"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (T - U)

From tewiki
Jump to navigation Jump to search

నిఘంటువు

 • This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features are continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
 • T The entries use American spelling. Where possible, British spellings are also given.
 • You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
 • PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks

25 Aug 2015.

Part 1: T

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • table, n. (1) బల్ల; మేజా; భోజనాల బల్ల; (2) పట్టిక; పట్టీ; సారణి; సరణి; (3) ఎక్కం;
  • addition -, ph. కూడిక ఎక్కం;
  • multiplication -, ph. ఎక్కం; గుణకార ఎక్కం;
  • water -, ph. జలమట్టం; భూమిలో ఈ మట్టానికి దిగువ నీరు సంతృప్తంగా ఆవరించి ఉంటుంది; నుయ్యి తవ్వినప్పుడు నీరు ఈ మట్టానికి నిలుస్తుంది;
  • - of contents, ph. విషయసూచిక;
  • - salt, ph. ఉప్పు; వంటలో వాడే ఉప్పు; కూర ఉప్పు;
  • - spoon, ph. వడ్డన చెంచా; పెద్ద చెంచా;
  • - sugar, ph. చక్కెర; రోజూ వాడుకునే పంచదార;
 • tableland, n. పీఠభూమి; సానువు;
 • tablet, n. (1) బిళ్ల; గుటిక; మాత్ర; మింగడానికి అనుకూలంగా ఉన్న మోతాదు మించని మాత్ర; (2) పలక; కర్రతో కాని, మట్టితో కాని, రాయితో కాని చేసి, రాతకి అనుకూలంగా చదునుగా ఉన్న వస్తువు;
  • clay -, ph. మట్టి పలక;
 • taboo, n. అశ్లీలం; బూతు; సాధు సమ్మతం కానిది; చెయ్యకూడని చేత; రాయకూడని రాత;
 • tabular, adj. విన్యాసం; సారణ్య విన్యాసం;
  • - arrangement, ph. సారణీబద్ధమైన విన్యాసం:
 • tabula rasa, n. ఖాళీ పలక; తెల్ల కాగితం; అలేఖ్యం; అలేఖం;
 • tabulation, n. సారణీకరణం;
 • tacit, adj. అనుక్త; ప్రత్యేకంగా చెప్పని; ఉద్ఘాటించని; ముభావంగా ఊరుకున్న; అంతర్లీనమైన;
 • tacit assumption, ph. అనుక్త ఉపపాదన; ఉద్ఘాటించని తలంపు;
 • taciturn, adj. ముభావంగా ఉన్న; తక్కువగా మాట్లాడే తత్వం కల;
 • tack, n. పూతిక నాటు; చిన్న మేకు;
  • thumb -, ph. బొత్తాం నాటు; సుత్తి అవసరం లేకుండా వేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
 • tact, n. యుక్తి; ఒడుపు;
  • - and talent, ph. శక్తియుక్తులు;
 • tactic, n. లఘుయుక్తి; లఘుతంత్రం; పన్నాగం; సమీప భవిష్యత్తుకి కావలసిన ఎత్తు; see also stratagem;
 • tactile, adj. స్పర్శకి సంబంధించిన;
 • tadpole, n. తల కప్ప; భేకడింభం; చిరు కప్ప; పిల్ల కప్ప;
 • tail, n. (1) తోక; పక్షి తోక; జంతువుల తోక; విమానపు తోక; (2) వాలం; లాంగూలం; జంతువుల తోక; (3) బొరుసు;
  • hairy -, ph. లాంగూలం; గురప్రు తోక లాంటి కుచ్చు తోక;
 • tail, v. t. వెంటాడు; తోకలా వెంటాడు; వెన్నంటి వెళ్లు;
 • tail-lights, n. pl. తోకదీపాలు;
 • tailor, n. దర్జీ; తున్నవాయుఁడు; కుట్టరి;
 • tailwind, ph. వాలుగాలి;
 • taint, n. కళంకం; కల్తీ;
 • taint, v. t. కల్తీ చేయు; కళంకం తీసుకొని వచ్చు;
 • tainted, adj. కల్తీ అయిన;
 • take, v. t. (1) తీసుకొను; కైకొను; చేపట్టు; (2) సేవించు; తిను; తాగు;
 • takeoff, n. (1) ఎత్తుగడ; (2) పైకి లేచు; గాలిలోకి లేచు; (ant.) conclusion; landing;
  • - of a story, ph. కథ ఎత్తుగడ;
 • take up, v. t. చేపట్టు;
 • tale, n. కథానకం; ఉపాఖ్యానం;
 • talent, n. నేర్పు; కుశలత; కౌశల్యం; ప్రతిభ; ప్రజ్ఞ; ‘జన్మతః సంక్రమించే నైసర్గిక లక్షణం’ అనేదే ప్రతిభ అన్నారు దండి; అభినవ గుప్తుడు ‘అపూర్వ వస్తు నిర్మాణ ప్రజ్ఞ’గా చెప్పారు;
 • talisman, n. తావీజు; తాయెత్తు; రక్షామణి; రక్ష;
 • talk, n. మాట; పలుకు; ప్రసంగం;
  • parrot -, ph. చిలక పలుకు;
  • - of the town, ph. కింవదంతి;
 • talk, v. t. మాట్లాడు; భాషించు;
 • talkies, n. మాట్లాడే బొమ్మలు; సినిమాలు;
 • talkative person, n. వాగుడుకాయ; వాచాలుడు; వాచాటుడు; జల్పకుడు;
 • talkativeness, n. వాచాలత;
 • tall, adj. పొడవైన; పొడుగైన; ఎత్తయిన;
 • tallow, n. కొవ్వు;
 • tally, n. బేరీజు; తైపారు;
 • tally, v. t. బేరీజు వేసి చూడు; తైపారు వేసి చూడు;
 • talons, n. pl. పక్షి గోళ్లు; పంజా;
 • tamarin, n.మీసాలకోతి;
 • tamarind, n. చింతపండు; తింత్రిణీకం; (ety.) tamar-e-Hind = Indian date = భారతీయ ఖర్జూరం;
  • - tree, ph. చింతచెట్టు; తింత్రిణీ వృక్షం;
  • - seed, ph. చింతగింౙ; చింతపిక్క;
 • tame, adj. మచ్చిక అయిన; పెంపుడు; సాధు; (ant.) wild; (rel.) domesticated;
 • tame, v. t. మచ్చిక చేయు;
 • tamp, v. t. దట్టించు; కూరు;
 • tamper, n. పోఁపు; తాలింపు; తిరగబోత;
 • tamper, v. t. జోలికి పోవు; జోక్యం కలుగజేసుకొను; లంచం ఇచ్చు;
 • tan, n. (1) లేత గోధుమ రంగు; కడారు వన్నె; (2) పదును; కురటము; చర్మాన్ని తోలుగా మార్చే పద్ధతి;
 • tan, v. t. (1) ఎండలో కూర్చుని శరీరాన్ని లేత గోధుమ రంగు లోకి మార్చు; (2) ఊను; ఊన్‌చు; పదును పట్టు; కురటించు; చర్మాన్ని తోలుగా మార్చు;
 • tangent, n. (1) స్పర్శరేఖ; (2) స్పర్శాంశం; త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం లవంలోనూ, పక్కగా ఉన్న భుజం హారంలోనూ వేసినప్పుడు వచ్చే నిష్పత్తి; లంబకోణ త్రిభుజంలో లంబకోణం కాని ఒకకోణానికి ఎదురుగా ఉన్నభుజం లవం లోను, ప్రక్కగా ఉన్న( కర్ణం కాని) భుజం హారం లోను వేసినప్పుడు వచ్చే నిష్పత్తి;
 • tangible, adj. స్పర్శనీయ; అనుభవనీయ; సాకారమైన; స్పష్టమైన;
 • tangle, n. చిక్కు;
 • tank, n. (1) చెరువు; తటాకం; కోనేరు; టెంకి; పుష్కరిణి; (2) తొట్టి;
 • tanner, n. కురటుడు; చర్మాన్ని తోలుగా మార్చే వ్యక్తి;
 • tanner's cassia, n. తంగేడు చెట్టు; [bot.] Senna auriculata
 • tannery, n. కురట శాల; తోళ్లని పదును చేసే కర్మాగారం;
Tangent_to_a_curve
Academ_Base_of_trigonometry
 • tantamount, adj. నిజానికి; వాస్తవానికి; మొత్తంమీద; సమానార్ధకమైన;
 • tap, v. t. (1) తట్టు; (2) చిన్న గంటు పెట్టి వెలికి తీయు;
 • tap, n. (1) కుళాయి; నల్ల; గొట్టానికి గంటు పెట్టి నీళ్లని బయటకు తీసే సాధనం; పంపు; (2) [phonetics] అల్ప కంపితం;
  • water -, ph. నీళ్ళ కుళాయి;
  • - root, ph. తల్లి వేరు; కూకటి వేరు;
 • tapaculo, n. వెందాపు పక్షి;
 • tape, n. పట్టెడ; నవారు; బద్దీ; నాడా; టేపు;
 • taper, adj. కూచిగా ఉన్న; ఆదోక; (ety.) ఆవుతోక వలె;
  • - joint, ph. ఆదోక బందు; ఆదోక బంధం;
 • taperingly, adv. అదోకగా;
 • tapestry, n. చిత్ర యవనిక; గుడ్డ మీద వేసిన వర్ణ చిత్రం;
 • tapeworm, n. బద్దె పురుగు; మనుష్యుల చిన్న ప్రేగులలో పెరిగే ఒక జాతి పరాన్నభుక్కి; an invertebrate of the platihelmonth family;
 • tapioca, n. సగ్గుబియ్యం; కఱ్ఱపెండలం జాతి పిండి పదార్థంతో చేసే ఒక ధాన్య విశేషం; తాళజాతి చెట్ల నుండి వచ్చే పిండితో చేస్తే దానిని "సేగో" అంటారు; see also sago;
 • tar, n. తారు; కీలు; గంజిత్తు; (ety.) గని + జిత్తు;
 • tardy, adj. ఆలస్యం చేసెడు;
 • tare, n. తారం; తారా; పడికట్టు ఎత్తు; తూనిక తోపుడు; సరుకులు బుట్టలో వేసి తూచేటప్పుడు ఖాళీ బుట్ట బరువు;
 • target, n. లక్ష్యం;
 • targeted, adj. లక్షిత;
  • - reader, ph. లక్షిత పాఠకుడు;
 • tariff, n. (1) సుంకం; ఎగుమతి దిగుమతుల మీద ప్రభుత్వం వేసే సుంకం; (2) హొటేలు గదులకి పుచ్చుకొనే అద్దె; (3) సుంకాల పట్టీ; సుంకసూచిక;
 • tarnish, n. మెరుపు తగ్గుట; కిలుం పట్టుట;
 • taro root, n. చేమ దుంప;
 • tarpaulin, n. కీలుచాప; తారుగుడ్డ;
 • tart, adj. పుల్లని;
 • tartar, n. (1) ద్రాక్ష ఉప్పు; (2) పండ్లమీద చేరే మలినం; పాచి;
తింత్రిణికామ్లం
 • tartaric acid, n. తింత్రిణికామ్లం; C4H6O6
 • task, n. పని;
 • taste, n. (1) రుచి; స్వాదనం; చవి; రసం; (2) రసజ్ఞత; (3) అభిరుచి;
 • taste, v. t. రుచిచూడు; చవిచూడు; ఆస్వాదించు;
 • taste, adj. రుచి; స్వాదు; చవి;
  • - buds, ph. రుచిబొడిపెలు; స్వాదుముకుళాలు;
 • tasteless, adj. చప్పిడి; రుచిలేని; రసహీనమైన;
 • tasty, adj. కమ్మని; రుచికరమైన;
 • tattle, v. t. వదరుట; పేలుట; వాగుట; ఉపయోగం లేని కబుర్లు, చాడీలు;
 • tattletales, n. పనికిమాలిన కబుర్లు; గుసగుసలు;
 • tattoo, n. పచ్చబొట్టు;
 • taunt, n. దెప్పు; ఎత్తిపొడుపు; ఉపాలంభం;
 • taunt, v. t. దెప్పు; ఎత్తిపొడుచు;
 • taupe, n. తోపు; తోపురంగు; ముదర ఎరుపు;
 • Tauri Beta, n. అగ్ని నక్షత్రం; వృషభ రాశి లోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో రెండవది;
 • Tauri Gamma, n. రోహిణి నక్షత్రం; వృషభ రాశిలోని ప్రకాశవంతమైన చుక్కలలో మూడవది;
 • Tauri Pi, n. కృత్తిక నక్షత్రం; వృషభ రాశిలో ఒక తార;
 • Taurus, n. వృషభ రాశి;
 • tautology, n. అనులాపం; పునరుక్తి దోషం; అనవసరంగా ఒకే భావాన్ని ఒకే వాక్యంలో మరొకసారి చెప్పడం; ఉదా. చొక్కా ఇరుకుగా ఉండి పట్టడం లేదు;
 • tawny, adj. చామనచాయ; ధూసరవర్ణం; గోధుమ రంగు; సింహం రంగు; tan color;
 • tax, n. పన్ను; సుంకం; కరం; same as cess; see also duty; (Note) duty అనేది సరుకుల మీద పడే సుంకం, tax అనేది మనుష్యుల మీద పడే సుంకం;
  • death -, ph. మరణ సుంకం;
  • excise -, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను; వ్యాపారపు పన్ను; అబ్కారీ పన్ను;
  • house -, ph. ఇంటి పన్ను; ఇల్లరి;
  • income -, ph. ఆదాయపు పన్ను;
  • inheritance -, ph. వారసత్వపు పన్ను;
  • property -, ph. ఆస్తి పన్ను;
  • - collector, ph. కర గ్రాహి;
 • taxes, n. పన్నులు; కప్పములు;
 • tax-free, adj. పన్నులు లేని;
 • taxi, n. కిరాయికారు; టేక్సీ; టేక్సీకేబ్ అన్న మాటని కత్తిరించగా వచ్చిన మాట;
 • taxonomy, n. వర్గీకరణ; వర్గీకరణ శాస్త్రం;
 • tea, n. తేనీరు; చా; టీ;
  • - leaf, ph. తేయాకు;
 • teach, v. t. నేర్పు; బోధించు; బోధన చేయు; బోధపరచు; ప్రబోధించు;
 • teacher, n. గురువు; అఖ్యాత; బోధకుఁడు; m. పంతులు; ఉపాధ్యాయుఁడు; ఒజ్జ; అధ్యాపకుఁడు; ఆచార్యుఁడు; దేశకుఁడు; అయ్యవారు; f. పంతులమ్మ; గుర్వి; ఉపాధ్యాయిని; ఒజ్జసాని;
  • teacher's teacher, ph. ప్రాచార్యుడు; (note)similar to ప్రపితామహుడు
 • teaching, n. బోధ; బోధన; అధ్యాపనం;
 • teak, n. టేకు; టేకు కర్ర; టేకు చెట్టు;
 • teakwood, n. టేకు; టేకు కర్ర;
 • teal, n. నీలపచ్చం; నీలహరితం;
 • teal, adj. నీలంపచ్చ; నీలహరిత;
 • team, n. జట్టు; గుంపు;
 • tear, v. t. చింపు; చించు;
 • tear, n. (1) కన్నీరు; అశ్రువు; అశ్రుజలం; బాష్పం; బాష్పజలం; (2) చిరుగు;
  • - gland, ph. అశ్రుగ్రంథి; కన్నీటి కంతి;
 • teardrop, n. అశ్రుబిందువు; అశ్రుకణం; కన్నీటిబొట్టు;
 • teargas, n. బాష్పవాయువు; కన్నీరువాయువు;
 • tears, n. అశ్రువులు; అశ్రుబిందువులు; కన్నీటిబొట్లు; కన్నీళ్లు; కన్నీరు; బాష్పములు;
  • - of joy, ph. ఆనంద ఆశ్రువులు; ఆనంద బాష్పములు;
 • tease, v. t. (1) చిక్కులు విడదీయు; (2) ఏడిపించు; ఉడికించు; ఆగడం చేయు;
  • - the hair, ph. చిక్కులు విడదీయడానికి చిక్కట్టతో జుత్తుని దువ్వడం;
 • teaser, n. చిక్కట్ట;
 • teaspoon, n. మిళ్లిగరిటె; చాచెంచా; చిన్నచెమ్చా;
 • teat, n. (1) ౘన్ను; ౘనుమొన; (2 ) తిత్తి;
 • technical, adj. సాంకేతిక; తాంత్రిక; పారిభాషిక;
  • - terminology, ph. పారిభాషిక పదజాలం; సాంకేతిక పదజాలం;
 • technicality, n. నిమిత్తమాత్రపు లొసుగు; పారిభాషికత;
 • technician, n. తాంత్రికుఁడు;
 • technique, n. పద్ధతి; కిటుకు; సంవిధానం; శిల్పం; విద్యామర్మం; కళాత్మకమైన ప్రయోగ విధానం;
 • technology, n. సాంకేతికం; సాంకేతిక తంత్రం; సంవిధాన శాస్త్రం;
 • tedious, adj. విసుగు పుట్టించే; బోరు కొట్టించే; ఎప్పటికీ తెమలని;
 • teen-age, n. కౌమారం;
 • teeth, n. పళ్లు; పండ్లు; దంతాలు;
  • canine -, ph. రదనికలు; కోరపళ్ళు;
  • deciduous -, ph. పాల పళ్లు;
  • incisor -, ph. కుంతకాలు; కత్తెర పళ్ళు;
  • molar -, ph. చర్వణకాలు; దంతాలు;
  • permanent -, ph. శాశ్వత దంతాలు; ప్రౌఢ దంతాలు;
 • teething troubles, ph. [idiom] బాలారిష్టాలు; వాచ్యర్థం చిన్నపిల్లలకి వచ్చే రోగాలే అయినప్పటికీ ఏ పని చెయ్యడానికైనా మెదట్లో ఎదురయే ఇబ్బందులని సూచించడానికి గౌణ్యర్థంతో వాడే మాట;
 • teetotaler, n. [idiom] మద్యం ఎన్నడూ ముట్టని వ్యక్తి; మాదక పానీయాలు ముట్టని వాడు; మందు ముట్టని మందభాగ్యుడు;
 • tejpat, n. తేజపత్రి;
 • telegram, n. తంతి; తంతివార్త; టెలిగ్రామ్; same as wire;
 • teleological, adj. ప్రయోజన సంబంధమైన;
 • telepathy, n. దూరానుభూతి; దివ్యానుభూతి; ఇంద్రియముల ప్రమేయం లేకుండా రెండు మనస్సులకు మధ్య జరిగే వార్తా ప్రసరణ;
 • telephone, n. దూరవాణి; దూరశ్రవణి; శ్రవణి; టెలిఫోను;
