"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇన్శాట్-2E ఉపగ్రహం

From tewiki
Jump to navigation Jump to search
ఇన్శాట్-2E ఉపగ్రహం
మిషన్ రకంCommunication
Weather
నిర్వహించే సంస్థISRO
COSPAR ID1999-016A
మిషన్ కాలము12 years (planned)
అంతరిక్షనౌక లక్షణాలు
ప్రారంభ ద్రవ్యరాశి2,550 కిలోగ్రాములు (5,620 పౌ.)
శక్తి2,050 watts
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ2 April 1999, 22:03 UTC (1999-04-02UTC22:03Z)
రాకెట్Ariane 42P
ప్రారంభించిన స్థలంKourou ELA-2
ContractorArianespace
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థGeocentric
RegimeGeostationary
Longitude83° East
Perigee35,766 కిలోమీటర్లు (22,224 మై.)
Apogee35,806 కిలోమీటర్లు (22,249 మై.)
Inclination0 degrees
Period24 hours
Transponders
Band17 G/H band

ఇన్శాట్-2E ఉపగ్రహం భారతదేశపు ఉపగ్రహం. ఇండియన్ నేషనల్ శాటలైట్ సిష్టం ప్రణాళికభాగంగా భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ (isro) వారు, వారి నిర్వహణ, పరివేక్షణలో అంతరిక్షములో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఇన్శాట్-2E ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని సమాచారసేకరణ, ప్రసరణ, వాతావరణ పరిశీలన/పరిశోధనకై ఉపయోగార్ధమై ప్రయోగించారు. తూర్పుకు 83° డిగ్రీల అక్షాంశమలో భూస్థిరకక్ష్యలో పరిభ్రమిస్తూ తిరిగేలా అంతరిక్షములో ప్రవేశపెట్టారు.పైన పేర్కొన్న కక్ష్య పరిధిలో పరిభ్రమించు ఈ ఉపగ్రహం ఆసియా, ఆస్ట్రేలియాలో సమాచార సేవలను అందిస్తుంది.ఈ ఉపగ్రహం రెండు మేటిరియోలాజికల్/ వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధి పరికరాలు:ఎక్కువ రేసోల్యుసన్ రేడియో మీటరు, ఒక CCD కెమరాను కలిగిఉన్నది. ఈ కెమరా ఒకకిలోమీటరు పరిధి వరకు చిత్రాన్ని చిత్రించి పంపు రేసోల్యుసన్ కలిగిఉన్నది.[1] .

INSAT-2E ఉపగ్రహంలో 12 G/H బ్యాండ్ (IEEE Cబ్యాండ్) ట్రాన్స్‌పాండరులను అమర్చారు[2]. ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు 2,550కిలోలు (5,620 పౌండ్లు).ఉపగ్రహం యొక్క పనిచేయు జీవితకాలం 12 సంవత్సరాలు[3].ఇందులోని కొన్ని ట్రాన్స్‌పాండరులను ఇంటెల్ శాట్ (Intelsat) వారికి గుత్తకు (lease) ఇచ్చారు. ఇంటెల్‌శాట్ వాళ్ళు ఈ ట్రాన్స్‌పాండరులను Intelsat APR-2. అనేపేరు మీద ఆపరేట్ చేస్తున్నారు.

ఉపగ్రహ ప్రయోగం

ఈ ఉపగ్రహాన్నిదక్షిణ అమెరికా, ఫ్రెంచి గయానాలోని, ELA-2 ఉపగ్రహ ప్రయోగ వేదిక నుండి, ఏరియన్ 42Pఅను ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక ద్వారా ద్వారా1999 ఏప్రిల్ 2 న 22:03 (GMT) గంటలకు అంతరిక్షములోకి పంపారు [4]. ప్రయోగానంతరం, ఉపగ్రహంలో ఉన్న ద్రవఇంధనంతో పనిచేయు అపోజీ మోటరును మండించి 1999 ఏప్రిల్ 8 న ఉపగ్రహాన్ని నిర్దేశించిన భూస్థిరకక్ష్యలో పరిభ్రమించేలా, 83°డిగ్రీల తూర్పు రెఖాంశ కక్ష్యలో స్థిర పరిచారు[5].

ఇవి కూడా చూదండి

మూలాలు

  1. "INSAT-2E". Indian Space Research Organisation. Archived from the original on 2013-08-18. Retrieved 2009-08-08.
  2. Krebs, Gunter. "Insat 2E / Intelsat APR-2". Gunter's Space Page. Retrieved 2009-08-08.
  3. "UCS Satellite Database". Union of Concerned Scientists. 1 July 2009. Retrieved 2009-08-08.
  4. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 2009-08-08.
  5. McDowell, Jonathan. "Index". Geostationary Orbit Catalog. Jonathan's Space Page. Archived from the original on 2010-04-06. Retrieved 2009-08-08.