph. నిష్ప సంఖ్య; అకరణీయ సంఖ్య;
  • real -, ph. నిజ సంఖ్య; వాస్తవ సంఖ్య;
  • roll -, ph. వరుసవారీ సంఖ్య;
  • serial -, ph. క్రమానుగత సంఖ్య; క్రమ సంఖ్య;
  • singular -, ph. ఏక వచనం;
  • whole -, ph. పూర్ణాంకం; పూర్ణ సంఖ్య;
  • - theory, ph. సంఖ్యా శాస్త్రం; అంకెలలో కాని, సంఖ్యలలో కాని కనిపించే బాణీలని అధ్యయనం చేసి గణితశాస్త్ర సూత్రాలని వెలికి లాగే శాస్త్రం;
 • numbers, n. pl. సంఖ్యలు;
  • amicable -, ph. కలుపుగోలు సంఖ్యలు;
  • consecutive -, ph. క్రమానుగత సంఖ్యలు;
 • numeral, n. అంకె; అంకం; సంఖ్యావాచకం; అంకెల రాత గుర్తు; అంకెల లేఖా సంకేతం;
  • Arabic -, ph. అరబ్బు అంకె; అరబ్బాంకం;
  • Roman -, ph. రోమక అంకె; రోమకాంకం;
 • numerator, n. లవం;
 • numerical, adj. సంఖ్యావాచక; సంఖ్యాత్మక;
  • - analysis, ph. సంఖ్యావాచక విశ్లేషణ;
 • numerology, n. సంఖ్యల వరుసలలో ఏదో మార్మికత ఉందని నమ్మి సంఖ్యలలో కనిపించే బాణీని బట్టి జోశ్యం చెప్పడం; ఇది ఒక నమ్మకమే కాని శాస్త్రం అనిపించుకోదు;
 • numerous, adj. చాలా; బహు; మెండు; ఎక్కువ; అసంఖ్యాక;
 • numismatics, n. రూప్యశాస్త్రం; నాణెముల గురించిన శాస్త్రం;
 • nurse, n. ఉపమాత; నర్సు; f. దాది; పరిచారిక; నరసమ్మ; m. పరిచారకుడు; నరసయ్య;
 • nurse, v. t. శుశ్రూష చేయు; పరిచర్య చేయు;
 • nursery, n. (1) మొక్కలను పెంచి అమ్ము స్థలం; (2) పసి పిల్లలకి నర్సు పర్యవేక్షణలో ఆటలు, పాటలు నేర్పే స్థలం;
 • nursing mother, n. బాలెంతరాలు;
 • nurture, n. పెంపకం;
/220px-Nut-hardware.jpg
 • nut, n. (1) పిక్క; గింజ చుట్టూ పెంకు లాంటి కవచం ఉన్న విత్తు; ఉ. చింత పిక్క; బాదం పిక్క; జీడి పిక్క; (2) మరచుట్టు; మర ఉంగరం; (rel.) bolt; screw; (3) పిచ్చి మనిషి;
 • nutcracker, n. అడకత్తెర; వక్కలని, పిక్కలని విరగ్గొట్టడానికి వాడే కత్తెర వంటి ఉపకరణం;
 • nutmeg, n. జాజికాయ; ఈ జాజికాయ తొక్కనే జాపత్రి అంటారు;
 • nutrient, n. పోషకం; పోషక పదార్థం; పోషకాహారం;
 • nutrition, n. పోషణ; ప్రోది; పరిపోషణ;
 • nutritional, adj. పోషక; పౌష్టిక;
  • - value, ph. పౌష్టిక విలువ;
 • nutritious, adj. పోషకమైన; పుష్టికరమైన; పౌషిక;
 • nux vomica, n. ముషిణి; ముసిడి; ముసిని; Loganiaceae జాతి చెట్టు;
 • nymph, n. ఎలనాగ; యువతి;
 • nymphomania, n. కామాతురత;
 • nymphomaniac, n. f. రిరంసువు; కాముకి; విపరీతమైన కామేచ్ఛ గల స్త్రీ; వివిధమైన పురుషులతో రతిని కోరే స్త్రీ;

Part 2: O

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • O, inter. ఒహో; అలాగునా;
 • oak tree, n. సిందూర వృక్షం;
 • oar, n. తెడ్డు; అల్లీసకర్ర; క్షేపణి;
 • oasis, n. విరామారామం; ఎడారిలో నీళ్లు, నీడ దొరికే ప్రదేశం;
  • like an -, ph. [idiom] కుంపట్లో తామర వలె;
 • oat, n. ఓటు; ఒక ధాన్యపు దినుసు;
 • oat meal, n. (1) అటుకులులా దంచబడ్డ ఓటు బియ్యం; (2) ఓటు బియ్యాన్ని బాగా చిమడబెట్టి అంబలిలా కాచిన భోజన పదార్థం;
 • oath, n. ఒట్టు; ప్రమాణం; శపథం; ఆన, Ana
 • obdurate, adj. మూర్ఖమైన;
 • obedience, n. విధేయత; వినయం; నమ్రత; ప్రణతి;
 • obediently, adv. సవినయంగా; విధేయతతో;
 • obedient person, n. m. విధేయుడు; ప్రణతుడు;
 • obese, adj. లావైన; స్థూలమైన; వలంగా; బడ్డుగా;
 • obesity, n. స్థూలకాయత్వం; స్థౌల్యం;
 • obey, v. i. కట్టుబడియుండు; పాటించు; చెప్పినట్లు నడుచుకొను;
 • obituary, n. వార్తాపత్రికలో ప్రచురించబడ్డ మరణ వార్త; సంస్మరణ; స్మృతి;
 • object, n. (ఆబ్‌జెక్ట్) (1) భౌతిక పదార్థం; వస్తువు; (2) కర్మ, వ్యాకరణంలో; (ant.) subject;
 • object, v. t. (అబ్‌జెక్ట్) వారించు; అభ్యంతరపెట్టు; ఆక్షేపించు;
 • objection, n. అభ్యంతరం; ఆక్షేపణ; ప్రతిబంధకం;
  • groundless -, ph. దురాక్షేపణ;
 • objectionable, adj. ఆక్షేపణీయ; కూడని;
 • objective, adj. వస్తుగత; (ant.) subjective;
 • objective, n. వస్తుగత గమ్యం; లక్ష్యం; ఆశయం; ప్రయోజనం; గమ్యం ఎంతవరకు చేరుకున్నామో కొలిచి చెప్పడానికి వీలయిన చలరాసి; (rel.) goal;
 • objectively, adv. నిష్పక్షపాతంగా;
