"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఇయోసిన్

From tewiki
Jump to navigation Jump to search

ఇయోసిన్ (ఆంగ్లం: Eosin) ఒక విధమైన ఎర్రని రంజనము (Dye) . దీనిని పేథాలజీ ప్రయోగశాలలో హిమటాక్సిలిన్ (Hematoxylin) తో కలిపి రంగులు వేయడానికి ఉపయోగిస్తారు.

పేరు

ఇయోసిన్ అనే పేరు ప్రాచీన గ్రీకు దేవతైన ఇయోస్ (Eos) అనగా ఉషస్సు యొక్క ఎరుపుదనానికి గుర్తుగా ఉంచారు.

రకాలు

ఇయోసిన్ లో చాలా దగ్గర సంబంధమున్న రెండు వర్ణకాలు వాడకంలో ఉన్నాయి:

  • ఇయోసిన్ వై (Eosin Y, Eosin Y ws, Eosin yellowish, Acid Red 87, C.I. 45380, bromoeosine, bromofluoresceic acid, D&C Red No. 22) : ఇది కొంచెం ఎక్కువగా ఉపయోగంలోని వర్ణకం. దీనికి కొంచెం పసుపు రంగు కలిసివుండటం వలన ఆ పేరు వచ్చింది.
  • ఇయోసిన్ బి (Eosin B, Eosin bluish, Acid Red 91, C.I. 45400, Saffrosine, Eosin Scarlet, or imperial red) : ఇది కొద్దిగా నీలివర్ణాన్ని కలిగివుంటుంది.

కణజాలాల పరీక్షలో ఇయోసిన్ ఉపయోగం

Sample of a trachea coloured with hematoxylin and eosin.

ఇయోసిన్ వర్ణకం సామాన్యంగా హిమటాక్సిలిన్తో కలిపి ఉపయోగిస్తారు. ఈ రెండింటినీ కలిపి కణజాలాల పరీక్షలో సర్వసాధారణంగా వాడుతారు. ఇయోసిన్ జీవద్రవ్యాన్ని ఎరుపుగా చేస్తే; హిమటాక్సిలిన్ కేంద్రకాలను నీలి రంగులో చూపిస్తుంది. ఇయోసిన్ ఎర్ర రక్తకణాలను కూడా ఎరుపుగా చేస్తుంది.

ఈ పరీక్షలో ఇయోసిన్ వై సామాన్యంగా 1 నుండి 5 శాతంగా నీటిలో గాని లేదా ఇథనాల్ లో గాని కలిపి ఉపయోగిస్తారు..[1] నీటిలో కలిపి తయారుచేసినప్పుడు శిలీంద్రాలు పెరగకుండా కొద్దిగా థైమాల్ కలుపుతారు.[2] కొంచెం (0.5 శాతం) ఎసిటిక్ ఆమ్లం కలపడం వలన ఇంకా ఎర్రని ఎరుపు వచ్చేనట్లు చేయవచ్చును.

మూలాలు

బయటి లింకులు