 • telescope, n. దుర్భిణి; దూరదర్శని; ఓఁకుమర; చుక్కీ; టెలిస్కోప్;
 • television, n. టెలివిజన్; టీవీ; దూరదర్శని;
 • tell, v. t. చెప్పు; నుడువు;
 • Tellurium, n. తెల్లురం; టెల్లూరియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 52, సంక్షిప్త నామం, Te); [Lat. tellus = earth];
 • telo, pref. అంత్య;
 • telophase, n. అంత్యదశ;
 • temerity, n. తెగువ; సాహసం;
 • temp., n. కైజీతగాఁడు; తాత్కాలికంగా పనిచేసే వ్యక్తి;
 • temper, n. పోఁపు; తాలింపు; తిరుగబోత;
 • temper, v. t. (1) పోఁపు పెట్టు; (2) గట్టిపరుచు; మలుచు; (3) మెత్తపరచు; ఇక్కడ ఒకే మాటకి రెండు వ్యతిరేక అర్థాలు గమనించునది;
 • temperate, adj. మితమైన; సమశీతోష్ణ;
 • temperature, n. ఉష్ణోగ్రత; తాపమానం; తాపక్రమం; తాప తీక్షణాన్ని తెలిపే సంఖ్య; శీతోష్ణ పరిమాణం; శీతోగ్రత;
  • - gauge, ph. ఉష్ణమితి;
 • tempered justice, ph. దయతో కూడిన శిక్ష;
 • tempered steel, n. గట్టిపరచబడ్డ ఉక్కు;
 • temple, n.(1) గుడి; కోవెల; దేవాలయం; దేవళం; మందిరం; (2) కణత; నుదిటికి ఇరువైపులా ఉండే శిరోభాగం;
  • - without a roof, ph. దద్దళం;
 • tempo, n. గమనం; జోరు; బిగి;
  • - of a story, ph. కథాగమనం;
 • temporal, adj. (1) కర్ణాస్థులకి సంబంధించిన; (2) ఐహికమైన; (3) కాలానికి సంబంధించిన;
  • - lobes, ph. కర్ణావృత్తములు;
 • temporary, adj. తాత్కాలిక; అసత్; తైంతిక; హంగామీ;
  • - crew, ph. హంగామీ సిబ్బంది; కై సిబ్బంది;
  • - residence, ph. మకాం;
  • - staff, ph. కైజీతగాళ్లు;
 • temporary, n. తాత్కాలికం;
 • tempt, v. t. పురిగొలుపు; ఊరించు; ఆశపెట్టు; ఉసిగొలుపు; ప్రేరేపించు;
 • temptation, n. ప్రలోభం;
 • tempting, adj. ఆకర్షించెడు;
 • ten, n. పది;
 • ten, adj. దశ; పది;
 • tenacity, n. జిగి; హఠం;
 • tenancy, n. కౌలుదారితనం;
 • tenant, n. నెలసరి; అద్దెకున్నవాఁడు; భూమి కౌలుకి తీసికొన్నవాఁడు;
 • tend, v.i. ఒక వైపునకు జరుగు; మొగ్గుచూపు;
 • tendency, n. వాటం; ప్రవృత్తి; ఉన్ముఖత; పోబడి; జాడ; ధోరణి; ఆసక్తి;
 • tender, adj. లేత; కవట; కసు; మృదువైన; ఎల; (ant.) mature; ripe;
  • - vegetables, ph. కసుగాయలు; లేత కాయలు;
  • - age, ph. ఎలప్రాయము;
  • - leaf, ph. కవటాకు;
  • - shoots, ph. లేత చిగుర్లు;
 • tender, n. కొనుగోలుకి సిద్దంగా ఉన్నామని తెలియజేసే లాంఛన పత్రం;
 • tender, v. t. ఇచ్చు; లాంఛనంగా ఇచ్చు; దఖలు పరచు;
 • tendon, n. స్నాయువు; స్నాయుబంధనం;
 • tendril, n. నులితీగ; లేత తీగ;
 • tenement, n. చిన్న చిన్న వాటాలుగా కట్టిన అద్దె కొంపలు;
 • ten-fold, n. పదింతలు; పదిరెట్లు;
 • tenet, n. సిద్ధాంతం; సూత్రం;
 • ten million, n. కోటి;
 • tenon, n. కుసి; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రకి ఉండే ముక్కు; రెండవ కర్రకి ఉండే బెజ్జాన్ని కుసి బెజ్జం అంటారు;
 • tenor, n. (1) సారాంశం; (2) తారస్వరం;
 • tense, n. [gram.] కాలం;
  • future -, ph. భవిష్యత్ కాలం; భవిష్యదర్ధకం;
  • future indefinite -, ph. తద్ధర్మ కాలం;
  • past -, ph. భూత కాలం; భూతార్థకం;
  • present -, ph. వర్తమానకాలం; వర్తమానార్ధకం;
  • present perfect -, ph. తద్ధర్మార్ధకం;
  • present indefinite -, ph. తద్ధర్మకాలం;
 • tense, adj. బిర్రుగా; ఆరాటంగా; (ant.) lax;
 • tension, n. బిగి; బిగితం; బిర్రు; జిగి; పట్టు; తన్యత; ఆతతి; ఉద్రిక్తత;
  • emotional -, ph. ఉద్రేకం;
  • surface -, ph. తలతన్యత;
 • tension bar, ph. బిగిబద్ద;
 • tent, n. డేరా; గుడారం; పటకుటిరం; షామియానా;
 • tentative, adj. ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా;
 • tenth, adj. దశమ; పదో; పదియవ;
 • tepid, adj. నులివెచ్చ; గోరువెచ్చ; కదుష్ణ; కోష్ణమైన;
 • tepidity, n. కోష్ణం;
 • tera, pref. టెరా; ట్రిలియనుని సూచించడానికి వాడే పూర్వ ప్రత్యయం;
 • term, n. (1) పదం; మాట; (2) నియత కాలం; కందాయం; (3) విశ్వవిద్యాలయాల్లో అర్ధ సంవత్సరం; (4) గణితంలో చలరాశి కాని చలరాశుల సముదాయం కాని;
  • analogous -, ph. తుల్య పదం;
  • antecedent -, ph. పూర్వ పదం;
  • common -, ph. సమాహారక పదం;
  • first -, ph. మొదటి కందాయం; మొదటి పదం; మొదటి అంశం;
 • terminal, adj. శీర్ష; అవసాన; అంత్య; అంతిమ;
  • cell -, ph. అంత్యకణం;
  • multi -, ph. బహుశీర్ష;
  • two -, ph. ద్విశీర్ష;
  • - disease, ph. అవసాన రోగం; చివరి రోగం;
 • - phase, ph. అంతిమ దశ;
 • - stage, ph. అవసాన దశ; అవసాన కాలం;
 • terminal, n. కడ; కాడు; కొస; కొన; చివరకు; అంతు; అంతం; అడంగు; అవధి; అవసాని; అవసానిక; గణి; శీర్షం; కోటి;
  • computer -, ph. కలనావసాని; గణక అవసానిక; అవసాయకం;
  • positive -, ph. ధన గణి; ధన శీర్షం;
 • terminate, v. t. కడతేర్చు; కొసముట్టించు; అంతుచూడు; ఉపసంహరించు; చంపు; చాలించు;
 • termination, n. ఉపసంహారం; ముగింపు; కడతేర్చడం; కొసముట్టించడం; అంతుచూడడం; పూర్తిచేయడం;
 • terminator, n. ఉపసంహార రేఖ; ఒక గ్రహం మీద పగటికి, రాత్రికి మధ్య ఉండే ఊహాత్మక రేఖ;
 • terminology, n. పదజాలం; పరిభాష;
 • termite, n. చెదపురుగు; ఘణ; ఇవి చూడడానికి తెల్లటి చీమలలా ఉంటాయి కాని, ఇవి చీమలు కావు, బొద్దెంక జాతివి, చీమలకీ చెద పురుగులకీ మధ్య వైరం, చీమలు చెదపురుగులని తినేయ గలవు;
  • - hill, ph. చెదల పుట్ట;
 • terms, n. pl. (1) అంశాలు; పదాలు; (2) నిబంధనలు; షరతులు;
 • turpentine, n. శ్రీవేష్టం;
 • terrace, n. డాబా; అలిందం; బోడిమిద్దె; గదులు లేని మీది అంతస్థు;
 • terrestrial, adj. అధిభౌతిక; భూమికి సంబంధించిన; భూ; (ant.) అధిదైవిక;
  • - creatures, ph. భూచరాలు;
 • terrible, adj. భీషణ; భీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ; ఉగ్ర;
 • terrier, n. ఉడుప కుక్క; మొరసడము;
 • terrific, adj. భయంకరమైన; తీవ్రమైన; అద్భుతమైన;
 • territorial, adj. ప్రాదేశిక; భూభాగానికి సంబంధించిన; దేశాధికారానికి సంబంధించిన;
 • territorial sea, ph. ప్రాదేశిక సముద్రం;
 • territory, adj. దేశం; సంస్థానం; ప్రదేశం; భూభాగం;
 • terror, n. విపరీతమైన భయం;
 • terrorizing, adj. భయానక;
 • terrorism, n. ఉగ్రవాదం; a philosophy that supports unlawful violence and intimidation, especially against civilians, in the pursuit of political aims; (rel.) extremism = తీవ్రవాదం;
 • terrorist, n. ఉగ్రవాది; (rel) extremist = తీవ్రవాది;
 • terse, adj. క్లుప్తమైన; సంక్షిప్త;
 • tertiary, adj. తృతీయ; see also triassic;
 • test, n. పరీక్ష; శోధన; పరిశీలన;
 • test, v. t. పరీక్షించు; శోధించు; పరిశీలించు;
 • testament, n. (1) ఒప్పందం; (2) వీలునామా; మరణశాసనం;
  • New -, ph. మలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికి, దేవుడికీ మధ్య రెండవసారి జరిగిన ఒప్పందం;
  • Old -, ph. తొలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికీ, దేవుడికీ మధ్య జరిగిన తొలి ఒప్పందం;
 • testator, n. మరణశాసనం రాసి చనిపోయిన వ్యక్తి;
 • testes, n. బీజాండాలు; వృషణాలు; వట్టలు; వట్టకాయలు; ముష్కగోణులు;
 • testicle, n. వట్ట; వట్టకాయ; వట్రకాయ; బీజాండం; వృషణం; ముష్కం; కర్పూరం;
 • testify, v. t. సాక్ష్యమిచ్చు;
 • testimony, n. సాక్ష్యం; వాంగ్మూలం;
  • deathbed -, ph. మరణ వాంగ్మూలం;
 • test tube, n. పరీక్ష నాళిక; శోధన నాళిక;
  • - - baby, ph. కుంభ సంభవుడు; భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం;
 • tetanus, n. ధనుర్వాతం; గుర్రపువాతం; బేక్టీరియా వల్ల కలిగే ఒక జబ్బు; ---a disease caused by the bacterium Clostridium tetani; this bacterium makes one harmful toxin; protection against tetanus is afforded by immunity to this single toxin; so tetanus vaccine contains one single protein;
 • tether, n. సందము; కట్టుతాడు; కన్నెతాడు; పగ్గం;
 • tethered, n. సందానితము; తాడుతో కట్టబడ్డది;
 • tetra, pref. చతుర్;
 • tetrad, n. చతుష్టయం; పుంజీ; చవిత;
 • tetrafluoroethylene, n. చతుర్‌ప్లవనవిదిలీను; టెఫ్లాన్ తయారీకి ముడి పదార్థం; C2F4;
 • tetragonal, adj. చతుష్కోణ;
 • tetrahedron, n. చతుర్ముఖి; నలుమోమి; సమత్రిభుజాకారంలో నాలుగు ఫలకాలు (ముఖాలు) గల ఘన వస్తువు;
 • tetraploid, adj. చతుస్థితిక;
 • tetravalent, adj. చతుర్‌ బల; చతుర్‌బాహు;
 • text, n. (1) పాఠం; (2) పాఠ్యపుస్తకం; వాచకం;
  • non-detailed -, ph. ఉపవాచకం;
 • text box, ph. పాఠ పేటిక; కంప్యూటర్‍ తెర మీద అక్షరాలని రాయడానికి వీలుగా ఏర్పాటు చేసిన పెట్టె;
 • textiles, n. నేతబట్టలు; నేతసరకులు; జవళి;
 • textile industry, ph. జవళి పరిశ్రమ;
 • texture, n. అల్లిక; వ్యూతి; నేత నేసిన పద్ధతి; కూర్పు; కూర్పరితనం; ఒక ఉపరితలం ఎలా ఉందో జ్ఞఆనేంద్రియాల స్పర్శకి కలిగే అనుభూతి; ఉ. ముతకగా ఉంది, మెత్తగా ఉంది, పిండిలా ఉంది, మొరుంలా ఉంది, అంటూ ఆ ఉపరితలం కట్టడి ఎలా ఉందో వర్ణించడానికి వాడే మాట;
 • thalamus, n. పుష్పాసనం; పర్యంకదేశము; either of two masses of gray matter lying between the brain hemispheres on either side of the third ventricle, relaying sensory information and acting as a center for pain perception;
 • Thallium, n. థేలియం; రెమ్మజం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 81, సంక్షిప్తనామం, Tl); [Gr. thalos = green shoot or twig];
 • than, conj. కంటె;
 • thank, .v. t. కృతజ్ఞత తెలుపు; ధన్యవాదాలు చెప్పు;
 • thanks, n. ధన్యవాదాలు; మప్పిదాలు;
 • that, pron. adj. ఆది; ఆ; తత్;
  • different from -, ph. తత్‌భిన్నం;
  • connected with -, ph. తత్‌సంబంధమైన;
 • that way, ph. అటు;
 • thatched, adj. గడ్డితో నేయబడ్డ; గడ్డితో కప్పబడ్డ; పూరి;
 • thaw, v. i. కరుగు; ద్రవించు; మంచుతో గడ్డకట్టుకుపోయిన వస్తువు ద్రవించు;
 • the, def. art. ఆ; ఈ;
 • theater, n. (1) శాల; నాటకశాల; ఆటపాక; హాలు; (2) నాటకశాస్త్రం;
 • theft, n. దొంగతనం;
 • their, pron. (1) remote. వాళ్ల; వారి; వాళ్ళవి; వారివి; (2) proximate. వీళ్ల; వీరి; వీళ్ళవి; వీరివి;
 • theism, n. ఆస్తిక మతం; భగవంతుడనే సృష్టికర్త ఉన్నాడని, అతడు దయామయుడు, మన మంచిచెడ్డలని చూస్తూ మనని కనిపెట్టుకుని ఉంటాడనే నమ్మకం;
 • theist, n. సేశ్వర వాది;
 • theistic, adj. ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకంతో; సేశ్వర;
 • them, pron. వారిని; వాళ్ళని;
 • theme, n. ఇతివృత్తం; భూమిక;
 • themselves, pron. వారే; అవియే; తామే;
 • then, adv. అప్పుడు; అంతట; అటు పిమ్మట; ఆ తర్వాత; అనవుడు;
 • thence, adv. అక్కడనుండి; అప్పటినుండి;
 • theocracy, n. మతవర్గాధిపత్యం; మతధర్మ స్వామ్యం;
 • theology, n. మతధర్మ శాస్త్రం; దేవుడికీ, మతానికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని విచారించే శాస్త్రం;
 • theorem, n. ప్రమేయం; నియమం; సిద్ధాంతం; రుజువు అయినది;
  • converse -, ph. విలోమ నియమం;
  • derived -, ph. వ్యుత్పన్న నియమం;
  • existence -, ph. అస్తిత్వ నియమం;
  • fundamental -, ph. మూల సిద్ధాంతం;
 • theoretically, adj. సిద్ధాంతరీత్యా;
 • theorist, n. సిద్ధాంతకర్త;
 • theorize, n. సిద్ధాంతీకరించు; సూత్రీకరించు; వాదించు;
 • theory, n. వాదం; ప్రతిపాదించబడ్డది;
  • in -, ph. సిద్ధాంతరీత్యా; శాస్త్ర ప్రకారం;
 • Theosophical Society, n. దివ్యజ్ఞాన సమాజం;
 • theosophy, n. దివ్యజ్ఞానం;
 • therapy, n. చికిత్స;
 • there, adv. అక్కడ;
 • thereabouts, adv. ఆ చుట్టుపట్ల; ఆ సమీపంలో;
 • thereafter, adv. ఆతర్వాత; తదాది; తదుపరి; అనంతరం;
 • thereby, adv. తద్వారా; ఆ దారి వెంబడి; ఆ మూలాన్న;
 • therefore, adv. కనుక; కాబట్టి; కావున; అందువల్ల; అందుచేత; తస్మాత్;
 • therein, adv. అందులో;
 • thereupon, adv. అందుమీదట;
 • thermal, adj. తాప; తాపీయ; ఊషణ; ఉష్ణ;
  • - currents, ph. తాపీయ ప్రవాహాలు;
 • thermals, n. తాపీయాలు; భూతాపీయాలు; తాపవనాలు; భూమి వేడిమికి భూమినుండి పైకెగసే వేడి గాలి ప్రవాహాలు;
 • thermic, pref. తాప;
 • thermo, pref. తాప; ఉష్ణ;
 • thermodynamics, n. ఉష్ణగతిశాస్త్రం; తాపగతిశాస్త్రం; ఉష్ణ చలనం;
 • thermometer, n. తాపమాపకం; ఉష్ణమాపకం; తాపక్రమమాపి; ఉష్ణోగ్రతని కొలిచేది;
 • thermostat, n. తాపస్థాపకి; ఉష్ణోగ్రతని ఒక చోట స్థిరంగా నిలిపే ఉపకరణం;
 • thesaurus, n. సంబంధి పదకోశం; పదార్థ భాండాగారం;
 • these, pron. proximate. ఈ: ఇవి;
  • of -, ph. వీటి;
  • whose are -?, ph. ఇవి ఎవరివి?