 • objectivity, n. విషయనిష్టత; వస్తునిష్టత;
 • oblation, n. నైవేద్యం; నైవేద్యాది ఉపచారం;
 • obligation, n. (1) అనివార్యకార్యం; తప్పనిసరి అయిన పని; (2) మొహమాటం; నిర్బంధం; విద్యుక్తం; విధాయకం;
 • obliging person, n. ఉపకారబుద్ధిగల వ్యక్తి;
 • oblique, adj. తిర్యక్; వాలివున్న; వాలుగా ఉన్న; ఒరిగిన; transverse;
  • - line, ph. తిర్యక్ రేఖ; వాలు గీత; transversal;
 • obliquely, adv. వాలుగా; ఐమూలగా;
 • obliterate, v. t. సర్వనాశనం చేయు; తుడిచిపెట్టు;
 • oblong, adj. కోల; కోలగా ఉన్న;
 • obnoxious, adj. అసహ్యకరమైన; హేయమైన;
 • obscene, adj. అసభ్యమైన; అసహ్యకర మైన; అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు;
 • obscure, adj. స్పష్టతలేని; ఎక్కడో మారుమూలని ఉన్న;
 • obsequies, n. అపరకర్మలు; ఉత్తర క్రియలు; మరణానంతరం చేసే కర్మ;
 • observable, adj. గమనార్హమైన; అవలోకనార్హమైన;
 • observation, n. (1) పరిశీలనం; అవలోకనం; వీక్షణ; విలోకనం; ప్రేక్షణం; (2) పరిశీలన;
 • observatory, n. వేధశాల;
 • observe, v. i. పరిశీలించు; గమనించు; అవలోకించు; వీక్షించు; పాటించు;
 • observer, n. పరిశీలకుడు; ప్రేక్షకుడు; ద్రష్ట;
 • obsession, n. రంధి; యావ;
 • obsolete, n. విలుప్తం; వ్యవహారబ్రష్టం; వ్యవహారచ్యుతం; అప్రచలితం; వాడుకలో లేనిది;
 • obsolescence, n. అప్రచలనం;
 • obstacle, n. అడ్డంకి; అవరోధం; అవాంతరం; ప్రతిబంధకం; విఘ్నం; విష్కంభం;
  • without -, ph. నిర్విఘ్నం;
 • obstetrics, n. సూతిక శాస్త్రం; ప్రసూతి శాస్త్రం; ప్రసవ శాస్త్రం; పురిటి వైద్యం;
 • obstinacy, n. మొండితనం; పిడివాదం; మూర్ఖపు పట్టు;
 • obstinate, adj. మొండి; మూర్ఖపు పట్టుగల; హఠం చేసే; refractory;
 • obstruct, v. t. అడ్డు; ఆటంకపరచు; అటకాయించు; అవరోధించు; నిరోధించు; అభ్యంతరపెట్టు; వారించు;
 • obstructed, n. ప్రతిహతం;
  • one that was -, ph. ప్రతిక్షిప్తం;
 • obstruction, n. అడ్డంకి; ఆటంకం; రోధం; రుద్ధం; అవరోధం; నిరోధం; ఆక; ప్రతిఘాతం; ప్రతిబాధకం; ప్రతిబాధి; ప్రతిబంధం; ప్రతిబంధకం; ప్రతిరోధకం;
 • obtain, v. i. పొందు; సాధించు; సంపాదించు;
 • obtrude, v. i. ముందుకు చొచ్చుకొని వచ్చు;
 • obtuse, adj. [geom.] గురు; బహిర్లంబ; సూదిగాలేని;
 • obtuse angle, ph. గురు కోణం; బహిర్లంబ కోణం;
 • obverse, adj. బొమ్మవైపు; ప్రతిలోమ;
 • obverse, n. బొమ్మ; బొరుసు కానిది; సీదా; (ant.) reverse;
 • obvious, n. స్వయంవిదితం; విదితం; విస్పష్టం; వివరణ లేకపోయినా అర్థం అయేది;
 • occasion, n. సందర్భం; సమయం; అవకాశం; కారణం;
 • occasional, adj. అప్పుడప్పుడు; కాదాచిత్క; నైమిత్తిక;
 • occasionally, adv. అప్పుడప్పుడు; అడపాదడపా; కదాచిత్తుగా;
 • occident, n. పాశ్చాత్య దేశాలు; పశ్చిమ దేశాలు;
 • occidental, adj. పాశ్చాత్య; పశ్చిమ దేశాలకి సంబంధించిన;
 • occipital, adj. కపాలాస్థి; కపాలాస్థిక; తల వెనక భాగాన్ని ఉన్న ఎముకకి సంబంధించిన;
  • - lobe, ph. కపాలాస్థిక తమ్మె; మెదడులో ఒక భాగం;
 • occlusion, n. అంతర్ధారణ; ఆటంకం; అడ్డు;
 • occult, adj. నిక్షిప్త; రహస్య; మానవుడి అవగాహనకి అందని;
 • occupation, n. (1) వృత్తి; ఉద్యోగం; (2) వ్యాపకం; (3) ఆక్రమణ;
 • occupant, n. ఆక్రమించినవాడు; ఆక్రమితుడు;
 • occupy, v. t. ఆక్రమించు; ఆవరించు;
 • occur, v. i. సంభవించు; తట్టు; స్ఫురించు; తటస్థించు;
 • occurrence, n. సంఘటన; స్ఫూర్తి;
 • ocean, n. మహాసముద్రం; అబ్రాసి; కడలి; విషధి; ఉదధి; అంబుధి; జలధి; సాగరం;
 • oceanography, n. సాగరశాస్త్రం;
 • ocellus, n. కృష్ణపాదం; the characteristic marking on the hood of a cobra;
 • ochre, n. గోపీచందనం; ఒక రంగు పదార్థం;
 • octadecane, n. అష్టాదశేను; ఒక ఉదకర్బనం; C18H38;
 • octadeconic acid, n. అష్టాదశాయిక్ ఆమ్లం; C18H38O2;
 • octagon, n. అష్టభుజి; అష్టకోణి;
 • octahedron, n. అష్టముఖి; ఎనిమిది సమత్రిభుజములు ముఖములుగా గల ఒక ఘనరూపము;
 • octal, adj. అష్టాంశ;
  • - number system, ph. అష్టాంశ పద్ధతి;
 • octane, n. అష్టేను; ఒక ఉదకర్బనం పేరు; CH3(CH2)6CH3;
