"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇందుపల్లి గోవిందరావు

From tewiki
Jump to navigation Jump to search
ఇందుపల్లి గోవిందరావు
జననంఆగస్టు 12, 1897
మరణంసెప్టెంబరు 8, 1969
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, స్త్రీ పాత్రధారి
తల్లిదండ్రులుకృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ

ఇందుపల్లి గోవిందరావు (ఆగస్టు 12, 1897 - సెప్టెంబరు 8, 1969) రంగస్థల నటుడు, స్త్రీ పాత్రధారి. రంగభూషణం బిరుదాంకితుడు.[1]

జననం

గోవిందరావు 1897, ఆగస్టు 12న కృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం

చిన్నతనంలోనే నటన, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించుకున్న గోవిందరావు, తారాశశాంకం లో రెండవ చంద్రుడు పాత్ర ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టాడు. అప్పటినుండి అనేక నాటకాల్లో నటించి, పేరు మరియు డబ్బు సంపాదించాడు. కొంతకాలం నె జీతం మీద బందరు రాయల్ థియేటర్, రామమోహన్ థియేటర్లలో స్త్రీ, పురుష పాత్రలను పోషించేవాడు. పింగళి లక్ష్మీకాంతం, బుర్రా రాఘవాచారి, మాదిరెడ్డి సుబ్బారావు, పింగళి వీరయ్య, పింగళి నర్సయ్య, కలపటపు రాజేశ్వరరావు, శ్రవణం తాతయ్య, పెదసింగు రంగయ్య, ఆమాను సుబ్బారావు వంటి ప్రముఖ నటులతో కలిసి వందలాది నాటకాలను అద్భుతంగా ప్రదర్శించాడు. 1920-21లలో విజయవాడలో జరిగిన చింతామణి నాటక పోటీలలో రాధ పాత్రకు సువర్ణ పతకం గెల్చుకోవడంతోపాటు, చిత్రరేఖ, సత్యభామ, చంద్రమతి పాత్రలకు సువర్ణ పతకాలు గెల్చుకున్నాడు. అంతేకాకుండా, గోవిందరావు ధరించిన నటనకు ముగ్దులై ప్రేక్షకులంతా రంగస్థలం మీదకు పతకాలు విసిరేసేవారు.

నటించిన పాత్రలు

మరణం

చివరిదశలో పేదరికాన్ని అనుభవించిన గోవిందరావు 1969, సెప్టెంబరు 8న మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.298.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).