  • - things, ph. ఇవి;
  • - people, ph. వీళ్లు;
 • they, pron. వాళ్లు; వారు;
 • thick, adj. దట్టమైన; మందమైన; చిక్కనైన; చిక్కని; అవిరల;
 • thicket, n. గుబురు; తుప్ప; చిట్టడవి; చిన్న అడవి;
 • thickness, n. దళసరి; మందం;
 • thief, n. దొంగ; తస్కరుడు; పాటచ్ఛరుడు; తాయువు; అధశ్చరుడు; మ్రుచ్చు; హర్త; అపహర్త; కేడీ;
 • thigh, n. తొడ; పెందొడ; కురువు; ఊరువు; జంఘిక; ఊర్వి; అంకం;
  • lower -, ph. కీతొడ;
  • - bone, ph. తొడ ఎముక; జంఘికాస్తి; ఊర్వికాస్తి; ఉరోస్తి;
 • thin, adj. పలుచని; సన్నని; బక్కపలుచని; పేలవ; పీల;
 • thing, n. (1) వస్తువు; పదార్థం; (2) సంగతి;
 • think, v. i. ఆలోచించు; ఆలోచనచేయు; స్మరించు; తలపెట్టు; తలపోయు; యోచించు; భావించు;
 • think tank, ph. స్మరణ తటాకం;
 • thinker, n. m. భావుకుడు;
 • thinking, adj. ఆలోచించే; ఆలోచన చేయగల;
 • third, adj. మూడవ; తృతీయ; తార్తీయ;
 • third, n. మూడవది; తృతీయం; తార్తీయం;
 • thirst, n. దాహం; దప్పిక; దాహతి; పిపాస; తృష్ణ; ఉదన్యత;
  • excessive -, ph. విదాహం;
 • thirst for knowledge, ph. ఆదిత్స;
 • thirteen, n. పదమూడు;
 • thirteenth, adj. త్రయోదశ; పదమూడవ;
 • thirtieth, adj. ముప్ఫయ్యవ; ముప్పదియవ; త్రింశ;
 • thirty, n. ముప్పయి; ముప్పదియవ; త్రింశత్;
 • this, adj. ఇది; ఈ;
 • this way, ph. ఇటు;
 • thoracic cavity, n. హృదయ కుహరం; ఉరః పంజరం;
 • thorax, n. హృదయ కుహరం; ఉరహ్ పంజరం;
 • Thorium, n. దురం; ఒక రసాయన మూలకం; (అణసంఖ్య 90, సంక్షిప్త నామం, Th);
 • thorn, n. ముల్లు; కంటకం;
 • thorns, n. pl. ముళ్లు; ముండ్లు;
 • thorny bush, n. ముళ్లకంప;
 • thorny fence, ph. ముళ్ల కంచె;
 • thoroughbred, n. మేలుజాతి గుర్రం; రెండు వైపులా మంచి ప్రవర ఉన్న గుర్రం;
 • thoroughfare, n. రహదారి;
 • thoroughly, adv. క్షుణ్ణంగా; పూర్తిగా; సంపూర్ణంగా; కూలంకషంగా; సమగ్రంగా;
 • those, adj. ఆ; అవి; వారు;
 • those papers, ph. ఆ కాగితాలు;
 • those people, ph. వాళ్లు;
  • of -, ph. వాటి;
 • though, conj. (దో) అయినప్పటికి;
 • thought, n. చింత; ఆలోచన; తలపు; తలపోత; భావం; మనోభావం; చిత్తం; చిత్; స్పురణ;
  • purity of -, ph. చిత్తశుద్ధి;
  • - experiment, ph. మనో ప్రయోగం; స్పురణ ప్రయోగం;
 • thoughtfully, adv. సాలోచనగా;
 • thousand, n. వెయ్యి; వేయి; సహస్రం; దశశతి;
 • thousandth, adj. వెయ్యవ; వేయవ;
 • thrash, v. i. కొట్టుకొను; గిలగిలలాడు;
 • thrash, v. t. ఉప్పళించు; ఝాడించు;
 • thread, n. (1) దారం; సూత్రం; నూలిపోగు; తంతువు; (2) కడ్డీ మీద సర్పిలాకారంలో కోయబడ్డ వెన్నుపట్టె;
 • threat, v. t. బెదరింపు; భిభీషిక;
 • threat, n. బెదిరింపు; బిభీషిక;
 • three, n. (1) మూడు; తిగ; త్రి; (2) ముగ్గురు; మువ్వురు;
 • three people, ph. ముగ్గురు; మువ్వురు;
 • three-dimensional, adj. త్రిదిశాత్మక; త్రిమితీయ; త్రిపరిమాణిక;
 • three-fold, adj. ముమ్మడి; త్రివళి;
 • three-fourths; n. ముప్పాతిక;
 • three-times, adj. ముమ్మారు; మూడుసార్లు;
 • three-way, adj. ముమ్మడి;
 • thresh, v. t. నూర్చు;
 • threshing, n. నూర్పు; నురుపిడి;
 • threshing floor, ph. నూర్పుడు కళ్ళెం;
 • threshold, n. (1) గడప; గుమ్మం; దేహళి; (2) హద్దు;
  • space -, ph. గడప;
  • time -, ph. గడుపు;
 • thrice, n. మూడు సార్లు; ముమ్మారు; ముమ్మడి;
 • thrift, n. పొదుపు; మితవ్యయం; పోడిమి; ఊజ్జితం;
 • thrill, n. ఉద్విగ్నత;
 • thrilling, adj. హృదయంగమ;
 • thrive, v. i. వర్ధిల్లు; బాగుపడు; వృద్ధి చెందు; నమనమలాడు;
 • throat, n. గొంతుక; గళం; కంఠం; పీక;
 • throbbing, n. పరిస్పందం;
 • thrombosis, n. రక్త నాళంలో రక్తపు కుదువ ఏర్పడుట;
 • thrombus, n. గడ్డ; బెడ్డ;
 • throne, n. సింహాసనం; గద్దె; అధికార పీఠం;
 • throng, n. సమూహం;
 • through, prep. (త్రూ) గుండా;
 • throw, v. t. విసరు; రువ్వు; గిరాటు వేయు;
 • thrush, n. కస్తూరి పిట్ట; కస్తూరి పక్షి;
 • thrust, v. t. తోయు; పొడుచు; గుచ్చు;
 • thumb, n. (తమ్) బొటనవేలు; అంగుష్ఠం; చేతి బొటన వేలు;
  • rule of -, ph. బండ నియమం;
 • thumbnail sketch, ph. చిన్నది; క్లుప్తంగా చెప్పబడ్డది; నఖచిత్రం; కరరుహ చిత్రం; ఒక ఊహకి టూకీగా ఇచ్చిన రూపురేఖలు;
 • thumbtack, n. బొత్తాంనాటు; సుత్తి అవసరం లేకుండా బొటనవేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
 • thunder, n. ఉరుము; మేఘనాదం;
 • thunderbolt, n. పిడుగు; ఆశనిపాతం; భిత్తిక;
 • Thursday, n. గురువారం; లక్ష్మివారం; బృహస్పతి వారం;
 • thus, adv. కావున; అని; ఇట్లు; ఈ తీరున; ఈవిధంగా;
 • thyme, n. వాముపువ్వు; ఉగ్రగంథం; వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Thymus vulgaris;
 • thyroid, n. కాకళగ్రంథి; అవటుగ్రంథి; గొంతుకలో ఉండే ఒక వినాళ గ్రంథి;
 • tiara, n. లలాటపట్టం; చిన్న కిరీటం; కిరీటిక;
 • tibia, n. జంఘాస్తి; అంతర్ జంఘాస్తి; తొడలో ఉండే ఒక ఎముక;
 • ticket, n. టికెట్టు; కట్టిన డబ్బుకి రసీదు; చీటీ;
 • Tibetan, adj. కీచక;
 • tickle, n. కితకిత; చక్కలిగింత;
 • tic-tac-toe, n. దాడాట;
 • tidal wave, n. ఉప్పెన; సముద్రంలో ఆటు పోట్లు, తుపాను కలిసినప్పుడు సముదమట్టంలో ఉన్న తీర ప్రాంతాలు ములిగిపోవడం; (rel.) tsunami;
 • tide, n. పోటు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల;
  • ebb -, ph. ఆటు; నీటిమట్టం పెరుగుదల;
  • flood -, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
  • high -, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
  • low -, ph. ఆటు; నీటిమట్టం తరుగుదల;
  • neap -, ph. అష్టమినాడు వచ్చే ఆటుపోట్లు;
  • spring -, ph. నిండు పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉధృతంగా వచ్చే ఆటుపోట్లు;
 • tides, n. ఆటుపోట్లు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల, తరుగుదలలు; ఇవి భూమి మీద ప్రతి 24 గంటల 58 నిముషాలలో రెండుమార్లు వస్తాయి;
 • tie, v. t. కట్టు; ముడిపెట్టు;
 • tie up, v. t. అన్వయించు; ముడిపెట్టు; రెండింటికి మధ్య సంబంధాన్ని చూపు;
 • tier, (టియర్) n. (1) మెట్టు; ఆంచె; అంతస్థు; పావంచా; సోపానం; (2) వరుసల శ్రేణి;
 • tiffin, n. ఉపాహారం; ఫలహారం;
 • tiger, n. పెద్దపులి; బెబ్బులి; కోలుపులి; పులి; శార్దూలం; పుండరీకం;
 • tight, adj. బిగువు; బిగువైన; బిగుతు;
 • tight-fisted, ph. పితలాటకం; పిసినారితనం;
 • tighten, v. t. బిగించు; ఉగ్గగట్టు; ముద్రించు;
 • tightness, n. బిగి; బిగుతు;
 • tigon, n. సిమ్లి; సింహానికి, పులికి పుట్టిన కంచర జంతువు;
 • tigress, n. f. ఆడుపులి;
 • tile, n. పెంకు; ఓడుబిళ్ల; పలక;
  • flat -, ph. బిళ్ళ పెంకు;
  • Mangalore -, ph. బంగాళా పెంకు; (మంగుళూరు పెంకు అనడానికి బదులు బంగాళా పెంకు అన్నారు)
  • native -, ph. నాటు పెంకు;
 • till, prep. వరకు; దాక;
 • till, v. t. దున్ను;
 • till, n. సొమ్ము సొరుగు; గల్లాపెట్టి సొరుగు; గల్లాపెట్టి;
 • tillable, n. నావ్యం; దున్నడానికి వీలైనది;
 • tilt, v. t. ఒంచు; ఒరిగించు;
 • tilt, v. i. ఒంగు; ఒరుగు; మొగ్గు;
 • timber, n. కచ్చా కలప; పడగొట్టిన చెట్లు, వగైరా మానులు; see also lumber; logs;
  • - industry, ph. దారు పరిశ్రమ;
 • timbre, n. (టేంబర్) ధ్వనిగుణం; నాదగుణం; సంగీత వాద్యవిశేషం పుట్టించే తరంగాలు చెవికి తగినలినప్పుడు మన అనుభూతిలో కలిగే వైవిధ్యత; తరచుదనం, బిగ్గతనం ఒకేలా ఉన్నా చెవికి వినబడినప్పుడు ధ్వనిలో తేడా;
 • time, n. (1) కాలం; వేళ; సమయం; గంట; పొద్దు; సేపు; (2) తీరిక; వ్యవధి; సేపు; అదను; (3) మారు; తపవ; తూరి; సారి; చుట్టు; దఫా; పర్యాయం;
  • at an earlier -, ph. మునుపు; పూర్వం; గతంలో;
  • another -, ph. మరో మారు; మరొకసారి;
  • at this -, ph. ఈవేళప్పుడు; ఇప్పుడు; ఈ సమయంలో;
  • contemporary -, ph. వర్తమానకాలం;
  • first -, ph. మొదటిసారి; మొదటి దఫా;
  • from what -? ph. ఎప్పటినుండి?; (lit.) from when;
  • how much -? ph. ఎంతసేపు?;
  • in the mean -, ph. అందాకా;
  • one -, ph. ఒక మారు; ఒక పరి; ఒక సారి; ఒక తేప; ఒక తూరి; ఒక తడవ; ఒక విడుత;
  • one more -, ph. ఇంకో మారు; ఇంకోసారి; మరొకసారి;
  • this -, ph. ఈ మారు; ఈ సారి; ఈ తడవ; ఈ దఫా;
 • time barred, adj. కాలదోషం పట్టిన;
 • timely, adj. కాలోచిత; సమయోచిత; సందర్భానికి అనుకూలమైన;
 • times, adj. సార్లు; మార్లు; చుట్లు; తడవలు; తూర్లు; ఆవర్తులు;
  • at all -, ph. ఎల్లవేళల; కలకాలం; నిరంతరం;
  • hundred -, ph. నూరు సార్లు; శతథా; చాలాసార్లు;
  • many -, ph. చాలాసార్లు; చాలా తడవలు; చాలా చుట్లు; పలుమారులు; చాలా పర్యాయములు;
  • some -, ph. అప్పుడప్పుడు;
  • two -, ph. రెండు ఆవర్తులు; రెండుసార్లు; రెండు తూర్లు;
  • time -, ph. కాల ముద్ర; వేళ ముద్ర; ఒక పని ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు పూర్తయిందో సూచించడానికి వేసే ముద్ర;
  • time -, ph. కాలదర్శిని; సమయ సారణి;
  • time -, ph. కాల ప్రస్థానం; కాల యానం;
  • time -, ph. కాల మండలం;
 • timidity, n. పిరికితనం; భీరుత;
 • tin, adj. కళాయి; తగరపు;
 • tin foil, ph. తగరపు తగడు;
 • tin sheet, ph. చీనారేకు; (ety.) Chinese metal sheet;
 • Tin, n. తగరం; వంగం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 50, సంక్షిప్త నామం, Sn); [Lat.] stannum;
 • tin, n. (1) కళాయి; (2) డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
 • tin-can, n. డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
 • tincture, n. ద్రావణం; ఒలంతం (ఆల్కహాలు)తో కలిపిన మందు; అరఖు;
  • mother -, ph. మాతృ ద్రావణం;
 • tinge, n. లేశమంత రంగు;
 • tin-plate, n. కళాయి పూసిన ఇనుప రేకు;
 • tin plating, v. t. కళాయి పెట్టుట; వంగలేపనం;
 • tinsel, n. కాకి బంగారం; ముచ్చె బంగారం;
 • tint, n. డౌలు; రాగము; కవురు;
  • yellow -, ph. పసుపు డౌలు;
 • tintinnabulation, n. గంటారావం; టింగు మనే చప్పుడు; గంట చేసే ధ్వని;
 • tiny, adj. బుల్లి; ఆణక; బుచ్చి; చిరుతుక;
 • tion, n. (టియాన్) పుహం; మగపులికి ఆడసింహానికి పుట్టిన కంచరజంతువు, ఈ జాతులు(పుహాలు) పునరుత్పత్తి చేయలేవు, ఇవి సంతానహీన జాతులు;
 • tip, n. (1) మొన; కొన; కొడి; ముల్లు; అగ్రం; (2) బక్షిస్; ఈనాం;
 • tirade, n. దూషణ పరంపర; దుష్ర్పచారం;
 • tire, tyre (Br.) n. టైరు;