  • - number, ph. అష్టేను సంఖ్య; పెట్రోలు నాణ్యతని కొలిచే సూచికాంకం;
 • octave, n. (1) సప్తకం; సంగీతంలో f అనే పౌనఃపున్యం నుండి 2f పౌనఃపున్యం వరకు ఉన్న మధ్య దూరం; ఈ దూరంలోనే సప్త స్వరాలు ఇమిడి ఉంటాయి; భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ దూరాన్ని సరిగమపదని వరకే లెక్కపెడతారు, పాశ్చాత్య సంగీతంలో సరిగమపదనిస అని లెక్క పెడతారు; (2) అష్టపది; అష్టకం;
 • octet, n. అష్టకం; అష్టకి; ఎనిమిది అంశాలు కలది;
 • octonoic acid, n. అష్టనోయిక్‍ ఆమ్లం; కేప్రిలిక్‍ ఆమ్లం; ఎనిమిది కర్బనపు అణువుల దండ ఉన్న గోరోజనామ్లం;
 • odd, adj. (1) బేసి; బేసరి; ఓజ; విషమ; సరి కాని; (2) వింతైన; ఎబ్బెట్టు; విజ్జోడు; (3) విషమ; చికై్కన;
  • - behavior, ph. వింత ప్రవర్తన;
  • - looking, ph. వింతగా కనిపించే;
  • - number, ph. బేసి సంఖ్య;
 • odds and ends, ph. చిల్లర మల్లర వస్తువులు, పనులు;
 • ode, n. కీర్తన; స్తుతి; పదం; భావగీతం;
 • odious, adj. హేయమైన;
 • odor, n. వాసన; గంధము; (Br.) odour; (rel.) malodor;
 • of, prep. యొక్క; గురించి;
 • offend, v. t. నేరం చేయు; కోపం పుట్టించు; నొప్పించు;
 • offense, n. నేరం; తప్పు; తప్పు పని;
  • cognizable -, ph. వారంటు లేకుండా అరెస్టు చెయ్యడానికి పోలీసులకి హక్కు ఉన్న నేరం; ఇండియాలో ఇటువంటి నేరం జరిగిందని అనిపించగానే పోలీసులు తప్పనిసరిగా FIR (first information report) నమోదు చేసి తీరాలని చట్టం చెబుతోంది;
  • punishable -, ph. శిక్షార్హమైన నేరం;
 • offer, v. t. అర్పించు; సమర్పించు; భక్తితో ఇచ్చు; కానుకగా ఇచ్చు;
 • offering, n. ముడుపు; కానుక; నైవేద్యం; బలి;
 • off-guardedly, adv. ఏమరుపాటుగా;
 • office, n. కచేరీ; కార్యాలయం; కృత్యాగారం; దప్తరు; ఆఫీసు;
 • office bearer, n. కార్యకర్త;
 • officer, n. అధికారి; ఉద్యోగి; సచివుడు; ఆఫీసరు;
  • executive -, ph. కర్మాధికారి; కర్మసచివుడు;
  • investigative -, ph. విచారణాధికారి;
 • official, adj. అధికార; అఫీషియల్;
 • official, n. అధికారి;
 • officinalis, n. ఉపయోగం ఉండి దుకాణాలలో కొనుగోలుకి దొరికేది;
 • offshore, adj. తీరస్థ;
  • - islands, ph. తీరస్థ దీవులు;
 • offspring, n. s. బిడ్డ; సంతానం; తోకం; కేపు, kEpu
 • offspring, n. pl. తనుజులు; సంతానం; సంతతి; బిడ్డలు;
 • often, adv. తరచుగా;
 • ogre, n. మనుష్యులను తినే రాక్షసుడు;
 • oil, n. నూనె; చమురు; తైలం; ఆయిలు;
  • animal -, ph.జాంతవ తైలం;
  • cooking -, ph. వంట నూనె;
  • crude -, ph. ముతక నూనె; క్రూడాయిలు;
  • fuel-, ph. మంట చమురు; ఇంధనపు చమురు;
  • kerosine -, ph. కిరసనాయిలు;
  • mineral -, ph. ఖనిజపు చమురు;
  • refined -, ph. రిఫండాయిలు;
  • til -, ph. నువ్వుల నూనె;
  • sesame -, ph. నువ్వుల నూనె;
  • vegetable -, ph. శాకీయ తైలం;
  • - cake, ph. తెలక పిండి; పిణ్యాకం; నూనె చెక్క;
 • oily, adj. నూనెలా ఉండే; జిడ్డుగా ఉండే; జిడ్డయిన;
 • ointment, n. అంజనం; లేపనం; విలేపనం; మలాము; పైన పూసే మందు;
 • o.k., n. సరే;
 • okra, n. బెండ; ఎద్దునాలుక చెట్టు; గంబో;
 • ol, suff. ఆల్కహాలు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. alcohol; menthol; phenol;
 • old, adj. పాత; ముసలి;
  • - age, ph. ముసలితనం; వృద్ధాప్యం; ముదిమి;
  • - people, ph. ముసలివారు; వృద్ధులు; వయోవృద్ధులు;

---Usage Note: old, elderly

 • ---Use old to talk about the age of things or people: This is an old car; How old are your children? Use elderly to be more polite when talking about people who are very old.
 • oleander, n. గన్నేరు పూవు; కరవేరం పూవు;
 • olfactory, adj. ఘ్రాణ; వాసనకి సంబంధించిన;
  • - nerves, ph. ఘ్రాణ నాడులు;
  • - nodes, ph. [biol.] గంధప్రవరాలు,
 • oligarchy, n. స్వల్పజన పరిపాలనం; స్వల్పజనాధిపత్యం;
 • oligosaccharide, n. స్వల్పచక్కెర; తక్కువ ఏకచక్కెరలు ఉన్న కర్బనోదక కట్టడం; a carbohydrate whose molecules are composed of a relatively small number of monosaccharide units.
 • olive, n. జిత చెట్టు; జిత వృక్షం; మానుగాయ; కుదురు జువ్వి; ఆలివ్; మధ్యధరా వాతావరణాలలో కాసే ఒక చిన్న కాయ;
  • - branch, ph. [idiom[ మైత్రీ సందేశం;
  • - oil, ph. జిత తైలం; మానుగాయ నూనె;
  • - green, n. మానుగాయ రంగు;
 • -oma, suff. [med] వైద్య రంగంలో వచ్చే ఈ ఉత్తర ప్రత్యయానికి అర్థం "కంతి"; అనగా, శరీరంలోని జీవకణాలు మితిమీరి పెరిగి కాయలా తయారవడం; ఈ కంతి కేన్‌సరు కావచ్చు, కాకపోవచ్చు;
  • carcinoma, ph. అంగాలని చుట్టి ఉండే పొరలలో కాని, చర్మపు పొరలలో కాని వచ్చే కేన్‌సరు;
  • cytoma, ph. కణాలకి సంబంధించిన కంతి;
  • melanoma, ph. మెలనిన్‌ అనే రంగు పదార్థం ఉన్న చోట (సాధారణంగా చర్మం) పెరిగే కంతి;
  • sarcoma, ph. శరీరపు కట్టడానికి ఉపయోగపడే భాగాలకి (అనగా, ఉ. ఎముకలు, కండరాలు, వగైరాలకి) వచ్చే కేన్‌సరు;
 • ombrophobia, n. వానపిరికి; వర్షం అంటే భయం;
 • ombudsman, n. లోకపాల్;
 • omelet, n. గుడ్డట్టు; (rel.) scrambled eggs;
 • omen, n. శకునం;
  • bad -, ph. అపశకునం; దుర్నిమిత్తం;
  • fatal -, ph. మారకం;
 • ominous, adj. దుశ్శకునమైన; అశుభసూచకమైన;
 • omit, v. t. మినహాయించు; పరిహరించు; వదలివేయు; విడచిపెట్టు;
 • omission, n. పరిహార్యం; మినహాయింపు; పరిహరింపు; చేయమి;
 • omni, adj. సర్వ; అన్ని; సమస్థ;
 • omnidirectional, n. సర్వదిశాత్మకం;
 • omniscience, n. సర్వజ్ఞత;
 • omniscient, n. సర్వజ్ఞుడు; అన్నీ తెలిసినవాడు;
 • omnipotent, adj. సర్వశక్తిసంపన్నత; సర్వసమర్ధత;
 • omnipotent, n. సర్వశక్తిసంపన్నుడు; సర్వసమర్ధుడు;
 • omnipresence, n. సర్వవ్యాప్తి;
 • omnipresent, n. సర్వోపగతుడు; సర్వవ్యాపకుడు;
 • omnivorous, adj. సర్వభక్షక;
 • omnivore, n. సర్వభక్షిణి; సర్వాహారి; సర్వభక్షకి;
 • on, prep. మీద; పైన; గురించి;
  • - behalf, ph. తరఫున; పక్షమున;
  • - demand, ph. అడగ్గానే; అడిగిన వెంటనే;
 • once, adv. (1) ఒకప్పుడు; ఒకానొకప్పుడు; (2) ఒకసారి; ఒకమారు; ఒకతడవ; ఒక పర్యాయం; ఒక తూరి;
  • - upon a time, ph. అనగా అనగా; తొలి; తొల్లి;
 • one, adj. ఏక; ఒంటి;
 • one, n. ఒకటి;
  • increment by -, ph. ఏకోత్తరించు; ఏకోత్తరవృద్ధి; ఒకటొకటిగా పెంచు;
 • one-dimensional, adj. ఏకమాత్రక; ఏకప్రమాణ; ఏక దిశమాన; ఒకే కొలత గల;
 • one-by-one, ph. ఒకదాని తరువాత మరొకటి చొప్పున; ఐకాఇకంగా;
 • one-to-one correspondence, ph. ఏకైక సంబంధం;
 • one and only, ph. ఏకైక;
 • one's, adj. స్వ; స్వకీయ; తన; తనదైన;
 • one's own duty, ph. స్వధర్మం;
 • onion, n. (1) ఉల్లి; ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; (2) నీరుల్లి; పెద్ద ఉల్లి; ఎరగ్రడ్డ; సుకంద;
  • green -, ph. ఉల్లికాడలు;
  • yellow -, ph. లతార్కం; దుద్రుమం;
 • onion bulb, ph. ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; ఎరగడ్డ;
 • onionskin, n. ఉల్లిపొర; ఉలిపిరి;
  • - paper, ph. ఉల్లిపొర కాగితం;
 • onlooker, n. చూపరి; దారిన పోయే దానయ్య; కలుగజేసుకోకుండా పక్కనుండి చూసే వ్యక్తి; ప్రేక్షకులు;
 • only, adj. ఏక; ఒకే ఒక;
 • only, adv. మాత్రం;
 • onomastics, n. సంజ్ఞానామ పరిశీలన; పేర్ల పూర్వాపరాలని పరిశీలించే శాస్త్రం;
 • onomatopoeia, n. ధ్వన్యనుకరణం; భావమును వ్యక్తపరచు శబ్దం; ఒక రకమైన శబ్దాలంకారం; అన్నం కుతకుత ఉడుకుతున్నది అన్నప్పుడు ‘కుతకుత’ అన్నం ఉడికే శబ్దాన్ని అనుకరించడమే ఈ అలంకారం లక్షణం;
 • onset, n. మొదలు; ఆరంభం;
 • onslaught, n. ఆక్రమణ; పైబడడం; ఆఘాతం;
 • ontology, n. లక్షణ శాస్త్రం; సత్త్వమీమాంశ; a set of concepts and categories in a subject area or domain that shows their properties and the relations between them; Ontologyలో సత్తా (అంటే ఉనికి) గల పదార్థాల తత్త్వము ముఖ్యం;
 • ontological, adj. లక్షణ శాస్త్ర సంబంధమైన;
 • onus, n. బాధ్యత; పూచీ; భారం;
 • onyx, n. గోమేధికం; క్వార్‍ట్జ్ (quartz) జాతికి చెందిన రాయి; SiO2;
 • oodles, n. pl. కొల్లలు;
 • oogamy, n. అండ సంయోగం;
 • oogenisis, n. అండజననం; అండోత్పత్తి;
 • oogonium, n. స్త్రీ బీజాశయం;