 • tire, v. i. అలసిపోవు; డస్సిపోవు; డీలాపడు;
 • tiredness, n. అలసట; అలసిపోవుట; డీలాపడుట;
 • tireless, adj. అలుపుఎరుగని; నిర్విరామమైన;
 • tissue, n. కణజాలం; కణతండము; కణసంహతి; కణరాశి; కులాయం; ధాతువు; పేసీజాలం; అంగాంశం;
  • fibrous -, ph. పీచు ధాతువు;
 • tissue paper, n. పల్చటి మృదువైన కాగితం;
 • tits, n. pl. ౘన్నులు; సళ్లు; ఉరోజాలు; స్తనాలు; వక్షోజాలు;
 • Titanium, n. టైటేనియం; తితినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 22, సంక్షిప్త నామం, Ti); [Lat.] titans are the first sons of the Earth;
 • title, n. (1) బిరుదు; పట్టం; (2) పేరు; (3) హక్కు; పట్టా; (4) శీర్షిక;
 • titles, n. (1) బిరుదులు; (2) పేర్లు; (3) సినిమాలలో చూపించే నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు;
 • titrant, n. అంశమాపణి;
 • titration, n. అంశుమాపనం;
 • titter, v. i. ఇకిలించు; భయంతో కూడిన భావంతో నవ్వు;
 • titular, adj. నామకః; నామకార్థం; నామమాత్రపు; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే;
 • to, prep. కి, కు; తో; వద్దకు;
 • toad, n. గోదురుకప్ప; కప్ప రూపంలో ఉండే ఒక భూచరం;
 • toadstool, n. కుక్కగొడుగు; విషపూరితమైన పుట్టగొడుగు; see also mushroom;
 • tobacco, n. (1) పొగమొక్క; (2) పొగాకు;
  • - leaf, ph. పొగాకు; ధూమ్రపత్రి;
  • - plant, ph. పొగమొక్క;
 • today, n. నేడు; ఈరోజు; ఈనాడు; ఈవేళ;
 • toe, n. కాలివేలు;
  • big -, ph. కాలి బొటనవేలు; అంగుష్ఠం;
  • - nail, n. కాలివేలి గోరు; కాలిగోరు;
  • - rings, n. pl. మట్టెలు; చిట్టిబొద్దులు; స్త్రీలు ధరించే ఆభరణాలు;
 • together, prep. కలసి; తో; తోడ;
 • toil, n. ప్రయాస; శ్రమ;
 • toil, v. i. ప్రయాసపడు; శ్రమపడు; శ్రమించు; పాటుపటు; కష్టపడు;
 • toilet, n. (1) సైరంధ్రి; అలంకరణకి ఉపయోగించే గది; (2) మరుగు గది; మరుగు గదిలో మలమూత్రాదుల విసర్జనకు వాడే గది లేక ఉపకరణం;

USAGE NOTE; toilet, restroom, bathroom

 • Use bathroom for a room in a house where there is a toilet. Use restroom, men’s room, and ladies’ room to talk about a room in a public place where there are one or more toilets. On a plane or train this room is called lavatory.
 • toiletries, n. pl. ధావన సామగ్రి; పళ్లు, ఒళ్లు తోముకోడానికి కావలసిన పళ్లపొడి, సబ్బు, వగైరా;
 • tofu, n. టోఫూ; సోయాపాల జున్ను; సోయా చిక్కుడు పాల నుండి తీసిన పెరుగు వంటి పదార్ధాలతో చేసిన జున్ను వంటి పదార్థం;
 • token, n. అడియాలం; గురుతు; చిహ్నం; ఆనవాలు; సైగ; కందువ;
 • tolerable, adj. సహ్య;
 • tolerance, n. సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత; క్షమ;
 • tolerance test, ph. తాళుక పరీక్ష; సహన శక్తి పరీక్ష;
  • glucose - test, ph. గ్లూకోజు తాళుక పరీక్ష;
 • tolerate, v. t. తాళుకొను; తట్టుకొను; సహించు; భరించు; ఓర్చుకొను; నిభాయించు;
 • toleration, n. సహనం; ఓర్పు;
 • toll, n. (1) సుంకం; పన్ను; (2) దెబ్బ; నష్టం;
  • took a -, ph. దెబ్బ తిన్నాది;
 • toll booth, n. చవుకీ; సుంకరి మెట్టు; ఆసీల మెట్ట; ఆసీల చౌకు; రహదారిలో పన్నులు వసూలు చేసే స్థలం;
 • tomahawk, n. పరశువు;
 • tomato, n. టమాటా; టొమేటో; రామ్ములగ; తక్కాలికాయ; సీమవంకాయ; కర్పూరవంగ; తర్కారి; a fruit of the nightshade family that is native to S. America. The U.S. Supreme Court decided that this belongs to the vegetable family rather than the fruit family;
 • tomatillo, n. టొమేటిల్లో; జాంబెరీ పండు; [bot.] Physalis ixocarpa; ఇక్సోకార్పా అంటే జిగురుగా ఉన్న పండు అని అర్థం;
 • tomb, n. (టూమ్) గోరీ; సమాధి;
 • tomcat, n. m. గండుపిల్లి;
 • tome, n. పెద్ద పుస్తకం; ఉద్గ్రంథం; దస్తరం;
 • tomorrow, n. రేపు;
  • day after-, ఎల్లుండి;
 • ton, n. టన్ను; బరువుని తూచే కొలత;
  • long -, ph. పెద్దటన్ను; 2,240 పౌనులు; ఇంగ్లండులోను, తదితర కామన్వెల్తు దేశాలలోను వాడుకలోనున్న కొలమానం;
  • metric -, ph. మెట్రిక్‌టన్ను; 1,000 కిలోలు; 2204.62 పౌనులు; అంతర్జాతీయ మెట్రిక్ పద్ధతిలో వాడే కొలమానం;
  • short -, ph. చిన్నటన్ను; 2,000 పౌనులు; అమెరికాలోను, కెనడాలోను వాడుకలోవున్న కొలమానం;
 • tone, n. (1) స్వరం; ఒక శబ్ద తరంగం ప్రకంపించే పౌనఃపున్యం; (2) శరీరావయవాలకి, కండరాలకి ఉండే బిగి;
 • tongs, n. స్రావణం; చిమటా; నిరుకారు; (rel.) పటుకారు;
 • tongue, n. (1) నాలిక; నాలుక; జిహ్వ; అర్రు; (2) భాష;
 • foreign -, ph. పరదేశపు భాష;
 • mother -, ph. మాతృభాష;
 • slip of the -, ph. నోరు జారడం;
 • tongue cleaner, n. పాచిబద్ద;
 • tonight, n. ఈ రాత్రి; ఈ రోజు రాత్రి;
 • ---USAGE NOTE; tonight, last night
 • ---Use last night for the night of yesterday. Do not say, “yesterday night.”
 • tonsillitis, n. గవదల వాపు; ఘశాంత దాహం;
 • tonsils, n. గవదలు; నోటిలో కొండనాలుకకి ఇరుపక్కలా ఉండే కణజాలం;
 • tonsure, n. గుండు చెయ్యడం; గుండు కొట్టించడం; శిరోముండనం; వపనం;
 • too, adv. కూడా; సైతం; సహితం;
 • tool, n. పనిముట్టు; సాధనం; కరణం; ఉపకరణం; పరికరం;
 • toolbar, n. కరణపు పట్టీ;
 • toolbox, n. పొది;
  • barber's -, మంగలి పొది;
 • toot, n. (1) బూరా; (2) కూత; గుడ్లగూబ అరుపు; ఘాత్కారం;
 • tooth, n. పల్లు; పన్ను; దంతం;
 • tooth ache, ph. పంటినొప్పి;
 • toothbrush, n. దంతమార్జని; దంతకాష్టం; పళ్ళు తోముకునే కుంచె;
 • toothed, adj. దంతదారు;
 • tooth paste, ph. దంతధావన ఖమీరం;
 • toothpick, n. దంతకాష్టం; పళ్లు కుట్టుకునే పుల్ల;
 • tooth powder, n. పళ్లపొడి; దంత ధావన చూర్ణం;
 • top, adj. మీద; పైన; పై;
 • top, n. బొంగరం; బ్రమరకం; విఘూర్ణి;
 • topaz, n. గోమేధికం; పుష్యరాగం; పీతస్పటికం;
 • topic, n. చర్చనీయాంశం; సంగతి; విషయం;
 • topography, n. నైసర్గిక స్వరూపం; స్థలాకృతి;
 • topology, n. సంస్థితి శాస్త్రం;
 • topple, v. t. కూలద్రోయు; పడద్రోయు;
 • topsy-turvy, adj. తలకిందైన; విటతటం;
 • torch, n. దివ్వె; దివిటీ; కాగడా; దీపం; ఇలాయి;
 • torch bearer, n. దీపధారి; వైతాళికుడు;
 • torch, v. t. అంటించు; ముట్టించు; నిప్పుపెట్టు;
 • torment, v. t. ఆరడిపెట్టు; హింసించు; యాతనపెట్టు;
 • tormentor, n. ధూర్తుడు; కంటకుడు;
 • tornado, n. సుడిగాలి; చక్రవాతం; నిర్ఘాతం; ఉత్పాత పవనం; పెనుగాలి;
 • torque, n. పురిశక్తి; మెలిశక్తి; పురిశ;
 • torrential, adj. విపరీతమైన; కుండపోతగా;
  • - rains, ph. విపరీతమైన వాన; కుంభవృష్టి; కుండపోత;
 • torsion, n. పురి; మెలి;
 • torsion, n. పురి; విమోటనం;
 • torso, n. మొండెం; కబంధం;
 • tort, n. వికర్మ;
 • tortoise, n. (టార్డస్) తాఁబేలు; కూర్మం; కచ్చపం; కమఠం; నేల తాబేలు;
 • torture, n. చిత్రహింస; చిత్రవధ;
  • death by -, ph. చిత్రవధ;
 • torque, n. పురిబలం; Torque is a measure of how much a force (బలం) acting on an object causes that object to rotate; The unit of torque is a Newton-meter, which is also a way of expressing a Joule (the unit for energy, శక్తి). However, torque is not energy. భౌతిక శాస్త్రంలో శక్తి, బలం వేర్వేరు భావాలు;
 • torus, n. వడాకారం;
 • toss, v. i. అల్లాడు; అల్లల్లాడు; దొర్లు;
 • toss, v. t. ఎగరవేయు; విసరు;
 • tossed, adj. ఎగరవేయబడ్డ; ఉదంచిత;
 • tot, n. m. కుర్రాడు; పిల్లాడు; డింభకుడు;
 • tot, n. f. కురద్రి; పిల్ల;
 • total, v. t. మొత్తం చేయు; కూడు;
 • total, n. మొత్తం;
 • totalitarianism, n. ఏకాధిపత్యం; నిరంకుశత్వం;
 • totally, adv. పూర్తిగా; పరిపూర్ణంగా; ఆసాంతంగా; అచ్చంగా; బొత్తిగా; సుతరామూ; వడసారంగా;
 • tottering, adj. కసిమసి;
 • toucan, n. శరారి; ఆడేలు; దక్షిణామెరికా అడవులలో ఉండే ఒక పెద్దముక్కు గల పక్షి;
 • touch, adj. సంస్పర్శ;
 • touch, v. t. తగులు; తాకు; సోకు; అంటుకొను; ముట్టుకొను; స్పర్శించు; స్పృశించు;
  • sense of -, ph. స్పర్శ జ్ఞానం;
 • touch, n. స్పర్శ; అభిమర్శం; అభిమర్శనం;
 • touch-me-not, n. (1) సోకుడుముడుగు; అత్తిప్రత్తి; ఏటేటా పాతే రంగురంగుల పువ్వుల పూసే ఒక రకం మొక్క; (2) [idiom] నన్ను ముట్టుకోకు నా మాల కాకి;
 • touchstone, n. (1) స్పర్శవేధి; పరసువేది; నీచలోహాలను బంగారంగా మార్చగల దివ్యశక్తి ఉన్న ఒక ఱాయి; (2) ఒరగల్లు; బంగార్పు వన్నె చూడటానికి వాడే గీకుడు ఱాయి;
 • tough, adj. దిట్టమైన; దృఢమైన; బిరుసైన;
 • toughness, n. దిట్టతనం; దృఢత్వం; బిరుసుతనం;
 • toupee, n. (టూపే), మగవారి బట్ట తలని కప్పిపుచ్చే "విగ్గు";
 • tour, n. పర్యటన; దేశాటన;
 • tourists, n. pl. పర్యాటకులు; దేశికులు;
 • toward, towards, adv. వైపు; దెసకు; యెడల; పట్ల;
 • towel, n. తువ్వాలు; తుండు; తుండు రుమాలు;
 • tower, n. శిఖరం; గోపురం; బురుజు; సిగము;
 • town, n. పట్టణం; పట్నం; నగరం; పురం; ద్రంగం; పెద్ద ఊరు; బస్తీ;
  • - planning, ph. నగర నిర్మాణ క్రమం;
 • townhall, n. పురమందిరం;
 • toxin, n. బేతవిషం; శరీర జన్య విషం; కొన్నిరకాల బేక్టీరియాలచేత తయారు కాబడ్డ ప్రాణ్యములు కొన్ని ప్రాణుల యెడల విషపదార్థములుగా పనిచేస్తాయి; (rel.) poison;
 • toxoid, n. వేడిచేత బలహీనపరచబడ్డ బేతవిషం;
 • toy, n. బొమ్మ; ఆటబొమ్మ;
 • toy, v. i. చెలగాటాలాడు;
 • toy brick, n. బొమ్మయిటుక; ఆటయిటుక;
 • trace, adj. లేశ;
  • - element, ph. లేశ మూలకం; లేశ ధాతువు;
 • trace, n. ( 1) పత్తా; అయిపు; ఐపు; ఆచూకీ; జాడ; ఆరా; అడా, పొడా; అజా, పతా; ( 2) లేశం;
  • without a -, పత్తాలేకుండా; అయిపు లేకుండా; అడా, పొడా లేకుండా; అజా, పతా లేకుండా;
 • tracer, n. పత్తాదారి;
 • trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్ళే గొట్టం;
 • trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకేళ్లే గొట్టం;
 • track, n. (1) మార్గము; గాడీ; (2) జాడ;
 • track, v. t. వెతుకు; వెంటాడు;
 • tractable, adj. సుగమం;
 • traction, n. కర్షణం;
 • trade, n. వ్యాపారం; వాణిజ్యం; బేహారం;
 • trade, v. t. వ్యాపారం చేయు; ఇచ్చిపుచ్చుకొను; చేతులు మార్చు;
 • trader, n. వ్యాపారి; వ్యాపారస్తుడు; సార్థవాహుడు;
 • trade winds, n. వ్యాపార పవనాలు; రుతుపవనాలు;
 • tradition, n. ఆచారం; సంప్రదాయం; ఆనవాయితీ; రివాజు;
 • traditional, adj. సంప్రదాయ; సనాతన;
 • traditionalist, n. ఆచారపరాయణుడు;
 • traditionally, adv. ఆచారంగా; అనూచానంగా; సంప్రదాయంగా;
 • traffic, n. సంచారం; రాకపోకలు; యాతాయాతాలు; క్రయవిక్రయాలు;
  • foot -, ph. జన సంచారం;
  • pedestrian -, ph. జన సంచారం;
 • traffic jam, ph. ప్రతిష్టంబించిన సంచారం; వాహన సంచార ప్రతిష్టంభనం;
 • trafficking, n. దొంగ రవాణా; మాదక ద్రవ్యాల దొంగ రవాణా;
 • tragedy, n. (1) విషాద పూరితం; దుఃఖపూరితం; (2) విషాదాంతం; దురంతం;
 • tragic, n. విషాదమయం;
 • tragopan, n. గొఱ్ఱెకోడి;
 • trail, n. జాడ; జాలు;
 • train, n. (1) రైలుబండి; (2) జూటం; వెనక వేలాడేది; (3) పరంపర; పుంఖానుపుఖం; గొలుసుకట్టుగా అమర్చబడినవి; (4) పక్షి తోక; పురి;
  • - of a peacock, ph. నెమలి పురి;
  • - of thought, ph. ఊహా పరంపర; ఆలోచనా చయనిక;
 • train, v. t. తరిఫీదు చేయు;
 • trainee, n. అభ్యాసి;
 • training, n. తరిఫీదు; శిక్షణ; సాధకం;
 • trail, n. పుంతబాట; డొంక; కోన; పొద;
 • trait, n. లక్షణం; చిహ్నం;
 • traitor, n. దేశద్రోహి; ద్రోహి; కావైరి; కాపురుషుడు;
 • tragedy, n. విషాద సంఘటన; దుస్సంఘటన; విషాద రచన; విషాద వార్త;
 • trajectory, n. గతిపథం; చారగతి;
  • radial -, ph. త్రైజ్య సంచారగతి;
 • trance, n. వివశత; వివశత్వం; సమాధిస్థితి లాంటిది; పూనకం;
 • trans, adj. pref. [chem.] ఎదురెదురుగా; అడ్డుగా; అను; అనుప్రస్థ; see also cis;
 • trans fat, ph. అనుప్రస్థ కొవ్వు; ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఇటూ అటూ గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు తిన్నగా ఉంటుంది; ఈ రకం జంట బంధాలు ఉన్న కొవ్వులు తినటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు;
 • transaction, n. బేరం; లావాదేవీ; ఇచ్చిపుచ్చుకొనడం; ఇచ్చిపుచ్చుకోలు; బేరసారాలు; వ్యవహారం; వాణిజ్యం;
  • business -, ph. వాణిజ్య వ్యవహారం; లావాదేవీ;
  • conversational -, ph. వాగ్వ్యవహారం;
 • transcendence, n. తారకం; అనుభవాతీతం;
 • transcendental, adj. (1) బీజాతీత; (2) అత్యుత్తమ; ఉత్తమోత్తమ; లోకోత్తర; (3) తారక; అనుభవాతీత;
  • - meditation, ph. లోకోత్తర జప విధానం;
  • - number, ph. బీజాతీత సంఖ్య; లోకోత్తర సంఖ్య;
 • transcript, n. నకలు; ఒక కాగితానికి కాని, దస్తానికి కాని, సంభాషణకి కాని రాత రూపంలో యథాతథంగా తీసిన నకలు;
 • transcription, n. (1) పరివర్తిత లేఖనం; ఒక భాషను ధ్వని ప్రథానమైన ఏదో ఒక ప్రత్యేక లిపిలో రాయడం; (2) యథాతథంగా తీసిన నకలు ప్రతి;
 • transducer, n. యానకి; దాటించేది; బదిలీ చేసేది; [Lat. traducere = transfer];
 • transfer, v. t. మార్చు; బదిలీ చేయు;
 • transfer, n. బదిలీ;
 • transformation, n. పరిణామం; పరివర్తనం; మార్పు; రూపాంతరీకరణ;
  • gradual -, ph. క్రమ పరిణామం;
  • sudden -, ph. హఠాత్ పరిణామం;
 • transformational, adj. పరివర్తక;
 • transformative, adj. పరివర్తక;
 • transformer, n. [engr.] పరివర్తకం;
 • transfusion, n, ఉపసరణం;
 • transfusion, n. కొత్త రక్తాన్ని శరీరంలోనికి ఎక్కించడం;
 • transgress, v. t. జవదాటు;
 • transgression, n. తప్పు; పాపం; అపరాధం; వ్యతిక్రమం; అతిక్రమణం; ఉల్లంఘనం; అతిచారం;
 • transient, adj. తాత్కాలిక; క్షణిక; క్షణభంగుర; అనిత్య; భంగుర; దంధన; తైంతిక; క్షర; అధ్రువ;
 • transient, n. తాత్కాలికం; దంధనం; భంగురం; అనిత్యం; క్షణికం; క్షణభంగురం; తైంతికం; నశ్వరం;
 • transit, adj. ప్రయాణ;
 • transit, n. (1) పోక; ప్రయాణం; (2) ప్రయాణ సాధనం; (3) దాటు; దాటడం; అంతర్యానం;
  • rapid -, ph. జోరుపోక; ఊరులోని రద్దీని దాటుకు పోవడానికి రైలుబండి వంటి సదుపాయం;
  • - of a planet across Sun's disk, ph. గ్రహం సూర్యబింబాన్ని దాటడం; గ్రహ అంతర్యానం;
 • transitive, adj. సకర్మక;
 • transitive verb, ph. సకర్మక క్రియ;
 • transistor, n. బదిరోధకి; (ety.) బదిలీ + అవరోధకి;
 • transition, adj. సంక్రమణ; సంధి; స్థిత్యంతర; అవస్థాంతర;
  • - element, ph. అవస్థాంతర మూలకం; అవస్థాంతర ధాతువు;
  • - metal, ph. అవస్థాంతర లోహం; ఉ. zinc, copper, palladium, nickel, cobalt, titanium and chromium
 • translate, v. t. (1) అనువదించు; (2) జరుపు;
 • translate into Telugu, ph. ఆంధ్రీకరించు; తెలిగించు; తెలుగులోకి మార్చు;
 • translation, n. (1) అనువాదం; తర్జుమా; భాషాంతరీకరణం; (2) జరుపుట;
  • free -, ph. స్వేచ్ఛానువాదం;
  • literal -, ph. శాబ్దిక అనువాదం;
  • word for word -, ph. మక్కీకిమక్కీ అనువాదం;
  • - into English, ph. ఆంగ్లీకరణం;
  • - into Telugu, ఆంధ్రీకరణం; తెలుగు సేత; ఆంధ్రానువాదం;
 • translator, n. అనువాదకుడు; అనువాదకి; అనువాదకం; దుబాషీ; దుబాసీ; తొపాసి; ఒక భాషని మరొక భాషలోనికి మార్చే వ్యక్తి లేక పరికరము లేక అనువర్తనం; see also interpreter;
 • transliteration, n. లిప్యంతరీకరణం; ప్రతిలేఖనం; ఒక భాషని మరొక భాషయొక్క లిపిలో రాయడం;
 • translocation, n. స్థానాంతరీకరణం;
 • translucent, adj. మసకైన; మసక; మునిమసక; పాల; పారభాసక; పాక్షికపారదర్శక; వెలుగు వెళుతుంది కాని అవతలి వాళ్లు కనబడరు;
  • - glass, ph. మసక గాజు; పాలగాజు;
 • trans, pref. గుండా; అడ్డుగా;
 • transmission, n. ప్రేషణం; ప్రేషితం; ప్రసారం; ఒక మాధ్యమం గుండా పంపించడం, ప్రసారం చెయ్యడం, లేదా సరఫరా చెయ్యడం;
  • live -, ph. ప్రత్యక్ష ప్రసారం;
 • transmission line, ph. ప్రేషణ తంతువు; పంపించడానికి మాధ్యమంగా వాడిన తీగలు;
 • transmit, v. t. పంపించు; ప్రేషించు; ప్రసరించు;
 • transmitter, n. పంపేది; ప్రేషకి; ప్రసారిణి; ప్రేషకుడు;
  • radio -, ph. రేడియో ప్రసారిణి; రేడియో పంపు;
 • transparent, n. పారదర్శకం; అడ్డుగా వెలుగుని పోనిచ్చేది; తన గుండా వెలుగుని ప్రసరించనిచ్చేది;
 • transparency, n. (1) పారదర్శకత; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం; (2) పారదర్శక పత్రం; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం కల కాగితం లాంటి పత్రం;
 • transpiration, n. చెమర్చడం; ఆకులు చెమర్చడం; పత్రశ్వేదనం; ఉత్‌స్వేదనం; తన గుండా చెమ్మని పోనిచ్చే పద్ధతి; చెట్లయొక్క ఆకుల గుండా చెమ్మ బయటకి వెలిగక్కబడే ప్రక్రియ;
 • transplantation, n. (1) ఊడుపు; తిరగనాటడం; వరి నారుని తిరిగి నాటడం; (2) ఒకరి శరీర అవయవాలని మరొకరి శరీరంలో పొదగడం;
 • transport, n. రవాణా;
  • road -, ph. రోడ్డు రవాణా; రస్తే సారిగె
 • transportation, n. యానం; రవాణా పద్ధతి; ప్రజలని కాని, సరుకులని కాని, ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా చేసే పద్ధతి;
  • - devices, ph. pl. యాన సాధనాలు; రవాణా సాధనాలు;
 • transpose, n. తారుమారు; పరావర్త్యం; ఇటునుండి అటు మార్పిడి;
 • transversal line, n. తిర్యక్ రేఖ; ఖండించు రేఖ;
 • transverse, adj. తిర్యక్; అడ్డు; పేక; (పడుగు పేకలో వలె); అనుప్రస్థ;
  • - axis, ph. తిర్యక్ అక్షం;
 • transverse section, ph. అడ్డు కోత; తిర్యక్ ఛేదనం;
 • trap, n. బోను; వల;
 • trap, v. i. బోనులోపడు; ఇరుకుకొను; చిక్కుకొను; వలలోపడు;
 • trap, v. t. బోనులో పట్టుకొను; వలలో పట్టుకొను;
 • trapper, n. m. వాగుఱికాఁడు; f. వాగుఱిగత్తె;
 • trapezium, n. విషమ చతుర్భుజం; ఏ రెండు భుజములూ కూడ సమాంతరంగా లేని చతుర్భుజం;
 • trapezoid, n. అర్థసమాంతర చతుర్భుజం; ఏవో రెండు భుజములు సమాంతరంగా ఉన్న చతుర్భుజం;
 • trash, n. చెత్త; పిప్పి;
 • trash bin, n. చెత్త బుట్ట; చెత్త కుండీ;
 • trauma, n. క్షోభ; స్థాపం;
  • mental -, ph. మన స్థాపం;
  • physical -, ph. భౌతిక స్థాపం;
 • travails, n. pl. (1) సమస్యలు; ఇబ్బందులు; (2) నొప్పులు; ప్రసవ వేదన;
 • travel, n. ప్రయాణం; పయనం;
 • traveler, n. m. ప్రయాణీకుడు; బాటసారి; తెరువరి; పాంథుడు;
 • traveling, adj. సంచార; ఆధ్వనీన; ప్రయాణీకులకి సంబంధించిన;
  • - doctor, ph. సంచార వైద్యుడు;
  • - library, ph. సంచార గ్రంథాలయం;
 • traverse, n. చంక్రమణం;
  • - along a branch, ph. శాఖాచంక్రమణం;
 • trawler, n. చేపలు పట్టడానికి ప్రత్యేకంగా అమర్చబడ్డ పడవ;
 • tray, n. తబుకు;
 • treachery, n. ద్రోహం;
 • tread, v. t. తొక్కు; మట్టు; కాలితో తొక్కు;
 • tread, n. తొక్కు; మట్టు; రబ్బరు చక్రాలు భూమిని కరిచిపెట్టుకు ఉండడానికి వీలుగా వేసిన మట్టు;
 • treason, n. దేశద్రోహం;
 • treasure trove, n. నిక్షిప్తనిధి;
 • treasurer, n. కోశాధికారి; పోతేదార్;
 • treasury, n. బొక్కసం; కోశం; ఖజానా; భండారం; భాండాగారం; ధనాగారం; ఉగ్రాణం;
 • treat, v. t. (1) చికిత్స చేయు; (2) చూడు; ఉపచారం చేయు;
 • treatise, n. సంహితం;
 • treatment, n. (1) చికిత్స; (2) చూపు; ఉపచారం; పరిపోషణ; అభిచర్య;
  • heat -, ph. ఉష్ణోపచారం; తాపోపచారం;
 • treaty, n. ఒడంబడిక; ఒప్పందం;
 • tree, n. చెట్టు; వృక్షం; ద్రుమం; తరువు; దరువు; అగం; నీవం; మహీరుహం; భూరుహం; సాలం; విటపం; మ్రాను; మ్రాకు;
  • deciduous -, ph. పతయాళువు; ఆకులు రాల్చే స్వభావం గల చెట్టు;
  • evergreen -, ph. సతతహరితం; ఎల్లప్పుడు ఆకులు పచ్చగా ఉండే చెట్టు;
  • hollow of a -, ph. తొర్ర; కోటరం;
  • invasive -, బెడద చెట్టు; బెడద వృక్షం;
 • trefoil, n. త్రైపత్రిణి; మువ్వాకి; మూడు ఆకులు తమతమ కాడల వద్ద కలిసి ఒక వలయాకారంలోనున్న గుర్తు;
 • trellis, n. పాకిడ; పందిరి; పాదు పాకడానికి వీలుగా అమర్చిన చట్రం;
 • tremor, n. వణుకు; కంపం; వేపథువు;
 • trench, n. కందకం; అగడ్త; పరిఘ; గాడీ;
  • long narrow -, గాడీ;
 • trend, n. పంథా; పథం; బాణి; ధోరణి; వరస; పోకడ; రీతి;
 • trend setter, ph. పథనిర్దేశకుడు; వైతాళికుడు;
 • trepidation, n. భయం; జంకు;
 • tresses, n. జడలు; జటలు; జటాజూటం;
 • triad, n. త్రేతం; త్రికం;
 • trial, n. (1) న్యాయవిచారణ; విచారణ; (2) యత్నం; ప్రయత్నం;
  • - and error method, ph. నేతి నేతి పద్ధతి; నేతి నేతి మార్గం; ప్రయత్న వైఫల్య పద్ధతి; అవక్షేప పద్ధతి;
 • trials, n. pl. తిప్పలు; పాట్లు; కష్టాలు;
  • - and tribulations, ph. తిప్పలు; పాట్లు; కష్టాలు;
 • triangle, n. త్రిభుజం; ముయ్యంచు; త్రికోణి; ముక్కోణి;
  • equilateral -, ph. సమబాహు త్రిభుజం; సమకోణ త్రిభుజం; సమ త్రిభుజం; త్రస్రం;
  • isosceles -, ph. సమద్విబాహు త్రిభుజం;
  • right-angled -, ph. లంబకోణ త్రిభుజం;
  • scalene -, ph. విషమబాహు త్రిభుజం; అసమభుజ త్రిభుజం;
 • triangular, adj. త్రిభుజాకారపు; ముక్కోణాకారపు;