 • oology, n. అండాధ్యయనం; గుడ్లని అధ్యయనం చేసే శాస్త్రం:
 • ooze, v. i. ఒలుకు; కారు; చెమర్చు; ఊరు; శ్రవించు;
 • opal, n. క్షీరోపలం; ఒక విలువైన రాయి;
 • opaque, n. కాంతి కిరణాలని చొరనీయని లక్షణం గల;
 • open, adj. తెరచిన; తీసిన; విడిన; వికసించిన; విప్పిన; వివృత; విరళ; ఉపరితల;
  • near- -, ph. ఉప వివృత; జారుగా తెరచిన;
  • wide -, ph. బార్లా తెరచిన; బారుగా తెరచిన; బార్లా తీసిన;
  • - set, ph. వివృత సమితి;
  • - society, ph. వివృత సమాజం;
  • - circuit, ph. వివృత వలయం; వివృత పరివాహం;
  • - door, ph. విరళారళం; విరళ అరళం;
  • - drainage system, ph. ఉపరితల నీటిపారుదల వ్యవస్థ;
  • - forcibly, ph. పెగుల్చు; పెగలదీయు;
  • - gently, ph. విడదీయు;
 • open, v. i. వికసించు;
 • open, v. t. తెరుచు; విప్పు; విడదీయు; పెగుల్చు; పెగలదీయు;
 • opening, n. (1) వివారం; వివరం; కన్నం; బెజ్జం; (2) ఖాళీ; ఖాళీ స్థలం; సందు; బీటిక; (3) ఎత్తుబడి; మొదలు;
 • openly, adv. బాహాటంగా; బహిరంగంగా; వెల్లడిగా; దాపరికం లేకుండా; నిష్కపటంగా;
 • operate, v. t. (1) తోలు; నడుపు; చోదించు; (2) శ చికిత్స చేయు;
 • operating system, n. నిరవాకి; ఉపద్రష్ఠ; కలనాత్మ; ఆత్మ లేని శరీరం ఎలాంటిదో అలాగే కలనాత్మ లేని కలనయంత్రం ప్రాణం లేని బొందె వంటిది; ఒక కలనయంత్రంలో పనిచేసే క్రమణికల (ప్రోగ్రాముల) మీద అజమాయిషీ, లేదా నిరవాకం, చేసే మరొక పెద్ద క్రమణిక;
 • operation, n. (1) [math.] సంక్రియ; పరిక్రియ; సముచ్చయం; (2) శ చికిత్స; కోత; (3) చర్య;
  • algebraic -, ph. బీజీయ పరిక్రియ; బీజీయ సముచ్చయం;
  • mathematical -, ph. గణిత పరిక్రియ;
  • surgical -, ph. శస్త్ర పరిక్రియ; శస్త్ర సముచ్చయం;
 • operator, n. [math.] పరికర్త; కర్మచారి; నిర్వాహకుడు;
  • difference -, ph. భేద పరికర్త;
  • differential -, ph. అవకలన పరికర్త;
 • operative, n. కర్మచారి;
 • opinion, n. అభిప్రాయం; మతం; ప్రవాదం;
  • difference of -, ph. అభిప్రాయ భేదం;
  • good -, ph. సదభిప్రాయం;
  • in my -, ph. నా అభిప్రాయం ప్రకారం;
  • of the same -, ph. సమత;
  • popular -, ph. లోక ప్రవాదం;
 • opinionated, adj. దిట్టమైన అభిప్రాయాలు గల;
 • opium, n. నల్లమందు; అభిని; అహిఫేనం;
  • - poppy seeds, ph. గసగసాలు; అభిని;
 • opponent, n. ప్రత్యర్థి; ప్రతిద్వంది; ప్రతిస్పర్ధి; ప్రతిపక్ష; ప్రతికక్షి; ఎదిరి; వ్యతిరేకి; ప్రతికూలుడు; విరోధి; ప్రతిరోధి; ప్రతిరోధి, pratirOdhi
 • opportune, adj. సానుకూల; సమయానుకూల;
  • - idea, ph. తరుణోపాయం;
  • - moment, ph. సానుకూల పరిస్థితి;
 • opportunist, n. అవకాశవాది;
 • opportunity, n. అవకాశం; తరుణం; వీలు; సమయం; ఎసలిక;
  • good -, ph. సదవకాశం; మంచి తరుణం;
 • oppose, v. t. ప్రతిఘటించు; ఎదిరించు;
 • opposite, adj. విరుద్ధ; విపరీత; అభిముఖ; వ్యతరిక్త; వ్యతిరేక; ప్రాభిముఖ; ఎదురెదురుగా; ఎదుటి;
 • opposites, n. పరస్పర విరుద్ధములు;
 • opposition, n. (1) ప్రతిపక్షం; విపక్షం; (2) వ్యతిరిక్తం; (3) సూర్యుడిని, మరొక బాహ్య గ్రహాన్ని కలిపే ఊహాత్మక రేఖ మీదకి భూమి వచ్చినప్పుడు ఉన్న స్థితి;
 • (ant.) conjunction;
 • opposition party, n. ప్రతిపక్షం; విపక్షం;
 • oppression, n. జులుం;
 • optic, adj. దృష్టి; దృక్; చక్షు; నేత్ర;
 • optic nerve, ph. నేత్ర నాడి;
 • optical, adj. చక్షుష;
  • optical -, ph. చక్షుష అక్షం; చక్షుషాక్షం;
  • optical -, ph. చక్షుష తంతువు; దృక్ తంతువు;
  • optical -, ph. చక్షుష భ్రమ;
  • optical -, ph. చక్షుష పరికరాలు;
  • optical -, ph. చక్షుష సూక్ష్మదర్శిని;
 • optician, n. కళ్లద్దాలని తయారు చేసే వ్యక్తి;
 • optics, n. (1) కాంతిశాస్త్రం; నేత్రజ్ఞానశాస్త్రం; దృశాశాస్త్రం; తేజశ్శాస్త్రము; (2) ప్రచారం కొరకు ఛాయాచిత్రాలలో కనబడే తీరు;
 • optimism, n. ఆశావాదం;
 • optimistic, adj. ఆశాజనక;;
 • optimum, n. సర్వోత్తమం;
 • option, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం;
 • ophthalmologist, n. కంటివైద్యుడు; కంటి జబ్బులని నయం చేసే వైద్యుడు;