  • prism -, ph. ముక్కోణ పట్టకం; త్రికోణ పట్టకం;
 • Triassic, adj. తృతీయ; తదియ; మూఁడవ; --see also tertiary;
  • period -, ph. మూఁడవ జీవయుగము;
 • tribal people, n. గిరిజనులు;
 • tribe, n. తెగ; జాతిలో ఒక భాగం;
 • tribunal, n. త్రిమూర్తి న్యాయస్థానం;
 • tributary, n. ఉపనది;
 • tribute, n. (1) కప్పం; ఉపప్రదానం; పెద్దలకి సంప్రదాయానుసారంగా ఇచ్చే బహుమానం; లంచం; (2) పొగడ్త; ప్రశంస;
  • pay - to, ph. పొగుడు; ప్రశంసించు;
 • tri-chloro methane, n. త్రిహరితపాడేను; క్లోరోఫారం; మత్తుమందు; తీపిగా ఉండి, వాసన లేని ఒక ద్రవపదార్థం; దీనిని మత్తుమందుగా వాడతారు; CHCl3;
 • trick, n. (1) టక్కు; దందన; (2) పట్టు, పేకాటలో;
 • trickery, n. టక్కరితనం;
 • trickle, v. i. కారు; స్రవించు; బొట్టుబొట్టుగా కారు;
 • trickster, n. టక్కరి; నమ్మరానివాడు; మాయావి; జిత్తులమారి; టక్కులమారి; దందనకాడు; దందనకత్తె;
 • tricycle, n. మూడు చక్రాల సైకిలు;
 • tridax, n. కుక్కబంతి;
 • trident, n. త్రిశూలం; శూలం;
 • triennial, adj. త్రైవార్షిక; తిస్సాలా; మూడేళ్లకి ఒకసారి;
 • trifle, n. అల్పం; స్వల్పం; అలతి;
 • trifle, n. కల్యవర్తం; ఒక రకమైన తీపి తినుబండారం;
 • trifling, adj. పేలవంగానున్న; చాలా కొంచెం; ఇసుమంత; ఈషత్తు; తృణప్రాయం;
 • trifoliate, adj. ముయ్యాకుల; మూడాకుల; త్రిపత్ర;
 • trigonometry, n. త్రిగుణ మాత్రకం; త్రికోణమితి; త్రిభుజ శాస్త్రం; త్రికోణ గణితం;
 • trihedral, adj. త్రిముఖ; త్రిఫలక;
 • trill, n. [phonetics] అధిక కంపితం;
 • trillion, n. ట్రిలియను; ఖర్వం; ఒకటి తర్వాత పన్నెండు సున్నలు;
 • trim, v. t. (1) కత్తిరించు; కురచ చేయు; త్రుంచు; తగ్గించు; పత్రించు; (2) అలంకరించు;
 • trimer, n. త్రిభాగి; త్రితయాణువు;
 • trimester, n. (1) ఒక కాల పరిమితిలో మూడవ భాగం; (2) తొమ్మిది నెలలలో మూడవ భాగం; గర్భిణి ఎన్నవ నెలలో ఉన్నదో చెప్పడానికి వాడతారు; (3) కందాయం; జ్యోతిషంలో సంవత్సరంలో మూడవ భాగం; నాలుగు నెలలు;
 • trimester, n. కందాయం; సంవత్సరంలో మూడవ వంతు;
 • triode, n. త్రయోడు; మూడు ముఖ్య భాగాలు ఉన్న శూన్య నాళిక; ట్రాన్సిస్టర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత వీటి వాడకం తగ్గిపోయింది కాని, అంతకు పూర్వం ఇవి ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తప్పనిసరి అయిన భాగాలుగా ఉండేవి;
 • trioka, n. ముగ్గురి ముఠా; ముగ్గురి గుంపు; త్రిష్టయం;
 • trip, n. చిన్న ప్రయాణం; ప్రయాణం; పర్యటనం;
  • return -, ph. తిరుగు ప్రయాణం;
 • trip, v. i. పడు; కాలితో దేన్నయినా తన్నుకుని పడు;
 • tripartite, adj. త్రైపాక్షిక; త్రిపక్ష;
 • triple, adj. త్రయ; త్రిక;
 • triple, n. త్రయం;
 • triplet, n. త్రికం; త్రయం; తిగలు;
 • tripod, n. త్రిపాది; ముక్కాలిపీట; టీపాయి; తీపాయి;
 • trisector, n. త్రిఖండిక;
 • triumphant, adj. జైత్ర;
  • - march, ph. జైత్ర యాత్ర;
 • trivial, adj. (1) వ్యర్థమైన; అల్ప; సాధారణ; (2) ఆషామాషీ;
 • tropical, adj. ఉష్ణ; ఆయనరేఖా;
 • trials zones, ph. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం;
 • troll, n. (1) పిల్లల కథలలో వచ్చే పొట్టిగా, కురూపిగా ఉండే ఒక పాత్ర; (2) అంతర్జాలంలో జరిగే "సంభాషణలలో" మధ్యలో తలదూర్చి, అసందర్భపు వ్యాఖ్యలు చేసి దీశని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తి; పానకంలో పుడక; పుల్లారిబుడ్డి;
 • trolling, n. అంతర్జాలంలో పిలవని పేరంటంగా మధ్యలో వచ్చి వ్యాఖ్యానాలు చెయ్యడం;
 • tropics, n. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం; (lit.) turning points;
 • Tropic of Cancer, n. కర్కాటక రేఖ;
 • Tropic of Capricorn, n. మకర రేఖ;
 • troop, n. మేళం; జట్టు; మూక; దండు; see also troupe;
  • - of monkeys, ph. కోతి మూక;
 • trophic, adj. పోషక; జీవనాధార;
  • - web, ph. పోషక వలయం; పోషక జాలం; జీవనాధార జాలం; ఆధారజాలం; ఏ జంతువుకి ఏది ఆహారమో తెలియజేసే వలయాకారపు బొమ్మ;
 • trophy, n. పతకం;
 • troposphere, n. చైతన్యావరణం; సామీప్యావరణం;
 • trouble, n. ఇబ్బంది; శ్రమ; యాతన; గొడవ; కిరికిరి; ఉపహతి;
 • troubles, n. pl. ఇబ్బందులు; యాతనలు; తిప్పలు; పుర్రాకులు; అగచాట్లు; కడగండ్లు; అరిష్టాలు;
  • teething -, ph. బాలారిష్టాలు;
 • trough, n. గర్తం; ఉద్ది;
 • trough, n. (ట్రఫ్‍) (1) గోలెం; తొట్టె; గాడి; (2) గర్తం; ఉద్ది; (3) ద్రోణి; తరంగం దిగువ భాగం; అల్పపీడన ప్రాంతం;
 • troupe, n. మేళం; మూక; దండు; తండం; see also troop;
 • troupe of Lambadis, ph. లంబాడీ తండా;
 • trowel, n. తాపీ;
 • truant, n. బడి ఎగ్గొట్టిన విద్యార్థి;
 • truce, n. సంధి;
 • true, n. నిజం; వాస్తవం;
 • truffle, n. శిలీంధ్ర రత్నం; [bot.] Tuber melanosporum;
 • truism, n. నిర్వివాదమైన నిజం; సర్వసాధారణమైన సత్యం;
 • trump, n. పేకాటలో తురఫు;
 • trumpet flower, n. అంబువాసిని; బెగోనియా;
 • trumps, v. t. పేకాటలో తురఫు పెట్టి కోయు;
 • trumpet, n. బాకా; బూరా;
 • truncate, v. t. క్షిప్తించు;
 • truncated, adj. క్షిప్తించిన; కోసేసిన;
 • trunk, n. (1) పెట్టె; (2) మొండెం; (3) మాను; మోడు; స్థాణువు; స్కంధము; (4) తొండము; కరము;
 • truss, n. (1) పటకా; ఇంటికప్పుకి ఆధారంగా దూలాలతో కట్టే పటకా; (2) ఆంత్రనిరోధక పటకా; శరీరాంగాలు జారిపోకుండా వైద్యుడు వేసే పటకా;
 • trussor flap, n. గోచీ గుడ్డ;
 • trust, n. (1) నమ్మకం; విశ్వాసం; పూచీ; నమ్మిక; (2) విశ్వాస నిక్షేపం; విక్షేపం; ధర్మనిక్షేపం; (3) బ్యాంకు;
 • trustee, n. ధర్మకర్త; ధర్మవ్యవహర్త;
  • honorary -, ph. గౌరవనీయ ధర్మకర్త;
 • truth, n. నిజం; సత్యం; నిక్కం; నిబద్ధం; రుతం; యథార్థం; యథాతథం; వాస్తవం; నిలవరం; సమీచీనం;
  • - table, ph. రుత పట్టీ; నిజంపట్టీ; నేటుపట్టీ; సత్యపీఠం;
  • naked -, ph. నగ్నసత్యం;
 • truthfulness, n. నిజాయతీ;
 • try, v. i. ప్రయత్నించు; ఉంకించు; ఉద్యోగించు; తివురు;
 • tryst, n. (ట్రిస్ట్) ముఖాముఖీ;
 • tryst with destiny, ph. విధితో ముఖాముఖీ;
 • tsunami, n. ఉప్పెన; సునామీ;
 • tub, n. తొట్టి; తొట్టె;
 • tuba, n. బూరా; బాకా;
 • tube, n. గొట్టం; నాళం; నాళిక; సానిక; క్రోవి; గ్రోవి;
 • tuber, n. దుంప; గడ్డ;
 • tuberculosis, n. క్షయ;
 • tubular, adj. నాళాకార;
 • Tuesday, n. మంగళవారం; భౌమ్యవారం; భౌమవాసరం;
 • tumbler, n. గ్లాసు; గళాసు;
 • tummy, n. బొజ్జ;
 • tumor, n. కంతి; నెత్తురుగడ్డ; గడ్డ; కణిత; గుల్మం; అర్బుదం; --see also gland
 • tumult, n. కకపిక;
 • tundra, n. నీహారమండలం; శీతలమండలం; టండ్రా; ఆర్కిటిక్ చక్రం ప్రాంతాలలో వుండే చెట్లులేని విశాలమైన చెమ్మ మైదానాలు; see also savanna; prairie;
 • tune, n. వరస; పాట పాడే వరస; ఒకదాని తరువాత మరొక స్వరం వరసగా రావడం; భారతీయ శాస్త్రీయ సంగీతంలో పాట పాడినప్పుడు ఏదో ఒక వరస ఎంచుకుని పాడతారు; (ఉదా. కేవలం అన్నం తిన్నట్లు లేదా కేవలం చపాతీ తిన్నట్లు; పాశ్చాత్య సంప్రదాయంలో అనేక వరసలు కలిసి వినిపిస్తాయి; అనంలో ముక్కల పులుసు కలుపుకుని తిన్నట్లు;)
 • tune, v. t. శృతి చేయు;
 • tuning fork, n. శృతిదండం;
 • Tungsten, n. టంగ్‌స్టన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 74, సంక్షిప్త నామం, W); Swedish. tung sten = heavy stone; wolfram;
 • tunnel, n. (1) సొరంగం; బిలం; (2) తొర్ర;
 • tunnel, v. t. దొలుచు;
 • turban, n. తలపాగా; పాగా;
 • turbidity, n. కలక; ఆవిలం; మసకతనం;
 • turbid, adj. మసక; ఆవిలమైన; ఆవిల;
 • turbo, adj. విక్రమ; జోరుగా నడచే;
 • turbulence, n. (1) సమీరితం; అనిశ్చల ప్రవాహం; (2) వాతావరణంలో అనిశ్చలత; (3) సంక్షోభం;
 • turgid, adj. (1) వాచిన; బలిసిన; (2) అనవసరమైన ఉత్ప్రేక్షలతో కూడిన;
 • turkey, n. (1) టర్కీ; కోడి లాంటి పక్షి; (2) [idiom] అసమర్ధుడు; చేతకానివాడు;
 • turmeric, n. పసుపు; పసుపు కొమ్ము; అళది;
 • turmoil, n. మథన;
 • turn, n. (1) మలుపు; క్రాంతి; (2) పర్యాయం; సారి; చుట్టు; ఆవర్తి; (3) వంతు;
 • turns, n. pl. సార్లు; చుట్లు;
 • turn, v. i. తిరుగు; మళ్లు;
 • turn, v. t. (1) తిప్పు; మళ్లించు; మరలించు; (2) మార్పు; మార్పు చేయు; (3) చుట్టు; చుట్టబెట్టు;
 • turning chair, n. అసందిక; (see also) rotating chair
 • turning point, n. మలుపు తిరిగే స్థానం; విశ్రమ స్థానం; క్రాంతి బిందువు; పరివర్తన స్థానం;
 • turnings, n. రజను; రద్దు;
 • turnstile, n. కిర్రుమాను;
 • turpentine, n. శ్రీవేష్టం; కర్పూరతైలం;
 • turquoise, n. హరితాశ్మను వర్ణం;
 • turtle, n. నీటి తాబేలు; ఇది సాధారణంగా నీటిలో నివసిస్తుంది; నేల తాబేలుకీ, దీనికి కొన్ని పోలికలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి;
 • tweezers, n. చిమటా;
 • twelfth, adj. ద్వాదశ; పన్నెండవ;
 • twelve, n. పన్నెండు; ఇరారు; ఈరారు;
 • twentieth, n. ఇరవైయ్యవది;
 • twenty, n. ఇరవై; ఇరువది; వింశతి;
 • twenty five, n. ఇరవై అయిదు; పంచ వింశతి; పచ్చీసు;
 • Tweed, n. a misnomer for Twill;
 • tweezers, n. తండసం;
 • twice, adj. ఈరు; రెట్టింపు;
  • - five, ph. ఈరేను; 10;
  • - six, ph. ఈరారు; 12;
  • - seven, ph. ఈరేడు; 14;
 • twice, n. (1) రెండు సార్లు; (2) రెండింతలు; రెట్టింపు;
 • Twill, n. గెంటెం; జంటనేత బట్ట; రెండు పేటల దారంతో నేసిన గుడ్డ యొక్క వ్యాపార నామం;
 • twig, n. రెమ్మ; పరిగె; ఉపశాఖ; కొమ్మ రెండుగా చీలడం వల్ల వచ్చిన ఉపశాఖ;
 • twilight, n. సంధ్య;
  • evening -, ph. మలి సంధ్య; మునిమాపు; మునిచీకటి;
  • morning -, ph. తొలి సంధ్య;
 • twine, n. జమిలిదారం; రెండు పేటలు వేసి పేనిన దారం;
 • twinkle, n. తళుకు; మినుకు;
 • twins, n. కవలలు;
 • twist, n. మెలి; పురి; వెంటి;
 • twist, v. t. పేను; పురి ఎక్కించు; తిప్పు;
 • twisted, adj. నులి; నులి పెట్టిన;
 • twisted pair, n. నులి జంట; నులి పెట్టిన తీగల జంట;
 • twigs, n. pl. చితుకులు;
 • twitch, v. i. కండరాలలో వచ్చే చిరు స్పందన;
 • two, n. (1) రెండు; ఇరు; ఈరు; జమిలి; ద్వ; ద్వయం; ద్వయి; దో; (2) ఇద్దరు;
  • - books, ph. రెండు పుస్తకాలు;
  • - people, ph. ఇద్దరు; ఇద్దరు మనుషులు;
  • - sides, ph. ఇరువైపుల;
 • two-dimensional, adj. ద్వైమానిక;
 • two-dimensional description, ph. ద్వైమానిక వర్ణనం;
 • two-colored, n. దోరంగి;
 • two-fold, adj. ఉమ్మడి;
 • tycoon, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు; see also mogul;
 • tympanum, n. కర్ణభేరి; గూబ;
 • type, n. (1) రకం; బాపతు; (2) టైపు; (3) ముద్రాక్షరాలు;
  • lino -, ph. పంక్తి కూర్పు;
  • mono -, ph. అక్షరాల కూర్పు;
  • - of person who will listen, ph. మాట వినే బాపతు;
 • typesetting, n. అచ్చుకూర్పు;
 • typhus, n. విష జ్వరం; టైఫస్;
 • typhoid, n. సన్నిపాత జ్వరం; టైఫాయిడ్;
 • typhoon, n. ప్రచండ తుఫాను; ప్రచండ వాయువు; చైనాలో వచ్చే గాలివాన పేరు; ఇండియాలో వచ్చే గాలివానని సైక్లోను అనీ, అమెరికాలొ వచ్చే దానిని హరికేను అనీ అనడం ఆచారం;
 • typo, n. టైపాటు; టైపు చేసేటప్పుడు దొర్లిన పొరపాటు;
 • tyrant, n. నియంత; ఇరినుఁడు;
 • tyranny, n. నైయంత్యం; ఇరినం;

Part 2: U

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
 • ubiquitous, adj. సర్వాంతర్యామి అయిన; సర్వవ్యాప్తమయిన; అన్నిచోట్లా ఉన్న; బాగా వాడుకలో ఉన్న; విభుత్వ;
 • udder, n. పొదుగు; గోస్తనం;
 • ugliness, n. అందవికారం; అనాకారిత్వం;
 • ugly, adj. అనాకార;
  • - person, ph. అనాకారి; కురూపి;
 • uh-huh, inter. అహా; ఉహూ; ఊకొట్టడం;
 • ulcer, n. గుల్మం; వ్రణం; పుండు; కొరుకుపుండు;
  • chronic -, ph. విలంబిత వ్రణం;
  • duodenal -, ph. ఆంత్రమూల వ్రణం;
 • ulna, n. అరత్ని; అరత్నిక; కూర్పరాస్థి; మూరెుముక; see also radius;
 • ultimate, adj. చిట్టచివరి; కడపటి; చరమ; కొస; ఆఖరు; తుది; అంతిమ; పరిపూర్ణ; కేవల;
  • - authority, ph. తుది తీర్పరి; అంతిమ ప్రమాణం;
  • - reality, ph. అంతిమ సత్యం; కఠోర వాస్తవం;
 • ultimatum, n. తుది హెచ్చరిక; మాట; ఆఖరి మాట; కడపటి కబురు; ఉల్లాకి; అంత్య సందేశం;
 • ultramarine, adj. అతినీల; చిక్కటి నీలిరంగు; (ety.) సముద్రాంతరాలనుండి (ఆఫ్గనిస్థాన్ నుండి) వచ్చిన నీలిరంగు;
 • ultrasonic, adj. శ్రవణాతీత; అతిధ్వనీయ;
 • ultrasound, n. (1) అతిధ్వని; ధ్వని తరంగాల కంటే వేగంగా కంపించే తరంగాలు; (2) శబ్ద తరంగాలని ఉపయోగించి శరీరపు లోపలి భాగాలని చూసే పద్ధతి;
 • ultra, pref. అతి; విపరీత; అత్యుగ్ర;
 • ultraviolet, adj. అత్యూద; అతినీలలోహిత; ఊర్ధ్వనీలలోహిత; వర్ణమాలలో ఊదా రంగు కంటె ఎక్కువ పౌనఃపున్యముతో ప్రకంపించే కాంతి కిరణాలు; ఈ తరంగాల పొడుగు 10 - 400 నేనోమీటర్లు ఉంటాయి;
 • umbel, n. గుత్తి;
 • umbilical, adj. బొడ్డుకి చెందిన; నాభికి సంబంధించిన;
  • - cord, ph. బొడ్డుతాడు;
 • umbilicus, n. నాభి; బొడ్డు;
 • umbrage, n. (1) నీడ; నీడనిచ్చే గుబురైన పెరుగుదల; (2) కోపగించుకోవడం; చిరాకు పడడం;; resentment;
 • umbrella, n. గొడుగు; ఛత్రం; ఆతపత్రం;
  • - tree, ph. గంగరావి; బ్రహ్మదారువు;
 • umpire, n. మధ్యవర్తి; ఆటల పోటీలలో ఇరు పక్షములకి మధ్యవర్తి; అంపైరు;
 • unable, adj. చేయ శక్యంకాని;
 • unaccented, adj. అనుదాత్త; అస్వరిత; తేలికగా పలికే;
 • unachievable, adj. అశక్య;
 • unadulterated, adj. అప్పటం; కల్తీకాని;
 • unaided, adj. అసహాయంగా; సహాయం లేకుండా;
 • unambiguously, adv. నిర్ద్వందంగా; స్పష్టంగా; అసందిగ్ధంగా; ఎటో ఒక పక్కకి తేల్పి;
 • unanimously, adv. ఏకగ్రీవంగా;
 • unasked, adj. అయాచితంగా;
 • unaspirated, adj. అల్పప్రాణ;
 • unassuming, adj. నమ్ర; అహంకారం లేని;
 • unattainable, adj. అందరాని; అందుబాటులో లేని; అప్రాప్యమైన;
 • unauthentic, adj. సిసలు కాని; నకలు; అప్రమాణిక;
 • unavoidable, adj. అనివార్య; అనివార్యమైన; అపరిహార్య;
 • unbiased, adj. నిష్పాక్షికంగా; పక్షపాతం లేకుండా;
 • unbleached, adj. కోరా; చలవ చెయ్యని;
 • unblushing, adj. అభిమానం లేని; సిగ్గులేని;
 • unbounded, adj. అపరిమిత; నిరవధిక; అవేల;
 • unbroken, adj. అఖండ; అఖండిత; అవిచ్ఛిన్న;
 • uncertain, adj. అనిశ్చిత;
 • uncertainty, n. విచికిత్స; సంశయం; అశంక; అనిశ్చితత్వం; వికల్పం;
 • unchanging, adj. కూటస్థ;
 • unchecked, adj. అదుపులేని;
 • uncircumcised, n. అసున్నతీయులు;
 • unclaimed, adj. బేవారసు;
 • uncle, n. (1) మావయ్య; తల్లి సోదరుడు; (2) పెదనాన్న; (3) చిన్నాన్న; బాబయ్య; కక్క; (4) అత్త భర్త; (5) భార్య తండ్రి; భర్త తండ్రి;
  • maternal -, ph. మావయ్య; మేనమామ; తల్లి సోదరుడు;
  • paternal -, ph. (1) పెదనాన్న; (2) చిన్నాన్న; బాబయ్య; కక్క;
  • paternal elder -, ph. పెదనాన్న;
  • paternal younger -, ph. చిన్నాన్న; బాబయ్య; కక్క;
 • unclear, adj. అవ్యక్త; అస్ఫుట;
 • unclear, n. అవ్యక్తం; అస్ఫుటం;
 • uncommon, adj. అసాధారణమైన;
 • unconcerned, adj. నిర్లిప్త; పట్టించుకోకుండా;
 • unconscious, adj. స్మృతివిహీన; స్మృతిలేని; స్మృతితప్పిన; మైకం కమ్మిన; అచేతన;
 • unconsciously, adv. (1) అపగత చేతనంగా; స్మృతివిహీనంగా; (2) అప్రయత్నంగా; అనుకోకుండా;
 • unconditionally, adv. బేషరతుగా; షరతులు లేకుండా;
 • unconventional, adj. కానువాయి;
 • uncountable, adj. అగణ్య; అసంఖ్యాక;
 • uncountable infinity, ph. అసంఖ్యేయ అనంతం; అగణ్య అనంతం;
 • uncountably, adv. అసంఖ్యాకంగా; లెక్కించడానికి వీలుపడని;
 • unction, n. లేపనం; అంజనం; తైలం;
 • undaunted, adv. నిరుత్సాహ పడకుండా;
 • undecidable, adj. అస్తినాస్తి;
 • undeniable, adj. తిరుగులేని;
 • under, adj. కింద; ఉప;
  • - employment, n. అల్పోద్యోగం; చదివిన చదువుకి కాని, ఉన్న తెలివితేటలకి గాని తగని చిన్న ఉద్యోగం;
 • undercurrent, n. (1) అంతర్వాహిని; (2) ధోరణి; వైఖరి; సరళి;
 • underdeveloped, adj. బడుగు;
 • underdog, n. పోటీలో వెనకబడ్డ వ్యక్తి; అణచబడ్డ వర్గంలోని వ్యక్తి;
 • undergo, v. i. అనుభవించు;
 • underground, adj. భూగత; భూగర్భ;
  • - drainage system, ph. భూగర్భ నీటిపారుదల వ్యవస్థ;
  • - stem, ph. భూగత కాండం;
 • underhand dealing, ph. దందా;
 • underline, n. క్రీగీటు; క్రీగీత;
 • underprivileged, adj. బడుగు; అవకాశాలు లేని;
 • underscore, v. t. (1) నొక్కి వక్కాణించు; (2) అడుగున గీత గీయు
 • understand, v. i. అర్థమవు; బోధపడు;
 • understand, v. t. అర్థం చేసుకొను;
 • understanding, n. అవగాహన; అవగతం; గ్రహణశక్తి; ఒప్పందం;
  • mutual -, ph. పరస్పర అవగాహన;
 • understatement, n. నిమ్నోక్తి; సరసోక్తి; చెప్పదలుచుకున్న దానిని బాధించకుండా చెప్పడం; "పాట బాగు లేదు" అనకుండా "పాట ఎదో కొత్త పంథాలో ఉన్నట్లు ఉంది" అనడం ఒక ఉదాహరణ; నిజాన్ని కాస్త మెత్తబరచి చెప్పడం;
 • undertake, v. i. తలపెట్టు; కైకొను; పూను;
 • underwater, adj. జలగత;
 • underwear, n. చెడ్డీ; లోదుస్తులు;
 • underwrite, v. i. పూచీపడు;
 • undesirable, adj. అవాంఛనీయమైన;
 • undignified, adj. లేకి;
 • undivided, adj. అవిభక్త; అఖండ;
  • - India, ph. అఖండ భారతదేశం;
 • undoubtedly, adv. నిస్సంకోచంగా; నిక్కచ్చిగా;
 • undue, adj. తగని;
 • undulate, v. i. ఊగిసలాడు;
 • unearned, adj. అనుపార్జిత;
  • - income, ph. అనుపార్జిత ఆదాయం;
 • uneasiness, n. నలత;
 • unemployed, n. నిరుద్యోగి; బికారి;
 • unemployment, n. నిరుద్యోగం;
  • - problem, ph. నిరుద్యోగ సమస్య;
 • unending, adj. అంతులేని; తరగని;
 • unenthusiastically, adv. నిరుత్సాహంగా; నిరాసక్తంగా;
 • unequal, adj. అసమానమైన; అసమమైన; విసమ; విషమ; ప్రతిసమ;
 • unequivocal, n. అసందిగ్ధంగా; నిస్సంశయంగా;
 • unerring, adj. సూటిగా; తడుముకోకుండా;
 • uneven, adj. ఒడిదుడుకులతో; ఎగుడు దిగుడులతో కూడిన; ఎత్తుపల్లాలతో; మిట్టపల్లాలతో; దంతుర; దంతురిత; ఉచ్ఛావచ; నిమ్నోన్నతమైన; న్యూనాధిక;
 • unevenness, n. దంతురత; న్యూనాధికత;
 • unexpectedly, adv. అనుకోకుండా; అవశాత్తుగా; ఉభేతుగా;
 • unfailingly, adv. తప్పక; తప్పకుండా;
 • unfair, adj. అన్యాయం;
  • - tax, ph. అప్పణం;
 • unfair, n. అన్యాయం;
 • unfavorable, n. ప్రతికూలం;
 • unfit, adj. తగని;
 • unfounded, adj. నిర్హేతుక;
 • unfriendliness, n. అనుపపత్తి; చెలిమి లేకపోవడం;
 • ungual, adj. గోరుకి సంబంధించిన; డెక్కకి సంబంధించిన;
 • unguent, n. లేపనం;
 • unhappy, adj. నిస్సంతోషంగా; సంతోషం లేని; విచారంగా;
  • - person, ph. నిస్సంతోషి;
 • unheard, n. అశ్రుతచరం; విననిది;
 • unheard of, adj. విని ఎరుగని; అశృత;
 • unhesitating, adj. నిస్సంశయంగా; అవిశంక;
 • uni, pref. ఏక;
 • unicellular, adj. ఏకకణ;
  • - organisms, ph. ఏకకణ జీవులు;
 • unidirectional, n. ఏకదిశాత్మకం;
 • unification, n. సంధానం; సంయోగం; ఏకీకరణ; ఏకీకృతం; ఏకీభూతం;
 • Unification Theory, ph. సంధాన వాదం;
  • Grand -, మహత్ సంధాన సిద్ధాంతం;
 • unified, adj. తాదాత్మ్య; సమీకృత; తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; ఏకరూప;
  • - field theory, ph. కూటస్థ క్షేత్ర వాదం;
 • uniform, adj. తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య;
  • - acceleration, ph. తదేక త్వరణం;
  • - convergence, ph. తదేక పరిచ్ఛిన్నం;
  • - velocity, ph. తదేక ధృతిగతి; ఏకరూప వేగం;
 • uniformity, n. తదేకత్వం; ఏకరూపత;
 • unify, v. t. ఏకీకరించు; ఏకంచేయు;
 • unilateral, adj. ఏకపాక్షిక;
 • unlucky, adj. ముదనష్టపు; దురదృష్టపు; అదృష్టవిహీన;
 • unimaginable, adj. అనూహ్యమైన;
 • unimaginable, n. అనూహ్యం;
 • unimpeachable, adj. ప్రశ్నింపలేని;
 • unimpeded, adj. ధారాళంగా; అవ్యాహతంగా; అడ్డు లేకుండా;
 • unimportant, n. అప్రధానం;
 • uninhabited, adj. నిర్జన; విజన;
 • uninterrupted, adj. అవిచ్ఛిన్న; నిర్విరామ;
 • uninterruptedly, adv. అవిచ్ఛిన్నంగా; నిర్విరామంగా; నిరాఘాటంగా; నిరంతరాయంగా;
 • union, n. (1) సంఘం; సమాఖ్య; (2) యోగం; సంయోగం; మేళనం; సంగమం; సంధానం; సంసర్గము; సంసక్తం;
  • chemical -, ph. రసాయన సంయోగం;
  • labor -, ph. కార్మిక సంఘం;
  • reunion, ph. పునస్సంధానం;
 • uni-planar, adj. ఏకతల; సమతల;
 • unique, adj. ఏకైక; అనన్య; సాటిలేని; అపూర్వ; అనన్యసామాన్య; అనన్యాదృశ్య; అద్వితీయ; అనుపమాన;
 • uniqueness, n. ఏకైకత; అపూర్వత;
 • un-irrigated land, n. నీటిపారుదల లేని భూమి; దేవమాతృకం;
 • unreachable, adj. అగమ్య; అందని; అందుబాటులో లేని; చేరలేని;
 • un-irrigated field, n. నీటిపారుదల లేని పొలం; దేవమాతృకం;
 • uni-sexual, adj. ఏకలింగ;
 • unit, n. (1) ఒకటి; (2) ఘటికం; మూలఘటికం; అంశం; మూలాంశం; మూర్తం; ఏకాంకం; కొల ప్రమాణం;
  • Derived -, ph. వ్యుత్పాదిత మూల-మానము.