 • ophthalmology, n. నేత్రవైద్యం; కంటివైద్యం;
 • option, n. వికల్పం; విభాష: అభిరుచి; కోరి ఎన్నుకున్నది;
 • optional, adj. ఐచ్ఛిక;
 • optometrist, n. దృష్టిదోషాన్ని కొలచి కళ్లజోడుని అమర్చే వ్యక్తి;
 • opulence, n. ఐశ్వర్యం; అయిస్వర్యం;
 • opulent, adj. విలువైన వస్తువులతో అలంకరించబడ్డ;
 • or, conj., కాని; లేక; కానిపక్షంలో; లేకపోతే; లేనియెడల;
 • oracle, n. సర్వజ్ఞుడు; ద్రష్ట; ప్రవక్త; గ్రీకు గాథలలో వచ్చే అన్నీ తెలిసిన వ్యక్తి;
 • oral, adj. (1) నోటిద్వారా; వాక్; వాగ్రూపంగా; వాచా; వాచారంభ; మౌఖిక; మూజువాణీ; (2) నోటికి సంబంధించిన; నోటితో; ఆశ్య;
 • oral cavity, అంగిలిగుంట; ఆశ్య కుహరం;
  • - commitment, ph. వాగ్దానం;
  • - examination, ph. వాచ పరీక్ష;
  • - exegesis, ph. కథాకాలక్షేపం;
  • - medicine, ph. నోటిద్వారా వేసికొనే మందు; మూజువాణీ మందు;
  • - testimony, ph. వాగ్మూలం;
  • - thrush, ph.తెల్ల పూత;
  • - tradition, ph. మౌఖిక సంప్రదాయం;
 • orange, n. నారింజ; నాగరంగం; కిచ్చిలి;
  • batavian -, ph. బత్తాయి; మోసంబి;
  • navel -, ph. బొడ్డు నారింజ; నాభి నారింజ;
  • sweet -, ph. బత్తాయి; చీనీకాయ; మోసంబి; తియ్య నారింజ; [bot.] Citrus sinensis;
  • mandarin -, ph. కమలాఫలం; [bot.] Citrus reticulata;
 • orator, n. వక్త; వాంగ్మి; ప్రవక్త;
 • oratory, n. వక్తృత్వం;
 • orb, n. (1) బింబం; (2) గోళం;
 • orbicular, adj. మండలాకార;
 • orbit, n. కక్ష్య; చారగతి; వివర్తకం; భచక్రం;
  • inner -, ph. అల్ప వృత్తం; అల్ప కక్ష్య;
  • outer -, ph. అధిక వృత్తం; అధిక కక్ష్య;
 • orbital, adj. కక్షీయ; కక్ష్యకి సంబంధించిన; గ్రహగతికి సంబంధించిన;
  • - mechanics, ph. కక్షీయ యంత్రశాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behaviour of physical bodies when subjected to forces or displacements;
 • orbital, n. విగతి; విస్తృతమైన గతి; ఒక ఎలక్ట్రాను ఎక్కడ ఉందో సూచించడానికి వాడే తరంగ ప్రమేయపు లక్షణం; గుళిక వాదంలో వచ్చే ఒక సంక్లిష్ట భావన;
 • orchard, n. పండ్లతోట; తోట; తోపు;
  • palm -, ph. తాటి తోపు;
 • orchestra, n. వాద్యబృందం; భజంత్రీలు; పక్కవాద్యాలు;
 • ordeal, n. అగ్ని పరీక్ష;
 • order, n. (1) ఆనతి; ఆన; ఆజ్ఞ; ఆజ్ఞాపన; అనుశాశనం; ఉత్తర్వు; తాకీదు; (2) ఆజ్ఞా పత్రిక; ఫర్మానా; (3) క్రమం; వరుస; (4) క్రమం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు నాలుగవ వర్గానికి పెట్టిన పేరు; [see also] genus, family, order, class, phylum and kingdom;
  • alphabetical -, ph. అక్షర క్రమం;
  • money -, ph. మనియార్డరు; పైకపు బరాతం;
  • out of -, ph. క్రమం తప్పడం; తారుమారు అవడం;
  • written -, ph. బరాతం; పరవానా;
 • ordered pair, ph. [math.] క్రమ యుగ్మం; (x, y) అనేది క్రమ యుగ్మం;
 • orderly, n. ఆసుపత్రిలో పనివాడు;
 • ordinal, adj. వరసవారీ; వరసలోని; వరసలోనుండి ఎంచిన; క్రమ;
 • ordinal number, ph. వరసవారీ సంఖ్య; క్రమ సంఖ్య;
 • ordinance, n. ఆజ్ఞ; అధికార శాసనం;
 • ordinarily, adv. సామాన్యంగా; సాధారణంగా;
 • ordinary, adj. సామాన్య; సాధారణ; సాదా; లౌకిక;
 • ordinary person, ph. సామాన్యుడు; సామాన్యురాలు;
 • ordnance, n. యుద్ధసామగ్రి; తోపులు;
 • ore, n. ఖనిజం;
 • oregano, n. పాశ్చాత్య దేశాల వంటకాలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum;
  • Greek -, ph. [bot.] Origanum vulgare hirtum;
  • Italian -, ph. [bot.] Origanum majoricum; ok
 • organ, n. (1) అంగం; అవయవం; (2) ఒక రకం పియానో;
 • organism, n. జీవి;
 • organic, adj. ఆంగిక; సేంద్రియ; చేతన;
 • organization, n. (1) సంస్థ; వ్యవస్థ; (2) సంవిధానం;
 • organized, adj. వ్యవస్థిత; సంఘటిత;
 • organized labor, ph. సంఘటిత శ్రామిక వర్గం;
 • organizers, n. pl. కార్యకర్తలు; నిర్వాహకులు; వ్యవహర్తలు; సంధాతలు;
 • orgasm, n. రతిక్రీడలో పరాకాష్ఠని అందుకున్న సన్నివేశం;
 • oriel, n. వీధి అరుగు; వీధి వసారా; చీడీ;
 • oriental, adj. పూర్వ; ప్రాక్; ప్రాచ్యదేశ;
 • orientation, n. దృగ్విన్యాసం; దిక్సాధన;