  • Physical -, ph. భౌతికాంకము.
  • - of heat -, ph. తాపాంకము.
  • - of quality -, ph. గుణప్రమాణము.
  • - of quantity -, ph. రాశిప్రమాణము.
  • - of resistance -, ph. ప్రతిరోధాంకము.
  • - of stress -, ph. పీడనాంకము.
  • - of value -, ph. మూల్యప్రమాణము.
  • - of work -, ph. కర్మాంకము, క్రియాంకము.
 • unite, v. i. కలియు; ఏకమగు; సంఘీభవించు;
 • unite, v. t. సంధించు; కలుపు; ఉజ్జీచేయు; కలుపు;
 • united, adj. సమైక్య; సంయుక్త;
 • unity, n. (1) ఏకత్వం; ఒరిమిక; ఐకమత్యం; ఐక్యత; సంఘీభావం; అవినాభావం; సమైక్యత; కట్టు; (2) ఒకటి;
  • - in diversity, ph. భిన్నత్వంలో ఏకత్వం;
 • universal, adj. విశ్వ; విశ్వతోముఖ; విశ్వజనీన; వసుధైక; సర్వతోముఖ; జగత్; సర్వసామాన్య; సార్వజనిక; సర్వజనీన; సర్వత్ర; సార్వత్రిక; వ్యాప్తిలోనున్న;
  • - adult suffrage, ph. సార్వజనిక వయోజన నియోజనం; సావని; విశ్వజనీన వయోజన వియోజనం;
  • - consciousness, ph. విశ్వాత్మ; జగదాత్మ;
  • - donee, ph. సర్వ దఖలుదారు;
  • - franchise, ph. సార్వజనిక నియోజన;
  • - perspective, ph. వసుధైక దృక్పథం;
  • - spirit, ph. విశ్వాత్మ; జగదాత్మ;
 • universe, n. విశ్వం; జగత్తు; జగం; జగతి; సృష్టి;
  • - of discourse, ph. ప్రసంగ విషయం;
 • university, n. విశ్వవిద్యాలయం; విశ్వకళాపరిషత్తు; విద్యాపీఠం;
 • unknowable, adj. అజ్ఞేయం; తెలియరానిది;
 • unknown, adj. అవ్యక్త; అజ్ఞాత;
  • - variable, ph. అవ్యక్త రాశి; అజ్ఞాత రాశి;
 • unlawful, adj. చట్టవిరుద్ధమైన; చట్టబద్ధము కాని; దొంగ;
 • unlimited, adj. అపరిమితమైన; పరిమితిలేని; అమితమైన;
 • unlimited, n. అపరిమితం; అనవధికం; అమితం; అపారం;
 • unload, v. t. దింపు; దించు;
 • unlucky, n. దురదృష్టం; అభాగ్యం;
 • un-manifested, adj. అవ్యక్తమైన; అవ్యాకృతమైన;
 • unmarried, adj. పెళ్ళికాని, అవివాహ;
 • un-measurable, adj. అమిత; కొలవలేని;
 • unmount, v. t. దింపు; పెట్టిన స్థానం నుండి తీయు;
 • unnatural, adj. అసహజమైన; విపరీతమైన;
 • unnatural, n. అస్వభావికం;
 • unnecessarily, adv. అనవసరంగా; నిష్కారణంగా;
 • unnecessary, adj. అనవసరం;
 • unobstructed, adj. అనర్గళ; నిరర్గళ; అప్రతిహత; నిరాఘాట;
 • unobstructed, n. అనర్గళం; అప్రతిహతం;
 • unobstructedly, adv. అనర్గళంగా; నిరర్గళంగా; అప్రతిహతంగా; నిరాఘాటంగా;
 • unofficial, adj. అనధికార;
 • unorganized, adj. అసంఘటిత;
 • unparalleled, adj. అతులిత;
 • unpolished, adj. కోరా; మెరుగులేని; మోటు;
 • unpolluted, adj. నిర్మల;
 • unprecedented, adj. అభూతపూర్వ;
 • unreasonably, adv. బేసబబుగా;
 • unrefined, adj. ముతక; శుద్ధికాని;
 • unrepeated, n. అజప;
 • unrest, n. అలజడి; అనిశ్చలత్వం;
 • unripe, adj. అపక్వ; అపరిపక్వ; పచ్చి; పండని;
 • unrivalled, adj. పోటీలేని; సాటిలేని; అప్రతిమాన; అప్రతిమ;
 • unrivalled, n. m. అప్రతిద్వందుడు;
 • unsalted, adj. ఉప్పిడి;
 • unsatisfied, adj. అసంతృప్త;
 • unsaturated, adj. అసంతృప్త;
  • - fatty acid, ph. అసంతృప్త గోరోజనామ్లం;
 • unscathed, adj. చెక్కుచెదరని;
 • unscientific, adj., అశాస్త్రీయమైన;
 • unscrupulous, adj. కుత్సిత; నైతిక విలువలు లేని;
 • unseasonal, adj. అకాల;
 • unsigned, adj. (1) సంతకం లేని; సంతకం చెయ్యని; (2) ధన, రుణ సంకేతాలు లేని;
 • unsolicited, adj. అయాచిత; అడగకుండా; కోరబడని;
 • unsplit, adj. ఏకాండీ; విరగ్గొట్టని; చింపని; సంయుక్త; సమైక్య;
 • unspeakable, adj. అనరాని; అవాచ్య;
 • unstable, adj. అస్థిర; అధ్రువ; అనిశ్చల; చంచల; తరల;
 • unsteady, adj. చంచల; నిలకడ లేని; కసిమసి;
 • unstoppable, adj. దుర్వార;
 • unsuccessful, adj. విఫలమైన;
 • unsuitable, adj. అసంగత; అనుచిత; పొసగని;
 • unsuitable, n. అసంగతం; అనుచితం;
 • unthinkable, n. అచింత్యం;
 • until, adv. వరకు; దనుక;
 • untimely, adj. అకాల; అకాండిత;
  • - rains, ph. అకాల వర్షాలు; అకాండిత వర్షాలు;
 • untouchability, n. అంటరానితనం;
 • untrue, n. అబద్ధం; అసత్యం; కల్ల; నిజం కానిది; సత్యదూరం;
 • unusual, adj. అసాధారణ; అసాధారణమైన;
 • unutterable, adj. అవాచ్య; అనరాని; ఆడరాని; అశ్లీలమైన; ఉచ్చరింపగూడని;
 • unveil, v. t. ఆవిష్కరించు;
 • unwise, adj. తెలివి తక్కువ; అజ్ఞానం; లౌక్యం తెలియని;
 • unhill, n. ఎగుడు;
 • up, adj. (1)లేచి ఉండు; (2) పనిచేసే పరిస్థితిలో ఉండు; పడుక్కోకుండా ఉండు;
 • up, adv. (1) ఎగువకెళ్లే; (2) ఉత్తర దిశలో;
 • up, n. ఎగువ;
 • up, prep. మీద; పైన;
 • upbeat, adj. ఉత్సాహవంతమైన; ఆశాజనక;
 • update, v. t. తాజించు; తాజా చేయు; తాజీకరించు;
 • upend, v. t. తిరగబెట్టు; బోల్తాకొట్టించు; ఉల్టా-సీదా చేయు;
 • upgrade, v. t. మెరుగు పరచు; నాసి రకం వస్తువులని తీసేసి, వాటి స్థానంలో మెరుగైన వాటిని ప్రతిక్షేపించు;
 • uphill, n. ఎగుడు; ఎక్కుడు;
 • uplift, v. t. ఉద్ధరించు;
 • upliftment, n. ఉద్ధరణ; సముద్ధరణ; ఉద్ధరింపు;
 • upload, v. t. ఎక్కించు; పంపించు;
 • upper, adj. ఎగువ; మీది; పై;
  • - arm, ph. దండ; ముంజేయి;
  • - berth, ph. ఎగువ బడ్డీ;
  • - canal, ph. ఎగువ కాలవ;
 • uprising, n. తిరుగుబాటు;
 • uppercase, n. పెద్ద బడి; ఇంగ్లీషు వంటి భాషలలో రాసే A, B, C వంటి పెద్ద అక్షరాలు; same as capital letters; (rel.) lowercase;
 • uppityness, n. టెక్కు; డాబు; అతిశయం;
 • uproar, n. ఘోషణ; ఎలగోలు;
 • uproot, v. t. పెకలించు; పెల్లగించు; పెరకు; పీకు;
 • ups and downs, ph. ఒడిదుడుకులు; నిమ్నోన్నతాలు;
 • upset, v. t. తలకిందులు చేయు; తిరగబెట్టు; పాడుచేయు; వమ్ముచేయు;
 • upshot, n. పర్యవసానం;
 • upsidedown, ph. అతలాకుతలం; తలకిందులు;
 • upstairs, n. మేడమీద; ఉప్పరిగె;
 • upstream, adj. ఎగుదల;
 • upward, adj. ఊర్ధ్వముఖ; పైకి చూపే; ఎగ;
  • - arrow, ph. ఊర్ధ్వముఖ సాయకం; పైకి చూపే బాణం;
  • - movement, ph. ఊర్ధ్వముఖ చలనం; పైకి కదలడం;
 • upwind, ph. ఎదురుగాలి; గోగంధనం;
 • Uranium, n. వరుణము; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 92, సంక్షిప్త నామం, U);
 • Uranus, n. (యూరెనస్) వరుణుడు; వరుణగ్రహం;
 • urban, adj. పౌర; నాగర; నగర; నగరీణ; నైగమ; పట్టణానికి సంబంధించిన; (ant.) rural;
 • urbanization, n. నగరీకరణ; పట్టణీకరణ:
 • urdiea, n. పాలపళ్ళు;
 • urchin, n. కుంక; కురక్రుంక; అల్లరి పిల్లాడు;
 • urea, n. మూత్రిక;
 • ureter, n. మూత్రనాళం;
 • urethra, n. మూత్రమార్గం; మూత్రం బయటకు వెళ్లే మార్గం;
 • urge, n. ప్రేరణ; కుతి;
 • urge, v. t. ప్రేరేపించు;
 • urgent, adj. అత్యవసరమైన; అవశ్యం; అర్జంటు;
 • urinary, adj. మూత్రానికి సంబంధించిన;
  • - bladder, ph. మూత్రాశయం;
  • - tubules, ph. మూత్రనాళికలు;
 • urinate, v. t. ఉచ్చపోయు; మూత్రవిసర్జన చేయు; అల్పాచిమానం చేయు;
 • urine, n. ఉచ్చ; నీరుడు; మూత్రం; పంచితం; అల్పాచిమానం; ప్రస్రావం;
 • urn, n. కూజా; కలశం; మట్టు ఉన్న చిన్న పాత్ర;
 • Ursa Major, n. బృహదృక్షం; పెద్ద ఎలుగుబంటి; ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఒక నక్షత్ర సముదాయం; ఈ ఎలుగుబంటి తుంటి భాగంలోనూ, తోక భాగంలోనూ కనిపించే కొన్ని తారలని సప్తర్షి మండలం అంటారు. దీనినే big dipper అనీ plow అనీ కూడా అంటారు;
 • Ursa Minor, n. లఘుదృక్షం; ఒక నక్షత్ర సముదాయం;
 • usable, adj. ఉపయోగపడే; (also) useable;
 • usage, n. వాడుక; వాడకం; ప్రయోగం; ప్రయుక్తం;
  • established -,-, ph. ప్రయుక్తం;
  • improper -,-, ph. అపప్రయోగం;
  • poetic -,-, ph. కవి ప్రయుక్తం;
 • use, n. (యూస్) ఉపయోగం; ప్రయోజనం; వాడుక;
 • use, v. t. (యూజ్ ) ఉపయోగించు; వాడు; వ్యవహరించు;
 • use of force, ph. దండోపాయం;
 • useful, adj. పనికొచ్చే; ఉపయోగపడే; ఉపయుక్తమైన; కార్యకారకంగా; ఉపయోగకరంగా; ఉపాదేయంగా;
 • useful, n. పనికొచ్చేది; ఉపయోగపడేది; ప్రయోజనకారి; కార్యకారి;
 • useless, adj. అప్రయోజనమైన; పనికిరాని; అక్కరకురాని; పనికిమాలిన; నిరుపయోగమైన; నిష్ప్రయోజనమైన; కొరగాని; చిల్ల; పుంజులూరు;
 • useless, n. నిరర్థకం; నిష్ప్రయోజనం; నిరుపయోగం; వ్యర్థం; పనికిమాలినది; అక్కరకురానిది;
  • - fellow, ph. అప్రయోజకుడు; అసమర్ధుడు; తేభ్యం; వాజమ్మ; దద్దమ్మ; వ్యర్థుడు; పుంజులూరు వెధవ; పనికిరానివాడు; పనికిరాని సన్నాసి; పనికిరానివాడు;
 • user, n. వినియోగదారుడు; ఉపయోగించువాడు; ప్రయోక్త; ఆచరణాఖ్యుడు; ఆచరణాఖ్యి; వాడుకరి;
 • usher, n. ద్వారదర్శి; నకీబు;
 • usual, adj. యథాప్రకారం; ఎప్పటివలె;
  • as -, యథాప్రకారం; యథావిధిగా; ఎప్పటిఉపయోక్త;
 • user, n. వాడుకరి; ఉపయోక్త; వినియోగదారు;
 • user-friendly, adj. ఉపయోక్త సఖ్యత్వ; తేలికగా ఉపయోగించడానికి వీలయే;
 • usually, adv. సామాన్యంగా; సాధారణంగా;
 • usurer, n. వడ్డీ వ్యాపారస్థుడు;
 • usury, n. (యూషరీ) ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారం; ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారస్థుడు;
 • utilitarianism, n. ఉపయోగితా వాదం;
 • usurp, v. t. అపహరించు; లాక్కొను; మింగు;
 • usurper, n. అపహర్త;
 • usury, n. వడ్డీవ్యాపారం; వడ్డీ వ్యాపారస్తుడు;
 • utensils, n. పాత్రసామాను; వాడుక గిన్నెలు; ముంతా తప్పేలాలు; తట్టుముట్లు;
 • uterine siblings, ph. ఏకోదరులు;
 • uterus, n. గర్భాశయం; గర్భకోశం; బిడ్డసంచీ; జరాయువు;
 • utility, n. (1) ఉపయుక్తి; ఉపయోగం; ప్రయోజనం; (2) టెలిఫోను, నీటి సరఫరా; విద్యుత్తు, మొదలైన సౌకర్యాలు;
 • utilizable, adj. ఉపయోజనీయ;
 • utilize, v. t. వినియోగించు; వినియోగపరచు; ప్రయుక్తపరచు;
 • utmost, adj. అతి; మిక్కిలి;
 • utopia, n. ఊహాస్వర్గం; కల్పనాలోకం; (ant.) dystopia = an imagined state or society in which there is great suffering or injustice, typically one that is totalitarian or post-apocalyptic.
 • utter, adj. శుద్ధ; పరమ; ఘన;
  • - poverty, ph. ఘన దరిద్రం; పరమ దరిద్రం;
  • - stupid, ph. శుద్ధ మొద్దావతారం;
 • utter, v. i. ఉచ్చరించు; అను; ఉటంకించు; వ్రాక్కుచ్చు;
 • utterance, n. ఉటంకంపు; ఉక్తి; పలకబడ్డది; ఉదీరణం;
 • uttered, n. ఉదితం; చెప్పబడ్డది;
 • utterly, adv. సుతరాము; బొత్తిగా; పరిపూర్ణంగా; శుద్ధ;
 • uvula, n. కొండనాలుక; చిరునాలుక; లంబిక; కాకలం; ఉపజిహ్విక;
 • uvulitis, n. కొండనాలుక వాపు; ఉపజిహ్వాదాహం;

మూలం