 • orifice, n. బెజ్జం;
 • origin, n. మూలం; ప్రభవం; ప్రభూతి; సంభవం; పుట్టుక; హేతువు; మూల బిందువు;
 • original, adj. అసలు; మొదటి; మూల;
 • original copy, ph. అసలు ప్రతి;
 • original, n. (1) అసలు; మొదటిది; మాతృక; మూలం; (2) అసలు ప్రతి;
  • Telugu -, ph. తెలుగు మాతృక; తెలుగు మూలం;
 • originality, n. అపూర్వత; నూతనత్వం; ఉపజ్ఞ;
 • orgon, n. నిమ్మ గడ్డి;
 • originator, n. m. కారణభూతుడు;
 • oriole, n. కల్ల పిట్ట;
 • Orion, n. మృగశిర; మృగశీర్షం ; వృత్రాసురుడు;
 • Orion's Belt, n. త్రిపురములు; ఇన్వకములు; గొల్లకావడి చుక్కలు;
 • ornate, adj. అలంకృతమైన; సాలంకృత;
 • ornament, n. నగ; భూషణం; ఆభరణం; తొడవు; రవణం; అలంకారం;
 • ornamentation, n. అలంకారం; సంగీతంలో అలంకారం అంటే సాదా, సీదాగా పాడకుండా స్వరాలకి చిన్న ఊపో, గమకమో, కంపిత గమకమో, వగైరాలు చేర్చి పాడడం; భాషలో అలంకారం అంటే ఉపమ, రూపక, మొదలైన అలంకారాలు వాడడం;
 • ornithology, n. పక్షిశాస్త్రం;
 • orphans, n. అనాథలు; తల్లిదండ్రులు లేని పిల్లలు;
 • orphanage, n. అనాథ శరణాలయం;
 • ortho, pref. తిన్ననైన; ఉదగ్ర;
 • orthodontist, n. ఎత్తుపల్లాలు ఉన్న పంటి వరసని తిన్నగా చేసే వైద్యుడు;
 • orthodox, adj. పూర్వాచార; సదాచార; శ్రోత్రియ; ఆస్తిక;
 • orthodoxy, n. పూర్వాచార పద్ధతి; శ్రోత్రియ సంప్రదాయం; ఆస్తికత్వం; ఛాందసం; వేదాలని ప్రమాణంగా నమ్మడం;
 • orthogonal, adj. లంబీయ; లంబకోణీయ; ఉదగ్రకోణీయ;
 • orthonormal, adj. లంబనిట్రీయ;
 • orthography, n. వర్ణక్రమం; వర్ణక్రమదోషం లేకుండా రాయడం;
 • orthotropus, adj. ఉదగ్రముఖ;
 • oscillating, adj. డోలాయమాన; స్పందన; నివర్తన;
  • - universe theory, ph. విశ్వస్పందన వాదం;
 • oscillation, n. స్పందనం; డోలనం; నివర్తనం; ఊగడం; ఆందోళనం;
 • oscillator, n. [phys.] ఆందోళిక;
  • harmonic -, ph. [phys.] హరాత్మక ఆందోళిక; స్వరాత్మక ఆందోళిక; In classical mechanics, a harmonic oscillator is a system that, when displaced from its equilibrium position, experiences a restoring force F proportional to the displacement x:
 • oscillatory, adj. స్పందించే; డోలాయమానమైన; ఊగే;
  • - universe, ph. స్పందించే విశ్వం;
  • theory of - -, ph. విశ్వ స్పందన వాదం; see also big bang theory;
 • oscilloscope, n. డోలన దర్శిని;
 • osculation, n. వేష్టనం; చుంబనం;
 • osmosis, n. అభిసరణం; ఉత్సరణం; ద్రవాభిసరణ;
 • osmotic pressure, n. అభిసరణ ప్రేషం;
 • ostentation, n. ఆడంబరం; డంబరం;
  • verbal -, ph. వాగాడంబరం;
 • osteomalacia, n. అస్తిమాల్యం; ఎముకల బలహీనతకు చెందిన వ్యాధి;
 • ostrich, n. నిప్పుకోడి; ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి;
 • other, adj. మరొక; వేరే; లాతి; అన్య; పరాయి; (rel.) another;
  • - countries, ph. అన్య దేశాలు; పరాయి దేశాలు;
  • - people, ph. లాతి వాళ్లు;
  • - side, ph. అవతల; అవతల పక్క;
 • otter, n.ఆటర్; నీళ్ళల్లో ఉండే కుక్కని పోలిన ఒక క్షీరదం;
 • otherwise, adv. అలాకాని పక్షంలో; అట్లుకాకున్న; కానిచో; అన్యథా; అథవా; పక్షాంతరమున;
 • ounce, n. అవున్సు; (1) ద్రవ పదార్థాలని కొలవడానికి వాడే ఒక మానం; (2) బరువుని కొలిచేటప్పుడు పౌనులో పదహారో వంతు;
 • our, poss. pron. (1) inclusive, మన; (2) exclusive; మా; మాయొక్క;
 • out, adv. బైట; బైటకి;
 • outcast, n. అప్రాశ్యుడు; వెలి వేయబడ్డవాడు;
 • outcome, n. ఫలితార్థం; ఫలం; పరిణామం;
 • outcropping, n. గుట్ట; మట్టిలోంచి బయటికి పొడుచుకు వచ్చిన శిలా సంస్తరం;
 • outcry, n. పెద్ద గోల; గొడవ; ఉద్ఘోషం;
 • outdoor, adj. బయటి; లోపలి కాని;
 • outer, adj. బహిర్గత; బాహ్య;
 • outfit, n. (1) దుస్తులు; (2) సరంజామా; సాధన సంపత్తి;
 • outlaw, v. t. నిషేధించు;
 • outlay, n. పెట్టుబడి; మొత్తపు ఖర్చు; వ్యయం;
 • outlet, n. నిర్గమ ద్వారం; నిర్గమం;
 • outline, n. రూపురేఖ;
 • output, adj. బహిర్గత; అంతర్యాన; అంతర్యాగ;
  • - data, ph. బహిర్గత దత్తాంశం; బహిర్యానాంశం; బహిర్యాగాంశం;
  • - pressure, ph. బహిర్గత పీడనం;
 • output, n. నిర్గమాంశం; నిర్గతం; బహిర్గతం; బహిర్హితం; బహిర్యానం; బహిర్యాగం; వెలపలం; బరవానా; పోత; ఫలితం; పరిణామం; ఉత్పన్నం; ఫలోత్పత్తి; నిర్గళితం; ఆయాతం; ప్రదానం; బైపెట్టు;
 • outrage, n. దౌర్జన్యం; దురంతం; దురాగతం;
 • outside, n. బయట;
 • outsiders, n. pl. బయటివారు; తస్మదీయులు;
 • outskirts, n. పొలిమేరలు; శివార్లు;
 • outstanding, adj. (1) విశిష్టమైన; (2) బాకీ ఉన్న; మిగిలిన;
  • - exhibition, ph. విశిష్టమైన ప్రదర్శన;
  • - debt, ph. మిగిలిన అప్పు;
 • outstretched, adj. బారజాపిన; చాపిన;
 • outward, adj. బహిర్; బాహరమైన;
 • ova, n. గుడ్లు; అండములు;
 • ovary, n. స్త్రీబీజకోశం; అండకోశం; గర్భాగారం;
 • oven, n. (అవెన్) ఆవం; ఆశ్మంతం; హసంతి; కమటం; పొక్కలి; పొయ్యి;
  • goldsmith's -, ph. కమటం;
  • oven bird -, ph. పొయ్యిపిట్ట; ఆవపిట్ట;
  • - to fire bricks, ph. ఇటుకలావం;
 • over, prep.కంటె; మీద; పైన;
 • over-bar, n. [math.] శిరోవారం; గణితంలో బీజాక్షరాల తల మీద గీసే అడ్డు గీత;
 • overbearing, adj. దాష్టీకమైన;
 • overcast, adj. మబ్బు కమ్మిన; మందారముగానున్న;
 • overcoat, n. అంగరఖా;
 • overcome, v. i. అధిగమించు; నిస్తరించు; గెలుచు; జయించు;
 • overdose, n. మితిమీరిన మోతాదు;
 • overdue, n. నిల్వ బాకీ; బకాయ;
 • overflow, v. i. పొంగు; ఉప్పొంగు;
 • overhang, v.i. వేలాడు;
 • overhead, n. అమాంబాపతులు; పై ఖర్చులు;
 • overlook, v. t. (1) చూడకపోవు; గమనించకపోవు; (2) ఒకరు చేసిన తప్పుని పట్టించుకోకుండా వదలిపెట్టు; (3) పైనుండి కిందకి చూచు;
 • overripe, adj. ఆరముగ్గిన;
 • oversee, v. i. అజమాయిషీ చేయు;
 • overseer, n. తలవరి; ఓర్సీలు;
 • oversight, n. (1) ఏమరుపాటు; ఏమరుపాటుతో చేసిన పొరపాటు; (2) ఏమరుపాటుతో పొరపాట్లు జరగకుండా అజమాయిషీ చేయు; (note) a word with opposing meanings;
 • overtake, v. t. అధిగమించు; అతిక్రమించు; పట్టుకొను;
 • overtly, adv. బాహాటంగా; బహిరంగంగా;
 • overtone, n. అతిస్వరం; ప్రాధమిక ధ్వని తరంగం కంటె ఎక్కువ తరచుదనం (పౌనఃపున్యం) తో కంపించే తరంగం;
 • overture, n. (1) పూర్వరంగం; (2) ఆరంభవాద్యం; సంగీత సభలలో ఉపోద్ఘాతంగా వాడే సంగీతం; (3) స్నేహభావాన్ని ప్రదర్శించడం;
 • overturn, v. t. (1) తలకిందులు చేయు; బోల్తా కొట్టించు; (2) దిగువ కోర్టులో చేసిన తీర్మానాన్ని ఎగువ కోర్టువారు కొట్టివేయు;
 • overview, n. పర్యావలోకనం; విహంగావలోకనం;
 • overwhelming, adj. అతిశయించిన;
  • - response, ph. అతిశయించిన స్పందన;
 • oviduct, n. అండవాహిక;
 • oviform, adj. అండాకార;
 • ovulation, n. అండోత్సర్గం;
 • oviparous, adj. అండజమైన; గుడ్డులోంచి పుట్టిన;
 • ovum, n. స్త్రీబీజం; అండం; శోణితం;
 • owing to, prep. వల్ల; నుంచి;
 • owl, n. గుడ్లగూబ; పులుగుపిట్ట; ఘూకం; ఉలూకం; దివాంధం; వాయసారాతి; వాయసారి; ధ్వాంక్షారాతి; పేచకం;
 • own, adj. స్వంత; ఖాసా; కాసా;
 • owner, n. స్వామి; ఖామందు; యజమాని; స్వంతదారు; సొంతదారు; పట్టాదారు;
 • ownership, n.స్వంతం; హక్కు; స్వామ్యం; స్వామిత్వం;
 • ox, n. s. ఎద్దు; గిత్త; వృషభం;
 • oxen, n. pl. ఎడ్లు; గిత్తలు;
 • oxidation, n. భస్మీకరణం; ఉపచయం;
 • oxidant, n. భస్మీకరి; భస్మం చేసేది;
  • antioxidant, n. ప్రతిభస్మీకరి;
 • oxide, n. ఆమ్లజనితో సంయోగం చెందగా వచ్చిన తుప్పు;
 • ox gall, n. గోరోచనం;
 • oxy-acetylene, n. ఆమ్లవిదీను;
 • oxy-acetylene torch, ph. ఆమ్లవిదీను దివ్వె; ఈ రకం దివ్వెతో ఉక్కుని సునాయాసంగా కోయవచ్చు;
 • Oxygen, n. ఆమ్లజని; ప్రాణవాయువు; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు; (అణుసంఖ్య 8, సంక్షిప్త నామం O)
 • oxymoron, n. విరుద్ధోక్తి; విరోధాభాసాలంకారం; సంసృష్టి; రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం; ఉ. మా చెడ్డ మంచోడు;
 • oxide, n. భస్మం;
  • iron -, ph. తుప్పు;
 • oyster, n. సీపి; గుల్లచేప; ఆల్చిప్ప;
 • ozone layer, n. ఓజోను పొర; అంతరిక్షం నుండి హాని చేసే కిరణాలు భూమిని సోకకుండా ఆపు చేసే వాయువుల పొర;

మూలం